106 : 2
إِۦلَٰفِهِمۡ رِحۡلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيۡفِ
(అల్లాహ్ కరుణ మరియు ఆయన రక్షణతో) వారు శీతాకాలపు మరియు వేసవి కాలపు ప్రయాణాలు చేయ గలుగుతున్నారు.
Explanation & meanings · 1
- ఈలాఫున్: ఖురైషుల ముఖ్య వృత్తి వ్యాపారం వారు సీతాకాలంలో యమన్ కు మరియు వేసవి కాలంలో సిరియాకు వ్యాపారానికి పోయేవారు. వారు కా'బా నిర్వాహకులు కావటం వల్ల వారి వాణిజ్య బృందాలు ఎలాంటి ఆటంకం, అపాయం లేకుండా ప్రయాణం చేయగలిగేవి.