“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
అబీ ఉసైద్ ఉల్లేఖించిన హదీసును అబీ హుమైద్ ఇలా తెలిపినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు:
“ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”
«إِذَا دَخَلَ أَحَدُكُمُ الْمَسْجِدَ فَلْيَقُلِ: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ فَلْيَقُلِ: اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ».
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిదులోనికి ప్రవేశించే ముందు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక) వైపునకు ముస్లిం సమాజాన్ని మార్గదర్శనం చేస్తున్నారు. అతడు మస్జిదులోనికి ఆరాధన (ఇబాదత్) కొరకు ప్రవేశించడానికి ముందు అతడు తన ప్రభువు యొక్క కరుణ కొరకు దువా చేస్తున్నాడు. అలాగే అతడు మస్జిదు నుండి బయటకు వెళ్ళాలని నిర్ణయించుకున్నపుడు పలుకవలసిన దుఆ (అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక మిన్ ఫజ్’లిక) వైపునకు మార్గదర్శనం చేస్తున్నారు. ఆ దుఆ పలుకడం ద్వారా అతడు తనకు ధర్మబద్ధమైన ఉపాధి కొరకు, అందులో అల్లాహ్ యొక్క అనుగ్రహాన్ని, దయను, కనికరాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాడు.
ఈ హదీసులో తెలుపబడిన దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు పలుకుట అభులషణీయము (ముస్తహబ్).
మస్జిదులోనికి ప్రవేశించునపుడు కరుణ కొరకు మరియు బయటకు వచ్చునపుడు అనుగ్రహం మరియు దయ కొరకు వేడుకొనుట ఈ దుఆల యొక్క ప్రత్యేకత: మస్జిదులోనికి ప్రవేశించు వ్యక్తి తన సృష్టికర్తను ఆరాధించుట కొరకు ప్రవేశిస్తాడు. ఆ ఆరాధనలు (ఇబాదత్’లు) అతడిని తన ప్రభువు దగ్గరికి చేరుస్తాయి, ఆయన అతడిని స్వర్గానికి చేరువ చేస్తాడు. కనుక తన ఆరాధనలు స్వీకరించి తనను కరుణించమని ప్రార్థించుట సరియైనదే. అలాగే మస్జిదు నుండి బయటకు వచ్చే వ్యక్తి బయట ప్రపంచములోనికి ప్రవేశిస్తాడు. అందులో అతడు తన ఉపాధి కొరకు కష్టపడి పనిచేయవలసి వస్తుంది. కనుక ధర్మబధ్ధమైన ఉపాధి సంపాదన కొరకు తనను అనుగ్రహించమని, తనపై దయ చూపమని దుఆ చేయడం ఆ సందర్భములో సరియైనదే.
ఆ దుఆలు మస్జిదులోనికి ప్రవేశించునపుడు మరియు మస్జిదు నుండి బయటకు వచ్చునపుడు చేయ వలసి ఉన్నది.
సహీహ్ ముస్లిం. (1/ 494) (713).
ఇంకా (3)
الكاشف عن حقائق السُّنن (3/935).
فيض القدير (1/ 336).
ذخيرة العقبى (9/153).
గ్రంథాలలో ఉల్లేఖించబడింది
10 గ్రంథాలు- హిస్నుల్ ముస్లిం - ఖుర్ఆన్ మరియు హదీథులలోని దుఆల పుస్తకం.حصن المسلماللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِك
- మస్జిద్-ఎ-నబవి యొక్క ఘనతలు, మర్యాదలు మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి సమాధిని, ఆయన ఇద్దరు సహచరుల (రదియల్లాహు అన్హుమా) సమాధులను సందర్శించే నియమాలు.فضائل وآداب المسجد النبوي، وأحكام زيارة قبر النبي عليه الصلاة والسلام وقبري صاحبيهఅల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నిశ్చయంగా నేను నీ అనుగ్రహమును నీతో అర్ధిస్తున్నాను) [19],
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానముఅల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయతో నేను నిన్ను వేడుకుంటున్నాను')
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానముజవాబు: అల్లాహుమ్మఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక. ఓ అల్లాహ్! నా కోసం నీ కారుణ్య ద్వారాలు తెరువుము.
- ముస్లిం పిల్లలకు నేర్పవలసిన జ్ఞానముజవాబు : అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయను నేను నిన్ను వేడుకుంటున్నాను')
ఇంకా (5)
- الذكر والدعاء والعلاج بالرقي من الكتاب والسنة"إذا دخل أحدكم المسجد فليقل: اللهم افتح لي أبواب رحمتك. وإذا خرج فليقل: اللهم إني أسألك من فضلك".
- المختصر في آداب السفر وصفة الحج والعمرة وآداب الزيارة والأدعية الجامعة مع ملحق بالفتاوى والمخالفات2- المختصر في صفة الحج وأحكامه (للحرمين)«اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ»[2]،
- المختصر في صفة الحج وأحكامهالمختصر في صفة الحج والعمرة«اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ»[2]،
- رسالة في الأذكار1«إِذَا دَخَلَ أَحَدُكُمُ المَسْجِدَ فَلْيَقُلِ: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ، وَإِذَا خَرَجَ فَلْيَقُلِ: اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ».
- مجموعة زاد التربية الإسلامية (3)، والسيرة النبوية (3)التربية الإٍسلامية -3- «اللهم إني أسألك من فضلك»