బిస్మిల్లా హిల్లజీ లా యజుర్రు మఅ' ఇస్మిహి షైఉన్ ఫల్ అ'ర్'జి వలా ఫిస్సమాఇ వహువ స్సమీఉ'ల్ అ'లీమ్ [భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఎవరి పేరు వింటే నష్టాన్ని కలిగించవో, ఆ అల్లాహ్ నామముతో! ఆయనే సర్వం వినేవాడూ, అన్నీ ఎరిగినవాడూను.]మూడు సార్లు
రజీతు బిల్లాహి రబ్బన్ వబిల్ ఇస్లామి దీనన్ వ బిముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం నబీయ్యన్. [అల్లాహ్ యే నా ప్రభువుగా, ఇస్లాం యే నా ధర్మముగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ యొక్క ప్రవక్తగా నేను ఇష్టపడినాను.]మూడు సార్లు
అస్బహ్''నా వ అస్బహల్ ముల్'కు లిల్లాహ్, వల్'హమ్'దు లిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు వహ్'దహు లా షరీకలహు, లహుల్'ముల్'కు వ లహుల్ హమ్'దు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, రబ్బి అస్అలుక ఖైర మా ఫీ హాదల్ యౌమ్ వ ఖైర మా బఅ'దహు, వ అఊ'దు బిక మిన్ షర్రిమా ఫీ హాదల్ యౌమి వమిన్ షర్రిమా బాదహ్ రబ్బి అఊజుబిక మినల్ కసలి వ సూఇల్ కిబరి, వ అఊ'జు బిక మిన్ అ'జాబిన్ న్నారి వ అ'జాబిల్ ఖబర్. [ మనము మరియు సమస్త లోకాలు అల్లాహ్ కొరకు ఉదయం గావించాము. అల్లాహ్ తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. ఆయన ఒకే ఒక్కడు. ఆయనకు భాగస్వాములెవ్వరూ లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు. ఓ నా ప్రభూ! ఈ రోజులోనూ మరియు ఈ రోజు తరువాత రోజులలోనూ ఉన్న మేలును (ప్రసాదించమని) నీతో అర్థిస్తున్నాను. అలాగే ఈరోజులోనూ మరియు ఈ రోజు తరువాత రోజులలోనూ ఉన్న చెడు నుండి నీ శరణు కోరుచున్నాను. ఓ నా ప్రభూ! సోమరితనం నుండి మరియు వృద్ధాప్యపు చెడు నుండి నీ శరణు కోరుచున్నాను. ఇంకా నరకాగ్ని నుండి మరియు సమాధి శిక్షల నుండి నిన్నే శరణు కోరుచున్నాను.]సాయంకాలం ఈ దుఆ చేసేటప్పుడు ఇలా పలక వలెను.(అస్బహ్''నా వ అస్బహల్ ముల్'కు లిల్లాహ్) కు బదులుగా (అమ్'సైనా వ అమ్'సఅల్ ముల్'కు లిల్లాహ్) అని పలుక వలెను.ఇంకా ఇలా దుఆ చేయవలెను,రబ్బి అస్'అలుక ఖైర మా ఫీ హాజిహిల్'లైలహ్ (ఓ నా ప్రభూ! ఈ రాత్రిలో ఉన్న శుభాలను ప్రసాదించమని నేను నిన్ను వేడుకుంటున్నాను.)అస్బహ్ నా వ అస్బహ్ కు బదులుగా హాజల్ యౌమ్ (ఈ దినము) అని కూడా పలుక వచ్చు.
అల్లాహుమ్మ బిక అస్బహ్ నా వ బిక అమ్'సైనా వ బిక నహ్యా వ బిక నమూతు వ ఇలైకన్ నుషూర్. (ఓ అల్లాహ్! మేము నీ వలననే ఉదయం గావించినాము, నీ వలననే సాయంత్రం గావించినాము. నీవే మమ్ముల్ని జీవింపజేస్తున్నావు, నీవే మరణాన్ని ప్రసాదిస్తావు మరియు నీ వైపునకే మేము లేపబడతాము)సాయంకాలం ఈ దుఆ చేసేటప్పుడు ఇలా పలక వలెను.అల్లాహుమ్మ బిక అమ్'సైనా వ బిక అస్బహ్ నా వ బిక నమూతు వ బిక నహ్యా వ ఇలైకల్ మసీర్. (ఓ నా ప్రభూ! నీ వలననే మేము సాయంత్రం గావించాము మరియు నీ వలననే ఉదయం గావించాము. నీవే మాకు మరణాన్ని ప్రసాదిస్తావు మరియు నీవే మమ్మల్ని జీవింప జేస్తున్నావు. మా విధివ్రాత నీ వద్దనే ఉన్నది.)
అల్లాహుమ్మ మా అస్బహ బీ మిన్ నేమతిన్ అవ్ బిఅహదిన్ మిన్ ఖల్'ఖిక, ఫమిన్'క వహ్'దక లా షరీక లక, ఫ లకల్ హమ్'దు వ లకష్షుక్రు (ఓ అల్లాహ్! నా పైననూ లేక సృష్టిలోని మరెవరి పైననూ ఉదయించిన వరాలన్నీ నీవు అనుగ్రహించినవే. నీవు ఒకే ఒక్కడివి, నీకు సాటి ఎవ్వరూ లేరు. స్తుతి స్తోత్రములు, కృతజ్ఞతలు అన్నీ నీ కొరకే.)సాయంకాలం ఈ దుఆ చేసేటప్పుడు ఇలా పలక వలెను.మా అమ్'సా బీ (పూర్తయిన వరాలన్నీ)
మూడు సార్లు
అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ ఆఫియత ఫిద్'దునియా వల్ ఆఖిరహ్. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుకల్ అఫ్వ వల్ ఆఫియత ఫీ దీనీ వ దునియాయ, వ అహ్'లీ వ మాలీ, అల్లాహుమ్మస్తుర్ ఔరాతీ వ ఆమిన రౌఆతీ, అల్లాహుమ్మ ఇహ్'ఫజ్'నీ మిమ్ బైన యదయ్య వ మిన్ ఖల్ఫీ, వ అఊజు బిఅజ్'మతిక అన్ ఉగ్'తాల మిన్ తహ'తీ (ఓ అల్లాహ్! ఇహపరలోకాలలో స్వస్థత మరియు నీ క్షమాపణ కోరుచున్నాను. ఓ అల్లాహ్! నేను స్వస్థత మరియు నీ క్షమాపణ కోరుచున్నాను నా ధర్మంలోనూ, నా ప్రాపంచిక విషయాలలోనూ, నా ఆలుబిడ్డలలోనూ మరియు నా సంపాదనలోనూ నీ మన్నింపు కోరుచున్నాను. ఓ అల్లాహ్! నా గోప్య విషయాలను గోప్యంగానే ఉంచు. నా అలజడిని ప్రశాంత పరచు. ఓ అల్లాహ్! నా ముందు వెనకాల నుండి, నా కుడి ఎడమల నుండి, నా పైనుండి నన్ను కాపాడు. క్రింది నుండి హఠాత్తుగా వచ్చే వినాశం నుండి నీ మహోన్నత శరణు వేడుకుంటున్నాను.)
అల్లాహుమ్మ అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత, ఖలఖ్'తనీ వ అనా అబ్దుక వ అనా అలా అహ్'దిక మస్ తతాతు, అఊజుబిక మిన్ షర్రి మా సనఅతు, అబూఉ లక బినేమతిక అలయ్య, వ అబూఉ బిజమ్బీ, ఫగ్'ఫిర్'లీ ఫ ఇన్నహు లా యగ్'ఫిరు జునూబ ఇల్లా అంత. (ఓ అల్లాహ్! నీవే నా ప్రభువువి. నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు. నీవే నన్ను పుట్టించావు. నేను నీ దాసుడను. నేను నీకు చేసిన వాగ్దానానికి, నీతో చేసుకున్న ఒప్పందానికి నా శాయశక్తులా కట్టుబడి ఉన్నాను. నేను చేసిన కర్మల నుండి నీ శరణు కోరుతున్నాను. నాపై ఉన్న నీ అనుగ్రహాలను ఒప్పుకుంటున్నాను. నేను చేసిన పాపాలను ఒప్పుకుంటున్నాను. కనుక నన్ను క్షమించు. ఎందుకనగా నీవు తప్ప పాపాలను క్షమించేవాడు ఎవడూ లేడు.)
అల్లాహుమ్మ ఫాతిరస్'సమావాతి వల్ అర్'జి, ఆలిమిల్ గైబి వష్'షహాదతి, రబ్బ కుల్లి షైఇన్ వ మలీకహు, అష్'హదు అన్ లా ఇలాహ ఇల్లా అంత, అఊజుబిక మిన్ షర్రి నఫ్సీ వ మిన్ షర్రిష్'షైతాని వ షిర్కిహి, వ అన్అఖ్'తరిఫ అలా నఫ్సి సూఅన్ ఔ అజుర్రహు ఇలా ముస్లిమిన్. (ఓ అల్లాహ్! భూమ్యాకాశాల సృష్టికర్తా! గోచర అగోచరాల జ్ఞానీ! సృష్టిలోని ప్రతి ఒక్క దాని ప్రభువూ మరియు యజమానీ! నీవు తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవడూ లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నాలోని కీడు నుండి, షైతాను కీడు నుండి మరియు వాడి షిర్కు (అల్లాహ్ కు సాటి కల్పించుట నుండి) నుండి నీ శరణు వేడుకుంటున్నాను. ఇంకా నాకు నేనై కల్పించుకునే కీడు నుండి లేదా ఇతర ముస్లింలకు నా ద్వారా సంక్రమించే కీడు నుండి నీ శరణు వేడుకుంటున్నాను.)
అల్లాహుమ్మ ఇన్నీ అస్'బహ్'తు, ఉష్'హిదుక వ ఉష్'హిదు హమలత అర్'షిక వ మలాఇకతక వ అన్బియాయిక వ జమీఅ ఖల్'ఖిక బి అన్నక అంత లా ఇలాహ ఇల్లా అంత వ అన్న ముహమ్మదన్ అబ్దుక వ రసూలుక. (ఓ అల్లాహ్! నిన్ను సాక్షిగా చేస్తూ ఉదయం గావించాను - అలాగే నీ అర్ష్ ను (సింహాసనాన్ని) మోస్తున్న వారినీ, నీ దైవదూతలను,నీ సందేసహరలను మరియు నీ సమస్త సృష్టిని సాక్షిగా చేస్తూ! నిశ్చయంగా నీవే అల్లాహ్ (ఏకైక ఆరాధ్యుడివి). నీవు తప్ప ఆరాధనకు అర్హుడు ఎవ్వడూ లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ దాసుడు మరియు సందేశహరుడు అనీ నేను సాక్ష్యమిస్తున్నాను.)మరియు సాయంత్రం వేళలోఅల్లాహుమ్మ ఇన్నీ అమ్'సైతు (నేను సాయంత్రం గావించాను)... చివరి వరకు (నాలుగు సార్లు)
లా ఇలాహ ఇల్లల్లాహు వహ్'దహు లా షరీకలహు, లహుల్ ముల్'కు, వ లహుల్ హమ్'దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ఆయన ఒకే ఒక్కడు, ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు, విశ్వమంతా ఆయనకే చెందింది, సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకే శోభిస్తాయి, ఆయనే ప్రతి దానిపై ఆధిపత్యము కలిగి ఉన్నాడు.)ఉదయం మరియు సాయంత్రం (వంద సార్లు)
హస్'బియల్లాహు లా ఇలాహ ఇల్లా హువ అలైహి తవక్కల్'తు వ హువ రబ్బుల్ అర్'షిల్ అజీమ్ (నాకు అల్లాహ్ యే చాలు. ఆయన తప్ప నిజమైన ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. నేను ఆయన పైనే నమ్మకం ఉంచాను మరియు ఆయనే మహోన్నతమైన అర్'ష్ (సింహాసనము) యొక్క ప్రభువు.)ఏడు సార్లు
సుబ్'హా నల్లాహి వ బిహమ్'దిహి (అల్లాహ్ ఎలాంటి లోపాలూ, కొరతలూ లేని పరమ పవిత్రుడు మరియు సకల స్తోత్రములు, కృతజ్ఞతలు ఆయనకు మాత్రమే శోభిస్తాయి.)ఉదయం మరియు సాయంత్రం లేదా రెండు కలిపి వంద సార్లు
అస్'తగ్'ఫిరుల్లాహ్ వ అతూబు ఇలైహి (ఓ అల్లాహ్! నన్ను క్షమించు. పశ్చాత్తాపంతో నేను నీ వైపునకే మరలుతున్నాను, నీ వద్దనే తౌబా చేసుకుంటున్నాను)'''వంద సార్లు
పాఠకుల కొరకు సులభంగా ఉండేలా దీనిని వ్రాయడం జరిగింది. మీరందరూ దీని నుండి ప్రయోజనం పొందాలని నేను సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను వేడుకుంటున్నాను.
దీనిని ముహమ్మద్ సాలిహ్ అల్ ఉసైమీన్ 20-1-1428 హి నాడు రచించినారు.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానము
75 భాషలు
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానము
సమాహతు షైఖ్ అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ రహిమహుల్లాహ్ 'కైఫియ్యతుస్సలాతున్నబియ్యి సల్లల్లాహు అలైహివ సల్లమ్' అనే తన పుస్తకంలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి నమాజు విధానాన్ని ప్రామాణిక ఆధారాల వెలుగులో, సులభమైన శైలిలో మరియు కచ్చితమైన పద్ధతిలో సంక్షిప్తీకరించారు. ఈ పుస్తకం ఒక ముస్లింకు తన నమాజులో మార్గదర్శకంగా ఉంటుంది. దీనిలో ఆయన వుజూ నుండి తస్లీమ్ వరకు నమాజు యొక్క మూలస్తంభాలు (అర్కాన్), దాని సున్నతులు మరియు దాని స్వరూపాలను, ఆధారాలతో పాటు స్పష్టమైన వివరణను అందిస్తూ వివరించారు. ఇది అత్యంత గొప్ప ఆరాధనలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సంపూర్ణంగా అనుసరించాలని ప్రోత్సహిస్తుంది.
ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం.
65 భాషలు
ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం.
ఇస్లాం యొక్క సందేశహరులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం" అనే ఈ పుస్తకం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క వంశం, బాల్యం నుండి ఆయన శుభప్రదమైన వివాహం, వహీ ప్రారంభం మరియు ఆయన అంతిమ దైవదౌత్యం వరకు ఆయన జీవితాన్ని సమీక్షిస్తుంది. ఇది ఆయన దైవదౌత్యపు సూచనలను, ఆయన సత్యసంధతకు నిదర్శనాలను స్పష్టం చేస్తుంది; ఆయన తీసుకువచ్చిన షరీఅతును, మానవ హక్కులు మరియు గౌరవాన్ని పరిరక్షించడంలో దాని పాత్రను వివరిస్తుంది. అలాగే, ఆయనను విభేదించినవారి వైఖరిని మరియు ఆయన గురించి వారి సాక్ష్యాలను ప్రముఖంగా చూపిస్తూ, ఆయనను ప్రజలకు ఆదర్శంగా మరియు సృష్టికర్త యొక్క ఏకత్వం వైపు పిలుపునిచ్చేవానిగా నిలిపిన ఆయన ఉత్తమ…
ఉమ్రా మరియు హజ్ చేయదలచినవారి కోసం మార్గదర్శిని (మన్హజ్):
15 భాషలు
ఉమ్రా మరియు హజ్ చేయదలచినవారి కోసం మార్గదర్శిని (మన్హజ్):
షైఖ్ ముహమ్మద్ బిన్ సాలెహ్ అల్ ఉసైమీన్ రచించిన "అల్-మన్హజు లిమురీదిల్-ఉమ్రా వల్-హజ్" పుస్తకం, హజ్ మరియు ఉమ్రా ఆచరణకు ఆసక్తి ఉన్న ప్రతి ముస్లింకు సమగ్ర మరియు విశ్వసనీయ మార్గదర్శి. ఈ పుస్తకం ప్రయాణ ఆచారాలు, ఇహ్రామ్ ఆదేశాలు, హజ్ మరియు ఉమ్రా విధులు గురించి సమగ్ర వివరణను అందిస్తుంది, ఖుర్అన్ మరియు సున్నతుల ఆధారంగా పుస్తకం హజ్ సమయాలు, ఆచరణల రకాలు, ప్రయాణికుడి నమాజు ఆదేశాలు వంటి విషయాలను విపులంగా చర్చిస్తుంది, మరియు హజ్ మరియు ఉమ్రా ప్రతి మూలకాన్ని సరిగ్గా ఎలా నిర్వహించాలో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగా, వివరంగా చూపిస్తుంది.