4 : 142
إِنَّ ٱلۡمُنَٰفِقِينَ يُخَٰدِعُونَ ٱللَّهَ وَهُوَ خَٰدِعُهُمۡ وَإِذَا قَامُوٓاْ إِلَى ٱلصَّلَوٰةِ قَامُواْ كُسَالَىٰ يُرَآءُونَ ٱلنَّاسَ وَلَا يَذۡكُرُونَ ٱللَّهَ إِلَّا قَلِيلٗا
నిశ్చయంగా, ఈ కపట విశ్వాసులు అల్లాహ్ ను మోసగించగోరుతున్నారు. కాని ఆయనే వారిని మోసంలో పడవేశాడు. మరియు ఒకవేళ వారు నమాజ్ కొరకు నిలిచినా శ్రద్ధాహీనులై కేవలం ప్రజలకు చూపటానికే నిలుస్తారు. మరియు వారు అల్లాహ్ ను స్మరించేది చాల తక్కువ!
Explanation & meanings · 2
- చూడండి, 57:12-15.
- కపటవిశ్వాసులకు 'ఇషా మరియు ఫజ్ర్ నమా'జ్ లు చేయటం చాలా కఠినంగా ఉంటుంది. ('స'హీ'హ్ బు'ఖారీ). వారు ఇతరులకు చూపటానికి మరియు ముస్లింలను తమను గురించి అంధకారం (అయోమయం)లో ఉంచటానికే నమా'జ్ చేస్తారు. వారు చేసే నమా'జ్ లలో భయభక్తులు ఉండవు.