24 : 30
قُل لِّلۡمُؤۡمِنِينَ يَغُضُّواْ مِنۡ أَبۡصَٰرِهِمۡ وَيَحۡفَظُواْ فُرُوجَهُمۡۚ ذَٰلِكَ أَزۡكَىٰ لَهُمۡۚ إِنَّ ٱللَّهَ خَبِيرُۢ بِمَا يَصۡنَعُونَ
విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును.
Explanation & meanings · 1
- చూడండి, 23:5-6, అంటే పురుషులు తమ చూపులను అదుపులో ఉంచుకోవాలి. చూడదని విషయాల నుండి చూపులను మరల్చుకోవాలి. అంటే పురుషులు అన్య స్త్రీలను చూడటం, ఇతరుల ఆచ్ఛాదనీయ అవయవాలను చూడటం, అసభ్య దృశ్యాలపై చూపును నిలపటం తగదు, అని అర్థం. ఇంకా చూడండి, మత్తయి - (Mathew), 5:27-29.