17 : 37
وَلَا تَمۡشِ فِي ٱلۡأَرۡضِ مَرَحًاۖ إِنَّكَ لَن تَخۡرِقَ ٱلۡأَرۡضَ وَلَن تَبۡلُغَ ٱلۡجِبَالَ طُولٗا
మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు!
Explanation & meanings · 1
- విర్రవీగటం అల్లాహుతా'ఆలాకు ఎంతో అసహ్యకరమైనది. ఖారూన్ విర్రవీగటం వల్లనే, తన ధనసంపత్తులతో సహా భూమిలోకి త్రొక్కి వేయబడ్డాడు. చూడండి, 28:81.