13 : 11
لَهُۥ مُعَقِّبَٰتٞ مِّنۢ بَيۡنِ يَدَيۡهِ وَمِنۡ خَلۡفِهِۦ يَحۡفَظُونَهُۥ مِنۡ أَمۡرِ ٱللَّهِۗ إِنَّ ٱللَّهَ لَا يُغَيِّرُ مَا بِقَوۡمٍ حَتَّىٰ يُغَيِّرُواْ مَا بِأَنفُسِهِمۡۗ وَإِذَآ أَرَادَ ٱللَّهُ بِقَوۡمٖ سُوٓءٗا فَلَا مَرَدَّ لَهُۥۚ وَمَا لَهُم مِّن دُونِهِۦ مِن وَالٍ
ప్రతివాని ముందూ వెనుకా ఆయన నియమించిన, ఒకరి వెంట ఒకరు వచ్చే కావలివారు (దైవదూతలు) ఉన్నారు. వారు అల్లాహ్ ఆజ్ఞానుసారం అతనిని (మనిషిని) కాపాడుతూ ఉంటారు. నిశ్చయంగా, ఒక జాతి వారు తమ స్థితిని తాము మార్చుకోనంత వరకు, అల్లాహ్ వారి స్థితిని మార్చడు. అల్లాహ్ ఒక జాతి వారికి కీడు చేయదలిస్తే దానిని ఎవ్వరూ తొలగించలేరు. మరియు వారికి ఆయన తప్ప మరొక స్నేహితుడు (ఆదుకునేవాడు) లేడు.
Explanation & meanings · 2
- అంటే ఎడతెగకుండా ఒకరి తరువాత ఒకరు రాత్రింబవళ్ళు కాపలా ఉంటారు.
- చూడండి, 8:53.