صفة الوضوء والصلاة (مرئي)
PROJ-187
నేను వజూ ఎలా చేయాలి ?
م
స్వరము (ద్వని)
1
అజాన్ స్వరము
2
ఓ విశ్వసించినవారులారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి.
{సూరతుల్ మాయిద : 6}
3
వజూ లేకుండ ఏ నమాజు లేదు మరియు సంకల్పం లేకుండా వజూ లేదు. చిత్తశుద్ధి లేకుండా సంకల్పం లేదు. సంకల్పము స్థానము హృదయము నాలుక కాదు.
4
బిస్మిల్లాహ్ (అల్లాహ్ నామముతో )
వజూ ఆరంభంలో బిస్మిల్లాహ్ పఠించాలి. కావున మా వజూను దానితో మేము ఆరంభించాలి.ఆ తరువాత ఒక వేళ సౌలభ్యం ఉంటే నోటి పరిశుభ్రత కొరకు మేము మిస్వాక్ చేసుకోవాలి.
5
రెండు చేతులను మూడు సార్లు కడుక్కోవాలి. వేళ్ల అంచుల నుండి అర చేతి కీలు వరకు ఆరంభించాలి.
6
రెండు అరచేతులను మణికట్టు వరకు వరుసగా మూడు సార్లు కడుక్కోవాలి.
7
మరియు కుడి అరచేతి నుండి ఆరంభించి మూడుసార్లు దాని తరువాత ఎడమ అరచేతిని మూడుసార్లు కడుక్కోవాలి.
8
అలాగే కుడి అరచేతిని కడుక్కుని ఆ తరువాత ఎడమ చేతిని ఆ తరువాత కుడి చేతిని ఆ తరువాత ఎడమ చేతిని ఈ విధంగా కడగటం సమ్మతం.
9
చేతి వేళ్ళ మధ్య నీటిని చొప్పించాలని నిర్ధారించుకోవాలి.
10
ఆ పిదప పుక్కిలించటం ,ముక్కును చీదరించటం వైపునకు మరలాలి.
11
పుక్కిలించటం అనేది నోట్లో నీళ్ళను తీసుకుని దాన్ని లోపలిభాగంలో కదిపి ఆ తరువాతా దాన్ని బయటకు ఉమ్మి వేయాలి.
12
ఇస్తింషాఖ్ (ముక్కులో నీటిని తీసుకోవటం) అన్నది నీటిని ముక్కులో బాగా తీసుకుని దాన్ని ఎడమ చేతితో బయటకు ఛీదరించటం.
13
సున్నత్ ఏమిటంటే మేము ఉపవాస స్థితిలో లేకుంటే లేదా ఏదైన హాని భయం లేకుంటే ఆ రెండిటిని చేయటంలో అధికంగా చేయాలి.
14
నీటిని పుక్కిలించే,ముక్కులో తీసుకుని ఛీదరించే రెండు పద్దతులు కలవు.
15
రెండిటిని కలిపి చేయటం ; అదెలాగంటే నీటిని ఒకే దోసిట్లో తీసుకుని దాని సగ భాగముతో పుక్కిలించటం రెండవ సగ భాగముతో ముక్కులో తీసుకుని ఛీదరించటం.
నోటిలో నీటిని బాగా కదిపి ఆ తరువాత దాన్ని బయటకు వూసివేయాలి . ఆ తరువాత ముక్కులో తీసుకున్న నీటిని ఎడమ చేతితో ఛీదరించాలి.
మూడు దోసిట్లలో నిటిని తీసుకుని మూడు సార్లు ఇలా చేయాలి.
16
ఇక రెండిటిని వేరువేరుగా చేయటం అదెలాగంటే ప్రత్యేకించి ఒక దోసిటి నోటిలో పుక్కిలించటానికి ఇంకొకటి ముక్కులో నీటిని తీసుకుని ఛీదరించటానికి. ఒక దోసిటి నీటిని తీసుకుని దాన్ని పూర్తిగా నోట్లో తీసుకోవాలి. ఆ తరువాత దాన్ని కదిపి దాన్ని బయటకు ఊసివేయాలి. ఆ తరువాత రెండవ దోసిటి తీసుకుని దాన్ని ముక్కులో తీసుకుని దాన్ని ఎడమ చేతితో ఛీదరించాలి.
17
పుక్కిలించి,ముక్కులో తీసుకుని ఛీదరించిన తరువాత ముఖమును కడగటం.
18
ముఖము హద్దు పొడవున తల వెంట్రుకల దగ్గర నుండి గడ్డం చివరి వరకు, వెడల్పున రెండు చెవుల మధ్యన.
19
ముఖములోని వెంట్రుకలన్నింటిని కడగటం తప్పనిసరి. ఉదాహరణకు లేత గడ్డం మరియు మీసాలు,కనుబొమ్మలు,సిలియా (ఐబ్రూ), క్రింది పెదవి కింద భాగమున మొలచే వెంట్రుకలు కూడా గెడ్డములోనివే.
20
మరియు ముఖము కడగటానికి రెండు పద్దతులు ఉన్నవి.
21
మొదటిది : పూర్తి రెండు చేతులతో నీళ్లను తీసుకోవాలి. ఆ తరువాత వాటితో ముఖమును తల ముందు వెంట్రుకల నుండి గడ్డం చివరి వరకు మరియు కుడి చెవి నుంచి ఎడమ చెవి వరకు కడుక్కోవాలి. ఒక వేళ గడ్డం దట్టంగా ఉంటే నీళ్ళను గడ్డంలోకి చొప్పించి వేళ్ళతో గడ్డమును ఖిలాల్ చేయాలి.
ఇలా మేము మూడుసార్లు చేయాలి. అది పరిపూర్ణం. లేదా రెండు సార్లు లేదా ఒక సారి అది తప్పనిసరి.
22
మరియు రెండవది : నీళ్ళను కేవలం కుడి చేత్తో తీసుకోవాలి. ఆ తరువాత దాన్ని ముఖముపై పోసుకుని రెండు చేతులతో ముఖమును మొదటి పద్దతిలో కడుక్కున్నట్లు కడుక్కోవాలి. ఇలా మూడుసార్లు చేయాలి.
23
వజూ అవయవాల్లో క్రమ పద్దతి తప్పనిసరి. అలాగే ఒక దాని తరువాత ఒకటి వెను వెంటనే చేయటం తప్పనిసరి. ఎలాగంటే ఒక భాగమును ఇంకో భాగము కన్న ముందు చేయకూడదు.అలాగే ఒక భాగమును దాని తరువాత భాగమునకు వెనుక చేయకూడదు.
24
ముఖమును కడుక్కున్న తరువాత చేతులు కడుక్కునే వైపుకు మరలాలి.
25
రెండు చేతులను తప్పనిసరిగా కడిగే హద్దు : వేళ్ళ అంచు భాగము నుండి మోచేయి వరకు. రెండు మోచేయిల సమేతంగా.
26
కుడి చేయిని అరచేతి వేళ్ళ అంచుల నుండి మొదలెట్టాలి. రెండు అరచేతుల వేళ్ళ మధ్య చొప్పించి ఖిలాల్ చేయాలి ఆ తరువాత నీళ్ళను మోచేయి వరకు పోనీయాలి.
27
ఆ తరువాత ఎడమ చేతి వైపుకు మరలి దాన్ని కూడా అరచేతి వేళ్ళ మధ్య ఖిలాల్ చేస్తూ మోచేయి వరకు కడుక్కోవాలి.
28
తలను మసాహ్ (స్పర్శించుకోవటం) చేసుకోవటం వైపు మరలాలి. రెండు చేతులను సరికొత్త నీటితో తడుపుకోవాలి. ఆ తరువాత తడి రెండు చేతులను తల ముందు భాగము పై పెట్టి వెనుక భాగము వద్దకు పోనిచ్చి ఆ తరువాత వాటిని మొదలు పెట్టిన స్థలం వద్దకు తీసుకు రావాలి. బట్టతల కలిగి ఉన్న లేదా వెంట్రుకలు ఉన్న తల హద్దులో తేడా ఏమి లేదు.
29
తలను మసాహ్ చేసుకున్న తరువాత మిగిలి ఉన్న నీటితో రెండు చెవులను మసహ్ చేసుకోవాలి. ఇలా ఒక సారి చేయాలి.
30
రెండు చెవులను మసాహ్ ఎలాగంటే చూపుడు వేలితో రెండు చెవుల లోపలి భాగములో పోనిచ్చి మసాహ్ చేయాలి. మరియు బొటన వేలితో రెండు చెవుల బాహ్య బాగమును మసాహ్ చేయాలి. అలా రెండు చెవుల బాహ్య,అంతర భాగములను మసాహ్ చేసుకోవాలి.
31
ఆ తరువాత రెండు కాళ్ళను కడుక్కునే వైపుకు మరలాలి. రెండు కాళ్ళను తప్పనిసరి కడగవలసిన హద్దు అది : కాలి వేళ్ల అంచుల నుండి మడమల వరకు. అయితే రెండు పాదముల మూలములను కడగటం తప్పనిసరి.
32
కుడి కాలితో మొదలుపెట్టాలి. మరియు కాలి వేళ్ల మధ్య ఖిలాల్ చేయాలి. పాదమూలములను మరియు రెండ పాదములపై భాగమును కడుక్కోవటం గుర్తుంచుకోవాలి.
33
కుడి కాలిని కడుక్కున్నట్లే ఎడమ కాలును కడుక్కోవాలి. మరియు వాటి వేళ్లను ఖిలాల్ చేయటం మరవకూడదు. మరియు పాదమూలమును కడగటం మరియు నీళ్ళను మడమల వద్దకు చేర్చటం తప్పనిసరిగా చేయాలి.
34
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహూ. (వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని,ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను).
35
వజూ ముగిసిన తరువాత స్మరణ మరియు ప్రార్ధన చేయటం సున్నత్ విధానము. మరియు ఈ దుఆను అధికం చేయటం సున్నత్.
36
అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్ (ఓ అల్లాహ్ నీవు నన్ను తౌబా చేసే వారిలో నుంచి మరియు పరిశుద్ధత పొందే వారిలో నుంచి చేయి).
37
లేదా
సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతున్నాను.
م
స్క్రీన్ పై వ్రాయబడింది.
1
నేను వజూ ఎలా చేయాలి ?.
2
ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి.
సూరతుల్ మాయిదా'ఆయతు 6
3
రెండు అర చేతులను కడగటం
4
పుక్కిలించటం మరియు ముక్కులో నీళ్ళను తీసుకుని ఛీదరించటం.
5
కలిపి చేయటం
6
విడి విడిగా చేయటం
7
ముఖము కడగటం
8
మొదటిది
9
రెండవది
10
సంకల్పము మరియు బిస్మిల్లాహ్ పలకటం
11
రెండు అర చేతులను కడగటం
12
పుక్కిలించటం
13
ముక్కులో నీళ్ళను తీసుకుని ఛీదరించటం
14
ముఖము కడగటం
15
మోచేతులతో పాటు రెండు చేతులను కడగటం.
16
తలను మసాహ్ చేయటం మరియు రెండు చెవులను మసాహ్ చేయటం
17
రెండుకాళ్ళను చీలమండలాలతో పాటు కడగటం
18
రెండు చేతులను కడగటం
19
తలను మసాహ్ చేయటం
20
తల ఆరంభము -: నుదుటి అంచు,ముందు వెంట్రుకలు మొలచిన చోటు.
21
తల ముగింపు -: తల వెనుక భాగము నుండి జుట్టు మొలచిన చోటు ముగింపు.
22
రెండు చెవులను మసాహ్ చేయటం
23
రెండు కాళ్ళను కడగటం
24
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
వైలుల్లిల్ ఆఖాబి మినన్నార్,అస్బిగుల్ వజూఅ
దీన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు
25
అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహూ లా షరీక లహూ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వరసూలుహూ. వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని,ఆయన ఒక్కడే, ఆయనకు సాటి ఎవరు లేరని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.
దాన్ని ముస్లిం ఉల్లేఖించారు
26
అల్లాహుమ్మజ్ అల్నీ మినత్తవ్వాబీన వజ్అల్నీ మినల్ ముతతహ్హిరీన్ (ఓ అల్లాహ్ నీవు నన్ను తౌబా చేసే వారిలో నుంచి మరియు పరిశుద్ధత పొందే వారిలో నుంచి చేయి.
దీన్ని తిర్మిజీ ఉల్లేఖించారు
27
సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతున్నాను.
అమలుల్ యౌమ వల్లైల లో దీన్ని నసాయి ఉల్లేఖించారు.
నేను నమాజు ఎలా చదవాలి ?.
తక్బీరె తహ్రీమా నుండి సలాం తిరిగే వరకు నమాజు.
م
స్వరము (ద్వని)
1
నమాజు ఇఖామత్ స్వరము.
2
ఇఖామత్ స్వరము నిరంతరం ఉంటుంది.
సంకల్పమును చేయటం అనేది ఒక నమాజు చదివే వ్యక్తి చేసే మొదటి పని. హృదయం దాని ప్రదేశము.
3
ఖిబ్లాకి అభిముఖంగా నిలబడాలి. ఒక వేళ నీవు ఇమామ్ అయినా లేదా ఒక్కడివైన నీ ముందట సుత్రా (అడ్డంగా ఏదైన పెట్టుకోవటం) ను పెట్టుకోవాలి.
4
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
ఇహ్రామ్ తక్బీరు (తక్బీరె తహ్రిమా) ద్వారా మేము నమాజులో ప్రవేశించాలి. దాన్ని మేము నాలుకతో తప్పనిసరిగా పలకాలి.
5
తక్బీర్ పలికేటప్పుడు మన రెండు చేతులను రెండు భుజములకు సమాంతరంగా లేపాలి. మరియు మన చేతి వేళ్ల లోపలి వైపును ఖిబ్లాకి అభిముఖం చేయాలి.
లేదా
అదే పద్దతిలో ఆ రెండిటిని (చేతులను) చెవులకు సమాంతరంగా ఎత్తాలి.
6
తక్బీర్ తరవాత రెండు చేతులను హృదయంపై ఉంచుకోవాలి. లేదా హృదయం క్రింద బొడ్డుపైకి లేదా బొడ్డు క్రిందకు ఉంచుకోవాలి. అవన్ని సరైనవే.
మన కుడి చేతిని ఎడమ అర చేతిపై ఉంచుకోవాలి.
లేదా కుడి అర చేతితో ఎడమ అరచేతిపై పట్టుకోవాలి.
లేదా కుడి చేతితో ఎడమ చేతిని పట్టుకోవాలి.
7
అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి ,అల్లాహుమ్మ నక్కినీ మిన్ ఖతాయాయ కమా యునక్క సౌబల్ అబ్యజ్ మినద్దనసి ,అల్లాహుమ్మగ్సిల్నీ మిన్ ఖతాయాయ బిల్ మాయి వస్సల్జీ వల్ బరది'
తక్బీరె తహ్రిమా తరువాత,ఖిరాఅత్ కన్న ముందు దుఆఎ ఇస్తిఫ్తాహ్ ను చదవాలి. మరియు నమాజు ఆరంభించటం కొరకు వేరే ఇతర దుఆలు కూడా వచ్చి ఉన్నవి. వాటి మధ్య వైవిధ్యం చేయటం సున్నత్.
8
అఊదు బిల్లాహి మినష్షైతానిర్రజీమ్. శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను
ఇస్తిఫ్తాహ్ తరువాత అఊదు బిల్లాహ్ చదవటం ఆ తరువాత సూరె ఫాతిహా చదవటం.
9
వినయనిమమ్రతతో,మనశ్శాంతితో ఒక్కొక్క ఆయత్ ను చదవాలి.
10
ఆమీన్.
అలా పలకటం నమాజీ కొరకు అతడు ఇమామ్ అయినా లేదా ముఖ్తదీ అయినా లేదా ఒక్కడే అయినా సున్నత్ పద్దతి. మరియు అది ఫాతిహా ఆయత్ కాదు. అది కేవలం దుఆ మాత్రమే. దాని అర్ధం ఓ అల్లాహ్ స్వీకరించు.
11
సూరె ఫాతిహ తరవాత ఖుర్ఆన్ నుండి ఏది సౌలభ్యంగా ఉంటే అది చదవాలి. అది ఒక సూరా గాని లేదా దానిలో నుండి కొంత భాగము గాని . తిలావత్ ముగింపు తరువాత రకూ చేయక ముందు కాసేపు మౌనంగా ఉండాలి.
12
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
ఖియామ్ నుండి రుకూ చేయటానికి తక్బీర్ ను పఠించాలి.
మరియు ఇది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో తన రెండు చేతులు పైకి ఎత్తిన రెండవ చోటు. కావున మనము మన రెండు చేతులను రెండు భుజములకు లేదా రెండు చెవులకు సమాంతరంగా లేపటం సున్నత్.
13
రెండు అర చేతులను రెండు మోకాళ్లపై ఉంచుకోవాలి మరియు మన వేళ్లను ఎడంఎడంగా ఉంచి వాటిని మోకాళ్లపై స్థిరంగా ఉంచాలి ఎలాగంటే వాటిని పట్టుకున్నట్లు.
రుకూను ప్రశాంతంగా చేయాలి.రెండు చేతులను రెండు పక్కల నుండి ఎడంగా ఉంచాలి. మరియు ఒక బుగ్గ వైపు వాలి రెండవ బుగ్గను బహిర్గతం చేయకూడదు.
14
వీపు వంగ కుండా సమాంతరంగా (తిన్నగా) ఉండాలి. మరియు తల వీపుకి సమాంతరంగా ఉండాలి. దాన్ని పైకి ఎత్తకూడదు మరియు వంచకూడదు.
15
సుబహానల్లాహి రబ్బియల్ అజీమ్. మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు
మరియు తస్బీహ్ ను మూడు సార్లు పునరావృతం చేయాలి.ఇది స్వల్ప పరిపూర్ణత. ఒక సారి తస్బీహ్ చదవిన సరిపోవును. ఒక వేళ మేము తలచుకుంటే అధికం చేయవచ్చు. మరియు వేరు వేరు మాసూర్ తస్బీహ్ లను చదువుతూ ఉండాలి.
16
రుకూలో పఠించే అజ్కార్ లు చాలా ఉన్నవి.
17
సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్థుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు)
రుకూ నుండి నిలబడేటప్పు దాన్ని పలకాలి. మేము ఒక్కరమే నమాజ్ చదివే స్థితిలోనైనా లేదా మనలో నుంచి ఒకరు ఇమామ్ అయినా.
18
మరియు మేము మా రెండు చేతులను భుజములకు సమాంతరంగా లేదా చెవులకు సమాంతరంగా పైకి లేపాలి. మరియు ఇది మేము చేతులను పైకి లేపే మూడవ ప్రదేశము.
19
ఆ తరువాత ఇలా పలుకుతూ తిన్నగా నిలబడాలి :
రబ్బనా వలకల్ హమ్దు (మా ప్రభువా, స్థుతులన్ని నీ కొరకే)
20
రకూ తరవాత రెండు చేతులను వదిలివేయటం లేదా వాటిని కట్టుకోవటం సమ్మతమే.
21
రుకూ తరవాత నిలబడటమును పొడిగించటం మరియు అందులో మనశ్శాంతిగా ఉండటం సున్నత్
22
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
ఆ తరవాత ఖియామ్ నుండి సజ్దా వైపుకు మరలే తక్బీర్ ను పలుకుతూ నేల వైపుకు వంగాలి.
మరియు మోకాళ్లకన్న ముందు చేతులను పెట్టటం లేదా చేతుల కన్న ముందు మోకాళ్లను పెట్టటం ఆ రెండటిలో మాకు ఏది సౌలభ్యమో చేయాలి.
23
ఏ విధంగానైతే మాకు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారో అలా ఏడు ఎముకలపై మేము సజదా చేయటం అనివార్యము.
ముక్కుతో పాటు నుదుటు,రెండు అరచేతులు,రెండు పాదాలు,రెండు మోకాళ్లు
24
రెండు కాళ్ల వేళ్ల అంచులను ఖిబ్లా వైపు చేయాలి మరియు రెండు పాదములను నిటారుగా నిలబెట్టాలి.
రెండు తొడలను ఎడంగా ఉంచి వాటి నుండి పొట్టను పైకి లేపాలి.
రెండు చేతులను నేల నుండి పైకి లేపి పక్క రెక్కల నుండి దూరంగా ఉండేటట్లు ఉంచాలి. ఒక వేళ మేము జమాత్ లో లేకుంటే మరియు ప్రక్కవారిని బాధ కలిగించకుండా ఉంటే ఇలా చేయాలి.
మరియు రెండు అర చేతులను భుజములకు లేదా చెవులకు సమాంతరంగా ఉంచాలి.
25
సుబహాన రబ్బియల్ ఆలా (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు)
మరియు తస్బీహ్ ను మూడు సార్లు పునరావృతం చేయాలి.ఇది స్వల్ప పరిపూర్ణత. ఒక సారి తస్బీహ్ చదవిన సరిపోవును. ఒక వేళ మేము తలచుకుంటే అధికం చేయవచ్చు. మరియు వేరు వేరు మాసూర్ తస్బీహ్ లను చదువుతూ ఉండాలి. మరియు మాకు ఇష్టమైన ఇహపరాల మేలుని వేడుకోవాలి.
26
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:- ‘దాసుడు తన ప్రభువుకు ‘సజ్దా స్థితిలో ఉన్నప్పుడూ’ అతిసమీపంగా ఉంటాడు కాబట్టి మీరు ఆ స్థితిలో ఎక్కువగా దుఆ చేస్తూ ఉండండి.
27
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
తక్బీర్ పలుకుతూ మన తలను సజ్దా నుంచి పైకి లేపాలి.
ఎడమ పాదమును పరచి దానిపై ప్రశాంతముగా కుర్చుని కుడి పాదమును నిటారుగా లేపి దాని వేళ్లను ఖిబ్లా వైపు చేయాలి.
లేదా
రెండు పాదములను నిటారుగా లేపి ఉంచి వాటిపై కూర్చోవాలి.
మన కుడి చేయిని కుడి తొడపై మరియు ఎడమ చేయిని ఎడమ తొడపై పరచి మోకాళ్ల వరకు లేదా మోకాళ్ల పై ఉండేటట్లు ఉంచాలి.
28
రబ్బిగ్ఫిర్లీ (ఓ నా ప్రభువా నన్ను క్షమించు).
దానితో మేము రెండు సజదాల మధ్య ప్రశాంతంగా కూర్చున్నపుడు వేడుకోవాలి.
29
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
తక్బీర్ పలుకుతూ రెండవ సజ్దా కొరకు వంగాలి. మరియు అది మొదటి సజదాలాగే ఉండాలి చేయటంలో మరియు దుఆలు పఠించటంలో
30
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
మొదటి రకాత్ ను చేసినట్లే రెండవ రకాత్ చేయాలి.
రెండు చేతులను ఉంచటం,ఫాతిహాను మరియు ఏదైన ఆయతును లేదా ఖుర్ఆన్ ఆయతులను పఠించటం.
ఆ తరువాత రుకూ చేయాలి.
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
మరియు నిలబడాలి
సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్థుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు)
ఆ తరువాత సజ్దా చేయాలి.
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
రెండు సజ్దాలు చేసి ఆ తరువాత తషహ్హుద్ కొరకు కూర్చోవాలి.
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
31
రెండవ రకాత్ పూర్తయిన తరువాత తషహ్హుద్ కొరకు కూర్చోవటం జరుగును. విస్తరించుకుని కూర్చోవాలి.
32
జిల్సతుల్ ఇఫ్తిరాష్(ఎడమ కాలిని పరచి దానిపై కూర్చోవటం) ఉదయపు,జుమా,రెండు పండుగల నమాజులలాగా రెండు రకాతుల నమాజుల తషహ్హుద్ లో ఉంటుంది. అలాగే మూడు రకాతుల,నాలుగు రకాతుల నమాజు మొదటి తషహ్హుద్ లో మరియు రెండు సజ్దాల మధ్య కూర్చోవటం లో ఉంటుంది.
33
ఎవరైన తన శరీరం లావుగా ఉండటం వలన లేదా తన కాళ్ళలో నొప్పి ఉండటం వలన లేదా ఇతర వాటి వలన విస్తరించుకుని కూర్చో లేకపోతే తనకు తగిన విధంగా కూర్చోవటంలో ఎటువంటి దోషం లేదు.
34
తషహ్హుద్ లో కుడి చేయిని కుడి తొడపై ఉంచి చూపుడు వేలు తప్ప అన్నీ వేళ్ళను మడిసి పెట్టి చూపుడు వేలుతో సైగ చేయాలి.
35
లేదా మధ్య వేలుతో బొటన వేలుని కలిపి గుండ్రంగా చేసి చూపుడు వేలుతో సైగ చేయాలి.
36
ఇక ఎడమ చేయి విషయానికొస్తే దాన్ని ఎడమ తొడపై విస్తరింపజేసి ఉంచ వచ్చు లేదా దాన్ని మోకాలిపై బిగిసి పెట్టవచ్చు.
తషహ్హుద్ లో మన చూపులు మన కుడి చేయి చూపుడు వేలు వైపు ఉండటం ముస్తహబ్.
37
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు,అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు,వ రహ్మతుల్లాహి వ బరకాతుహు,అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు,వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.
మూడు రకాతుల లేదా నాలుగు రకాతుల నమాజు అయినప్పు డు మొదటి తషహ్హుద్ ను చదవటం సరిపోవును.
ఇక ఫజర్ లేదా జుమా లేదా రెండు పండుగల లాగా రెండు రకాతుల నమాజు అయితే తషహ్హుద్ ను దరూదె ఇబ్రాహీమ్ తోపాటు పూర్తిగా చదవాలి.
‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్,కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు'స్తోత్రానికి అర్హుడవు,ఘనత కలవాడవు నీవే'ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయనకుటుంబంపై శుభాలు కురిపించు.
38
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక).
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక).
తషహ్హుద్ ముగిసిన తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ ప్రకారం వచ్చిన దుఆలను పఠించిన తరువాత సలాం తిరగాలి. కాని ఇది రెండు రకాతుల నమాజులో.
39
మేము తేలికగా వింటాము : అల్లాహు అక్బర్
ఇక మగ్రిబ్ లా మూడు రకాతుల నమాజు లేదా జుహర్,అసర్,ఇషాలా నాలుగు రకాతుల నమాజు అయినప్పుడు
40
మొదటి తషహ్హుద్ తరువాత మగ్రిబ్ నమాజ్ అయితే ఒక రకాతు చదవటానికి లేదా జుహర్,అసర్,ఇషా నమాజు అయితే రెండు రకాతులు చదవటానికి నిలబడాలి. అందులో సూరే ఫాతిహా చదవాలి దానితో పాటు ముందు చేసినట్లు రుకూ,సజ్దాలు,ఖియామ్,జులూసు లన్ని చేయాలి.
41
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
42
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు తషహ్హుద్ ల ప్రతీ నమాజు చివరి తషహ్హుద్ లో పిరుదులపై (తవర్రుక్) కూర్చునేవారు.
43
జిల్సతు తవర్రుక్ (పిరుదులపై కూర్చోవటం) కేవలం మూడు రకాతుల,నాలుగు రకాతుల నమాజుల చివరి తషహ్హుద్లో మాత్రమే ఉంటుంది. దానికి ఒకటి కన్న చాలా ఎక్కువ రూపాలు కలవు.
44
ఎడమ కాలును పరచి కుడి కాలును నిలబెట్టి వాటిని కుడి వైపు నుంచి బయటకు తీయండి మరియు నేలపై పిరుదులను ఉంచటం.
లేదా
రెండు కాళ్ళను పరచి వాటిని కుడి వైపు నుండి తీయాలి.
లేదా
కుడి కాలును పరచి ఎడమ కాలును కుడి కాలు యొక్క తొడ,పిక్క మధ్యలో ప్రవేశింపజేయాలి.
45
చివరి తషహ్హుద్ లో కూర్చున్నప్పుడు మేము తషహ్హుద్ ను చదవాలి,ఆ తరువాత దాని వెనుకే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ చదవాలి.
46
సలాం తిరగక మునుపు,తషహ్హుద్ ముగిసిన తరువాత మేము అల్లాహ్ తో నాలిగింటి నుండి శరణం వేడుకోవాలి : నరక శిక్ష నుండి,సమాది శిక్ష నుండి,జీవన మరణ ఉపద్రవాల నుండి,మసీహుద్దజ్జాల్ ఉపద్రవ కీడు నుండి.
మరియు ఇహపరాల మేలులోంచి మేము తలచిన వాటిని అర్ధించాలి.
47
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక.
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక).
నమాజు ముగింపు జరగటం,దాని నుండి హలాల్ అవ్వటం సలాం తిరగటం ద్వారా జరుగును.
48
సలాం తిరగటం ద్వారా మేము మన నమాజును ముగించుకున్నాము.
అస్తగ్ఫిరుల్లాహ్,అస్తగ్ఫిరుల్లాహ్,అస్తగ్ఫిరుల్లాహ్
49
నమాజ్ చదివే వాడి కొరకు అతడు సలాం తిరిగినప్పుడు మూడు సార్లు అల్లాహ్ తో మన్నింపును వేడుకోవటం సున్నత్. ఆ తరువాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి వచ్చిన అజ్కార్ లతో పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ స్మరణ చేయాలి.
م
స్క్రీన్ పై వ్రాయబడింది.
1
నీవు ఇమామ్ అయినా లేదా ఒక్కడివైన
2
తక్బీరె తహ్రిమా
3
రెండు చేతులను రెండు భుజాలకు సమాంతరంగా పైకి లేపాలి.
4
అదే పద్దతిలో ఆ రెండిటిని (చేతులను) చెవులకు సమాంతరంగా లేపాలి.
5
రెండు చేతులను హృదయంపై ఉంచాలి
6
లేదా బొడ్డు పైకి
7
లేదా బొడ్డు క్రిందకి
8
మన కుడి చేతిని ఎడమ అర చేతిపై ఉంచుకోవాలి.
9
లేదా కుడి చేతితో ఎడమ చేతిని పట్టుకోవాలి.
10
ఇస్తిఫ్తాహ్ దుఆ
11
అల్లాహుమ్మ బాయిద్ బైని వ బైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మగ్రిబి ,అల్లాహుమ్మ నక్కినీ మిన్ ఖతాయాయ కమా యునక్క సౌబుల్ అబ్యజు మినద్దనసి ,అల్లాహుమ్మగ్సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జి వల్ మాయి వల్ బరది' (రవాహు ముస్లిం)
12
వాటి మధ్య వైవిధ్యం చేయటం సున్నత్
13
ఇస్తిఆజ (శరణు కోరటం)
14
శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను
15
ఫాతిహ
16
అల్హందులిల్లాహి రబ్బిల్ ఆలమీన్,అర్రహ్మానిర్రహీమ్,మాలికియౌమిద్దీన్, ఇయ్యాకనాబుదు వ ఇయ్యాకనస్తయీన్, ఇహ్దినస్సిరాతల్ ముస్తఖీమ్, సిరాతల్లజీన అన్అమ్త అలైహిమ్, గైరిల్ మగ్జూబి అలైహిమ్ వలజ్జాల్లీన్.
17
ఆమీన్ (స్వీకరించు)
18
దుఆ దాని అర్దం ఓ అల్లాహ్ స్వీకరించు.
19
ఖుర్ఆన్ నుండి సౌలభ్యమైన దాన్ని మేము చదవాలి.
20
రుకూ
21
అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు.
22
వీపు వంచకుండా తిన్నగా సమాంతరంగా ఉంచాలి.
23
సుబహానల్లాహి రబ్బియల్ అజీమ్ (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).
24
రుకూ యొక్క మాసూర్ దుఆలు.
25
’సబ్బూహున్ ఖుద్దూసున్ రబ్బుల్ మలాయికతి వర్రూహి’
26
సుబ్,హానక రబ్బనా వ బిహమ్దిక,అల్లాహుమ్మగ్ఫిర్లీ
27
సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్థుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు)
28
రబ్బనా వలకల్ హమ్దు,హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహి.
29
మా రెండు చేతులను క్రింది వదిలివేయాలి.
30
లేదా వాటిని కట్టుకోవాలి.
31
సజ్దాలు
32
ముక్కుతో పాటు నుదుట
33
రెండు అర చేతులు
34
రెండు మోకాళ్ళు
35
రెండు పాదములు
36
సుబహాన రబ్బియల్ ఆలా (మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు).
37
‘దాసుడు తన ప్రభువుకు ‘సజ్దా స్థితిలో ఉన్నప్పుడూ’ అతిసమీపంగా ఉంటాడు కాబట్టి మీరు ఆ స్థితిలో ఎక్కువగా దుఆ చేస్తూ ఉండండి. దీన్ని ముస్లిం ఉల్లేఖించారు.
38
జిల్సతుల్ ఇఫ్తిరాష్
39
జిల్సతుల్ ఇఖ్ఆ
40
రబ్బిగ్ఫిర్లీ (మూడు సార్లు)
41
అల్లాహుమ్మగ్ఫిర్లి,వర్హమ్నీ,వజ్బుర్నీ,వహ్దినీ,వర్జుఖ్నీ
42
ఫజర్
43
జుమ్ఆ
44
రెండు పండుగలు
45
జుహర్
46
అసర్
47
మగ్రిబ్
48
ఇషా
49
అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు,అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు,వ రహ్మతుల్లాహి వ బరకాతుహు,అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు,వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు.
50
‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్,కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు'స్తోత్రానికి అర్హుడవు,ఘనత కలవాడవు నీవే'ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయన కుటుంబం పై శుభాలు కురూపించు.
51
జుహర్ - అసర్ - మగ్రిబ్ - ఇషా
52
ఫజర్ - జుమ్ఆ - రెండు పండుగలు
53
‘అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్,కమా సల్లైత అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్’ అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలీ ముహమ్మద్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వఅలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్ (ఓ అల్లాహ్ !నీవు ఇబ్రాహీం ను ఆయన కుటుంబం వారిని కరుణించినట్లుగానే ముహమ్మద్'ను మరియు ఆయన కుటుంబాన్నికరుణించు'స్తోత్రానికి అర్హుడవు,ఘనత కలవాడవు నీవే'ఓ అల్లాహ్ !ఇబ్రాహీం పై ఆయన కుటుంబం పై శుభాలు కురిపించినట్లుగానే ముహమ్మద్' మరియు ఆయనకుటుంబంపై శుభాలు కురూపించు.
54
అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక.
55
చివరి రకాత్ లో కూర్చునేటప్పుడు ఎడమ కాలును ముందుకు జరిపి కుడికాలును నిలబెట్టి పిరుదులపై (సీటుపై) కూర్చోవాలి. దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు
56
జిల్సతు తవర్రుక్
57
అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబి జహన్నమ, వ మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి (రవాహు ముస్లిం). (ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నరక యాతన నుండి,సమాది శిక్ష నుండి,జీవితపు,మరణపు ఉపద్రవాల నుండి,మసిహుద్దజ్జాల్ ఉపద్రవాల కీడు నుండి నీతో శరణు వేడు కుంటున్నాను ) దీన్ని ముస్లిం ఉల్లేఖించారు
58
అల్లాహుమ్మ ఇన్నీ జలమ్తు నఫ్సీ జుల్మన్ కసీరన్, వలా యగ్ఫిరుజ్జునూబ ఇల్లా అన్త, ఫగ్ఫిర్లీ మగ్ఫిరతన్ మిన్ ఇందిక వర్హమ్ని ఇన్నక అన్తల్ గఫూరుర్రహీమ్ (రవాహుల్ బుఖారి) (ఓ అల్లాహ్ నిశ్చయంగా నేను నా మనస్సుపై బాగా హింసకు పాల్పడ్డాను, నీవు తప్ప పాపములను మన్నించే వాడు ఎవడూ లేదు, కావున నీవు నీ యందు నుండి నన్ను మన్నించు మరియు నాపై కరుణించు. నిశ్చయంగా నీవే మన్నించేవాడవు కరుణించేవాడువు.
59
అస్తగ్ఫిరుల్లాహ్ (మూడు సార్లు)
60
హజ్రత్ అబూ హురైర (ర) ఉల్లేఖనం : ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలుకుతుండగా విన్నానని అన్నారు :- ప్రళయదినాన దాసుడికి తన కర్మల్లోంచి అతని నమాజు గురించి మొట్టమొదట లెక్క తీసుకోవటం జరుగును. ఒక వేళ అది సరిగా ఉంటే అతడు సాఫల్యం చెందుతాడు,బ్రతికి బయటపడుతాడు. ఒక వేళ అది చెడితే అతడు నష్టపోతాడు. అబూ దావుద్,తిర్మిజీ,నసాయి దాన్ని ఉల్లేఖించారు.