16 : 89
وَيَوۡمَ نَبۡعَثُ فِي كُلِّ أُمَّةٖ شَهِيدًا عَلَيۡهِم مِّنۡ أَنفُسِهِمۡۖ وَجِئۡنَا بِكَ شَهِيدًا عَلَىٰ هَٰٓؤُلَآءِۚ وَنَزَّلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ تِبۡيَٰنٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ وَبُشۡرَىٰ لِلۡمُسۡلِمِينَ
మరియు (జ్ఞాపకముంచుకోండి) ఆ రోజు మేము ప్రతి సమాజంలో నుండి వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చే వానిని (ప్రవక్తను) లేపి నిలబెడ్తాము. మరియు (ఓ ప్రవక్తా!) మేము నిన్ను వీరికి వ్యతిరేకంగా సాక్ష్యమివ్వటానికి తీసుకువస్తాము. ప్రతి విషయాన్ని స్పష్టపరచటానికి నీపై ఈ దివ్యగ్రంథాన్ని అవతరింపజేశాము. మరియు ఇందులో అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అయిన వారికి మార్గదర్శకత్వం, కారుణ్యం మరియు శుభవార్తలూ ఉన్నాయి.
Explanation & meanings · 1
- ప్రతి ప్రవక్త తన జాతివారిలో సత్యాన్ని తిరస్కరించిన వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాడు. మరియు ము'హమ్మద్ ('స'అస) మరియు అతని అనుచరులు (ర'ది.'అన్హుమ్) ప్రవక్త ('అలైహిమ్ స.) ల విషయంలో వారు సత్యవాదులు మరియు వారు అల్లాహ్ (సు.తా.) సందేశాన్ని ప్రచారం చేశారని సాక్ష్యమిస్తారు. ('స.బు'ఖారీ, తఫ్సీర్ సూరహ్ అన్-నిసా').