Skip to content
التوبَة /

ఆయత్ 6

9 : 6

ఆయత్ 6 of التوبَة (9 : 6). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

التوبَة ఆయతులు 129
సూరా · التوبَة
తెలుగు · Muhammad
9 : 6

وَإِنۡ أَحَدٞ مِّنَ ٱلۡمُشۡرِكِينَ ٱسۡتَجَارَكَ فَأَجِرۡهُ حَتَّىٰ يَسۡمَعَ كَلَٰمَ ٱللَّهِ ثُمَّ أَبۡلِغۡهُ مَأۡمَنَهُۥۚ ذَٰلِكَ بِأَنَّهُمۡ قَوۡمٞ لَّا يَعۡلَمُونَ

మరియు బహుదైవారాధకులలో (ముష్రికీన్ లలో) ఎవడైనా నీ శరణు కోరితే - అతడు అల్లాహ్ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) వినటానికి - అతడికి శరణు ఇవ్వు. తరువాత అతడిని, అతడి కొరకు సురక్షితమైన స్థలానికి చేర్చు. ఇది ఎందుకంటే! వాస్తవానికి, వారు (సత్యం) తెలియని ప్రజలు.

Explanation & meanings · 1
  1. పై ఆయత్ మీతో యుద్ధం చేస్తున్న సత్యతిరస్కారుల విషయంలో అవతరింపజేయబడింది. ఈ విరోధులైన సత్యతిరస్కారులలో ఎవడైనా మీ శరణు కోరితే అతనికి శరణు ఇవ్వండి. అతడు మీతో ఉండి మీ మంచితనాన్ని మరియు ఇస్లాంను దగ్గరనుండి చూసి ఖుర్ఆన్ విని ముస్లిం కావచ్చు. అతడు ఖుర్ఆన్ ను విన్న తరువాత కూడా ఇస్లాం స్వీకరించకుంటే అతనిని, అతనికి భద్రతనిచ్చే స్థలానికి పంపండి. అతడు ముస్లిం కాకున్నా సరే. మీరిచ్చిన శరణపు ప్రతిజ్ఞను పూర్తి చేసుకోండి. అతడు తన భద్రతాస్థలానికి చేరేంత వరకు వాని ప్రాణ రక్షణ మీ బాధ్యత.