ما لا يسع أطفال المسلمين جهله
[దీనిని తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు]
These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.
[దీనిని తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు]
ముకద్దిమ అబీ జైద్ అల్ ఖైర్వానీ (పే.5).
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు
దీనిని అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
అబూ దావూద్ హదీసు గ్రంధము.
దీనిని అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని అహలుస్సునన్ ఉల్లేఖించారు.
ముత్తఫఖున్ అలైహి
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూదావుద్, ఇబ్నెమాజ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్, తిర్మిజీ, నసాయి ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ,ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్, తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ, ముస్లిం
అహ్మద్ మరియు అత్తిర్మిజి మొదలైన వారు ఉల్లేఖించారు.
దీనిని అహలుస్సునన్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
ముత్తఫఖున్ అలైహి
దీనిని బుఖారీ ఉల్లేఖించారు
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ, ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని నసాయీ ఉల్లఖించారు. దీని మూలము సహీహైన్ లో ఉన్నది.
దీనిని తిర్మిజీ మరియు ఇతరులు ఉల్లేఖించారు.
ముస్లిం, అహ్మద్, ఇంకా ఇతర హదీసు గ్రంధాలు ఉల్లేఖించాయి.
అబూ దావూద్, ఇంకా తదితరులు ఉల్లేఖించారు.
అబూ దావూద్, ఇంకా తదితరులు ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు
అహ్మద్ మరియు అత్తిర్మిజి దీనిని ఉల్లేఖించారు.
దీనిని ఇబ్నె మాజ మరియు మాలిక్ ముఅత్తాలో ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ మరియు నసాయీ ఉల్లేఖించారు.
దీనిని ఇబ్నె మాజ ఉల్లేఖించారు
హాకిమ్ మరియు ఇతరులు దీనిని ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ, ముస్లిం మరియు తదితరులు ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, ఈ హదీసు హసన్ (ఉత్తమ) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికారు:
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
అబూ దావూద్ ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
తిర్మిజి మరియు తదితరులు ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని అబూదావుద్,తిర్మిజీ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ, ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని అబూ దావుద్ ఉల్లేఖించారు.
దీనిని ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ, దార్మీ ఉల్లేఖించారు.
దీనిని అబూ దావుద్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ,అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని తిర్మిజీ,అహ్మద్ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని తిర్మిజీ, ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
అహ్మద్,ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
దీనిని అబూదావుద్,ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
బుఖారీ, ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని అబూదావుద్ ఉల్లేఖించారు.
దీనిని తబ్రానీ,ఇబ్నె అబీ షైబ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు
దీనిని అబూదావుద్,ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీన్ని నసాయీ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ,దార్మీ ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ,అబూదావుద్,అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు. మరియు పదాలు ఆయనివి.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూదావుద్,అహ్మద్ మరియు తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు
దీనిని అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం దీనిని ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
అత్తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని హాకిం మరియు తబ్రానీ ఉల్లేఖించారు.
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
అత్తిర్మిజీ మరియు ఇబ్నె మాజాఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
అబూ దావూద్, తిర్మిజీ, నసాయి ఉల్లేఖించారు.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్, ఇంకా ఇతరులు ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
అబూ దావూదు మరియు ఇబ్నె మాజా మొదలైనవారు ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
అబూ దావూద్, తిర్మిజీ, నసాయి ఉల్లేఖించారు.
అబూ దావూద్, అత్తిర్మిజీ ఉల్లేఖించారు.
ప్రయాణం నుండి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ దుఆయే చదివి మరియు ఇంకా ఇలా పలకాలి : ఆయిబూన, తాఇబూన, ఆబిదూన, లిరబ్బినా హామిదూన్ (మేము వాపసు తిరిగి వచ్చేవారం, పశ్చాత్తాప పడేవారం, ఆరాధించేవారం, మా ప్రభువునే మేము స్తుతించేవారము). దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.
అహ్మద్ మరియు అత్తిర్మిజి మొదలైనవారు ఉల్లేఖించారు.
అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
దీనిని హాకిమ్ మరియు ఇతరులు ఉల్లేఖించారు.
సహీహ్ అల్'జామయి
అత్తిర్మిజి, అబూ దావూద్ మొదలైనవారు ఉల్లేఖించారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
అబూ దావూద్ మరియు ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు.
ముఅత్తఅ మాలిక్
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.
అత్తిర్మిజి మరియు ఇబ్నె మాజా ఉల్లేఖించారు.
బుఖారీ,ముస్లిం
ఇతర విషయాల విభాగం
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
అబూ దావూద్ మరియు తిర్మిజీ మరియు ఇబ్నెమాజహ్ దీనిని ఉల్లేఖించారు
బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానము
అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో,
ముందుమాట
అల్లాహ్ పేరుతో, సకల ప్రశంసలు అల్లాహ్ కే శోభిస్తాయి. వబాదు :
ఇవి ముస్లిం పిల్లలు తప్పక తెలుసుకోవలసిన మహోన్నతుడైన అల్లాహ్ ధర్మంలోని ముఖ్యమైన విషయాలు. చిన్నవయసులోనే తమ పిల్లలకు వీటిని బోధించడం తల్లిదండ్రుల కర్తవ్యం. ఇది తౌహీద్ (ఏకదైవత్వ విశ్వాసం), ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్రం), సీరత్ (ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర), ఆదాబ్ (నైతిక ప్రవర్తన), తఫ్సీర్ (ఖుర్ఆన్ వివరణ), హదీస్ శాస్త్రం (ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం బోధనలు), అఖ్లాఖ్ (నీతిశాస్త్రం) మరియు జిక్ర్ (అల్లాహ్ యొక్క ధ్యానం) మొదలైన అంశాలతో కూడిన సరళమైన మరియు సమగ్రమైన కోర్సు. ఇది చిన్నపిల్లలతో పాటు అన్ని వయసుల వారికీ మరియు నవముస్లింలకు కూడా సరిపోతుంది. దీనిని ఇళ్ళలో, నర్సరీలలో మరియు విద్యా సంస్థలలో బోధించవచ్చు. నేను దీనిని అంశాల వారీగా వివిధ భాగాలలో అమర్చాను, ప్రశ్నలు మరియు సమాధానాల రూపంలో ఉంచాను. ఇది కంఠస్థం చేయడానికి అనువుగా ఉండి, మనస్సును ఉత్తేజపరుస్తూ చదివే కొద్దీ మరింత ఆసక్తి కలిగించే విధంగా తయారు చేయబడింది. ఉపాధ్యాయులు తమ విద్యార్థుల వయస్సుకు సరిపోయేలా వీటిలో నుండి సముచితమైన భాగాలు ఎంచుకోవచ్చు.
అల్లాహ్‌ను అడుగుతున్నాను ఆయన దీని ద్వారా లాభాన్ని చేకూర్చును గాక మరియు దీన్ని స్వీకరించును గాక.
మరియు దీని మూలము:
అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దేవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.} [తహ్రీమ్: 6]
ఇంకా ఇది అబ్దుల్లాహ్ ఇబ్నె మస్ఊద్ (రజియల్లాహు అన్హుమా) ఉల్లేఖించిన ఈ హదీసు కూడా దీనికి మూలము ఆయన ఇలా తెలిపారు : "ఒకరోజు, నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వెనుక ఉండగా ఆయన నాతో ఇలా అన్నారు: 'ఓ బాలుడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను: అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించు, అల్లాహ్ నిన్ను కాపాడుతాడు. అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించు, నీవు అల్లాహ్ ను నీ పక్షాన కనుగొంటావు. ఒకవేళ నీవు వేడుకుంటే, కేవలం అల్లాహ్ ను మాత్రమే వేడుకో. ఒకవేళ నీకు సహాయం అవసరమైతే, నీవు కేవలం అల్లాహ్ ను మాత్రమే సహాయం అర్థించు. నీకు ప్రయోజనం చేకూర్చడానికి మొత్తం ప్రజలందరూ సమావేశమైనా, అల్లాహ్ నీ కోసం నిర్ణయించిన దానిని తప్ప వారు నీకు ఎలాంటి ప్రయోజనమూ కలిగించ లేరని మరియు వారందరూ నీకు ఏదైనా హాని కలుగ జేయడానికి సమావేశమైనా, అల్లాహ్ నీపై విధించిన దానిని తప్ప వారు నీకు ఎలాంటి హాని కలిగించ లేరని నీవు తెలుసుకో! కలములు ఎత్తివేయబడ్డాయి మరియు కాగితాలు ఎండి పోయాయి'.
పిల్లలకు ఇస్లామీయ విద్యాబోధన ప్రాముఖ్యత:
మానిషి పిల్లవాడికి అతను ఇస్లాం స్వభావంపై సంపూర్ణ మానవుడిగా మారి, విశ్వాసం మార్గంలో ఏకదైవత్వాన్ని ఆచరించే మానవుడిగా మారేవరకు అతనికి తన ధర్మంలో అవసరమైన దానిని బోధించవలసి ఉంటుంది.
ఇమామ్ ఇబ్నె అబూ జైద్ అల్ ఖైర్వానీ (రహిమహుల్లాహ్) ఇలా పలికారు: “ఏడేళ్ల వయసులో నమాజ్ చేయమని ఆజ్ఞాపించాలని, పదేళ్ల వయసులో నమాజ్ చేయనందుకు దండించాలని మరియు వారి పడకలు వేరు చేయాలని ఆదేశించబడింది. అలాగే యుక్తవయస్సుకు చేరుకోక ముందే వారికి అల్లాహ్ తన దాసులపై విధిగావించిన మాటలు, ఆచరణలు నేర్పించ వలెను. ఈ విధంగా వారు యుక్తవయస్సుకు చేరుకున్నప్పుడు, వారి హృదయాలు, ఆత్మలు మరియు శరీరాలు స్వచ్ఛంగా, శాంతియుతంగా (తమ ప్రభువైన) అల్లాహ్ కు లొంగిపోతాయి మరియు అలాంటి దైవిక ఆదేశాలతో సుపరిచితమైన అనుభూతి పొందుతాయి".
తౌహీద్ (ఏకేశ్వరోపాసన) విభాగము
ఆఖీదా పరిజ్ఞానం:
ఇస్లామియ ఆఖీదా: అల్లాహ్ యొక్క రుబూబీయత్, ఉలూహీయత్, ఆయన పేర్లు మరియు ఆయన లక్షణాలు, ఆయన దూతలు, ఆయన గ్రంధాలు, ఆయన ప్రవక్తలు, తీర్పు దినం, మంచి మరియు చెడు విధిరాత, ఇతర అగోచర విషయాలు, ధర్మవిధానాలు, మరియు సలఫ్ సాలిహ్ అందులో ఏకాభిప్రాయం పొందిన వాటి గురించి ఖచ్చితమైన విశ్వాసం.
1వ ప్రశ్న: నీ ప్రభువు ఎవరు?
జ: నా ప్రభువు అల్లాహ్, ఆయనే తన అనుగ్రహముతో నన్ను మరియు సర్వలోకాలను పోషించాడు. ఆయనే నా ఆరాద్య దైవము, నాకు ఆయన తప్ప మరెవరు ఆరాధ్య దైవం కారు. ఆయనే సృష్టికర్త, యజమాని, పోషకుడు, మరియు సర్వశక్తివంతుడు, ఆయనే విశ్వంలో వాటన్నిటిని నిర్వహించేవాడు.
దీనికి సాక్ష్యం: అల్లాహ్ యొక్క వాక్కు: {సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. [అల్ ఫాతిహ: 2]
2వ ప్రశ్న: నీ ధర్మము ఏది?
జవాబు: నా ధర్మము ఇస్లాం. ఏకదైవారాధన ద్వారా అల్లాహ్ కు సమర్పించుకోవడం, వినయ విధేయతలతో, వినమ్రతతో ఆయనను ఆరాధించడం, షిర్క్ (బహుదైవారాధన) నుండి మరియు బహుదైవారాధకుల నుండి తనను తాను దూరంగా ఉంచడమే ఇస్లాం ధర్మము.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిస్సందేహంగా ఇస్లాంయే అల్లాహ్ వద్ద సమ్మతమైన ధర్మం}. [ఆలె ఇమ్రాన్: 19]
3వ ప్రశ్న: నీ ప్రవక్త ఎవరు?
జవాబు : ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు. [ఫతహ్ : 29]
4వ ప్రశ్న: కలిమయె తౌహీద్ ఏమిటో తెలుపు మరియు తౌహీద్ అర్థం ఏమిటో వివరించు?
జవాబు: కలమయె తౌహీద్ "లా ఇలాహ ఇల్లల్లాహ్" అంటే అల్లాహ్ తప్ప మరెవ్వడూ ఆరాధనలకు అర్హుడు కాదు. అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని సాక్ష్యమివ్వటం యొక్క అర్ధం: అల్లాహ్ తప్ప వేరే వాస్తవ ఆరాధ్యుడు లేడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నీవు తెలుసుకో} [ముహమ్మద్: 19]
మరొక చోట అల్లాహ్ సెలవిచ్చాడు: {ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).} [హజ్: 62]
5వ ప్రశ్న: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?
జ: అల్లాహ్ ఆకాశంలో, అర్ష్ మీద, అన్ని సృష్టులపై ఉన్నాడు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.} [తాహా: 5]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.} [అల్ అన్ఆమ్: 18]
6వ ప్రశ్న: 'ముహమ్మద్, అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యం పలకటం' అంటే అర్ధం ఏమిటి?
జవాబు: దాని అర్థం - నిశ్చయంగా అల్లాహ్ ఆయనను సర్వలోకాలకు శుభవార్త తెలిపే వానిగా మరియు హెచ్చరించే వానిగా చేసి పంపాడు.
అందువలన ఆయన గురించి ప్రతి ఒక్కరిపై క్రింది విషయాలు విధి గావించబడి ఉన్నాయి:
1. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞలను శిరసావహించుట.
2. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని విశ్వసించుట.
3. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపకుండా ఉండుట.
4. మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన షరీఅతు ప్రకారం మాత్రమే ఆరాధించుట అంటే సున్నతులను అనుసరించుట మరియు ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలను, ఆవిష్కరణలను బహిష్కరించుట అత్యవసరమైది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {దైవప్రవక్తను అనుసరించేవాడు అల్లాహ్ ను అనుసరించాడు.} [నిసా: 80]
అల్లాహ్ సెలవిచ్చాడు: {మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు. అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.(4) [అన్ నజ్మ్ : 3 - 4]
ఇంకా మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!} [ అహ్జాబ్: 21]
7వ ప్రశ్న: అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు?
జ : ఆయన మనల్ని తన ఒక్కడి ఆరాధన కొరకు సృష్టించాడు, ఆయనకు ఎవరు సాటి లేరు. ఆయన మనలను వ్యర్థంగా లేదా వినోదం కోసం సృష్టించలేదు, అలాగే నిర్లక్ష్యంగా లేదా నిరుద్దేశంగా వదిలిపెట్టలేదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు నేను జిన్నాతులను మరియు మానవులను కేవలం నా ఆరాధన కొరకే సృష్టించాను.} [జారియాత్: 56]
8వ ప్రశ్న: ఆరాధన అంటే ఏమిటి?
ఆరాధన (ఇబాదత్) అనేది ఒక విస్తృతమైన పదము. ఇది అల్లాహ్ ఇష్టపడే మరియు సంతుష్టపడే అన్నిరకాల బహిర్గతమైన మరియు గోప్యమైన మొత్తం మాటలు మరియు ఆచరణలు కలిగి ఉన్నది.
తస్బీహ్ (అల్లాహ్ ను కీర్తించడం), తహ్మీద్ (అల్లాహ్ ను స్తుతించడం), మరియు తక్బీర్ (అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం) మొదలైన పదాలతో అల్లాహ్ యొక్క జిక్ర్ ను (ధ్యానాన్ని) తమ నాలుకతో చేయుట, సలాహ్ (నమాజు) చేయుట మరియు హజ్ యాత్ర చేయుట వంటివి బహిర్గతమైన ఆరాధనకు ఉదాహరణ.
మరోవైపు, అల్లాహ్ పై ఆధారపడుట, ఆయనకు భయపడుట మరియు ఆయనపై ఆశలు పెట్టుకొనుట మొదలైనవి గోప్యమైన ఆరాధనకు ఉదాహరణలు.
9వ ప్రశ్న: మన అసలు కర్తవ్యము ఏమిటి?
జవాబు: మనపై ఉన్న అసలు కర్తవ్యము 'తౌహీద్ అల్లాహ్' అంటే మహోన్నతుడైన అల్లాహ్ పట్ల ఏకదైవత్వ విశ్వాసము కలిగి ఉండుట.
మహోన్నతుడు అయిన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని,} [అల్ బయ్యినహ్: 5]
10వ ప్రశ్న: తౌహీద్ విభాగాలు ఎన్ని?
జ : 1.తౌహీద్ రుబూబియ్యహ్ (ప్రభుతలో ఏకత్వం): కేవలం అల్లాహ్ మాత్రమే సమస్త సృష్టిరాశుల సృష్టికర్త, ప్రధాత, యజమాని మరియు వ్యవహారాలను నిర్వహించేవాడని,ఒక్కడే అని ఆయనకు ఎవరు సాటి లేరని విశ్వసించటం.
రెండవది తౌహీద్ ఉలూహియ్యహ్ (ఆరాధనలలో ఏకత్వం): సకల ఆరాధనలు కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుట అంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించకుండా ఉండుట.
3. తౌహీద్ అస్మా వ సిఫ్ఫాత్ (దివ్యనామాలు మరియు దివ్యగుణాలలో ఏకత్వం): ఖుర్ఆన్ మరియు సున్నతులలో తమ్'సీల్ (అల్లాహ్ మరియు ఆయన సృష్టి మధ్య సారూప్యతను కల్పించుట), తష్'బీహ్ (అల్లాహ్ ను ఆయన సృష్టితో పోల్చుట), లేదా త’అతీల్ (నిరాకరించుట, తిరస్కరించుట) మొదలైన వాటికి తావు లేకుండా అల్లాహ్ యొక్క దివ్యనామాలు మరియు దివ్యగుణాలను విశ్వసించడం అని దీని అర్థం.
మూడు రకాల తౌహీద్ గురించి ఆధారం: అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?" [మర్యమ్: 65]
11వ ప్రశ్న: అత్యంత ఘోరమైన పాపం ఏది?
జవాబు: షిర్క్ (మహోన్నతుడైన అల్లాహ్ కు సాటి కల్పించుట, ఆయన ఏక దైవత్వంలో భాగస్వాములను చేర్చుట)
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహాపాపం చేసిన వాడు!} [నిసా: 48]
ప్రశ్న 12 : షిర్క్ అంటే ఏమిటి మరియు దాని రకాలు ఏమిటి ?
జవాబు: షిర్క్ అంటే మనిషి అల్లాహ్‌కు సమానుడిని ఉంచడం; అది ఆయన ఆరాధనలో కావచ్చు, రబూబీయతులో కావచ్చు లేదా ఆయన పేర్లు మరియు లక్షణాలలో కావచ్చు.
ఆరాధన రకాలలో నుంచి దేనినైనా అల్లాహ్ కు కాకుండా ఇతరులకు చేయటం షిర్క్ లోని భాగమే.
షిర్క్ లోని రకాలు:
షిర్కే అక్బర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ ను కాకుండా ఇతరులను వేడుకొనుట, ఇతరులకు సజ్దా చేయుట (సాష్టాంగ పడుట), ఇతరుల పేరు మీద జిబహ్ చేయుట (బలిపశువు వధించుట, ఖుర్బానీ చేయుట) మొదలైనవి.
షిర్కే అస్గర్: ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయుట; తమకు ప్రయోజనం కలిగిస్తాయనే లేదా హాని నుండి రక్షిస్తాయనే నమ్మకంతో తాయెత్తులు కట్టుకొనుట లేదా వ్రేలాడ దీయుట; ఇతరుల మెప్పు కోసం తన ఆరాధనలను మరింతగా పొడిగించుట (ప్రదర్శనాబుద్ధి).
13వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప అగోచర విషయాల జ్ఞానం ఇంకెవరికైనా ఉందా?
కేవలం అల్లాహ్ ఒక్కనికే తప్ప అగోచర విషయాల జ్ఞానం మరెవ్వరికీ లేదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {వారితో అను: "ఆకాశాలలోను మరియు భూమిలోను ఉన్న అగోచర విషయజ్ఞానం గలవాడు అల్లాహ్ తప్ప మరొకడు లేడు. మరియు వారు తిరిగి ఎప్పుడు లేపబడతారో కూడా వారికి తెలియదు."} [నమ్ల్: 65]
ప్ర14: ఈమాన్ (విశ్వాసం) యొక్క మూల స్థంభాలు ఏమిటి?
జ : విశ్వాసము యొక్క మూల స్తంభములు ఆరు:
1) మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం చూపటం.
2) ఆయన దూతలపై విశ్వాసం.
3) ఆయన గ్రంధాలపై విశ్వాసం.
4) ఆయన సందేశహరులపై విశ్వాసం.
5) అంతిమదినంపై విశ్వాసం.
6) ఖద్ర్ (విధివ్రాత)పై విశ్వాసం.
దీనికి సాక్ష్యాధారం: ముస్లిం హదీసు గ్రంధంలో నమోదు చేయబడిన సుప్రసిద్ధ హదీసు జిబ్రయీల్ అలైహిస్సలాంలో దీని సాక్ష్యాధారం ఉన్నది: ఇక ఈమాన్ (విశ్వాసం) గురించి నాకు తెలుపండి. దానికి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా పలికారు: "అల్లాహ్ ను, ఆయన దైవదూతలను, ఆయన గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని మరియు విధివ్రాతను విశ్వసించుట".
ప్ర14: ఈమాన్ (విశ్వాసం) యొక్క మూలస్థంభాల అర్ధం ఏమిటి?
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసం: మిమ్మల్ని సృష్టించిన, మిమ్మల్ని పోషిస్తున్న, ఇంకా సకల సృష్టిరాశుల యజమాని మరియు నిర్వాహకుడు అయిన అల్లాహ్ ను మాత్రమే విశ్వసించుట. మరియు ఆయనే ఆరాధ్యుడు. నిజానికి, ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధ్యులు లేరు. సృష్టించటం, ఆదేశము, తీర్పు ధర్మశాసనాలు చేయటం ఆయన ఒక్కడిగే చెందును. ఆయనకు ఎవరు సాటి లేరు.
మరియు ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. ఆయనకు సాటి ఎవ్వరూ లేరు. ఆయనను పోలిన వారెవ్వరూ లేరు. ఆయనలో ఎలాంటి లోపాలూ, కొరతలూ లేవు.
దైవదూతల పై విశ్వాసం: కేవలం తనను మాత్రమే ఆరాధించడానికి మరియు తన ఆజ్ఞలను మాత్రమే పూర్తిగా అనుసరించేందుకు, అల్లాహ్ కాంతి నుండి సృష్టించిన గొప్ప సృష్టిరాశులే దైవదూతలు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!" వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.} [అల్ అంబియా :26,27]
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా పలికారు: దైవదూతలు జ్యోతి( నూర్) నుండి సృష్టించబడ్డారు.
వారిలో జిబ్రయీల్ అలైహిస్సలామ్ ఒకరు. ఆయన ప్రవక్తలకు, సందేశహరులకు ప్రత్యక్షంగా దైవసందేశాన్ని అందిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం). దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు; నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని; స్పష్టమైన అరబీ భాషలో!} [షుఅరా:192-195]
దైవగ్రంధాల పై విశ్వాసం: ఉదాహరణకు అల్లాహ్ తన సందేశహరులపై అవతరింప జేసిన గ్రంధాలు.
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేసిన ఖుర్ఆన్ లా.
ఇంజీలు గ్రంధం ప్రవక్త ఈసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
తౌరాతు గ్రంధం ప్రవక్త మూసా అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
జబూర్ గ్రంధం ప్రవక్త దావూద్ అలైహిస్సలాం పై అవతరింప జేయబడింది.
- సహీఫ ఇబ్రాహీమ్ మరియు మూసా (అలైహిమ స్సలాం): ప్రవక్త ఇబ్రాహీమ్ మరియు మూసా అలైహిమస్సలాంల పై అవతరింప జేయబడినాయి.
దైవసందేశహరుల పై విశ్వాసం: మరియు తన దాసులకు (ధర్మం) బోధించడానికి, మంచితనం మరియు స్వర్గానికి సంబంధించిన శుభవార్తలను అందించడానికి, ఇంకా చెడు మరియు నరకం నుండి వారిని హెచ్చరించడానికి అల్లాహ్ తన సందేశహరులను ఉద్భవింపజేసాడు.
మరియు వారిలో ఉత్తములు మరియు దృఢసంకల్పం గల కొందరు సందేశహరులు:
నూహ్ అలైహిస్సలాం.
ఇబ్రాహీమ్ అలైహిస్సలాం.
మూసా అలైహిస్సలాం.
ఈసా అలైహిస్సలాం.
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ప్రళయదినం పై విశ్వాసం: ప్రళయదినంపై విశ్వాసం అంటే సమాధిలోని మరణానంతరం జీవితంపై విశ్వాసం ఉదాహరణకు ప్రళయదినం, పునరుత్థాన దినం, అంతిమ తీర్పుదినం, చివరికి శాశ్వతంగా స్వర్గవాసులు స్వర్గంలోని తమ స్థానాల్లో మరియ నరకవాసులు నరకంలోని తమ స్థానాల్లో చేరటంపై విశ్వాసం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!} [ఆలి ఇమ్రాన్ : 185]
6) అల్ ఖద్ర్ ఖైరిహి,వషర్రిహి ( మంచి,చెడు విధివ్రాత)పై విశ్వాసం:
అల్ ఖద్ర్: విశ్వంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ కు తెలుసు అనీ, ఆయన ఆ జ్ఞానాన్ని దానిని అత్యంత సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే దివ్యగ్రంధంలో లిఖించి ఉంచాడని, దాని ఉనికి ఆయన ఇష్టానుసారమే ఉందని మరియు దానిని ఆయనే సృష్టించాడని విశ్వసించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిశ్చయంగా, మేము ప్రతి దానిని ఒక విధివ్రాత (ఖద్ర్) తో సృష్టించాము.} [అల్ ఖమర్: 49]
అది నాలుగు స్థాయిలలో జరిగింది:
మొదటిది: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహాద్భుత జ్ఞానము. ప్రతిదీ సంభవించక ముందు మరియు సంభవించిన తర్వాత విషయాల గురించి తన అపూర్వ జ్ఞానం వలన ఆయన ముందే ఎరుగును.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు).} [లుఖ్మాన్ : 34]
రెండవది: దీనిని అల్లాహ్ సురక్షితంగా భద్రపరచబడిన ‘అల్ కితాబ్’ అనే మహాద్భుత గ్రంధంలో లిఖించాడు. కాబట్టి జరిగినదీ మరియు జరగబోయేదీ ప్రతిదీ ఆయన అందులో నమోదు చేసి ఉంచాడు.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {మరియు అగోచర విషయాల తాళపు చెవులు ఆయన (అల్లాహ్) వద్దనే ఉన్నాయి. వాటిని, ఆయన తప్ప మరెవ్వరూ ఎరుగరు. మరియు భూమిలోనూ, సముద్రంలోనూ ఉన్నదంతా ఆయనకు తెలుసు. మరియు ఆయనకు తెలియకుండా ఏ చెట్టు ఆకు కూడా రాలదు. మరియు భూమిలోని చీకటి పొరలలో ఉన్న ప్రతి గింజ, అది పచ్చిది కానీ ఎండినది కానీ అంతా స్పష్టంగా ఒక గ్రంధంలో (వ్రాయబడి) ఉంది.} [అల్ అన్ఆమ్: 59 ]
మూడవది: ప్రతిదీ అల్లాహ్ యొక్క చిత్తం ద్వారా మాత్రమే జరుగుతుంది మరియు ఆయన సృష్టిలోనిదేదీ ఆయన ఇష్టానుసారంగా కాకుండా జరగదు. మరియు దాసునికి ఎంపిక ఉంటుంది, నిర్ణయం ఉంటుంది, మరియు అతనికి ఇష్ట ప్రకారం ఉంటుంది. అయితే, ఈ ఆలోచన మరియు ఈ ఇష్టప్రకారం అల్లాహ్ సుబ్హానహూ తఆలా యొక్క ఇష్టానికి తరువాత మాత్రమే జరుగుతాయి.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {మీలో, ఋజుమార్గంలో నడవ దలచుకున్న ప్రతివాని కొరకు.28 మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.29} [అత్తక్వీర్ : 28-29]
నాల్గవది: మొత్తం సృష్టిలోని జీవరాశులన్నీ అల్లాహ్ చే సృష్టించబడిన జీవరాశులు అని విశ్వసించుట. ఆయనే వాటి ఆత్మలనూ, గుణగణాలనూ, కదలికలనూ మరియు వాటిలో ఉన్న ప్రతిదాన్నీ సృష్టించాడు.
దీనికి సాక్ష్యం: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {"వాస్తవానికి, మిమ్మల్ని మరియు మీరు (చెక్కి) చేసిన వాటిని సృష్టించింది అల్లాహ్ యే కదా!"} [అస్సాఫ్ఫాత్: 96]
16వ ప్రశ్న: ఖుర్ఆన్ ను నిర్వచించండి?
ఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు, అది సృష్టించబడిన వాటిలోనిది కాదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు బహుదైవారాధకులలో (ముష్రికీనులలో) ఎవడైనా నీ శరణు కోరితే – అతడు అల్లాహ్ గ్రంధాన్ని (ఖుర్ఆను) వినటానికి – అతనికి శరణు ఇవ్వు.} [తౌబా: 6]
హదీసులో ఇలా వివరించబడింది: "అల్లాహ్ వాక్కు యొక్క శ్రేష్ఠత ఇతర మాటలపై, అల్లాహ్ యొక్క సృష్టులపై ఆయన శ్రేష్ఠత లాంటిదే."
17వ ప్రశ్న: సున్నతు అంటే ఏమిటి?
జవాబు: సున్నతు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు, ఆచరణలు, అనుమతులు మరియు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క స్వభావం.
18వ ప్రశ్న: బిద్అతు (ఇస్లాం ధర్మంలో నూతన కల్పితాలు, ఆవిష్కరణలు) అంటే ఏమిటి? మనం వాటిని అంగీకరిస్తామా ?
జవాబు: ప్రజలు ధర్మంలో ఆవిష్కరించిన ప్రతి నూతన కల్పితమూ బిద్అత్ గానే పరిగణించబడుతుంది. మరియు దాని ఉనికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల కాలంలో కనబడదు.
దానిని మనం అంగీకరించకూడదు, వాస్తవానికి దానిని సూటీగా తిరస్కరించ వలెను.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ప్రతి నూతన ధార్మిక కల్పితం, ఆవిష్కరణ మార్గభ్రష్టత్వమే.
- మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూక్తి: ఎవరైనా నా ఆదేశం లేని ఏదైన ఆచరణ (ధర్మం అనుకుని) చేస్తే అది తిరస్కరించబడును.
దానికి ఉదాహరణకు: వుజులో (మూడు సార్లు కడగటంతో ఆగకుండా) నాల్గవ సారి కడగటం, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పుట్టినరోజు జరుపుకోవడం వంటి ఆరాధనలో నిర్దేశించబడిన వాటిలో హద్దులు మీరటం. ఇలాంటివి ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నుండి గానీ, ఆయన సహాబాల రజియల్లాహు అన్హుమ్ నుండి గానీ నమోదు చేయబడలేదు.
ప్రశ్న 19: వలా మరియు బరాఅ యొక్క ఆఖీదా ఏమిటి?
జవాబు: అల్ వలాఅ అంటే దైవవిశ్వాసులతో ప్రేమగా మెలుగుతూ, వినమ్రతతో వారికి సహాయ సహకారాలు అందించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు విశ్వాసులైన పురుషులు మరియు విశ్వాసులైన స్త్రీలు ఒకరి కొకరు స్నేహితులు.} [అత్తౌబా : 71]
అల్ బరాఅ: అంటే సత్యతిరస్కారులను మరియు ఇస్లాంకు విరుద్ధంగా వారు చూపే శత్రుత్వాన్ని ద్వేషించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {"వాస్తవానికి ఇబ్రాహీమ్ మరియు అతనితో ఉన్న వారిలో మీ కొరకు ఒక మంచి ఆదర్శం ఉంది. వారు తమ జాతి వారితో ఇలా అన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకో: "నిశ్చయంగా, అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటితో మరియు మీతో, మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము మిమ్మల్ని త్యజించాము మరియు మీరు అద్వితీయుడైన అల్లాహ్ ను విశ్వసించనంత వరకు, మాకూ మీకూ మధ్య విరోధం మరియు ద్వేషం ఉంటుంది".} [అల్ ముమ్'తహీన :4]
20వ ప్రశ్న: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అంగీకరిస్తాడా?
జవాబు: ఇస్లాం ధర్మాన్ని కాకుండా వేరే ధర్మాన్ని అల్లాహ్ అస్సలు అంగీకరించడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత చూపడాన్ని (ఇస్లాం ను) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడే వారిలో చేరుతాడు.} [ఆలె ఇమ్రాన్ :85]
21వ ప్రశ్న: కుఫ్ర్ (సత్యతిరస్కారం, అవిశ్వాసం) అనేది మాటల్లోనూ, చేతల్లోనూ, మనస్సులోనూ జరుగుతుంది అనడానికి ఉదాహరణ ఇవ్వండి?
జవాబు: మాటల్లో సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: అల్లాహ్ ను లేదా ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను దూషించడం.
చేతల్లో సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: ఖుర్ఆన్ ను అవమానించడం లేదా మహోన్నతుడైన అల్లాహ్ కు కాకుండా మరొకరికి సజ్దా (సాష్టాంగం) చేయడం.
మనస్సులోపల సత్యతిరస్కారానికి, అవిశ్వాసానికి ఒక ఉదాహరణ: మహోన్నతుడైన అల్లాహ్ కాకుండా ఆరాధనలకు అర్హుడు మరొకడు ఉన్నాడని లేదా మహోన్నతుడైన అల్లాహ్ తో పాటు మరో సృష్టికర్త ఉన్నాడని నమ్మడం.
22వ ప్రశ్న: నిఫాఖ్ (కపటత్వం) అంటే ఏమిటి?
జవాబు : 1) ఘోరమైన కపటత్వము (అన్నిఫాఖుల్ అక్బర్): మనసు లోపల అవిశ్వాసాన్ని దాచి పెట్టి, బయటికి విశ్వాసిగా నటించడం.
ఇది ఇస్లాం నుండి బహిష్కరింప జేస్తుంది మరియు ఇది ఘోరమైన అవిశ్వాసంగా పరిగణించబడుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిశ్చయంగా కపట విశ్వాసులు నరకంలోని అట్టడుగు అంతస్తులో పడి ఉంటారు. మరియు వారికి సహాయం చేయగల వాడిని ఎవ్వడినీ నీవు చూడవు.} [నిసా : 145]
2) అల్పమైన కపటత్వము: ఉదాహరణ: అబద్ధం పలకడం, వాగ్దాన భంగము, నమ్మకద్రోహము మొదలైనవి.
ఇది ఇస్లాం నుండి బహిష్కరింప జేయదు. గానీ, పాపకార్యంగా పరిగణించ బడుతుంది, అలాంటి వ్యక్తికి కఠినశిక్షలు విధించబడతాయి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {కపటవిశ్వాసిలో మూడు చిహ్నాలు ఉంటాయి: అతడు మాట్లాడినప్పుడు అసత్యమాడుతాడు, ప్రమాణం చేసి తప్పుతాడు, అమానతుగా ఉంచమని అప్పగిస్తే, నమ్మకద్రోహం చేస్తాడు.}
23వ ప్రశ్న: ప్రవక్తల మరియు సందేశహరుల పరంపరను ముగించే సీలుముద్ర వంటి వారు ఎవరు ?
జవాబు : ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {(ఓ మానవులారా!) ముహమ్మద్ మీ పురుషుల్లో ఎవ్వడికీ తండ్రి కాడు. కాని ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ప్రవక్తలలో చిట్టచివరివాడు.} [అల్ అహ్’జాబ్ :40]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నేను ప్రవక్తల పరంపరను ముగించే సీలుముద్రను. నా తరువాత ఏ ప్రవక్తా పంపబడడు.
24వ ప్రశ్న: మహిమ (అద్భుతం) అంటే ఏమిటి ?
ప్రతి అసాధారణమైన, అస్వభావికమైన, మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన అతీంద్రియ చర్య లేదా సంఘటనను (మోజిజా) అంటే మహిమ లేదా అద్భుతం అంటారు. మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్తలకు తమ నిజాయితీని నిరూపించుకోవడానికి మద్దతుగా వారికి కొన్ని మహిమలు, అద్భుతాలు ప్రసాదించాడు. ఉదాహరణకు:
- దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు చంద్రుడు రెండు ముక్కలవటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: [ఆ ఘడియ దగ్గరకు వచ్చింది మరియు చంద్రుడు పూర్తిగా చీలిపోయాడు. అయినా (సత్యతిరస్కారులు), అద్భుత సూచనను చూసినా తమ ముఖాలను త్రిప్పుకుంటున్నారు. మరియు: "ఇది ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్న మంత్రజాలమే." అని అంటున్నారు. మరియు వారు దీనిని (ఈ ఖుర్ఆన్ ను) అసత్యమని తిరస్కరించారు. మరియు తమ మనోవాంఛలను అనుసరించారు. మరియు ప్రతి వ్యవహారం ఒక పర్యవసానానికి చేరవలసి ఉంటుంది.} [అల్ ఖమర్: 1-3]
మూసా అలైహిస్సలాం (అల్లాహ్ ఆజ్ఞతో) సముద్రాన్ని రెండుగా చీల్చడం, ఫిరౌనును మరియు అతడి సైన్యాన్ని అందులో ముంచి వేయడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మరియు మేము మీ కొరకు సముద్రాన్ని చీల్చి మిమ్మల్ని రక్షించి నప్పుడు మీరు చూస్తూ ఉండగానే ఫిర్ఔన్ జాతి వారిని ముంచి వేసిన సంఘటనను (గుర్తుకు తెచ్చుకోండి).} [అల్ బఖర: 50]
ప్రశ్న 25: సహాబాలు ఎవరు? మనం వారిని ప్రేమించటం తప్పనిసరా?
జవాబు: సహాబీ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకుని, ఆయనపై విశ్వాసం ఉంచి, ఇస్లాం మీదే మరణించిన వ్యక్తి.
మనము సహాబాలను తప్పనిసరిగా ప్రేమించి, వారిని అనుసరించాలి. వారు ప్రవక్తల తరువాత అత్యుత్తములు మరియు శ్రేష్ఠులైనవారు.
వారిలో అత్యుత్తములు: నలుగురు ఖలీఫాలు.
అబూబక్ర్ రజియల్లాహు అన్హు
ఉమర్ రజియల్లాహు అన్హు
ఉస్మాన్ రజియల్లాహు అన్హు
అలీ రజియల్లాహు అన్హు
మహోన్నతుడైన అల్లాహ్ సహాబా రజియల్లాహు అన్హుమ్ అజ్మయీన్ గురించి ఇలా సెలవిచ్చాడు: {మరియు వలస వచ్చిన ముహాజిర్ లలో నుండి మరియు అన్సారులలో (మదీనావాసులలో) నుండి, ప్రప్రథమంగా ముందంజ వేసిన (ఇస్లాం ను స్వీకరించిన) వారితోనూ మరియు సహృదయంతో వారిని అనుసరించిన వారితోనూ, అల్లాహ్ సంతోషపడ్డాడు. మరియు వారు కూడా ఆయనతో సంతోషపడ్డారు. మరియు వారి కొరకు క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలను సిద్ధ పరిచి ఉంచాడు. వారు వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అదే గొప్ప సాఫల్యం (విజయం).} [తౌబా : 100]
26వ ప్రశ్న: ఉమ్మహాతుల్ మోమినీన్ అంటే ఎవరు?
జవాబు: వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సతీమములు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {విశ్వాసులకు (ముస్లింలకు) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, స్వయం కంటే కూడా ముఖ్యులు మరియు అతని భార్యలు వారికి తల్లులు.} [అల్ అహ్'జాబ్: 6]
ప్రశ్న 27: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు పట్ల మనపై ఉన్న హక్కులు ఏమిటి?
వారిని గౌరవించే వారిని మేము గౌరవిస్తాము, వారిని ద్వేషించేవారిని మేము ద్వేషిస్తాము. మరియు మేము వారితో హద్దుమీరి ప్రవర్తించము మరియు వారు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర భార్యలు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ఓ ప్రవక్త ఇంటివారులారా! మీ నుండి (అన్ని రకాల) మాలిన్యాన్ని దూరం చేయాలన్నది, మిమ్మల్ని పూర్తిగా పరిశుద్ధ పరచాలన్నది అల్లాహ్ అభిలాష.} [అల్ అహ్'జాబ్: 33]
ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: నా కుటుంబం గురించి నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేయాలనుకుంటున్నాను, నా కుటుంబం గురించి అల్లాహ్ ను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను, నా కుటుంబం గురించి నేను మీకు అల్లాహ్ ను గుర్తు చేయాలనుకుంటున్నాను.
28వ ప్రశ్న: ముస్లింల పాలకుల పట్ల మన కర్తవ్యం ఏమిటి?
జవాబు: మన కర్తవ్యం ఏమిటంటే, వారిని గౌరవించడం, శ్రద్ధగా వినడం, విధేయత చూపడం వారి పై తిరుగుబాటు చేయకుండా ఉండడం, వారిని విడిచి పెట్టకుండా ఉండడం, బహిరంగంగా కాకుండా గోప్యంగా వారికి సలహా ఇవ్వడం, స్పష్టమైన కుఫ్ర్ మనకు కనిపిస్తే తప్ప వారి పై తిరుగుబాటు చేయకుండా ఉండడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి; మరియు ఆయన సందేశహరునికి విధేయులై ఉండండి మరియు మీలో అధికారం అప్పగించబడిన వారికి కూడా! మీ మధ్య ఏ విషయంలోనైనా అభిప్రాయ భేదం కలిగితే - మీరు అల్లాహ్ ను అంతిమదినాన్ని విశ్వసించే వారే అయితే - ఆ విషయాన్ని అల్లాహ్ కు మరియు ప్రవక్తకు నివేదించండి. ఇదే సరైన పద్ధతి మరియు ఫలితాన్ని బట్టి కూడా ఉత్తమమైనది.} [నిసా: 59]
29వ ప్రశ్న: విశ్వాసుల నివాస స్థలము ఏది?
జవాబు: స్వర్గం (జన్నత్). మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : విశ్వసించి సత్కార్యాలు చేసేవారిని, అల్లాహ్ నిశ్చయంగా, క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. [ముహమ్మద్: 12]
30వ ప్రశ్న: అవిశ్వాసుల నివాస స్థలము ఏది?
జవాబు: నరకాగ్ని (జహన్నుమ్). మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయ పడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది.} [అల్ బఖర: 24]
31వ ప్రశ్న: భయపడటం అంటే ఏమిటి? ఆశ పడటం అంటే ఏమిటి? వాటికి సాక్ష్యాధారాలు ఏవి?
జవాబు: భయపడటం అంటే అది అల్లాహ్ నుండి మరియు ఆయన కఠినశిక్షల నుండి భయపడటం.
ఆశ పడటం అంటే అల్లాహ్ నుండి అనుగ్రహాలు లభిస్తాయని ఆశించడం, అల్లాహ్ మనల్ని మన్నిస్తాడని మరియు మనపై కారుణ్యం చూపుతాడని ఆశించడం.
దీనికి ఆధారం: మహోన్నతుడై అల్లాహ్ వాక్కు: {వారు, ఎవరినైతే వీరు ప్రార్థిస్తూ ఉన్నారో, వారే తమ ప్రభువు సాన్నిధ్యాన్ని పొందటానికి మార్గాన్ని వెతుకుతున్నారు. మరియు వారిలో ఆయనకు ఎవరు ఎక్కువ సాన్నిధ్యం పొందుతారో అని ప్రయత్నిస్తున్నారు. మరియు ఆయన కారుణ్యాన్ని ఆశిస్తున్నారు మరియు ఆయన శిక్షకు భయపడుతున్నారు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్ష, దానికి భయపడ వలసిందే!} {అల్ ఇస్రా: 57}
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: నా దాసులకు ఇలా తెలియజెయ్యి: నిశ్చయంగా నేను, కేవలం నేనే! క్షమించేవాడను, కరుణించేవాడను. మరియు నిశ్చయంగా, నా శిక్షయే అతి బాధాకరమైన శిక్ష! [అల్ హిజ్ర్: 49 - 50]
ప్రశ్న32: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలు పేర్కొనండి?
జవాబు: అల్లాహ్, అర్రబ్, అర్రహ్మాన్, అస్సమీయి, అల్ బసీర్, అల్ అ'లీమ్, అర్రజ్జాఖ్, అల్ హయ్యి, అల్ అజీమ్ మరియు అల్ హకీమ్ మొదలైనవి మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కొన్ని దివ్యనామాలు మరియు గుణగణాలూను.
33వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ దివ్యనామము గురించి వివరించండి?
జవాబు: అల్లాహ్: అర్ధము అల్ ఇలాహ్, నిజమైన ఆరాధ్యుడు, ఏకైకుడు, అద్వితీయుడు, ఆయనకు సాటి గానీ, భాగస్వాములు గానీ ముమ్మాటికీ ఎవ్వరూ లేరు, ఏదీ లేదు.
అర్రబ్: సృష్టికర్త, యజమాని, పోషకుడు, వ్యవహారాలను చక్కబెట్టేవాడు, ఏకైకుడు, ఏ లోపమూ మరియు ఏ కొరతా లేని వాడు.
అస్సమీఉ: సృష్టిలోని ప్రతిదీ వినగలిగేటంతటి గొప్ప శ్రవణశక్తి గలవాడు. వాటి మధ్య తేడాలు మరియు వైరుధ్యాలు ఉన్నప్పటికీ సృష్టిలోని శబ్దాలన్నింటినీ వినగలవాడు,
అల్ బసీరు: సృష్టిలోని ప్రతిదీ చూడగలిగేవాడు. సూక్ష్మమైనదైనా, అతి పెద్దది అయినా ప్రతిదీ చూడగలిగేవాడు.
అల్ అ'లీము: భూత, వర్తమాన, భవిష్య కాలములలో సృష్టిలోని ప్రతిదానిని తన అపూర్వ జ్ఞానంతో ఆవరించి ఉన్నవాడు.
అర్రహ్మాన్: సకల సృష్టిరాశులను ఆవరించగలిగేంత కరుణ కలిగినవాడు. ప్రతి దాసుడూ, ప్రతి సృష్టిరాశీ ఆయన కారుణ్యం వలననే జీవిస్తున్నాయి.
అర్రజ్'జాఖ్: మొత్తం మానవజాతినీ, జిన్నాతులనూ మరియు సృష్టిరాశులన్నింటినీ పోషించగలిగే శక్తి గలవాడు.
అల్ హయ్యు: నిత్యుడు, మరణం లేనివాడు. మొత్తం సృష్టి నాశనమై పోయినా మిగిలి ఉండే వాడు.
అల్ అజీమ్: తన దివ్యనామాలు, గుణగుణాలు మరియు దివ్య కార్యాలలో పరిపూర్ణతలన్నీ మరియు మహిమలన్నీ కలిగి ఉన్నవాడు.
హకీమ్: అతను తన సృష్టిని పరిపూర్ణంగా, అద్భుతంగా మరియు మంచిగా సృష్టించినవాడు, అతనికి తన సృష్టిలో మరియు తీర్పులలో హిక్మత్ (జ్ఞానం) ఉంది.
హిక్మత్: ప్రపంచంలోని వస్తువులను తమ స్థానాల్లో ఉంచడం, వాటిని వారి సరైన స్థాయిలో ఉంచడం.
34వ ప్రశ్న: ముస్లింల పండితుల పట్ల మన కర్తవ్యం ఏమిటి?
జవాబు: ముస్లిం పండితుల పట్ల మన కర్తవ్యం ఏమిటంటే వారిని ప్రేమించడం మరియు షరీఅతు సంబంధిత సమస్యలు మరియు అపూర్వమైన సంఘటనల పరిష్కారం కొరకు వారిని సంప్రదించడం. మనం పండితులను సగౌరవంగా సంభోదించాలి మరియు ప్రస్తావించాలి. ఎవరైతే వారితో ప్రతికూలంగా, అవమానకరంగా ప్రవర్తిస్తారో, వారు సన్మార్గంపై లేనట్లే.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు మీలో విశ్వసించిన వారికి మరియు జ్ఞానం ప్రసాదించ- బడిన వారికి అల్లాహ్ ఉన్నత స్థానాలను ప్రసాదిస్తాడు.} [అల్ ముజాదల: 11]
ప్రశ్న 35: మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఔలియాలు అంటే ఎవరు ?
జ : వారు విశ్వాసపరులు, అల్లాహ్‌కు భయపడే వారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్‌ను అనుసరించే వారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిశ్చయంగా అల్లాహ్ కు ప్రియులైన వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! 62 ఎవరైతే విశ్వసించారో మరియు దైవభీతి కలిగి ఉంటారో!63} [యూనుస్ : 62-63]
36వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) మాటల్లో మరియు చేతల్లో కూడా ఉంటుందా?
జవాబు: అవును, ఈమాన్ మాటల్లోనూ, చేతల్లోనూ, మనస్సులోనూ ఉంటుంది.
- నాలికతో పలకటం,మనస్సుతో విశ్వసించటం, ఆచరించటం - అంటే హృదయంతో - ఆవయవాలతో ఆచరించుట.
- అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “విశ్వాసము డెభ్భై శాఖలు కలిగి ఉంటుంది లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా 60 శాఖలు కలిగి ఉంటుంది (అన్నారు). వాటిలో అత్యుత్తమమైనది “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు); మరియు అన్నింటికన్నా చివరిది (తక్కువ స్థాయి శాఖ) ప్రజలు నడిచే దారి నుండి ప్రమాదకరమైన దానిని తొలగించుట*. అలాగే అణకువ, నమ్రత, బిడియము – విశ్వాసపు శాఖలలో ఒకటి.”
37వ ప్రశ్న: అల్ ఈమాన్ (దైవవిశ్వాసం) పెరుగుతూ, తరుగుతూ ఉంటుందా?
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ కు విధేయత చూపుతున్నప్పుడు ఈమాను పెరుగుతుంది మరియు అవిధేయత చూపుతూ, పాపాలు చేస్తున్నప్పుడు ఈమాన్ తరుగుతుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {నిశ్చయంగా, విశ్వాసులైన వారి హృదయాలు అల్లాహ్ ప్రస్తావన వచ్చినపుడు భయంతో వణుకుతాయి. మరియు వారి ముందు ఆయన ఆయతులు పఠింపబడినప్పుడు వారి విశ్వాసం మరింత అధికమవుతుంది. మరియు వారు తమ ప్రభువు మీదే దృఢనమ్మకం కలిగి ఉంటారు.} [అల్ అన్ఫాల్: 2]
38వ ప్రశ్న: అల్ ఇహ్సాన్ అంటే ఏమిటి?
జవాబు : అల్ ఇహ్సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించలేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడు అని భావిస్తూ ఆయనను ఆరాధించటం.
39వ ప్రశ్న: ఏ యే సమయాలలో చేసే ఆచరణలు లోప రహితుడైన అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యంగా ఉంటాయి?
జవాబు : ఆచరణలు రెండు షరతులతో స్వీకరించబడును:
1 - మహోన్నతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే ఆ ఆచరణ అయి ఉండాలి.
2 - ఆ ఆచరణ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతు (విధానాన్ని) బట్టి ఉండాలి.
40వ ప్రశ్న: మహోన్నతుడైన అల్లాహ్ పై నమ్మకం పెట్టుకోవడం (తవక్కుల్ అలల్లాహ్) అంటే ఏమిటి ?
జవాబు: అందుబాటులో ఉన్న మార్గాలన్నింటినీ ఉపయోగించుకుంటూ, ప్రయోజనం పొందడంలో మరియు హానిని నివారించడంలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఎవరైతే అల్లాహ్ పై నమ్మకము ఉంచుతారో, అలాంటి వానికి ఆయనే చాలు} [అత్ తలాఖ్ : 3]
హస్బుహు: అంటే ఆయన అతనికి సరిపోయేటంత అధికంగా ప్రసాదిస్తాడు అని అర్థము.
41వ ప్రశ్న: అల్ అమ్ర్ బిల్ మఅరూఫ్ వ అన్నహీ అనిల్ మున్కర్ (మంచి చేయమని ఆదేశించడం మరియు చెడు చేయవద్దని నిరోధించడం) ఆదేశంలో తప్పనిసరి విధి ఏమిటి?
జవాబు: అల్ మఆరూఫ్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ కు అన్ని విధాలా విధేయత చూపడం, మరియు అల్ మున్కర్ అంటే మహోన్నతుడైన అల్లాహ్ అవిధేయత చూపుతూ పాపకార్యాలకు పాల్పడటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు.} [ఆలె ఇమ్రాన్ :110]
42: అహ్లె సున్నతు వల్ జమాఅతు అంటే ఎవరు ?
జవాబు: తమ విశ్వాసంలోనూ, మాటలలోనూ మరియు చేతలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను, ఆయన సహాబాలను మాత్రమే తు.చ. తప్పకుండా అనుసరించేవారు.
మరియు వారికి అహ్లుల్ సున్నహ్ అనే పేరు పెట్టారు: ఎందుకంటే వారు కేవలం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతులను మాత్రమే అనుసరించినందుకు మరియు ధర్మంలో నూతన కల్పితాలను త్యజించినందుకు గానూ.
మరియు జమాఅతు: ఎందుకంటే వారు సామూహికంగా సత్యంపై జమ అయ్యారు మరియు తమలో తాము భేదభావాలతో విడిపోలేదు.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: నిశ్ఛయంగా బనీ ఇస్రాయీల్ 72 వర్గాలుగా విభజించబడ్డారు, మరియు నా ఉమ్మత్ 73 వర్గాలుగా విభజించబడుతుంది. వారందరూ నరకంలోకి పోతారు, ఒక్క వర్గం మినహాయించి. వారు అడిగారు: "ఏది అది, యా రసూలల్లాహ్?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: "నేను మరియు నా సహాబాలు ఉన్న మార్గంను అనుసరించినవారు."
ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్ర) విభాగము
ఫిఖ్ (ఇస్లామీయ ధర్మశాస్త్ర) జ్ఞాన:
ఫిఖ్ : ఇది షరీయత్ సంబంధిత ఆచరణాత్మక ఆదేశాల జ్ఞానం, తాహరత్ (పవిత్రత), నమాజు, జకాత్, ఉపవాసం, హజ్, జిహాద్ మరియు ఇతర షరీయత్ సంబంధిత ఆచరణలు.
1: అత్తహారతు (పరిశుద్ధత) అంటే ఏమిటి?
జవాబు: అత్తహారతు: అంటే అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) మరియు ఖబస్ (పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి పరిశుద్ధత పొందుట. అంటే నమాజును భంగపరిచే విషయాల నుండి శుద్ది పొందటం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "నమాజు యొక్క తాళం పరిశుద్ధత (తాహరత్)".
అత్తహారతున్ మిన్ ఖబస్: ఖబస్ (నజాసహ్, పదార్థ సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే ఒక ముస్లిం తన శరీరం నుండి, బట్టల నుండి లేదా సలాహ్ (నమాజు) చేసే స్థలం నుండి భౌతిక మలినాలను తొలగించడం.
తహారతున్ మినల్ హదస్: అల్ హదస్ (ఆచార సంబంధమైన అపరిశుద్ధత) నుండి శుద్ధీకరణ అంటే స్వచ్ఛమైన నీటితో వుజూ చేయడం; లేదా గుసుల్ (ఇస్లామీయ పద్ధతిలో తలస్నానం) చేయడం; లేదా నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించడం కష్టంగా ఉన్న సందర్భంలో తయమ్ముమ్ (పరిశుభ్రమైన మట్టి ద్వారా శుద్ధీకరణ) చేయడం.
2: నజాసహ్ (పదార్థ అశుద్ధత) ద్వారా ప్రభావితమైన వాటిని ఎలా శుద్ధి చేయవచ్చు?
జవాబు: అపరిశుద్ధత తొలగిపోయే వరకు శుభ్రంగా నీటితో కడగటం ద్వారా. కుక్క నాకిన దానిని శుద్ధి చేసేందుకు మొదట దానిని శుభ్రమైన మట్టితో శుభ్రం చేసి, తర్వాత ఆరు సార్లు నీటితో కడగ వలెను, అంటే మొత్తం ఏడు సార్లు శుభ్రం చేయవలెను.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: మీలో ఎవరిదైన పాత్రలో కుక్క నాకితే దాని పరిశుద్ధత ఏమిటంటే దానిని ఏడు సార్లు కడగవలెను. వాటిలో మొదటి సారి మట్టితో.
ప్రశ్న 3: వుజూ ఘనత ఏమిటి?
ప్రశ్న 4: వుజూ ఎలా చేయాలి?
జవాబు: రెండు అరచేతులను మూడుసార్లు కడగాలి. నోటిలో నీటిని తీసుకొని పుక్కిలించటం, ముక్కులో నీటిని తీసుకొని ఛీదరించటం మూడు మూడు సార్లు చేయాలి.
అల్ మజ్'మజహ్: అంటే నోటిలో నీరు పట్టి, బాగా పుక్కిలించి, బయటకు ఉమ్మేయాలి.
అల్ ఇస్తింషాఖ్: అంటే ముక్కులో నీరు ఎక్కించి, ఎడమచేతి వేళ్ళతో ముక్కు లోపల శుభ్రం చేసుకోవటం.
ఇస్తిన్సార్ : ముక్కు లోపల ఎడమచేతి వ్రేళ్ళతో శుభ్రపరుచుకున్న తరువాత ముక్కును పట్టుకుని, ఆ నీటిని బయటికి చీదడం.
ఆ తరువాత, ముఖాన్ని మూడు సార్లు కడగాలి
ఆ తరువాత, మోచేతుల వరకు రెండు చేతులూ మూడు సార్లు చేతులు కడగాలి (ముందుగా కుడిచేయి కడగాలి, తరువాత ఎడమచేయి).
ఆ తరువాత, రెండు తడి అరచేతులను దగ్గరగా చేర్చి, తలపై నిమరాలి (నుదురు పైభాగం నుండి ప్రారంభించి, వెనక్కు), రెండు చెవుల లోపలి భాగాన్ని చూపుడు వ్రేలితో, మరియు చెవి వెనుక భాగాన్ని బొటన వ్రేలితో శుభ్రపరచుకోవాలి.
ఆ తరువాత రెండు పాదాలు చీలమండలాల వరకు శుభ్రంగా కడుక్కోవడం
దీనితో మీ వుజు పూర్తి అవుతుంది. ఉస్మాన్, అబ్దుల్లాహ్ బిన్ జైద్ మొదలైన వారి (రజియల్లాహు అన్హుమ్) ఉల్లేఖనల ఆధారంగా సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీసు గ్రంధాలలో ప్రామాణికంగా నమోదు చేయబడిన అత్యంత పరిపూర్ణమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వుజూ పద్ధతి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ప్రామాణికంగా సహీహ్ అల్ బుఖారీ మరియు ఇతర హదీసు గ్రంధాలలో నమోదు చేయబడింది: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఒకసారి వుజూ చేశారు, మరియు ఆయన రెండు సార్లు రెండు సార్లు వుజూ చేశారు» అంటే అర్థం: వుజూ యొక్క ప్రతి అవయవాన్ని ఆయన ఒకసారి లేదా రెండుసార్లు కడిగారు.
5: వుజూలో తప్పనిసరి ఆచరణలు ఏమిటి?
జవాబు: వుజూలో విధిగా చేయవలసిన ఆచరణలు ఇక్కడ పేర్కొనబడినాయి. వాటిలో ఏ ఒక్కటి విడిచిపెట్టినా, వారి వుజూ చెల్లుబాటు కాదు. అవి:
1 - ముఖం కడుక్కోవడం, నోట్లో మరియు ముక్కులో నీరు ఎక్కించి శుభ్రం చేసుకోవడం.
2 - రెండు చేతులూ మోచేతుల వరకు కడుక్కోవడం.
3 - తడి అరచేతులతో తలపై నిమరడం (మసహ్) చేయడం, మరియు రెండు చెవులను శుభ్రం చేసుకోవడం.
4 - రెండు పాదాలు చీలమండలాల వరకు శుభ్రంగా కడుక్కోవడం.
5 - ముందుగా ముఖాన్ని కడుక్కోవడం, తర్వాత చేతులు కడుక్కోవడం, తర్వాత తలపై మసహ్ చేయడం, చివరగా పాదాలు కడుక్కోవడం వరుస క్రమంలో పాటిస్తూ, నిర్దేశించిన క్రమాన్ని అనుసరించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ఓ విశ్వసించినవారులారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి.} [అల్ మాయిదా :104]
6 - వరుస క్రమంలో అంటే అవయవాలు పొడిగా మారడానికి అనుమతించే సమయ వ్యవధి అధిగమించకుండా వుజూ అవయవాలను వరుసగా ఒకదాని తరువాత ఒకటి కడగడం. వుజూ మొత్తం ఒకేసారి పూర్తి చేయకుండా, ఒకసారి సగం మాత్రం చేసి, కొంతసేపటి తరువాత మిగతా సగం చేస్తే ఆ వుజూ చెల్లదు.
హదీసు: «దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని నమాజు చేస్తూ చూశారు. అతని కాలి వెనుక భాగంలో దిర్హమ్ పరిమాణంలో నీరు తాకని మచ్చ ఉండేది. అందుకు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అతనికి వుజూ మరియు నమాజు పునరావృతం చేయమని ఆజ్ఞాపించారు.»
6: వుజూ లోని సున్నతులు ఎన్ని? అవి ఏవి?
జవాబు: సునన్ అల్ వుజూ అంటే వీటిని పూర్తి చేస్తే ఇంకా ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి, ఒకవేళ పూర్తి చేయక పోతే ఎలాంటి దోషమూ లేదు మరియు అతని వుజూ చెల్లుతుంది.
1 - తస్మియహ్ - బిస్మిల్లాహ్ పదాలతో ప్రారంభించడం. హదీసు: «అల్లాహ్ పేరు పలకని వ్యక్తి యొక్క వుజూ లేదు.»
2 - అస్,సివాక్ (పంటిపుల్లతో పళ్ళు శుభ్రం చేసుకోవడం) హదీసు: ఒకవేళ నా సమాజం (ఉమ్మత్) పై కష్టతరం కానట్లైతే నేను వారికి ప్రతీసారి వుజూ చేసేటప్పుడు మిస్వాక్ చేయమని ఆదేశించేవాడిని.
3 - రెండు అరచేతులు శుభ్రం చేసుకోవడం.
4 - వ్రేళ్ళ మధ్య శుభ్రం చేసుకోవడం హదీసు: వజూ పరిపూర్ణంగా ఆచరించు, వ్రేళ్ళ మద్యలో చక్కగా రుద్ది శుబ్రపరుచు, ఉపవాస స్థితిని మినహాయించి ముక్కులోకి చక్కగా నీటిని ఎక్కించు’అని ఉపదేశించారు.
5 - వుజూలో కడగ వలసిన అవయవాలను రెండోసారి మరియు మూడోసారి కడగడం
6 - ప్రతిసారీ కుడివైపు నుండి ప్రారంభించడం హదీసు : విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా సెలవిచ్చారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."
7 - వుజూ పూర్తి చేసిన తరువాత అల్లాహ్ యొక్క ధ్యానం (అజ్కార్) చేయడం అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్'హదు అన్న ముహమ్మదన్ అబ్'దుహూ వరసూలుహూ. వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని,ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
8 - వుజూ చేసిన తరువాత రెండు రకాతులు నమాజ్ చేయడం. హదీసు: నేను చేసిన ఈ వుజూ మాదిరిగా వుజూ చేసి పిదప రెండు రకాతుల నమాజును, వీటి మధ్య ఎలాంటి ప్రాపంచిక ఆలోచన లేకుండా చదివిన వ్యక్తి యొక్క వెనుకటి పాపాలు క్షమించబడుతాయి.
ప్రశ్న 7: వుజూను భంగం చేసే విషయాలు ఏమిటి?
జవాబు: రెండు మర్మాంగాల నుండి బయటికి వచ్చేది ఏదైనా సరే అంటే మూత్రం, మలం, గాలి మొదలైనవి వుజును భంగం చేస్తుంది.
నిద్ర పోవడం లేదా పిచ్చి పట్టడం లేదా స్పృహ కోల్పోవడం హదీసు: రెండు కళ్ళు పిరుదులకు ముడి వంటివి, కాబట్టి నిద్రపోయిన వారు వుజూ చేయాలి.»
ఒంటె మాంసం భుజించడం. ఒక వ్యక్తి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఒంటె మాంసము తినటం వలన నేను వుజూ చేయాలా? అని అడిగాడు దానికి ఆయన అవును అని సమాధానమిచ్చారు.
మర్మాంగాలను ఎలాంటి ఆచ్ఛాదనం లేకుండా స్పర్శించడం హదీసు: తన మర్మాంగాన్ని ముట్టుకున్నవాడు వజూ చేసుకోవాలి”
8: తయమ్ముమ్ అంటే ఏమిటి?
జవాబు: తయమ్ముమ్ అంటే నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించలేనప్పుడు శుభ్రమైన ఇసుక, దుమ్ము, ధూళి లేదా మట్టి వంటి వాటిని ఉపయోగించి పరిశుభ్రం కావడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: (మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు.) [నిసా : 43]
9: తయమ్ముమ్ ఎలా చేయాలి?
జవాబు: రెండు అరచేతులను ఒక్కసారి దుమ్ము (మట్టి) పై కొట్టి, ముఖాన్ని, చేతుల వెనుక భాగాలను ఒక్కసారి మాత్రమే తుడుచుకోవాలి.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అమ్మార్ బిన్ యాసిర్ రజియల్లాహు అన్హుకు చెప్పిన మాట: "నీవు ఇలా చేస్తే సరిపోతుంది." అలా చెప్పి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులతో నేలపై కొట్టారు మరియు వాటిపై ఊదారు, ఆ తరువాత వాటితో తన ముఖం మరియు తన చేతులపై మసహ్ చేశారు.
10: తయమ్ముమ్ ను భంగం చేసే విషయాలేమిటి?
జవాబు: వుజూను భంగం చేసే విషయాలన్నీ తయమ్ముమ్ ను కూడా భంగం చేస్తాయి.
ఇంకా, నీరు అందుబాటులోకి రాగానే తయమ్ముమ్ తో చేసిన శుద్ధీకరణ ముగుస్తుంది.
11: ఖుఫ్ఫాన్ మరియు జౌరబాన్ అంటే ఏమిటి. వాటిపై మసహ్ చేయాలా?
జవాబు: అల్ ఖుఫ్ఫాన్: అంటే పాదాలకు తొడిగే చర్మపు మేజోళ్ళు.
జౌరబాన్: అంటే చర్మంతో తయారు చేసిన మేజోళ్ళు కాకుండా పాదాలకు తొడిగే ఇతర మేజోళ్ళు.
వుజూ చేస్తున్నప్పుడు, పాదాలను నీటితో కడగకుండా, వాటిపై మసహ్ చేయడం అంటే తడి చేతితో తుడవడం అనుమతించబడింది.
ముగైర బిన్ షుబ రజియల్లాహు అన్హు హదీసు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వజూ చేసి రెండు మేజోళ్లపై మసహ్ చేశారు.
- బుఖారీ మరియు ముస్లింలో ఇలా ఉంది: ఆయన వజూ చేసి మేజోళ్లపై మసహ్ చేశారు.
11 : ఖుఫ్ఫైన్ (మేజోళ్లపై) పై మసహ్ చేయడం వెనుకనున్న వివేకం ఏమిటి?
జవాబు: ఇది ప్రజలకు విషయాలను సులభతరం చేయడానికి మరియు ముఖ్యంగా శీతాకాలంలో ఎముకలు కొరికే అతి చల్లటి వాతావరణంలో మరియు ప్రయాణంలో సాక్సు తీయడం కష్టంగా ఉన్నప్పుడు వుజు చేయడంలోని కలిగే కష్టాలు, ఇబ్బందులు తగ్గించడానికి ఉద్దేశించబడింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: (అల్లాహ్ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్టదలచు కోలేదు.) [అల్ బఖర: 39]
13: తోలు సాక్సు పై మసహ్ చేయడం (తుడవడం) యొక్క చెల్లుబాటుకు సంబంధించిన షరతులు ఏమిటి?
జవాబు: 1 - తహారతు (ఆచార శుద్ధి) స్థితిలో ఉన్నప్పుడు అంటే వుజూ చేసిన తర్వాత తోలు సాక్సు ధరించడం.
ముగైరా ఇబ్నె షఅబహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట ప్రయాణంలో ఉన్నప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ధరించిన మేజోళ్లు విప్పదీయడానికి ప్రయత్నించగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : ‘వాటిని వదిలేయి. నేను పరిశుద్ధ స్థితిలో ఉండగా ధరించాను' అని పలికి వాటిపై కేవలం మసాహ్ చేశారు.
2 - తోలు సాక్సు తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉండాలి ఎందుకంటే అశుద్ధమైన వాటిపై మసహ్ చేయడం (తుడవడం) అనుమతించబడదు.
3 - తోలు సాక్సు తప్పనిసరిగా చీలమండలంతో సహా మొత్తం పాదాలను కప్పి ఉంచాలి.
4 - తోలు సాక్సు పై తుడవడం తప్పనిసరిగా పరిమిత వ్యవధి లోపలే ఉండాలి - స్థానికుని కొరకు ఆ పరిమిత వ్యవధి ఒక పగలు మరియు రాత్రి. అలాగే ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.
అలీ రజియల్లాహు అన్హు హదీసు: మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రయాణికుడి కొరకు మూడు రోజులు మరియు రాత్రులు మరియు ఒక రోజు మరియు రాత్రి స్థానికుని కొరకు మసహ్ చేసుకోవచ్చు అని బొదించారు.
14: ఖుఫ్ఫైన్ పై మసహ్ చేసే పద్ధతి ఏమిటి?
జవాబు: ఇది ఒకరి తడి వేళ్లను అతని కాలి వేళ్లపై ఉంచి అంటే తోలు సాక్సుపై ఉంచి, వాటిని పాదం పైభాగం (మోకాలి క్రింది భాగం) వరకు మసహ్ చేయాలి (తుడవాలి); అయితే కుడి చేతితో కుడి పాదంపై మరియు ఎడమ చేతితో ఎడమ పాదంపై మసహ్ చేయాలి (తుడవాలి). మసహ్ చేసే (తుడిచే) సమయంలో వేళ్లను వేరు వేరుగా ఉంచాలి మరియు పునరావృతం చేయకుండా ఒకసారి మాత్రమే చేయాలి.
15: మసహ్ ను (తోలు మోజోళ్ళపై తుడవడాన్ని) భంగం చేసే విషయాలు ఏవి?
జవాబు: 1 - మసహ్ (తోలు మేజోళ్ళపై తుడవడం) కోసం తెలుప బడిన నిర్దిష్ట వ్యవధి గడువు పూర్తి కావడం. ఎందుకంటే ఆ వ్యవధి ముగిసిన తర్వాత మరలా వాటిపై మసహ్ చేయడం (తోలు మేజోళ్ళపై తుడవడం) అనుమతించ బడలేదు: ఆ వ్యవధి - స్థానికుని కొరకు ఒక పగలు మరియు రాత్రి, మరియు ప్రయాణికుడి కొరకు మూడు రాత్రింబవళ్ళు.
2 - వుజూ స్థితిలో తొడిగిన తోలు మేజోళ్ళను వాటిలో ఒకదానిని లేదా రెండింటిని విడవడం.
ప్రశ్న16 : నమాజు ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు : అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు: మీలో ఎవరి ఇంటి ముందైనా ఒక సెలయేరు ఉండి, అందులో అతను ప్రతి రోజూ ఐదుసార్లు స్నానం చేస్తూ ఉంటే అతని ఒంటిపై మురికి, మాలిన్యాలు మిగిలి ఉంటాయా చెప్పండి?" అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. దానికి సహచరులు, “ఎలాంటి మురికి, మాలిన్యాలు మిగిలి ఉండవండీ?" అని సమాధానమిచ్చారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఐదుపూటల నమాజు సంగతి కూడా అంతే. అల్లాహ్ వాటి మూలంగా పాపాలను మన్నిస్తాడు”.
అద్దరను : మురికి
ప్రశ్న 17: నమాజు (సలాహ్) అంటే ఏమిటి?
జవాబు: సలాహ్ (నమాజు) అంటే నిర్దిష్ట పదాలు మరియు చర్యల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది తక్బీర్ (అంటే అరబీ భాషలో అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)) అనే పదాలతో మొదలై, తస్లీమ్ (సలాహ్ (నమాజు)ను ముగించే సలాం పదాలతో ముగుస్తుంది.
ప్రశ్న18: సలాహ్ (నమాజు) గురించి ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?
జవాబు: సలాహ్ (నమాజు) ప్రతి ముస్లింపై విధిగావించబడింది అంటే తప్పనిసరి చేయబడింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: నిస్సందేహంగా నమాజును నిర్ధారిత వేళల్లో చేయటం విశ్వాసులకు విధిగా చేయబడింది. [నిసా : 103]
ప్రశ్న19: నమాజును వదిలివేయటం యొక్క ఇస్లామీయ ధార్మిక ఆదేశం ఏమిటి?
జవాబు : నమాజును వదిలివేయటం అవిశ్వాసం అవుతుంది. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "మనకు వారికి మధ్య ఉన్న ప్రమాణము సలాహ్ (నమాజు). దాన్ని వదిలిన వాడు అవిశ్వాసమునకు ఒడిగట్టాడు".
ప్రశ్న20: రాత్రింబవళ్ళలో (అంటే 24 గంటలలో) ఒక ముస్లింపై ఎన్ని నమాజులు విధిగావించబడ్డాయి? ప్రతి నమాజ్ లోని రకాతుల సంఖ్య ఎంత?
జవాబు : రాత్రింబవళ్ళలో ఐదు పూటల నమాజు విధిగా చేయబడ్డాయి.
- ఫజర్ నమాజు: రెండు రకాతులు
- మరియు జుహర్ నమాజు: నాలుగు రకాతులు.
- మరియు అసర్ నమాజు: నాలుగు రకాతులు.
- మరియు మగ్రిబ్ నమాజు: మూడు రకాతులు.
- ఇషా నమాజు: నాలుగు రకాతులు.
ప్రశ్న 21: నమాజు యొక్క షరతులు ఏమిటి?
జవాబు : 1.ఇస్లాం ధర్మం. అవిశ్వాసుల నమాజు చెల్లదు. ఎందుకంటే షిర్క్ వలన ఆచరణ వ్యర్ధమయింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {"ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి} [జుమర్ : 67]
2 - అల్ అఖల్: మతిస్థిమితం లేని వారి నమాజ్ చెల్లదు.
3 - అత్ తమ్యీజ్: బుద్ధి, వివేకం లేని పిల్లల నమాజ్ చెల్లదు.
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {ముగ్గురి పై నుంచి కలం ఎత్తుకోబడింది:- నిద్రిస్తున్నవ్యక్తి మేల్కునెంతవరకు –పిల్లవాడు ప్రాజ్ఞవయస్సుకు చేరేవరకు–మతించినవాడు'బుద్దివచ్చేవరకు లేదా స్పృహలోకి వచ్చేవరకు.}
4 - అన్నియ్యహ్: సంకల్పం
హదీసులో ఇలా ఉన్నది : నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి సంకల్పాలపై ఆధారపడి ఉంటాయి ‘ప్రతీ వ్యక్తికి అతని సంకల్పానుసారంగా ప్రతిఫలము లభిస్తుంది.
5 - నమాజ్ యొక్క నిర్ణీత సమయం అవ్వటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.} [నిసా: 103]
6 - అల్ హదస్ (ఆచార అశుద్ధి) నుండి పరిశుభ్రము కావడం. హదీసు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “మీలో ఎవరైనా చిన్న హదస్ స్థితిలో (తప్పనిసరిగా వుజూ చేయవలసిన అశుద్ధ స్థితిలో) ఉన్నట్లయితే, వారు వుజూ చేయనంత వరకు అల్లాహ్ వారి సలాహ్ ను (నమాజును) స్వీకరించడు.”
7 - అల్ నజాసహ్ (పదార్థ అశుద్ధి) ను తొలగించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు నీ వస్త్రాలను పరిశుభ్రంగా ఉంచుకో!} [అల్ ముద్దస్సిర్: 4]
8 - ఔరహ్ ను (తప్పనిసరిగా కప్పుకోవలసిన శరీర భాగాలను) కప్పుకోవడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ఓ ఆదమ్ సంతానమా ప్రతి మస్జిదులో (నమాజ్ లో) మీ వస్త్రాలంకరణ పట్ల శ్రద్ధ వహించండి} [అల్ ఆరాఫ్: 31]
9 - ఖిబ్లాకి అభిముఖంగా నిలబడడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మరియు నీవు ఎక్కడికి బయలుదేరినా సరే! నీ ముఖాన్ని (నమాజ్ లో) మస్జిద్ అల్ హరామ్ వైపునకే త్రిప్పుకో. మరియు మీరెక్కడున్నా సరే, మీ ముఖాలను దాని వైపునకే త్రిప్పుకోండి.} [అల్ బఖర: 144]
ప్రశ్న 22: నమాజు యొక్క (రుకున్) మూలస్తంభాలు ఏమిటి?
జవాబు: మొత్తం పధ్నాలుగు (అర్'కానులు) మూలస్తంభాలు: అవి
వాటిలో మొదటిది: తప్పనిసరి ఫర్ద్ నమాజులో నిటారుగా నిలబడటం (ఆరోగ్యంగా ఉంటే). ఇమ్రాన్ బిన్ హుసైన్ (రజియల్లాహు అన్హు) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “నమాజు నిలబడి ఆచరించు, అలా చేయలేకపోతే కూర్చుని ఆచరించు, అలా కూడా చేయలేకపోతే ఒకవైపునకు తిరిగి పడుకుని ఆచరించు”.
"అల్లాహు అక్బర్" అనే పదాలతో తక్బీర్ అల్ ఇహ్రామ్ పలకడం. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు: నీవు నమాజు కొరకు నిలబడితే అల్లాహు అక్బర్ అని పలుకు
సూరతుల్ ఫాతిహా పఠించడం నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు: “ఫాతిహతిల్ కితాబ్” (అంటే సూరహ్ అల్ ఫాతిహా) పఠించని వాని నమాజు కాదు” (అనగా చెల్లదు, స్వీకారయోగ్యము కాదు).
రుకూ చేయడం అంటే తన తల మరియు వీపు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా తన వీపును ముందుకు వంచడం.
రుకూ నుండి లేవడం
నిటారుగా నిలబడటం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి: "తరువాత రుకూకు వెళ్లి రుకూలో నిశ్చలంగా నిలబడుము, ఆపై పైకి లేవి పూర్తిగా నిలువుగా నిలచుము."
సుజూద్ (సాష్టాంగం): నుదురు, ముక్కు, రెండు అరచేతులు (చెవులకు దగ్గరలో), రెండు మోకాళ్ళు, రెండు పాదాల బొటన వ్రేళ్ళు నేలపై ఆన్చి, సాష్టాంగం చేయడం.
సజ్దా నుండి పైకి లేవడం
రెండు సజ్దాల మధ్య కొంచెం సేపు కూర్చోవడం నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలు: "తరువాత సజ్దహ్ చేయి మరియు సజ్దహ్ లో నిశ్చలంగా ఉండి, ఆపై పైకి లేచి ప్రశాంతంగా కూర్చో.
ఇక్కడ కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, కాలి వేళ్లను ఖిబ్లా దిశలో ఉంచుతూ, ఎడమ పాదం మీద కూర్చోవడం సున్నతు చర్య. హదీసు: విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా సెలవిచ్చారు : "ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ కాలు పరచుకొని, తన కుడి కాలు నిలువుగా ఉంచేవారు."
ప్రశాంతత: నమాజు లోని ప్రతి భంగిమను, చర్యను ప్రశాంతంగా, మనస్సు లగ్నం చేసి మరీ ఆచరించవలెను.
చివరి తషహ్హుద్ పఠించడం. అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: మేము నమాజులో తషహ్హుద్ విధిగావించబడక ముందు ఇలా పలికేవారము:
తషహ్హుద్ పఠించడం కొరకు కూర్చోవడం.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ ముందుగా కుడివైపు తల త్రిప్పాలి, ఆ తరువాత ఎడమ వైపు తల త్రిప్పాలి. హదీసు: ఆయన కుడి ఎడమల వైపు అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ అని సలాం తిరిగేవారు.
పైన పేర్కొనబడిన చర్యలను ఇదే వరుస క్రమంలో ఆచరించడం. అంటే ఒకవేళ ఎవరైనా కావాలని రుకూ చేయకుండా ముందు సజ్దా చేసి, ఆ తరువాత రుకూ చేసినట్లయితే, అతని నమాజు చెల్లదు. ఒకవేళ మరచిపోవటం వలన అలా జరిగితే, అతను లేచి నిలుచొని ముందుగా రుకూ చేసి, తరువాత సజ్దా చేయవలెను.
ప్రశ్న23: నమాజులో(వాజిబాతులు) విధులు ఏమిటి?
జవాబు: నమాజులో విధులు (వాజిబాతులు) తొమ్మిది. అవి,
1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ కాకుండా మిగిలిన తక్బీర్లు
2 - ఇమామ్ మరియు ఒంటరిగా నమాజు చేస్తున్న వారు "సమిఅ అల్లాహు లిమన్ హమిదహ్ (తనను ఎవరైనా స్తుతిస్తే, అల్లాహ్ దానిని ఆలకిస్తాడు)" అని పలకడం.
3 - "రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి)" అని పలకడం.
4 - రుకూలో "సుబహాన రబ్బియల్ అజీమ్" అని మూడు సార్లు పలకడం.
5 - సజ్దాలో "సుబహాన రబ్బియల్ అఆలా" అని మూడుసార్లు పలకడం.
6 - రెండు సజ్దాల మధ్య విరామంలో (జల్సా భంగిమలో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు), రబ్బిగ్ఫిర్లీ అని పలకడం.
7 - తషహ్హుద్ మొదటి భాగం పఠించడం.
8 - తషహ్హుద్ మొదటి భాగాన్ని పఠించడం కొరకు కూర్చోవడం.
ప్రశ్న24 : నమాజులో సున్నతులు ఏమిటి?
జవాబు: నమాజు సున్నతులు ఈ క్రింది విధంగా పదకొండు కలవు:
1 - దుఆ అల్ ఇస్తిఫ్తాహ్ అంటే తక్బీర్ అల్ ఇహ్రామ్ తరువాత "సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, వ తబారకస్ముక, వ తఅఆలా జద్దుక, వలా ఇలాహ గైరుక" అని పలకడం.
2 - తఅ'వ్వుజ్ అంటే అఊజు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ అని పలకడం.
3 - బస్మలహ్ అంటే బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ అని పలకడం.
4 - ఆమీన్ అని పలకడం.
5 - సూరతుల్ ఫాతిహా తరువాత వేరే ఏదైనా సూరహ్ గానీ, ఏదైనా సూరహ్ లోని కొన్ని ఆయతులు గానీ పఠించడం.
6 - బిగ్గరగా ఖుర్ఆన్ పారాయణం చేసే నమాజులలో వెనుక ఉన్న వారికి చక్కగా వినిపించేలా ఇమామ్ తన కంఠస్వరాన్ని పెంచి, ఖుర్ఆన్ వచనాలు పఠించడం.
7 - తహ్మీద్ పలకడం (అల్లాహ్ ను స్తుతించడం) - "మిలస్సమావాతి వ మినల్ అర్ద్, వ మినల్ మా షి'త మిన్ షైఇన్ బఆద్" అనే పలుకులు ఇమాం నుండి విన్న తరువాత అల్హందులిల్లాహ్ అంటూ అల్లాహ్ ను స్తుతించడం.
8 - తస్బీహ్ - రుకూలో ఎక్కువసార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ అనే పలుకులను ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
9 - సజ్దాలో ఒకటి కంటే ఎక్కువ సార్లు తస్బీహ్ చదవటం.
10 - రబ్బిగ్'ఫిర్లీ అనే పదాలను రెండు సజ్దాల మధ్య ప్రశాంతంగా కొంచెంసేపు కూర్చున్నప్పుడు ఒకటి కంటే ఎక్కువ సార్లు చదవడం.
11. చివరి తషహ్హు ద్ లో ప్రవక్త ﷺ మరియు ఆయన కుటుంబం మీద దరూద్,సలాం, శుభాలను పలుకడం, మరియు తరువాత దుఆ చేయడం.
సున్నత్ కార్యాలు, మరియు వాటిని హైయ్'ఆత్ (రూపాలు,ఆకృతులు) అని పిలుస్తారు :
1 - తక్బీర్ అల్ ఇహ్రామ్ పలుకులతో రెండు అరచేతులను ఖిబ్లా దిశలో చెవుల క్రింది భాగం వరకు పైక లేపడం.
2 - రుకూలోకి వెళ్ళే ముందు రఫ్ ఉల్ యదైన్ చేయడం
3 - రుకూ నుండి పైకి లేచిన తరువాత రఫ్ ఉల్ యదైన్ చేయడం.
4 - రఫ్ ఉల్ యదైన్ తరువాత రెండు చేతులను క్రిందికి దించడం.
5 - ఎడమ చేతిపై కుడి చేతిని కట్టడం.
6 - సజ్దా చేసే స్థానంపై మీ కంటిచూపును ఉంచడం.
7 - నిటారుగా నిలబడినప్పుడు రెండు కాళ్ళను సముచితమైన దూరంలో ఉంచడం.
8 - రుకులో రెండు అరచేతులతో మరియు చేతివ్రేళ్ళతో రెండు మోకాళ్లను గట్టిగా పట్టుకోవడం, ఒకరి వీపును నేలకు సమాంతరంగా, తిన్నగా ఉంచుతూ, తల మరియు వీపు సమంగా ఉండేలా ముందుకు వంగడం.
9 - సజ్దా అవయవాలను నేలపై ప్రశాంతంగా ఆన్చడం, అవన్నీ నేలను తాకేలా చూసుకోవడం.
10 - సజ్దాలో రెండు మోజేతులను పక్కల నుండి దూరంగా ఉంచడం, పొత్తికడుపు తొడల నుండి మరియు తొడలను కాళ్ళ నుండి దూరంగా ఉంచడం; మోకాళ్లను వేరుగా ఉంచడం మరియు పాదాల కాలి వేళ్లు వేరు చేయడం మరియు వేళ్ళ మొన భాగాన్ని నేలకు ఆన్చడం; అరచేతులు నేలపై ఆన్చుతూ, వాటి వేళ్ళు కలిపి ఉంచి, మోజేతులను భుజాలకు సమాంతరంగా ఉంచడం.
11 - రెండు సజ్దాల మధ్య మరియు మొదటి తషహ్హుద్ సమయంలో కూర్చున్నప్పుడు ఇఫ్తీరాష్ (ఎడమ పాదాన్ని దాని వైపే ఉంచి, దానిపై కూర్చోవడం; మరియు కుడి పాదాన్ని ఖిబ్లా వైపు కాలి వేళ్ల మొనలు ఉండేలా చేయడం) చేయడం. అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో తవర్రుక్ (ఎడమ వెనుక భాగాన్ని (పిరుదులను) నేలపై పర్చి, దానిపై కూర్చోవడం; కుడి పాదం కాలి వేళ్ల ఖిబ్లా వైపు ఉంచి, పాదాన్ని నిటారుగా ఉండేలా చేయడం; మరియు ఎడమ పాదాన్ని కుడి పాదం కింద ఉండేలా చేయడం) చేయడం.
12 - రెండు సజ్దాల మధ్య మరియు తషహ్హుద్ సమయంలో చేతి వ్రేళ్ళను దగ్గరగా ఉంచి, రెండు అరచేతులను రెండు తొడల మీద పెట్టడం; అయితే, రెండవ తషహ్హుద్ సమయంలో, తన కుడి చేతి యొక్క చిన్న మరియు ఉంగరపు వేళ్లను (చివరి రెండు వేళ్ళను) బిగించి, బొటనవేలు మరియు మధ్య వేళ్లతో ఉంగరాన్ని తయారు చేయవచ్చు మరియు అల్లాహ్ నామం ప్రస్తావిస్తున్నప్పుడు చూపుడు వేలును పైకి లేపి చూపవలెను.
13 - తస్లీమ్ చేస్తున్నప్పుడు ముందుగా ముఖాన్ని కుడివైపుకు త్రిప్పాలి, ఆ తరువాత ఎడమవైపునకు.
ప్రశ్న25: నమాజును భంగపరచే విషయాలు ఏమిటి?
జవాబు: (1) నమాజు యొక్క రుకున్లు లేదా షరతులలో నుండి దేనినైనా విడిచిపెట్టడం.
(2) కావాలని నమాజులో మాట్లాడటం.
(3) నమాజులో తినడం లేదా త్రాగటం.
(4) నమాజులో అనవసరంగా, అధికంగా చేసే శరీర కదలికలు.
5. కావాలని నమాజులో ఏదైనా వాజిబు చర్యను వదిలి వేయడం.
26: ఒక ముస్లిం నమాజు ఎలా చేయవలెను?
జవాబు: నమాజు చేసే పద్ధతి
1 - ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
2 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ నమాజు చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
3 - భుజాల ఎత్తులో ఖిబ్లాకు అభిముఖంగా అరచేతులు ఉండేలా రెండు చేతులు పైకి ఎత్తి, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ తక్బీర్ అల్ ఇహ్రామ్ పూర్తి చేయాలి.
4 - ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
లేదా ఇలా పలకండి: (సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక.)
6 - అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోండి. అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను)
7 - ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించవలెను. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1) అల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్ (స్తుతులన్ని సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి).(2) అర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడు) (3) మాలికి యౌమిద్దీన్ (తీర్పుదినానికి యజమాని).(4) ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తయీన్ ( మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము).(5) ఇహ్'ది నశ్శిరాతల్ ముస్తఖీమ్ (మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి).(6) శిరాతల్లదీన్ అన్అమ్త అలైహిమ్ గైరిల్ మగ్దూబి అలైహిమ్ వలద్దాల్లీన్ (నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు).(7) [అల్ ఫాతిహ : 1-7]
ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను. :
8 - తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ నమాజులో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయవలెను.
9 - ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.
10 - రుకూలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ (లోపాలూ, కొరతలకు అతీతుడైన నా ప్రభువుకే సకల కీర్తనలు), ఇంకా ఇలా కూడా పలికితే మంచిది: సుబహానక అల్లాహుమ్మ వ బి హమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్లీ ((ఓ అల్లాహ్! నీవు ఎలాంటి లోపాలకూ, కొరతలకూ అతీతుడవు. ఓ అల్లాహ్, నన్ను క్షమించు)
11 - ఆ తరువాత రుకూ నుండి తన తల పైకెత్తుతూ, మరలా రెండు చేతులు భుజాల వరకు పైకెత్తి సమి అల్లాహు లిమన్ హమిదహ్ (అల్లాహ్ తనను స్తుతించే వారిని వింటాడు) అని పలక వలెను. ఇమామును అనుసరిస్తూ, ఆయన వెనుక నమాజ్ చేస్తున్నవారు, బదులుగా ఇలా పలక వలెను రబ్బనా వలకల్ హమ్ద్ (ఓ మా ప్రభూ! సకల స్తోత్రములు నీకే శోభిస్తాయి).
12 - అలా పైకి లేచి, నిటారుగా నిలబడిన తరువాత రబ్బనా వలకల్ హమ్'ద్ మిల్అ స్సమావాతి వ మిల్ అల్ అర్'ది, వ మా బైనహుమా వ మిల్అ మా షిఅత మిన్ షైయిన్ బఆదు. అహ్లలథ్థనాయి వల్ మజ్ది అహఖ్'ఖు మా ఖాలల్ అబ్'దు వ కుల్లునా లక అబ్దున్. అల్లాహుమ్మ లా మానిఅ లిమా ఆతైత వలా మూతియ లిమా మనఆత వలా యన్'ఫవు దల్ జద్ది మిన్కల్ జద్దు (ఆకాశాల నిండుగా, భూమి నిండుగా మరియు వాటి మధ్య నున్న వాటి నిండుగా, ఆ తరువాత నీవు తలచిన వాటన్నింటి నిండుగా (ప్రశంసలన్నీ నీకే శోభిస్తాయి). సమస్త ప్రశంసలు మరియు ఘనతలు గలవాడవు. దాసుడు సెలవిచ్చిన మాట అత్యంత సత్యమైనది. మేమంతా నీకు దాస్యం చేయువారము. ఓ అల్లాహ్! నీవు ఇవ్వదలిస్తే అడ్డగించే వాడెవ్వడూ లేడు. మరియు నీవు ఇవ్వదలచక పోతే దాన్ని ప్రసాదించే వాడెవ్వడూ లేడు. ఏ గొప్పవాని గొప్పతనమూ నీ వద్ద చెల్లదు. అతనికి అది ఎలాంటి లాభాన్నీ చేకూర్చదు) అని పలుక వలెను.
13 - "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలుకుతూ, మొదటి సజ్దాలోకి వెళ్ళ వలెను. శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.
14 - సజ్దాలో మూడు సార్లు సుబహాన రబ్బియల్ ఆలా (సర్వోన్నతుడైన నా ప్రభువు అపర పరిశుద్ధుడు) పలక వలెను. ఇంకా ఇలా పలికితే మంచిది - సుబహానక అల్లాహుమ్మ, రబ్బనా వ బిహమ్'దిక అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడవు, ఓ మా ప్రభూ! నేను నిన్నుస్తుతిస్తున్నాను. (కనుక) ఓ అల్లాహ్ నన్ను క్షమించు)
15 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్త వలెను.
16 - ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి;తన రెండు చేతులను తన తొడలు,తన మోకాళ్ళపై పెట్టవలెను.
17 - రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను. రబ్బిగ్'ఫిర్లీ వర్'హమ్'నీ, వహ్'దినీ, వరజుఖ్'నీ, వజ్'బుర్'నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు సన్మార్గం వైపు మార్గదర్శకం చేయి, నాకు ఉపాధి ప్రసాదించు, నా నష్టాన్ని పూడ్చు, నాకు ఉన్నత స్థానాన్ని ప్రసాదంచు.)
18 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయవలెను.
19 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేచి నిలబడ వలెను (ఇక్కడితో మొదటి రకాతు పూర్తయింది), మొదటి రకాతులో పలికినట్లుగా, ఆచరించినట్లుగానే చేస్తూ రెండవ రకాతు పూర్తి చేయ వలెను.
20 - రెండవ రకాతులోని రెండవ సజ్దా చేసిన తరువాత రెండవ సజ్దా నుండి అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే లేచి కూర్చో వలెను.
21 - అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను,
22 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
23 - ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల నమాజు చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ లో అష్ హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు వద్ద ఆపి వేయవలెను.
24 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ, రెండు చేతులు మరలా ఖిబ్లా వైపు భుజాల వరకు ఎత్తి, మూడవ రకాతు కొరకు లేచి నిలబడ వలెను.
25 - ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.
26 - మొదటి తషహ్హుద్ లో కూర్చున్నట్లుగానే ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి లేదా కుడికాలి క్రింద ఎడమ కాలు వాలుగా తీసుకు వచ్చి, ఎడమ పిరుదుపై కూర్చుని; కుడి చేతిని తొడ అంచున, మోకాలికి కొంచెం పైన ఉంచి; చిన్న మరియు ఉంగరపు వేళ్లను బిగించి, చూపుడు వేలును పైకెత్తి, దుఆ చేసేటప్పుడు దానిని కదిలిస్తూ. ; వృత్తాకారంగా చేయడానికి మధ్య వేలు యొక్క కొనతో బొటనవేలు యొక్క కొనను కలపి; ఎడమ చేతిని, వేళ్లు విస్తరించి, తొడ అంచున, మోకాలి పైన ఉంచి ప్రశంతంగా కూర్చోవలెను. (గమనిక: ఒకవేళ నాలుగు రకాతుల సలాహ్ చేస్తున్నట్లయితే, మూడవ రకాతులో కూర్చోకుండా, లేచి నిలబడి రెండవ రకాతు పూర్తి చేసినట్లుగానే నాలగవ రకాతు పూర్తి చేసి, రెండవ సజ్దా తరువాత కూర్చుని తషహ్హుద్ లోని రెండవ భాగాన్ని పఠించి, సలాము పలుకుతూ నమాజును పూర్తి చేయవలెను.)
27 - అలా ప్రశాంతంగా కూర్చుని, తషహ్హుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.
28 - ఆ తరువాత అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ అని పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను. ఆ తరువాత అలాగే పలుకుతూ ఎడమవైపు కూడా తల త్రిప్పవలెను.
26: సలాము పలుకుతూ నమాజును ముగించిన తరువాత ఏ అజ్కార్ (అల్లాహ్ యొక్క ధ్యాన వచనాలు) పఠించాలి ?
జవాబు: మూడు సార్లు అస్'తగ్'ఫిరుల్లాహ్ (ఓ అల్లాహ్ నన్ను క్షమించు) అని పలకాలి.
అల్లాహుమ్మ అంత'స్సలాము, వ మిన్'కస్సలాము. తబారక్'త యా జల్'జలాలి వల్'ఇక్రామ్ (ఓ అల్లాహ్ నీవు శాంతి ప్రధాతవు, నీ వద్ద నుండే శాంతి ప్రాప్తిస్తుంది. ఓ వైభవోపేత, గౌరవోన్నతుడా సకల శుభాలు కలవాడవు నీవే).
సుబహానుల్లాహ్ అని ముప్పై మూడు సార్లు పఠించాలి.
అల్హమ్దులిల్లాహ్ అని ముప్పై మూడు సార్లు పఠించాలి.
అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు పఠించాలి.
చివరిగా దీనిని ముగిస్తూ, ఇలా పలుక వలెను: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీకలహు లుహుల్ ముల్'కు వ లహుల్ హమ్'దు వహుల అలా కుల్లి షైయిన్ ఖదీర్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒక్కడే. ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సర్వస్తోత్రాలన్ని ఆయనకే చెందుతాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు).
ఆ తరువాత ఫజ్ర్ మరియు మగ్రిబ్ నమాజులలో సూరతుల్ ఇఖ్లాస్ (112వ సూరహ్) మూడు సార్లు, సూరతుల్ ఫలఖ్ మూడు సార్లు (113వ సూరహ్) మరియు సూరతున్నాస్ మూడు సార్లు (114వ సూరహ్) పఠించ వలెను. మిగతా నమాజులలో ఒక్కొక్కసారి పఠించవలెను.
ఆ తరువాత ఒకసారి ఆయతుల్ కుర్సీ (2:255) పఠించ వలెను.
ప్రశ్న28:సునన్ అర్రవాతిబ్ అంటే ఏమిటి? వాటి ఘనత ఏమిటి?
జవాబు: ఫజ్ర్ నమాజు కంటే ముందు రెండు రకాతులు
జుహర్ నమాజుకు ముందు నాలుగు రకాతులు (రెండు రెండు రకాతుల చొప్పున)
జుహర్ నమాజ్ తరువాత రెండు రకాతులు
మగ్రిబ్ నమాజ్ తరువాత రెండు రకాతులు
ఇషా నమాజ్ తరువాత రెండు రకాతులు
వాటి ఘనత : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే రాత్రింబవళ్ళలో పన్నెండు రకాతులు నమాజ్ చేస్తారో, వారి కోసం అల్లాహ్ స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు.
ప్రశ్న29: వారం రోజులలో ఏరోజు ఉత్తమమైనది?
జవాబు: వారం రోజులలో శుక్రవారం రోజు ఉత్తమమైనది. నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీ దినాలలో అత్యంత శ్రేష్ఠమైన దినం శుక్రవారం; ఆ దినముననే ఆదమ్ సృష్టించబడ్డాడు, ఆ దినముననే అతను మరణించాడు, ఆ దినముననే చివరి (ప్రళయ) శంఖం ఊదబడుతుంది, ఆ దినముననే (ప్రళయ) ఆర్తనాదాలు వినబడతాయి. కాబట్టి ఆ దినము నాపై మరింత ఎక్కువగా దరూద్ పంపండి, ఎందుకంటే మీ దరూద్ లు నాకు సమర్పించబడతాయి. దానికి ప్రజలు ఇలా అడిగారు: ఓ రసూలుల్లాహ్, మీ భౌతిక శరీరం కుళ్ళిపోయిన తరువాత కూడా మా దరూద్ లు మీకు ఎలా చేరతాయి? అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారు: నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ప్రవక్తల శరీరాలు కుళ్ళకుండా భూమిని నిషేధించాడు.
ప్రశ్న30: జుముఅహ్ నమాజు గురించి ఇస్లాం యొక్క ధార్మిక ఆదేశం ఏమిటి?
జవాబు: ఇది యుక్తవయస్సుకు చేరిన, మతిస్థిమితం కలిగిఉన్న, స్థిరంగా ఒకచోట నివాసం ఉంటున్న ప్రతి ముస్లిం పురుషుడిపై తప్పనిసరి వ్యక్తిగత విధి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వాసులారా! శుక్రవారం (జుముఅహ్) రోజు నమాజ్ కొరకు పిలుపు ఇవ్వబడినప్పుడు, మీరు మీ వ్యాపారాలను విడిచి అల్లాహ్ స్మరణ వైపునకు పరుగెత్తండి. మీరు తెలుసుకోగలిగితే అది మీకు ఎంతో ఉత్తమమమైనది.} [జుమ్అహ్ : 9]
ప్రశ్న31 : జుముఅహ్ నమాజులోని రకాతులు ఎన్ని?
జవాబు: జుముఆహ్ నమాజులోని రకాతుల సంఖ్య రెండు. ఇమాం రెండు జుమఅహ్ ఖుత్బా ప్రసంగాల తరువాత, బిగ్గరగా ఖుర్ఆన్ ఆయతులు పఠిస్తూ, రెండు రకాతుల జుమఅహ్ నమాజు చేయిస్తారు.
ప్రశ్న32: జుముఅహ్ నమాజుకు హాజరు కాకుండా ఉండటం సమ్మతమా?
జవాబు: సరైన షరయీ కారణం లేకుండా జుముఅహ్ సలాహ్ కు (నమాజుకు) హాజరుకాకుండా ఉండేందుకు అనుమతి లేదు. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, ఎవరైనా నిర్లక్ష్యంతో వరుసగా మూడు జుముఅహ్ నమాజులు గైరుహాజరు అయితే, అల్లాహ్ అతని హృదయంపై ముద్ర వేస్తాడు.
ప్రశ్న33: జుముఅహ్ దినమున పాటించ వలసిన సున్నతులు ఏవి?
జవాబు :1.గుసుల్ చేయటం. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “యుక్తవయస్కుడైన ప్రతి ముస్లిం పురుషునిపై శుక్రవారం నాడు గుసుల్ చేయుట (తల స్నానం చేయుట) విధి.
2 - సుగంద ద్రవాలు పూసుకోవడం. హదీసు : ముస్లింలపై శుక్రవారం రోజు స్నానం చేయడం హక్కుగా ఉంది. వారిలో ప్రతి ఒకరు తన కుటుంబం నుండి సుగంధ ద్రవ్యాన్ని పూసుకోవాలి."
3 - మంచి దుస్తులు ధరించడం. హదీసు: "మీలో ఎవరికైనా స్థోమత ఉంటే, జుముఅహ్ రోజు కోసం వారి రోజు వారీ పనికోసం ఉపయోగించే దుస్తులను తప్పించి రెండు ప్రత్యేక వస్త్రాలను ఏర్పాటు చేసుకోవటం మంచిది."
4 - ముందుగానే మస్జిదుకు వెళ్ళడం.
7 - మస్జిదుకు కాలినడకన వెళ్ళడం. హదీసు : "జుమా రోజు స్నానం చేసినవాడు, శుభ్రపరిచినవాడు, తొందరగా వెళ్లినవాడు, మొదటగా చేరుకున్నవాడు, సమీపంగా కూర్చున్నవాడు, నిశ్శబ్దంగా ఉన్నవాడు, శ్రద్ధగా విన్నవాడు, అతనికి ప్రతి అడుగుకు ఏడాది రోజుల ఉపవాసం మరియు ఎడాది రాత్రుల ప్రార్థనల పుణ్యం లభిస్తుంది."
6. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ అధికంగా పఠించడం. ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: "జుముఅహ్ రోజున నా మీద అధికంగా దురూద్ పంపండి, ఎందుకంటే ఆ రోజు హాజరు చేయబడును.అందులో దైవదూతలు హాజరు అవుతారు. ఎవ్వరైనా నా మీద దురూద్ పంపినప్పుడు, అది పూర్తయ్యే వరకు ఆ దురూద్ నా వద్ద ప్రదర్శించబడుతుంది."
6 - సూరతుల్ కహఫ్ పారాయణం హదీసు : "జుముఅహ్ రోజున ఎవరు సూరతుల్-కహఫ్ చదివితే, రెండు జుమా రోజుల మధ్య వారికి ఒక కాంతి వెలుగుతుంది."
8 - దుఆలు ఎక్కువగా ఆమోదించబడే అవకాశం ఉన్న ఘడియను అన్వేషించడం (ఆ ఘడియ దుఆలలో గడపడం). "అబూ హురైరా రజియల్లాహు అన్హు నుండి,దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుమా రోజు గురించి పేర్కొంటూ ఇలా అన్నారు: ఆ రోజులో ఒక ఘడియ ఉంది. ఏ ముస్లిం దాసుడయినా ఆ ఘడియను పొంది, ఆ సమయంలో అతను నిలబడి నమాజు చేస్తూ అల్లాహ్ ని ఏదయినా అడిగితే అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు.
ప్రశ్న 34: సామూహికంగా చేసే నమాజు యొక్క ఘనత ఏమిటి?
జవాబు: అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "ఒంటరిగా చేసే నమాజ్ కంటే జమఆతుతో పాటు చేసే నమాజ్ ఇరవై ఏడు 27 రెట్లు విలువైనది"
ప్రశ్న35: నమాజులో ఖుషూ అంటే ఏమిటి?
జవాబు: మనస్సును, శరీరాన్ని స్థిమితంగా, ప్రశాంతంగా హాజరు పరచి, పూర్తి ఏకాగ్రతతో, అణుకువ, వినమ్రతతో, విధేయతతో (బయటి ప్రపంచాన్ని మరచి) నమాజులో లీనమై పోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {వాస్తవానికి విశ్వాసులు సాఫల్యం పొందుతారు;1 వారే! ఎవరైతే తమ సలాహ్ లో ఖుషు (వినమ్రత) పాటిస్తారో!2} [అల్ ముమినూన్ :1 - 2]
ప్రశ్న36 : జకాత్ అంటే ఏమిటి?
జవాబు: ఇది ఒక నిర్దిష్ట రకమైన ఆస్తిపై, ఒక నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వ్యక్తులకు ఇవ్వబడే ఆర్థిక హక్కు.
ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి మరియు తప్పనిసరిగా ధనవంతుల నుండి తీసుకోబడి, పేదలకు అందించబడే విధి దానం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు మీరు జకాత్ చెల్లించండి}. [అల్ బఖర: 43]
ప్రశ్న 37: ప్రామాణికమైన (ఇష్టమైన) దానం ఏమిటి?
జవాబు: సదఖతుల్ ముస్తహబ్ అంటే జకాతు కాకుండా ఇతర అన్ని రకాల దానధర్మాలు వస్తాయి. ఉదాహరణకు ఏ సమయంలోనైనా ఏ మంచి పనికైనా ఉపయోగపడేలా ఏదైనా దానం చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : అల్లాహ్ మార్గంలో ఖర్చు (దానధర్మాలు) చేయండి. [అల్ బఖర: 195]
ప్రశ్న 38: ఉపవాసం యొక్క నిర్వచనం ఏమిటి?
జవాబు: ఉపవాసం పాటించాలనే సంకల్పంతో, తెల్లవారుజాము నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని నిర్వీర్యం చేసే వాటన్నింటి నుండి దూరంగా ఉండటం ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది రెండు రకాలు:
1. సియాము వాజిబ్ అంటే విధిగావించబడిన తప్పనిసరి ఉపవాసాలు: ఇస్లాం యొక్క మూలస్థంభాలలో ఒకటైన రమజాన్ నెల ఉపవాసాల వంటివి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! ఉపవాసం మీకు విధిగా నిర్ణయించబడింది, ఏ విధంగానైతే మీ పూర్వికులకు విధిగా నిర్ణయించబడి ఉండెనో బహుశా మీరు దైవభీతిపరులై ఉంటారని!} [బఖర: 183]
2. స్వచ్ఛంద ఉపవాసం: సోమవారం మరియు గురువారాల్లో ఉపవాసం; ప్రతి నెలా మూడు రోజుల ఉపవాసం, వీటిలో ఉత్తమమైనవి ప్రతి చంద్రమాన నెలలో తెల్లటి దినాల ఉపవాసాలు (13, 14, 15) మొదలైన తప్పనిసరి విధిగావించ బడని ఉపవాసాలు.
ప్రశ్న39: రమజాన్ నెల ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ పై విశ్వాసముతో మరియు పుణ్యప్రాప్తిని ఆశిస్తూ రమజాన్ ఉపవాసాలను నిష్టగా పాటించేవారి వెనుకటి పాపాలన్నీ మన్నించ బడతాయి.
ప్రశ్న40 : రమజాన్ కాకుండా ఇతర మాసములలో ఉండే నఫిల్ ఉపవాసాల ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు: అబూ సయీద్ అల్ ఖుద్'రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఏ దాసుడైతే అల్లాహ్ మార్గంలో ఒక దినము ఉపవాసం ఉంటాడో, అల్లాహ్ ఆ దినము ఉపవాసానికి బదులుగా అతని ముఖాన్ని నరకాగ్ని నుండి డెబ్బై శరదృతువులంత (సంవత్సరాలంత) దూరంగా ఉంచుతాడు.
డెబ్బై శరదృతువులు అంటే డెబ్బై సంవత్సరాలు అని అర్థం
ప్రశ్న41 : ఉపవాసమును భంగపరిచే విషయాలు ఏమిటి?
జవాబు: 1 - ఉద్దేశపూర్వకంగా తినడం మరియు త్రాగడం
2 - కావాలని వాంతి చేసుకోవడం
ప్రశ్న41: ఉపవాసంలోని సున్నతులు ఏమిటి?
జవాబు: 1 - సమయం కాగానే ఉపవాసాన్ని విరమించడంలో త్వరపడటం.
2 - తెల్లవారుజామున ఉపవాసం ప్రారంభించ వలసిన సమయం వరకు ముందు వరకు ఆగి, అప్పుడు సహరీ భోజనం చేయడం.
3 - మంచిపనులు మరియు అల్లాహ్ ఆరాధనలు అధికంగా చేయడం
4 - ఒకవేళ ఎవరైనా మీతో జగడం మొదలు పెడితే, వారితో "నేను ఉపవాసం పాటిస్తున్నాను" అని పలికి అతనితో తగవులాట నుండి దూరంగా ఉండటం
5 - ఉపవాసం విరమించే సమయంలో (ఇఫ్తార్ సమయంలో) దుఆ చేయడం
6 - అప్పుడే కోసిన ఖర్జూరపు పండ్లతో లేదా మామూలు ఖర్జూరపు పండ్లతో ఉపవాసాన్ని విరమించడం. ఒకవేళ అవి అందుబాటులో లేకపోతే, మంచినీళ్ళతో ఉపవాసాన్ని విరమించడం.
ప్రశ్న 43: హజ్ అంటే ఏమిటి?
జవాబు: హజ్ అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను“నిర్ణీత సమయంలో నిర్దిష్ట ఆచారాలు పాటిస్తూ మక్కా నగరంలోని ఆయన పవిత్ర గృహాన్ని సందర్శించడం” ద్వారా ఆరాధించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు అల్లాహ్ కొరకుప్రజలపై దైవగృహ సందర్శన హజ్జ్ స్తోమత కలిగి ఉన్నవారు చేయవసల్సి ఉంది;మరియు ఎవరైతే తిరస్కరించాడో నిశ్చయంగా అల్లాహ్ సర్వలోకాల కంటే చాలా సుసంపన్నుడు'} [ఆలె ఇమ్రాన్: 97]
ప్రశ్న 44: హజ్ యొక్క మూలస్థంభాలు ఏమిటి?
జవాబు: 1 - ఇహ్రామ్.
2 - అరఫాతు మైదానంలో బస చేయటం.
3 - తవాఫ్ అల్ ఇఫాదహ్ (కాబా గృహ ప్రదక్షిణ చేయడం)
4 - సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయడం
ప్రశ్న 45: హజ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు: అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా విన్నానని తెలిపారు:- ఎవరైతే అశ్లీల పనులకు మరియు పాపకార్యాలకు దూరంగా ఉంటూ హజ్జ్ యాత్రను పూర్తి చేస్తారో అతను తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా (పాప రహితునిగా) మరలుతాడు.
క యౌమ వలదత్ హు ఉమ్ముహు (తన తల్లి ప్రసవించిన రోజు మాదిరిగా) అంటే పాపరహితుడిగా, పవిత్రంగా అని అర్థం.
ప్రశ్న 46: ఉమ్రా అంటే ఏమిటి?
జవాబు: ‘ఉమ్రహ్ (చిన్న యాత్ర) అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను “ఏ సమయంలోనైనా నిర్ణీత ఆచారాలు నిర్వహించడానికి మక్కాలోని ఆయన పవిత్ర కాబాగృహాన్ని సందర్శించడం ద్వారా” ఆరాధించడం.
ప్రశ్న 47: ఉమ్రా యొక్క మూలస్థంభాలు ఏమిటి?
జవాబు: 1 - ఇహ్రామ్.
2 - కాబాగృహ ప్రదక్షిణలు.
3 - సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయడం.
ప్రశ్న 48: అల్లాహ్ మార్గంలో జిహాద్ అంటే ఏమిటి?
జవాబు: దీని అర్థం, సత్యాన్ని కాపాడటంలో, ఇస్లాంను వ్యాపింపజేస్తూ మరియు దాని ప్రజలను శత్రువుల బారి నుండి రక్షించడంలో, ఇస్లాం మరియు ముస్లింల బద్ధశత్రువులతో వారి దాడిని ఎదుర్కొంటూ ధర్మపోరాటం చేయడంలో అత్యంత కృషి చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {తేలికగానైనా సరే, బరువుగా నైనా సరే బయలుదేరండి. మరియు మీ సంపదలతో మరియు మీ ప్రాణాలతో అల్లాహ్ మార్గంలో పోరాడండి. ఒకవేళ మీరిది తెలుసుకో గలిగితే, ఇది మీకెంతో ఉత్తమమైనది.} [తౌబా: 41]
*******
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర విభాగము
ప్రవక్త జీవిత చరిత్ర జ్ఞానం:
ప్రవక్త జీవిత చరిత్ర: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జీవితం గురించి, ఆయన జననం నుండి మరణం వరకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం.
ప్రశ్న 1: మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వంశావళి ఏమిటి?
జవాబు: ఆయన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిమ్. హాషిమ్ ఖురైష్ తెగకు చెందిన వారు. ఖురైష్ అరేబియా వాసుల్లోని ఒక సుప్రసిద్ధ తెగ. అరబ్ వాసులు ఇబ్రాహీం ఖలీలుల్లాహ్ బిన్ ఇస్మాయీల్ సంతానం. ఆయనపై మరియు మన ప్రవక్త పై అల్లాహ్ శుభశాంతులు కురిపించుగాక.
ప్రశ్న 2: మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క తల్లి పేరు ఏమిటి?
జవాబు: ఆమిన బిన్తె వహబ్
ప్రశ్న3: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తండ్రి ఎప్పుడు చనిపోయారు?
జవాబు :ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఆయన తండ్రి అబ్దుల్లాహ్ మదీనాలో మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించడానికి ముందే తండ్రి మరణించారు.
ప్రశ్న 4: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు జన్మించారు?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఏనుగుల సంవత్సరంలో రబీఉల్ అవ్వల్ నెలలో 12వ తేదీన జన్మించారు.
ప్రశ్న5: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎక్కడ జన్మించారు?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం మక్కా నగరంలో జన్మించారు
ప్రశ్న6: తల్లి కాకుండా ఏ యే ఆయాలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు పాలు త్రాపించారు?
జవాబు: తండ్రి బానిసరాలైన ఉమ్మె అయిమన్
పినతండ్రి అబు లహబ్ బానిసరాలైన సువైబహ్
హలీమా అస్సాదియహ్.
ప్రశ్న7: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి ఎప్పుడు చనిపోయింది?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వయస్సు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తల్లి చనిపోయింది. ఆ తరువాత తాత అబ్దుల్ ముత్తలిబ్ ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనా పాలనా బాధ్యతలను తీసుకున్నారు.
ప్రశ్న8: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఆలనా పాలనా బాధ్యతలను ఎవరు తీసుకున్నారు?
జవాబు:తాత అబ్దుల్ ముత్తలిబ్ చనిపోయినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎనిమిది సంవత్సరాలు. అప్పుడు ఆయన ఆలనా పాలనా బాధ్యతలను ఆయన పినతండ్రి అబూ తాలిబ్ తీసుకున్నారు.
ప్రశ్న9: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన పినతండ్రి అబూ తాలిబ్ తో కలిసి షామ్ (నేటి సిరియా, లెబనాన్, జోర్డార్ తదితర ప్రాంతాలు) వైపునకు ఎప్పుడు ప్రయాణించారు?
జవాబు :ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన పినతండ్రి గారితో పాటు 12 సంవత్సరాల వయస్సులో షామ్ (సిరియా)కు ప్రయాణం చేశారు.
ప్రశ్న10: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఎప్పుడు ప్రయాణించారు?
జవాబు: రెండవసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఖదీజహ్ రజియల్లాహు అన్హా వ్యాపార బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ప్రయాణించారు. ఆ ప్రయాణం నుండి మరలి వచ్చిన తరువాత ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వివాహం ఖదీజహ్ రజియల్లాహు అన్హ తో జరిగింది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు.
ప్రశ్న11: కాబాగృహ పునఃనిర్మాణాన్ని ఖురైషీయులు ఎప్పుడు ప్రారంభించారు?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు, ఖురైషీయులు కాబాగృహ పునఃనిర్మాణాన్ని చేపట్టారు.
కాబాగృహ పునఃనిర్మాణంలో భాగంగా హజ్రె అస్వద్ (నలుపు రాయి)ని దాని స్థానంలో ఎవరు పునరుద్ధరించాలనే విషయంపై ఖురైషీ సర్దారులు విభేదించినప్పుడు, వారు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ను తీర్పు చెప్పమని కోరారు; అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం దానిని ఒక దుప్పటిలాంటి వస్త్రంపై ఉంచారు మరియు ముఖ్యమైన నాలుగు తెగలలో నుండి ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఆ వస్త్రం యొక్క నాలుగు చివరలు పట్టుకోవాలని ఆదేశించారు. అలా, వారు దానిని ఎత్తినప్పుడు, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం హజ్రె అస్వద్ ను తన శుభమైన చేతులతో దాని స్థానంలో పునరుద్ధరించారు.
ప్రశ్న12: ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు ఎంత?
జవాబు: ప్రవక్తగా ప్రకటించబడినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వయస్సు నలభై ఏళ్ళు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజలకు (స్వర్గం గురించిన) శుభవార్తలు తెలిపేవానిగా మరియు (నరకాగ్ని నుండి) హెచ్చరించేవానిగా చేసి పంపబడ్డారు.
ప్రశ్న 13: మొదటగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద వచ్చిన వహీ ఏమిటి?
జవాబు: వహీ, యదార్థమైన కలలతో ప్రారంభమైంది: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లంకు కలలో ఏదైతే కనబడిందో, అది యదార్థంగా కళ్ళ ముందు జరిగేది.
ప్రశ్న14: వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పరిస్థితి ఎలా ఉండేది? మొట్టమొదటిసారి ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై వహీ ఎప్పుడు అవతరించింది?
జవాబు: మొట్టమొదటిసారి వహీ అవతరణకు ముందు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం హిరా గుహలో అల్లాహ్ ను ఆరాధిస్తూ ఉండేవారు.
హిరా గుహలో ఆరాధనలో ఉండగా, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం పై మొట్టమొదటిసారి వహీ అవతరించింది.
ప్రశ్న15: మొట్టమొదటిసారి ఆయన పై ఖుర్ఆన్ లో నుండి ఏమి అవతరించింది?
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: పఠించు! నీ ప్రభువు పేరుతో, ఆయనే (సర్వాన్ని) సృష్టించాడు!1 ఆయన మానవుడిని రక్తపుముద్దతో సృష్టించాడు.2 పఠించు! మరియు నీ ప్రభువు పరమదాత.3 ఆయన కలము ద్వారా నేర్పాడు.4 మానవుడు ఎరుగని జ్ఞానాన్ని అతనికి బోధించాడు.5} [అల్ అలఖ్: 1 - 5]
ప్రశ్న16: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం దివ్యసందేశంపై మొట్టమొదట ఎవరు విశ్వాసం ప్రకటించారు?
జవాబు: - పురుషులలో : అబూబకర్ సిద్దీఖ్ రజియల్లాహు అన్హు
- స్త్రీలలో: ఖదీజ బిన్తె ఖువైలిద్ రజియల్లాహు అన్హా
- పిల్లలో నుంచి: అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు అన్హు.
-విముక్తి పొందిన బానిసలలో నుంచి: జైద్ బిన్ హారిస రజియల్లాహు అన్హు.
-బానిసలలో: బిలాల్ హబషి రజియల్లాహు అన్హు
ప్రశ్న17: ఇస్లాం వైపు ఆహ్వానించే ధర్మప్రచారం ఆ కాలంలో ఎలా జరిగేది?
జవాబు: మొదటి మూడు ఏళ్ళు రహస్యంగా ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ ధర్మప్రచారం జరిగింది. ఆ తరువాత బహిరంగంగా సత్యధర్మ ప్రచారం చేయమని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు ఆజ్ఞాపించబడింది.
ప్రశ్న 18: బహిరంగ ధర్మప్రచారం తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయనపై విశ్వాసం కనబరచిన వారి పరిస్థితి ఏమిటి?
జవాబు: విశ్వాసులకు అబిసీనియాలోని నజాషి (నెగస్) రాజు యొక్క ప్రాంతానికి వలస వెళ్ళడానికి అనుమతి ఇవ్వబడనంత వరకు మక్కాలోని బహుదైవారాధకులు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ను మరియు విశ్వాసులను తీవ్రంగా బాధపెట్టేవారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలనే పన్నాగాన్ని బహుదైవారాధకులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు; అయినప్పటికీ, అల్లాహ్ ఆయన ను రక్షించాడు మరియు వారి నుండి ఆయన ను రక్షించడానికి, పినతండ్రి అబూ తాలిబ్ ఆయన కు మద్దతు ఇచ్చేలా చేసాడు.
ప్రశ్న 19: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం లభించిన పదోవ ఏట మరణించిన వారు ఎవరు?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పినతండ్రి అబూ తాలిబ్, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఖతీజహ్ రజియల్లాహు అన్హా చనిపోయారు.
ప్రశ్న20: అల్ ఇస్రాఅ వల్ మేరాజ్ ఎప్పుడు జరిగింది?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు మరియు అందులో ఐదు పూటల నమాజు తప్పనిసరి విధిగావించబడినది.
అల్ ఇస్రా: మక్కాలోని మస్జిద్ అల్ హరామ్ నుండి అల్ అఖ్సా మస్జిదు వరకు చేసిన ప్రయాణం.
అల్ మేరాజ్: మస్జిద్ అల్ అఖ్సా నుండి సిద్రతుల్ మున్తహా వరకు చేసిన స్వర్గారోహణ.
ప్రశ్న 21: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా వెలుపల ప్రజలను ఎలా ఆహ్వానించారు?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తాయిఫ్ ప్రజలను ఇస్లాం వైపునకు ఆహ్వానించారు. మదీనా పట్టణానికి చెందిన అన్సారు ప్రజలు మక్కా వచ్చి తనకు మద్దతుగా విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేసే వరకు, వేర్వేరు ప్రాంతాల నుండి మక్కా నగరానికి విచ్చేసే యాత్రికుల సమావేశ సమయాలలో, ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ప్రజల ముందుకు స్వయంగా వెళ్ళి ఇస్లాం గురించి వారికి వివరించేవారు.
ప్రశ్న 22: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఎంతకాలం ప్రజలను ఇస్లాం వైపు పిలిచారు?
జవాబు: పదమూడు సంవత్సరాల పాటు.
ప్రశ్న 23: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎటు హిజ్రత్ చేశారు?
జవాబు: మక్కా నుండి మదీనా కు
24:ఎన్ని సంవత్సరాల పాటు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మదీనా పట్టణంలో ఇస్లాం ధర్మ ప్రచారం చేసారు?
జవాబు: పది సంవత్సరాల పాటు.
25: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, ఏ యే ఇస్లామీయ శాసనాలు నిర్దేశించబడ్డాయి?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ఉన్నప్పుడు, జకాతు (విధి దానం), సియామ్ (రమజాను మాసపు తప్పనిసరి ఉపవాసాలు), హజ్ యాత్ర, జిహాద్ (అల్లాహ్ మార్గంలో ధర్మపోరాటం), అజాన్ (ఐదు పూటలా నమాజ్ కొరకు ఇచ్చే పిలుపు) మొదలైన ధర్మాదేశాలు నిర్దేశించబడ్డాయి.
ప్రశ్న 26: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రధాన యుద్ధాలు ఏమిటి?
బదరుల్-కుబ్రా (బద్ర్ యుద్దం): హిజ్రత్ యొక్క రెండవ సంవత్సరంలో జరిగింది.
ఉహద్ యుద్ధం: హిజ్రత్ యొక్క మూడవ సంవత్సరంలో జరిగింది.
అహ్జాబ్ యుద్ధం : హిజ్రత్ యొక్క ఐదవ సంవత్సరంలో జరిగింది.
ఫతహ్ మక్కా యుద్ధం: హిజ్రత్ యొక్క ఎనిమిదవ సంవత్సరంలో జరిగింది.
ప్రశ్న27: ఖుర్ఆన్ లో చిట్టచివరగా ఏమి అవతరింప జేయబడింది?
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: {మరియు మీరు తిరిగి అల్లాహ్ సమక్షానికి చేరుకోబోయే ఆ దినానికి భయపడండి. అప్పుడు ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారి కెలాంటి అన్యాయం జరుగదు.} [అల్ బఖర:281]
ప్రశ్న 28: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు మరణించారు? మరియు ఆయన వయస్సు ఎంత?
జవాబు: హిజ్రీ 11వ సంవత్సరము, రబీఉల్ అవ్వల్ మాసం 12వ తేదీన ఆయన మరణించారు. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు అరవై మూడు సంవత్సరాలు.
ప్రశ్న 29: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలు ఎవరో తెలుపండి?
జవాబు: 1 - ఖదీజహ్ బిన్తె ఖువైలిద్ రజియల్లాహు అన్హా.
2 - సౌదహ్ బిన్తె జ'మఅ రజియల్లాహు అన్హా.
3 - ఆయిషహ్ బిన్తె అబూబకర్ అస్సిద్దీఖ్ రజియల్లాహు అన్హా.
4 - హఫ్సహ్ బిన్తె ఉమర్ రజియల్లాహు అన్హా.
5 - జైనబ్ బిన్తె ఖుజైమహ్ రజియల్లాహు అన్హా.
6 - ఉమ్మె సలమహ్ హింద్ బిన్తె అబీ ఉమయ్యహ్ రజియల్లాహు అన్హా.
7 - ఉమ్మే హబీబా బిన్తె అబూ సుఫ్యాన్ రజియల్లాహు అన్హా.
8 - జువైరియా బిన్తె అల్ హారిస్ రజియల్లాహు అన్హా.
9 - మైమూనా బిన్తె అల్ హారిస్ రజియల్లాహు అన్హా.
10 - సఫియ్య బిన్తె హుయై రదియల్లాహు అన్హా.
11 - జైనబ్ బిన్తె జహష్ రజియల్లాహు అన్హా.
ప్రశ్న 30: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంతానం ఎవరు?
జవాబు: ముగ్గురు మగపిల్లలు
ఖాసిమ్, ఇతని వలననే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ను అబుల్ ఖాసిమ్ అనే మారుపేరుతో పిలిచేవారు.
అబ్దుల్లాహ్
ఇబ్రాహీమ్
ఆడపిల్లలు:
ఫాతిమహ్
రుఖయహ్
ఉమ్మె కుల్'సూమ్
జైనబ్
ఇబ్రాహీమ్ తప్ప పిల్లలందరూ ఖదీజహ్ రజియల్లాహు అన్హా ద్వారానే జన్మించారు మరియు ఫాతిమహ్ రజియల్లాహు అన్హా తప్ప పిల్లలందరూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలోనే మరణించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన ఆరు నెలల తరువాత ఫాతిమహ్ రజియల్లాహు అన్హా మరణించారు.
ప్రశ్న31: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొన్ని భౌతిక లక్షణాలను పేర్కొనండి?
జవాబు : ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఎత్తు సగటు ఎత్తు, పొట్టీ కాదు - పొడుగూ కాదు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెల్లటి రంగు కలిగి ఉండేవారు, అది కొద్దిగా ఎర్రగా ఉండేది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మందపాటి గడ్డం, పెద్ద కళ్ళు మరియు విశాలమైన నోరు కలిగి ఉండేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జుట్టు చాలా నల్లగా ఉండేది, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం భుజాలు విశాలంగా ఉండేవి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వాసన ఇతర సుందరమైన లక్షణాలతో పాటు చాలా ఆహ్లాదకరంగా ఉండేది.
ప్రశ్న 32: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ని దేని మీద వదిలారు?
జవాబు: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను (సమాజాన్ని) స్పష్టమైన మార్గంలో విడిచిపెట్టి వెళ్ళారు, దేని రాత్రి అయితే దాని పగలంత స్పష్టంగా ఉంటుందో. నాశనానికి గురైన వ్యక్తి తప్ప ఎవరూ దాని నుండి దారితప్పరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మతును సన్మార్గాలన్నింటి వైపు నిర్దేశించారు మరియు చెడులన్నింటి నుండి వారిని హెచ్చరించారు.
*******
తఫ్సీర్ (ఖుర్ఆన్ వ్యాఖ్యాన) విభాగము
ఖుర్ఆన్ వ్యాఖ్యాన జ్ఞానం:
తఫ్సీర్: ఖుర్ఆన్ యొక్క ఆయతుల అర్థాలను తెలుసుకునే శాస్త్రం, ఇది నమ్మకాలు, ఆరాధనలు, లావాదేవీలు, నైతికతలు, హలాల్ మరియు హరామ్, ఆజ్ఞలు మరియు నిషేదాలు మొదలైన వాటిలో మార్గదర్శకత్వాన్ని కలిగి ఉంటుంది.
గమనిక: ఈ విభాగం ఖుర్ఆన్ ఆయతులను కంఠస్తం చేయటంలో మరియు వాటి అర్థాలను అర్థం చేసుకోవడంలో సహాయపడటానికి ఉంటుంది.
1:సూరతుల్ ఫాతిహా పఠించండి మరియు దాని వ్యాఖ్యనం తెలపండి?
జవాబు: సూరతుల్ ఫాతిహా మరియు దాని తఫ్సీరు (వ్యాఖ్యానం) :
{అనంత కరుణా ప్రధాత మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, (1) సకల ప్రశంసలు, కృతజ్ఞతలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. (2) అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. (3) తీర్పుదినానికి యజమాని.(4) మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము.(5) మాకు ఋజుమార్గము చూపించు.(6) నీవు అనుగ్రహించిన వారి మార్గము మాత్రమే (చూపించు); నీ ఆగ్రహానికి గురి అయిన వారి మరియు మార్గభ్రష్టులైన వారి (మార్గం) కాదు.(7)} [అల్ ఫాతిహ: 1-7]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
ఇది పవిత్ర ఖుర్ఆన్ ప్రారంభ సూరహ్ కాబట్టి దీనికి సూరతుల్ ఫాతిహా (తొలి అధ్యాయం) అనే ఈ పేరు పెట్టారు.
1. అనంత కరుణాప్రధాత మరియు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, (1) అల్లాహ్ పేరిట నేను ఖుర్ఆన్ పఠించడం ప్రారంభిస్తున్నాను. ఆయన సహాయం కోరుతూ, ఆయన నామమును ప్రస్తావించడం ద్వారా ఆయన దీవెనలు కోరుతున్నాను.
- అల్లాహ్ అంటే: నిజంగా సకల ఆరాధనలకు ఏకైక అర్హుడు. సర్వశక్తిమంతుడైన ప్రభువుకు తప్ప మరెవ్వరికీ ఆ నామము ఇవ్వబడలేదు.
- అర్రహ్మాన్ అంటే: కరుణాప్రధాత: సమస్తాన్ని ఆవరించి ఉన్న మహోన్నతమైన మరియు సువిశాలమైన అపార కారుణ్యం కలిగి ఉన్నవాడు.
- అర్రహీమ్ అంటే: విశ్వాసులపై ప్రత్యేక కృపాకటాక్షాలు కురిపించేవాడు.
2. సకల ప్రశంసలు, కృతజ్ఞతలు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కే శోభిస్తాయి. (2) అంటే: అన్ని రకాల ప్రశంసలు మరియు సంపూర్ణతలు కేవలం ఒక్కడైన అల్లాహ్ కే చెందుతాయి.
3. అనంత కరుణాప్రధాత, అపార కృపాశీలుడు. (3) అంటే: సృష్టిలోని ప్రతిదానిని ఆవరించేటంతటి విస్తృతమైన దయాదాక్షిణ్యాలు గలవాడు మరియు విశ్వాసులపై ప్రత్యేక దయను ప్రసాదించేవాడు.
4.(తీర్పుదినానికి యజమాని). (4): అది ప్రళయదినం.
5. మేము కేవలం నిన్ను మాత్రమే ఆరాధిస్తాము మరియు కేవలం నిన్ను మాత్రమే సహాయం కొరకు అర్థిస్తాము.(5) అంటే: మేము కేవలం నీ ఒక్కడి ఆరాధన మాత్రమే చేస్తాము మరియు కేవలం నీ ఒక్కడి నుంచే సహాయం కోరుతాము.
6.మాకు ఋజుమార్గము చూపించు.(6): ఇది ఇస్లాం మరియు సున్నత్ వైపు మార్గదర్శకత్వం.
7. నీవు అనుగ్రహించిన వారి మార్గము మాత్రమే (చూపించు); నీ ఆగ్రహానికి గురి అయిన వారి మరియు మార్గభ్రష్టులైన వారి (మార్గం) కాదు.(7) అంటే : అల్లాహ్ యొక్క శాపానికి గురైన క్రైస్తవులు మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురైన యూదుల మార్గానికి భిన్నమైన మార్గము, ప్రవక్తలు, వారి అనుచరులు, అల్లాహ్ యొక్క నీతిమంతులైన దాసులు నడిచిన మార్గం.
-మరియు సూరతుల్ ఫాతిహా చదివిన తర్వాత "ఆమీన్" (మా ప్రార్థన స్వీకరించు!) అని పలకడం సున్నతు.-
ప్రశ్న 2: సూరతుల్ జల్'జలహ్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?
జవాబు: సూరతుల్ జల్'జలహ్ మరియు దాని వ్యాఖ్యానము:
{భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు, 1 మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు, 2 మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు, 3 ఆ రోజు అది తనలోని సమాచారాన్నంతా బహిరంగ పరిచినప్పుడు, 4 ఎందుకంటే, నిశ్చయంగా నీ ప్రభువు దానిని ఆదేశించి ఉన్నాడు. 5 ఆ రోజు తమ తమ కర్మలు చూపించబడటానికి ప్రజలను వేర్వేరు గుంపులలో తీసుకు వెళ్ళడం జరుగుతుంది. 6 మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 7 మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 8} [జల్ జలహ్:1-8]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. భూమి, అత్యంత తీవ్రమైన (అంతిమ) ప్రకంపనలతో కంపింప జేయబడినప్పుడు 1): భూమి ప్రళయదినమున తనకు సంభవించే తీవ్ర ప్రకంపనతో ప్రకంపించినప్పుడు.
2. మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు, 2): మరియు భూమి తన లోపల ఉన్న మృతులను, ఇతరవాటిని వెలికి తీసివేసినప్పుడు.
3. మరియు మానవుడు: "దీనికి ఏమయింది?" అని అన్నప్పుడు, 3): మానవుడు కలవర పడి ఇలా పలుకుతాడు: భూమికి ఏమయ్యింది కదులుతుంది, ప్రకంపిస్తుంది.
4.ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది 4): ఆ గొప్ప దినమున భూమి తనపై అతడు చేసిన మంచీ చెడుల గురించి తెలుపుతుంది.
5. ఎందుకంటే, నిశ్చయంగా నీ ప్రభువు దానిని ఆదేశించి ఉన్నాడు. 5): ఎందుకంటే అల్లాహ్ దానికి తెలియపరచాడు మరియు దానికి దాని గురించి ఆదేశించాడు.
6.ఆ రోజు ప్రజలు తమ తమ కర్మలు చూపించబడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.6): భూమి ప్రకంపించే ఆ గొప్ప దినమున ప్రజలు లెక్క తీసుకోబడే స్థానం నుండి వర్గములుగా బయలుదేరుతారు తాము ఇహలోకంలో చేసుకున్న తమ కర్మలను చూడటానికి.
7.మరియు అలాగే, ప్రతి ఒక్కడూ తాను రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 7): ఎవరైతే చిన్న చీమంత బరువైన మేలు కార్యములను, పుణ్య కార్యములను చేసి ఉంటే దాన్ని తన ముందట చూసుకుంటాడు.
8. మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. 8): ఎవరైతే తులన యొక్క బరువుతోనైనా చెడుకార్యాలను చేయగలరో, అతడు వాటిని తన ముందు చూడగలడు.
3: సూరతుల్ ఆదియాత్ పఠించు మరియు దాని వ్యాఖ్యానం వివరించు?
జవాబు: సూరతుల్ ఆదియాత్ పఠనం మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానము):
{వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా 1 తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి; 2 తెల్లవారుజామున దాడిచేసే వాటి; 3 (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;4 (శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.5 నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.6 మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.7 మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.8 ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;9 మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;10 నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని! 11} [ఆదియాత్: 1-11]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. వగర్చుతూ పరిగెత్తే గుర్రాల సాక్షిగా 1): అల్లాహ్ ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే వేగంగా పరిగెడుతున్నవో చివరికి తీవ్రంగా పరిగెట్టటం వలన వారి రొప్పే శబ్దము వినబడుతుంది.
2. తమ ఖురాల తట్టులతో అగ్నికణాలు లేపేవాటి; 2): మరియు ఆ గుర్రములపై ప్రమాణం చేశాడు ఏవైతే తమ కాలి గిట్టెలతో అగ్నిని రాజేస్తున్నవో అవి వాటితో రాతి పలకలపై రాకినప్పుడు వాటిపై తీవ్రంగా వాటిల్లటం వలన.
3. తెల్లవారుజామున దాడిచేసే వాటి; 3): మరియు ఉదయం వేళ శతృవులపై దాడి చేసే గుర్రములపై ప్రమాణం చేశాడు.
4 . (మేఘాల వంటి) దుమ్ము లేపుతూ;4) : మరియు అవి తమ పరిగెట్టటం వలన దుమ్మును లేపుతాయి.
(శత్రువుల) సమూహంలో దూరిపోయే వాటి.5 తమ సవారీలను తీసుకుని శతృవుల సమూహం మధ్యలో దూరిపోతాయి.
నిశ్చయంగా, మానవుడు తన ప్రభువు పట్ల ఎంతో కృతఘ్నుడు.6 నిశ్చయంగా మానవుడు తన నుండి తన ప్రభువు ఆశించే మేలును ఎక్కువగా ఆపుతాడు.
మరియు నిశ్చయంగా, దీనికి స్వయంగా అతడే సాక్షి.7 మరియు నిశ్చయంగా మేలుని ఆపటంపై తాను స్వయంగా సాక్షి. అది స్పష్టమైనప్పుడు దాన్ని నిరాకరించలేడు.
మరియు నిశ్చయంగా, అతడు సిరిసంపదల వ్యామోహంలో పూర్తిగా మునిగి ఉన్నాడు.8 నిశ్చయంగా అతను సంపద పట్ల చాలా ప్రేమ కలిగిన వాడు దానిలో పిసినారితనం చూపుతాడు.
ఏమిటి? అతనికి తెలియదా? గోరీలలో ఉన్నదంతా పెళ్ళగించి బయటికి తీయబడినప్పుడు;9 ఏమీ ఇహలోకముతో ఈ మోసపోయే మానవునికి అల్లాహ్ సమాదులలో ఉన్న మృతులను లెక్క తీసుకోవటానికి మరియు ప్రతిఫలం ప్రసాదించటానికి మరల లేపి నేల నుండి వెలికి తీసినప్పుడు తాను ఊహిస్తున్నట్లు విషయం కాదని తెలియదా ?!
మరియు (మానవుల) హృదయాలలోని విషయాలన్నీ వెల్లడి చేయబడినప్పుడు;10 హృదయముల్లో ఉన్న సంకల్పాలు మరియు విశ్వాసాలు మరియు ఇతర విషయాలు బహిర్గతం చేయబడుతాయి మరియు స్పష్టం చేయబడుతాయి.
నిశ్చయంగా, ఆ రోజున వారి ప్రభువు వారిని గురించి అంతా తెలుసుకొని ఉంటాడని! 11 : నిశ్చయంగా వారి ప్రభువు వారి గురించి ఆ దినమున బాగా తెలిసిన వాడు. తన దాసుల వ్యవహారముల్లోంచి ఏదీ ఆయన పై గోప్యంగా ఉండదు. మరియు ఆయన తొందరలోనే వారికి దాని పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు.
ప్రశ్న4:సూరతుల్ ఖారిఅహ్ పఠించండి మరియు దాని వ్యాఖ్యానాన్ని వివరించండి?
జవాబు: సూరతుల్ ఖారిఅహ్ మరియు దాని వ్యాఖ్యానం:
{ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1 ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? 2 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 3 ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.4 మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.5 అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!6 అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.7 మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!8 అతని నివాసం అధఃపాతాళమే. 9 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? (10) అదొక భగభగ మండే అగ్ని (గుండం).11} [అల్ ఖారిఅహ్:1-11]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1.ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం! 1) : ప్రళయం అదే ఏదైతే ప్రజల హృదయాలను పెద్ద భయాందోళనల ద్వారా తట్టుతుందో.
2. ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం? 2): ప్రజల హృదయాలను పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?!.
3. మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 3): ఓ ప్రవక్త మీకేమి తెలుసు - ప్రజల హృదయాలను పెద్ద భయాందోళనల ద్వారా తట్టే ఈ ప్రళయం ఏమిటి ?! అది ప్రళయదినం.
4. ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు.4): ఆ రోజు అది ప్రజల హృదయములను తట్టుతుంది.వారు అక్కడ ఇక్కడ విస్తరించి పడి ఉన్న చిమ్మెటల వలె అయిపోతారు.
5. మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి.5): మరియు పర్వతాలు వాటి నడవటంలో, వాటి కదలికల్లో తేలికదనంలో ఈక బడిన ఉన్ని వలే అయిపోతాయి.
6 .అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో!6): మరియు ఎవరి సత్కర్మలు అతని దుష్కర్మల కన్న బరువుగా వంగుతాయో.
7. అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు.7): అతడు మనస్సుకు నచ్చిన భోగభాగ్యాలతో కూడిన జీవితంలో ఉంటాడు. దాన్ని అతడు స్వర్గంలో పొందుతాడు.
8. మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో!8): మరియు ఇక ఎవరి దుష్కర్మలు అతని సత్కర్మల కన్న బరువుగా వంగుతాయో.
9 . అతని నివాసం అధఃపాతాళమే. 9): అయితే అతని నివాసము మరియు అతని ఆశ్రమం ప్రళయదినాన అది నరకము
10 . మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? (10): ఓ ప్రవక్తా అది ఏమిటో మీకు ఏమి తెలుసు?.
11. అదొక భగభగ మండే అగ్ని (గుండం).11): అది తీవ్ర వేడి గల నరకాగ్ని.
ప్రశ్న5: సూరతు త్తకాసుర్ పఠించండి మరియు దాని వ్యాఖ్యానం వివరించండి?
జవాబు: సూరతు తకాసుర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది 1 మీరు గోరీలలోకి చేరే వరకు.2 అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.3 మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.4 ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).5 నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! 6 మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!7 అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 8} [సూరతుత్తకాసుర్: 1-8వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. (ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరు పాటులో పడవేసింది 1): ఓ ప్రజలారా సంపదల పట్ల, సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం మిమ్మల్ని అల్లాహ్ విధేయత నుండి పరధ్యానంలో పడవేసింది.
2. మీరు గోరీలలోకి చేరే వరకు.2): చివరికి మీరు మరణించి మీ సమాదులలో ప్రవేశించారు.
3. అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు.3): వాటి పట్ల ప్రగల్భాలు పలకటం అల్లాహ్ విధేయత నుండి మిమ్మల్ని పరధ్యానంలో పడవేయటం మీకు సరి కాదు. ఈ పరధ్యానం యొక్క పర్యవసానం ఏమిటో మీరు తొందరలోనే తెలుసుకుంటారు.
4. మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు.4): ఆ పిదప మీరు తొందరలోనే దాని పర్యవసానమును తెలుసుకుంటారు.
5. ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు).5): వాస్తవం ఒక వేళ మీరు అల్లాహ్ వైపు మరల లేపబడి వెళతారని మరియు ఆయన మీకు మీ కర్మల ప్రతిఫలం ప్రసాదిస్తాడని మీరు ఖచ్చితంగా తెలుకుని ఉంటే సంపదల పట్ల, సంతానం పట్ల ప్రగల్భాలు పలకటం ద్వారా మీరు పరధ్యానంలో పడేవారు కాదు.
6. నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు! 6): అల్లాహ్ సాక్షిగా ప్రళయదినమున మీరు నరకాగ్నిని తప్పకుండా చూస్తారు.
7. మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు!7): ఆ తరువాత మీరు దాన్ని ఖచ్చితంగా చూస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు.
8. అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు! 8): ఆ తరువాత అల్లాహ్ ఆ దినమున మీకు అనుగ్రహించిన ఆరోగ్యము, ఐశ్వర్యము, ఇతర వాటి గురించి మీకు తప్పకుండా అడుగుతాడు.
ప్రశ్న6: సూరతుల్ అస్ర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ అస్ర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{కాలం సాక్షిగా (1) నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! (2) కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! (3)} [అస్ర్ : 1-3]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. కాలం సాక్షిగా (1) : అల్లాహ్ సుబహానహూ తఆలా కాలముపై ప్రమాణం చేశాడు.
2.నిశ్చయంగా మానవుడు నష్టంలో ఉన్నాడు! (2): అంటే ప్రతీ మనవుడు నష్టంలో, వినాశనంలో ఉన్నాడు.
3.కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప! (3): విశ్వసించి, సత్కార్యాలను ఆచరిస్తూ, అదే సమయంలో సత్యం వైపు పిలుస్తూ, సహనంతో ఉండే వారు మాత్రమే ఆ నష్టం నుండి బయటపడతారు.
ప్రశ్న7: సూరతుల్ హుమజహ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూతరుల్ హుమజహ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.1 ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!2 తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!3 ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.4 మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 5 అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;6 అది గుండెల దాకా చేరుకుంటుంది.7 నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.8 పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!9} [సూరతుల్ హుమజహ్ : 1-9 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1 .అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు.1: ప్రజల గురించి ఎక్కువగా చాడీలు చెప్పేవాడి కొరకు మరియు వారి విషయంలో దెప్పిపొడిచే వాడి కొరకు దుష్పరిణామము మరియు కఠిన శిక్ష కలదు.
2 .ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో!2 అతడి ఉద్దేశం సంపదను సేకరించటం మరియు దాన్ని లెక్కపెట్టి ఉంచటం తప్ప అతనికి వేరే ఉద్దేశం లేదు.
3. తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు!3 : అతడు సేకరించిన అతని సంపద అతడిని మరణం నుండి ముక్తిని కలిగిస్తుందని మరియు అతడు ఇహలోక జీవితంలో శాశ్వతంగా ఉండిపోతాడని భావిస్తున్నాడు.
4. ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు.4: ఈ మూర్ఖుడు ఊహించినట్లు విషయం కాదు. అతడు తప్పకుండా నరకాగ్నిలో విసిరివేయబడుతాడు. అది తన శిక్ష తీవ్రత వలన తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని దంచివేస్తుంది, విచ్చిన్నం చేస్తుంది.
5. మరియు ఆ ఊర్ధ్వగమనం అంటే ఏమిటో నీకు తెలుసా? 5: ఓ ప్రవక్త తనలో విసిరివేయబడిన ప్రతీ దాన్ని తుత్తునియలు చేసే ఈ నరకాగ్ని ఏమిటో మీకేమి తెలుసు ?.
6. అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని;6: నిశ్చయంగా అది అల్లాహ్ రాజేసిన అగ్ని.
7. అది గుండెల దాకా చేరుకుంటుంది.7: అది ప్రజల శరీరముల నుండి వారి హృదయముల్లోకి చొచ్చుకుపోయేది.
8. నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది.8: నిశ్చయంగా అది తనలో శిక్షింపబడే వారిపై నలువైపుల నుండి బంధించబడి ఉంటుంది.
9. పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే!9: విస్తరించిన పొడవైన స్తంభాలలో చివరికి వారు దాని నుండి వెలుపలికి రాలేరు.
ప్రశ్న8: సూరతుల్ ఫీల్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ ఫీల్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) :
{ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 1 ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 2 మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; 3 అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి. 4 ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు. 5 [సూరతుల్ ఫీల్: 1-5 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. ఏమీ? ఏనుగువారి (సైన్యంతో) నీ ప్రభువు ఎలా వ్యవహరించాడో నీకు తెలియదా? 1: ఓ ప్రవక్తా మీ ప్రభువు అబ్రహా పట్ల మరియు అతని సహచరులైన ఏనుగుల వారి పట్ల వారు కాబాను శిధిలం చేయుటకు పూనుకున్నప్పుడు ఏమి చేశాడో మీరు చూడలేదా ?!
2. ఏమీ? ఆయన వారి కుట్రను భంగం చేయలేదా? 2: నిశ్ఛయంగా దాన్ని పడవేసే వారి దుర పన్నాగమును అల్లాహ్ నిర్వీర్యం చేశాడు. కావున ప్రజలను కాబా నుండి మరల్చటమును ఏదైతే వారు పొందలేదో. మరియు దాని నుండి వారు ఏమి పొందలేదు.
3. మరియు ఆయన వారిపైకి పక్షుల గుంపులను పంపాడు; 3 : మరియు వారిపై పక్షులను పంపించాడు అవి వారిపై సమూహాలు సమూహాలుగా వచ్చినవి.
4. అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి4: అవి వారిపై మట్టితో చేయబడిన కంకర రాళ్ళను విసిరాయి.
5. ఆ విధంగా ఆయన వారిని (పశువులు) తినివేసిన పొట్టుగా మార్చి వేశాడు. 5: అప్పుడు అల్లాహ్ వారిని పశువులు తిని తొక్కి వేసిన పంట ఆకుల వలె చేశాడు.
ప్రశ్న9: సూరతు ఖురైష్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి ?
జవాబు: సురతు ఖురైష్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు.1 (అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు. 2 కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! 3 వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 4} [సూరతు ఖురైష్ : 1-4 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1.(అల్లాహ్ రక్షణ మరియు ఆయన కరుణతో) ఖురైషులు (ప్రయాణాలకు) అలవాటుపడ్డారు.(1) : దాని ఉద్దేశం, వారు శీతాకాలం మరియు వేసవికాలంలో చేసే ప్రయాణాలకు అలవాటుపడ్డారు.
2.(అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు. 2: నిశ్ఛింతగా యమన్ వైపునకు శీతాకాల ప్రయాణము మరియు వేసవి కాలంలో షామ్ (సిరియా) వైపునకు ప్రయాణం (అలవాటు పరచటానికి).
3. కావున వారు ఆ ఆలయ (కఅబహ్) ప్రభువు (అల్లాహ్)ను మాత్రమే ఆరాధించాలి! 3: కావున వారు ఈ పరిశుద్ధ గృహము యొక్క ఒక్కడే ప్రభువైన అల్లాహ్ ను ఆరాధించాలి. ఎవరైతే వారి కొరకు ఈ ప్రయాణమును శులభతరం చేశారో. మరియు ఆయనతో పాటు ఎవరిని సాటి కల్పించకూడదు.
4. వారు ఆకలితో ఉన్నప్పుడు ఆయనే వారికి ఆహారమిచ్చాడు మరియు ఆయనే వారిని భయం (ప్రమాదం) నుండి కాపాడాడు. 4: ఆయనే వారిని ఆకలితో ఉన్నప్పుడు తినిపించాడు మరియు భయాందోళనలో శాంతిని కలిగించాడు. అరబ్ వాసుల హృదయములలో హరమ్ యొక్క గౌరవమును వేయటంతో మరియు అక్కడి వాసుల గౌరవమును వేయటంతో.
ప్రశ్న10: సూరతుల్ మాఊన్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ మాఊన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? (1) అతడే అనాధులను కసరి కొట్టేవాడు; (2) మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. (3) అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4) ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5) ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! (6) మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో (7)} [సూరతుల్ మాఊన్: 1-7వ ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? 1: ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!
2. అతడే అనాధులను కసరి కొట్టేవాడు; 2: అతనే అనాథను అతని అవసరం నుండి చాలా మొరటుగా నెట్టివేస్తాడు.
3. మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. 3: పేదవాడికి భోజనం తినిపించే విషయంలో స్వయమును ప్రేరేపించడు మరియు ఇతరులను ప్రేరేపించడు.
4. అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4): వినాశనము మరియు శిక్ష ఆ నమాజీలకు కలదు.
5.ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5): ఎవరైతే తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహిస్తారో. మరియు వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోరో.
6. ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! (6): వారే తమ నమాజులను మరియు తమ కర్మలను ప్రదర్శిస్తారు. ఆచరణను అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో చేయరు.
7. మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో (7): మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.
ప్రశ్న11: సూరతుల్ కౌసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ కౌసర్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{(ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము. 1 {కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!}[2] నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3} [అల్ కౌసర్ :1 - 3]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. (ఓ ముహమ్మద్!) నిశ్చయంగా, మేము నీకు కౌసర్ ప్రసాదించాము. 1: ఓ ప్రవక్త నిశ్చయంగా మేము మీకు చాలా మేలును ప్రసాదించాము. మరియు స్వర్గములో కౌసర్ సెలయేరు కూడా అందులో నుంచే.
2. కనుక నీవు నీ ప్రభువు కొరకే నమాజ్ చెయ్యి మరియు బలి (ఖుర్బానీ) కూడా (ఆయన కొరకే) ఇవ్వు!}2: కావున మీరు ఈ అనుగ్రహముపై అల్లాహ్ కు కృతజ్ఞతను తెలుపుకోండి ఆయన ఒక్కడి కొరకు మాత్రమే నమాజును పాటించండి మరియు జుబాహ్ చేయండి. ముష్రికులకు వ్యతిరేకంగా ఎందుకంటే వారు విగ్రహాల సామిప్యము పొందటం కొరకు జుబహ్ చేస్తారు.
3. నిశ్చయంగా నీ శత్రువు, వాడే! వేరు తెగిన వాడిగా (వారసుడూ, పేరూ లేకుండా) అయిపోతాడు. 3: నిశ్చయంగా మిమ్మల్ని ద్వేషించేవాడు ప్రతీ మేలు నుండి తెగిపోయేవాడు, మరపింపబడేవాడు అతడే ఒక వేళ అతని ప్రస్తావన జరిగిన చెడు ప్రస్తావనే జరుగును.
ప్రశ్న12: సూరతుల్ కాఫిరూన్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ కాఫిరూన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!1 మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;2 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.3 మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.4 మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.5 మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"6} [ కాఫిరూన్ : 1-6 ]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. ఇలా అను: "ఓ సత్యతిరస్కారులారా!1: ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా.
2.మీరు ఆరాధిస్తున్న వాటిని నేను ఆరాధించను;2: ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని నేను మీరు ఆరాధించే విగ్రహాలకు ఆరాధన చేయను.
3. మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.3: నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.
4. మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.4: మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.
5. మరియు నేను ఆరాధిస్తున్న ఆయనను మీరు ఆరాధించేవారు కారు.5: నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.
6. మీ ధర్మం మీకూ మరియు నా ధర్మం నాకు!"6: మీ స్వయం కొరకు మీరు సృష్టించిన మీ మతం మీ కొరకు ఉన్నది. అల్లాహ్ నా పై అవతరింపజేసిన నా ధర్మం నా కొరకు ఉన్నది.
ప్రశ్న13 సూరతున్నసర్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతున్నసర్ మరియు తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{(ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)! 1 మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 2 అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 3} [సూరతున్నసర్: 1-3 ఆయతులు ]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1. (ఓ ముహమ్మద్!) ఎప్పుడైతే అల్లాహ్ సహాయం వస్తుందో మరియు విజయం (లభిస్తుందో)! 1: ఓ ప్రవక్తా మీ ధర్మమునకు అల్లాహ్ సహాయము మరియు దానికి ఆయన గౌరవం ప్రాప్తించబడినప్పుడు మరియు మక్కా విజయం సంభవించినప్పుడు.
2. మరియు నీవు ప్రజలను గుంపులు గుంపులుగా అల్లాహ్ ధర్మం (ఇస్లాం)లో ప్రవేశించడం చూస్తావో! 2: మరియు మీరు ప్రజలను ఒక సమూహం తరువాత ఒక సమూహం ఇస్లాంలో ప్రవేశిస్తుండగా చూస్తారు.
3. అప్పుడు నీవు నీ ప్రభువు స్తోత్రంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు మరియు ఆయన క్షమాభిక్షను అర్థించు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. 3: కాబట్టి మీరు అది మీరు ఏ కర్తవ్యం కొరకు పంపించబడ్డారో దాని ముగింపు దగ్గరపడినది అనటాని సూచనగా తెలుసుకోండి. కావున మీరు మీ ప్రభువు స్థుతులతో పాటు పరిశుద్ధతను కొనియాడండి సహాయము, విజయము యొక్క అనుగ్రహము పై ఆయనకు కృతజ్ఞత చూపు. మరియు ఆయనతో మన్నింపును వేడుకోండి. నిశ్చయంగా ఆయన తన దాసుల పశ్చాత్తాపమును బాగా స్వీకరిస్తాడు మరియు వారిని మన్నిస్తాడు.
ప్రశ్న14: సూరతుల్ మసద్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ మసద్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక! 1 అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! 2 అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! 3 మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 4 ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. 5} [సూరతుల్ మసద్ : 1-5 ఆయతులు]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1.అబూ లహబ్ రెండు చేతులూ నశించుగాక మరియు అతడు కూడా నశించి పోవు గాక! 1: దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బాబాయి అయిన అబూలహబ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ రెండు చేతులు అతని కర్మలు నిర్వీర్యమవటంతో నాశనమైపోయినవి. ఎప్పుడైతే అతడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బాధ కలిగించాడో. మరియు అతని ప్రయత్నం నిర్వీర్యమైపోయినది.
2.అతడి ధనం మరియు అతడి సంపాదన (సంతానం) అతడికి ఏ మాత్రం పనికి రావు! 2: అతడి సంపద మరియు అతని సంతానములో నుంచి అవి అతడి నుండి శిక్షను తొలగించకపోతే మరియు అతనికి కారుణ్యమును తీసుకుని రాకపోతే దేనికి పనికి వస్తాయి ?.
3. అతడు ప్రజ్వలించే నరకాగ్నిలో కాల్చబడతాడు! 3: ప్రళయదినమున అతడు ప్రజ్వలించే అగ్నిలో ప్రవేశిస్తాడు. మరియు దాని వేడిని అనుభవిస్తాడు.
4. మరియు అతడి భార్య కూడా! కట్టెలు మోసే (చాడీలు చెప్పి కలహాలు రేకెత్తించే) స్త్రీ! 4: మరియు అతని భార్య అయిన ఉమ్మెజమీల్ అతనితో పాటు అందులో ప్రవేశిస్తుంది. ఆమె దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన మార్గంలో ముళ్ళను పరచి బాధ కలిగించేది.
5. ఆమె మెడలో బాగా పేనిని ఖర్జూరపునార త్రాడు (మసద్) ఉంటుంది. 5: ఆమె మెడలో ఖర్జూరపు నారతో పేనబడిన తాడు ఉంటుంది. దానితో ఆమె నరకాగ్నిలోకి ఈడ్చబడుతుంది.
ప్రశ్న15: సూరతుల్ ఇఖ్లాస్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ ఇఖ్లాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. 3 మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} [అల్ ఇఖ్లాస్:1-4]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1.{ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) : ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : దైవత్వంలో ఏకైకుడు ఆయనే అల్లాహ్. ఆయన తప్ప ఏ వాస్తవ ఆరాధ్యదైవం లేడు.
2.అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2): అంటే : సృష్టి యొక్క అవసరాలు ఆయన వైపుకు లేపబడతాయి.
3.ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.( 3): ఆయన ఎవరినీ కనలేదు మరియు ఆయనను ఎవరూ కనలేదు. కాబట్టి పరిశుద్ధుడైన ఆయనకు ఎటువంటి సంతానము లేదు. మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు.
4. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4): అతని సృష్టించటంలో అతనికి పోల్చదగినది ఏది లేదు.
ప్రశ్న16:సూరతుల్ ఫలఖ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతుల్ ఫలఖ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 } [అల్ ఫలక్ : 1-5]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1.ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1): ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.
2.ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2): సృష్టితాల్లోంచి బాధను కలిగించే వాటి కీడు నుండి.
3.మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! (3): మరియు నేను అల్లాహ్ తో రాత్రి వేళ బహిర్గతమయ్యే జంతువుల, దొంగల కీడుల నుండి శరణు వేడుకుంటున్నాను.
4.మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; (4) : మరియు నేను ముడులలో ఊదే మంత్రజాలకుల కీడు నుండి అల్లాహ్ తో శరణం వేడుకుంటున్నాను.
5.అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. (5) : మరియు అల్లాహ్ వారికి ప్రసాదించిన దీవెనలను చూసి ఓర్పుకోలేక, ప్రజలను ద్వేషించే మరియు అసూయపడే వ్యక్తి యొక్క చెడు నుండి. ఆ ప్రజలు ఇకపై అలాంటి ఆశీర్వాదాలను పొందకూడదని మరియు వారికి హాని కలిగించాలని ఆ దుష్టులు కోరుకుంటారు.
ప్రశ్న17: సూరతున్నాస్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?
జవాబు: సూరతున్నాస్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):
{ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6} [అన్నాస్ : 1 - 6]
తఫ్సీర్ (వ్యాఖ్యానము):
1.ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1): ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ప్రజల ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణు వేడుకుంటున్నాను.
2.మానవుల చక్రవర్తి. (2): ఆయన తాను తలచుకున్న వాటితో వారిలో కార్య నిర్వహణ చేస్తాడు. ఆయన తప్ప వారికి ఏ చక్రవర్తి లేడు.
3. మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)!( 3): వారి వాస్తవ ఆరాధ్య దైవము. అతను తప్ప వారికి ఏ వాస్తవ ఆరాధ్యదైవము లేడు.
4.కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; (4): ప్రజల వద్ద గుసగుసలాడే షైతానుల యొక్క చెడు నుండి.
5.ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!(5): అతడు తన దుష్ప్రేరితాలను ప్రజల హృదయాల్లో వేస్తాడు.
6.వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!(6): అలా గుసగుసలాడేది జిన్ నుండి కావచ్చు లేదా మానవజాతి నుండి కావచ్చు అని దీని అర్థం.
*******
హదీసు విభాగము
హదీసు శాస్త్రం
హదీస్ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు సంబంధించిన వాక్యం, చర్య, ఆమోదం, స్వభావిక లక్షణం లేదా నైతిక లక్షణం.
మొదటి హదీసు:
ప్రశ్న1: ఈ హదీసు పూర్తి చేయండి: "«... إنما الأعمال بالنيات ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు: అమీరుల్ మోమినీన్ అబీ హఫ్స ఉమర్ బిన్ అల్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకుతూ ఉండగా నేను విన్నానని ఆయన రజియల్లాహు అన్హు తెలిపారు: ‘నిశ్చయంగా కార్యాలు, కర్మలు వాటి నియ్యతులపై (సంకల్పాలపై) ఆధారపడి ఉంటాయి ‘ప్రతి వ్యక్తికీ అతని సంకల్పాన్ని బట్టి ప్రతిఫలము లభిస్తుంది. ఒకవేళ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కొరకు హిజ్రత్ చేస్తే (వలస వెళితే), అతని హిజ్రత్ అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త వైపుకు (హిజ్రత్ చేసినట్లుగా) నమోదు చేయబడుతుంది. మరెవరైతే ప్రాపంచిక లాభాల కోసం హిజ్రత్ చేస్తాడో అతనికి అది లభిస్తుంది, అలాగే ఒక స్త్రీని వివాహమాడుటకు వలస పోతే, అతను సంకల్పించిన దాని ప్రకారంగానే ఆ హిజ్రత్ నమోదు చేయబడుతుంది.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ప్రతి కార్యానికీ అంటే ఉదాహరణకు నమాజు, ఉపవాసం, హజ్ యాత్ర మొదలైన వాటన్నింటికీ సంకల్పాన్ని బట్టే ప్రతిఫలం ప్రసాదించబడుతుంది.
2 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు మాత్రమే, మరియు పూర్తి చిత్తశుద్ధితో మాత్రమే ఏ ఆచరణ అయినా చేయాలి.
రెండవ హదీసు:
ప్రశ్న2: ఈ హదీసు పూర్తి చేయండి, «من أحدث في أمرنا هذا ...»? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు: ఉమ్ముల్ మోమినీన్ ఉమ్మే అబ్దుల్లాహ్ ఆయిషహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసి పుచ్చబడుతుంది”.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ధర్మంలో కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను ప్రవేశపెట్టడం నిషేధించబడింది
2 - మతపరమైన ఆవిష్కరణల, నూతన కల్పిత పోకడలపై ఆధారపడిన ఆరాధనలు, చర్యలు తిరస్కరించబడతాయి
మూడవ హదీసు:
ప్రశ్న3:ఈ హదీసును పూర్తి చేయండి, (بينما نحن جلوس عند رسول الله ﷺ ...)? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు : ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: మేము మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాము, అపుడు అక్కడికి తెల్లటి దుస్తులు ధరించి, నల్లటి వెంట్రుకలు కలిగి, ఎటువంటి ప్రయాణ ప్రభావం కనిపించని ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. అతను నేరుగా వెళ్ళి మహనీయ ప్రవక్తకి దగ్గరగా ఆయన మోకాళ్ళకు మోకాళ్ళు ఆన్చి పెట్టి, తన చేతులు తొడలపై పెట్టుకుని కూర్చున్నాడు, పిదప "ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ ఇస్లాం అంటే ఏమిటో నాకు బోధించండి?" అంటూ అడిగాడు. దానికి మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ బదులిస్తూ ‘ఇస్లాం అంటే ‘అల్లాహ్ తప్ప మరొక వాస్తవ ఆరాధ్యుడు లేడు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ అల్లాహ్ యొక్క ప్రవక్త మరియు సందేశ హరుడని నీవు సాక్ష్యమివ్వటం, నమాజులు ఆచరించడం,(స్తోమత ఉంటే )జకాతు చెల్లించడం, రమదాన్’మాసపు ఉపవాసాలు పాటించడం, ఒకవేళ నీకు వెళ్లగలిగే శక్తి, స్తోమత ఉంటే హజ్జ్ యాత్ర చేయడం అని చెప్పారు. దానికి ఆ వ్యక్తి ‘ యదార్థం చెప్పారు’ అన్నాడు, మాకు ఆవిషయం ఆశ్చర్యం కలిగించింది అతను ప్రశ్నిస్తున్నాడు తరువాత జవాబును కూడా దృవీకరిస్తున్నాడే! మళ్ళీ ప్రశ్నిస్తూ ‘నాకు ఈమాన్ అంటే ఏమిటో చెప్పండి అని అడిగాడు, దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘అల్లాహ్ ను, దైవదూతలను, ఆకాశ గ్రంధాలను, ప్రవక్తలను, మరియు పరలోకదినాన్ని నీవు విశ్వసించాలి, దాంతో పాటు విధివ్రాత మంచి ఐనా మరియు చెడు ఐనా ను విశ్వసించాలి, అని చెప్పారు. అతను ‘యదార్ధం చెప్పారు మీరు అన్నాడు. ఆ పై ‘ఇహ్సాన్ ‘ అంటే ఏమిటి ఓ ప్రవక్తా? అని ప్రశ్నించాడు. నువ్వు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అలా చేయలేక పోతే అల్లాహ్ యే నిన్ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆరాధించు అని తెలిపారు దానికి అతను ‘ప్రళయం గురించి బోధించండి’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త ‘ఎవరినైతే ఇది అడుగుతున్నావో అతనికి ప్రశ్నిస్తున్న వాడి కంటే ఈ విషయం లో ఎక్కువ జ్ఞానం లేదు‘ అన్నారు. దానికి అతను అయితే ప్రళయ సూచనలు నాకు చెప్పండి అంటూ ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిస్తూ ‘ఒకటి ‘బానిసరాలు తన యజమానిని జన్మనిస్తుంది, రెండవ సూచన ‘నువ్వు చూస్తావు దుస్తులు లేని, కాళ్ళకు చెప్పులు లేని నగ్నులను, దరిద్రులు పెద్దపెద్ద భవనాలు నిర్మిస్తారు. పిదప ఆ వ్యక్తి వెళ్లి పోయాడు, చాలా సేపు నేను అక్కడే ఉన్నాను. అప్పుడు ప్రవక్త ‘ ఓ ఉమర్ ! నీకు ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా? అని అడిగారు. దానికి నేను ‘అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకే తెలుసును‘ అన్నాను. అపుడు ఆయన ‘నిశ్చయంగా అతను జీబ్రయీల్ అలైహిస్సలామ్ మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చారు' అని తెలియజేశారు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఇస్లాం ధర్మం యొక్క మూలస్థంభాలు (మూల నియమాలు) ఐదు అని గుర్తుంచుకోండి; అవి:
- షహాదతు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ - (అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం).
- వ ఇఖాము స్సలాహ్ - నమాజు ను స్థాపించడం.
- వ ఈతాఇ జ్'జకాహ్ - జకాతు (విధిదానం) చెల్లించడం
- వ సౌము రమజాన్ - రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించడం.
- వ హజ్జ బైతుల్లాహిల్ హరామ్ - హజ్ యాత్ర చేయడం.
2 - అర్కానుల్ ఈమాన్ (విశ్వాస మూల నియమాలు) లను గుర్తుంచుకోండి. అవి ఆరు:
- అల్లాహ్ పై విశ్వాసం.
- దైవదూతలపై విశ్వాసం.
- దైవగ్రంధాలపై విశ్వాసం.
- దైవప్రవక్తలపై విశ్వాసం.
- ప్రళయదినముపై విశ్వాసం.
- మంచి,చెడు ఖదర్ (విధివ్రాత)పై విశ్వాసం.
3 - రుకునుల్ ఇహ్'సాన్ (ఇహ్'సాన్ మూలనియమం). ఇహ్'సాన్ అంటే నీవు అల్లాహ్ ను చూస్తున్నట్లుగా భావిస్తూ ఆయనను ఆరాధించటం. ఒకవేళ నీవు ఆయనను చూస్తున్నట్లు భావించ లేకపోతే, ఆయన నిన్ను చూస్తున్నాడని భావిస్తూ ఆయనను ఆరాధించడం.
4 - ప్రళయదినం సంభవించే సమయం , మహోన్నతుడైన అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ దాని గురించి తెలియదు.
నాల్గొవ హదీసు:
ప్రశ్న4: ఈ హదీసు పూర్తి చేయండి, «أكمل المؤمنين إيماناً ...»? మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు :అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉన్న విశ్వాసులు అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - మంచి నైతికతను ప్రోత్సహించడం.
2 - నైతికత యొక్క పరిపూర్ణత, విశ్వాసం యొక్క పరిపూర్ణతలోని భాగముగా పరిగణించబడుతుంది.
3 - ఈమాన్ (విశ్వాసం) పెరుగుతూ ఉంటుంది, తరుగుతూ ఉంటుంది.
ఐదవ హదీసు:
ప్రశ్న5: ఈ హదీసు పూర్తి చేయండి, «من حلف بغير الله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు: అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేస్తాడో, అతను కుఫ్ర్ (అవిశ్వాసము) లేక షిర్కు (బహుదైవారాధన) కు ఒడిగట్టినట్లే, పాల్బడినట్లే.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
- అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం సరికాదు.
- అల్లాహ్ పై కాకుండా ఇతరులపై ప్రమాణం చేయడం అనేది షిర్క్ అల్ అస్గర్ (అల్పమైన బహుదైవారాధన) గా పరిగణించబడుతుంది.
ఆరవ హదీసు:
ప్రశ్న6: ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى أكون أحب إليه ...» ఈ హదీసు ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి:
జవాబు : అనస్ ఇబ్నె మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “మీలో ఏ వ్యక్తి అయినా తన ఆలుబిడ్డలకన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవులకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ అతను విశ్వాసి కాజాలడు".
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
- మొత్తం మానవజాతి కంటే అధికంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రేమించవలెను.
- అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఏడవ హదీసు:
ప్రశ్న7: ఈ హదీసు పూర్తి చేయండి, «لا يؤمن أحدكم حتى يحب لأخيه ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు :అనస్ ఇబ్నె మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు స్వయంగా తమ కోసం ఏదైతే కోరుకుంటారో, అలాంటిదే తన సోదరుని కోసం కూడా కోరుకునేంత వరకు, మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
- ఒక విశ్వాసి తనకు మంచి జరగడాన్ని ఎలా ఇష్టపడతాడో, అలాంటి మంచి ఇతర విశ్వాసుల కొరకు కూడా జరగడాన్ని ఇష్టపడాలి.
- అది పరిపూర్ణమైన విశ్వాసాన్ని సూచిస్తుంది.
ఎనిమిదవ హదీసు:
ప్రశ్న8: ఈ హదీసు పూర్తి చేయండి, «والذي نفسي بيده! ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు : అబీ సయీద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఎవరి చేతిలోనైతే నా ప్రాణము ఉన్నదో ఆయన సాక్షిగా, ఇది (సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం) ముూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - సూరతుల్ ఇఖ్లాస్ యొక్క ఘనత, విశిష్ఠత, ఔన్నత్యము.
2 - సూరతుల్ ఇఖ్లాస్ పారాయణం, మూడో వంతు ఖుర్ఆన్ పారాయణంతో సమానము.
తొమ్మిదవ హదీసు:
ప్రశ్న9: ఈ హదీసు పూర్తి చేయండి, «لا حول ولا قوة إلا بالله ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు : అబీ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అనే గొప్ప పలుకులు స్వర్గం యొక్క ఖజానాలలో ఒక నిధి.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఈ పలుకుల ఘనత ఎంత గొప్పది అంటే అది స్వర్గపు ఖజానాలలో ఒక నిధి.
2 - తన శక్తిసామర్ధ్యాలపై ఆధార పడకుండా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పై మాత్రమే ఆధారపడటం.
పదవ హదీసు:
ప్రశ్న10: ఈ హదీసు పూర్తి చేయండి, «ألا إن في الجسد مضغة...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు : నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను: నిజానికి, శరీరంలో ఒక మాంసం ముక్క ఉన్నది; అది సరైన దారిలో ఉంటే, శరీరం మొత్తం సరైన దారిలోనే ఉంటుంది. ఒకవేళ అది భ్రష్టుపడితే, శరీరం మొత్తం అవినీతిమయం అయిపోతుంది. నిశ్చయంగా, అదే హృదయం.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - హృదయం సరైన దారిలో ఉండటం అనేది ఒక వ్యక్తిని బాహ్యంగానూ (మాటలలో, చేతలలో) మరియు ఆంతరంగీకంగానూ (ఆలోచనలో, సంకల్పంలో) సరైన దారిలో ఉండేలా చేస్తుంది.
2 - హృదయాన్ని సరైన దారిలో ఉంచటంపై శ్రద్ధ చూపడం, ఎందుకంటే మనిషి నిజాయితీ దానిపైనే ఆధారపడి ఉంటుంది.
పదకొండవ హదీస్:
ప్రశ్న11: ఈ హదీసు పూర్తి చేయండి, «من كان آخر كلامه من الدنيا:لا إله إلا الله» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు: మఆజ్ బిన్ జబల్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవరైతే చివరిగా (మరణం ఆసన్నమైనపుడు) "లా ఇలాహ ఇల్లల్లాహు అంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవడూ లేడు" అని పలుకుతాడో, అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుల ఘనత, ఆ పలుకుల ఔన్నత్యం కారణంగా ఒక దాసుడు స్వర్గంలో ప్రవేశించగలడు.
2 - ఈ ప్రాపంచిక జీవితంలో ఒకరి చివరి పలుకులు లా ఇలాహ ఇల్లల్లాహ్ కావడంలోని శ్రేష్ఠత.
పన్నెండవ హదీసు:
ప్రశ్న12: ఈ హదీసు పూర్తి చేయండి, «ليس المؤمن بالطعان، ولا اللعان ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు :అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: విశ్వాసి అనేవాడు ‘దెప్పిపొడవడం, శపించడం, సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం మొదలైన దుర్గుణాలకు ఎంతో దూరంలో ఉంటాడు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
- అన్ని తప్పుడు మరియు అసభ్య పలుకుల నుండి వారింపు.
విశ్వాసి పలుకులు ఎలా ఉండాలో వివరించబడింది.
పదమూడవ హదీసు:
ప్రశ్న13: ఈ హదీసు పూర్తి చేయండి, «من حسن إسلام المرء ...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు : అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: తమకు సంబంధించని విషయాలలో తలదూర్చక పోవడం అనేది (అంటే వాటిని వదిలివేయడం) అనేది ఒక ఉత్తమ ముస్లిం యొక్క లక్షణం.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఇతరుల ధార్మిక లేదా ప్రాపంచిక విషయాలలో జోక్యం చేసుకోకూడదు.
2 - ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం అనేది ఒకరి పరిపూర్ణ ఇస్లాంలో భాగం
పధ్నాలగవ హదీసు*:
ప్రశ్న14: ఈ హదీసు పూర్తి చేయండి, «من قرأ حرفاً من كتاب الله...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
జవాబు : అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త్ర (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికారు: ఎవరైతే అల్లాహ్ యొక్క గ్రంధము (ఖుర్ఆన్) నుండి ఒక అక్షరం పారాయణం చేస్తారో, అతనికి ఒక పుణ్యం లభిస్తుంది. ఆ ఒకటి పది పుణ్యాలంత ప్రతిఫలాన్ని ఇస్తుంది. అలిఫ్, లామ్, మీమ్ మూడింటినీ కలిపి ఒకే అక్షరమని అనవద్దు గానీ అలిఫ్ ఒక అక్షరము, లామ్ ఒక అక్షరము మరియు మీమ్ మరొక అక్షరము (గా పరిగణించబడతాయని) అనండి.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
1 - ఖుర్ఆన్ పారాయణం యొక్క ఘనత
2 - ఖుర్ఆన్ లో నుండి చదివే ప్రతి అక్షరానికి బదులుగా మీ కొరకు ఎన్నో పుణ్యాలున్నాయి.
*******
ఇస్లామీయ నైతిక ప్రవర్తనల విభాగం
మర్యాదలు, సంస్కారాల జ్ఞానం
ఇస్లామీయా మర్యాదలు: ఇవి మంచి వైఖరులు, ఆచరణలు మరియు ప్రవర్తనల సమాహారం, ఇవి ఇస్లామీయ షరియాలో సూచించబడ్డాయి. ఇందులో అల్లాహ్ పట్ల మర్యాదలు మరియు ఆయన సృష్టు రాశుల పట్ల ఉండే మర్యాదలు ఉన్నాయి.
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల మర్యాదలు:
ప్రశ్న1: మహోన్నతుడైన అల్లాహ్ పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
జవాబు: 1 - ఆయనను సృష్టిలోని అందరి కంటే, అన్నింటి కంటే మహోన్నతుడని మరియు ఆయన కొరతలకు, లోపాలన్నింటికీ అతీతుడని మనస్పూర్తిగా నమ్మడం, గౌరవించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {వారు అల్లాహ్ సామర్ధ్యాన్ని గుర్తించ వలసిన విధంగా గుర్తించలేదు; పునరుత్థాన దినమున భూమి అంతా ఆయన పిడికిలిలో ఉంటుంది; మరియు ఆకాశాలన్నీ చుట్టబడి ఆయన కుడిచేతిలో ఉంటాయి. ఆయన సర్వలోపాలకు అతీతుడు మరియు వారు కల్పించే భాగస్వాముల కంటే అత్యున్నతుడు.} [జుమర్ : 67]
2 - ఆయనకు ఎవ్వరినీ, దేనినీ సాటి లేదా భాగస్వామ్యం కల్పించకుండా ఉండటం. కేవలం తనను మాత్రమే ఆరాధించేందుకు గానూ ఆయన మనల్ని సృష్టించాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని} [బయ్యిన : 5]
3 - ఆయనకు విధేయత చూపడం మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు విధేయులై ఉండండి} [ముహమ్మద్ : 33]
4 - ఆయనకు అవిధేయత చూపడం నుండి దూరంగా ఉండటం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు ఎవడైతే, అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు అవిధేయుడై, ఆయన హద్దులను అతిక్రమిస్తాడో! అలాంటి వాడు నరకాగ్నిలోకి ప్రవేశింపబడతాడు అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు. మరియు అతడికి అవమానకరమైన శిక్ష ఉంటుంది.} [నిసా : 14]
5 - ఆయన పట్ల కృతజ్ఞతాభావం చూపుతూ, ఆయన ప్రసాదిస్తున్న లెక్కలేనన్ని సహాయాలు మరియు అనుగ్రహాలకు బదులుగా ఆయనను స్తుతించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: { మీరు అల్లాహ్ నే ఆరాధించే వారైతే అల్లాహ్ అనుగ్రహాలకు కృతజ్ఞతలు చూపండి.} [అన్ నహ్ల్ : 114]
6 - ఆయన నిర్ణలయాపై సహనంతో ఉండటం. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు సహనం వహించండి నిశ్చయంగా అల్లాహ్ సహనం వహించే వారితో ఉంటాడు.} [అల్-అన్'ఫాల్ :46]
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మర్యాదలు:
ప్రశ్న2: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
జవాబు: 1- ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ఆదర్శంగా తీసుకుని, ఆయన జీవిత విధానాన్ని (సున్నతులను) మనస్పూర్తిగా అనుసరించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది, వారి కొరకు ఎవరైతే అల్లాహ్ మరియు అంతిమ దినాన్ని ఆశిస్తారో మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరిస్తారో!} [అల్ అహ్'జాబ్ : 21]
2 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు విధేయత చూపడం
3 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కు అవిధేయత చూపడమును వదిలివేయటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {ఎవడు ప్రవక్తకు విధేయత చూపుతాడో వాస్తవంగా అతడు అల్లాహ్ కు విధేయత చూపినట్లే. మరియు కాదని వెనుదిరిగి పోతే వారిని అదుపులో ఉంచటానికి (కావలివానిగా) మేము నిన్ను పంపలేదు.} [నిసా : 80]
4. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన దానిని మనస్పూర్తిగా విశ్వసించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు.3 అది (అతను పలుకుతున్నది), అతనిపై అవతరింప జేయబడిన వ'హీ (దివ్యజ్ఞానం) తప్ప మరింకేమీ కాదు.} [అన్ నజ్మ్ : 3 - 4]
5 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులకు కొత్త కల్పిత విషయాలను, నూతన పోకడలను చేర్చకుండా ఉండటం. ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: “ఎవడయినా మా ఈ ధర్మం విషయంలో దీనికి సంబంధించని కొత్త విషయమేదైనా ఆవిష్కరిస్తే అది త్రోసిపుచ్చబడుతుంది”.
6 - స్వయం కంటే ఎక్కువగా మరియు మొత్తం మానవాళి కంటే (సృష్టిలోని ప్రతిదాని కంటే) ఎక్కువగా ఆయన ను ప్రేమించడం ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: “మీలో ఏ వ్యక్తి అయినా తన ఆలుబిడ్డలకన్నా, తన తల్లిదండ్రుల కన్నా, సమస్త మానవులకన్నా ఎక్కువగా నన్ను ప్రేమించనంత వరకూ అతను విశ్వాసి కాజాలడు".
7 - ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతులను గౌరవించడం మరియు వాటికి పూర్తి మద్దతును ఇవ్వడం అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఎందుకంటే (ఓ ముస్లింలారా!) మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించాలనీ మరియు మీరు అతనితో (ప్రవక్తతో) సహకరించాలనీ మరియు అతనిని గౌరవించాలనీ} [ఫతహ్ : 9 ]
తల్లిదండ్రుల యొక్క మర్యాదలు:
3: తల్లిదండ్రుల పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
జవాబు: 1 - షరిఅతుకు విరుద్ధం కానంత వరకు, ఏ విషయంలోనైనా వారికి విధేయత చూపడం.
2 - తల్లిదండ్రులకు సేవ చేయడం.
3 - తల్లిదండ్రులకు సహాయ పడటం.
4 - తల్లిదండ్రుల అవసరాలు పూర్తి చేయడం.
5 - తల్లిదండ్రుల కొరకు దుఆ చేయడం.
6 - వారితో ఎల్లప్పుడూ మర్యాదపూర్వకంగా మాట్లాడటం, చికాకును వ్యక్తం చేసే "ఉఫ్" అనే చిన్న పదం కూడా పెదవులపై రావడం అనుమతించబడదు.
7 - నవ్వుతూ వారి వైపు చూడటం, వారి వైపు చిరాకుగా, తీక్షణంగా చూడటం నిషేధించబడింది.
8 - వారితో మాట్లాడేటప్పుడు గొంతు పెంచకుండా ఉండటం. మధ్యలో ఎలాంటి అంతరాయం కల్పించకుండా వారి మాటలు పూర్తిగా వినడం. వారిని పేర్లతో పిలవకుండా, బదులుగా "నాన్న" మరియు "అమ్మ" అని పిలవడం.
9 - వారు తమ గదిలో ఉన్నప్పుడు, అందులో ప్రవేశించే ముందు వారి అనుమతి కోరడం.
10 - వారి నుదుటిని మరియు చేతులను ముద్దు పెట్టడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు నీ ప్రభువు: తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదనీ మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలనీ, ఆజ్ఞాపించి ఉన్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గానీ, లేదా వారిరువురు గానీ ముసలివారైతే, వారితో విసుక్కుంటూ: "ఛీ! (ఉఫ్)" అని కూడా అనకు మరియు వారిని గద్దించకు మరియు వారితో మర్యాదగా మాట్లాడు.23 మరియు వారి మీద కరుణ మరియు వినయవిధేయతల రెక్కలను చాపు మరియు వారి కొరకు ఇలా ప్రార్థించు: "ఓ నా ప్రభూ! వారు ఏ విధంగా నన్ను బాల్యంలో పెంచారో అదే విధంగా నీవు వారి యెడల కరుణను చూపు!} [అల్ ఇస్రా: 23 - 24]
- హదీస్లో ఇలా ఉంది ఒక వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జిహాద్ కోసం అనుమతి అడగడానికి వచ్చాడు, అప్పుడు ఆయన ఇలా పలికారు : «నీకు తల్లి తండ్రులు ఉన్నారా?» అతను అవును అని సమాధానమిచ్చాడు. ఆయన అతనితో: «వారిలో జిహాద్ చేయి అన్నారు»
రక్తసంబంధీకుల యొక్క మర్యాదలు:
4: రక్తసంబంధీకుల పట్ల మనం ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
జవాబు: 1 - సోదరసోదరీమణులు, బాబాయి, మేనత్త, మేనమామ, పిన్ని మొదలైన బంధువులను సందర్శించడం ద్వారా రక్తసంబంధాలను కొనసాగించాలి.
2 - మాటలలోనూ, చేతలలోనూ వారి పట్ల దయ చూపుతూ వారికి సహాయం అందించడం.
3 - వారికి ఫోన్ చేసి, వారి మంచిచెడ్డలు, బాగోగులు కనుక్కోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {(వారితో ఇలా అను): "ఏమీ? మీరు (అల్లాహ్) ఆజ్ఞాపాలనకు విముఖులై, మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా?"} [ముహమ్మద్: 22]
- మరియు హదీసులో ఇలా ఉంది: “బంధుత్వాలను త్రెంచుకునే వాడు స్వర్గంలో ప్రవేశించలేడు”.
ఇస్లాంలో సోదరాభావం యొక్క మర్యాదలు.
5: నేను నా సోదరులు మరియు స్నేహితుల పట్ల ఎలాంటి మర్యాదలు కలిగి ఉండాలి?
జవాబు: 1 - నేను మంచి వ్యక్తులను ప్రేమించాలి మరియు వారిని స్నేహితులుగా ఎంచుకోవాలి.
2 - నేను చెడు వ్యక్తుల సహవాసానికి దూరంగా ఉండాలి. హదీసులో ఇలా ఉన్నది: "నువ్వు విశ్వాసిని మాత్రమే స్నేహితుడిగా చేసుకో, మరియు నీ ఆహారం భక్తిపరుడే తినాలి."
3 - నేను తోటి సోదరులకు సలాం చేయాలి మరియు కరచాలనం చేయాలి. హదీసులో ఇలా ఉన్నది: ఇద్దరు ముస్లిములు కలుసుకుని ఒకరికొకరు కరచాలనం చేసుకున్నప్పుడు అక్కడి నుండి విడిపోవడానికి ముందే వారి పాపాలు ప్రక్షాళించబడుతాయి.
4 - నేను వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి మరియు వారి స్వస్థత కొరకు అల్లాహ్ ను వేడుకోవాలి.
5 - నేను తుమ్మిన వ్యక్తి కొరకు "యర్హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక) అని ప్రార్థించాలి.
6 - నేను తమను సందర్శించమని ఆహ్వానించిన వారి ఆహ్వానాన్ని స్వీకరించాలి. హదీసులో ఇలా ఉన్నది: “ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు తీసుకుపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”.
7 - నేను వారికి అవసరమైనప్పుడు, మంచి సలహాలు ఇవ్వాలి. హదీసులో ఇలా ఉన్నది : ఎవరైన తన సోదరునికి ఏదైన విషయం గురించి వేరేది సరైనదని తెలిసి కూడా సూచిస్తే అతడు ఖియానత్ చేశాడు.
8 - నేను వారికి అన్యాయం జరిగినప్పుడు వారిని ఆదుకోవాలి మరియు ఇతరులను అణచియకుండా వారిని అడ్డుకోవాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:- నీ సహోదరుడు దౌర్జన్యుడైనా లేదా దౌర్జన్యపాలైనవాడైన సరే అతనికి సహాయం చేయి’చెప్పారు,ఒకవ్యక్తి‘ఓ దైవప్రవక్త !దౌర్జన్యపాలైన వాడికి సహాయం చేయగలము కానీ దౌర్జన్యం చేసేవాడికి ఎలా సహాయం చేయాలి?అని ప్రశ్నించాడు అప్పుడు ప్రవక్త ‘దౌర్జన్యం చేసే వాడి ఆదౌర్జన్యాన్ని ఆపండి అడ్డుకోండి నిశ్చయంగా అదే అతనికి మీరు చేసే సహాయము’అని బోదించారు.
9-నేను నా స్వంతానికి ఇష్టపడిన దానిని నా ముస్లిం సోదరుని కొరకు కూడా ఇష్టపడతాను. హదీసులో అనస్ ఇబ్న్ మాలిక్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: స్వయంగా తమ కోసం ఏదైతే కోరుకుంటారో, అలాంటిదే తన సోధరుని కోసం కూడా కోరుకునేంత వరకు, మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు.
10 - నా సహాయసహకారాలు అవసరమైనప్పుడు వారికి నేను సహాయ సహకారాలు అందించాలి. హదీసులో ఇలా ఉన్నది : "మరియు దాసుడు తన సోదరుడికి సహాయం చేసినంత కాలం అల్లాహ్ దాసుడికి సహాయం చేస్తాడు."
11 - మాటల ద్వారా, చేతల ద్వారా వారికి నేను హాని కలిగించకూడదు. హదీసులో ఇలా ఉన్నది: వాస్తవ 'ముస్లిము'ఎవరంటే -అతని చేతితో, నోటితో ముస్లిములు పరిరక్షించబడతారు.
12 - నేను వారి రహస్యాలను గోప్యంగా ఉంచాలి. హదీసులో ఇలా ఉన్నది: «ఒక వ్యక్తి ఏదైన మాట చెప్పి ఆ తరువాత తిరిగి వెళ్లిపోతే ఆ మాట అమానత్ అవుతుంది.»
13 - వారిని అవమానించడం, దూషించడం, తృణీకరించడం, వారి ఎదుగుదలను చూసి అసూయపడడం, వారిపై గూఢచర్యం చేయడం లేదా వారిని మోసం చేయడం వంటివి నేను మానుకోవాలి.
హదీసులో ఇలా ఉన్నది: ఒకముస్లిమ్ మరొక ముస్లింకు సోదరుడు దౌర్జన్యం చేయవద్దు, అగౌరవపర్చవద్దు, దుత్కరించవద్దు మరియు చిన్నచూపుతో అసహ్యించవద్దు, తోటి ముస్లిం సోదరుణ్ణి చులకనగా చూడటం చాలు అతను చెడ్డవాడు అని చెప్పటానికి.
ఇరుగు పొరుగువారి పట్ల నైతిక ప్రవర్తన:
ప్రశ్న6: ఇరుగు పొరుగువారి పట్ల నైతిక ప్రవర్తనలు ఏమిటి?
జవాబు: 1 - నేను ఇరుగుపొరుగువారి పట్ల మాటలలో మరియు చేతలలో దయ చూపడం మరియు అవసరమైనప్పుడు వారికి సహాయం అందించడం.
2 - ఈద్ పండుగలు, వివాహం మొదలైన సంతోషకరమైన శుభ సందర్భాలలో వారిని నేను అభినందించాలి.
3 - వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారిని పరామర్శించాలి మరియు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చాలి.
4 - మంచి వంటకాలు వండినపుడు, వీలైనంత వరకు దానిని వారికి కూడా పంపాలి.
5 - నేను మాటలతో, చేతలతో వారికి హాని కలిగించకూడదు.
6 - పెద్ద శబ్దాలతో వారిని గాభరాపెట్టకుండా, వారిపై నిఘాలు వేయకుండా ఉండాలి. వారితో సహనంతో మెలగాలి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవ్వరినీ ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి. మరియు తల్లిదండ్రులతో, దగ్గరి బంధువులతో అనాథులతో, నిరుపేదలతో, బంధువులైన పొరుగువారితో, అపరిచితులైన పొరుగువారితో, ప్రక్కనున్న మిత్రులతో, బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదార స్వభావంతో వ్యవహరించండి. నిశ్చయంగా, అల్లాహ్ గర్వితుణ్ణి, బడాయీలు చెప్పుకునే వాణ్ణి ప్రేమించడు.} [నిసా : 36]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: «ఓ అబూజర్ మీరు కూర వండినప్పుడు, దానిలో మరిన్ని నీళ్లు వేసి, మీ పొరుగు వారిని పట్టించుకోండి.»
హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : «ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో తన పొరుగువారిని బాధ పెట్టకూడదు.»
ఆతిథ్య మర్యాదలు:
7: అతిథులు మరియు ఆతిథ్యం ఇచ్చేవారు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - అతిథిగా ఆహ్వానించిన వ్యక్తి ఆహ్వానాన్ని నేను స్వీకరించాలి.
2 - నేను ఎవరినైనా సందర్శించాలనుకుంటే, వారి అనుమతిని మరియు సందర్శన సమయాన్ని కోరాలి.
3 - నేను ప్రవేశించే ముందు అనుమతి కోరాలి.
4 - నేను సందర్శన సమయంలో అక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేయకూడదు.
5- నేను ఇంటి వారి నుంచి నా చూపులను కిందికి ఉంచాలి.
6 -నేను అతిథిని ఆహ్వానించి, అతనిని ఉత్తమంగా స్వాగతించాలి, ముఖంలో చిరునవ్వుతో మరియు ఉత్తమమైన ఆతిథ్య పదాలతో.
7 - నేను అతిథిని ఉత్తమ స్థానంలో కూర్చోబెట్టాలి
8-నేను అతనికి ఆహార పానీయాలతో ఆతిథ్యం ఇవ్వాలి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఓ విశ్వాసులారా! మీ ఇండ్లు తప్ప, ఇతరుల ఇండ్లలోనికి వారి అనుమతి లేకుండా మరియు ఆ ఇంటివారికి సలామ్ చేయకుండా ప్రవేశించకండి. ఈ పద్ధతి మీకు అతి ఉత్తమమైనది మీరు ఈ హితోపదేశం జ్ఞాపకం ఉంచుకుంటారని ఆశింపబడుతోంది!} [నూర్ : 27]
హదీసులో ఇలా ఉన్నది: «అల్లాహ్ అనుమతి అడగడాన్ని కేవలం దృష్టి (పడకుండా ఉండటం) కోసం చేసాడు»
- మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సూక్తి: «ఎవరైతే అల్లాహ్ ను మరియు పరలోక దినాన్ని విశ్వసిస్తాడో అతను తన అతిథి గౌరవించాలి.»
వ్యాధిగ్రస్తుని మర్యాదలు:
ప్రశ్న8: వ్యాధిగ్రస్తుని మర్యాదలు మరియు రోగిని పరామర్శించడంలో చూప వలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - నొప్పి ఉన్న చోట కుడి చేయి ఉంచి, "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరిట) అని మూడుసార్లు పలకండి. ఆ తర్వాత ఇలా దుఆ చేయండి: "అవుదు బిఇజ్జతిల్లాహి వ ఖుద్రతీహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిర్" (నేను గుర్తించిన మరియు భయపడుతున్న వాటికి వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క తేజస్సు మరియు శక్తిలో శరణు పొందుతున్నాను) - ఏడు సార్లు పఠించాలి.
2 - అల్లాహ్ నిర్ణయించిన దాని పట్ల సంతృప్తిగా మరియు సహనంతో ఉండాలి. ప్రామాణిక హదీసులో ఉమ్ముల్ అలా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ఆమె ఇలా తెలిపారు : నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు ఆయన ఇలా తెలిపారు: «ఆనందించు ఓ ఉమ్ముల్-అలా! నిశ్ఛయంగా ముస్లిం రోగం ద్వారా అల్లాహ్ అతని పాపాలను అగ్ని బంగారం మరియు వెండి మలినాన్ని తొలగించినట్లు తొలగిస్తాడు.»
3 - రోగిని సందర్శించడంలో త్వరపడాలి, రోగి కోసం ప్రార్థించాలి మరియు రోగి వద్ద ఎక్కువసేపు ఆగకుండా ఉండాలి.
4 - వ్యాధిగ్రస్తులు అడగకుండానే రుఖ్యహ్ (ఖుర్అన్ మరియు సున్నతుల ద్వారా వైద్యం చేసే పద్ధతి) చేయాలి.
5 - రోగిని ఓపికగా ఉండమని మరియు ప్రార్థనలు, నమాజులు మరియు తహారతుకు కట్టుబడి ఉండమని ఉపదేశించాలి.
6- రోగి కొరకు చేయవలసిన దుఆ: అస్'అలుల్లాహల్ అజీమ్, రబ్బిల్ అర్'షిల్ అజీమ్, అన్ యష్'ఫీక్ (నీకు స్వస్థత చేకూర్చమని మహోన్నత పీఠానికి అధిపతి, సర్వోన్నతుడైన అల్లాహ్ ను నేను అర్థిస్తున్నాను) అని ఏడు సార్లు పఠించాలి.
జ్ఞానార్జనలో పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న9- జ్ఞానార్జనలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - సంకల్పాన్ని సంపూర్ణ చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం హదీసులో ఇలా ఉన్నది : "ఎవరైతే జ్ఞానాన్ని పండితుల ముందు గొప్పతనం ప్రదర్శించడానికి, మూర్ఖులతో పోటీ పడేందుకు, లేదా ప్రజల దృష్టిని తన వైపు మళ్లించేందుకు నేర్చుకుంటాడో, అల్లాహ్ అతనిని నరకంలో ప్రవేశింపజేస్తాడు."
2 - నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి. హదీసులో ఇలా ఉన్నది: “పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు. -ఆ విషయాలలో ఒకటి ప్రస్తావించారు - అతని జ్ఞానం గురించి, దానితో అతను ఏం చేశాడు?"
3 - గురువును అతని సమక్షంలో మరియు పరోక్షంలో గౌరవించాలి మరియు అతనిని సత్కరించాలి.
4 - అతని సమక్షంలో వినమ్రతతో, అణుకువతో కూర్చోవాలి.
5 - గురువుకు మధ్యలో అంతరాయం కలగజేయకుండా శ్రద్ధగా వినాలి.
6 - గురువును మర్యాదతో ఉత్తమ పద్ధతిలో తన సందేహాలు అడిగి తెలుసుకోవాలి.
7 - గురువును పేరు పెట్టి పిలవ కూడదు. హదీసులో ఇలా ఉన్నది : "నిశ్ఛయంగా ముస్లిం వృద్ధులను మరియు ఖుర్ఆన్ హాఫిజ్ లను గౌరవించటం అల్లాహ్‌ను గౌరవించడం లో నుంచి అవుతుంది."
సమావేశంలో పాటించవలసిన మర్యాదలు:
10: సమావేశాలలో పాటించ వలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - సభలో ప్రజలకు అభివాదం (సలాం) చేయడం.
2 - ఎవరి సీటూ ఖాళీ చేయమని అడగకుండా అందుబాటులో తనకు దగ్గరగా ఉన్న మొదటి ఖాళీ సీటులో కూర్చోవడం, ఉభయుల అనుమతితో తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చోక పోవడం.
3 - ఇతరులు కూడా కూర్చునేలా సర్దుబాటు చేయడం.
4 - ఇతరుల మాటలకు అంతరాయం కలిగించకూడదు.
5 - సమావేశం విడిచి బయలుదేరే ముందు ప్రజలకు అభివాదం (సలాం) చేయడం మరియు వారి అనుమతి తీసుకోవడం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు: ‘ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తిని లేపి తిరిగి అతని స్థానం లో కూర్చోవటం నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు, కూర్చో దలిస్తే అతనికి స్థానం కల్పిస్తూ ప్రదేశాన్నివిస్తారించాలి
హదీసులో ఇలా ఉన్నది : సమావేశం ముగిసినప్పుడు సలాం చేయాలి అలాగే లేచి వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసి వెళ్ళాలి మొదటి సలాం కు రెండవ సలాం పై ఎటువంటి ప్రాముఖ్యత లేదు(అనగా రెండు ప్రదానమైనవే)
6 - సభ ముగియగానే జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కఫ్ఫారతు మజ్లిస్ ఇలా దుఆ చేయడం: సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.
నిద్రించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న11: నిద్రించేటప్పుడు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - త్వరగా నిద్రపోవడం హదీసు : అబూ బర్జా రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజుకు ముందు పడుకోవటాన్ని, ఇషా తర్వాత కబుర్లు చెప్పుకోవటాన్ని అసహ్యించుకునేవారు.
2 -వుజూ (ఆచరణ స్వచ్ఛత) స్థితిలో నిద్రించడం.
3 - వెల్లకిలా పొట్ట మీద నిద్ర పోకూడదు.
4 - కుడిచేతిని కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకోవడం.
5 - పడుకునే ముందు పక్క మీద దుమ్ము దులపడం.
హదీసులో ఇలా ఉన్నది: బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: నీవు నీ పడకపైకి పోయేటప్పుడు నమాజు కొరకు చేసేలా వుజూ చేయి పిదప కుడి ప్రక్కపై పడుకో.
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ఆయన అన్నారు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని తన పొట్టపై పడుకుని ఉండగా చూశారు, అప్పుడు ఆయన ఇలా అన్నారు: "ఈ విధమైన పడుకోవడం అల్లాహ్‌కు ఇష్టం కాదు."
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో ఎవరైతే నిద్రించడానికి ఉపక్రమిస్తారో వారు పడకలని తమ నడుము వస్రాల లోపటి క్రింది భాగం తో దులపండి,ఎందుకంటే అతను వెళ్ళాక దానిపై ఏం వచ్చి పడిందో తెలీదు
6 - నిద్రకు ఉపక్రమించే వేళ చేసే ప్రార్థనలు : అయత్ అల్-కుర్సీ ఒకసారి మరియు సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్నాస్, ఒక్కొక్కటి మూడుసార్లు పఠించాలి. ఆ తరువాత ఇలా ప్రార్థిస్తూ, పడుకోవాలి: "బిస్మిక అల్లాహుమ్మా అముతు వ అహ్యా" (ఓ అల్లాహ్! నీ పేరుతో నేను చనిపోతాను మరియు మరలా బ్రతుకుతాను)
7 - తెల్లవారుజామున ఫజ్ర్ నమాజు కొరకు మేల్కొనడం.
8 - నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థించాలి: "అల్'హమ్'దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్" (మన నుండి తీసుకున్న తర్వాత మరలా మనకు జీవితాన్ని ఇచ్చిన అల్లాహ్ కే సకల స్తోత్రాలు మరియు ప్రళయదినాన ఆయన వైపునకే మరలుతాము)
భుజించడంలో పాటించవలసిన మర్యాదలు:
12:భుజించడంలో పాటించవలసిన మర్యాదలు ఏవి?
జవాబు:1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపేందుకు అవసరమైన శక్తి పొందటానికి అన్నపానీయాలు సేవిస్తున్నాననే సంకల్పం చేయుకోవడం
2 - భుజించడానికి ముందు చేతులు కడుక్కోవడం.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: తినాలని, త్రాగాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు చేతులను కడిగి ఆ తరువాత తినాలి, త్రాగాలి.
3 - భుజించడానికి ముందు ఇలా ప్రార్థించాలి: "బిస్మిల్లాహ్" (అల్లాహ్ పేరుతో). కుడిచేత్తో మరియు పళ్ళెంలో తనకు సమీపంలో ఉన్నదాని నుండి తినాలే గానీ, పళ్ళెం మధ్యలో లేదా ఇతరుల ముందు ఉన్న దాని నుండి కాదు.
4 - భుజించడానికి ముందు "బిస్మిల్లాహ్" అని చెప్పడం మరచిపోయిన సందర్భంలో, ఇలా పలకాలి: "బిస్మిల్లాహి అవ్వలుహు వ ఆఖిరుహు" (అల్లాహ్ పేరుతో, ఆరంభంలోనూ మరియు అంతంలోనూ).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: మీలో నుండి ఎవరైన తినడం ప్రారంభించేటప్పుడు "బిస్మిల్లాహ్” (అల్లాహ్ పేరుతో) అని పలకాలి. ఒకవేళ మరచిపోయి మధ్యలో జ్ఞాపకం వస్తే "బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి” (అల్లాహ్ పేరుతో (అన్నం తింటున్నాను) దీని ప్రారంభము నుండి ఆఖరు నుండి) అని పలకాలి.
5 - లభించిన భోజనంతో తృప్తి పడటం, దానిని విమర్శించకుండా ఉండడం అంటే ఇష్టం ఉంటే తినాలి, లేకుంటే వదిలేయాలి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : 'మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ భోజనంలో ఎన్నడూ లోపం చూపించేవారు కాదూ నచ్చితే తినేవారు నచ్చకపోతే వదిలేసేవారు.
6 -కొన్ని ముద్దలు మాత్రమే తినడం మరియు అతిగా తినకుండా ఉండడం.
హదీసులో ఇలా ఉన్నది : ఆదమ్ సంతానం తన పొట్టను నింపినంతగా మరే పాత్ర ను నింపలేదు, మనిషి కొన్ని ముద్దలు తింటే చాలు అతని వెన్నును నిటారుగా ఉంచండములో తోడ్పడుతుంది, అధికంగా తినాలని కోరితే మూడింట ఒక వంతు భోజనం కోసం, మరొకవంతు నీటికోసం, ఇంకో వంతు శ్వాస కోసం వదిలిఉంచాలి.
7 - భోజనం లేదా పానీయంలో ఊదకూడదు మరియు అది చల్లబడే వరకు వేచి ఉండాలి.
హదీసులో ఇలా ఉన్నది: "ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆహారంలో లేదా పానీయంలో ఊదటం నిషేధించారు."
8 - తన కుటుంబంతో లేదా అతిథులతో కలిసి తినడం.
- ఒక హదీసులో ఇలా ఉన్నది ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను మేము ఎంత తిన్నా మా కడుపు నిండటం లేదు అన్నాడు దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా: బహుశా మీరు విడివిడిగా తింటున్నారేమో. భోజనం చేసేటప్పుడు అందరూ ఒకచోట కూర్చుని అల్లాహ్ నామస్మరణ తో బుజించండి అల్లాహ్ మీకోసం అందులో సమృద్దిని బర్కత్ ను ఒసగుతాడు’
9 - పెద్దలు తినడం ప్రారంభించక ముందే మీరు తినడం మొదలు పెట్టకూడదు.
10 - ఏదైనా పానీయం, మంచినీళ్ళు త్రాగే ముందు అల్లాహ్ పేరుతో ప్రారంభించడం, కూర్చుని మూడు గుక్కల్లో త్రాగడం.అందులో ఊదకుండా ఉండటం.
హదీసు: "మీలో ఎవరైన తాగుతున్నపుడు, పాత్రలో శ్వాస వదలకూడదు."
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: "నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నిలుచుని తాగడాన్ని నివారించారు."
- హదీసు: నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నీటిని మూడు శ్వాసాల్లో త్రాగేవారు’
11 - భుజించిన లేదా త్రాగిన తర్వాత అల్లాహ్ ను స్తుతించడం.
వస్త్రధారణలో పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న 13: వస్త్రధారణలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1- అల్లాహ్ ను స్తుతిస్తూ, కుడివైపు నుండి వస్త్రధారణ ప్రారంభించడం.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: మీరు దుస్తులు ధరించేటప్పుడు మరియు, వజూ చేసేటప్పుడు కుడి చేతి నుండి ఆరంభించండి.
2 - వస్త్రం, చీలమండలం క్రింద వరకు వేలాడేంత పొడువుగా ఉండకూడదు.
హదీసులో ఇలా ఉన్నది: కాలి గిలకలకన్నా క్రిందికి వ్రేలాడే ధోవతీ (లుంగీ, షరాయి) భాగం నరకాగ్నికి ఆహుతి అవుతుంది. కాబాని అనేవి పాదాల రెండువైపులనూ పొంగి ఉన్న ఎముకల భాగాలు."
3 - అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరించకూడదు. అలాగే అమ్మాయిలు అబ్బాయిల దుస్తులు ధరించకూడదు.
హదీసులో ఇలా ఉన్నది: ఒక పురుషుడు స్త్రీ యొక్క వస్త్రాదారణ చేయడాన్ని అలాగే ఒక స్త్రీ పురుషునిలా వస్త్రాదారణ చేయడం పై మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.
4 - అవిశ్వాసుల మరియు దుర్మార్గుల వస్త్రధారణను అనుకరించ కూడదు.
5 - బట్టలు విప్పేటప్పుడు ముందుగా అల్లాహ్ పేరును ప్రస్తావించాలి.
హదీసులో ఇలా ఉన్నది: "మీలో ఒకరు 'బిస్మిల్లాహ్' అని పలికి తన వస్త్రాలను తొలగిస్తే అది ఆదాము సంతానము మరియు జిన్ పిల్లల యొక్క మర్మావయవాలను కప్పివేయటం అవుతుంది."
6 - పాదరక్షలు ధరించేటప్పుడు ముందుగా కుడి వైపు నుండి మరియు వాటిని తీసేటప్పుడు ముందుగా ఎడమ నుండి ప్రారంభించండి.
విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."
ప్రయాణికులు పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న14: ప్రయాణికులు పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - తన ప్రయాణాన్ని "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో, అల్'హందు లిల్లాహ్ (సకల ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి)" అనే పదాలతో ప్రారంభించాలి {పరమ పరిశుద్ధుడగు అల్లాహ్ ఈ వాహనాన్ని మాకు లోబరిచాడు,మేము దీనిని మేము (ఆయన అనుగ్రహం లేకపోతే) దీనిని లోబరుచుకోలేక పోయేవారము, 13 మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది! 14} [జుఖ్'రుఫ్ : 13 - 14]
2 - ఒకవేళ ఎవరైనా ముస్లింను దాటుతున్న సందర్భంలో, అతనికి సలాం పలుకుతూ ముందుకు సాగండి.
రోడ్లపై, రహదారులపై పాటించవలసిన పద్ధతులు:
15: రోడ్లపై, రహదార్లపై పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - సాధారణ వేగంతో, వినమ్రత, అణుకువలతో రహదారిపై నడవడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు!} [అల్ ఇస్రా: 37]
2 - దారిలో ఎదురయ్యే వారికి (పరిచయం ఉన్నా, లేకపోయినా) సలాం చేస్తూ పలకరించడం.
“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
3 - చూపులు క్రిందకు దించి, ఎవరికీ హాని కలుగ జేయకుండా ఉండటం.
4 - మంచి వైపుకు ఆహ్వానించడం, చెడును ఖండించడం. హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : ‘రహదారుల హక్కులను పూరించండి అని చెప్పారు వారు ‘ఓ ప్రవక్త ‘రహదారుల హక్కులు ఏమిటి ?అని అడిగారు దానికి ప్రవక్త సమాధానమిస్తూ’కళ్లను క్రిందికి వాల్చడం మరియు ఇతరులకు హనీ చేయకపోవడం,సలాం కు జవాబు చెప్పడం,మంచిని బోధించటం,చెడును ఖండించటం’అని ఉపదేశించారు.
5 - దారి నుండి హానికరమైన వాటిని తొలగించడం.
హదీసులో ఇలా ఉన్నది: బాధకరమైన వస్తువులను రహదారి నుండి తొలగించటం సదఖా అవుతుంది.
ఇంటిలో ప్రవేశించే మరియు ఇంటి నుండి బయటికి వెళ్ళటంలో పాటించవలసిన పద్ధతులు:
ప్రశ్న16: ఇంటిలో ప్రవేశించే మరియు ఇంటి నుండి బయటికి వెళ్ళటంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?
జవాబు: 1 - ఎడమ కాలు బయట పెట్టి, ఇంటి నుండి బయటకు అడుగు వేస్తూ ఇలా దుఆ చేయ వలెను: "బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా ఇన్నీ అ'ఉదు బిక అన్ అదిల్ల అవ్ ఉదల్ల; అవ్ అజిల్ల, అవ్ ఉజల్ల, అవ్ అజ్'లిమ అవ్ ఉజ్'లమ; అవ్ అజ్'హల అవ్ ఉజ'హల అలయ్య" (అల్లాహ్ పేరుతో, నేను అల్లాహ్ పైనే ఆధారపడతాను మరియు అల్లాహ్లో తప్ప మరో దానిలో ఏ శక్తీ లేదా బలమూ లేదు. ఓ అల్లాహ్! నేను తప్పుదారి పట్టడం నుండి లేదా నన్ను ఎవరైనా తప్పుదారి పట్టించడం నుండి, నేను ఎవరినైనా అవమానించడం నుండి లేదా నన్ను ఎవరైనా అవమానించడం నుండి నేను ఎవరిపైనైనా దౌర్జన్యం చేయడం నుండి లేదా నాపై ఎవరైనా దౌర్జన్యం చేయడం నుండి, నేను అజ్ఞానంతో వ్యవహరించడం నుండి మరియు నాపై ఎవరైనా అజ్ఞానంతో వ్యవహరించడం నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.)
2 - కుడి పాదంతో ఇంట్లోకి ప్రవేశిస్తూ, ఇలా దుఆ చేయాలి: "బిస్మిల్లాహి వలజ్నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ ‘అలా రబ్బినా తవక్కల్నా” (అల్లాహ్ పేరుతో మేము ప్రవేశిస్తాము, అల్లాహ్ పేరుతో మేము బయటికి వెళతాము మరియు మా ప్రభువుపైనే మేము ఆధారపడతాము).
3 - మిస్వాక్ ఉపయోగిస్తూ (దంతాలు శుభ్రపరిచే పంటిపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటూ ), ఇంట్లోని వ్యక్తులను సలాం చేస్తూ ఇంటిలోనికి ప్రవేశించవలెను.
హదీసులో ఇలా ఉన్నది : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్లు ప్రవేశించినప్పుడు మొదట మిస్వాక్ చేసేవారు (పళ్ళు శుభ్రం చేసే పుల్ల) ఉపయోగించేవారు.
టాయిలెట్, హమామ్ పద్ధతులు:
ప్రశ్న17: టాయిలెట్ లేదా హమామ్ విషయంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?
జవాబు: 1 - ఎడమకాలు లోపలికి పెట్టి ప్రవేశించడం.
2 - టాయిలెట్ లేదా హమామ్ లో ప్రవేశించే ముందు ఇలా దుఆ చేయడం: "అల్లాహ్ పేరుతో" ఓ అల్లాహ్! నేను అపరిశుద్ధమైన స్త్రీ పురుష జిన్నుల నుండీ నీ శరణు వేడుకుంటున్నాను.
3- అల్లాహ్ స్మరణ ఉన్న ఏ వస్తువును అందులో తీసుకెళ్ళకూడదు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు మలముత్రవిసర్జన కొరకు బహిర్భుమి వెళ్లినప్పుడు తన ఉంగారాన్ని తీసి విడిచి వెళ్ళేవారు
4 - మలమూత్ర విసర్జన సమయంలో ఇతరులకు కనబడకుండా ఉండే టాయిలెట్ గది లాంటిది లేదా పరదా లాంటిది ఏర్పాటు చేసుకోవడం.
హదీసులో ఇలా ఉన్నది : అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో అత్యంత ఇష్టపడ్డది గోడ లేదా ఖర్జూర చెట్ల పొదల వెనుక దాగటం.
5 - టాయిలెట్లో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడకుండా ఉండటం.
6 - మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఖిబ్లా దిశలో కూర్చోకుండా ఉండటం లేదా దాని వైపు వీపు చూపకుండా ఉండడం.
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మలమూత్ర విసర్జనలకై వెళ్ళినప్పుడూ మీరు ఖిబ్లా వైపుకు ముఖం కానీ వీపు కానీ చేయకండి ఉత్తరదక్షిణాల వైపుకు చేయండి.
7 - మలినాలను తొలగించడంలో, మర్మాంగాలు కడగడంలో కుడి చేతిని కాకుండా ఎడమ చేతిని ఉపయోగించడం.
హదీసు : నిశ్చయంగా ...ఇస్తెంజా కొరకు కుడి చేతిని ఉపయోగించకూడదని మమ్మల్ని వారించారు.
8 - ప్రజల మార్గంలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: (లఆనైన్) శాపానికి గురిచేసే రెండు విషయాలనుండి భయపడండి. అనుయాయులు (లఆనైన్) ఆ రెండు విషయాలు ఏమిటి ?ప్రవక్త అని అడిగారు. ప్రవక్త బదులిస్తూ –జనులు సంచరించే మార్గాల్లో మలవిసర్జన చేయడం లేదా వారు సేదతీరే నీడలో విసర్జించడం.
9- కాలకృత్యములు తీర్చుకున్న తరువాత చేతులను కడుక్కోవటం. జరీర్ రజియల్లాహు అన్హు చెప్పిన హదీసు: "నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. ఆయన మరుగుదొడ్లవైపు వెళ్లి తన అవసరాలను తీర్చుకున్నారు, ఆపై అన్నారు..." ఓ జరీర్! పవిత్రత కోసం నీరు తీసుకురా." నేను నీటిని ఆయనకు అందించాను. ఆపై ఆయన నీటితో ఇస్తింజా (శుద్ధి) చేసుకున్నారు మరియు తన చేతిని నేలపై రుద్దారు.
10 - కుడి పాదంతో టాయిలెట్ నుండి బయటకు వస్తూ ఇలా పలకాలి : "గుఫ్రానక్" (ఓ ప్రభూ, నన్ను క్షమించు)
మస్జిదులో పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న18: మస్జిదులో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - కుడిపాదం లోపలికి పెట్టి మస్జిదులో ప్రవేశి స్తూ ఇలా దుఆ చేయవలెను. బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నా కొరకు నీ కారుణ్య ద్వారాలు తెరువుము)
2 - రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ నమాజు పూర్తి చేయకుండా, మస్జిదులో కూర్చోవద్దు.
హదీసు : మీలో ఎవరయినా మస్జిద్ లోకి ప్రవేశిస్తే రెండు రకాతుల నమాజ్ చేసేంత వరకు కూర్చోకూడదు.
3 - నమాజు చేసే వ్యక్తుల ముందు నుండి వెళ్ళకూడదు, పోగొట్టుకున్న వస్తువులను వెతకకూడదు లేదా మస్జిదులలో అమ్మడం మరియు కొనడం చేయకూడదు. ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: నమాజు చదివే వ్యక్తి ఎదుట నుండి వెళ్ళేవానికి దాని పాపం ఏమిటో తెలిస్తే,అతని ముందు నుండి వెళ్లే బదులు నలబై(రోజులు/నెలలు/సంవత్సరాలు)అక్కడ నిలబడటం మేలుగా భావిస్తాడు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి : పోగొట్టుకున్న వస్తువు మస్జిద్లో ప్రకటించినప్పుడు కనుక మీరు విన్నట్లైతే ‘అల్లాహ్ నీకు ఎన్నటికీ తిరిగి చేరనివ్వడు’ఎందుకంటే మస్జిద్ లు వాటి కొరకు నిర్మించబడలేదు” అని చెప్పండి,
మరియు హదీసులో ఇలా ఉంది: మీరు మస్జిద్ లో ఏదైనా అమ్మడం కొనడం లాంటివి చేసినప్పుడు చూస్తే ఇలా చెప్పండి : అల్లాహ్ నీ వ్యాపారం లో లాభం ఇవ్వకూడదు.
4- నేను మసీదును శుభ్రంగా ఉంచడం పట్ల ఆశక్తిని కనబరుస్తాను.
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం: బస్తీల్లో వాడల్లో మస్జిదులు నిర్మించి వాటిని పరిశుబ్రంగా ఉంచుతూ సుగంధపరిమలాలతో నింపాలని ఆదేశించారు.
5- ఎడమపాదం బయట పెట్టి, మస్జిదు నుండి బయటికి వస్తూ, ఇలా దుఆ చేయాలి: అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయతో నేను నిన్ను వేడుకుంటున్నాను')
సలాం (అభివాదం) చేయడంలో పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న19: సలాం చేయడంలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - ఒక ముస్లిమ్ ను కలిసినప్పుడు, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" (అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై ఉండుగాక) అని ప్రశాంతంగా పలకరించడంతో సంభాషణ ప్రారంభించాలి. సలాం చెప్పకుండా, కేవలం చేతితో సంజ్ఞ చేయడం మాత్రమే సరిపోదు.
2 - చిరునవ్వుతో ఇతరులకు సలాం చేయండి. హదీసులో ఇలా ఉన్నది : ఏ చిన్న సత్కార్యాన్ని కూడా సాధారణమైనదిగా భావించవద్దు, అది మీ సోదరుడిని చిరునవ్వుతో పలకరించడమైనా సరే!
3 - కుడిచేత్తో కరచాలనం చేయండి.
4 - ఎవరైనా సలాం చేసినప్పుడు, దానికి సమానమైన పదాలతో లేదా దాని కంటే ఉత్తమంగా ఇంకా ఎక్కువ పదాలతో తిరిగి సలాం చేయండి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు.} [నిసా : 86]
5 - అవిశ్వాసిని కలుసుకున్నప్పుడు, అతనికి సలాం చెప్పడంతో ప్రారంభించకూడదు. ఒకవేళ అతను సలాం చేస్తే అతనికి అలైకుమ్ అని ప్రతిసలాం చేయాలి.
హదీసు : “యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చేయకండి.
6 - యువకులు వృద్ధులకు సలాం చేయాలి, వాహనం మీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వారికి సలాం చేయాలి, నడుస్తున్న వారు, కూర్చున్నవారికి సలాం చేయాలి, కొద్దిమందితో ఉన్న బృందం, ఎక్కువ మంది ఉన్న పెద్ద బృందానికి సలాం చేయాలి. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:- “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”
7. మహరమ్ కాని స్త్రీతో కరచాలనం చేయవద్దు.
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రదియల్లాహు అన్హా ఉల్లేఖనం: అల్లాహ్ సాక్షిగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతి ద్వారా ఎన్నడు ఏ మహిళను తాకలేదు.
అనుమతి అడగడంలో పాటించవలసిన మర్యాదలు:
ప్రశ్న20: ఇతరుల అనుమతి అడగడంలో పాటించవలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - ఒక ప్రదేశంలోకి ప్రవేశించే ముందు అనుమతి కోరడం.
2 - ప్రవేశించేందుకు మూడు సార్లు మాత్రమే అనుమతి కోరాలి, అంతకంటే ఎక్కువ సార్లు తగదు. అయినా అనుమతి లభించకపోతే, అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలి.
హదీసులో ఇలా ఉన్నది : మీలో ఎవరైన మూడు సార్లు అనుమతి కోరితే అనుమతి ఇవ్వబడకపోతే, అతను మరలివెళ్ళిపోవాలి.
3 - తలుపును సున్నితంగా తట్ట వలెను మరియు తలుపు నుండి దూరంగాను అంటే, దాని కుడివైపున గానీ లేదా ఎడమవైపున గానీ నిలబడ వలెను. అస్సలాము అలైకుమ్ అని పలకవలెను. హదీసు : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి గుమ్మం వద్దకు వచ్చినా, నేరుగా ద్వారానికి ఎదురుగా నిలబడకుండా, కుడి మూలకు లేదా ఎడమ మూలకు నిలబడేవారు. ఆ తరువాత "అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం" అని పలుకేవారు.
4 - ముందుగా అనుమతి తీసుకోకుండా, ముఖ్యంగా తెల్లవారుజామున, మధ్యాహ్న సమయంలో మరియు ‘ఇషా’ నమాజు తర్వాత తల్లిదండ్రుల గదిలోకి లేదా ఇతరుల గదిలోకి అస్సలు ప్రవేశింవద్దు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమాజ్ కు ముందు, మధ్యాహ్నం (జుహ్ర్) తరువాత - మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు - మరియు రాత్రి (ఇషా) నమాజ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.} [నూర్ : 58]
5 - అనుమతి తీసుకోకుండానే ఆసుపత్రి లేదా దుకాణం వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఎవ్వరికీ నివాస స్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు.} [ నూర్: 29]
జంతువుల సంక్షేమంలో పాటించవలసిన పద్ధతులు:
ప్రశ్న21: జంతువుల సంక్షేమంలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?
జవాబు: 1 - జంతువులకు ఆహారం మరియు నీరు అందించడం.
హదీసులో ఇలా ఉన్నది : సహచరులు అడిగారు:-‘ఓ దైవప్రవక్త! మా ఈ పశువుల ద్వారా మాకు పుణ్యం లభిస్తుందా?ప్రవక్త చెప్పారు:- {అవును,తేమను కలిగిన ప్రతీ కాలేయంలో పుణ్యం ఉంది}}
- మహనీయ దైవప్రవక్త ఒకసారి ఒక ఒంటె గుండా ప్రయాణిస్తుండగా చూశారు దాని కడుపు వీపుకు అతుక్కుపోయింది అప్పుడు ప్రవక్త ఉపదేశిస్తూ ఇలా తెలిపారు : «మీరు ఈ మూగ జంతువుల విషయంలో అల్లాహ్ కు భయపడండి.»
2 - జంతువుపై దయ చూపడం మరియు అది భరించలేనంత భారం దానిపై వేయకుండా ఉండటం.
హదీసులో ఇలా ఉన్నది : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : ఈ ఒంటె యజమాని ఎవరు?ఈ ఒంటె ఎవరిది ?అని అడిగారు, అప్పుడు అన్సారీ తెగకు చెందిన ఒక యువకుడు వచ్చి ‘ఓ దైవప్రవక్త ఇది నా ఒంటె అని చెప్పాడు, దైవప్రవక్త అతనికి ఉపదేశిస్తూ : నీవు ఈ పశువు పట్ల అల్లాహ్ కు భయపడటం లేదా ?ఆయనే నిన్ను దీనికి యజమాని చేశాడు? ఎందుకంటే “ నీవు దాని ఆకలిదప్పికలు తీర్చకుండా దాన్ని అలసటకు గురిచేస్తున్నావని అది నాకు ఫిర్యాదు చేసుకుంది” అని చెప్పారు. తుద్యిబుహు అంటే నీవు దానిని అలసటకు గురి చేస్తున్నావు.
3 - ఏ విధంగానైనా జంతువును హింసించడం లేదా బాధించడం వంటి వాటికి పాల్బడకుండా ఉండటం.
హదీసులో జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గాడిద ముఖంపై ముద్ర వేయబడినది చూశారు. అప్పుడు ఆయన ఇలా పలికారు: "మీకు తెలియలేదా? నేను జంతువులను ముఖంపై ముద్ర వేసేవారిని లేదా ముఖంపై కొట్టేవారిని శపించాను?" అని. అప్పుడు ఆయన దాని నుండి వారించారు.
క్రీడలు,వ్యాయామములలో పాటించవలసిన పద్ధతులు:
ప్రశ్న22 : క్రీడలు,వ్యాయామములలో పాటించవలసిన పద్ధతులు ఏమిటి?
జవాబు: 1 - అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ఆయన మెప్పును పొందటానికి అవసరమైనంత బలం చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీడల,వ్యాయామముల అభ్యాసం చేయడం.
2 - నమాజు సమయంలో క్రీడలు,వ్యాయామములను ఆపి వేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఆ నమాజీల కొరకు వినాశనం తప్పదు. వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు.} [అల్ మాఊన్ :4,5]
3 - అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి క్రీడలు,వ్యాయామము చేయకూడదు.
4 - మర్మవయవాలను (తప్పనిసరిగా కప్పబడి ఉండవలసిన శరీర భాగాలు) కప్పి ఉంచేలా క్రీడా,వ్యాయామ దుస్తులను ధరించడం.
5 - ముఖం పై కొట్టడం లేదా 'మర్మావయవాలను బహిర్గతం చేయడం వంటి నిషేధించబడిన క్రీడలను నివారించడం.
హదీసులో ఇలా ఉన్నది: మీలో ఎవరైన తన సోదరునితో పోరాడితే ముఖమును గాయపర్చకండి.
హాస్య పద్ధతులు:
ప్రశ్న23 : హాస్య పద్దతులు ఏమిటి?
జవాబు: 1 - హాస్యమాడుతున్నప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండాలి.
హదీసులో ఇలా ఉన్నది : ‘ఇతరులను నవ్వించడానికి మాట్లాడినప్పుడల్లా అసత్యం పలికేవాడికి సర్వనాశనం తప్పదు,అతను నాశనం అయిపోతాడు,నాశనం అయిపోతాడు.
2 - హాస్యం అనేది ఎగతాళి, అపహాస్యం, హాని మరియు బెదిరింపులు లేకుండా ఉండాలి.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: "ఒక ముస్లిం మరొక ముస్లింను భయపెట్టడం సమ్మతం కాదు."
3 - తరచుగా జోకులు వేయడం మానుకోండి.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: "ఎక్కువగా నవ్వకుండా ఉండండి; ఎందుకంటే అధికంగా నవ్వడం హృదయాన్ని మృతిచేస్తుంది."
తుమ్మినపుడు పాటించవలసిన పద్ధతులు:
ప్రశ్న24 : తుమ్మినపుడు పాటించవలసిన పద్ధతులు ఏమిటి?
జవాబు: 1 - తుమ్మేటప్పుడు నోటిపై చేయి, వస్త్రం లేదా రుమాలు పెట్టుకోవడం.
2 - తుమ్మిన తర్వాత అల్లాహ్ ను స్తుతిస్తూ: "అల్'హమ్'దు లిల్లాహ్" అని పలకడం.
3 - తుమ్మినవాని సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక).
దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి: "యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక)
ఆవలించడంలో పాటించ వలసిన పద్ధతులు:
25: ఆవలించడంలో పాటించ వలసిన పద్ధతులు ఏమిటి?
జవాబు: 1 - ఆవలింతలను ఆపివేసేందుకు ప్రయత్నించాలి
హదీసులో ఇలా ఉన్నది : ఆవలింపు షైతాన్ తరుపు నుండి వస్తుంది కనుక మీకు అవలింపు వచ్చినప్పుడు దాన్ని శక్తిమేరకు ఆపే ప్రయత్నం చేయండి.
2. "ఆహ్ ఆహ్" అని గట్టిగా అరవకుండా ఉండటం.
హదీసులో ఇలా ఉన్నది : "మీలో ఎవరూ 'ఆహ్ ఆహ్' అని చెప్పకూడదు, ఎందుకంటే మీరు నోటిని తెరిస్తే, షైతాను మీపై నవ్వుతాడు."
3 - నోటిపై చేయి పెట్టాలి.
హదీసులో ఇలా ఉన్నది: మీలో ఎవరైన ఆవలించినప్పుడు చేతిని ముఖానికి అడ్డుగా పెట్టండి. నిశ్చయంగా షైతాన్ నోటిలో చొరబడతాడు.
దుఆ పద్దతులు :
ప్రశ్న26: దుఆ పద్దతులు ఏమిటి?
జవాబు : 1. అల్లాహ్ స్థుతులను పలుకుతూ మరియు ఆయనను ప్రశంసిస్తూ ప్రారంభించాలి.
2. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం.
ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : "నీవు నమాజు చేసినప్పుడు కూర్చుంటే, అల్లాహ్‌ను ఆయనకు తగిన విధంగా స్థుతులను పలుకు, నా పై దురుద్ పటించు, ఆ తర్వాత ఆయనను ప్రార్థించు."
3. దుఆ చేసే సమయంలో రెండు చేతులను పైకి ఎత్తాలి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ‘నిశ్చయంగా నీ ప్రభువు దయామయుడు బిడియంగలవాడు, దాసుడు తన వైపు చేతులు చాచి అర్ధించినప్పుడు అతన్ని ఖాళీ చేతులతో మరల్చడానికి అల్లాహ్ సిగ్గు పడతాడు.
4. తౌబా చేయడం మరియు పాపాన్ని అంగీకరించడం.
- మూసా అలైహిస్సలాం దుఆ విషయంలో ఇలా ఉన్నది : {(మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నాకు నేను అన్యాయం చేసుకున్నాను. కావున నన్ను క్షమించు!" (అల్లాహ్) అతనిని క్షమించాడు. నిశ్చయంగా, ఆయన క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.} [అల్ ఖసస్ : 16]
4 - దుఆలో మొండిగా వ్యవహరించటం (పట్టుబడటం) అంటే దానిని ఎక్కువగా చేయటం మరియు పదేపదే చేయటం.
6. దుఆ స్వీకరించటమును తొందర చేయకూడదు.
7. ఏదైన పాపము గురించి లేదా బంధుత్వమును తెంచటం గురించి దుఆ చేయకూడదు.
హదీసులో ఇలా ఉన్నది : ఖచ్చితంగా ప్రతీ దాసుని ప్రార్థన నెరవేరుతుంది కానీ అది పాపానికి సంబంధించి మరియు బంధుత్వాన్ని తెంపేది అయి ఉండకూడదు, అలాగే తొందరపడకూడదు తొందరపడటం అంటే ఏమిటి ప్రవక్త అని అడగబడింది, ప్రవక్త సమాధానం ఇస్తూ దాసుడు అంటాడు' నేను దుఆ చేశాను మళ్ళీ చేశాను కానీ నా ప్రార్థన (దుఆ) నెరవేరేలా నాకు అనిపించటం లేదు అంటూ 'నిరాశచెంది' దుఆ చేయడం మానేస్తాడు' అని తెలియజేశారు.
8. దుఆలో స్వరాన్ని తగ్గించాలి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మీ ప్రభువును వినయంతో మరియు రహస్యంగా (మౌనంగా) ప్రార్థించండి.} [అల్ ఆరాఫ్ : 54]
9. దుఆలో మనస్సును శ్రద్దతో లగ్నం చేయడం.
హదీసులో ఇలా ఉన్నది : మీరు అల్లాహ్ తో దుఆ చేయండి మరియు దుఆ స్వీకరింపబడటంపై నమ్మకమును కలిగి ఉండండి. మరియు మీరు తెలుసుకోండి అల్లాహ్ నిర్లక్ష్యంగా, అశ్రద్ధతో చేసేవారి దుఆను ఆమోదించడు.
10. అల్లాహ్‌కి ప్రామాణికత చూపించడం, కష్టాల్లోనూ సుఖాల్లోనూ కేవలం అల్లాహ్‌నే అడగడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు నిశ్చయంగా, మస్జిదులు అల్లాహ్ కొరకే ప్రత్యేకించబడ్డాయి. కావున వాటిలో అల్లాహ్ తో పాటు ఇతరులెవ్వరినీ ప్రార్థించకండి.} [అల్ జిన్న్:18]
11.అల్లాహ్‌ను ఆయన సుందరమైన నామాలు మరియు గొప్ప గుణాల ద్వారా వేడుకోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి.} [అల్ ఆరాఫ్ : 54]
12. ఖిబ్లా వైపు అభిముఖమవటం. హదీసులో ఇలా ఉన్నది : ఆయన ఖిబ్లా వైపు అభిముఖమై చేతులు చాచి తన ప్రభువును పిలుస్తూనే ఉన్నారు. చివరికి ఆయన దుప్పట ఆయన భుజాలపై నుండి జారిపడిపోయింది.
13. తినే ఆహారం, తొడిగే దుస్తులు పరిశుద్ధమైనవి అయ్యి ఉండాలి. హదీసులో ఇలా ఉన్నది : తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక సుదూర ప్రయాణీకుడి గురించి ప్రస్తావించినారు, అతడి తలవెంట్రుకలు చిందరవందరగా ఉన్నాయి, అతడి శరీరమంతా మట్టికొట్టుకుని ఉంది, అతడు తన రెండు చేతులు ఆకాశం వైపునకు చాచి “ఓ నా ప్రభూ! ఓ నా ప్రభూ!” అంటూ వేడుకుంటున్నాడు. మరి చూడబోతే అతని ఆహారం హరాం (ధర్మసమ్మతమైనది కాదు); అతని పానీయం హరాం, అతని దుస్తులు హరాం, మరియు అతని పోషణ పూర్తిగా హరాం. మరి అది (అతని దుఆ, వేడుకోలు) ఎలా స్వీకరించబడుతుంది?”
ఖుర్ఆన్ పారాయణంలో పాటించ వలసిన మర్యాదలు:
ప్రశ్న27 : ఖుర్ఆన్ పారాయణంలో పాటించ వలసిన మర్యాదలు ఏమిటి?
జవాబు: 1 - వుజూ చేసిన తర్వాత తహారతు (కర్మ స్వచ్ఛత) స్థితిలో ఉన్నప్పుడు పఠించడం.
2 - వినమ్రతతో, అణుకువతో మర్యాదగా మరియు హుందాగా కూర్చుని ఖుర్ఆన్ పారాయణం చేయడం.
3 - అల్లాహ్ తో షైతాను బారి నుండి కాపాడమని శరణు వేడుకుంటూ పారాయణం ప్రారంభించడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {కావున నీవు ఖుర్ఆన్ పఠించబోయేటప్పుడు శపించబడిన (బహిష్కరించబడిన) షైతాన్ నుండి (రక్షణ పొందటానికి) అల్లాహ్ శరణు వేడుకో!} [అన్ నహ్ల్ : 98]
4 - దీర్ఘాలోచన చేస్తూ పారాయణం చేయడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: {వారు ఈ ఖుర్ఆన్ ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడి వున్నాయా?} [ముహమ్మద్:24]
*******
నైతిక విలువల విభాగం.
నైతికతల జ్ఞానం:
నైతికలు : ఇది మంచి మరియు చెడుల అర్థాన్ని నిర్వచించే జ్ఞానం, మరియు అల్లాహ్ మరియు అతని సృష్టి పట్ల ఎలా వ్యవహరించాలో వివరిస్తుంది.
ప్రశ్న 1: మంచి నైతికత యొక్క ఘనత ఏమిటి?
జవాబు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండే విశ్వాసులు, అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు.
2: మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి?
జవాబు: 1 - మనం ఎందుకు ఇస్లామీయ నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి అంటే: 1. ఇది అల్లాహ్ ప్రేమకు దారి తీస్తుంది.
హదీసులో ఇలా ఉన్నది : "అల్లాహ్ వద్ద అత్యంత ప్రియమైన దాసులు ఎవరు అని ప్రశ్నించగా, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉత్తమ నైతికత గలవారు అని సమాధానమిచ్చారు"
2 - ఇది ప్రజల ప్రేమకు దారి తీస్తుంది.
3 - ఇది (తీర్పుదినాన) త్రాసుపై అత్యంత భారీగా తూగుతుంది.
హదీసులో ఇలా ఉన్నది : «తీర్పు రోజున విశ్వాసుల త్రాసులో మంచి నైతికత ఎంతో బరువైనది.»
4 - ఇది పుణ్యాలు మరిన్ని రెట్లు గుణించబడటానికి దారి తీస్తుంది.
హదీసులో ఇలా ఉన్నది : నిశ్చయంగా మోమిన్ తన మంచి నడవడిక ఉత్తమ సద్వర్తన వల్ల ఉపవాసికి మరియు తహజ్జుద్ చదివే వ్యక్తి యొక్క స్థానానికి చేరుకుంటాడు.
5 - ఇది పరిపూర్ణ విశ్వాసానికి సంకేతం.
హదీసులో ఇలా ఉన్నది : అత్యంత పరిపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండే విశ్వాసులు, అత్యంత ఉత్తమమైన నైతికత, నడవడిక కలిగి ఉంటారు.
3: మనం నైతికత విలువలను ఎక్కడ నుండి పొందాలి?
జవాబు: పవిత్ర ఖుర్ఆన్ నుండి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {నిశ్చయంగా ఈ 'ఖుర్ఆను' పటిష్టమైన సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేస్తుంది}. [అల్ ఇస్రా: 9]
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతుల నుండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం: {నిశ్చయంగా నేను సత్ప్రవర్తనలు, ఉత్తమ నైతికతను సంపూర్ణం చేయడానికి పంపించబడ్డాను}
4: ఇహ్సాన్ యొక్క నైతికతలు మరియు దాని రూపాలు ఏమిటి?
జవాబు: ఇహ్సాన్ అంటే నిరంతరం అల్లాహ్ పట్ల శ్రద్ధ వహించడం మరియు అన్ని జీవుల పట్ల దయతో మరియు కనికరంతో వ్యవహరించడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: నిశ్చయంగా, అల్లాహ్ అన్ని విషయాలపై దయతో వ్యవహరించమని ఆదేశించాడు.
ఇహ్సాన్ యొక్క రూపాలు:
✔ అల్లాహ్ ఆరాధనలో ఇహ్సాన్ అది ఆరాధనలను పూర్తి చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం.
✔ మాటలలో మరియు చేతలలో తల్లిదండ్రుల పట్ల దయ చూపటం.
✔ రక్తసంబంధీకులు మరియు బంధువుల పట్ల దయ చూపటం.
✔ ఇరుగు పొరుగు వారి పట్ల దయ చూపటం.
✔ అనాధల పట్ల మరియు అక్కరగలవారి పట్ల దయ చూపటం.
✔ మిమ్మల్ని బాధపెట్టిన వ్యక్తి పట్ల దయ చూపటం.
✔ వాదనలలో దయ చూపటం.
✔ మాట్లాడటంలో దయ చూపటం.
✔ పశువుల పట్ల దయ చూపటం.
ప్రశ్న 5 : ఇహ్సాన్ కు వ్యతిరేకం ఏది?
జవాబు:ఇహ్సాన్ కు విరుద్ధమైనది అల్ ఇసాఅహ్ (చెడు చేయటం).
* చెడుచేయటం ఉదాహరణలు: . సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించడంలో చిత్తశుద్ధి లేకుండా ఉండటం.
* తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపటం.
* రక్తసంబంధాల తెగత్రెంపు చేసుకోవటం.
* ఇరుగు పొరుగు వారి పట్ల ద్వేషం, శత్రుత్వం చూపటం
* చెడు మాటలు మరియు చేతలతో పాటు పేదలు మరియు అక్కరగలవారి పట్ల దయలేనితనం.
6: నీతి (త్రికరణశుద్ధి, న్యాయబుద్ధి) యొక్క రకాలు మరియు రూపాలు ఏమిటి?
జవాబు : 1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క హక్కులను పరిరక్షించడంలో నీతి, త్రికరణశుద్ధి.
దాని రూపాలు : నమాజులు, జకాతు, ఉపవాసం, హజ్ మొదలైన ఆరాధనలను నిర్వహించడంలో త్రికరణశుద్ధి.
2 -సృష్టితాల హక్కులను పరిరక్షించడంలో త్రికరణశుద్ధి.
- ప్రజల గౌరవాన్ని పరిరక్షించటంలో నుంచి.
- వారి సంపదను పరిరక్షించటం.
వారి రక్తములను పరిరక్షించటం.
వారి రహస్య వ్యవహారాలు మరియు ఒకరిపై నమ్మకంతో అప్పగించబడిన ప్రతిదిని పరిరక్షించటం.
సాఫల్యం పొందే వారి లక్షణాల గురించి సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.} [అల్ ముమినూన్ : 8]
7: నీతి (త్రికరణశుద్ధి) కు విరుద్ధమైనది ఏమిటి?
జవాబు: నమ్మకద్రోహం, మోసం, దగా మొదలైనవి అంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ప్రజల హక్కులను వృధా చేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కు మరియు ఆయన ప్రవక్తకు నమ్మకద్రోహం చేయకండి మరియు తెలిసి ఉండి కూడా మీ (పరస్పర) అమానతుల విషయంలో నమ్మకద్రోహం చేయకండి.} [అల్-అన్'ఫాల్ :27 ]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కపటుడి చిహ్నాలు మూడు : "... మరియు అతనికి ఏదైనా అప్పగించినట్లయితే, అతను నమ్మక ద్రోహం చేస్తాడు..."
8: సత్యసంధత అంటే ఏమిటి?
జవాబు: సత్యసంధత అంటే ఏది వాస్తవికతకు అనుగుణంగా ఉంటుందో లేదా ఏది నిజమో అదే చెప్పడం.
దాని రూపాలు :
- ప్రజలతో మాట్లాడడంలో సత్యసంధత.
- వాగ్దానం నెరవేర్చడంలో సత్యసంధత.
- ప్రతి మాటలో, ప్రతి ఆచరణలో సత్యసంధత.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: సత్యసంధతకు కట్టుబడి ఉండండి, ఎందుకంటే సత్యం ధర్మానికి దారి తీస్తుంది మరియు ధర్మం స్వర్గానికి దారితీస్తుంది. ఒక వ్యక్తి అత్యంత సత్యవంతుడు అయ్యేంత వరకు సత్యాన్ని మాట్లాడుతూనే ఉంటాడు.
9: సత్యసంధతకు వ్యతిరేకమైనది ఏమిటి?
జవాబు: అబద్ధం, ఇది నిజానికి వ్యతిరేకం, ఇందులో ప్రజల ముందు అబద్ధం చెప్పడం, వాగ్దానాలను పూర్తి చేయకపోవటం, మరియు అబద్ధం సాక్ష్యం ఇవ్వడం ఉన్నవి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {మీరు అసత్యానికి దూరంగా ఉండండి, ఎందుకంటే అసత్యం మనిషిని పాపం వైపుకు తీసుకెళ్తుంది, ఈ పాపం నిశ్చయంగా అతన్ని నరకానికి చేరవేస్తుంది. ఒకవ్యక్తి ఎల్లప్పుడు అబద్దం చెప్తూ ఉంటాడు, అతను ఆ అబద్దాలను విధిగా చేసుకుంటాడు చివరికి అల్లాహ్ వద్ద అతను అసత్యవాది’అని లిఖించబడతాడు.}
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కపటుడి చిహ్నాలు మూడు: "... మరియు అతడు మాట్లాడితే అసత్యాలే పలుకుతాడు."
ప్రశ్న10 : సహనం యొక్క రకాలు ఎన్ని?
జవాబు: మొదటిది - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడంలో సహనం.
రెండవది - పాపాలు మానుకోవడంలో చూపే సహనం.
మూడవది - కఠినమైన దైవాదేశాలను ఆచరణలో పెట్టడంలో చూపే సహనం మరియు అన్ని స్థితులలోనూ అల్లాహ్ నే స్తుతించడంలో చూపే సహనం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అల్లాహ్ ఓర్పు గల వారిని ప్రేమిస్తాడు.} [ఆలె ఇమ్రాన్ :146]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసి పరిస్థితి చాలా ఆశ్చర్యకరమైనది. అతను ఏ పరిస్థితిలో ఉన్నా అతనికి మేలు మాత్రమే కలుగుతుంది. ఇది కేవలం విశ్వాసి విషయంలో మాత్రమే జరుగుతుంది. అతనికి ఆనందం కలిగినప్పుడు అల్లాహ్'కు కృతజ్ఞత తెలుపు కుంటాడు, అతనికి అది మేలును ప్రసాదిస్తుంది. ఒక వేళ అతనికి కష్టం కలిగితే అతను సహనం వహిస్తాడు అది అతనికి మేలు చేస్తుంది.
11: సహనానికి వ్యతిరేకమైనది ఏమిటి?
జవాబు: సహనానికి వ్యతిరేకమైనది అసహనం అంటే అల్లాహ్ కు విధేయత చూపడంలో మరియు పాపాలకు దూరంగా ఉండటంలో అసహనం చూపడం. మాటల ద్వారా లేదా చేతల ద్వారా అల్లాహ్ యొక్క ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తం చేయడం కూడా దీని క్రిందికే వస్తుంది.
దాని రూపాలు:
- మరణాన్ని కోరుకోవడం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మీలో ఎవరూ తనకు బాధ కలిగిందని చావుని కోరుకోరాదు. తప్పనిసరి పరిస్థితుల్లోనైతే ఈ విధంగా వేడుకోవాలి: "దేవా! జీవితం నా కొరకు మేలుతో కూడుకొని ఉన్నంతవరకూ నన్ను సజీవంగా ఉంచు. మరణమే నా కొరకు శ్రేయస్కరమైనప్పుడు నాకు మరణాన్ని ప్రసాదించు".
- చెంపలపై కొట్టుకోవడం.
- బట్టలు చింపుకోవడం.
- జుట్టు చిందర వందరగా వదిలి వేయడం.
- తనకు త్వరగా మరణం రావాలని వేడుకోవడం.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు: “(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తమ చెంపలను చరుచుకుంటూ, తమ చొక్కాలను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడుగా పరిగణించబడడు).
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నిశ్చయంగా ఎంతపెద్ద ఆపద వస్తే దానికి అంతటి పుణ్యం లభిస్తుంది. నిస్సందేహంగా ఎవరినైతే అల్లాహ్ తఆలా ప్రేమిస్తాడో వారిని పరీక్షలకు గురిచేస్తాడు. ఎవరైతే వాటిలో సహనంగా ఓర్పుతో ఉంటాడో అల్లాహ్ అతని పట్ల సంతోషపడుతాడు. మరెవరైతే ఆగ్రహానికి గురౌతారో, అల్లాహ్ కూడా అతని పట్ల ఆగ్రహం చూపుతాడు.
ప్రశ్న12: పరస్పర సహకార గుణం అంటే ఏమిటి?
జవాబు: ఇది సత్యం మరియు మంచితనంలో ప్రజల మధ్య సహకారం.
పరస్పర సహకారము యొక్క రకాలు :
-హక్కులను తిరిగి అందించడంలో సహకారం.
- అన్యాయస్తుడిని అడ్డుకునే విషయంలో సహకారం.
- ప్రజల అవసరాలు మరియు నిరుపేదల అవసరాలను తీర్చడంలో సహకారం.
- అన్ని మంచి విషయాలలో సహకారం.
- పాపకార్యాలు, ఇతరులకు హాని కలిగించే పనులు మరియు ఇతరులపై అరాచకాలలో సహకరించకపోవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు సత్కార్యాల్లో,అల్లాహ్ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో,దౌర్జన్యపు పనులలో ఎవరితోను సహకరించకండి. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు.} [అల్ మాయిదా :2]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక విశ్వాసితో మరొక విశ్వాసి యొక్క సంబంధం ఒక భవనం (ఇటుకలు) లాంటిది, ప్రతి ఒక్కటి మరొక దానిని బలపరుస్తుంది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లిం మరొక ముస్లిం సోదరుడు; అతడు మరొకతనికి అన్యాయం చేయడు మరియు దౌర్జన్యుడికి అతనిని అప్పగించడు. ఎవరైతే తన సోదరుని అవసరాలను తీరుస్తారో, అల్లాహ్ అతని అవసరాలను తీరుస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లింను అతని భారం నుండి విముక్తులను చేస్తారో, అల్లాహ్ ప్రళయ దినపు భారం నుండి అతనిని విముక్తి చేస్తాడు; మరియు ఎవరైతే ఒక ముస్లిం (తప్పులను) కప్పిపెడతారో, అల్లాహ్ ప్రళయ దినాన (అతని తప్పులను) కప్పిపెడతాడు.
13: హయా (వినయం, బిడియం)లోని రకాలు ఏమిటి?
జవాబు: 1 - అల్లాహ్ పట్ల సిగ్గు,బిడియం : అల్లాహ్ కు అవిధేయత చూపకుండా ఆయన పట్ల విధేయత చూపటం
2 - ప్రజలపట్ల సిగ్గు,బిడియం : అసభ్యకరమైన మరియు అసంబద్ధమైన మాటలు మానుకోవడం మరియు 'మర్మావయవాలను'ను బహిర్గతం చేయకుండా ఉండడం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: విశ్వాసానికి డెబ్బైలేక అరవై కు మించి శాఖలు ఉన్నాయి. అందులో "లా ఇలాహ ఇల్లల్లాహ్" వాక్యం పలకడం (విశ్వసించడం) అత్యున్నతమైనది. అయితే "మార్గం మధ్య నుండి హానికరమైన దాన్ని తొలగించడం అతి చిన్నది. ' సిగ్గు (బిడియం) విశ్వాసానికి సంబంధించిన శాఖల్లో ఒక శాఖ.
ప్రశ్న14: దయ గుణం యొక్క రూపాలు ఏమిటి ?
జవాబు: వృద్ధుల పట్ల దయ చూపడం మరియు వారిని గౌరవించడం.
- పిన్న వయస్సు వారి పట్ల మరియు చిన్నపిల్లల పట్ల దయ చూపడం హదీసులో ఇలా ఉన్నది : «మనలో పెద్దలను గౌరవించనివారు, మనలో చిన్నరులపై దయ చూపనివారు మనలోవారు కాదు.»
- పేదలు, అక్కరగలవారు మరియు దిక్కులేని నిరుపేదల పట్ల దయ చూపడం
- జంతువులకు ఆహారం ఇవ్వడం ద్వారా మరియు వాటికి హాని కలిగించకుండా ఉండటం ద్వారా వాటిపై దయ చూపడం.
దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: విశ్వాసుల ఉపమానం వారి స్నేహం, ఐక్యత మరియు దయ, జాలి విషయాలలో ఒక శరీరం వంటిది. శరీరం లో ఏ భాగానికైనా బాధ కలిగితే ఆ బాధను పూర్తి శరీరం అనుభవిస్తుంది. నిద్రపట్టదు, జ్వరం వస్తుంది.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కరుణించే జనులపై కరుణామయుడు (అర్రహ్మాన్) కరుణిస్తాడు, మీరు భూవాసులపై కరుణించండి, ఆకాశంలో ఉన్న ప్రభువు మిమ్ములను కరుణిస్తాడు.
15: ప్రేమ ఎన్ని రకాలు?
జవాబు: మహోన్నతుడైన అల్లాహ్ ను ప్రేమించుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : “విశ్వసించిన వారు అల్లాహ్ ను ప్రగాఢంగా ప్రేమిస్తారు” [అల్ బఖర: 165 ]
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల ప్రేమ.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : నా ప్రాణం ఎవరి చేతిలో ఉన్నదో ఆయన సాక్షిగా, నన్ను తన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మరియు తన సంతానం కంటే ఎక్కువగా ప్రేమించనంత వరకు మీలో ఎవ్వరూ పరిపూర్ణ విశ్వాసి కాజాలరు.
విశ్వాసుల పట్ల ప్రేమ మరియు ఒక వ్యక్తి తన కొరకు తాను కోరుకున్నట్లే వారి కొరకు కూడా మంచిని కోరుకోవడం.
నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: స్వయంగా తన కోసం కోరుకున్నటు వంటిదే, తన సోధరుని కోసం కూడా కోరుకునేంత వరకు మీలో ఎవ్వరూ విశ్వాసి కాజాలరు.
ప్రశ్న16: బషాష (ఉల్లాసం) అంటే ఏమిటి?
జవాబు: ఉల్లాసమైన ముఖాన్ని కలిగి ఉండటం, దానితో పాటు సంతోషంతో మరియు చిరునవ్వుతో, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్నేహపూర్వకంగా ప్రజలను కలవడం.
ఇది కోపంతో నుదురు చిట్లిస్తూ, అసహ్యంతో మరియు విరోధంతో ప్రజల వైపు చూడడానికి వ్యతిరేకమైన వైఖరి.
ఉల్లాసం యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ అనేక హదీసులు ఉల్లేఖించ బడినాయి. వాటిలో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు కూడా ఉంది: ఏ చిన్న సత్కార్యాన్ని కూడా సాధారణమైనదిగా భావించవద్దు, అది మీ సోదరుడిని చిరునవ్వుతూ పలకరించడ మైనా సరే!
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: చిరునవ్వుతో నీ సోదరుడిని పలకరించడం కూడా సదఖ (దానం) గా పరిగణించ బడుతుంది.
17: అసూయ అంటే ఏమిటి?
జవాబు: ఇతరులపై కురుస్తున్న అల్లాహ్ యొక్క దీవెనలు, అనుగ్రహాలు, ఆశీర్వాదాలు ఆగి పోవాలని కోరుకోవడం లేదా ఇతరులు అల్లాహ్ యొక్క ఆశీర్వాదం ఆస్వాదించడాన్ని ద్వేషించడం, ఇతరులు మంచిగా ఉండటం చూసి ఓర్చు కోలేక పోవటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అసూయపరుడి కీడు నుండి, ఎప్పుడైతే అతడు అసూయపడతాడో!"} [అల్ ఫలక్ : 5]
అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ఒకరినొకరు ద్వేషించకండి, ఒకరిపై మరొకరు అసూయ పడకండి మరియు ఒకరినొకరు వీపు చూపు కోకండి, అల్లాహ్ దాసులారా, సోదరులుగా మెలగండి.
18:అపహాస్యం చేయడం అంటే ఏమిటి?
జవాబు: ఇది తోటి ముస్లిం సోదరుడిని ఎగతాళి చేయడం మరియు తృణీకరించడం, ఇది అనుమతించ బడలేదు.
దీనిని పూర్తిగా ఖండిస్తూ మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! మీలో ఎవరూ (పురుషులు) ఇతరులెవరినీ ఎగతాళి చేయరాదు. బహుశా వారే (ఎగతాళి చేయబడే వారే) వీరి కంటే శ్రేష్ఠులు కావచ్చు! అదే విధంగా స్త్రీలు కూడా ఇతర స్త్రీలను ఎగతాళి చేయరాదు. బహశా వారే (ఎగతాళి చేయబడే స్త్రీలే) వీరి కంటే శ్రేష్ఠురాండ్రు కావచ్చు! మీరు పరస్పరం ఎత్తి పొడుచుకోకండి మరియు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి. విశ్వసించిన తర్వాత ఒకనిని చెడ్డ పేరుతో పిలవటం ఎంతో నీచమైన విషయం మరియు (ఇలా చేసిన పిదప) పశ్చాత్తాప పడకుంటే, అలాంటి వారు చాలా దుర్మార్గులు.} [అల్ హుజరాత్ : 11]
ప్రశ్న19: వినయం అంటే ఏమిటి?
జవాబు: ఒకరు తనను తాను ఇతరుల కంటే గొప్పవారు అని ఆలోచించక పోవడమే వినయం, వినమ్రత, అణుకువ; దాని వలన, ఒక వ్యక్తి ప్రజలను తృణీకరించడు లేదా సత్యాన్ని తిరస్కరించడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {భూమిపై వినయంగా నడిచేవారే అత్యంత కరుణామయుని దాసులు.} [ఫుర్ఖాన్ : 63] వారు నిరాడంబరులు, వినయులు అని అర్థం
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అల్లాహ్ ప్రసన్నత కోసం తనను తాను తగ్గించుకుని వినయం, అణుకువలతో మెలిగేవారి స్థాయిని అల్లాహ్ పెంచకుండా ఎవ్వరూ మిగలరు.
మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: {నిశ్చయంగా అల్లాహ్ నా వైపుకు ఈ విషయాల వ'హీ (దివ్యవాణి) పంపాడు: మీరు వినమ్రతను కలిగి ఉండండి. ఒకరిపై మరొకరు దురాక్రమణ'తో హద్దు మీరవద్దు మరియు ఒకరిపట్ల మరొకరు గర్వం, అహంకారం చూప వద్దు}
20: నిషేధించబడిన అహంకారం ఎన్ని రకాలు?
జవాబు: 1- సత్యంతో వ్యవహరించడంలో అహంకారం, అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు అంగీకరించకపోవడం
2 - ప్రజలతో వ్యవహరించడంలో అహంకారం, అంటే వారిని తృణీకరించడం మరియు చులకన చేయడం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:- ఎవరి హృదయంలోనైతే అణువంత గర్వం, అహం ఉంటుందో అతను స్వర్గం లో ప్రవేశించడు. దానికి ఒక వ్యక్తి ఇలా అడిగాడు: "ఒక వ్యక్తి తన బట్టలు మరియు బూట్లు మంచిగా ఉండాలని ఇష్టపడితే?" అపుడు ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా బదులు పలికారు, "నిశ్చయంగా అల్లాహ్ అందమైనవాడు మరియు ఆయన అందాన్ని ప్రేమిస్తాడు. కానీ, అహంకారం అంటే సత్యాన్ని తిరస్కరించడం మరియు ప్రజలను తక్కువగా చూడటం.
- "సత్యాన్ని తిరస్కరించడం": అంటే దానిని అంగీకరించక పోవడం.
- "వ్యక్తులను తక్కువగా చూడటం": అంటే వారిని తృణీకరించడం, నీచంగా చూడటం.
- అందంగా కనిపించేలా మంచి దస్తులు మరియు బూట్లు ధరించడం అహంకారం క్రిందికి రాదు.
ప్రశ్న21: నిషేధించబడిన మోసం యొక్క కొన్ని రకాలను పేర్కొనండి?
జవాబు: - సరుకులోని లోపాన్ని దాచిపెట్టి, అమ్మకంలో, కొనుగోలులో మోసం చేయడం.
- పరీక్షల్లో విద్యార్థులు మోసం చేసిన విధంగా చదువులో మోసం చేయడం.
- తప్పుడు సాక్ష్యం చెబుతూ మరియు అబద్ధాలు చెబుతూ మాటల్లో మోసం చేయడం.
- ఇతరులతో చేసిన ఒప్పందాలను ఉల్లంఘించడం.
మోసం గురించి వారింపు విషయంలో హదీసు : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన అతనితో ఇలా అడిగారు: ఇది ఏమిటి? ఓ ధాన్యాల వ్యాపారి? అని అడిగారు, అతను ‘వర్షంలో తడిసింది ఓ ప్రవక్త! అని చెప్పాడు,ప్రవక్త ‘మరి అలాంటప్పుడు ఆ ధాన్యాన్ని మీద ఎందుకు పెట్టలేదు, ప్రజలు దాన్ని గుర్తిస్తారు కదా’?మోసం చేసేవాడు మనలోని వాడు కాదు’అని చెప్పారు.
ధాన్యపు కుప్ప: అంటే ఆహార ధాన్యాల గుట్ట
22: చాడీలు చెప్పడం (గీబతు చేయడం) అంటే ఏమిటి?
జవాబు: ఇది ఒక ముస్లిం సోదరుడి విషయంలో అతను దగ్గరలో లేనప్పుడు అతను ఇష్టపడని వాటిని గురించి ప్రస్తావించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు చాడీలు చెప్పుకోకండి. మీలో ఎవడైనా చచ్చిన తన సోదరుని మాంసం తినటానికి ఇష్టపడతాడా? మీరు దానిని అసహ్యించుకుంటారు కదా! అల్లాహ్ పట్ల భయ-భక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణాప్రధాత.} [అల్ హుజరాత్ : 12]
ప్రశ్న23: చాడీలు చెప్పటం అంటే ఏమిటి?
జవాబు: అపనిందలు వేయడం, పుకార్లు పుట్టించడం అంటే ఇది ప్రజల మధ్య అపనమ్మకం మరియు విభేదాలను కలిగించే ఉద్దేశ్యంతో ప్రజల మధ్య ఒకరి మాటలను మరొకరికి చేరవేయడం.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: అపనిందలు వేసేవాడుం, చాడీలు చెప్పేవాడు స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేడు’
24: సోమరితనము, బద్ధకము అంటే ఏమటి?
జవాబు: సత్కార్యాలు చేయడంలోనూ, విధులు నిర్వర్తించడంలోనూ అలసత్వం వహించడం.
వాజిబాతు (కర్తవ్య బాధ్యత) లను నిర్వర్తించడంలో అలసత్వం కూడా ఇందులోని ఒక భాగమే.:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!} [నిసా : 142]
కాబట్టి ఒక విశ్వాసి బద్ధకాన్ని, అలసత్వాన్ని మరియు సోమరితనాన్ని విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు నచ్చే విధంగా ఈ జీవితంలో కష్టపడి పని చేయాలి.
ప్రశ్న25: కోపం యొక్క రకాలను పేర్కొనండి?
జవాబు: 1 - ప్రశంసనీయమైన కోపం: అవిశ్వాసులు, కపటులు లేదా ఇతరులు అల్లాహ్ యొక్క విషయంలో దేనినైనా ఉల్లంఘించినప్పుడు, హద్దుమీరి నప్పుడు అల్లాహ్ కోసం వచ్చే కోపం.
2 - అంగీకరించబడని అవమానకరమైన కోపం: ఒకరు పలక కూడని మాటను నోటితో పలికించడానికి మరియు చేయకూడని పనిని అతనితో చేయించడానికి పురిగొల్పేది కోపమే.
నిందనీయ కోపానికి చికిత్స:
వెంటనే వుజూ చేయడం
నిలబడినవాడు కూర్చోవడం, కూర్చున్నవాడు పడుకోవడం
ఈ విషయంలో "కోప పడకండి" అని పలికిన ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సలహాకు కట్టుబడి ఉండటం.
కోపం వచ్చినప్పుడు తనను తాను నియంత్రించుకోవడం.
శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను అని వేడుకోవడం.
మౌనంగా ఉండడం.
26: గూఢచర్యం అంటే ఏమిటి?
జవాబు: - ఇది ప్రజల తప్పులను మరియు వారు గోప్యంగా దాచి ఉంచిన వాటిని వెతకడం మరియు వాటిని బహిర్గతం చేయడం.
నిషేధితమైన గూఢచర్యానికి ఉదాహరణలు:
- వ్యక్తుల ఇళ్లలోని వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించడం.
- ప్రజల వ్యక్తిగత సంభాషణలు వినడానికి ప్రయత్నించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {ఒకరిపై నొకరు గూఢచర్యం చేయవద్దు.} [అల్ హుజరాత్ : 12]
27: వ్యర్థం, దుబారా అంటే ఏమిటి? లోభితనం, పిసినారితనం అంటే ఏమిటి? దాతృత్వం అంటే ఏమిటి?
జవాబు: వృధా చేయడం అంటే డబ్బును దాని హక్కులకు భిన్నంగా అసమర్థంగా, అనవసరంగా ఖర్చు పెట్టడం. ఇది లోభితనానికి, పిసినారితనానికి వ్యతిరేకం, అంటే డబ్బును అవసరమైనప్పుడు కూడా వాడకుండా నిలిపి ఉంచడం
సరైన వైఖరి ఏమిటంటే వ్యర్థం చేయకుండా మరియు పిసినారితనం చూపకుండా, మధ్యస్థ మార్గంలో అవసరమైనప్పుడు తగిన మోతాదులో దాని హక్కు ప్రకారం ఖర్చు పెట్టడం అంటే ఉదారంగా ఉండటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు ఎవరైతే ఖర్చు చేసేటప్పుడు అనవసర ఖర్చు గానీ లేక లోభత్వం గానీ చేయకుండా, ఈ రెండింటి మధ్య మితంగా ఉంటారో;} [ఫుర్ఖాన్ : 67]
28: పిరికితనం అంటే ఏమిటి? శౌర్యం అంటే ఏమిటి?
జవాబు: - పిరికితనం అంటే భయపడకూడని దానికి భయపడటం.
ఉదాహరణకు నిజం చెప్పడానికి లేదా చెడును నిషేధించడానికి భయపడటం వంటివి.
శౌర్యం అంటే అధర్మానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం చేయడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించడం. ఉదాహరణకు ఇస్లాంను మరియు ముస్లింలను రక్షించేందుకు అల్లాహ్ మార్గంలో పోరాడటం, సత్యం పక్షాన పోరాడటం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన దుఆలో (ప్రార్థనలో) ఇలా వేడుకునేవారు: ఓ అల్లాహ్! పిరికితనం నుండి నీ శరణు వేడుకుంటున్నాను.(అల్లాహుమ్మఇన్నీఅవూదుబిక మినల్' జుబ్'ని).
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: బలహీన విశ్వాసి కంటే బలమైన విశ్వాసి అల్లాహ్ కు ఎంతో ప్రియమైనవాడు మరియు రెండింటిలోనూ మంచి ఉంది.
ప్రశ్న 29: పెను భాషలోని కొన్ని నిషేధిత మాటలు ఏమిటి?
జవాబు: - శాపము, తిట్లు మరియు అవమానాలు.
- ఎవరినైనా హైవాన్ (జంతువు) లేదా అలాంటిది అనడం.
- అసభ్యకరమైన, అశ్లీలమైన, నీచమైన, సిగ్గుమాలిన పదాలు పలకడం.
- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలాంటి వాటిని నిషేధించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: - విశ్వాసి అనువాడు ‘దెప్పిపొడవడం,శపించడం ,సిగ్గుమాలినతనం మరియు దురుసుతనం లాంటి దుర్గుణాలకు ఆమడ దూరంలో ఉంటాడు.
ప్రశ్న 30: మంచి నైతిక లక్షణాలను అవలంబించడానికి ముస్లింని సహాయం చేసే కారణాలు ఏమిటి?
జవాబు: 1- మీకు మంచి నైతికతను ప్రసాదించమని మరియు దానికి కట్టుబడి ఉండటానికి మీకు సహాయం చేయమని అల్లాహ్ ను వేడుకోవడం.
2 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల నిరంతరం శ్రద్ధ వహించడం మరియు ఆయన మిమ్మల్ని పూర్తిగా తెలుసుకుంటాడని, వింటాడని మరియు చూస్తాడని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం.
3 - మంచి నైతికత యొక్క ప్రతిఫలాన్ని మరియు అవి స్వర్గంలో ప్రవేశించడానికి కారణం అవుతాయని గుర్తుంచుకోవడం.
4 - దుర్గుణాల యొక్క పరిణామాలను మరియు అవి నరకాగ్నిలోకి ప్రవేశించడానికి కారణం అవుతాయని గుర్తుంచుకోవడం.
5 - మంచి నైతికత సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మరియు ఆయన సృష్టి యొక్క ప్రేమను గెలుచుకోవడానికి దారి తీస్తుంది, అయితే దుర్గుణాలు అల్లాహ్ మరియు అతని సృష్టి యొక్క కోపానికి గురి చేస్తాయి.
6 - ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్రను చదవడం మరియు ఆయనను ఆదర్శంగా తీసుకోవడం.
7 - మంచి వ్యక్తుల సహవాసంలో ఉండటం మరియు చెడు వ్యక్తుల సాంగత్యానికి దూరంగా ఉండటం
*******
దుఆలు మరియు అజ్'కార్ ల విభాగము
జిక్ర్ (అల్లాహ్ స్మరణ) యొక్క జ్ఞానం :
జిక్ర్ యొక్క నిర్వచనం : అది అల్లాహ్‌ను స్మరణ చేసేందుకు నాలుకతో చేయు చలనం, ఇది తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ అనడం), తక్బీర్ (అల్లాహు అక్బర్ అనడం), తస్బీహ్ (సుభ్హానల్లాహ్ అనడం), తహ్మీద్ (అల్-హమ్దు లిల్లాహ్ అనడం), ఇస్తిగ్ఫార్ (మన్నింపు కోరడం), మరియు అల్లాహ్‌ను పొగడ్త చేయడం ఉదయం, సాయంకాలం స్మరణలు, నమాజుల సందర్భంలో చేయు స్మరణలుు, నిద్రపోయే ముందు, మేల్కొనే సమయంలో, మరియు ఇతర సంధర్భాలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన వాక్యాలు.
మనసు మరియు నాలుక రెండూ సమానంగా అంగీకరించి చేసే స్మరణ ఉత్తమమైన స్మరణ.
1: అజ్'కార్ (అల్లాహ్ ధ్యానం, జిక్ర్) యొక్క ఔన్నత్యం, ప్రాధాన్యత ఏమిటి?
జవాబు : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ‘అల్లాహ్ నామస్మరణ జపించేవాడి మరియు జపించని వాడి ఉపమానము ప్రాణమున్న జీవి మరియు ప్రాణం లేని నిర్జీవితో సమానం.
ఎందుకంటే సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను ఎంత తరచుగా స్మరించుకుంటాడనే దానిపై మనిషి జీవితం యొక్క విలువ మరియు శ్రేష్ఠత ఆధారపడి ఉంటుంది.
2: జిక్ర్ (అల్లాహ్ ధ్యానం) యొక్క కొన్ని ప్రయోజనాలను పేర్కొనండి?
జవాబు: 1- ఇది అత్యంత కరుణామయుడైన అల్లాహ్ ను సంతోషపరుస్తుంది.
2 - ఇది చెడును తొలగిస్తుంది.
3 - ఇది ఒక ముస్లింను చెడు నుండి రక్షిస్తుంది.
4 - ఇది మంచి పర్యవసనాన్ని మరియు ప్రతిఫలాన్ని తెస్తుంది.
3: ఏది ఉత్తమమైన జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)?
4: నిద్ర నుండి మేల్కొన్నప్పుడు ఏమని పలకాలి?
జవాబు: చనిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి బ్రతికించిన అల్లాహ్ కే సమస్త స్తోత్రములు, మరియు ఆయన వైపునకే మనమంతా మరలిపోవలసి ఉన్నది.
5వ ప్రశ్న: దుస్తులు ధరించేటప్పుడు ఏమని పలకాలి?
జవాబు: నాకు దీనిని (దుస్తులని) ధరింపజేసిన మరియు నా శక్తి సామర్ధ్యాల ప్రమేయం లేకుండా నాకు వాటిని ప్రసాదించిన ఆ అల్లాహ్ కే సమస్త స్తోత్రములు శోభిస్తాయి.
6: దుస్తులు విడుస్తున్నప్పుడు ఏమని పలకాలి?
జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో
7: నూతన దుస్తులు ధరించినప్పుడు చదువు దుఆలు?
జవాబు: ఓ అల్లాహ్ సమస్త స్తోత్రములు నీకే చెందును. నీవే నాకు వీటిని తొడిగించావు. దీని మేలును మరియు ఏ మేలు కొరకైతే ఇవి తయారు చేయబడ్డాయో ఆ మేలును నాకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను. అలాగే దీని కీడు నుండి మరియు ఏ కీడు కొరకైతే ఇవి తయారు చేయబడ్డాయో ఆ కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను.
8: నూతన దుస్తులు ధరించే వారి కొరకు చేయు దుఆ ?
జవాబు: ఎవరైనా కొత్త వస్త్రాన్ని ధరిస్తూ ఉండగా మీరు చూసినప్పుడు, అతని కోసం ఇలా ప్రార్థించాలి: "తుబ్లీ వ యుఖ్లిఫుల్లాహు త'ఆలా" (మీరు దీనిని ధరించవచ్చు మరియు సర్వశక్తిమంతుడు మీకు ఇలాంటి మరొక దానిని కూడా ప్రసాదిస్తాడు). నీవు దానిని పాతవిగా చేయుదువు గాక మరియు అల్లాహ్ దానిని (మరో కొత్త దానితో) మార్చివేయు గాక.
ప్రశ్న9: కాలకృత్యములు తీర్చుకునే స్థలము ఐన బైతుల్ ఖలా లో ప్రవేశించేటప్పుడు పటించవలసిన దుఆ ఏమిటి?
10: టాయిలెట్ నుండి బయటికి వచ్చేటప్పుడు చేయవలసిన ప్రార్థన ఏమిటి?
జవాబు: గుఫ్రానక్ - ఓ అల్లాహ్ నన్ను క్షమించు
11: వుజూ ప్రారంభించక ముందు చేయవలసిన దుఆ ఏమిటి?
జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో
12: వుజూ పూర్తి చేసిన తరువాత పఠించు దుఆలు ఏమిటి?
13: ఇంటి నుండి బయలుదేరినప్పుడు పఠించు దుఆ ?
జవాబు: బిస్మిల్లాహ్, తవక్కల్'తు అలల్లాహ్, వలా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్. అల్లాహ్ పేరుతో (బయలుదేరుతున్నాను). నేను అల్లాహ్ నే నమ్ముకున్నాను. నష్టం చేకూర్చే శక్తి, ప్రయోజనం చేకూర్చే సామర్ధ్యం అల్లాహ్ కు తప్ప మరెవ్వరికి లేదు.
14: ఇంట్లో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?
జవాబు: బిస్మిల్లాహి వలజ్'నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ అలల్లాహి రబ్బనా తవక్కల్'నా. మేము అల్లాహ్ పేరుతో ప్రవేశించాము మరియు అల్లాహ్ పేరుతో బయటకు వెళ్ళాము మరియు మా ప్రభువుపైనే మేము నమ్మకం కలిగి ఉన్నాము. ఆ తరువాత ఇంటివారికి సలాం చేయాలి.
15: మస్జిదులో ప్రవేశించేటప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?
ప్రశ్న16: మస్జిద్ నుండి బయటకు వచ్చేటప్పుడు పఠించు దుఆ ఏమిటి?
17: అజాన్ పిలుపు వింటున్నప్పుడు ఏమి చేయ వలెను?
జవాబు: అజాన్ పలుకులనే మీరు కూడా మరలా పలుక వలెను (లోగొంతుతో రిపీట్ చేయవలెను). హయ్యా లస్సలాహ్, అలాగే హయ్యా లల్ ఫలాహ్ అని ముఅజ్జిన్ పలికినప్పుడు మాత్రము, మీరు లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అని బదులు పలుక వలెను.
18: అజాన్ పలుకులు విన్న తరువాత ఏమని దుఆ చేయవలెను?
జవాబు : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం'పై దరూద్ పఠించడం.
అజాన్ మరియు ఇఖామతుల మధ్య దుఆ చేయవలెను ఎందుకంటే ఆ సమయంలో చేసే దుఆ తిరస్కరించబడదు.
19: ఉదయం మరియు సాయంత్రం వేళల్లో చేసే జిక్ర్ (అల్లాహ్ ధ్యానం)లో ఏమి పలక వలెను?
జవాబు: 1 - ఆయతల్ కుర్సీ పఠనం : {“అల్లాహు లా ఇలాహ ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూం, లా త’ఖుజుహు, సినతు వలా నౌం, లహు మా ఫిస్సమావాతి వమా ఫిల్ అర్జ్, మన్’జల్లజీ యష్’ఫఉ, ఇందహు, ఇల్లా బిఇజ్’నిహి, యా’లము మాబైన ఐదీహిమ్, వమా ఖల్ఫహుమ్, వలా యుహీతూన బి షైఇమ్ మిన్ ఇల్మిహి, ఇల్లా బిమా షాఅ, వసిఅ కుర్సియ్యుహు స్సమావాతి వల్ అర్జ్, వలా యఊదుహు హిఫ్జుహుమా, వహువల్ అలియ్యుల్ అజీమ్”} [అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వ వ్యవస్థకు ఆధారభూతుడు, ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. ఆయన సమ్ముఖంలో – ఆయన అనుజ్ఞ లేకుండా – సిఫారసు చేయగల వాడెవడు? వారి ముందు ఉన్నదీ మరియు వారి వెనుక నున్నదీ అన్నీ ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన కోరితే తప్ప, ఆయన జ్ఞానవిశేషాలలో ఏ విషయమునూ వారు గ్రహించజాలరు. ఆయన కుర్సీ ఆకాశాలనూ మరియు భూమినీ పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఏ మాత్రం అలసట కలిగించదు. మరియు ఆయన మహోన్నతుడు, సర్వోత్తముడు.] (సూరహ్ అల్ బఖరహ్ 2:255) [అల్ బఖర : 255 ]
2. మరియు పటించండి : అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో, {ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. (1) అల్లాహ్ ఏ అవసరం లేనివాడు(నిరుపేక్షాపరుడు). (2) {ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు.} 3 {మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు. (4)} [ఇఖ్లాస్ : 1 - 4] మూడు సార్లు చదవాలి.
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో, ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1) ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2) మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3 మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4 : అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5: [ఫలక్: 1 - 5] మూడుసార్లు పటించాలి
అనంత కరుణామయుడు అపార కరుణా ప్రధాత అయిన అల్లాహ్ పేరుతో, ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!(1) మానవుల చక్రవర్తి. (2) మానవుల ఆరాధ్యదైవం (అయిన అల్లాహ్ యొక్క శరణు)! 3 కలతలు రేకెత్తించి తొలగిపోయేవాని కీడు నుండి; 4 ఎవడైతే మానవుల హృదయాలలో కలతలు రేకెత్తిస్తాడో!5 వాడు జిన్నాతులలోని వాడూ కావచ్చు లేదా మానవులలోని వాడూ కావచ్చు!6} [అన్నాస్ 1 - 6] మూడుసార్లు పటించాలి.
20: నిద్రకు ఉపక్రమించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?
జవాబు: బిస్మిక అల్లాహుమ్మ అమూతు వ అహ్యా (ఓ అల్లాహ్! నీ పేరుతోనే చనిపోతాను మరియు నీ పేరుతోనే బ్రతుకుతాను)
21: భోజనం ప్రారంభించే ముందు ఏమని దుఆ చేయవలెను?
జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో ఒకవేళ ప్రారంభంలో బిస్మిల్లాహ్ చెప్పటం మరిచిపోతే, ఇలా దుఆ చేయ వలెను. బిస్మిల్లాహ్ ఫీ అవ్వలిహీ వ ఆఖిరిహీ
22: భోజనము ముగించిన తర్వాత పఠించు దుఆ?
జవాబు: సమస్త స్తోత్రములు నన్ను తినిపించిన ఆ అల్లాహ్ కు చెందును, నా ఏ విధమైన కృషి, ఎలాంటి శక్తి లేకుండానే ఆయన నాకు ప్రసాదించాడు.
23: అతిథులు ఆతిథ్యము ఇచ్చిన వాని కొరకు ఏమని దుఆ చేయవలెను?
జవాబు: ఓ అల్లాహ్! నీవు వారికి ఇచ్చిన దానిలో వారి కొరకు మరిన్ని శుభాలు కలుగజేయి. వారిని క్షమించు వారిని కరుణించు.
24: తుమ్ము వచ్చినపుడు ఏమని దుఆ చేయవలెను?
జవాబు: అల్'హమ్'దులిల్లాహ్ నిస్సందేహంగా స్తోత్రములు అల్లాహ్ కొరకే శోభిస్తాయి. 3 - తుమ్మినవాని ప్రక్కన ఉన్న సోదరుడు లేదా సహచరుడు అతనితో ఇలా చెప్పాలి: "యర్'హముకల్లాహ్" (అల్లాహ్ మీపై దయ చూపుగాక). దానికి బదులుగా తుమ్మినవారు ఇలా పలకాలి: "యహ్'దీకుముల్లాహు వ యుస్లిహ్ బాలకుమ్" (అల్లాహ్ మీకు మార్గనిర్దేశం చేసి మీ పరిస్థితిని మెరుగుపరుచు గాక)
25: సమావేశం నుండి నిష్క్రమించేటప్పుడు, సమావేశంలో జరిగిన తప్పులకు ప్రాయశ్చితంగా అంటే కఫ్ఫారతుల్ మజ్లిస్ గా ఏమని దుఆ చేయాలి?
జవాబు: సుబహానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త, అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్తుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.
26: ప్రయాణికుడు వాహనం ఎక్కేటప్పుడు ఏమని దుఆ చేయవలెను?
జవాబు: బిస్మిల్లాహ్, వల్'హమ్'దులిల్లాహ్ - సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ 13 వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్14.[జుఖ్రుఫ్ : 13 - 14] అల్'హమ్'దులిల్లాహ్, అల్'హమ్'దులిల్లాహ్, అల్'హమ్'దులిల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. సుబహానక అల్లాహుమ్మ ఇన్నీ జలమ్'తు నఫ్'సీ ఫగ్'ఫిర్'లీ, ఫఇన్నహు లా యగ్'ఫిర ద్దునూబ ఇల్లా అంత.
ప్రశ్న27: ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏమని దుఆ చేయ వలెను?
జవాబు: అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, {సుబహానల్లదీ సఖ్ఖర లనా హాదా వమా కున్నా లహు ముఖ్రినీన్ 13. వ ఇన్నా ఇలా రబ్బినా లముంఖలిబూన్ 14.}.[జుఖ్రుఫ్ : 13 - 14] అల్లాహుమ్మ ఇన్నా నస్'అలుక ఫీ సఫరినా హాదా అల్'బిర్ వత్తఖ్'వా వ మినల్ అమల్ వా తర్'దా, అల్లాహుమ్మ హవ్విన్ అలైనా సఫరనా హాదా, వత్వి అన్న బఅదహు, అల్లాహుమ్మ అంత సాహెబు ఫిస్సఫర్, వ ఖలీఫతు ఫిల్ అహల్, అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మివ్వఅసాయి'సఫర్, వ క'అబతిల్ మంజర్, వ సూఇల్ ముంఖలిబ్ ఫిల్ మాలి వల్ అహల్.
28: స్థానికుడి కోసం ప్రయాణికుడు ఏమని దుఆ చేయవలెను?
జవాబు: అస్'తౌదిఉకుముల్లాహ్ అల్లజీ లా తదీఉ వ దాఇఉహు. (నేను నీకు అల్లాహ్ కు అప్పగించుచున్నాను, ఆయనకు అప్పగించినది ఏదీ వృధాగా పోదు).
29: ప్రయాణికుడి కోసం స్థానికుడు ఏమని దుఆ చేయవలెను?
జవాబు: 'అస్తవుదిఉల్లాహ దీనక వ అమానతక వ ఖవాతీమ అమలిక' (నేను మీ ధర్మాన్ని, మీ విశ్వాసాన్ని మరియు మీ అంతిమ కర్మలను అల్లాహ్ కు అప్పగిస్తున్నాను).
30: మార్కెట్లో ప్రవేశించే ముందు చేయవలసిన దుఆ ఏమిటి?
జవాబు: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీకలహు లహుల్'ముల్'కు లహుమ్ హమ్'దు యుహ్'యీ వ యుమీతు వహువ హయ్యి లా యమూతు బియదిహిల్ ఖైర్, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఏకైకుడు, ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే, సకల స్తోత్రములు ఆయనకే శోభిస్తాయి. ఆయనే ప్రాణం పోసేవాడు మరియు ఆయనే ప్రాణం తీసేవాడును. ఆయన నిత్యుడు, ఆయనకు మరణం లేదు. ఆయన చేతిలోనే శుభాలన్నీ ఉన్నాయి. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు).
ప్రశ్న31:కోపం వచ్చినప్పుడు చెేయవలసిన ప్రార్థనను పేర్కొనండి.?
జవాబు: అఊదు బిల్లాహి మినష్'షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను).
32: మీకు మేలు చేసిన వారి కొరకు చేయు దుఆ?
జవాబు: జజాకల్లాహ్ ఖైరా (అల్లాహ్ నీకు మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించుగాక)
33: స్వారీ చేస్తున్నప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?
జవాబు: బిస్మిల్లాహ్ - అల్లాహ్ పేరుతో
34: ఎవరికైనా ఏదైనా మంచి జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?
జవాబు: అల్'హమ్'దు లిల్లాహ్ అల్లదీ బి నేమతిహీ తతిమ్మశ్'శాలిహాత్. (స్తుతులన్నీ ఆ అల్లాహ్ కే శోభిస్తాయి, ఆయన అనుగ్రహము ద్వారా శుభకార్యాలు పరిపూర్ణమవుతాయి).
35: ఎవరికైనా ఏదైనా చెడు జరిగినప్పుడు ఏమని దుఆ చేయాలి?
జవాబు: అల్ హమ్'దు లిల్లాహి అలా కుల్లి హాల్' (అన్ని సందర్భాల్లోనూ స్తుతులన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి)
36: అభివాదము (సలాము) ఎలా చేయ వలెను మరియు అభివాదమునకు (సలాముకు) జవాబు ఎలా చెప్ప వలెను?
జవాబు: అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతహు అని అభివాదము (సలాము) చేయవలెను దానికి జవాబుగా వాఅలైకుమ్ అస్సలాము వ రహ్మతుల్లాహి వ బరకాతహు అని చెప్ప వలెను.
37: వర్షం కురుస్తున్నప్పుడు చేయవలసిన దుఆ ఏమిటి?
జవాబు: అల్లాహుమ్మ సయ్యిబన్ నాఫిఅహ్ (ఓ అల్లాహ్! ఈ వర్షాన్ని లాభదాయకమైనదిగా చేయి)
38: వర్షం కురిసిన తరువాత చేయవలసిన దుఆ ఏమిటి ?
జవాబు: మతర్'నా బి పద్'లిల్లాహి వ రహ్'మతిహీ (అల్లాహ్ అనుగ్రహంతో మరియు దయతో వర్షం కురిసింది)
ప్రశ్న39: పెనుగాలులు వీస్తున్నపుడు చేయవలసిన దుఆ ఏమిటి?
జవాబు: అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఖైరహా వ అఊదు బిక మిన్ షర్రిహా (ఓ అల్లాహ్! నిశ్చయంగా నేను దాని మేలును కోరుకుంటున్నాను,దాని కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను.)
ప్రశ్న40 : పిడుగు శబ్దం విన్నప్పుడు ఏ దుఆ చేయాలి?
జవాబు: సుబహానల్లదీ యుస'బ్బిహు ర్రఅదు బిహమ్'దిహి వ మలాఇకతు మిన్ ఖీఫతిహీ (ఆయన అత్యంత పరిశుద్ధుడు, మేఘాలు సైతం ఆయన్ని స్తుతిస్తున్నాయి, దైవదూతలు కూడా ఆయనను భయభక్తులతో స్తుతిస్తున్నాయి.)
41: బాధిత వ్యక్తిని చూసినప్పుడు అతని కొరకు ఏమని ప్రార్థన చేయ వలెను?
జవాబు : సర్వ స్తోత్రాలన్నీ ఆ అల్లాహ్ కే శోభిస్తాయి. ఎవరైతే నీవు దేనికైతే లోను చేయబడ్డావో దాని నుండి నన్ను ఆరోగ్యంగా ఉంచాడు మరియు ఆయన తన సృష్టిలో అనేకులపై నాకు ప్రాధాన్యతను వొసగాడు.
ప్రశ్న42: తనకు ఇతరుల దిష్టి తగులుతుందని భయపడే వ్యక్తి చేయు దుఆ ఏమిటి?
జవాబు : హదీసులో ఇలా ఉన్నది : మీలో ఎవరైనా తన సోదరుని లేదా తనలో లేదా తన వద్దనున్న సంపదలో సంతోషం కల్గించే విషయం చూసినట్లయితే అతనికి లేదా తన సంపదలో శుభాలు ఉంచమని అల్లాహ్ తో దుఆ చేయాలి, ఎందుకనగా దిష్టి అన్న విషయం సత్యం.
43: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఏమని దరూద్ పంప వలెను?
*******
ఇతర విషయాల విభాగం
ఇతర విషయాలు : : ఇవి అనేక శాస్త్రాల్లో ముఖ్యమైన ప్రశ్నలు మరియు జవాబుల సమాహారం.
1: ధర్మాదేశాలకు సంబంధించిన ఐదు నియమాలు ఏమిటి?
జవాబు : 1. అల్ వాజిబ్ (తప్పనిసరి, విధి)
2 - అల్ ముస్తహబ్ (చేస్తే మంచిది)
3 - అల్ ముహర్రమ్ (నిషేధించబడింది)
4 - అల్ మక్రూహ్ (చేయకపోతే మంచిది)
5 - అల్ ముబాహ్ (చేస్తే పాపమూ కాదు, పుణ్యమూ కాదు)
2: ఈ ఐదు నియమాల గురించి వివరించండి?
జవాబు : ఇది తప్పనిసరి విధంగా ఉండే ఆచరణ, ఉదాహరణకు ఐదు నమాజులు, రమజాన్ ఉపవాసం, తల్లిదండ్రులకు సేవ చేయడం.
- వాజిబ్ ఆచరణలు విధిగా అమలు చేసినందుకు ప్రతిఫలం లభిస్తుంది, కానీ వాటిని విడిచిపెడితే శిక్షలు ఉంటాయి.
2 . ముస్తహబ్ (అభిష్టం): ఇది తప్పనిసరిగా చేయవలసినది కాదు, ఉదాహరణకు సున్నత్ నమాజులు, రాత్రిపూట లేచి నమాజు చేయడం, ఆహారాన్ని పంచడం, మరియు సలాములు చెప్పడం. దీనిని సున్నత్ లేదా మన్‌దూబ్ అని కూడా అంటారు.
- ముస్తహబ్ ఆచరణలు చేస్తే ప్రతిఫలం ఉంటుంది మరియు చేయకపోతే శిక్ష ఉండదు.
ముఖ్య గమనిక:
ముస్లింలు సున్నత్ లేదా ముస్తహబ్ ఆచరణలు చేసేందుకు త్వరపడాలి మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ఉదాహరణలను అనుసరించాలి.
3. ముహర్రమ్ (నిషిద్ధం): ఇది తప్పనిసరిగా విడిచిపెట్టాల్సింది, ఉదాహరణకు మద్యం తాగడం, తల్లిదండ్రులకు అవిధేయత చూపడం, మరియు బంధుత్వాలను తెగ త్రెంపులు చేయడం.
- నిషేధించబడిన వాటిని విడిచిపెట్టినందుకు పుణ్యాలు ప్రసాదించ బడతాయి, కానీ వాటికి పాల్పడితే శిక్షలు ఉంటాయి.
4. మక్రూహ్ (అయిష్టకరమైనది): దీనిని వదలడం తప్పనిసరి కాదు, ఉదాహరణకు ఎడమ చేతితో తీసుకోవడం లేదా ఇచ్చుకోవడం, నమాజులో దుస్తులను మడత పెట్టడం.
- మక్రూహ్ పనులు (అయిష్టకరమైనవి) త్యజించినందుకు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ వాటిని చేస్తే దానివలన శిక్షలు ఉండవు.
5- ముబాహ్ (అనుమతించబడినది) : దీనిని చేయడం లేదా వదలడం రెండూ ఇష్టప్రకారం ఉంటుంది, ఉదాహరణకు యాపిల్ తినడం లేదా టీ తాగడం. దీనిని జాయిజ్ లేదా హలాల్ అని కూడా అంటారు.
- అనుమతించబడిన వాటిని విడిచిపెట్టినందుకు ప్రతిఫలం ఉండదు, అది చేయడం వలన శిక్షలూ ఉండవు.
ప్రశ్న 3: (ధర్మవిషయాలలో లోతైన జ్ఞానాన్ని సంపాదించడము) తఫఖ్ఖహు ఫిద్దీన్ ఫలితము, ప్రాధాన్యత ఏమిటి?
జవాబు: మాటలు, పనులు, మరియు విశ్వాసాలలో సరైనతనం ఉంటే, అది ఈ లోకంలో మరియు పరలోకంలో సుఖ సంతోషాలను అందిస్తుంది.
- ముఆవియ బిన్ అబూ సుఫ్యాన్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «ఎవరి పట్ల అల్లాహ్ మేలును కోరుకుంటాడో అతనికి ధార్మిక విధ్యను ప్రసాదిస్తాడు.»
యుఫఖ్ఖిహ్'హు అనగా, అతనిని షరీయా సంబంధిత నియమాలపై జ్ఞానవంతుడిగా మారుస్తుంది.
ప్రశ్న4: అమ్మకాలు మరియు లావాదేవీలపై ధార్మిక ఆదేశం ఏమిటి?
జవాబు: సూత్రప్రాయంగా, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నిషేధించిన కొన్ని తప్ప, అన్ని రకాల అమ్మకాలు మరియు లావాదేవీలు అనుమతించబడ్డాయి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు వ్యాపారాన్ని (కొనుగోళ్ళు, అమ్మకాలను) ధర్మబద్ధం చేశాడు మరియు వడ్డీలను నిషేధించాడు.} [అల్ బఖర: 275]
ప్రశ్న 5: నిషేధించబడిన కొన్ని అమ్మకాలు, లావాదేవీలు ఏమిటి?
జవాబు : 1 - మోసం: వస్తువులో లోపాన్ని దాచడం వంటివి.
- అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒకసారి (బజారులోని) ధాన్యపు కుప్ప వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం తన చేతిని అందులో జొప్పించి చూడగా, ఆయన చేతివేళ్లకు కొంత తేమ తగిలింది. అది చూసి ఆయన (అతనితో ఇలా అడిగారు: "ఓ ధాన్యపు కుప్ప యజమానీ, ఏమిటిది?" దానికి ఆ వ్యక్తి ఇలా జవాబిచ్చాడు: "ఓ రసూలుల్లాహ్, వర్షం పడింది (ధాన్యం వర్షంలో తడిసింది)". అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: "ప్రజలు చూసేలా నీవు ధాన్యం గుట్టపై భాగాన ఈ తడిసిన ధాన్యాన్ని ఎందుకు ఉంచలేదు? మోసం చేసేవాడికీ నాకూ ఎలాంటి సంబంధమూ లేదు."
2 -రిబా (వడ్డీ): ఒకరి నుండి వెయ్యి అప్పుగా తీసుకుని, రెండు వేలు తిరిగి ఇవ్వడం.
ఈ అదనపు ధనం నిషేధిత వడ్డీగా పరిగణించబడుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు వ్యాపారాన్ని (కొనుగోళ్ళు, అమ్మకాలను) ధర్మబద్ధం చేశాడు మరియు వడ్డీలను నిషేధించాడు.} [అల్ బఖర: 275 ]
3 - ఘరర్ (అనిశ్చితి, అపాయము) మరియు జహాలహ్ (అజ్ఞానం): ఆడ గొర్రె పొదుగులో ఉన్న పాలను అమ్మడం లేదా ఇంకా పట్టుకోని నీటిలో చేపలను అమ్మడం వంటివి అంటే తన ఆధీనంలో లేని దానిని అమ్మడం అన్నమాట.
- హదీసులో ఇలా ఉంది: «ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లమ్ గారు అస్పష్టమైన (పూర్తిగా తెలియని లేదా అనిశ్చితి ఉన్న) వ్యాపార లావాదేవీలను నిషేధించారు.»
ప్రశ్న6: అల్లాహ్ మీకు ప్రసాదించిన కొన్ని అనుగ్రహాలను పేర్కొనండి?
జవాబు: 1 - అవిశ్వాసిగా కాకుండా ముస్లింగా ఉండటమనే గొప్ప అనుగ్రహం
2 - మతోన్మాద ఆవిష్కర్తలను అనుసరించే వారిలో కాకుండా సున్నతుకు కట్టుబడి ఉండటం.
3 - చక్కగా వినడం, చూడడం, నడవడం మొదలైన వాటితో సహా మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అనుగ్రహాలు.
4 - ఆహారం, పానీయం మరియు బట్టలు కలిగి ఉన్న అనుగ్రహం
- వాస్తవానికి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనకు ప్రసాదించిన అనుగ్రహాలు ఎన్నో ఉన్నాయి మరియు వాటన్నింటినీ మనం లెక్కించలేము మరియు పేర్కొనలేము.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్క పెట్టదలచినా, మీరు వాటిని లెక్క పెట్టలేరు. నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.} [అన్ నహ్ల్ : 18 ]
ప్రశ్న7: మనకు ప్రసాదించబడిన అనుగ్రహాల పట్ల మన కర్తవ్యం ఏమిటి? మనం వాటికి బదులుగా ఎలా కృతజ్ఞత తెలుపుకోవలెను?
జవాబు: అల్లాహ్ ను మన నాలుకతో స్తుతించడం ద్వారా మరియు అన్ని ఉపకారాలను ఆయనకే ఆపాదించడం ద్వారా అటువంటి అనుగ్రహాలు కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలియజేయడం మన విధి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {కావున మీరు నన్నే స్మరించండి, నేను కూడా మిమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుంటాను. మరియు నాకు కృతజ్ఞులై ఉండండి మరియు నాకు కృతఘ్నులు కాకండి.} [అల్ బఖర : 152]
7: ముస్లింల పండుగలు ఏవి?
జవాబు: ఈదుల్ ఫితర్ మరియు ఈదుల్ అద్'హా అనస్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు (వలస) వచ్చినప్పుడు, ప్రజలు రెండు రోజులు ఆటపాటలలో గడపడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు : 'ఏమిటి ఈ రెండు రోజులు?' దానికి వారు ఇలా బదులు పలికారు: 'మేము ఇస్లామ్ కు పూర్వ కాలంలో ఈ రెండు దినాలలో ఆటపాటలలో గడిపేవాళ్ళం.' అప్పుడు, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: 'అల్లాహ్ మీకు ఈ రెండింటి కంటే మెరుగైన వాటిని ఇచ్చాడు: ఒకటి ఖుర్బానీ చేసే దినం (ఈద్ అల్-అద్హా) మరియు ఉపవాసాలు విరమించే దినం ( ఈద్ అల్ - ఫితర్).'"
ఈ రెండు ఈద్ పండుగలు కాకుండా మిగిలిన అన్ని పండుగలు మతపరమైన ఆవిష్కరణలుగా, నూతన కల్పితాలుగా పరిగణించబడతాయి.
8: మాసములలో ఏ మాసము ఉత్తమమైనది?
జవాబు: రమజాను మాసం
9: వారం రోజులలో ఏ రోజు ఉత్తమమైనది?
జవాబు: జుమఅహ్ రోజు
10: మొత్తం సంవత్సరంలోని దినములలో ఏ దినము ఉత్తమమైనది?
జ: అది యౌముల్ నహర్ (బలి చేసే రోజు) అని అంటారు, మరియు కొందరు యౌము అరఫా అని కూడా అంటారు.
11: మొత్తం సంవత్సరములోని రాత్రులలో ఏ రాత్రి ఉత్తమమైనది?
జవాబు: లైలతుల్ ఖదర్ రాత్రి
12: మహ్రం కాని స్త్రీని చూసినప్పుడు ఏమి చేయాలి?
జవాబు: తప్పనిసరిగా తన చూపును క్రిందికి దించుకో వలెను. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు.} [ నూర్: 30]
ప్రశ్న14: ముస్లింల స్త్రీ హిజాబ్‌కు ఉండవలసిన లక్షణాలు ఏమిటి?
జవాబు : పూర్తి శరీరమును కప్పి ఉంచాలి.
అందులో అలంకరణ ఉండకూడదు.
అది పారదర్శకంగా ఉండకూడదు.
అది విశాలంగా ఉండాలి, బిగుతుగా ఉండకూడదు.
అది పరిమళభరితమైనది లేదా సువాసనతో ఉండకూడదు.
అది పురుషుల వేషధారణను పోలి ఉండకూడదు.
అది కాఫిర్లు మరియు నైతికంగా తప్పిపోయినవారి దుస్తులను పోలి ఉండకూడదు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ ప్రవక్తా! నీ భార్యలతో, నీ కుమార్తెలతో మరియు విశ్వాసినులైన స్త్రీలతోనూ తమ దుప్పట్లను తమ మీద పూర్తిగా కప్పుకోమని చెప్పు. ఇది వారు గుర్తించబడి బాధింపబడ కుండా ఉండటానికి ఎంతో సముచితమైనది. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత.} [అల్ అహ్'జాబ్ : 59]
ఆయతు యొక్క అర్ధం : ఓ ప్రవక్తా! మీ భార్యలకు, కుమార్తెలకు మరియు విశ్వాసినుల స్త్రీలకు ఇలా చెప్పండి: తమ తలలపై మరియు ముఖాలపై తమ వస్త్రాల నుండి కొన్ని భాగాలను కప్పుకోవాలి, తద్వారా తమ ముఖాలను, ఛాతీలను మరియు తలలను కప్పి ఉంచాలి. ఇది వారికి మరింత మర్యాద మరియు రక్షణ కలిగిస్తుంది, తద్వారా వారిని ఎవరూ నష్టపరచడం లేదా బాధించడం చేయరాదు. అల్లాహ్ క్షమాశీలవంతుడు మరియు దయామయుడు ఎందుకంటే ఆయన మీ గత పాపాలను మన్నించాడు మరియు హలాల్, హరామ్‌ను స్పష్టంగా తెలియజేసి మీపై దయచూపాడు.
13: మానవుడి శత్రువులు ఎవరు?
జవాబు :1 - ఒకరిని చెడు వైపుకు ప్రేరేపించే మానవ ఆత్మ: ఇది ఒక వ్యక్తి తన ఆత్మ తనకు ఏది నిర్దేశిస్తుందో దానిని అనుసరించి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు అవిధేయత చూపడంలో అతని వ్యక్తిగత కోరికలను అనుసరించేలా చేసే ఆత్మ. పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {వాస్తవానికి మానవ ఆత్మ చెడు (పాపం) చేయటానికి పురికొల్పుతూ ఉంటుంది – నా ప్రభువు కరుణించిన వాడు తప్ప – నిశ్చయంగా, నా ప్రభువు క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత.} [యూసుఫ్ : 53]
2 - షైతాను: అతడు ఆదమ్ కుమారుడి శతృవు మరియు అతడి ప్రధాన లక్ష్యం - మనిషిని తప్పుదారి పట్టించడం, అతనిని చెడు వైపు ప్రేరేపించడం మరియు నరకాగ్నిలోకి తీసుకెళ్లడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {షై’తాన్ అడుగుజాడలను అనుసరించకండి. నిశ్చయంగా అతడు మీకు బహిరంగ శత్రువు.} [అల్ బఖర: 168]
3 - చెడ్డ సహవాసులు: వారు చెడు వైపు ఒకరిని పురికొల్పేవారు మరియు మంచితనం నుండి అతన్ని నిరోధించేవారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఆ దినమున దైవభీతి గలవారు తప్ప ఇతర స్నేహితులంతా ఒకరి కొరకు శత్రువులవుతారు.} [జుక్'రుఫ్ : 67]
ప్రశ్న 16: తఖ్వా అంటే ఏమిటి?
జవాబు : అది పుణ్యకార్యాలను చేయడం మరియు పాపాలను విడిచిపెట్టడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.} [అల్ బఖర :194]
14: తౌబహ్ (పశ్చాత్తాపం) అంటే ఏమిటి?
జవాబు: అత్తౌబహ్: పశ్చాత్తాపం అంటే పాపాలను విడిచిపెట్టి, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపడం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {అయితే, ఎవడైతే పశ్చాత్తాపపడి విశ్వసించి మరియు సత్కార్యాలు చేసి సన్మార్గంలో నడుస్తాడో, అలాంటి వాని పట్ల నేను క్షమాశీలుడను.} [తాహా:82]
15: అత్తౌబహ్ (పశ్చాత్తాపం) యొక్క షరతులు ఏమిటి?
జవాబు: 1 - చెడుపనులు, పాపకార్యాలు విడిచి పెట్టడం
2 - చేసిన చెడుపనికి, పాపకార్యానికి పశ్చాత్తాపం చెందటం
3 - మరలా ఆ చెడుపనులు, పాపకార్యాలను చేయనని దృఢనిశ్చయం చేసుకోవడం
4 - ఒకవేళ ఆ చెడుపనిలో, పాపకార్యంలో ఇతరుల హక్కులు ఉల్లంఘించి ఉంటే వాటిని వాపసు చేయడం (దొంగిలించి ఉంటే దానిని అసలు యజమానికి వాపసు చేయడం).
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు వారు, ఎవరైతే, అశ్లీల పనులు చేసినా, లేదా తమకు తాము అన్యాయం చేసుకున్నా, అల్లాహ్ ను స్మరించి తమ పాపాలకు క్షమాపణ వేడుకుంటారో! మరియు అల్లాహ్ తప్ప, పాపాలను క్షమించ గలవారు ఇతరులు ఎవరున్నారు? మరియు వారు తాము చేసిన (తప్పులను), బుద్ధిపూర్వకంగా మూర్ఖపు పట్టుతో మళ్ళీ చేయరు!} [ఆలి ఇమ్రాన్ : 135]
ప్రశ్న19: ముస్లింల కొరకు గౌరవం మరియు విజయాన్ని సాధించే మార్గం ఏమిటి?
జవాబు : అది ఇస్లామును అనుసరించడం, పాపాలు మరియు తప్పులను వదిలివేయటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! ఒకవేళ మీరు అల్లాహ్ కు (ఆయన మార్గంలో) సహాయపడితే, ఆయన మీకు సహాయం చేస్తాడు మరియు మీ పాదాలను స్థిరపరుస్తాడు.} [ముహమ్మద్:7]
అల్లాహ్ సెలవిచ్చాడు: {నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు.} [రఅద్ : 11]
ప్రశ్న20: ప్రార్థన (దుఆ) యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జ: ప్రార్థన అనేది అత్యంత మహిమాన్వితమైన ఆచారాలలో ఒకటి మరియు గొప్ప సన్నిహిత చర్య.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {మరియు మీ ప్రభువు ఇలా అన్నాడు: "నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనలను అంగీకరిస్తాను. నిశ్చయంగా, ఎవరైతే నా ప్రార్థనల పట్ల దురహంకారం చూపుతారో, వారు తప్పక అవమానితులై నరకంలో ప్రవేశించగలరు."} [గాఫిర్ : 60]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు : నిశ్చయంగా దుఆ యే ఆరాధన.
16: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పంపడం అంటే ఏమిటి?
జవాబు: అంతిమదినంనాడు జరిగే అత్యున్నత సమావేశంలో తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం)ప్రస్తావనను గొప్పగా ప్రస్తావించమని అల్లాహ్ ను వేడుకోవడం.
17: సుబహానల్లాహ్ అంటే అర్థం ఏమిటి?
జవాబు: ఇది ఒక తస్బీహ్ పదం అంటే అల్లాహ్ యొక్క ధ్యానం చేసే పదం. దీని అర్థం ఎలాంటి లోపములకూ, కొరతలకూ అతీతుడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అని ప్రశంసించడం.
18: అల్'హమ్'దు లిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?
జవాబు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌ను స్తుతించడం మరియు పరిపూర్ణత యొక్క అన్ని లక్షణాలతో ఆయనను ప్రశంసించడం, ఆయనకు కృతజ్ఞతలు తెలుపు కోవడం.
19: అల్లాహు అక్బర్ అంటే అర్థం ఏమిటి?
జవాబు: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అన్నిటికంటే, అందరి కంటే గొప్పవాడు మరియు అత్యంత శక్తిమంతుడు అని దీని అర్థం.
20: లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్ అంటే అర్థం ఏమిటి?
జవాబు: అల్లాహ్ యొక్క బలం మరియు శక్తి ద్వారా తప్ప స్వయంగా ఒక వ్యక్తి ఒక స్థితి నుండి మరొక స్థితికి మారలేడు.
21: అస్తగ్'ఫిరుల్లాహ్ అంటే అర్థం ఏమిటి?
జవాబు: ఒకరి పాపాలను తుడిచివేయమని మరియు లోపాలను కప్పిపుచ్చమని సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను కోరడం.
*******
ముగింపు.
ఇక చివరగా:
ఇవి తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా వివరించాల్సిన మరియు పునరావృతం చేయవలసిన కొన్ని ప్రశ్నలు. తద్వారా వారు మంచి మాటలు, పనులు మరియు విశ్వాసాలపై పెరుగుతారు. మహోన్నతుడైన అల్లాహ్ ప్రకటించినట్లు, పిల్లలకు ఆహారం ఇవ్వడం మరియు బట్టలు పెట్టడం కంటే పిల్లలను మంచి మనిషిగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : {ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని మరియు మీ కుటుంబం వారిని, మానవులు మరియు రాళ్ళు ఇంధనం కాబోయే నరకాగ్ని నుండి కాపాడుకోండి! దానిపై ఎంతో బలిష్ఠులూ, కఠినులూ అయిన దైవదూతలు నియమింపబడి ఉంటారు. వారు అల్లాహ్ ఇచ్చిన ఆజ్ఞను ఉల్లంఘించరు మరియు వారికిచ్చిన ఆజ్ఞలనే నెరవేరుస్తూ ఉంటారు.} [తహ్'రీమ్:6]
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక పురుషుడు తన కుటుంబానికి సంరక్షకుడు మరియు అతని సంరక్షణలో ఉన్నవారికి బాధ్యత వహిస్తాడు మరియు స్త్రీ తన భర్త కుటుంబానికి సంరక్షకురాలిగా మరియు (అతను లేనప్పుడు) వారికి బాధ్యత వహిస్తుంది.
అల్లాహ్ మన మహానాయకుడు అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులపై శుభాలను, శాంతిని ప్రసాదించుగాక.
Related books
All books
ముస్లిం తప్పక తెలుసుకోవలసిన జ్ఞానము78 భాషలుముస్లిం తప్పక తెలుసుకోవలసిన జ్ఞానము
"ముస్లిం తప్పక తెలుసుకోవలసిన జ్ఞానము" అనే పుస్తకం ఒక మహత్తరమైన పుస్తకం, దీని అక్షరాలు జ్ఞానము మరియు వివరణ అనే సిరాతో రాయబడ్డాయి. ముస్లింకి తప్పకుండా తెలియవలసిన విషయాలలో నుండి, ఆధ్యాత్మిక విశ్వాస మూలాలు, ఇస్లాం శాసనాలు, శ్రేష్ఠ ఆచారాలు అన్నింటినీ సమగ్రంగా కూడగట్టింది. ఇది అద్భుతమైన శైలిలో ఉంది, దీని ద్వారా దృష్టులు ప్రకాశిస్తాయి,హృదయాలు ప్రశాంతమౌతాయి. ఇది అవగాహనను శ్రద్ధగా పరిపుష్టం చేస్తుంది, ఆచరణను సరిదిద్దుతుంది. కాబట్టి ఇది వాస్తవముగా రక్షణకు తాళం చెవి, విధేయత మరియు జ్ఞాన మార్గాలలో నడిచే వారికి మార్గదర్శకము.
సుఖమైన జీవితం కొరకు ఉపయోగకరమైన సాధనాలు.85 భాషలుసుఖమైన జీవితం కొరకు ఉపయోగకరమైన సాధనాలు.
షేఖ్ అబ్దుర్ రహ్మాన్ బిన్ నాసిర్ అస్సఅదీ రాసిన సుఖమైన జీవితానికి ఉపయోగకరమైన సాధనాలు అనే పుస్తకం నిజమైన సంతోషానికి దారితీసే కారణాలను లోతైన విశ్వాస దృష్టికోణంలో పరిశీలిస్తుంది. ఇది పాఠకుడిని విశ్వాసం, సత్కార్యాలు, అల్లాహ్ స్మరణ, సంతృప్తి, అనుగ్రహాలపై ధ్యానం, దయ, అల్లాహ్‌పై ఆధారపడటం, సహనం, విషయాల అర్థాన్ని గ్రహించడం ద్వారా హృదయ ప్రశాంతత వైపు దారి చూపుతుంది. అందమైన శైలిలో, ఈ పుస్తకం జీవనంలోని మార్పులు, ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ ప్రశాంతమైన, సమతుల్యమైన, ఆనందకరమైన జీవితం కోసం ఒక మార్గచిత్రాన్ని మీ చేతుల్లో ఉంచుతుంది.
సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్యమైన పాఠాలు78 భాషలుసాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్యమైన పాఠాలు
అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ వారి 'సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్యమైన పాఠాలు' అనే పుస్తకం గొప్ప ప్రయోజనకరమైన ఒక సంక్షిప్త పత్రిక. ప్రతి ముస్లింకు సరైన విశ్వాసం మరియు ఆరాధనను దగ్గర చేయడానికి, ఖుర్ఆన్ మరియు సున్నత్ ఆధారాలతో, సులభమైన, స్పష్టమైన శైలిలో, సాధారణ ముస్లింల కొరకు ఒక విజ్ఞాన నిధిగా దీనిని ఇమామ్ గారు రచించారు. దీనిలో వారు తౌహీద్, ఈమాన్, ఇస్లాం వంటి ధర్మ మూలాలు మరియు మూలస్తంభాల నుండి మొదలుకొని, పవిత్రత మరియు నమాజ్ నియమాలు, ఇస్లామీయ మర్యాదలు, మరియు షిర్క్, ఇతర పాపాల నిషేధాల వరకు వివరించారు.
దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ వెలుగులో ఇస్లాం గురించి సంక్షిప్త సందేశం61 భాషలుదివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ వెలుగులో ఇస్లాం గురించి సంక్షిప్త సందేశం
అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో, అల్-ఇస్లాము. ఆధారాల నుండి ఖాళీ శీర్షిక (1) (1) ఈ శీర్షిక యొక్క మరొక కాపీ దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ యొక్క ఆధారాలతో సహా ఉన్నది. దానిని వీక్షించడానికి ఈ లింక్ ను సంప్రదించగలరు : https://islamhouse.com/ar/books/2830071 ఇది ఇస్లాం యొక్క సంక్షిప్త పరిచయాన్ని తెలియజేసే చాలా ముఖ్యమైన శీర్షిక. ఇది ఇస్లాం ధర్మం యొక్క సిద్ధాంతాలు మరియు బోధనలు మరియు దాని శుభాలను వాటి అసలైన మూలాధారాలైన దివ్యఖుర్ఆన్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్ యొక్క ఆధారాలతో పొందుపరచబడింది. ఈ సందేశం యొక్క సంబోధితులు పరిస్థితులు…