2 : 194
ٱلشَّهۡرُ ٱلۡحَرَامُ بِٱلشَّهۡرِ ٱلۡحَرَامِ وَٱلۡحُرُمَٰتُ قِصَاصٞۚ فَمَنِ ٱعۡتَدَىٰ عَلَيۡكُمۡ فَٱعۡتَدُواْ عَلَيۡهِ بِمِثۡلِ مَا ٱعۡتَدَىٰ عَلَيۡكُمۡۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ مَعَ ٱلۡمُتَّقِينَ
నిషిద్ధ మాసానికి బదులు నిషిద్ధ మాసమే మరియు నిషిద్ధ స్థలాలలో న్యాయ ప్రతీకారం (ఖిసాస్) తీసుకోవచ్చు. కాబట్టి మీపై ఎవరైనా దాడి చేస్తే, మీరు కూడా వారిపై అదే విధంగా దాడి చేయండి. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ భయభక్తులు గలవారికి తోడుగా ఉంటాడని తెలుసుకోండి.
Explanation & meanings · 1
- నిషిద్ధ మాసాలు: జు'ల్ - ఖాఇదహ్, జు'ల్ హిజ్జహ్, ము'హర్రం మరియు రజబ్ (హిజ్రీ శకపు 11, 12, 1, 7 మాసాలు). ఈ మాసాలలో యుద్ధం చేయటం ఇస్లాంకు పూర్వం నుండి కూడా అరేబియా వాసులలో నిషేధించబడి ఉండింది. చూడండి, 2:217. ఈ నిషేధాలను దరూ గౌరవించాలి. ఎదుటి వారు వాటిని గౌరవించని పక్షంలో వారితో పోరాడి ప్రతీకారం తీర్చుకోవచ్చు.