Skip to content
آل عِمران /

ఆయత్ 110

3 : 110

ఆయత్ 110 of آل عِمران (3 : 110). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 110

كُنتُمۡ خَيۡرَ أُمَّةٍ أُخۡرِجَتۡ لِلنَّاسِ تَأۡمُرُونَ بِٱلۡمَعۡرُوفِ وَتَنۡهَوۡنَ عَنِ ٱلۡمُنكَرِ وَتُؤۡمِنُونَ بِٱللَّهِۗ وَلَوۡ ءَامَنَ أَهۡلُ ٱلۡكِتَٰبِ لَكَانَ خَيۡرٗا لَّهُمۚ مِّنۡهُمُ ٱلۡمُؤۡمِنُونَ وَأَكۡثَرُهُمُ ٱلۡفَٰسِقُونَ

మీరే (విశ్వాసులే) మానవజాతి (హితం) కొరకు నిలబెట్టబడిన ఉత్తమ సమాజం వారు. మీరు ధర్మాన్ని ఆదేశించే (బోధించే) వారు మరియు అధర్మాన్ని నిషేధించే (నిరోధించే) వారు మరియు మీరు అల్లాహ్ యందు విశ్వాసం కలిగి ఉన్నవారు. మరియు ఒకవేళ గ్రంథప్రజలు విశ్వసిస్తే, వారికే మేలై ఉండేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే (ఫాసిఖూన్).

Explanation & meanings · 2
  1. అబూహురైరా కథనం: "మీరే (సత్యధర్మమైన ఇస్లాంను మరియు దైవప్రవక్త ('స'అస) సున్నతులను అనుసరించే వారే), ఉత్తమమైన మానవసమాజానికి చెందినవారు." ('స. బు'ఖారీ పుస్తకం - 6, 'హదీస్' నం. 80).
  2. 'అబ్దుల్లాహ్ బిన్ - సల్లాం (ర'ది. 'అ.) వంటి వారు.