114 : 1
قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
ఇలా అను: "నేను మానవుల ప్రభువు (అల్లాహ్) ను శరణుకై వేడుకుంటున్నాను!
Explanation & meanings · 1
- రబ్బున్: పర్ వర్ దిగార్ (ఉర్దూ), పోషకుడు, చాలా మట్టుకు తెలుగు అనువాదాలలో ఈ పదానికి ప్రభువు అని అనువాదం చేశారు. మానవుడు తన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి వానిని సరిదిద్ది పోషిస్తాడు. మరియు అతని అంతిమ ఘడియ వరకు పోషిస్తాడు. కేవలం మానవుడే కాక సమస్త సృష్టికి కూడా పోషకుడు ఆయనే!