1 : 6
ٱهۡدِنَا ٱلصِّرَٰطَ ٱلۡمُسۡتَقِيمَ
మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి.
Explanation & meanings · 1
- ఋజుమార్గం అంటే, అంతులేని సర్వసుఖసంతోషాలు గల శాశ్వత స్వర్గాన్ని పొందే మార్గం. దానిని పొందటానికి మానవుడు తన ఆరాధనను కేవలం అల్లాహ్ (సు.తా.) కే ప్రత్యేకించుకొని, సత్కార్యాలు చేయాలి. అల్లాహుతా'ఆలాను తప్ప మరెవ్వరినీ ఆరాధ్యదైవాలుగా చేసుకోరాదు.