Skip to content
آل عِمران /

ఆయత్ 97

3 : 97

ఆయత్ 97 of آل عِمران (3 : 97). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

آل عِمران ఆయతులు 200
సూరా · آل عِمران
తెలుగు · Muhammad
3 : 97

فِيهِ ءَايَٰتُۢ بَيِّنَٰتٞ مَّقَامُ إِبۡرَٰهِيمَۖ وَمَن دَخَلَهُۥ كَانَ ءَامِنٗاۗ وَلِلَّهِ عَلَى ٱلنَّاسِ حِجُّ ٱلۡبَيۡتِ مَنِ ٱسۡتَطَاعَ إِلَيۡهِ سَبِيلٗاۚ وَمَن كَفَرَ فَإِنَّ ٱللَّهَ غَنِيٌّ عَنِ ٱلۡعَٰلَمِينَ

అందులో స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. ఇబ్రాహీమ్ నిలిచిన స్థలం ఉంది. మరియు దానిలో ప్రవేశించినవాడు అభయం (రక్షణ) పొందుతాడు. మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).

Explanation & meanings · 2
  1. 'హరమ్ సరిహద్దులలో యుద్ధం, హత్య, వేటాడటం మరియు చెట్లను కోయటం కూడా నిషేధించబడ్డాయి. ('స'హీ'హ్ బు'ఖారీ మరియు 'స'హీ'హ్ ముస్లిం).
  2. ముస్లింలకు ఎవరైతే ఆరోగ్యవంతులై ఉండి 'హజ్ చేయటానికి కావలసిన ఖర్చులు భరించగలిగి వుండి, శాంతియుతంగా ఎలాంటి ధన, ప్రాణ హాని లేకుండా 'హజ్ కు పోగలరో, వారి కొరకు వారి జీవితంలో ఒక్కసారి 'హజ్ యాత్రకు పోవటం విధిగా చేయబడింది, (ఇబ్నె - కసీ'ర్). చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 2, అధ్యాయం - 1; 'స.ముస్లిం పుస్తకం - 1, అధ్యాయం - 52.