Skip to content
العقيدة الصحيحة وما يضادها

العقيدة الصحيحة وما يضادها

నేను వారి నుండి ఎలాంటి జీవనోపాధిని కోరటం లేదు మరియు వారు నాకు ఆహారం పెట్టాలని కూడా కోరటం లేదు. [జారియాతు : 57] నిశ్చయంగా, అల్లాహ్! ఆయన మాత్రమే ఉపాధి ప్రధాత, మహా బలవంతుడు, స్థైర్యం గలవాడు. [జారియాతు : 58] ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి. [అల్ బఖరా : 22] మీరు అల్లాహ్ ను తప్ప ఇతరులను ఆరాధించకండి. నిశ్చయంగా నేను, ఆయన (అల్లాహ్) తరఫు నుండి మీకు హెచ్చరిక చేసేవాడిని మరియు శుభవార్తలు ఇచ్చేవాడిని మాత్రమే! వినండి! నిష్కల్మషమైన ఆరాధన మాత్రమే అల్లాహ్ కు చెందుతుంది.

0%
Font size