103 : 3
إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوۡاْ بِٱلۡحَقِّ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ
కాని విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మరియు ఒకరికొకరు సత్యాన్ని బోధించుకునే వారు మరియు ఒకరికొకరు సహనాన్ని (స్థైర్యాన్ని) బోధించుకునే వారు తప్ప!
Explanation & meanings · 1
- ఇలాంటి నష్టం నుండి తప్పించుకోగల వారు ఎవరంటే: ఒకే ఒక్క ఆరాధ్యుడైన అల్లాహ్ (సు.తా.)ను విశ్వసించి సత్కార్యాలు చేసేవారు మరియు అల్లాహ్ (సు.తా.) ఆదేశాలను పాటించేవారు, అల్లాహ్ (సు.తా.) నిషేధించిన వాటి నుండి దూరంగా ఉండేవారు, కష్టకాలంలో సహనం వహించి, సత్య ధర్మ ప్రచారం చేస్తూ ఉండేవారు.