22 : 70
أَلَمۡ تَعۡلَمۡ أَنَّ ٱللَّهَ يَعۡلَمُ مَا فِي ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِۚ إِنَّ ذَٰلِكَ فِي كِتَٰبٍۚ إِنَّ ذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ
ఏమీ? నీకు తెలియదా? ఆకాశంలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసని! నిశ్చయంగా, ఇదంతా ఒక గ్రంథంలో (వ్రాయబడి) ఉంది. నిశ్చయంగా ఇదంతా అల్లాహ్ కు చాలా సులభమైనది.
Explanation & meanings · 1
- ప్రతివాడు ఏమి కాబోతున్నాడు అనేది అల్లాహ్ కు తెలుసు కాబట్టి ఆయన సంభవించబోయేదంతా ఒక గ్రంథంలో వ్రాసి పెట్టాడు. ఇదే విధివ్రాత (ఖద్ర్). అంటే అల్లాహ్ (సు.తా.) ఎవరిని కూడా మంచి లేక చెడు మార్గాలను అవలంబించటానికి బలవంతం చేయడు. 'స'హీ'హ్ ముస్లింలో ఉంది: 'అల్లాహ్ భూమ్యాకాశాల సృష్టికి 50 వేల సంవత్సరాలకు ముందు తన సృష్టి యొక్క విధి వ్రాసి పెట్టాడు. అప్పుడు ఆయన విశ్వసామ్రాజ్యాధిపత్య పీఠం ('అర్ష్) నీటిపై ఉండెను.'