Skip to content
الأحزَاب /

ఆయత్ 6

33 : 6

ఆయత్ 6 of الأحزَاب (33 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الأحزَاب ఆయతులు 73
సూరా · الأحزَاب
తెలుగు · Muhammad
33 : 6

ٱلنَّبِيُّ أَوۡلَىٰ بِٱلۡمُؤۡمِنِينَ مِنۡ أَنفُسِهِمۡۖ وَأَزۡوَٰجُهُۥٓ أُمَّهَٰتُهُمۡۗ وَأُوْلُواْ ٱلۡأَرۡحَامِ بَعۡضُهُمۡ أَوۡلَىٰ بِبَعۡضٖ فِي كِتَٰبِ ٱللَّهِ مِنَ ٱلۡمُؤۡمِنِينَ وَٱلۡمُهَٰجِرِينَ إِلَّآ أَن تَفۡعَلُوٓاْ إِلَىٰٓ أَوۡلِيَآئِكُم مَّعۡرُوفٗاۚ كَانَ ذَٰلِكَ فِي ٱلۡكِتَٰبِ مَسۡطُورٗا

విశ్వాసులకు (ముస్లింలకు), దైవప్రవక్త స్వయంగా తమ కంటే కూడా ముఖ్యుడు. మరియు అతని భార్యలు వారికి తల్లులు. అల్లాహ్ గ్రంథం ప్రకారం రక్తసంబంధీకులు - ఇతర విశ్వాసుల మరియు వలస వచ్చిన వారి (ముహాజిరీన్) కంటే - ఒకరి కొకరు ఎక్కువగా పరస్పర సంబంధం (హక్కులు) గలవారు. కాని! మీరు మీ స్నేహితులకు మేలు చేయగోరితే (అది వేరే విషయం)! వాస్తవానికి ఇదంతా గ్రంథంలో వ్రాయబడి వుంది.

Explanation & meanings · 3
  1. దైవప్రవక్త ('స'అస) ప్రవచనం: 'నేను, మీకు మీ తండ్రులకంటే, మీ సంతానం కంటే మరియు సర్వమానవుల కంటే ఎక్కువ ప్రీతిపాత్రుడనయ్యేంత వరకు మీరు నిజమైన విశ్వాసులు కాజాలరు!' (బు'ఖారీ ముస్లిం) - అనస్ (ర'ది.'అ.) కథనం.
  2. దైవప్రవక్త ('స'అస) భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు) ముస్లింల తల్లుల వంటి వారు. కాబట్టి ఈ ఆయత్ శాసనం ప్రకారం దైవప్రవక్త మరణం తరువాత, వారిని ఎవ్వరూ వివాహమాడరాదు. ఇంకా చూడండి 8:75. అందులో విశ్వాసుల పరస్పర సహోదరత్వం తెలుపబడింది. మరియు ఈ ఆయత్ లో ఒక విశ్వాసునికి, దైవప్రవక్త ('స'అస) మరియు అతని భార్యలు (ర'ది. 'అన్హుమ్ లు), తల్లిదండ్రుల వంటి వారు అని తెలుపబడింది..
  3. చూడండి, 49:10 మరియు 8:75 దగ్గరి బంధువులు తప్ప ఇతరులు వారసులు కాలేరు.