Skip to content
لُقمَان /

ఆయత్ 34

31 : 34
لُقمَان ఆయతులు 34
సూరా · لُقمَان
తెలుగు · Muhammad
31 : 34

إِنَّ ٱللَّهَ عِندَهُۥ عِلۡمُ ٱلسَّاعَةِ وَيُنَزِّلُ ٱلۡغَيۡثَ وَيَعۡلَمُ مَا فِي ٱلۡأَرۡحَامِۖ وَمَا تَدۡرِي نَفۡسٞ مَّاذَا تَكۡسِبُ غَدٗاۖ وَمَا تَدۡرِي نَفۡسُۢ بِأَيِّ أَرۡضٖ تَمُوتُۚ إِنَّ ٱللَّهَ عَلِيمٌ خَبِيرُۢ

నిశ్చయంగా, ఆ (అంతిమ) ఘడియ జ్ఞానం, కేవలం అల్లాహ్ కు మాత్రమే ఉంది. మరియు ఆయనే వర్షం కురిపించేవాడు మరియు గర్భాలలో ఉన్నదాని విషయం తెలిసినవాడు. మరియు తాను రేపు ఏమి సంపాదిస్తాడో, ఏ మానవుడు కూడా ఎరుగడు. మరియు ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా, అల్లాహ్ మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు (ఎరిగినవాడు).

Explanation & meanings · 1
  1. పై ఐదు అగోచర విషయాల జ్ఞానం కేవలం అల్లాహ్ కే ఉంది అవి : 1) అంతిమ ఘడియ సమయం, 2) వర్షం వచ్చే సమయం, 3) మాతృగర్భంలో ఉన్నదాని గతి, 4) రేపు సంభవించబోయే విషయం మరియు 5) మానవుని మరణ స్థానం ('స'హీ'హ్ బు'ఖారీ).