Skip to content
يسٓ /

ఆయత్ 12

36 : 12

ఆయత్ 12 of يسٓ (36 : 12). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

يسٓ ఆయతులు 83
సూరా · يسٓ
తెలుగు · Muhammad
36 : 12

إِنَّا نَحۡنُ نُحۡيِ ٱلۡمَوۡتَىٰ وَنَكۡتُبُ مَا قَدَّمُواْ وَءَاثَٰرَهُمۡۚ وَكُلَّ شَيۡءٍ أَحۡصَيۡنَٰهُ فِيٓ إِمَامٖ مُّبِينٖ

నిశ్చయంగా, మేము మృతులను సజీవులుగా చేస్తాము. మరియు మేము వారు చేసి పంపిన మరియు తమ వెనుక విడిచిన చిహ్నాలను కూడా వ్రాసి పెడుతున్నాము. మరియు ప్రతి విషయాన్ని మేము స్పష్టమైన గ్రంథంలో వ్రాసిపెడుతున్నాము.

Explanation & meanings · 1
  1. చూఎవడైతే ఇస్లాంలో ఒక మంచి పనిని ప్రారంభిస్తాడో అతనికి అతనికి దాని పుణ్యఫలితం లభిస్తుంది. అంతేగాక, అతని తరువాత ఇతరులు దానిపై నడిస్తే - ఆ అనుసరించే, వారి పుణ్యంలో ఎట్టి తగ్గింపు లేకుండా - ఆ పుణ్యం కూడా అతనికి లభిస్తూ ఉంటుంది. ఇక ఒకడు చెడ్డపని ప్రారంభిస్తే అతనికి దాని శిక్ష కాక, దానిపై నడిచే వారందరి పాపాల శిక్ష కూడా విధించబడుతుంది. (స'హీ'హ్ ముస్లిం). ఒక వ్యక్తి మరణించిన తరువాత అతని కర్మలు ఆగిపోతాయి. మూడు విషయాలు తప్ప. 1) జ్ఞానం - దేనినైతే ఇతరులు లాభం పొందుతూ ఉంటారో! 2) పుణ్యాత్ములైన సంతానం - ఎవరైతే చనిపోయిన తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తూ ఉంటారో! 3) 'సదఖహ్ జారియహ్ - దేనితోనైతే అతడు మరణించిన తరువాత కూడా, ప్రజలు లాభం పొందుతూ ఉంటారో! ('స'హీ'హ్ ముస్లిం).