Skip to content
الفَاتِحة /

ఆయత్ 2

1 : 2

ఆయత్ 2 of الفَاتِحة (1 : 2). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الفَاتِحة ఆయతులు 7
సూరా · الفَاتِحة
తెలుగు · Muhammad
1 : 2

ٱلۡحَمۡدُ لِلَّهِ رَبِّ ٱلۡعَٰلَمِينَ

సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.

Explanation & meanings · 2
  1. రబ్బున్: ప్రభువు, అనే పదానికి తెలుగులో సరితూగే పదం లేదు. దీనికి సర్వలోకాల ఏకైక ప్రభువు, వాటి సృష్టికర్త, పోషకుడు, సంరక్షకుడు, యజమాని, సర్వవర ప్రదాత అనే అర్థాలున్నాయి. చాలా వరకు తెలుగు అనువాదాలలో వాటినట్లు ఈ అనువాదంలో కూడా ప్రభువు అనే పదమే వాడబడింది.
  2. 'హదీస్'లో వచ్చింది: లా ఇలాహ ఇల్లల్లాహ్ - అల్లాహ్ (సు.తా.) తప్ప మరొక ఆరాధ్యదేవుడు లేడు. అతి ఉత్తమమైన జిక్ర్ (Meditation), జ్ఞాపిక, స్మరణ, ధ్యానం మరియు అల్'హమ్దులిల్లాహ్ - సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా'ఆలా మాత్రమే, అతి ఉత్తమమైన దు'ఆ' - ప్రార్థన (తిర్మిజీ', నసాయీ' మొదలైన వారు).