Skip to content
النِّسَاء /

ఆయత్ 136

4 : 136

ఆయత్ 136 of النِّسَاء (4 : 136). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 136

يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِي نَزَّلَ عَلَىٰ رَسُولِهِۦ وَٱلۡكِتَٰبِ ٱلَّذِيٓ أَنزَلَ مِن قَبۡلُۚ وَمَن يَكۡفُرۡ بِٱللَّهِ وَمَلَٰٓئِكَتِهِۦ وَكُتُبِهِۦ وَرُسُلِهِۦ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ فَقَدۡ ضَلَّ ضَلَٰلَۢا بَعِيدًا

ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!

Explanation & meanings · 1
  1. ఇంతకు పూర్వం అవతరింపజేయబడిన దివ్యగ్రంథాలను విశ్వసించడం అంటే, అల్లాహ్ (సు.తా.) తరఫు నుండి అవతరింపజేయబడిన, తౌరాత్ మరియు ఇంజీల్ మొదలైన దివ్య గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను అన్నమాట. అంటే అల్లాహుతా'ఆలా తరఫు నుండి అవతరింపజేయబడి ఉన్న విషయాలను విశ్వసించడం. ఈ రోజు కేవలం ఈ దివ్యఖుర్ఆన్ తప్ప ఏ ఇతర దివ్యగ్రంతం కూడా అవతరింపజేయబడిన నిజరూలంలో లేదు. ఎందుకంటే ఆ మతపు ధర్మవేత్తలు కాలక్రమేణా వాటిలో ఎన్నో హెచ్చుతగ్గులు చేస్తూ వచ్చారు. ఉదారహణకు ఇప్పుడు వాడుకలో నున్న బైబిల్ లో ఎన్నో సార్లు మార్పులు చేశారు. ఇప్పుడు వాడుకలో ఉన్న ఆధునిక బైబిల్ లో చివరి మార్పు 1977 క్రీ.శకంలో చేశారు. ఇది (Revised) Authorized KJV అనబడుతుంది. ఇక్కడ సంబోధన, ఇప్పుడు వాడుకలో ఉన్న ఆ దివ్యగ్రంథాలలో ఉన్న సత్యాలను మాత్రమే సూచిస్తునంది. చూడండి, 3:3