Skip to content
العَنكبُوت /

ఆయత్ 65

29 : 65
العَنكبُوت ఆయతులు 69
సూరా · العَنكبُوت
తెలుగు · Muhammad
29 : 65

فَإِذَا رَكِبُواْ فِي ٱلۡفُلۡكِ دَعَوُاْ ٱللَّهَ مُخۡلِصِينَ لَهُ ٱلدِّينَ فَلَمَّا نَجَّىٰهُمۡ إِلَى ٱلۡبَرِّ إِذَا هُمۡ يُشۡرِكُونَ

వారు నావలోకి ఎక్కినప్పుడు తమ భక్తిని కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుకొని ఆయననే ప్రార్థిస్తారు; కాని ఆయన వారిని రక్షించి నేల మీదకు తీసుకు రాగానే ఆయనకు సాటి కల్పించ సాగుతారు.

Explanation & meanings · 1
  1. ఇక్రిమ ('ర.ది.'అ) మక్కా విజయం సమయంలో మక్కా విడిచి పారిపోతాడు. అతడు ఒక నావలోకి ఎక్కి పోతూ ఉండగా అది ప్రమాదంలో చిక్కుకుంటుంది. దానిలో ఉన్నవారు పరస్పరం ఇలా చెప్పుకుంటారు: "అల్లాహ్ (సు.తా.) ను వేడుకోండి. ఆయన తప్ప మమ్మల్ని మరెవ్వరూ కాపాడలేరు." అప్పుడు అతడు ఆలోచిస్తాడు: "సముద్రంలో అల్లాహ్ (సు.తా.) తప్ప మరొకరు కాపాడలేకుంటే నేలపై కూడా ఇతరులెవ్వరూ కాపాడలేరు. ఒకవేళ తాను ఇక్కడ నుండి బ్రతికి బయటపడితే దైవప్రవక్త ('స'అస) సన్నిధిలోకి పోయి ఇస్లాం స్వీకరిస్తాను." అని అనుకుంటాడు. అదేవిధంగా జరుగుతుంది. అతడు (ర'ది.'అ.) ఇస్లాం స్వీకరించి ఇస్లాం ప్రచారంలో చాలా పాటుపడ్తాడు. (ఇబ్నె-కసీ'ర్)