సలాహ్ (నమాజు) ఎలా ఆచరించాలో తెలిపే సంక్షిప్త ఆచరణాత్మక వివరణ. మనం పూర్తి అవగాహనతో అల్లాహ్ ను ఆరాధించడానికి మరియు మన నమాజ్ అన్ని నిబంధనలు మరియు షరతులతో సంపూర్ణంగా ఉండటానికి ఇది ఉద్దేశించబడింది. సలాహ్ (నమాజు) విధానము మనం సలాహ్ (నమాజ్) చేసే ముందు, చిన్న అశుద్ధత (హదథ్ అస్గర్) నుండి మరియు పెద్ద అశుద్ధత (హదథ్ అక్బర్) నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం తప్పనిసరి. మనం పవిత్రమైన దుస్తులు ధరించి మరియు మన శరీరాన్ని కప్పుకుని ముఖ్యంగా మన మర్మావయవాలను కప్పి ఉంచి సలాహ్ (నమాజ్) చేయాలి. మన శరీరం మరియు సలాహ్ (నమాజ్) చేసే స్థలం కూడా మలినాల (నజాసత్) నుండి పరిశుభ్రంగా ఉండాలి. మనం ఖిబ్లాకు (కాబాగృహానికి)…
సలాహ్ (నమాజు) ఎలా ఆచరించాలో తెలిపే సంక్షిప్త ఆచరణాత్మక వివరణ. మనం పూర్తి అవగాహనతో అల్లాహ్ ను ఆరాధించడానికి మరియు మన నమాజ్ అన్ని నిబంధనలు మరియు షరతులతో సంపూర్ణంగా ఉండటానికి ఇది ఉద్దేశించబడింది.సలాహ్ (నమాజు) విధానము
మనం సలాహ్ (నమాజ్) చేసే ముందు, చిన్న అశుద్ధత (హదథ్ అస్గర్) నుండి మరియు పెద్ద అశుద్ధత (హదథ్ అక్బర్) నుండి మనల్ని మనం శుద్ధి చేసుకోవడం తప్పనిసరి.
మనం పవిత్రమైన దుస్తులు ధరించి మరియు మన శరీరాన్ని కప్పుకుని ముఖ్యంగా మన మర్మావయవాలను కప్పి ఉంచి సలాహ్ (నమాజ్) చేయాలి.
మన శరీరం మరియు సలాహ్ (నమాజ్) చేసే స్థలం కూడా మలినాల (నజాసత్) నుండి పరిశుభ్రంగా ఉండాలి.
మనం ఖిబ్లాకు (కాబాగృహానికి) అభిముఖంగా నిలబడాలి.మన ముందు ఒక సుత్రా (అడ్డు) ఉంచుకుని నమాజ్ చేయడం ఉత్తమం. (సుత్రా అంటే ఇస్లామీయ పరిభాషలో నమాజ్ చేసే వ్యక్తి తన ముందు హద్దుగా ఉంచుకునే ఏదైనా వస్తువు.)
తరువాత, మనం 'తక్బీర్ తహ్రీమా' (ప్రారంభ తక్బీర్) ఇలా పలకాలి:
అల్లాహు అక్బర్
అల్లాహు అక్బర్
మన రెండు చేతులను భుజాల వరకు లేదా చెవుల వరకు పైకి ఎత్తాలి.
మన అరచేతులు ఖిబ్లా (కాబాగృహం) వైపునకు ఉండాలి.
మన కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచాలి.
మరియు ఖిరాత్ (ఖుర్ఆన్ పఠనం) ప్రారంభించక ముందు 'దుఆ-ఎ-ఇస్తిఫ్తాహ్' (ప్రారంభ దుఆ) చేయడం ఉత్తమం. అది:
ఓ అల్లాహ్! నీవు అత్యంత పవిత్రుడవు, నీకే సకల స్తోత్రములు శోభిస్తాయి. నీ నామము ఎంతో శుభప్రదమైనది, నీ ఘనత అత్యున్నతమైనది. నీవు తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేడు.
సుబ్-హానక అల్లాహుమ్మ వ బి-హమ్దిక, వ తబారకస్-ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక.
లేదా హదీథులలో వచ్చిన ఇతర ప్రామాణిక దుఆలలో నుండి ఏదైనా ఒకటి పఠించవచ్చు.
తరువాత, నమాజ్ ప్రారంభంలో (శైతాన్ నుండి) రక్షణ కోరుతూ ఇలా ఇస్తిఆదా దుఆ చేయాలి:
శాపగ్రస్తుడైన షైతాను బారి నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను.
సూరతుల్ ఫాతిహా పఠనం పూర్తి చేసిన తరువాత, ఖుర్ఆన్ నుండి వీలైనంత పఠించడం సున్నతు.
ఆ తరువాత తక్బీర్ (అల్లాహు అక్బర్ అని) పలికి రుకూలో వెళ్ళాలి. (రుకూ అంటే ముందుకు వంగి, నడుము నిటారుగా ఉంచుతూ, రెండు అరచేతులతో రెండు మోకాళ్ళను గట్టిగా పట్టుకోవాలి).అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)
మన అరచేతులను మోకాళ్లపై ఉంచాలి మరియు మన చేతివేళ్లను విడదీసి (వెడల్పుగా ఉంచి) మోకాళ్లను గట్టిగా పట్టుకున్నట్లుగా ఉంచాలి.
ఆ తరువాత ఇలా పలకాలి:సుబహాన రబ్బియల్ అజీమ్. (పరమ పవిత్రుడైన నా ప్రభువు మహోన్నతుడు).సుబహాన రబ్బియల్ అజీమ్. (పరమ పవిత్రుడైన నా ప్రభువు మహోన్నతుడు).ఇలా కనీసం మూడు సార్లు పలకాలి.
తరువాత రుకూ నుండి పైకి లేస్తూ ఇలా పలకాలి:సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (తనను స్థుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు).సమిఅల్లాహు లిమన్ హమిదహ్
అలా నిటారుగా నిలబడిన తరువాత ఇలా పలకాలి:రబ్బనా వలకల్ హమ్'ద్ (ఓ మా ప్రభు!, మా స్థుతులన్ని నీ కొరకే)రబ్బనా వలకల్ హమ్'ద్
ఆ తరువాత సజ్దా (సాష్టాంగము) లోనికి వెళుతూ మరలా ఇలా తక్బీర్ పలకాలి:అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు).
సజ్దా (సాష్టాంగము) ఏడు ఎముకలపై ఉండాలి:
నుదురు మరియు ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు పాదాల వేళ్ళ అంచులు.
రెండు పాదములను నిటారుగా నిలబెట్టి, రెండు కాళ్ళ వేళ్ళ అంచులను ఖిబ్లాకు అభిముఖంగా ఉంచాలి.
సజ్దాలో రెండు తొడలను ఎడంగా ఉంచి, వాటి నుండి పొట్టను పైకి లేపాలి.
రెండు మోజేతులను నేల నుండి పైకి లేపి, పక్క ఎముకల నుండి దూరంగా ఉండేటట్లు చూడాలి.
ఒకవేళ మనం జమాతుతో సామూహికంగా నమాజు చేస్తూ, మన చుట్టూ ప్రకల ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తామేమోనని భయపడితే తప్ప.
మరియు రెండు అర చేతులను భుజాలకు సమాంతరంగా నేలపై ఉంచాలి. (చేతివేళ్ళు ఖిబ్లాకు అభిముఖంగా నేలపై ఆన్చి ఉంచాలి)
ఆ తరువాత సజ్దాలో ఇలా పలకాలి:సుబహాన రబ్బియల్ ఆలా (పరమ పవిత్రుడైన అల్లాహ్ మహోన్నతుడు)సుబహాన రబ్బియల్ అఅ్'లాకనీసం మూడు సార్లు పలకాలి
ఆ తరువాత తక్బీర్ పలుకుతూ తలను సజ్దా నుంచి పైకి లేపాలి. (ముందుగా నుదురు, ఆ తరువాత ముక్క)అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు).
ఎడమ పాదమును పరచి దానిపై ప్రశాంతముగా కూర్చోవాలి.
కుడి పాదమును నిలబెట్టి, దాని వేళ్లను ఖిబ్లా వైపు ఉండేలా చేయాలి.
మన కుడి చేతిని కుడి తొడపై, ఎడమ చేతిని ఎడమ తొడపై ఉంచాలి.
ఆ తరువాత ఇలా దుఆ చేయాలి:రబ్బిగ్ ఫిర్లీ ( ఓ నా ప్రభు! నన్ను క్షమించు).రబ్బిగ్ ఫిర్లీఇలా మూడు సార్లు పలకాలి.
తరువాత, తక్బీర్ పలుకుతూ, మొదట చేసిన సజ్దా మాదిరిగానే రెండవ సజ్దా చేయాలి.
ఆ తరువాత తక్బీర్ పలుకుతూ లేచి నిలబడాలి.అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు).రెండవ రకాతుకు
ఇస్తిఫ్'తా పఠించకుండా, మొదటి రకాతు మాదిరిగానే రెండవ రకాతును పూర్తి చేయాలి.
రెండవ రకాతు పూర్తి అయిన తరువాత, తషహ్హుద్ పఠించుట కొరకు విస్తరించుకుని కూర్చోవాలి.
తషహ్హుద్ లో కుడి చేయిని కుడి తొడపై ఉంచి చూపుడు వేలు తప్ప అన్నీ వేళ్ళను మడిచి వేయాలి.
ఎడమ చేతిని ఎడమ తొడపై పరిచి ఉంచి, తషహ్హుద్ పఠించాలి:
సకల ఆరాధనలు, ప్రార్థనలు మరియు పవిత్రమైనవన్నీ అల్లాహ్ కే చెందును. ఓ ప్రవక్తా! మీపై అల్లాహ్ శాంతి, కరుణ మరియు శుభాలు వర్షించుగాక. మాపై మరియు అల్లాహ్ యొక్క పుణ్యాత్ములైన దాసులందరిపై శాంతి కలుగుగాక. అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవ్వడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను.అత్తహియ్యాతు లిల్లాహి వస్సలావాతు వత్తయ్యి బాతు,
అస్సలాము అలయిక అయ్యుహన్ నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు,
అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్ సాలిహీన్,
అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు,
వ అష్ హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు
రెండు రకాతుల నమాజు అయితే, తషహ్హుద్ ను ఇలా దరూద్ ఇబ్రాహీమ్ తో పాటు పూర్తిగా పఠించాలి:
ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీం పై మరియు ఆయన కుటుంబంపై అనుగ్రహాలు పంపినట్లే, ముహమ్మద్ మరియు ఆయన కుటుంబముపై అనుగ్రహాలు పంపించు. నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవు, మహిమాన్వితుడవు. ఓ అల్లాహ్! నీవు ఇబ్రాహీంపై మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించినట్లుగానే, ముహమ్మద్ మరియు ఆయన కుటుంబంపై శుభాలు కురిపించు. నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడవు, మహిమాన్వితుడవు.అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా సల్లయ్'త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదున్ మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మద్, కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ్, ఇన్నక హమీదున్ మజీద్.
ఆ తరువాత మనం ఇలా దుఆ చేయాలి:ఓ అల్లాహ్! నేను నరకం శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి, జీవితం మరియు మరణం యొక్క పరీక్షల నుండి, మరియు మసీహ్ దజ్జాల్ యొక్క దుష్ట పరీక్ష నుండి నీ శరణు కోరుతున్నాను.అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ అదాబి జహన్నమ్, వ మిన్ అదాబిల్ ఖబ్ర్, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాత్, వ మిన్ షర్రి ఫిత్నతిల్ మసీహిద్-దజ్జాల్.
తరువాత కుడి వైపు సలాం పలుకుతూ ముఖం త్రిప్పాలి:మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యములు కురియుగాక.అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహ్
ఆ తరువాత ఎడమ వైపు సలాం పలుకుతూ ముఖం త్రిప్పాలి.మీపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యము కురియుగాక.
ఒకవేళ నమాజు మూడు రకాతులు, లేదా నాలుగు రకాతుల నమాజు అయితే,
మొదటి తషహ్హుద్ తరువాత మిగిలిన నమాజు కొనసాగించటానికి లేచి నిలబడాలి.
మరియు ఇలా తక్బీర్ పలకాలి:అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు).
అందులో కేవలం సూరతుల్ ఫాతిహా మాత్రమే పఠించాలి.ముందు రకాతుల మాదిరిగానే చేస్తూ, నమాజు పూర్తి చేయాలి.
ఇక చివరి తషహ్హుద్ లో తవర్రుక్ పద్ధతిలో కూర్చోవాలి, అది ఎలాగంటే:
కుడి కాలును నిలబెట్టి, ఎడమ కాలును కుడి పిక్క కింద నుండి తీసి, తన ఎడమ పిరుదుపై కూర్చోవాలి.
మరియు తషహ్హుద్, దరూదె ఇబ్రాహీమ్ పఠించాలి.
ఆ తరువాత దుఆలు చేసుకోవాలి మరియు చివరిగా సలాంతో నమాజును ముగించాలి.
1- భుజాల వరకు
2- చెవుల వరకు
3- 7 ఎముకలు:
4- నుదురు మరియు ముక్కు
5- రెండు అరచేతులు
6- రెండు మోకాళ్ళు
7- రెండు పాదాలు
ఉదూ చేసే విధానము (ఆచరణాత్మకంగా వివరించే సంక్షిప్త వీడియో)
79 భాషలు
ఉదూ చేసే విధానము (ఆచరణాత్మకంగా వివరించే సంక్షిప్త వీడియో)
ఉదూ చేసే సరైన విధానము ఈ వీడియోలో చక్కగా వివరించబడినది. ఇది వుదూ చేసే విధానాన్ని అడుగడుగునా వివరించే ఒక చక్కటి వీడియో. ఈ వీడియో ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే నమాజు స్వీకరించబటానికి 'వుదూ' ఒక అత్యంత కీలకమైన ప్రాథమిక షరతు! ఈ వీడియో పూర్తిగా చూసి, సరైన పద్ధతిలో ఉదూ చేయడం నేర్చుకోండి. ఉదూ చేసే విధానము
ఈ పుస్తకం ఈమాన్ యొక్క మౌలికాంశాలను వివరిస్తుంది; అంటే అల్లాహ్'పై, ఆయన దైవదూతలపై, ఆయన గ్రంథములపై, ఆయన ప్రవక్తలపై, అంతిమ దినముపై మరియు విధివ్రాతపై విశ్వాసము. ఇంకా ముస్లింలు విశ్వసించి వాటి ప్రకారమే ఆచరించవలసిన మౌలిక సూత్రాలను ఈ పుస్తకం చూపుతున్నది, అలాగే ఇస్లామీయ అఖీదాను (విశ్వాసమును, సిద్ధాంతమును) లోతుగా అర్థం చేసుకోవడం ద్వారా అల్లాహ్తో సంబంధాన్ని దృఢపరచడం యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తున్నది.
అజాన్ యొక్క పదాలను వివరించే ఈ పుస్తకం, ఆ పదాలను విశ్వాసపరంగా వివరిస్తుంది, వాటి అఖీదా మరియు ఆత్మీయ శిక్షణ సంబంధిత కోణాలను నొక్కి చెబుతుంది. అజాన్ కేవలం నమాజుకు పిలుపు మాత్రమే కాదు, అది ప్రతి రోజూ తౌహీద్ (ఏకదైవ విశ్వాసం) మరియు ఫలాహ్ (సఫలత) వైపుకు ఆహ్వానం అని ఇది స్పష్టపరుస్తుంది. అజాన్ పదాలను సవిస్తరంగా సమీక్షించి, వాటి సూచ్యార్థాలను విపులీకరిస్తుంది—అల్లాహ్ను మహిమపరచడం, షహాదతుత్-తౌహీద్ మరియు రిసాలా (ప్రవక్తత్వ సందేశం) నుండి, నమాజుకు మరియు విజయం వైపు ఆహ్వానం, అనంతరం తక్బీర్ మరియు తౌహీద్తో ముగుస్తుంది. ఒక ప్రభావవంతమైన శైలిలో, అజాన్ పదాలను దాని ఆధ్యాత్మిక లక్ష్యాలతో అనుసంధానించి, హృదయాలను…