Skip to content
المَائدة /

ఆయత్ 2

5 : 2

ఆయత్ 2 of المَائدة (5 : 2). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المَائدة ఆయతులు 120
సూరా · المَائدة
తెలుగు · Muhammad
5 : 2

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُحِلُّواْ شَعَٰٓئِرَ ٱللَّهِ وَلَا ٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَلَا ٱلۡهَدۡيَ وَلَا ٱلۡقَلَٰٓئِدَ وَلَآ ءَآمِّينَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ يَبۡتَغُونَ فَضۡلٗا مِّن رَّبِّهِمۡ وَرِضۡوَٰنٗاۚ وَإِذَا حَلَلۡتُمۡ فَٱصۡطَادُواْۚ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَـَٔانُ قَوۡمٍ أَن صَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ أَن تَعۡتَدُواْۘ وَتَعَاوَنُواْ عَلَى ٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَلَا تَعَاوَنُواْ عَلَى ٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ

ఓ విశ్వాసులారా! అల్లాహ్ (నియమించిన) చిహ్నాలను మరియు నిషిద్ధ మాసాన్ని ఉల్లంఘించకండి. మరియు బలి పశువులకు మరియు మెడలలో పట్టీ ఉన్న పశువులకు (హాని చేయకండి). మరియు తమ ప్రభువు అనుగ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (కఅబహ్ కు) పోయే వారిని (ఆటంక పరచకండి). కానీ ఇహ్రామ్ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్ హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారి పట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు.

Explanation & meanings · 3
  1. ష'ఆయి'రల్లాహ్: అల్లాహ్ చిహ్నాలు. అంటే పవిత్రమైనవని సూచించిన నిదర్శనాలు, సంకేతాలు, ప్రత్యేక ధర్మవిధులను నిర్వహించటానికి చూపబడిన స్థానాలు. ఉదా: క'అబహ్, 'సఫా-మర్వాలు, మరియు ధర్మ ఆచారాలు, 'తవాఫ్, స'యీ మొదలైనవి.
  2. నిషిద్ధ మాసాలు : రజబ్, జు'ల్ - ఖాయిదహ్, జు'ల్-'హిజ్జహ్ మరియు ము'హర్రమ్ ('అరబ్బీ 7, 11, 12 మరియు 1వ నెలలు) ఈ మాసాలలో యుద్ధం చేయటం నిషిద్ధం.
  3. 1) హద్ యున్ : అంటే 'హాజీ, 'హజ్ కొరకు, 'హరంలో బలి (ఖుర్బానీ) చేయటానికి తెచ్చే పశువు. 2) ఖలాయి దతున్': 'హరమ్ కు తీసుకుని పోవుటకు నిశ్చయించి, వాటి మెడలలో పట్టీలు వేసిన పశువు. 3) ఫిద్ యతున్ : ధర్మ ఆచారంలో అయిన తప్పులకు పరిహారంగా ఇచ్చే బలి (ఖుర్బానీ). దీని మాంసం పూర్తిగా పేదవారిలో పంచాలి.