22 : 62
ذَٰلِكَ بِأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡحَقُّ وَأَنَّ مَا يَدۡعُونَ مِن دُونِهِۦ هُوَ ٱلۡبَٰطِلُ وَأَنَّ ٱللَّهَ هُوَ ٱلۡعَلِيُّ ٱلۡكَبِيرُ
ఇది ఎందుకంటే, నిశ్చయంగా అల్లాహ్! ఆయనే సత్యం! మరియు అయనకు బదులుగా వారు ఆరాధించేవన్నీ అసత్యాలే! మరియు నిశ్చయంగా అల్లాహ్ ఆయన మాత్రమే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).
Explanation & meanings · 1
- ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) ధర్మమే సత్యధర్మం, ఆయన ఆరాధనయే సత్య ఆరాధన, ఆయన వాగ్దనమే సత్యవాగ్దానం. ఆయన, తన స్నేహితులకు వారి శత్రువులకు విరుద్ధంగా సహాయపడటం కూడా సత్యమే! అల్లాహ్ (సు.తా.) తన ఉనికిలో తన కార్యసాధనలో, తన యోగ్యతలో సత్యవంతుడు.