Skip to content

“ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”

అబీ హురైరాహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అంటూ ఉండగా నేను విన్నాను:

“ఒక ముస్లిమునకు తోటి ముస్లిముపై ఐదు హక్కులు ఉన్నాయి: సలామునకు జవాబిచ్చుట, వ్యాధిగ్రస్తుని పరామర్శించుట, మృతులను శ్మశానమునకు కొనిపోవునపుడు, స్మశానము వరకు అనుసరించుట, ఎవరైనా ఆహ్వానించినట్లయితే వారి ఆహ్వానాన్ని మన్నించుట మరియు ఎవరైనా తుమ్మి నపుడు (అతడు అల్-హందులిల్లాహ్ అని పలికినట్లయితే) అతడికి ‘యర్హకుముల్లాహ్’ అని సమాధానమిచ్చుట”.

«حَقُّ الْمُسْلِمِ عَلَى الْمُسْلِمِ خَمْسٌ: رَدُّ السَّلَامِ، وَعِيَادَةُ الْمَرِيضِ، وَاتِّبَاعُ الْجَنَائِزِ، وَإِجَابَةُ الدَّعْوَةِ، وَتَشْمِيتُ الْعَاطِسِ».

అల్ బుఖారీ మరియు ముస్లిం నమోదు చేసినారు
ప్రామాణికమైన హదీథు
వ్యాఖ్యానము

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ముస్లిమునకు తన తోటి సోదర ముస్లింపై కొన్ని హక్కులు ఉన్నాయని వివరిస్తున్నారు. ఆ హక్కులలో మొదటిది, మీపై శాంతి కురియాలని మీకు సలాముతో అభివాదం చేసిన వ్యక్తికి మీరు జవాబిచ్చుట. రెండవ హక్కు: వ్యాధిగ్రస్తుడై ఉన్న ముస్లిం సోదరుని చూచేందుకు అతని వద్దకు వెళ్ళుట మరియు అతడిని పరామర్శించుట. మూడవ హక్కు: ఎవరైనా ముస్లిం సోదరుడు చనిపోతే, అతడి జనాజాను (శవయాత్ర)ను అతని ఇంటి నుండి, జనాజా నమాజు కొరకు మస్జిదు వరకు, నమాజు తరువాత అతడిని ఖననం చేయుట కొరకు స్మశానము వరకు అనుసరించుట. నాలుగవ హక్కు: ఎవరైనా విందు భోజనానికి ఆహ్వానిస్తే - ఉదాహరణకు, వలిమా విందు లేదా అటువంటి ఇతర విందులు – ఆ ఆహ్వానాన్ని స్వీకరించుట. ఐదవ హక్కు: తుమ్మిన వ్యక్తికి జవాబిచ్చుట; ఒకవేళ తుమ్మిన వ్యక్తి (అల్ హందులిల్లాహ్ అని) అల్లాహ్ కు స్తోత్రములు పలికినట్లయితే, అతడికి “అల్లాహ్ నిన్ను కరుణించుగాక” (యర్హముకల్లాహ్) అని జవాబు ఇవ్వాలి, అపుడు తుమ్మిన వ్యక్తి “అల్లాహ్ మీకు మార్గదర్శకత్వం చేయుగాక మరియు మీ వ్యవహారములను చక్కదిద్దుగాక” (యహ్’దీకుముల్లాహు, వ యుస్లిహు బాలకుం) అని పలకాలి.

పదాల అర్థాలు

...:

హదీథు యొక్క ప్రయోజనాలలో నుండి

ముస్లిముల మధ్య హక్కులను స్థిరపరచడం మరియు వారి మధ్య సహోదరత్వాన్ని, ప్రేమను పటిష్ఠ పరచడం వంటి విషయాలలో ఇస్లాం యొక్క ఔన్నత్యం ప్రస్ఫుటమవుతున్నది.

సమీక్షకుడు

సహీహ్ అల్ బుఖారీ. (2/ 71) (1240).

సహీహ్ ముస్లిం. (4/ 1704) (2162).

ఇంకా (10)

كنوز رياض الصالحين.

لمجموعة من الباحثين (4/ 512).

بهجة الناظرين شرح رياض الصالحين.

لسليم الهلالي (1/ 327).

نزهة المتقين شرح رياض الصالحين.

مجموعة من الباحثين (1/ 253).

شرح رياض الصالحين.

لابن عثيمين (2/ 591).

بهجة قلوب الأبرار.

لابن سعدي (ص81).