ప్రశ్నలు మరియు సందేశాల ఎన్సైక్లోపీడియా
ఈ పుస్తకం ముస్లింలకు మరియు ఇతరులకు ఉపయోగపడే సాధారణ ప్రశ్నల సమూహాన్ని కలిగి ఉంది మరియు పవిత్ర ఖురాన్ మరియు సున్నత్ ఆధారంగా జ్ఞానపూర్వకమైన సమాధానాలను అందిస్తుంది. అలాగే, వారి దైనందిన జీవితంలో వారికి అవసరమైన ఫిఖహ్ (కర్మశాస్త్రం) మరియు అఖీదా (విశ్వాసం) విషయాలపై ప్రధానంగా దృష్టి సారిస్తూ, ఇస్లామీయ భావనలను స్పష్టం చేయడం మరియు ముస్లింలు మరియు ఇతరులకు వాటిని అర్థం చేసుకోవడాన్ని సులభతరం చేయడం ఈ పుస్తకం యొక్క ఉద్దేశ్యం; తద్వారా ఇది ఇస్లాం గురించి సరైన అవగాహనను మరియు సముచితమైన జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.
These files are generated automatically from the book's text; their layout may differ from the printed edition.
ప్రశ్నలు మరియు లేఖల ఎన్సైక్లోపీడియా
(మొదటి విభాగము)
వివిధ భాషలలో ఇస్లామీయ సాహిత్య సేవా సంఘం యొక్క శాస్త్రీయ కమిటీ
(సృష్టి విభాగం)
ప్రశ్న:
జీవం ఎలా ప్రారంభమైంది లేదా సృష్టి ఎలా ప్రారంభమైంది?
సమాధానం:
నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ ఉండేవాడు, ఆయన కన్న ముందు ఏదీ ఉండేది కాదు. ఆ తరువాత, విశ్వమంతా ఉనికిలో లేకుండా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన తన సృష్టిని సృష్టించాడు. అల్లాహ్ పరమపవిత్రుడు మహోన్నతుడు మునుపటి నమూనా ఏదీ లేకుండానే దానికి అస్తిత్వాన్ని, ఉనికిని కల్పించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- నిశ్చయంగా, మీ ప్రభువైన అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఆరు దినములలో (అయ్యామ్ లలో) సృష్టించాడు. ఆ పిదప తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. ఆయన రాత్రిని పగటి వెంట ఎడతెగకుండా అనుసరింపజేసి, దానిపై (పగటిపై) కప్పుతూ ఉంటాడు. మరియు సూర్యచంద్ర, నక్షత్రాలు ఆయన ఆజ్ఞకు కట్టుబడి ఉన్నాయి. నిశ్చయంగా, సర్వసృష్టి ఆయనదే! మరియు ఆజ్ఞ నడిచేది ఆయనదే. అల్లాహ్ ఎంతో శుభదాయకుడు, సర్వ లోకాలకు పోషకుడు! [అల్ ఆరాఫ్: 54]
బుఖారి తమ సహీహ్ లో ఉల్లేఖించారు: ఇమ్రాన్ ఇబ్నె హుసైన్ ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: ""అల్లాహ్ ఉండేవాడు. ఆయన కన్న ముందు ఏదీ ఉండేది కాదు. మరియు ఆయన సింహాసనం నీటిపై ఉండేది. ఆ తరువాత ఆయన ఆకాశములను,భూమిని సృష్టించాడు. మరియు ఆయన గ్రంథంలో ప్రతిదీ వ్రాసి ఉంచాడు.""
మరియు అల్లాహ్ మానవ తండ్రి అయిన ఆదంను సృష్టించాడు. సహీహ్ ముస్లింలోని అబూ హురైరహ్ ఉల్లేఖనం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "“సూర్యుడు ఉదయించే రోజుల్లో కెల్లా అతి ఉత్తమమైన రోజు (శుక్రవారము) జుమఆ రోజు. ఆ రోజు ఆదమ్ అలైహిస్సలామ్ పుట్టించబడ్డారు, స్వర్గంలో ప్రవేశం పొందారు. అదే రోజు అందులో నుండి బహిష్కరించబడ్డారు.”"
మరియు మహోన్నతుడైన అల్లాహ్ మనిషి సృష్టిని ప్రస్తావిస్తూ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వాస్తవంగా, మేము మానవుణ్ణి మట్టి యొక్క సారంతో సృష్టించాము. తరువాత అతనిని ఇంద్రియ బిందువుగా ఒక కోశంలో భద్రంగా ఉంచాము. ఐర్ఆ తరువాత ఆ ఇంద్రియ బిందువును రక్తపు ముద్దగా (జలగగా) మార్చాము. ఆ పైన ఆ రక్తపు ముద్దను (జలగను) మాంసపు ముద్దగా (జీవాణువుల పిండంగా) మార్చాము, ఆ జీవాణువుల పిండంలో ఎముకలను ఏర్పరచి, ఆ ఎముకలను మాంసంతో కప్పాము. ఆ తరువాత దానిని మరొక (భిన్న) సృష్టిగా చేశాము. కావున శుభకరుడు (శుభప్రదుడు) అయిన అల్లాహ్ యే అత్యుత్తమ సృష్టికర్త.﴿ [అల్ ముమినూన్:12-14]
మహోన్నతుడైన అల్లాహ్ ఈ ఆయతులలో మనిషి యొక్క దశలను మరియు అతని మార్పులను అతని సృష్టి ప్రారంభం నుండి చివరికి అతను చేరుకునే స్థితి వరకు ప్రస్తావించాడు. కాబట్టి మానవ జాతి తండ్రి అయిన ఆదమ్ అలైహిస్సలాం యొక్క సృష్టి ప్రారంభాన్ని ప్రస్తావించాడు, మరియు ఆయన … ﴾మట్టి యొక్క సారంతో﴿ అంటే: అది సేకరించబడింది, మరియు భూమి అంతటి నుండి తీసుకోబడింది, అందుకే అతని పిల్లలు భూమికి అనుగుణంగా వస్తారు: వారిలో కొందరు మంచి మరియు చెడు, మరియు దాని మధ్య వారు; మరియు మెత్తని వారు, కఠినులు, మరియు దాని మధ్య వారు వస్తారు.
మరియు అల్లాహ్ భూమ్యాకాశాలను మరియు వాటి మధ్య ఉన్నవాటిని సృష్టించడాన్ని పేర్కొన్నాడు: ﴾మీరు చూస్తున్నారు కదా! ఆయన ఆకాశాలను స్థంభాలు లేకుండానే సృష్టించాడు. మరియు భూమిలో పర్వతాలను నాటాడు, అది మీతో పాటు కదలకుండా ఉండాలని; మరియు దానిలో ప్రతి రకమైన ప్రాణిని నివసింపజేసాడు. మరియు మేము ఆకాశం నుండి నీటిని కురిపించి, దానిలో రకరకాల శ్రేష్ఠమైన (పదార్థాలను) ఉత్పత్తి చేశాము.﴿ [లుఖ్మాన్: 10].
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
(ఈమాన్ (విశ్వాసం) విభాగము)
ప్రశ్న:
అల్లాహ్ ఎవరు?
సమాధానం:
ఇస్లాంలో అల్లాహ్ సర్వలోకాలకు మరియు సకల సృష్టికి ప్రభువు, ఆయన తన అనుగ్రహముతో వారిని పోషిస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు.﴿ [అల్ ఫాతిహ: 2]
సృష్టికి ఆయనే ఏకైక సృష్టికర్త, యజమాని, ఆహార ప్రదాత, నిర్వహణకర్త, ఆయనకు సరిసాటి ఏ భాగస్వామి లేడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆకాశాలకూ, భూమికీ మరియు వాటి మధ్యనున్న సమస్తానికీ ఆయనే ప్రభువు, కావున మీరు ఆయననే ఆరాధించండి మరియు ఆయన ఆరాధనలోనే స్థిరంగా వుండండి. ఆయనతో సమానమైన స్థాయిగల వానిని ఎవడినైనా మీరెరుగుదురా?﴿ [సూరతు మర్యమ్: 65]
ఆయనే ఏకైక ఆరాధ్యుడు; ఆయన తప్ప సత్యమైన ఆరాధ్యుడు ఎవ్వరూ లేరు; ఎందుకంటే ఆయన దైవత్వము మరియు పరిపూర్ణత యొక్క గుణవిశేషణాలను కలిగి ఉన్నాడు, సృష్టించటం, ఆదేశము, తీర్పు ధర్మశాసనాలు చేయటం ఆయన ఒక్కడికే చెందును. ఆయనకు ఎవరు సాటి లేరు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾...భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది...﴿ [అర్రూమ్ : 27]
ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు, సంపూర్ణుడు, సకల ప్రశంసలు మరియు సంపూర్ణ పరిపూర్ణత ఆయనకే శోభిస్తాయి, అత్యంత సుందరమైన దివ్యనామాలు మరియు దివ్యమైన సుగుణాలు ఆయనకే చెందుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అల్లాహ్ పేర్లు! అన్నీ అత్యుత్తమమైనవే; కావున మీరు వాటితో ఆయనను ప్రార్థించండి...﴿ [అల్ ఆరాఫ్: 180]
సర్వశ్రవణశక్తి సంపూర్ణమైన వినేవాడు, సర్వదర్శనశక్తి సంపూర్ణమైన చూసేవాడు, సంపూర్ణ జ్ఞానం కలవాడు, ప్రతి విషయంపై శక్తి కలిగినవాడు — ఆయనకు ఏదీ అసాధ్యం కాదు, పరిశుద్ధుడైనవాడు. సమస్త సృష్టి మరియు ప్రతి జీవిని తన కరుణ ఆవరించిన అతి కరుణామయుడు, అతి దయాళువు, మరియు విశ్వాసులపై ప్రత్యేక కరుణ కలిగినవాడు. జీవించి ఉండే వాడు — ఎప్పటికీ మరణించడు. మొదటివాడు — ఆయనకు ముందు ఏదీ లేదు; చివరివాడు — ఆయన తరువాత ఏదీ లేదు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾ఆయనే ప్రథమం మరియు ఆయనే అంతం మరియు ఆయనే ప్రత్యక్షుడు మరియు ఆయనే పరోక్షుడు. మరియు ఆయనే ప్రతిదాని గురించి జ్ఞానం గలవాడు.﴿ [హదీద్ : 3]
హకీమ్ అనగా అతను తన సృష్టిని పరిపూర్ణంగా, అద్భుతంగా మరియు మంచిగా సృష్టించినవాడు, అతనికి తన సృష్టిలో మరియు తీర్పులలో హిక్మత్ (జ్ఞానం) ఉంది.
ఆయనకు ఎవరు సాటి లేరు, మరియు భార్య లేదు, ఎటువంటి సంతానము లేదు మరియు ఆయనకు జన్మనిచ్చినవాడు లేడు, ఆయన పరిశుద్ధుడు ఆయనను పోలినది ఏదీ లేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు. ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.﴿ [అల్ ఇఖ్లాస్:1-4], మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾... ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.﴿ [అష్-షూరా: 11]
ఆయన ఆకాశంలో, అర్ష్ మీద, అన్ని సృష్టులపై ఉన్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆ కరుణామయుడు, సింహాసనం (అర్ష్)పై ఆసీనుడై ఉన్నాడు.﴿ [సూరతు తాహా : 5]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మహా వివేచనాపరుడు, సర్వం తెలిసినవాడు.﴿ [సూరతుల్ అన్ఆమ్: 18]
***
ప్రశ్న:
అల్లాహ్ ఉనికికి ఆధారం ఏమిటి?
సమాధానం:
సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఉనికిపై నిదర్శనం స్పష్టమైన బుద్ధి, స్వచ్ఛమైన సహజ స్వభావం (ఫిత్రత్) మరియు రుజు మార్గాలు. మానవ బుద్ధి నిర్దేశించే దానికి విరుద్ధంగా వ్యవహరించే వారు తప్ప దీనిని ఎవరూ తిరస్కరించరు. ఎందుకంటే, ఈ జీవులు తమను సృష్టించిన ఒక సృష్టికర్తను తప్పనిసరిగా కలిగి ఉండాలి; ఈ జీవులు ఎటువంటి సృష్టికర్త లేదా ఉనికిలోకి తెచ్చినవాడు లేకుండా ఉనికిలోకి రావడం అనేది అసంబద్ధమైనదని బుద్ధి తప్పనిసరిగా నిర్ధారిస్తుంది. కాబట్టి ఉనికిలోకి తీసుకువచ్చేవాడు (సృష్టికర్త) లేకుండా ఏదీ ఉనికిలోకి రావడం సాధ్యం కాదు!
లేదా ఈ సృష్టిరాసులు తమను తామే సృష్టించుకుని ఉండాలి! మరియు ఇది అసాధ్యం మరియు అసంభవం, ఎందుకంటే ఏదైనా వస్తువు శూన్యం నుండి తనను తాను ఉనికిలోకి తీసుకురాదు.
లేదా ఈ సృష్టిరాసులకు వాటిని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, ఆయనే గొప్పవాడు, సర్వజ్ఞుడు, సృష్టికర్త మరియు సర్వ జ్ఞాని అయిన అల్లాహ్.
మహోన్నతుడైన అల్లాహ్ ఈ విభజనను అత్యుత్తమమైన వివరణతో, అత్యంత సంక్షిప్తంగా సూచిస్తూ ఇలా సెలవిస్తున్నాడు: ﴾వారు ఏ (సృష్టికర్త) లేకుండానే సృష్టింపబడ్డారా? లేక వారే సృష్టికర్తలా? లేక వారు ఆకాశాలను మరియు భూమిని సృష్టించారా? అలా కాదు, అసలు వారికి విశ్వాసం లేదు.﴾ [అల్ తూర్ : 35-36]
మరియు ఈ విషయం గురించి వారిలో ఒకరిని ఇలా ప్రశ్నించారు: "మీరు మీ ప్రభువును ఎలా కనుగొన్నారు?" దానికి అతను ఇలా అన్నాడు: "నిశ్చయంగా ఒంటె పేడ ఒంటెను సూచిస్తుంది, మరియు అడుగుజాడలు నడిచిన వ్యక్తిని సూచిస్తాయి; అలాంటప్పుడు, నక్షత్ర మండలాలతో కూడిన ఆకాశం, విస్తారమైన మార్గాలతో కూడిన భూమి, అలలతో కూడిన సముద్రాలు — ఇవన్నీ సూక్ష్మజ్ఞానుడైన, సమస్త విషయాలలో పరిజ్ఞానమున్నవాడైన అల్లాహ్‌ను సూచించవా?!”
నిశ్చయంగా ఈ జీవులను నడిపేవాడు ఒకడు తప్పనిసరిగా ఉన్నాడు, ఒకవేళ మీరు ఊర్ధ్వ మరియు అధో లోకాలను పరిశీలించి గమనించినట్లైతే అందులో మీరు పటిష్టమైన నిర్వహణను పొందుతారు, మరియు ప్రతి వస్తువు దానికి తగిన రూపంలో ఉనికిలోకి తీసుకురాబడింది, మరియు సమస్త జీవులు వాటికి ప్రయోజనం చేకూర్చే మరియు వాటి మనుగడను నిర్ధారించే వాటి వైపుకు మార్గనిర్దేశం చేయబడ్డాయి.
ఈ పరిపూర్ణత సమస్త జీవులలో లెక్కలేనన్ని రూపాలు మరియు ఆకారాలలో పునరావృతమైంది, దీనితో యాదృచ్ఛికత మరియు గందరగోళ సిద్ధాంతం అసంభవం!
మహోన్నతుడైన అల్లాహ్ దీని గురించి అప్రమత్తం చేస్తూ, పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾... ఇది అల్లాహ్ కార్యం! ఆయన ప్రతి కార్యాన్ని నేర్పుతో చేస్తాడు...﴿ [అన్-నమ్ల్ : 88]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(మూసా) జవాబిచ్చాడు: "ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు.﴿ [తాహా : 50]
ఇలా ఉల్లేఖించబడింది: నాస్తికుల ఒక బృందం అబూ హనీఫా రహిమహుల్లాహ్ వద్ద సమావేశమై ఇలా అన్నారు: "సృష్టికర్త ఉనికికి ఆధారం ఏమిటి?" అప్పుడు ఆయన వారితో ఇలా అన్నారు: "నన్ను వదిలేయండి, ఎందుకంటే నా మనస్సు ఒక వింతైన విషయంలో నిమగ్నమై ఉంది." వారు ఇలా అన్నారు: "అదేమిటి?" ఆయన ఇలా అన్నారు: "నాకు తెలిసినదేమిటంటే, దిజ్లహ్ నదిలో రకరకాల అద్భుతమైన వస్తువులతో నిండిన ఒక పెద్ద ఓడ ఉంది, మరియు దానిని ఎవరూ కదల్చకుండానే, దానిపై పర్యవేక్షించే నావికుడు ఎవరూ లేకుండానే అది వెళ్తూ మరియు వస్తూ ఉంది."
అప్పుడు వారు ఆయనతో ఇలా అన్నారు: "నీవేమైనా పిచ్చివాడివా?" ఆయన: "అదేమిటి?" అన్నారు. వారు: "దీనిని ఏ బుద్ధిమంతుడైనా నమ్ముతాడా?" అన్నారు. అప్పుడాయన వారితో ఇలా అన్నారు: "మరి ఈ విశ్వం, అందులోని రకరకాల వర్గాలు, జాతులు, ఆశ్చర్యకరమైన సంఘటనలు మరియు భ్రమిస్తూ చలించే ఈ ఆకాశగోళం అన్నీ సృష్టించేవాడు లేకుండానే నడుస్తున్నాయని, కదిలించేవాడు లేకుండానే ఈ కదిలే వస్తువులు కదులుతున్నాయని మీ బుద్ధి ఎలా నమ్మింది?" అప్పుడు వారు తమను తామే నిందించుకున్నారు.
పరమ పవిత్రుడైన, మహోన్నతుడైన ప్రభువు ఉనికిపై సూచించే ఆధారాలు లెక్కలేనన్ని ఉన్నాయి, వాటిలో ఒకటి ఫిత్రత్ (సహజ స్వభావం); ఇది మనిషి తనలోనే అనుభవించే సహజ లక్షణం, దానిని అతను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించలేడు.
మరియు వాటిలో ప్రతి సృష్టిరాసి పవిత్రుడు మరియు మహోన్నతుడైన సృష్టికర్తను సూచించడం.
వాటిలో సంరక్షణ, నైపుణ్యం మరియు వశపరచడం యొక్క రుజువు, మరియు లెక్కించడం సాధ్యపడనన్ని ఇతరాలు ఉన్నాయి, కనుక ప్రతి వస్తువు గొప్ప సృష్టికర్త, వివేకవంతుడైన నిర్వాహకుడు అయిన మహోన్నతుడైన అల్లాహ్ ను సూచిస్తుంది.
***
ప్రశ్న:
మహోన్నతుడైన అల్లాహ్ యొక్క తౌహీద్ (ఏకత్వం) తప్పనిసరి అనడానికి ఆధారం ఏమిటి?
సమాధానం:
మహోన్నతుడైన అల్లాహ్ ను ఆయన రుబూబియత్ లో ఏకీకరించడం తప్పనిసరి అనడానికి మరియు ఆయన ఒక్కరే సృష్టికర్త, యజమాని, నిర్వాహకుడని, ఆయనకు ఎవరూ సాటి లేరనడానికి ఆధారం.
వాటిలో నుంచి అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ ఎవ్వరినీ కూడా తనకు సంతానంగా చేసుకోలేదు మరియు ఆయనతో పాటు మరొక ఆరాధ్య దేవుడు లేడు. అలా అయితే ప్రతి దేవుడు తన సృష్టితో వేరై పోయేవాడు మరియు వారు ఒకరిపై నొకరు ప్రాబల్యం పొందగోరేవారు. అల్లాహ్! వారు కల్పించే వాటికి అతీతుడు.﴿ [అల్ ముమినూన్: 91]
ఈ ఆయత్ పండితులు పిలిచే 'దలీల్ తమానుఅ్' ను కలిగి ఉంది: దాని అర్థం ఏమిటంటే, అల్లాహ్ తో పాటు ఇతర దేవుళ్లు కూడా ఉన్నారని, ఊహించినట్లయితే, అప్పుడు అవి:
అవి దైవత్వంలో ఆయనకు లొంగిపోవాలి, లేదా దాని కొరకు ఆయనతో తగువులాడాలి. మొదటి ఊహ వాటి దైవత్వాన్ని రద్దు చేస్తుంది; ఎందుకంటే లొంగిపోయినవాడు అధీనంలో ఉన్నవాడే కానీ ఆరాధ్యుడు కాజాలడు. ఒకవేళ అవి ఆయన అధికారంలో మరియు సామ్రాజ్యంలో ఆయనతో తగువులాడితే, ఈ తగువులాట యొక్క ప్రభావం విశ్వంలో ఆరాధ్యదైవాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించే రూపంలో కనబడేది. మరియు ప్రతి ఆరాధ్యుడు తాను సృష్టించిన దానిని తీసుకుపోయేవాడు, తద్వారా ప్రతి ఒక్క ఆరాధ్యుడు తన సృష్టితో ప్రత్యేకమైపోయి, దానిపై తన ఇష్టానుసారంగా అధికారం చెలాయించేవాడు. మరియు మీరు వారిలో ప్రతి ఒక్కరి రాజ్యాన్ని ఇతరుల రాజ్యం నుండి వేరుగా చూసేవారు. ప్రపంచ రాజుల రాజ్యాలు ఏ విధంగానైతే వేరుగా ఉండి, వారు ఒకరిపై మరొకరు ఆధిపత్యం కోసం తగువులాడుతున్నారో మీరు చూస్తున్నట్లుగానే, ఆ ఆరాధ్యదైవాలు కూడా ఒకరిపై మరొకరు ఆధిపత్యాన్ని విజయాన్ని పొందేవి. మరి ఎప్పుడైతే మీరు రాజ్యాలు వేరుపడినట్లు మరియు ఆరాధ్యదైవాలు ఒకరిపై మరొకరు ఆధిపత్యం పొందినట్లు ఎటువంటి ప్రభావాన్ని చూడటం లేదో, అలాంటప్పుడు ఆయన మాత్రమే ఏకైక ఆరాధ్యుడని, సమస్త వస్తువుల అధికారం ఆయన చేతిలోనే ఉందని తెలుసుకోండి.
ఒకవేళ ఎవరైనా ఇలా వాదించినట్లయితే: దైవాల మధ్య ఒక రకమైన సానుకూలత కుదిరి, ఎలాంటి సంఘర్షణ లేదా తగువులాట లేకుండా ప్రతి దైవం తాను సృష్టించిన దానికి మాత్రమే పరిమితమయ్యాడని; అది కూడా వారి దైవత్వం నిరాధారమైనదని చెప్పడానికి అతిపెద్ద ఆధారం అవుతుంది. ఎందుకంటే ప్రతి దైవం యొక్క దైవత్వం తాను సృష్టించని వర్గానికి సంబంధించి లోపభూయిష్టంగా ఉంటుంది, మరియు ఇది ప్రతి దైవంలో లోపానికి దారి తీస్తుంది, మరియు ఇది జరగడం అసాధ్యం; ఎందుకంటే దైవత్వానికి పరిపూర్ణత అవసరం, లోపం కాదు.
- ఇక అల్లాహ్ యొక్క తౌహీదె ఉలూహియత్ ఆవశ్యకతకు సంబంధించిన ఆధారం విషయానికొస్తే, అది ఆరాధనా తౌహీదు. అనగా బహిరంగ మరియు అంతరంగిక ఆరాధనలన్నింటిలోనూ మహోన్నతుడైన అల్లాహ్‌ను ఒక్కరినే ఏకీకరించడం. ఉదాహరణకు నమాజు, దుఆ, అణకువ, నమ్మకం ఉంచటం, విధేయత, భయం మరియు ఆశ, జుబాహ్ చేయటం మరియు మొక్కుబడులు, సహాయం కోరటం, శరణు వేడుకోవటం, ఆపదలో రక్షణ కోరటం మరియు ఇతర ఆరాధనల రకాలన్నీ ఎవరూ సాటి లేని అల్లాహ్ ఒక్కడి కొరకే ప్రత్యేకించడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు!﴿ [అల్ బఖర: 21]
కాబట్టి ప్రభువు మాత్రమే ఆరాధనకు అర్హుడు, ఇతరులంతా సృష్టించబడినవారు మరియు పోషించబడేవారు కావున వారు ఆరాధనకు అర్హులు కారు.
మహోన్నతుడైన అల్లాహ్ ముష్రికులు అల్లాహ్ ను వదిలి ఆరాధ్య దైవాలను చేసుకోవటమును అనేక బుద్ధిపరమైన ప్రమాణాలతో అసత్యపరచాడు; వాటిలో:
వారు తయారు చేసుకున్న ఈ ఆరాధ్య దైవాలలో ఉలూహియ్యత్ లక్షణాలలో నుంచి ఏదీ లేదు. వారు సృష్టించబడిన వారు, సృష్టించలేరు. తమ దాస్యం చేసే వారికి ఎటువంటి లాభము చేకూర్చలేరు మరియు వారి నుండి ఎటువంటి నష్టమును దూరం చేయలేరు. వారికి మరణ,జీవనాల అధికారం లేదు. ఆకాశములలో మరియు భూమిలో వారికి ఎటువంటి అధికారము లేదు.
దీనికి సంబంధించి మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు కూడా ఉంది: ﴾అయినా వారు ఆయనకు బదులుగా ఏమీ సృష్టించలేని మరియు తామే సృష్టింపబడిన వారిని ఆరాధ్యదైవాలుగా చేసుకున్నారు. మరియు వారు తమకు తాము ఎట్టి నష్టం గానీ, లాభం గానీ చేసుకోజాలరు. మరియు వారికి మరణం మీద గానీ, జీవితం మీద గానీ మరియు పునరుత్థాన దినం మీద గానీ, ఎలాంటి అధికారం లేదు.﴿ [ఫుర్ఖాన్: 3]
మరియు అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾వారితో ఇలా అను: "అల్లాహ్ ను వదలి మీరు ఎవరినైతే, (ఆరాధ్యదైవాలుగా) భావిస్తున్నారో, వారిని పిలిచి చూడండి!" ఆకాశాలలో గానీ మరియు భూమిలో గానీ రవ్వ (పరమాణువు) అంత వస్తువుపై కూడా వారికి అధికారం లేదు. మరియు వారికి ఆ రెండింటిలో ఎలాంటి భాగస్వామ్యమూ లేదు. మరియు ఆయనకు వారిలో నుండి ఎవ్వడూ సహాయకుడునూ కాడు.﴿ [సబా: 22]
మరియు అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఏమీ? దేనినీ కూడ సృష్టించలేని మరియు (స్వయంగా) తామే సృష్టించబడిన వారిని, వారు ఆయనకు సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తారా?﴿ [అల్ అఅ్ రాఫ్: 191]
అంటే: ఏమి? ఈ ముష్రికులు ఆరాధన విషయంలో అల్లాహ్ కు ఆయన సృష్టితాలను సాటి కల్పిస్తున్నారా ? అవి దేనినీ సృష్టించలేవు, పైగా అవి కూడా సృష్టితాలే.
ఈ ఆరాధ్యదైవాల పరిస్థితి ఇలా ఉన్నప్పుడు, వారిని ఆరాధించడం పరమ మూర్ఖత్వం మరియు అస్సలు పనికిరాని పని.
- ఇక మహోన్నతుడైన అల్లాహ్ యొక్క నామాలు మరియు గుణాలలో ఆయన ఏకత్వం (తౌహీద్) తప్పనిసరి అనటానికి ఆధారం, సృష్టికర్త సృష్టితం కంటే భిన్నమైనవాడని మనం తెలుసుకోవటం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾... ఆయనకు పోలింది ఏదీ లేదు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వం చూసేవాడు.﴿ [అష్-షూరా: 11]
﴾... ఆయనకు పోలింది ఏదీ లేదు ...﴿ అంటే: ఆయన ఉనికిలో గానీ, ఆయన పేర్లలో గానీ, ఆయన గుణాలలో గానీ, ఆయన చర్యలలో గానీ ఆయన సృష్టిరాసులలో నుంచి ఆయనను పోలినది ఏదీ లేదు. ఎందుకంటే ఆయన నామాలన్నీ అత్యంత సుందరమైనవి, మరియు ఆయన గుణాలు పరిపూర్ణత మరియు గొప్పతనం గలవి. మరియు ఆయన తన చర్యల ద్వారా ఎవరి భాగస్వామ్యం లేకుండా గొప్ప సృష్టిరాసులను సృష్టించాడు. ఆయన ప్రతి కోణంలోనూ పరిపూర్ణతలో ఏకైకుడు మరియు అద్వితీయుడు అయినందున, ఆయనకు సమానమైనది ఏదీ లేదు.
షరియత్ ద్వారా రుజువైన పేర్లు మరియు గుణాలను నిర్ధారించడానికి గల మేధోపరమైన ఆధారాలలో ఒకటి ఏమనగా :
1- ఈ మహత్తరమైన సృష్టులు — వాటి వైవిధ్యం, భిన్నత్వం, తమ ప్రయోజనాలను నిర్వర్తించడంలో ఉన్న సమన్వయం, మరియు వాటికి నిర్ణయించబడిన మార్గాల్లో సాగడం — ఇవన్నీ మహోన్నతుడైన అల్లాహ్ యొక్క మహిమ, ఆయన శక్తి, జ్ఞానం, జ్ఞానపూర్వకత, అలాగే ఆయన సంకల్పం మరియు చిత్తాన్ని సూచిస్తాయి.
2- అనుగ్రహం, ఉపకారం, కష్టాలను తొలగించడం, మరియు బాధలను నివారించడం — ఈ విషయాలు కరుణ, దాతృత్వం మరియు ఉదారతను సూచిస్తాయి.
3- పాపాత్ములకు శిక్ష విధించటం మరియు వారిపై ప్రతీకారం తీర్చుకోవటం, వారిపై అల్లాహ్ యొక్క ఆగ్రహమును మరియు వారి పట్ల ఆయన అయిష్టతను సూచిస్తాయి.
4- విధేయులను గౌరవించడం మరియు వారికి ప్రతిఫలం ఇవ్వడం; వారి పట్ల అల్లాహ్ యొక్క ప్రసన్నతను మరియు వారి పట్ల ఆయన ప్రేమను సూచిస్తాయి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ ... భూమ్యాకాశాలలో ఆయన సామ్యమే సర్వోన్నతమైనది. ఆయనే సర్వశక్తిమంతుడు, మహా వివేచనా పరుడు.﴿ [రూమ్: 27]. అనగా: పరమ పవిత్రుడైన ఆయన వర్ణించబడే ప్రతి విషయంలోనూ ఆయన గుణాలే సర్వోన్నతమైనవి, ఆయనను పోలినది ఏదీ లేదు. ఈ సర్వోన్నత గుణగణాలలో ఇద్దరు భాగస్వాములు కావడం అసాధ్యం; ఎందుకంటే, ఒకవేళ వారిద్దరూ సమానమైతే, వారిలో ఒకరు మరొకరి కంటే అత్యున్నతులు కాలేరు. ఒకవేళ వారు సమానం కాకపోతే, ఆ సర్వోన్నత గుణగణాలతో వర్ణించబడేది వారిలో ఒకరు మాత్రమే అవుతారు. కావున సర్వోన్నత గుణగణాలు కలిగిన ఆయనకు ఎవరూ సమానులు కానీ, భాగస్వాములు గానీ ఉండటం అసాధ్యం.
***
ప్రశ్న:
అల్లాహ్ మనల్ని ఎందుకు సృష్టించాడు? మరియు మన ఉనికి లక్ష్యం ఏమిటి?
సమాధానం:
మన సృష్టి వెనుక ఉన్న వివేకం మరియు మన ఉనికి లక్ష్యం గురించి సర్వజ్ఞాని, సర్వం తెలిసిన అల్లాహ్ మనకు తెలియజేశాడు, ఆయన తన పవిత్ర గ్రంథంలో ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నేను జిన్నాతులను మరియు మానవులను సృష్టించింది, కేవలం వారు నన్ను ఆరాధించటానికే!﴿ [అద్-దారియాత్: 56]
అల్లాహ్ జిన్నులను మరియు మనుషులను సృష్టించిన ఉద్దేశ్యం ఇదే, మరియు ప్రవక్తలందరినీ దీని వైపుకు పిలవడానికే ఆయన పంపాడు, అదే ఆయన ఆరాధన. ఇందులో ఆయనను తెలుసుకోవడం మరియు ప్రేమించడం, ఆయన వైపుకు మరలడం మరియు ఆయనకు దగ్గరవ్వడం, మరియు అల్లహ్యేతరులను విడిచిపెట్టడం ఇమిడి ఉన్నాయి.
కాబట్టి, ఈ లక్ష్యం నుండి తొలగిపోయినవాడు అల్లాహ్ శిక్షకు హక్కుదారుడయ్యాడు, మరియు ఆజ్ఞకు లోబడి ఆచరించినవాడు శాశ్వతమైన అనుగ్రహాలకు హక్కుదారుడయ్యాడు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿ [అన్ నహ్ల్ : 97]
***
ప్రశ్న:
చెడు ఎందుకు సృష్టించబడింది?
సమాధానం:
అల్లాహ్ ఎందుకు చెడును సృష్టించాడు అనే ప్రశ్న వేయడం లేదా దానిపై అభ్యంతరం వ్యక్తం చేయడం తగదు; ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ సృష్టికర్త మరియు ఆయన చేసే పనుల గురించి ఆయనను ఎవరూ ప్రశ్నించలేరు, బదులుగా ఆయనే ప్రశ్నిస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు﴿ [అల్ అంబియా :23]
ఇక మంచి, చెడుల ఉనికి మరియు సృష్టిలో ఉన్న కొంత విజ్ఞత (హిక్మత్) ఈ క్రింది విధంగా ఉంది:
- బాధ్యత గలవారికి మంచి మరియు చెడుల ద్వారా పరీక్ష మరియు శోధన ఉంటుంది, తద్వారా సహనం పాటించేవారు ఇతరుల నుండి, మరియు విశ్వాసపరులు ఇతరుల నుండి స్పష్టమవుతారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.﴿ [ముల్క్ : 2]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾... మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము. మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.﴿ [అల్ అంబియా : 35]
అల్లాహ్ దాసులను ఇహలోకంలో సృష్టించాడు, వారికి ఆదేశించాడు మరియు వారిని నిషేదించాడు. మరియు మంచి మరియు చెడుల ద్వారా, సిరిసంపదలు మరియు పేదరికం ద్వారా, గౌరవం మరియు అవమానం ద్వారా, జీవితం మరియు మరణం ద్వారా వారిని పరీక్షించాడు, ఇది సర్వోన్నతుడైన ఆయన వైపు నుండి ఒక పరీక్ష; తద్వారా వారిలో ఎవరి క్రియలు అత్యుత్తమమైనవో, మరియు పరీక్షల సమయాలలో ఎవరు దానికి గురవుతారో మరియు ఎవరు రక్షించబడతారో వారిని పరీక్షించటానికి. ﴾మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.﴿ కాబట్టి మీ ఆచరణలపరంగా మేము మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాము, అది మంచి అయితే మంచి, మరియు చెడు అయితే చెడు. ﴾మరియు నీ ప్రభువు తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు.﴿ [ఫుస్సిలత్: 64]
- విశ్వం యొక్క ద్వంద్వత్వాన్ని నిర్ధారించడం; చెడును తెలుసుకోవడం ద్వారా మాత్రమే మంచిని తెలుసుకోగలము, విషయాలు వాటి వ్యతిరేకతల ద్వారానే స్పష్టమవుతాయి, మరియు మంచి యొక్క ఉనికికి చెడు అవసరం ఎందుకంటే దానికి వ్యతిరేకంగా చేసే ప్రయత్నమే అది. మంచి మరియు చెడు, మరియు వాటి మధ్య మనిషి మారుతూ ఉండటం ఇహలోక జీవితం యొక్క స్వభావం.
- చెడు అనేది సాపేక్షమైన విషయం; కొందరికి చెడుగా అనిపించే విషయం మరికొందరికి మేలుగా అనిపించవచ్చు. ఉదాహరణకు, దొంగ చేతిని నరకడం అతనికి చెడు అయినప్పటికీ, సమాజానికి అందులో మేలు ఉంది. ఎందుకంటే, ఒకరి ఆస్తులపై మరొకరు అక్రమంగా పాల్పడకుండా ఇది ప్రజలను నిరోధిస్తుంది.
- బాధ్యుడైన వ్యక్తి యొక్క న్యాయమైన పరీక్షకు గల నిజమైన అర్థాన్ని నిరూపించడం; నిశ్చయంగా సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మనిషికి మంచి మరియు చెడు మార్గాలను స్పష్టంగా తెలియజేశాడు మరియు వాటి మధ్య ఎంపిక చేసుకునే స్వేచ్ఛను అతనికి ప్రసాదించాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏమిటి? మేము అతనికి రెండు కళ్ళు ఇవ్వలేదా? మరియు నాలుకను మరియు రెండు పెదవులను. మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.﴿ [అల్ బలద్: 8-10] అంటే: ఏమీ మేము అతని కొరకు అతను చూసే రెండు కళ్ళను, అతను మాట్లాడే ఒక నాలుకను మరియు రెండు పెదవులను తయారు చేయలేదా? మరియు అతనికి మేము మంచి మరియు చెడుల మార్గమును స్పష్టపరచలేదా?
- మనం చూసే చెడులలో చాలా వరకు అన్ని విధాలా కేవలం చెడు మాత్రమే కావు, పైగా వాటిలో మంచి కోణాలు కూడా ఉంటాయి. మనం చెడుగా భావించే వాటిలో ఎంతో గొప్ప మేలు దాగి ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా వ్యాధికి గురికావచ్చు, అది అంతకంటే పెద్ద చెడు నుండి అతన్ని దూరం చేయడానికి కారణం కావచ్చు. ఒక వ్యక్తి ఏదైనా ఆర్థిక లావాదేవీలో నష్టపోవచ్చు, ఒకవేళ అతను దానిని పొంది ఉంటే అహంకారిగా మరియు దౌర్జన్యకారుడిగా మారేవాడేమో. ఒక వ్యక్తి సంతానం మరణించవచ్చు, బహుశా ఆ బిడ్డ జీవించి ఉంటే అతనికి ఆపదగా మారేవాడేమో. ఒక వ్యక్తి తన కర్మల వలన నరకానికి అర్హుడై ఉండవచ్చు, అదే నిజమైన విపత్తు, అప్పుడు అల్లాహ్ అతన్ని ఏదైనా ఆపదకు గురిచేస్తాడు, దానిపై అతను సహనం పాటిస్తాడు, అప్పుడు అతని ఆ సహనానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు, మరియు అదే శాశ్వతమైన నిజమైన మేలు.
కావున పరిశుద్ధుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ కేవలం చెడును సృష్టించడు, మరియు ఆయనకు చెడు ఆపాదించబడదు. సహీహ్ హదీసులో ఉన్నట్లుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "మరియు చెడు మీకు చెందదు" [దీన్ని ముస్లిం ఉల్లేఖించారు].
- మంచి మరియు చెడుల ఉనికిలోని మహిమావివేచనాలలో ఒకటి, పరస్పర విరుద్ధమైన వాటిని సృష్టించడంలో మహోన్నతుడైన ప్రభువు యొక్క శక్తి వ్యక్తమవ్వడం, మరియు ఆయన ఆధిపత్య నామాల ప్రభావాలు వ్యక్తమవ్వడం. అనగా: నిశ్చయంగా పరమ పవిత్రుడైన అల్లాహ్ తన నామాలు మరియు క్రియల ప్రభావాలను వ్యక్తపరుస్తాడు. ఉదాహరణకు ఆయన సర్వాధికారి, ప్రతీకారం తీర్చువాడు, న్యాయశీలుడు కావడం వంటివి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ యే సప్తాకాశాలను మరియు వాటిని పోలిన భూమండలాన్ని సృష్టించి, వాటి మధ్య ఆయన తన ఆదేశాలను అవతరింపజేస్తూ వుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు మరియు వాస్తవానికి అల్లాహ్ తన జ్ఞానంతో ప్రతిదానిని పరివేష్టించి వున్నాడని మీరు తెలుసుకోవటానికి.﴿ [అత్-తలాఖ్ 12]
చెడులు వాటికవే ఉద్దేశించబడలేదు, మరియు సృష్టి సృష్టించబడిన లక్ష్యం కూడా అవి కావు. అవి ఒక ఇష్టమైన ప్రయోజనం కోసం విధిగా నిర్ణయించబడినవి మరియు దానికి సాధనంగా చేయబడ్డాయి. కాబట్టి, అవి దేనికోసమైతే నిర్ణయించబడ్డాయో అది నెరవేరినప్పుడు, అవి క్షీణించి కనుమరుగవుతాయి మరియు పరిస్థితి సంపూర్ణమైన మంచికి తిరిగి వస్తుంది.
ఈ ప్రపంచం ఒక తాత్కాలిక నివాసమని, మరియు ఇది ఒక పరీక్షా స్థలము, కష్టాలు మరియు లోపాలతో కూడినదని దృఢంగా విశ్వసించేంత వరకు, చెడు ఉనికి వెనుక ఉన్న ఆంతర్యాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. మరియు ఇందులో సంపూర్ణ పరిపూర్ణతను చూడాలని ఆశించేవాడు, పరలోక నివాసమే పరిపూర్ణ నివాసంగా ఉండాలని నిర్ణయించిన దైవిక వివేకానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లే.
విశ్వసించిన వాని గురించి మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఈ ఇహలోక జీవిత సుఖం తాత్కాలికమైనదే మరియు నిశ్చయంగా, పరలోకమే శాశ్వతమైన నివాస స్థలము.﴿ [గాఫిర్ 39]
***
ప్రశ్న:
తౌహీద్ మరియు విశ్వాస విషయాలలో కలిగే దుష్ప్రేరితాలకు వైధ్యము ఏమిటి?
సమాధానం:
దుష్ప్రేరితాల వైధ్యము ఈ క్రింది విషయాల ద్వారా జరుగుతుంది:
- ఒక విశ్వాసి జ్ఞానము ద్వారా తనను తాను పరిరక్షించుకోవాలి, ఎందుకంటే అజ్ఞానము జిన్నుల మరియు మానవుల షైతానుల నుండి ఒక వ్యక్తిలో ప్రవేశించడానికి ఒక మార్గము.
- అల్లాహ్ ను స్మరించడం మరియు శాపగ్రస్తుడైన షైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు కోరడం.
- దుష్ప్రేరితాలలో కొనసాగడాన్ని పూర్తిగా ఆపి, వాటిని తెంచివేయాలి.
- ధార్మిక పండితులను అడగడం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి.﴿ [అన్ నహ్ల్: 43]
***
(దైవప్రవక్తత్వం విభాగం) )
ప్రశ్న:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు?
సమాధానం:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం: ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అల్ ఖురషీ, వీరు ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీం అలైహిస్సలాం వంశానికి చెందినవారు, మరియు ఆయన అంతిమ ప్రవక్త, మరియు ఆదమ్ సంతతికి నాయకుడు, మరియు ప్రళయదినాన సిఫారసు చేసేవారు మరియు సిఫారసు ఆమోదించబడేవారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నిశ్చయంగా, ప్రతీ ప్రవక్తకు ఒక ప్రత్యేక ప్రార్థన (అవకాశం) ఉండేది, దానిని వారు ఈ లోకంలోనే ఉపయోగించుకున్నారు. మరియు నేను నా ప్రార్థనను నా ఉమ్మత్ (సమాజం) కొరకు సిఫారసుగా దాచిపెట్టాను. మరియు నేను ప్రళయదినాన ఆదం సంతతికి నాయకుడిని, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. మరియు నేను మొట్టమొదటి వ్యక్తిని, ఎవరి కోసం భూమి బద్దలవుతుందో, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. మరియు నా చేతిలో ప్రశంసల పతాకం ఉంటుంది, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. ఆదం మరియు ఆయన తరువాత వచ్చిన వారందరూ నా పతాకం క్రింద ఉంటారు, ఇందులో గర్వపడాల్సినదేమీ లేదు. ముస్నద్ అహ్మద్ తబ్అ అర్రిసాలహ్ హదీసు నెంబరు 2546, మరియు సుననె తిర్మిజీ హదీసు నెంబరు 3148, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశహరులలో కెల్లా గొప్పవారు. అల్లాహ్ ఆయనను పంపినట్లయితే, వారు ఆయనను అనుసరిస్తారని అల్లాహ్ తఆలా ప్రవక్తలందరి అలైహిముస్సలాం నుండి వాగ్దానం తీసుకున్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.﴿ [సూరతు ఆలే ఇమ్రాన్: 81]
ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఇలా చెప్పారు: ఆదమ్ అలైహిస్సలాం నుండి ఈసా అలైహిస్సలాం వరకు తాను పంపిన ప్రతి ప్రవక్త నుండి మహోన్నతుడైన అల్లాహ్ వాగ్దానం తీసుకున్నాడని ఆయన తెలియజేస్తున్నాడు: అల్లాహ్ వారిలో ఎవరికైనా ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించి, వారు ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నప్పటికీ, ఆ తరువాత వారి వద్దకు ఒక సందేశహరుడు వస్తే, వారు ఆయనపై తప్పనిసరిగా విశ్వాసం కనబరచాలని మరియు ఆయనకు సహాయం చేయాలని; మరియు వారి వద్ద ఉన్న జ్ఞానం మరియు ప్రవక్త పదవి, వారి తరువాత పంపబడిన వారిని అనుసరించకుండా మరియు ఆయనకు సహాయం చేయకుండా వారిని నిరోధించకూడదని... ఇంకా ఆయన ఇలా పేర్కొన్నారు: అలీ బిన్ అబీ తాలిబ్ మరియు అతని పినతండ్రి కుమారుడు అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఇలా అన్నారు: "అల్లాహ్ ఏ ప్రవక్తను పంపినా అతని నుండి వాగ్దానం తీసుకున్నాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపించబడినప్పుడు అతను జీవించి ఉంటే ఆయనపై తప్పనిసరిగా విశ్వాసం కనబరచాలని, ఆయనకు సహాయం చేయాలని; మరియు తన జాతి వారితో వాగ్దానం తీసుకోవాలని అల్లాహ్ అతనికి ఆదేశించాడు: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవక్తగా పంపబడి, వారు సజీవంగా ఉంటే, వారు ఖచ్చితంగా ఆయనను విశ్వసించాలని మరియు ఆయనకు సహాయం చేయాలని." తఫ్సీర్ ఇబ్నె కసీర్ (2/67).
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం మునుపు వచ్చిన గ్రంధాలను మరియు సందేశాలను దృవీకరిస్తూ వచ్చారు, మరియు గత సందేశహరులను అలైహిస్సలాం విశ్వసించాలని పిలుపునిచ్చారు, మరియు ఆయన సందేశహరులు అలైహిస్సలాం తీసుకువచ్చిన దానికి అనుగుణంగా ఉన్నారు, అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.﴿ [సూరతు నిసా: 163], మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.﴿ [సూరతు షూరా: 13]
ఆయనను దైవప్రవక్తగా పంపడం ద్వారా అల్లాహ్ తఆలా సకల లోకాల వారిపై కరుణ కురిపించాడు. ఆయన మక్కా పట్టణంలో జన్మించారు మరియు అక్కడి నుండే సమస్త మానవ మరియు జిన్ జాతుల కోసం దైవప్రవక్తగా పంపబడ్డారు. ప్రవక్తకు 40 సంవత్సరాల వయస్సులో దైవదౌత్యం లభించింది. ఆ తరువాత ఆయన మదీనా కు వలస (హిజ్రత్) వెళ్ళారు మరియు 63 సంవత్సరాల వయస్సులో అక్కడే పరమవదించారు.
మరియు ఎవరికైతే దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) దౌత్యం ప్రాప్తించిందో, ఆయనను విశ్వసించకుండా మరియు ఆయన్ను అనుసరించకుండా స్వర్గంలో ప్రవేశించడానికి అతనికి ఏ మార్గమూ లేదు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.” [దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (153)] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾నూన్, కలం సాక్షిగా! మరియు వారు (దైవదూతలు) వ్రాస్తున్న దాని సాక్షిగా! నీ ప్రభువు అనుగ్రహం వలన నీవు (ఓ ముహమ్మద్) పిచ్చివాడవు కావు! మరియు నిశ్చయంగా, నీకు ఎన్నటికీ తరిగిపోని ప్రతిఫలం ఉంది. మరియు నిశ్చయంగా, నీవు ఉత్తమమైన శీలవంతుడవు!﴿ [సూరతుల్ ఖలమ్: 1-4]
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె సలామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: "అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయన వైపుకు దూసుకుని వచ్చారు. ఇలా చెప్పబడింది: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు. నేను ఆయనను చూడటానికి ప్రజలతో వచ్చాను. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం స్పష్టంగా చూసిన వెంటనే, ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదని నాకు తెలిసిపోయింది." [దీనిని అత్తిర్మిజి (2485) మరియు ఇబ్నె మాజా (1334) ఉల్లేఖించారు.] మరియు ఇది సరైనది. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
చూడండి: 'అల్ ఫుసూల్ ఫీ సీరతిర్రసూల్'-రచన -ఇబ్న్ కసీర్, 'అర్రహీకుల్ మక్తూమ్'-రచన -ముబారక్'పూరి.
***
ప్రశ్న:
ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ చేత పంపబడిన ప్రవక్తగా ఎలా అయ్యారు?
సమాధానం:
ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల,సందేశహరుల పరిసమాప్తకులు. ఆయన దైవదౌత్యపు వార్త అహలె కితాబ్ గ్రంథాలలో, పవిత్ర ఖుర్ఆన్ లో, ప్రవక్త సున్నత్ లో మరియు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్ మరియు పవిత్ర జీవిత చరిత్రను (సీరత్ ను) పొందుపరిచిన ఇస్లాం గ్రంథాలలో పుష్కలంగా లభిస్తుంది. ఆయన ఏ విధంగా ప్రవక్త అయ్యారో ఎవరికీ దాగి లేదు, మరియు ఈ ప్రశ్న వచ్చినందున, అల్లాహ్ సహాయాన్ని అర్థిస్తూ సమాధానంగా మేము ఈ విధంగా చెబుతున్నాము:
మొదటిది:- అల్లాహ్ యొక్క ప్రవక్త, మిత్రుడైన ఇబ్రాహీం అలైహిస్సలాం దైవాజ్ఞతో మక్కాలో పవిత్రదైవగృహాన్ని నిర్మించి, తన భార్య హాజిరా మరియు ఆమె కుమారుడు ఇస్మాయీల్ అలైహిమస్సలాంలను మక్కా ముకర్రమాలో నివసింపజేసినప్పుడు; ఇస్మాయీల్ సంతానం నుండి వారిలోనే ఒక ప్రవక్తను పంపమని అల్లాహ్ ను వేడుకున్నారు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఓ మా ప్రభూ! వీరిలో నుండి నీ సందేశాలను చదివి వినిపించుటకునూ, నీ గ్రంథాన్ని నేర్పుటకునూ, దివ్యజ్ఞానాన్ని బోధించుటకునూ మరియు వారిని పరిశుద్ధులుగా మార్చుటకునూ ఒక సందేశహరుణ్ణి పంపు. నిశ్చయంగా, నీవే సర్వ శక్తిమంతుడవు, మహా వివేకవంతుడవు.﴿ [సూరతుల్ బఖరహ్: 129] అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం యొక్క దుఆను ఆమోదించాడు మరియు అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రవక్తగా మరియు సందేశహరునిగా పంపించాడు.
రెండవది: తాను తన విశ్వసనీయ సందేశహరుడిని మరియు అంతిమ సందేశహరుడిని పంపుతాడని అల్లాహ్ పూర్వపు ప్రవక్తలకు అలైహిముస్సలాం తెలియజేశాడు, మరియు అతను పంపబడి, వారు సజీవంగా ఉంటే, వారు ఖచ్చితంగా అతనిని విశ్వసించి, అనుసరిస్తారు అని వారి నుండి వాగ్దానం తీసుకున్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను.﴿ [సూరతు ఆలే ఇమ్రాన్ : 81]
మూడవది: మూసా మరియు ఈసా అలైహిమస్సలామ్ ల దైవదౌత్యం మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యానికి కాలానుగుణంగా అత్యంత సమీపమైన దైవదౌత్యం అయినందున, వారి ఇరు గ్రంధాలలో మరియు బను ఇస్రాయీలు ఇతర ప్రవక్తల గ్రంధాలలో ఆధారాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆధారాలలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్షణాలు, ఆయన నగర లక్షణాలు, ఆయన హిజ్రత్ (వలస) లక్షణాలు, ఆయన ధార్మిక చిహ్నాలు మరియు ఆయన సహచరుల లక్షణాలు, ఇంకా అల్లాహ్ వారికి ప్రసాదించబోయే విజయం మరియు ప్రాబల్యంతో పాటు వారి గ్రంధాలలో ఉన్న ఇతర విషయాలన్నీ ఇమిడి ఉన్నాయి. అదేవిధంగా ఆయన రాక గురించిన శుభవార్త, ఆయనను స్వాగతించడానికి హృదయాలను సన్నద్ధం చేయడం, మరియు ఆయనను విశ్వసించి అనుసరించాలనే ఆదేశం కూడా వాటిలో కలవు. బను ఇస్రాయీలు పండితులకు ఈ ఆధారాలు తెలుసు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరుల లక్షణాలు బను ఇస్రాయీలు పండితుల, అలాగే క్రైస్తవ పండితుల మరియు వారి సన్యాసుల మనస్సులలో స్థిరపడిపోయాయి. ఈ విషయంలో కథనాలు చాలా ఉన్నాయి, తారీఖ్ గ్రంధాలు వీటితో నిండి ఉన్నాయి. దీనికి అల్లాహ్ యొక్క ఈ వాక్యమే మనకు చాలు: ﴾మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.﴿ [సూరతుల్ బఖరహ్: 146] ఎంతగానంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పవిత్రమైన శరీరంపై ఉన్న శారీరక చిహ్నం కూడా వారి గ్రంధాలలో పొందుపర్చబడింది, మరియు అది ఈనాటికీ వారి గ్రంధాలలో ఉంది. ఈ చిహ్నం యొక్క వర్ణన సహీహ్ బుఖారీ మరియు ముస్లింలలో ఉదహరించబడింది, సాయిబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు కథనం: "తర్వాత నేను ఆయన వెనుక నిలబడ్డాను; అప్పుడు ఆయన రెండు భుజాల మధ్య ఉన్న దైవప్రవక్తత్వ ముద్రను చూశాను పావురం గ్రుడ్డు'మాదిరి ఉంది." సహీహ్ బుఖారి (190). (వజిర్రుల్-హజల: పావురపు గుడ్డు).
మరియు అబ్దుల్లాహ్ ఇబ్నె సలామ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం: "అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, ప్రజలు ఆయన వైపుకు దూసుకుని వచ్చారు. ఇలా చెప్పబడింది: అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చేసినారు. నేను ఆయనను చూడటానికి ప్రజలతో వచ్చాను. అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఖం స్పష్టంగా చూసిన వెంటనే, ఆయన ముఖం ఒక అబద్ధాలకోరు ముఖం కాదని నాకు తెలిసిపోయింది." [దీనిని తిర్మిజి (2485) మరియు ఇబ్నె మాజా (1334) ఉల్లేఖించారు], అయితే ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తరువాత వచ్చిన ప్రవక్తలందరు ఇస్రాయీల్ (అనగా యఅఖూబ్ అలైహిస్సలాం) సంతతికి చెందినవారు కావడంతో, ఆ చివరి ప్రవక్త కూడా తమ నుండే వస్తాడని యూదులు భావించారు. కానీ అల్లాహ్ ఆయనను ఇస్మాయీల్ బిన్ ఇబ్రాహీమ్ అలైహిమస్సలామ్ సంతతి నుండి పంపించినప్పుడు - ఆయనే ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ - మరియు వారి గ్రంధములలో ఉన్న లక్షణాలు ఆయనకు సరిపోలినప్పుడు, వారు అసూయ చెంది ఆయనను తిరస్కరించారు. వారిలో చాలా మంది ఆయన దైవదౌత్యం గురించి సాక్ష్యమిచ్చినప్పటికీ, వారిలో కొద్దిమంది మాత్రమే ఆయనను విశ్వసించారు.
నాల్గవది: మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్త పదవి ప్రారంభం ఆయన నలభై సంవత్సరాల వయసుకు చేరుకున్నప్పుడు జరిగింది, మరియు విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఈ ప్రారంభం గురించి మనకు ఇలా తెలుపుతున్నారు: ⅞ సహీహ్ బుఖారీ (3), మరియు సహీహ్ ముస్లిం (252).
5- ఐదవది: అల్లాహ్ ఆయనకు దైవదౌత్యాన్ని అప్పగించిన తరువాత, స్పష్టమైన నిదర్శనాలు మరియు అద్భుత మహిమల ద్వారా ఆయనను ధృవీకరించాడు. ఆ నిదర్శనాలలో ఆకాశ సంబంధిత అద్భుతాలైన చంద్రుడు చీలిపోవడం, ఇస్రా మరియు మేరాజ్ లాంటివి, మరియు భూసంబంధిత అద్భుతాలైన ఆహారం మరియు పానీయాలు సమృద్ధిగా అవ్వడం, చెట్టు మొద్దు ఆయన వియోగానికి పరితపించడం లాంటివి మరెన్నో ఉన్నాయి. మరియు అల్లాహ్ ఆయనకు ప్రళయం వరకు నిలిచి ఉండే బహు గొప్ప అద్భుతాన్ని ప్రసాదించాడు, అదే దివ్య ఖుర్ఆన్. మరియు అల్లాహ్ ఆయనను గౌరవనీయులైన సహచరుల ద్వారా బలపరిచాడు, రజియల్లాహు అన్హుమ్. వారు ఈ ధర్మాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన ఈ ధర్మపు ఉత్తమ వాహకులుగా ఉండిరి. కాబట్టి ఆయన సహచరులు (రజియల్లాహు అన్హుమ్) మరియు ఆయన ధర్మం యొక్క వ్యాప్తి, ఆయన ప్రవక్తత్వం యొక్క సత్యానికి ఒక స్పష్టమైన నిదర్శనం.
అల్లాహ్ ఆయన కొరకు ఒకచోట చేర్చిన ఈ ఆయతుల వంటివి ప్రవక్తలలో (అలైహిముస్సలామ్) ఎవరికీ ఇలా కలిపి ఇవ్వబడలేదు.
ఆరవది: ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు ఇతర ప్రవక్తలందరి అలైహిముస్సలామ్ ల ప్రవక్తత అల్లాహ్ వద్ద నుండి వారిపై అవతరించిన దైవవాణి ద్వారా ఏ విధంగానైతే రుజువు చేయబడిందో, అదే విధంగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత కూడా రుజువు చేయబడింది. మరియు ప్రవక్తలలో ఏ ప్రవక్త యొక్క ప్రవక్తతను రుజువు చేసే మార్గమైనా, అదే మార్గం ద్వారా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత కూడా రుజువు చేయబడుతుంది. పూర్వ ప్రవక్తల ప్రవక్తతను రుజువు చేసే మార్గాలు ఇలా స్థిరపడ్డాయి: గ్రంధం, సూచనలు, వారిని విశ్వసించిన అనుచరులు మరియు సందేశమును నిరంతర పరంపరగా బదిలీ చేయటం ద్వారా. మరియు ఈ మార్గాలన్నింటి ద్వారా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత రుజువు చేయబడింది. కావున ఆయన గ్రంధము అల్లాహ్ ఒక ప్రవక్తకు ప్రసాదించిన గ్రంధాలలో అత్యంత గొప్ప గ్రంధం, మరియు ఆయన సూచనలు అత్యంత గొప్ప సూచనలు, మరియు ఆయన సహచరులు ప్రవక్తల సహచరులలో అత్యుత్తమ సహచరులు, మరియు ఏ నిరంతర పరంపర ద్వారా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత బదిలీ చేయబడిందో అది ప్రవక్తతలను బదిలీ చేసిన పరంపరలలోకెల్లా అత్యంత గొప్ప నిరంతర పరంపర. మరియు ఆయనతో పాటు వీడ్కోలు హజ్ లో లక్ష కంటే ఎక్కువ మంది సహచరులు రజియల్లాహు అన్హుమ్ హాజరయ్యారనేది ఆయనకు సరిపోతుంది.
ఇంతకుముందు పేర్కొన్న విషయాల ద్వారా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం యొక్క దైవదౌత్యం ఏ విధంగా రుజువైందో, మరియు ఈ శతాబ్దాల పొడవునా ఆయన ధర్మం స్థిరంగా ఉంటూ ఏ విధంగా వ్యాప్తి చెందుతూ వస్తుందో మీకు స్పష్టమవుతుంది. ఇది ఆయన దైవదౌత్యానికి గల మరొక సాక్ష్యం. అల్లాహ్ చిత్తంతో ప్రళయ దినము స్థాపించబడేటంత వరకూ ఇది ఇలాగే నిలిచి ఉంటుంది. మన దైవప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క కరుణ మరియు శాంతి వర్షించుగాక.
***
ప్రశ్న:
అల్లాహ్ ప్రవక్త ఈసా అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమని పలికారు?
సమాధానం:
పూర్వ ప్రవక్తలలో ఎక్కువ మంది తమ జాతి ప్రజలకు ప్రవక్తల పరిసమాప్తి అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాక గురించి శుభవార్త అందించారు. మరియు ఒకవేళ వారు జీవించి ఉండగా అల్లాహ్ ఆయనను పంపితే, ఆయనను విశ్వసించి అనుసరించాలని తమ జాతి ప్రజల నుండి వాగ్దానం తీసుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన గ్రంథ వాక్యాలు లెక్కించలేనన్ని ఉన్నాయి. మూసా మరియు ఈసా అలైహిమస్సలామ్ ల దైవ సందేశాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశానికి కాలపరంగా అత్యంత సమీపంలో ఉన్న దైవ సందేశాలు కావడంతో; వారి రెండు గ్రంధాలలో మరియు బను ఇస్రాయీలు ప్రవక్తల ఇతర గ్రంధాలలో ఈ వాక్యాలు విస్తారంగా ఉన్నాయి. ఈ వాక్యాలలో ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్షణాలు, ఆయన నగర లక్షణాలు, ఆయన హిజ్రత్ (వలస) లక్షణాలు, ఆయన ధార్మిక ఆచారాలు, ఆయన సహచరుల లక్షణాలు మరియు అల్లాహ్ వారికి ప్రసాదించబోయే విజయం మరియు అధికారం తదితర విషయాలు వారి గ్రంథాలలో పొందుపరచబడ్డాయి. అంతేకాకుండా ఆయన రాక గురించి శుభవార్త, ఆయనకు స్వాగతం పలికేందుకు మనస్సులను సిద్ధం చేయడం, మరియు ఆయనను విశ్వసించి అనుసరించాలన్న ఆజ్ఞ కూడా వాటిలో ఉన్నాయి. మరియు బను ఇస్రాయీలు పండితులకు ఈ గ్రంథ వాక్యాలు తెలుసు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం లక్షణాలు మరియు ఆయన సహచరుల లక్షణాలు బను ఇస్రాయీలు పండితుల మరియు క్రైస్తవ పండితుల, సన్యాసుల మదిలో స్థిరపడిపోయాయి. కానీ వారు వాటిలో ఎక్కువ భాగంలో మార్పుచేర్పులు జరిపారు, అయినప్పటికీ వాటిలో అనేక నిదర్శనాలు మిగిలిపోయాయి. అవి యూదుల ప్రవక్తల రాతలైన పాత నిబంధనలో కావచ్చు, లేదా క్రైస్తవ పండితులు రాసిన సంకలనం అయిన క్రొత్త నిబంధనలో కావచ్చు. వారు వాటిని మసీహ్ అలైహిస్సలాం సమకాలికుల నుండి ఉల్లేఖించామని భావిస్తారు. ఈ గ్రంథ వాక్యాలలో కొన్ని కింది విధంగా ఉన్నాయి:
మొదటిది: సఫర్ తస్నియా (ద్వితీయోపదేశకాండము) లో ఉన్నట్లుగా, మూసా అలైహిస్సలాంకు ఈ గొప్ప ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గురించి శుభవార్త వచ్చింది: (నేను వారి కొరకు వారి సోదరుల మధ్య నుండి నీలాంటి ఒక ప్రవక్తను పంపుతాను, మరియు నేను నా మాటలను అతని నోటిలో ఉంచుతాను, అప్పుడు నేను అతనికి ఆదేశించినదంతా అతను వారితో పలుకుతాడు. మరియు నా పేరుతో అతను పలికే నా మాటలను ఏ మనిషైతే వినడో, అతనిని నేను ప్రశ్నిస్తాను). ద్వితీయోపదేశకాండము 18: 18-19.
బనీ ఇస్రాయీల్ యొక్క సోదరులు బనీ ఇస్మాయీల్, మరియు బనీ ఇస్మాయీల్ నుండి అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరే ప్రవక్తా రాలేదు. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మాట వినని వారి కొరకు ఉన్న అల్లాహ్ యొక్క హెచ్చరికను మూసా అలైహిస్సలాం ఈ వాక్యంలో ప్రస్తావించారు, మరియు అది ఆయన మాట: (నేను అతనిని ప్రశ్నిస్తాను). మరియు అల్లాహ్ ఎవరినైతే ప్రశ్నిస్తాడో ఆయన వారిని పట్టుకుంటాడు.
మూసా అలైహిస్సలాం కూడా ఇలా అన్నారు, నిశ్చయంగా చిట్టచివరి ప్రవక్త (ఫారాన్) నుండి ఉద్భవిస్తాడు. మరియు ఫారాన్ అనగా మక్కా ముకర్రమాలోని పర్వతాలు. మరియు ఇస్మాయీల్ అలైహిస్సలాం తరువాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరే ప్రవక్తా మక్కా ముకర్రమా నుండి ఉద్భవించలేదు. సఫర్ అత్-తస్నియాలో వచ్చినట్లుగా: (ప్రభువు సీనాయి నుండి వచ్చాడు, మరియు సయీరు నుండి వారి కొరకు ఉదయించాడు, మరియు ఫారాన్ పర్వతం నుండి ప్రకాశించాడు). ద్వితీయోపదేశకాండము 33: 2.
రెండవది: దావూద్ అలైహిస్సలాం కూడా అతని గురించి శుభవార్త ఇస్తూ ఇలా అన్నారు: (కట్టడనిర్మాణకులు తిరస్కరించిన ఆ రాయి ఒక మూలకు తలగా మారింది. ప్రభువు తరుపున ఇది జరిగింది, మరియు ఇది మా దృష్టిలో అద్భుతమైనది) (మజామీర్ 118: 22). మరియు ఈ భవిష్యశుభవార్త యొక్క అర్థం ఏమిటంటే: ఇస్మాయీల్ (అరబ్బుల) సంతతి నుండి రావడాన్ని బనూ ఇస్రాయీల్ తిరస్కరించిన సందేశమే అత్యంత గొప్ప సందేశంగా మారింది; ఎందుకంటే, అది అత్యంత గొప్ప దైవ సందేశహరుని ద్వారా మానవాళికి పంపబడిన దైవ సందేశాలకు ముగింపు. కట్టడనిర్మాణంతో ఈ పోలిక ఎందుకు తీసుకురాబడిందంటే, ప్రతి ప్రవక్త తనకు ముందున్న ప్రవక్త ప్రారంభించిన దానిని పూర్తి చేస్తూ వచ్చారు. అలా ప్రవక్తల రాక పరిపూర్ణమై, చివరి ప్రవక్త మాత్రమే మిగిలి, మరియు కట్టడనిర్మాణం పరిపూర్ణతకు చేరువైనప్పుడు, అందులో కేవలం ఒక్క ఇటుక మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, అల్లాహ్ తన దైవ సందేశహరుడు మరియు అత్యంత ప్రియుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని పంపారు. తద్వారా ఆయనతో ధర్మం సంపూర్ణమైంది, అనుగ్రహం పరిపూర్ణమైంది, ప్రవక్తల పరంపర ముగిసింది మరియు కట్టడనిర్మాణం సంపూర్ణమైంది. ఆ విధంగా అల్లాహ్ యొక్క దైవ సందేశహరుడు (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు అంతిమ ప్రవక్త మరియు దైవ సందేశహరులకు (అలైహిమస్సలామ్) పరిసమాప్తి అయ్యారు. మరియు ఈ భవిష్యశుభవార్తలో సూచించబడిన రాయి ఉదాహరణ ఆయన గురించే ఇవ్వబడింది.
మూడవది: ఈసా (అలైహిస్సలాం) మత్తయి సువార్త లో ఇలా అన్నారు:(అందుకే నేను మీతో చెబుతున్నాను: నిశ్చయంగా, అల్లాహ్ రాజ్యం మీ నుండి తీసివేయబడుతుంది మరియు దాని ఫలాలను అందించే ఒక సమాజానికి ఇవ్వబడుతుంది). మత్తయి 42:21. మరియు ఈ శుభవార్తలో ఇమిడి ఉన్న ఈ ఆశ్చర్యకరమైన వార్తను ఆలోచించండి, అదేమిటంటే: ప్రవక్తత్వం వారి నుండి బను ఇస్మాయీల్ అలైహిస్సలాం వైపుకు తరలివెళ్తుందని మసీహ్ అలైహిస్సలాం బను ఇస్రాయీలుకు తెలియజేశారు; మరియు ఇస్మాయీల్ సంతానం నుండి అల్లాహ్ చేత పంపించబడ్డ ఏకైక ప్రవక్త, ప్రవక్తల పరిసమాప్తి అయిన అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
మరియు ఈసా (అలైహిస్సలాం) కూడా యోహాను సువార్త లో ఇలా అన్నారు: (తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోయే ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన నన్ను గురించి సాక్ష్యమిస్తాడు. మరియు మీరు మొదటి నుండి నాతో ఉన్నారు కాబట్టి, మీరు కూడా సాక్ష్యమిస్తారు). యోహాను 15: 26-27.
మసీహ్ ప్రవక్త అని సాక్ష్యమిచ్చి, యూదులు ఆయనపై మరియు ఆయన తల్లి అలైహస్సలాంపై కల్పించిన అబద్ధాల నుండి వారిని పవిత్రులుగా ప్రకటించింది దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరెవరు? మరియు మసీహ్ ఇలా అన్నారు: (నేను మీతో చెప్పవలసినవి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు వాటిని భరించలేరు. అయితే సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు, ఆయన మిమ్మల్ని సంపూర్ణ సత్యం వైపు మార్గనిర్దేశం చేస్తాడు. ఎందుకంటే ఆయన తనంతట తానుగా ఏమీ మాట్లాడడు, బదులుగా తాను విన్నదే మాట్లాడతాడు మరియు రాబోయే విషయాల గురించి మీకు తెలియజేస్తాడు. ఆయన నన్ను మహిమపరుస్తాడు, ఎందుకంటే ఆయన నా వాటిని తీసుకుని మీకు తెలియజేస్తాడు). యోహాను 16: 12 - 14.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథస్థులపై ఆయన గురించి వారికి ఉన్న పరిజ్ఞానాన్ని నమోదు చేశాడు — వారు తమ కుమారులను ఎలా తెలుసుకుంటారో అలా ఆయనను తెలుసుకుంటారని. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾మేము గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారులను ఏ విధంగా గుర్తిస్తారో ఇతనిని (ముహమ్మద్ ను) కూడా ఆ విధంగా గుర్తిస్తారు. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు.﴿ [సూరతుల్ బఖరహ్:146]
–గత వచనాలలో తెలిపిన విధంగా– మసీహ్ అలైహిస్సలాం తన లక్షణాలను మరియు తన లక్ష్యాన్ని వారికి ఎలాగైతే తెలిపాడో, అదే విధంగా తన పేరును కూడా స్పష్టంగా పేర్కొన్నాడని ఖుర్ఆన్ క్రైస్తవులు, నసారాల గురించి నమోదు చేసింది, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾మరియు మర్యమ్ కుమారుడు ఈసా (తన జాతి వారితో) ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నిశ్చయంగా, నేను మీ వద్దకు పంపబడిన అల్లాహ్ యొక్క సందేశహరుణ్ణి, నాకు పూర్వం, వచ్చి ఉన్న తౌరాత్ గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. మరియు నా తరువాత అహ్మద్ అనే సందేశహరుడు రాబోతున్నాడు, అనే శుభవార్తను ఇస్తున్నాను." తరువాత అతను (అహ్మద్) వారి వద్దకు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినపుడు వారు ఇలా అన్నారు: "ఇది కేవలం స్పష్టమైన మంత్రజాలమే! [సూరతు అస్సఫ్: 6]
మరియు ఈ అందమైన శుభవార్తలకు సంబంధించిన మరిన్ని వచనాల కొరకు, పాఠకులు ఈ క్రింది గ్రంథాలను పరిశీలించవచ్చు:
అద్దీన్ వద్దౌలతు ఫీ ఇస్బాతి నుబువ్వతి నబియ్యినా ముహమ్మద్[సల్లల్లాహు అలైహివ సల్లం ], రచన ‘అలీ బిన్ రబ్బన్ అత్తబరీ, తోహ్’ఫతుల్అరీబ్ ఫిర్రద్ది అలా ఇబాదిత్తస్లీబ్, రచన అబ్దుల్లా అత్తర్జుమాన్’, మరియు ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు అన్సెల్మ్ తుర్మెడా.
ఇబ్రహీం ఖలీల్ అహ్మద్ రాసిన جب“తౌరాతు, బైబిల్ మరియు ఖుర్ఆను’లలో ముహమ్మద్” పుస్తకం, మరియు ఇస్లాం స్వీకరించక ముందు ఆయన పేరు ఇబ్రహీం ఫిలిప్స్.
పవిత్ర బైబిల్లో ముహమ్మద్, రచన: అబ్దుల్ అహద్ దావూద్.
ఈ పుస్తకాల రచయితలు మొదట క్రైస్తవులుగా ఉండేవారు, ఆ తరువాత వారు ఇస్లాం స్వీకరించారు, ప్రశంసలు అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి.
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మసీహ్ అలైహిస్సలాం ఏమి చెప్పారని ఒక మనిషి అడగడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సందేశహరులు మరియు ప్రవక్తలు అల్లాహ్ తరఫు నుండి ఒకే లక్ష్యంతో వచ్చారని, అది ఆయన తప్ప మరెవరినీ కాకుండా ఏకైకుడైన అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం అని, మరియు వారంతా అల్లాహ్ ను విశ్వసించడం వైపుకు, అలాగే పునరుత్థానం, తీర్పు మరియు ప్రతిఫలాలను విశ్వసించడం వైపుకు ఆహ్వానించారని మనిషికి తెలిసి ఉండి కూడా, ఆ తరువాత వారు తీసుకువచ్చిన దానిని అతడు విశ్వసించకపోవడం. అల్లాహ్ సాక్షిగా, ఇదే స్పష్టమైన నష్టం మరియు తప్పించుకోలేని వినాశనం. మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురిపించుగాక.
మరియు "హుబ్బియల్ అజీమ్ లిల్ మసీహ్ అలైహిస్సలాం ఖాదనీ ఇలల్ ఇస్లాం" పుస్తకం పేజి 169 ను చూడండి. మరియు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అస్-సుహైమ్ పుస్తకం "బిషారతుల్ మసీహ్ అలైహిస్సలాం" ను చూడండి.
***
ప్రశ్న:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రకమైన మహిమలతోనైనా పంపబడ్డారా?
సమాధానం:
మోజిజా (మహిమ లేదా అద్భుతం) అనగా అల్లాహ్ ఒక ప్రవక్త ద్వారా బహిర్గతం చేసే ఒక అసాధారణమైన, అస్వభావికమైన, మానవాతీతమైన, ప్రకృతికి అతీతమైన అతీంద్రియ చర్య లేదా సంఘటన. తన జాతి ప్రజలను ఆహ్వానించే క్రమంలో అది ఆయనకు ఒక భౌతిక వాదనగా ఉంటుంది. ఉదాహరణకు, ఇబ్రాహీం అలైహిస్సలాం అగ్నిలో వేయబడినప్పుడు అది ఆయనపై చల్లగా మరియు శాంతియుతంగా మారిన సూచన, మరియు మూసా అలైహిస్సలాం యొక్క సూచనలు - వాటిలో కర్ర, చెయ్యి మరియు వరదలతో సహా -, కుష్ఠురోగి మరియు పుట్టుగ్రుడ్డికి వైద్యం చేయటం, అల్లాహ్ ఆదేశముతో చనిపోయిన వారిని తిరిగి బ్రతికించటం వంటి ఈసా అలైహిస్సలాం సూచన. మరియు కొన్నిసార్లు అల్లాహ్ ఒక ప్రవక్తను పంపుతాడు కానీ ఆయనతో పాటు ఎలాంటి అసాధారణమైన సూచనను పంపకపోవచ్చు; బదులుగా ప్రవక్త యొక్క స్థితి, ఆయన రుజువర్తన, మరియు ఆయన తీసుకువచ్చిన వహీ (దైవవాణి) ఆయన అల్లాహ్ తరపున వచ్చిన ప్రవక్త అని నిరూపించడానికి సరిపోతాయి. తద్వారా ప్రజలు అబద్ధికుని నుండి సత్యవంతుడిని స్పష్టంగా గుర్తిస్తారు; అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వచ్చినప్పుడు, అబ్దుల్లాహ్ బిన్ సలామ్ ఇలా అన్నారు: «ప్రజలు ఆయన వద్దకు తండోపతండాలుగా వెళ్ళారు, అలా వెళ్ళిన వారిలో నేను కూడా ఉన్నాను. ఆయన ముఖం స్పష్టంగా చూసిన వెంటనే “ఇది ఒక అబద్ధాలకోరు ముఖం కాదు” అని నాకు తెలిసిపోయింది. ఆయన నుండి ప్రత్యక్షంగా నేను విన్న మొట్టమొదటి మాటలు ఇవి: ‘సలాంను వ్యాపింపజేయండి, అన్నం తినిపించండి, బంధుత్వ సంబంధాలను కొనసాగించండి, ప్రజలు నిద్రిస్తున్న వేళ నమాజు చేయండి; అలా చేస్తే మీరు ప్రశాంతంగా స్వర్గంలోకి ప్రవేశించగలరు.’» [ముస్నద్ అహ్మద్ (23784), తిర్మిజీ (2485) మరియు ఇబ్నె మాజహ్ (1334)].
నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తలు మరియు తన సందేశహరులు అలైహిముస్సలాంకు స్పష్టమైన సూచనలు మరియు తిరుగులేని ఆధారాల ద్వారా మద్దతు తెలిపాడు. ఈ సూచనలు భిన్నంగా మరియు వివిధ రకాలుగా ఉన్నాయి, కానీ అల్లాహ్ ప్రతి ప్రవక్త యొక్క సూచనలను మానవులు విశ్వసించడానికి సరిపోయే విధంగా చేశాడు మరియు వాటి ద్వారా వారిపై ప్రమాణం నిలబెట్టబడుతుంది; తద్వారా అతను అల్లాహ్ చేత పంపబడిన ప్రవక్త అని వారు గ్రహిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: «దైవప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి, ఆ ప్రకారంగా ప్రజలు విశ్వసించేవారు, నిశ్చయంగా నాకు దైవవాణి ఇవ్వబడింది, అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు, కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను ఆశిస్తున్నాను» [ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ (7274), సహీహ్ ముస్లిం (239)].
నిశ్చయంగా మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేక అద్భుత మహిమలతో పంపబడ్డారు. ఇబ్నె కసీర్ రహిమహుల్లాహ్ ఈ విధంగా అన్నారు: "నిశ్చయంగా పండితులు ఇందులో వెయ్యి కంటే ఎక్కువ మహిమలను ఒకచోట చేర్చారు. వాటిలో అత్యంత ఆశ్చర్యకరమైనది మరియు గొప్ప అద్భుతం దివ్య ఖుర్ఆన్. దాని ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ ఎలాంటి అసత్యం దాని దరిచేరదు. అది మహా వివేకవంతుడు, ప్రశంసనీయుడు అయిన అల్లాహ్ తరఫున అవతరింపజేయబడినది. దాని అద్భుతం దాని పదాలు మరియు అర్థాల పరంగా ఉంటుంది. దాని పదాల విషయానికొస్తే, అవి వాక్చాతుర్యం యొక్క అత్యున్నత శిఖరాలలో ఉన్నాయి. ఈ విషయంలో ఎవరికైతే జ్ఞానం పెరుగుతుందో, వారికి ఖుర్ఆన్ పట్ల గౌరవం మరింతగా పెరుగుతుంది. ఆయన కాలంలోని గొప్ప వక్తలు మరియు భాషా పండితులకు ఆయనతో తీవ్రమైన శత్రుత్వం ఉన్నప్పటికీ, మరియు ఆయనను అసత్యవాదిగా నిరూపించాలనే తీవ్ర ఆసక్తి ఉన్నప్పటికీ, దానికి సాటివచ్చే దానిని, లేదా దానికి సమానమైన పది సూరాలను, లేదా కనీసం ఒక సూరానైనా తీసుకురమ్మని ఆయన వారిని సవాలు చేశారు, కానీ వారు అశక్తులయ్యారు. వారు దానిని ఎప్పటికీ తీసుకురాలేరని ఆయన వారికి తెలియజేశారు. అంతేకాకుండా, దానికి సాటివచ్చే దానిని తీసుకురమ్మని ఆయన జిన్నులు మరియు మానవులందరినీ సవాలు చేశారు, కానీ వారు అశక్తులయ్యారు. ఆయన వారికి ఆ విషయాన్ని తెలియజేశారు.మహోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ﴾ఇలా అను: "ఒకవేళ మానవులు మరియు జిన్నాతులు అందరూ కలిసి, ఈ ఖుర్ఆన్ వంటి దానిని కల్పించి తీసుకు రావటానికి ప్రయత్నించినా - వారు ఒకరి కొకరు తోడ్పడినప్పటికీ - ఇటువంటి దానిని కల్పించి తేలేరు.﴿ [సూరా అల్ ఇస్రా: 88] దాని అద్భుతాన్ని నిరూపించే ఇతర అంశాలే కాకుండా, దాని భావార్ధాల విషయానికి వస్తే అవి అత్యంత సమన్వయం, వివేకం, అనుగ్రహం, ప్రయోజనం, ప్రశంసనీయమైన పరిణామం మరియు ఏకాభిప్రాయంతో కూడి ఉంటాయి. అంతేకాకుండా అత్యున్నత లక్ష్యాలను సాధించడం, అనర్థాలను నిర్మూలించడం లాంటి అనేక విషయాలు, సందేహాలు మరియు మనోవాంఛల నుండి విముక్తి పొందిన స్వచ్ఛమైన బుద్ధి మరియు జ్ఞానం గలవారికి స్పష్టంగా గోచరిస్తాయి. అటువంటి వాటి (సందేహాలు, మనోవాంఛల) నుండి మేము అల్లాహ్ శరణు కోరుతున్నాము మరియు ఆయన నుండి సత్య మార్గ దర్శకత్వాన్ని అర్థిస్తున్నాము.
దీనికి నిదర్శనాలలో ఒకటి ఏమిటంటే, తన వంశం, పెంపకం మరియు నడవడిక గురించి బాగా తెలిసిన ప్రజల మధ్య ఆయన పెరిగారు. ఆయన వారి మధ్య ఒక అనాథగా, నమ్మకస్తుడిగా, సత్యవంతుడిగా, పుణ్యాత్ముడిగా మరియు సన్మార్గంలో నడిచేవాడిగా పెరిగారు. వారందరికీ ఈ విషయం తెలుసు, పంతానికి పోయేవాడు, కుతర్కాలు చేసేవాడు మరియు అహంకారి తప్ప మరెవరూ దీనిని తిరస్కరించరు. ఆయన నిరక్షరాస్యుడు, ఆయనకు రాయడం రాదు, దానిని ఆయన అభ్యసించలేదు లేదా ఆ విద్య తెలిసిన వారితో సావాసం చేయలేదు. వారి ప్రాంతంలో పూర్వీకుల జ్ఞానం లేదు, దాని గురించి ఏమాత్రం తెలిసిన వారూ ఎవరూ లేరు. ఆపై, తన నలభైవ ఏట ఆయన వారి వద్దకు వచ్చి, గతించిన విషయాలను స్పష్టంగా మరియు సవివరంగా తెలియజేశారు. పూర్వ గ్రంథాలపై అవగాహన ఉన్న, సత్యం ద్వారా సన్మార్గం పొందిన పండితులు దీనిని ధృవీకరించారు... ఇంకా, ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఈ ఖుర్ఆన్ లో మరియు ఆయన నుండి ఉల్లేఖించబడిన ప్రామాణిక హదీసులలో భవిష్యత్తుకు సంబంధించిన అగోచర (గైబ్) విషయాల గురించి తెలియజేసినవి ఆయన చెప్పినట్లే అక్షరాలా ఖచ్చితంగా జరిగాయి, అయితే వాటిని ఇక్కడ పూర్తిగా వివరించడం సుదీర్ఘమవుతుంది. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఆయన చేతుల మీదుగా ప్రదర్శించిన గొప్ప అద్భుతాలు కూడా అందులోనివే. వాటిలో: అల్లాహ్ తన మహత్తర గ్రంథంలో చంద్రుడు రెండు ముక్కలుగా విరిగిపోవటం గురించి తెలియజేసినది కూడా ఉంది. అదేమిటంటే, ముష్రిక్కులు ఆయనను ఒక సూచన అడిగారు, అది రాత్రి సమయం, అప్పుడు ఆయన చంద్రుని వైపు సైగ చేయగానే అది రెండు ముక్కలుగా చీలిపోయింది. ఆయన తమపై మాయ చేశాడేమోనని వారు తమ చుట్టుపక్కల ఉన్న ఇతర ప్రాంతాల వారిని విచారించారు, వారు కూడా సరిగ్గా వీరు చూసినట్లే వారితో చెప్పారు. పండితుల వద్ద ఇది ఆయన నుండి ముతవాతిర్ (అత్యంత ప్రామాణికం)గా నివేదించబడింది మరియు దీనిని పలువురు సహాబాలు రజియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ ఉల్లేఖించారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఆలలోని బర్కత్ వలన వెల్లడైన అద్భుతాలలో ఇవి కూడా ఉన్నాయి: ఇబ్నె మస్ఊద్ మేపుతున్న ఒక గొర్రెపిల్ల గురించి మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ తో దుఆ చేశారు. ఆయన అల్లాహ్ నామాన్ని స్మరించి దాని పాలు పితికారు. అప్పుడు అది పాలు ఇచ్చింది, ఆయన స్వయంగా ఆ పాలను త్రాగి, అబూబక్ర్ కు కూడా త్రాగించారు. ఉమ్మె మబద్ గొర్రె విషయంలో కూడా ఆయన అలాగే చేశారు. తుఫైల్ బిన్ అమ్ర కోసం ఆయన దుఆ చేశారు, దానికి నిదర్శనంగా అతని కొరడా చివర దూరం నుండి కనిపించే ఒక ప్రకాశవంతమైన కాంతి వెలువడింది. ఒక చీకటి రాత్రి ఆయన దగ్గరి నుండి బయలుదేరిన ఉసైద్ బిన్ హుజైర్ మరియు అబ్బాద్ బిన్ బిష్ర్ అల్-అన్సారీలకు కూడా అలాగే జరిగింది. తాను నమాజు చేస్తున్నప్పుడు తనను ఎగతాళి చేసిన ఏడుగురిపై ఆయన అల్లాహ్ తో దుఆ చేశారు, దాని ఫలితంగా వారు బద్ర్ యుద్ధంలో చంపబడ్డారు. అబూ లహబ్ కుమారునికి వ్యతిరేకంగా ఆయన దుఆ చేశారు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆకు అనుగుణంగా షామ్ (సిరియా) లో అల్లాహ్ అతనిపై ఒక క్రూరమృగాన్ని ఉసిగొల్పాడు. సురాఖాకు వ్యతిరేకంగా ఆయన దుఆ చేసినప్పుడు అతని గుర్రం ముందు కాళ్లు భూమిలో కూరుకుపోయాయి, ఆ తర్వాత ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా అల్లాహ్ వాటిని విడిపించాడు. బద్ర్ యుద్ధంలో ఖురైష్ అవిశ్వాసుల వైపు ఆయన ఒక గుప్పెడు గులకరాళ్లను విసిరారు. అందులోని రాళ్లు వారిలో ప్రతి ఒక్కరికీ తగిలాయి మరియు అల్లాహ్ వారిని ఓడించాడు. హునైన్ యుద్ధం రోజున కూడా ఆయన అలాగే చేశారు. బద్ర్ యుద్ధం రోజున ఉకాషా బిన్ మిహ్సన్ కు ఆయన ఒక కట్టె ముక్కను ఇచ్చారు, అది అతని చేతిలో పదునైన కత్తిగా మారిపోయింది. తన పినతండ్రి అబ్బాస్ ఖైదీగా ఉన్నప్పుడు, ఆయనా మరియు ఉమ్మె ఫజ్ల్ కలిసి తమ ఇంటి గుమ్మం కింద దాచిపెట్టిన ధనం గురించి దైవప్రవక్త ఆయనకు తెలియజేశారు, అప్పుడు ఆయన ఆ విషయాన్ని అంగీకరించారు. బద్ర్ ఖైదీలను విడిపించుకోవడానికి వచ్చానని ఉమైర్ బిన్ వహబ్ సాకు చెప్పినప్పుడు, వాస్తవానికి తనను చంపడానికే వచ్చాడన్న విషయాన్ని దైవప్రవక్త ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన దానిని అంగీకరించి, ఆ క్షణమే ఇస్లాం స్వీకరించారు రజియల్లాహు అన్హు. ఉహుద్ యుద్ధం రోజున ఖతాదా బిన్ అన్-నుమాన్ అజ్-జఫరీ కన్ను బయటకు వచ్చి అతని చెంపపై పడినప్పుడు (మరికొందరి కథనం ప్రకారం అతని చేతిలో పడినప్పుడు), దైవప్రవక్త దానిని తిరిగి యథాస్థానంలో ఉంచారు. ఆ కన్ను అతని రెండు కళ్ళలోకెల్లా అత్యంత అందమైనదిగా మారింది, రెండవ కంటికి దానికి ఏమాత్రం తేడా తెలిసేది కాదు. ఖందఖ్ యుద్ధం రోజున జాబిర్ ఇంటి వద్ద ఉన్న ఒక గొర్రెపిల్ల మరియు ఒక సాఅ జొన్నలతో దాదాపు వెయ్యి మంది ఉన్న భారీ సమూహానికి ఆయన భోజనం తినిపించారు. అలాగే అదే రోజున బషీర్ కుమార్తె తెచ్చిన అతి కొద్ది ఖర్జూరాలతో కూడా ఎంతోమందికి భోజనం తినిపించారు. తన పవిత్రమైన చేతితో దాదాపుగా కప్పగలిగేంత అతి కొద్ది ఆహారంతో సుమారు ఎనభై మందికి ఆయన భోజనం పెట్టారు. జైనబ్ బింత్ జహ్ష్ తో తన వివాహ విందు రోజున కూడా ఆయన అలాగే చేశారు. తబూక్ దండయాత్ర జరిగినప్పుడు ఒక అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది. ఒక మేక కూర్చునేంత పరిమాణంలో ఉన్న ఆహారంతో ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) సైన్యానికంతటికీ భోజనం పెట్టారు, వారు తమ వద్ద ఉన్న ప్రతి పాత్రనూ దానితో నింపుకున్నారు. హజ్రత్ అబూహురైర రజియల్లాహు అన్హుకు ఆయన ఒక ఆహారపు సంచిని ఇచ్చారు. ఆయన అందులోంచి తన జీవితకాలమంతా భుజించారు, అంతేకాకుండా దాని ద్వారా దైవమార్గంలో ఎంతో మందిని సన్నద్ధం చేశారు. హజ్రత్ ఉస్మాన్ హత్య చేయబడే రోజుల వరకు అది ఆయన వద్దనే ఉంది... కరువు సంభవించినప్పుడు ఆయన అల్లాహ్ ను ప్రార్థించారు (దుఆ చేశారు). ఆయన మింబర్ పై నుండి క్రిందికి దిగకముందే మస్జిద్ పైకప్పు నుండి నీరు కారి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గడ్డం మీదుగా ప్రవహించసాగింది. అంతకు ముందు ఆకాశంలో ఏ మబ్బు గానీ, మేఘపు తునక గానీ, కనీసం అరచేయంత మేఘం కూడా కనిపించలేదు. ఆ తరువాత వాతావరణం నిర్మలంగా మారాలని ఆయన దుఆ చేసినప్పుడు, మదీనా పై నుండి మేఘాలు విడిపోయి, చివరికి మదీనా చుట్టూ కిరీటంలా మేఘాలు ఏర్పడ్డాయి. ఖురైషీయులకు వ్యతిరేకంగా ఆయన అల్లాహ్ తో దుఆ చేయగా, వారు వర్ణించలేనంత కష్టాలకు గురయ్యారు. చివరికి వారు కరుణించమని వేడుకోగా, ఆయన వారిని కరుణించి ఆ కష్టాల నుండి వారికి ఉపశమనం కలిగించారు. వుజూ చేసుకోవడానికి ఆయన వద్దకు ఒక నీటి పాత్ర తేబడింది. అక్కడున్న వారు కూడా ఆయనతో పాటు వజూ చేసుకోవాలని ఆశించారు. అప్పుడు ఆయన ఆ పాత్రలో తన చేయి పెట్టారు, కాని అది ఇరుకుగా ఉండటం వల్ల సరిపోలేదు. తరువాత ఆయన అల్లాహ్ తో దుఆ చేశారు, అప్పుడు మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్రేళ్ల మధ్య నుండి నీరు ఉబుకసాగింది. హుదైబియా జరిగిన రోజున కూడా ఆయన ఇలాగే చేశారు. అప్పుడు సైన్యం ఒక వెయ్యి నాలుగు వందల మంది ఉన్నారు. (హజ్రత్) జాబిర్ ఇలా అన్నారు: «ఒకవేళ మేము ఒక లక్ష మంది ఉన్నప్పటికీ, అది మాకు సరిపోయేది», అదేవిధంగా తన ప్రయాణాలలో ఒకదానిలో ఒక నీటి సంచిలో ఉన్న ఒక నీటి బొట్టుతో కూడా ఆయన ఇలాగే చేసినారు. ఉల్లేఖీకుడు ఇలా తెలిపారు: ఆ నీటిని ఒక పాత్రలో పోయమని ఆయన నన్ను ఆదేశించినపుడు, ఎండిపోయిన ఆ నీటి సంచి ఆ నీటిని పీల్చుకుంటుందేమో అని నేను భయపడ్డాను. అపుడు ఆయన అందులో తన చేతిని పెట్టి, అల్లాహ్ తఆలాను ప్రార్థించారు. అపుడు తన సహచరుల కోసం ఆయన చేతి వేళ్ల మధ్య నుండి నీటి ఊట ప్రవహించింది, దానితో వారు ఉదూ చేసుకుని త్రాగారు. అదేవిధంగా ఆయన తన బాణాన్ని హుదైబియా నీటి బుగ్గ లోకి పంపినారు, దానిని అందులో ఉంచినపుడు అది వారికి సరిపోయేంతగా నీటితో ఉప్పొంగింది.. ఇన్ షా అల్లాహ్ తఆలా, మేము ప్రస్తావించిన ఈ విషయాలు సరిపోతాయి.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తతను సూచించే గొప్ప సాక్ష్యాలలో ఒకటి ఆయన సందేశం నిలిచి ఉండటం. అది ఈ రోజు అవతరించినట్లుగానే, ఎలాంటి మార్పు లేకుండా వక్రీకరించకుండా అలాగే ఉంది. మరియు ఆయన ధర్మం, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన సమాజానికి అందజేసిన విధంగానే ఇప్పటికీ అమలుచేయబడుతోంది, దానిలో ఏదీ మారలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన నమాజు, అలాగే జకాతు, ఉపవాసం, హజ్జ్ మరియు తదితర ఇస్లామీయ విధులను ముస్లిములు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించిన విధంగానే నెరవేరుస్తున్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అనుయాయులు తమ ధర్మాన్ని ఇప్పటికీ సంరక్షించుకుంటూనే ఉన్నారు, మరియు ప్రతిరోజూ అన్ని జాతులు మరియు భాషలకు చెందిన వారు సమూహాలుగా ఈ ధర్మంలోకి ప్రవేశిస్తూనే ఉన్నారు. దీని వ్యవహారం మరింత సుస్థిరంగా మరియు విస్తృతంగా పెరుగుతోంది, మరియు పరిశోధించేవారు దీని వాస్తవికతను, దీని శ్రేయస్సును మరియు విశ్వాస, నైతిక, వ్యవహారాలు మరియు ధర్మశాసనాలలో దీని యోగ్యతను గ్రహిస్తారు.
మరియు ఇదంతా మత్తయి ఇంజీల్'లో ఈ విధంగా పేర్కొన్నట్లుగా, మసీహ్ అలైహిస్సలాం చేసిన హెచ్చరికకు విరుద్ధంగా ఉంటుంది: "గొర్రెపిల్లల వేషంలో మీ వద్దకు వచ్చే అబద్ధపు ప్రవక్తల పట్ల అప్రమత్తంగా ఉండండి, కానీ అంతర్గతంగా వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలాలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు. ఎవరైనా ముళ్ళపొదల నుండి ద్రాక్షలను, లేదా గచ్చపొదల నుండి అంజూరపు పండ్లను కోస్తారా? అదే విధంగా ప్రతీ మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, అయితే చెడ్డ చెట్టు చెడ్డ ఫలాలను ఇస్తుంది. ఒక మంచి చెట్టు చెడ్డ ఫలాలను ఇవ్వలేదు, మరియు ఒక చెడ్డ చెట్టు మంచి ఫలాలను ఇవ్వలేదు. మంచి ఫలాలను ఇవ్వని ప్రతీ చెట్టు నరకబడి అగ్నిలో విసిరివేయబడుతుంది. కనుక, వారి ఫలాలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు" (మత్తయి 7: 15-20).
మరి అల్లాహ్ సాక్షిగా, ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత యొక్క సత్యతను, ఆయన దైవదౌత్యపు పరిపూర్ణతను మరియు ప్రళయ దినం వరకు ఆయన ధర్మం నిలిచి ఉండటాన్ని సూచించే సాక్ష్యాలు, రుజువులు మరియు అద్భుతాలలో అతి గొప్పది. మరియు మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క కారుణ్యము మరియు శాంతి కలుగుగాక.
చూడండి: అల్ ఫుసూల్ ఫీ అస్'సీర పేజీ 228-236.
***
ప్రశ్న:
దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్తలలో, సందేశహరులలో చిట్టచివరి ప్రవక్త అన్నది నిజమేనా? ఒకవేళ ఇది నిజమైతే, దాని వెనుక ఉన్న కారణం ఏమిటి? ఈ రోజుల్లో మానవాళికి మరింత మంది ప్రవక్తల అవసరం ఉందని మీరు భావించడం లేదా?
సమాధానం:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తల (అలైహిముస్సలాతు వస్సలామ్) పరిసమాప్తి. మరియు ఆయనకు ఇచ్చి పంపబడిన ధర్మము అత్యంత పరిపూర్ణమైన ధర్మము అయినందున, అది ప్రతీ కాలము,ప్రదేశము కొరకు సముచితమైనది కావడం దాని లక్షణాలలో ఒకటి. మరియు దైవభీతి గల పండితులు ప్రజలకు ధర్మాన్ని ప్రచారం చేస్తారు మరియు దానిని వివరిస్తారు.
మరియు ప్రశ్నించే వ్యక్తి సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తో ఇలా అంటున్నట్లుగా ఉంది: "నాకు నీకంటే బాగా తెలుసు; నీవు సందేశాలను ఎందుకు వరుసగా వచ్చేలా చేయలేదు?" అల్లాహ్'కు తన సందేశాన్ని ఎక్కడ పెట్టాలో చాలా బాగా తెలుసు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు వారు: "అల్లాహ్ యొక్క సందేశహరులకు ఇవ్వబడినట్లు, మాకు కూడా (దివ్యజ్ఞానం) ఇవ్వబడనంత వరకు మేము విశ్వసించము." అని అంటారు. తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు.... ﴿ [సూరతుల్ అన్ఆమ్: 124]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ మాకు ఇలా తెలియజేశాడు, నిశ్చయంగా ఆయన ఇబ్రహీము అలైహిస్సలాము, మూసా అలైహిస్సలాము మరియు ఈసా అలైహిస్సలాం ల సందేశాల వలె పూర్వపు సందేశాలను తమ జాతుల కొరకు ప్రత్యేక సందేశాలుగా చేశాడు. మరియు వాటికి ఒక గడువును నిర్ణయించాడు, దాని ముగింపుతో అవి ముగుస్తాయి. మరియు వాటిని భద్రపరిచే బాధ్యతను అల్లాహ్ తీసుకోలేదు; కానీ వాటి సంరక్షణ బాధ్యతను మానవులకు ఇచ్చాడు, అయితే వారు వాటిని పోగొట్టుకున్నారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾నిశ్చయంగా, మేము తౌరాత్ ను (మూసాపై) అవతరింపజేశాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి. అల్లాహ్ కు విధేయులైన (ముస్లింలైన) ప్రవక్తలు దానిని అనుసరించి, యూదుల మధ్య తీర్పు చేస్తూ ఉండేవారు. అదే విధంగా ధర్మ వేత్తలు (రబ్బానియ్యూన్) మరియు యూద మతాచారులు (అహ్ బార్ లు) కూడా (తీర్పు చేస్తూ ఉండేవారు). ఎందుకంటే వారు అల్లాహ్ గ్రంథానికి రక్షకులుగా మరియు దానికి సాక్షులుగా నియమింపబడి ఉండేవారు....﴿ [సూరతుల్ మాయిద : 44వ ఆయతు]
దైవదౌత్యలు మన ప్రవక్త ముహమ్మద్ (ﷺ) సందేశంతో ముగుస్తాయని అల్లాహ్ తన ప్రవక్తలకు (అలైహిస్సలాం) తెలియజేశాడు, మరియు మహోన్నతుడైన అల్లాహ్ దైవదౌత్యలను ఒకదానికొకటి సంపూర్ణం చేసుకునేలా చేశాడు, మరియు తరువాత వచ్చినది అంతకు మునుపటి కట్టడనిర్మాణాన్ని పరిపూర్ణం చేస్తుంది; అందుకనే దావూద్ ప్రవక్త (అలైహిస్సలాం) దీని గురించి తెలియజేస్తూ ఇలా చెప్పారు:- "నిర్మాతలు ఏ రాయిని అయితే తిరస్కరించారో ఆ రాయియే మూలరాయిగా మారింది. ఇది ప్రభువు వైపు నుండి జరిగింది, మరియు ఇది మన కళ్ళకు అద్భుతమైనది" (మజామీర్: 118: 22). ఈ శుభవార్త యొక్క అర్థం ఏమిటంటే: దైవ సందేశాలు ఒక కట్టడ నిర్మాణాన్ని పోలి ఉంటాయి, మరియు ప్రతి ప్రవక్త తమకు పూర్వం వచ్చిన ప్రవక్త ప్రారంభించిన దానిని పూర్తి చేస్తూ వచ్చారు. ప్రవక్తల పరంపర సంపూర్ణమై, కేవలం చివరి ప్రవక్త రాక మాత్రమే మిగిలి ఉన్నప్పుడు, ఆ కట్టడ నిర్మాణం పరిపూర్ణతకు చేరుకొని అందులో కేవలం ఒక ఇటుక స్థానం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు అల్లాహ్ తన సందేశహరుడు మరియు ప్రాణమిత్రుడైన ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారిని పంపాడు. తద్వారా ఆయనతో ధర్మాన్ని పరిపూర్ణం చేశాడు, అనుగ్రహాన్ని సంపూర్ణం చేశాడు, ప్రవక్తల పరంపరను ముగించాడు మరియు కట్టడ నిర్మాణాన్ని పరిపూర్ణం చేశాడు. ఆ విధంగా అల్లాహ్ యొక్క సందేశహరుడు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ప్రవక్తలు మరియు సందేశహరులకు (అలైహిముస్సలాం) అంతిమ ప్రవక్త అయ్యారు. దావూద్ (అలైహిస్సలాం) గారి మాటలలో సూచించబడిన రాయి (ఇటుక) ద్వారా ఆయన గురించే ఉదాహరణ ఇవ్వబడింది.
ఈ వార్త ఇంజీలులో కూడా వచ్చింది, ఇంజీలులో అంతిమ ప్రవక్తయైన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ గురించి శుభవార్త వచ్చింది, మరియు ఈసా మసీహ్ అలైహిస్సలాం అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ రాకతో దైవదౌత్యాలు సంపూర్ణమవుతాయని, ధర్మం పరిపూర్ణమవుతుందని మరియు ఆయనతో అనుగ్రహం పూర్తవుతుందని విశదపరిచారు. అందుకే మత్తయి ఉల్లేఖించినట్లు ఆయన ఇలా అన్నారు:- «యేసు వారితో,"మీరు దాని గురించి పుస్తకాలలో ఎప్పుడు చదువలేదా:-కట్టడనిర్మాణకులు వదిలిన ఆ రాయి మూల కేంద్రబిందువు! ప్రభువు తరుపున ఇది జరిగింది,ఇది మా దృష్టిలో అద్భుతమైనది"అని అన్నారు» (మత్తయి: 21:42). ఈ విషయం మొదటి పేతురు పత్రిక: 2:7 లో కూడా పేర్కొనబడింది.
దైవసందేశహరులైన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్వప్రవక్తలు ప్రారంభించిన దానిని ఎలా సంపూర్ణ పరిచారో, మరియు ఆయన కార్యం వారి కార్యాలను ఎలా పరిపూర్ణం చేసిందో విశదీకరిస్తూ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:- {నాది మరియు నాకు మునుపు గతించిన ప్రవక్తల ఉపమానం ఆ వ్యక్తి లాంటిది అతను ఒక ఇంటిని నిర్మించాడు,దాన్ని అత్యుత్తమంగా మలచి అతి సుందరంగా తీర్చిదిద్దాడు కానీ ఒక మూల‘ఇటుక’ పెట్టె ప్రదేశం మాత్రం వదిలేశాడు,ప్రజలు ఆ ఇంటిని చూడటానికి తరలి వస్తున్నారు ఆ ఇంటిని పరిశీలిస్తూ ఆశ్చర్యకితులవుతున్నారు,కానీ దానితో పాటు ఎందుకని ఇక్కడ ఒక ఇటుక’ పూరించలేదు’అని అంటున్నారు,దైవప్రవక్త సెలవిచ్చారు:-నేనే ఆ ఇటుకను మరియు నేనే ప్రవక్తలలో అంతిమ దైవప్రవక్తను} [సహీహ్ బుఖారీ (3535) మరియు ఈ పదాలు వారివే, మరియు సహీహ్ ముస్లిం (2286)].
చివరకు మన ప్రవక్త ముహమ్మద్ (ﷺ) రాకతో ధర్మం పరిపూర్ణమై మరియు అనుగ్రహం సంపూర్ణమైనప్పుడు; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ . . . ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను . . . ﴿ [సూరతుల్ మాయిదా: 3]
ఇక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విషయానికి వస్తే, ఆయన సర్వమానవాళి కొరకు అల్లాహ్ ప్రవక్త అని అల్లాహ్ నిర్ణయించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము. కాని వాస్తవానికి చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.﴿ [సూరతు సబా: 28] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ . . .(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను . . .﴿ [సూరతుల్ ఆరాఫ్: 158] ఈ కారణంగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దైవదౌత్యం ప్రళయ దినం వరకు మిగిలి ఉండిపోయేలా మహోన్నతుడైన అల్లాహ్ నిర్ణయించాడు మరియు దీనిని సురక్షితంగా ఉంచడానికి, ప్రళయ దినం వరకు మిగిలి ఉండిపోయేలా చేయడానికి అవసరమైన ప్రాపంచిక మరియు షరీఅతు పరమైన ఏర్పాట్ల రక్షణ బాధ్యతను ఆయనే స్వయంగా చేపట్టాడు. అందులో భాగమేమిటంటే: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవితకాలంలో ఆయన్ను విశ్వసించి, ఆయన్ను కలుసుకుని, ఆయన నుండి బోధనలను గ్రహించి, ఆయన సందేశాన్ని ఇతరులకు వ్యాప్తి చేసిన వారి సంఖ్య ఒక లక్షకు పైగా ఉండేది. వీరు ఆయన నుండి ఈ దైవదౌత్యాన్ని తమ తర్వాతి తరాల వారికి అందించారు. కాగా, ఈసా అలైహిస్సలాం వెంట ఉన్న వారి అనుచరుల (హవారీయుల) సంఖ్య డెభ్భై మందికి మించలేదు, మరియు మూసా అలైహిస్సలాంను విశ్వసించిన వారు కూడా చాలా కొద్ది మందే.
నిస్సందేహంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క అంతిమ సందేశం, అది విశ్వాసాలకు, ఆరాధనలకు, వ్యవహారాలకు, ప్రవర్తనలకు మరియు స్థితిగతులకు సంబంధించినదైనా సరే, తరతరాలుగా వరుసగా ముతవాతిర్ క్రమంలో వ్యాప్తి చేయబడింది. ఈ కారణంగానే, ఈరోజు ముస్లింలు ఆచరిస్తున్న ఆరాధనా పద్ధతులు, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు (సహాబా రజియల్లాహు అన్హుమ్) అమలు చేసినవేనని నేటి మానవుడు గమనిస్తున్నాడు. అదే విధంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెచ్చిన దైవవాణి (వహీ), అది దివ్యఖుర్ఆన్ అయినా లేదా ప్రవక్త సున్నతు అయినా, అల్లాహ్ సంరక్షణలో సురక్షితంగా ఉంది, ఇందులో ఏ ఒక్క అక్షరం కూడా లోపించలేదు.
పరిస్థితి ఇలా ఉన్నందున, మరియు ఈ సందేశం శాశ్వతమైనది మరియు సురక్షితమైనది, మరియు ఇది ప్రతి కాలానికి మరియు సమయానికి అనువైనది, మరియు ప్రతి వాతావరణానికి అనువైనది, మరియు దీనిని ప్రతి పరిస్థితిలోనూ అమలు చేయవచ్చు, కాబట్టి ఈ రోజుల్లో ప్రజలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మాన్ని దృఢంగా పట్టుకోవాల్సిన మరియు ఆయన సున్నత్‌పై అమలు చేయాల్సిన అవసరం ఉంది, మరియు ఇది వారికి సరిపోతుంది. ఒకవేళ ఏ ప్రవక్త అయినా వచ్చినా, వారు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్లోని వారే అయి ఉండేవారు మరియు ఆయన షరియత్పైనే అమలు చేసి ఉండేవారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: మరియు అల్లాహ్ ప్రవక్తల నుండి తీసుకున్న గట్టి ప్రమాణాన్ని (జ్ఞాపకం చేసుకోండి): "నేను మీకు ఒక గ్రంథాన్ని మరియు వివేకాన్ని ప్రసాదించిన తరువాత, ఒక సందేశహరుడు (ముహమ్మద్) వచ్చి (మీ గ్రంథాలలో నుండి మిగిలివున్న) సత్యాన్ని ధృవపరిస్తే మీరు అతనిని (ధర్మాన్ని) విశ్వసించి, అతనికి సహాయం చేయవలసి ఉంటుంది." అని చెప్పి ఇలా ప్రశ్నించాడు: "ఏమీ? మీరు దీనికి అంగీకరిస్తారా? మరియు నా ఈ ప్రమాణాన్ని స్వీకరిస్తారా?" వారన్నారు: "మేము అంగీకరిస్తాము." అప్పుడు ఆయన అన్నాడు: "అయితే, మీరు దీనికి సాక్షులుగా ఉండండి. మరియు నేను కూడా మీతోపాటు సాక్షిగా ఉంటాను. [సూరతు ఆలే ఇమ్రాన్: 81 ఆయతు] అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
ముస్లింలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆరాధిస్తారనేది వాస్తవమేనా?
సమాధానం:
ఇది వాస్తవం కాదు, ముస్లింలు అల్లాహ్ ఒక్కడినే ఆరాధిస్తారు, ఆయనకు ఎవ్వరు సాటి లేరు, మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధిస్తారో లేదా అల్లాహ్ కాకుండా ఇతరులను ఆరాధిస్తారో వారు అవిశ్వాసి (కాఫిర్), మరియు ముస్లిం కారు. మరియు ముస్లింలు తమ నమాజులో ఇలా అంటారు: "నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) అని."
అదే విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకువచ్చిన గ్రంథం షిర్కు అసత్యమని స్పష్టంగా వివరించే మరియు ముష్రిక్ ప్రయత్నాల వైఫల్యాన్ని తెలిపే మేధోపరమైన ఆధారాలతో నిండి ఉంది, ఉదాహరణకు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.﴿ [సూరతుల్ అంబియా : 22]
కనుక ముస్లింలు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అనుసరిస్తారు మరియు ఆయనను ఆరాధించరు, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: “ఓ అల్లాహ్! నా సమాధిని విగ్రహంగా చేయకు. తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా మార్చుకున్న జనాంగంపై అల్లాహ్ శాపం కలుగుగాక.” [ఈ హదీసును అహ్మద్ హదీథు సంఖ్య (7358) లో ఉల్లేఖించారు], మరియు ఇది హసన్ (ఉత్తమ) హదీసుగా వర్గీకరించబడింది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన యెడల అభిమానంలో మితిమీరి వ్యవహరించటాన్ని మరియు హద్దులు మీరడాన్ని గురించి తన అనుచర సమాజాన్ని హెచ్చరించారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: "క్రైస్తవులు మర్యమ్ కుమారుడైన ఈసా అలైహిస్సలాంను ప్రశంసించడంలో మితిమీరినట్లుగా, మీరు నా ప్రశంసలో అతిశయం చేయకండి. నిశ్చయంగా నేను ఆయన (అల్లాహ్) దాసుడను. కనుక నన్ను ‘అల్లాహ్ దాసుడు మరియు ఆయన సందేశహరుడు’ అని అనండి." [సహీహ్ బుఖారి (3445)].
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనకు ప్రజలలో అత్యంత సన్నిహితురాలైన తన కుమార్తె రజియల్లాహు అన్హాకు మరియు తన ఇతర బంధువులకు, ప్రళయదినమున అల్లాహ్ ముందు తాను వారికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చలేనని స్పష్టం చేశారు. ఆయనపై (దైవవాక్యం) అవతరించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ﴾మరియు నీ దగ్గరి బంధువులను హెచ్చరించు;﴿ [సూరతుష్ షుఅరా: 214] "ఓ ఖురైష్ ప్రజలారా! మిమ్మల్ని మీరు అల్లాహ్ శిక్ష నుండి రక్షించుకోండి, అల్లాహ్ శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షించలేను, ఓ అబ్దుల్ ముత్తలిబ్ సంతతివారా, అల్లాహ్ శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షించలేను, ఓ అబ్బాస్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్, అల్లాహ్ శిక్ష నుండి నేను మిమ్మల్ని రక్షించలేను, ఓ సఫియా - దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అత్త - నేను నిన్ను అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేను, ఓ ఫాతిమా - దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కుమార్తె - నీకు ఏది కావాలంటే అది అడుగు, నేను నిన్ను అల్లాహ్ శిక్ష నుండి రక్షించలేను." [ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ హదీసు నెంబరు 2753, సహీహ్ ముస్లిం హదీసు నెంబరు 351].
ఒకవేళ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తనను ఆరాధించాలని వారి నుండి కోరుకుని ఉంటే, తాను వారికి లాభం చేకూర్చలేనని వారికి తెలియజేసి ఉండేవారు కాదు. మరియు నిశ్చయంగా ముస్లింలు పఠించే గొప్ప గ్రంథమైన ఖుర్ఆన్ లో మహోన్నతుడైన అల్లాహ్ ఆయనకు ఇలా అవతరింపజేశాడు : ﴾మరియు వాస్తవానికి! నీకూ మరియు నీకంటే ముందు వచ్చిన (ప్రతి ప్రవక్తకూ) దివ్యజ్ఞానం (వహీ) ద్వారా ఇలా తెలుపబడింది: "ఒకవేళ నీవు బహుదైవారాధన (షిర్కు) చేసినట్లైతే నీ కర్మలన్నీ వ్యర్థమై పోతాయి మరియు నిశ్చయంగా, నీవు నష్టానికి గురి అయిన వారిలో చేరిపోతావు.﴿ [సూరతు జ్జుమర్: 65] ఇదంతా ఉన్నప్పటికీ, ముస్లింలు ఆయనను ఆరాధిస్తారని ఎలా భావించబడుతుంది? అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
(ముస్లిమేతరులు, షిర్కు (బహుదైవారాధన) మరియు ఇబాదత్ (ఆరాధన) కు సంబంధించిన విభాగం)
ప్రశ్న:
ఒక మనిషి మహోన్నతుడైన అల్లాహ్‌ను ఎందుకు ఆరాధించాలి?
సమాధానం:
ఈ ప్రశ్నకు సమాధానం ఎంతో గొప్పది, దీనికి చాలా విపులీకరణ మరియు సవిస్తరమైన వివరణ అవసరం, కానీ మేము సాధ్యమైనంత వరకు సంక్షిప్తం చేస్తాము, కాబట్టి మేము పలుకుతున్నాము - అల్లాహ్ తోనే భాగ్యము ప్రాప్తించును :
నిశ్చయంగా ధర్మాన్ని ఆచరించడం ఒక అత్యవసరమైన అంశం, దీని అర్థం ఏమిటంటే ఆత్మ దానిని కోరుకుంటుంది, అంతరాత్మ దాని కోసం పరితపిస్తుంది మరియు బుద్ధి దానిని తప్పనిసరి చేస్తుంది, మరియు మనిషి ధర్మం లేకుండా జీవించడాన్ని అంగీకరించలేడు; అందువల్లే అన్ని జాతులు ఆరాధించడం మీరు చూస్తారు, వారు ఆరాధించినంత మాత్రాన వారి ఆరాధన సరైనది అని దీని అర్థం కాదు, కాకుండా ఆరాధించడం అనేది ఒక సహజమైన మరియు అత్యవసరమైన అంశం అని ఇది సూచిస్తుంది.
నిశ్చయంగా అల్లాహ్ పవిత్ర ప్రభువు అందమైన పేర్లను మరియు మహోన్నతమైన లక్షణాలను కలిగి ఉన్నాడు. ఆయనే ప్రభువు, ఉపాధిప్రధాత, సమస్త వ్యవహారాల నిర్వాహకుడు, సార్వభౌముడు, ప్రాణమిచ్చేవాడు మరియు మరణమిచ్చేవాడు. మనకు తెలిసిన మరియు మనకు తెలియని సకల అనుగ్రహాలను మనకు ప్రసాదించిన వాడు ఆయనే. విషయమిలా ఉండగా, మానవుడు ఆరాధన చేయడానికి బద్ధుడై ఉన్నందున, ఆరాధనకు అర్హుడైన అల్లాహ్ పవిత్ర ప్రభువును మాత్రమే ఆరాధించాలి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ మానవులారా! మిమ్మల్ని మరియు మీకు పూర్వం వారిని సృష్టించిన మీ ప్రభువు (అల్లాహ్) నే ఆరాధించండి, తద్వారా మీరు భక్తిపరులు కావచ్చు! ఆయన (అల్లాహ్) యే మీ కొరకు భూమిని పరుపుగాను మరియు ఆకాశాన్ని కప్పుగాను చేశాడు. మరియు ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీకు జీవనోపాధిగా ఫలాలను (పంటలను) ఉత్పత్తి చేశాడు! కావున ఇది తెలుసుకొని కూడా, మీరు ఇతరులను అల్లాహ్ కు సాటిగా నిలబెట్టకండి.﴿ [సూరా అల్ బఖర: 21-22]
నిశ్చయంగా మానవుడికి తన అన్ని వ్యవహారాలలో మార్గదర్శనం అవసరం, మరియు అల్లాహ్ మాత్రమే సన్మార్గం చూపేవాడు. కావున అతను ఆయనను ఆరాధించకపోతే, ఆయనతో మార్గదర్శనం ఎలా అర్ధిస్తాడు? మరియు ఒక ముస్లిం ప్రతి నమాజులో మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చిన విధంగా ఇలా అంటాడు: ﴾మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.﴿ [సూరతుల్ ఫాతిహ: 5-7] మరియు అల్లాహ్ అతనికి మార్గదర్శనం ప్రసాదించనట్లయితే, అతని వ్యవహారాలు కష్టతరమవుతాయి.
నిశ్చయంగా మనిషి సహజంగానే మంచి, సంతోషకరమైన జీవితాన్ని కోరుకుంటాడు, మరియు ఈ మంచి జీవితం విశ్వాసపరులకు మాత్రమే లభిస్తుంది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:- ﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿ [నహల్ : 97] మంచి జీవితంలో మనిషికి ప్రశాంతత, సంతృప్తి మరియు శాంతి లభిస్తాయి.
నిశ్చయంగా జీవిత స్వభావంలో ఆపదలు మరియు పరీక్షలు ఉంటాయి. విశ్వాసం మరియు అల్లాహ్ ఆరాధన -అల్లాహ్ అనుమతితో- వాటిని కలిగి ఉన్నవారికి పరీక్షల సమయంలో సమతుల్యతను ప్రసాదిస్తాయి; తద్వారా ఆపద సమయంలో అతను తన సమతుల్యతను కోల్పోకుండా ఉంటాడు. ఎందుకంటే విశ్వాసం మనిషికి స్థిరత్వాన్ని మరియు సహనాన్ని చేకూరుస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾భూమి మీద గానీ లేదా స్వయంగా మీ మీద గానీ విరుచుకు పడే ఏ ఆపద అయినా సరే! మేము దానిని సంభవింప జేయక ముందే గ్రంథంలో వ్రాయబడకుండా లేదు. నిశ్చయంగా, ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.﴿ [సూరతుల్ హదీద్: 22] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏ ఆపద కూడా, అల్లాహ్ అనుమతి లేనిదే సంభవించదు. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసిస్తాడో, అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు అల్లాహ్ కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.﴿ [సూరతు తగాబున్:11]
మానవుడు ఇహలోకంలో మరియు పరలోకంలో తన ప్రభువు మరియు సృష్టికర్త సంతృప్తిని పొందాల్సిన అవసరం ఉంది. మరియు ఆయనను విశ్వసించి, ఆయన ఆదేశించిన విధంగా ఆరాధించే వారిని మినహాయించి, ప్రభువు సంతృప్తి లభించదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు:- ﴾నిశ్చయంగా, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు, వారే సృష్టిలో అత్యంత ఉత్కృష్ట జీవులు. వారికి తమ ప్రభువు నుండి లభించే ప్రతిఫలం శాశ్వతమైన స్వర్గవనాలు. వాటిలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. వారు, వాటిలో శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారితో ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో సంతుష్టులవుతారు. ఇదే తన ప్రభువుకు భయపడే వ్యక్తికి లభించే ప్రతిఫలం.﴿ [సూరతుల్ బయ్యిన: 7-8].
నిశ్చయంగా అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉండటం మరియు ఆయనను ఆరాధించడం మానవుడికి సత్యం మరియు అసత్యం మధ్య, మరియు సన్మార్గం మరియు మార్గభ్రష్టత్వం మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే ఒక ప్రమాణాన్ని ప్రసాదిస్తుంది. మానవుడికి తన అన్ని పరిస్థితులలోనూ ఈ ప్రమాణం అవసరం; తద్వారా ఏ విషయానికీ దాని అర్హతకు మించిన ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఉండేందుకు, లేదా ఘనతకు అర్హత లేని దానిని ఘనపరచకుండా ఉండేందుకు, లేదా గౌరవించబడటం మరియు అనుసరించబడటం హక్కుగా గల విషయాలలో లోపం చేయకుండా ఉండేందుకు.
నిశ్చయంగా మనిషికి ఒక నిర్ణీత గడువు ఉన్నది మరియు ఖచ్చితంగా దానిని కలుసుకోవలసి ఉంది, మరియు మరణ సమయం అతని వద్దకు వస్తుంది, మరియు మరణం దానికదే ఒక భయంకరమైన విషయము, కాని తన ప్రభువును ఆరాధించే విశ్వాసపరుని మరణము, అవిశ్వాసపరుని మరణము కంటే భిన్నంగా ఉంటుంది, మరియు విశ్వాసపరుని మరియు అవిశ్వాసపరుని ఈ రెండు ముగింపులను పరిశీలించండి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆ రోజు నరకం (ముందుకు) తీసుకు రాబడుతుంది. ఆ రోజు మానవుడు (తన కర్మలన్నీ) జ్ఞప్తికి తెచ్చుకుంటాడు; కాని ఆ రోజు జ్ఞప్తికి తెచ్చుకోవడం వల్ల అతనికి కలిగే ప్రయోజనమేమిటీ? అతడు: "అయ్యో! నా పాడుగానూ! నా ఈ జీవితం కొరకు నేను (సత్కార్యాలు) చేసి పంపు కొని ఉంటే ఎంత బాగుండేది!" అని వాపోతాడు. అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు! మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు! (సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా! నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై! నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో! ٢٩ మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!﴿ [సూరతుల్ ఫజర్: 23-30] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!﴿ [సూరా ఫుస్సిలత్ :30] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.﴿ [సూరతుల్ అన్'ఫాల్: 50]
అల్లాహ్ తెలియజేశాడు మరియు ఆయన వార్త సత్యమైనది, ఆయన వాగ్దానం చేశాడు మరియు ఆయన వాగ్దానం సత్యమైనది; నిశ్చయంగా అల్లాహ్ సమాధులలో ఉన్నవారిని లేపుతాడు. మరియు ఆయన దీని కొరకు లెక్కలేనన్ని రుజువులను సిద్ధంచేశాడు, అవి దివ్య ఖుర్ఆన్ లో విశదపరచబడి ఉన్నాయి. మరియు మనిషి తన ప్రభువు వైపుకు తీసుకువెళ్ళబడే రోజు తప్పక రానుంది. ఇక ఎవరైతే విశ్వాసిగా ఉంటాడో అతని కొరకు శాశ్వత స్వర్గంలో శాశ్వత అనుగ్రహం ఉంటుంది. మరియు ఎవరైతే అవిధేయునిగా ఉంటాడో అతని కొరకు నరకాగ్నిలో శాశ్వత శిక్ష ఉంటుంది.
***
ప్రశ్న:
మహోన్నతుడైన అల్లాహ్ ఎందుకు దైవప్రవక్తలను పంపుతాడు? ప్రజలు తమ బుద్ధితోనే తమ సృష్టికర్తను తెలుసుకోవడం సరిపోదా?
సమాధానం:
నిశ్చయంగా, మహోన్నతుడైన అల్లాహ్ ప్రజలను నిరర్థకంగా వదిలేయలేదు; బదులుగా, ఆయన ప్రజలకు సన్మార్గాన్ని చూపించడానికి మరియు కేవలం బుద్ధి, సహజమైన స్వభావంతో స్థూలంగా అర్థం చేసుకున్న విషయాలను వారికి వివరంగా తెలియజేయడానికి వారి వద్దకు దైవప్రవక్తలను శుభవార్తనిచ్చే వారుగా మరియు హెచ్చరించే వారుగా పంపాడు. స్వచ్ఛమైన బుద్ధి మరియు సరైన సహజమైన స్వభావం సృష్టికర్త యొక్క ఉనికిని మరియు ఆయనను ఆరాధించవలసిన ఆవశ్యకతను తెలియజేస్తాయి, కానీ ఆ ఆరాధనకు సంబంధించిన వివరాలను నిర్దేశించడంలో అవి అసమర్థమైనవి. అంతేకాకుండా, మాటలు మరియు చేతలలో అల్లాహ్ వేటిని ఇష్టపడతాడో, ఆయన ప్రసన్నత వేటి ద్వారా పొందవచ్చో, అలాగే ఆయన వేటిని ద్వేషిస్తాడో మరియు వేటిని నిషేధించాడో అవి మాత్రమే స్వతహాగా నిర్దేశించలేవు.
ప్రవక్తలు అల్లాహ్ మరియు ఆయన సృష్టికి మధ్య మధ్యవర్తులు. వారు ప్రజలకు తమ ప్రభువు యొక్క లక్షణాలను, ఆయన పేర్లను మరియు ఆయన పట్ల వారు నెరవేర్చాల్సిన హక్కులను తెలియజేసే ద్యోతకాన్ని (అల్లాహ్ సందేశాన్ని) తీసుకువస్తారు, మరియు మానవుల ఆరాధనలు, వారి వ్యవహారాలు మరియు వారి నైతికతలలో వారి జీవితాలను క్రమబద్ధీకరించే సరైన విధానాన్ని నిర్దేశిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు﴿ [అన్ నిసా:165] కాబట్టి, దైవవాణి ద్వారానే ప్రజలపై హుజ్జతు (రుజువు) స్థాపించబడుతుంది, మరియు దైవసందేశం యొక్క స్థానాన్ని భర్తీ చేయడానికి కేవలం బుద్ది సరిపోదు.
ప్రవక్తలను పంపించటంలో ఉన్న విజ్ఞతలో మరొకటి ఏమిటంటే, మనుషుల బుద్ధులు పరస్పరం భిన్నంగా ఉంటాయి., కొందరు మంచిదిగా భావించే దానిని ఇతరులు చెడ్డదిగా పరిగణించవచ్చు. ఒకవేళ వారిని కేవలం మనిషి బుద్దికే వదిలేసి ఉంటే, ప్రమాణాలు తారుమారయ్యేవి, లక్ష్యం కనుమరుగయ్యేది మరియు ప్రజలు సత్యం నుండి దారితప్పేవారు. అందువల్లనే దైవదౌత్య సందేశం వచ్చింది; ఇది కాలం మరియు ప్రదేశం మారినప్పటికీ ఏమాత్రం మారని స్థిరమైన ప్రామాణికంగా ఉండటానికి, మానవ సహజత్వాన్ని క్రమబద్ధీకరించటానికి, మనిషిబుద్దిని సంస్కరించటానికి మరియు దాని పని పరిమితులను స్పష్టంగా తెలియజేయటానికి.
ప్రవక్తలు కేవలం ఆదేశాలు మరియు నిషేధాలను తెలియజేసేవారు మాత్రమే కారు, కానీ వారు ఆచరణాత్మక ఆదర్శమూర్తులు, తమ జీవితాలలో ధర్మాన్ని ఆచరించి చూపుతారు మరియు విధేయత, ఆరాధనలలో మానవులకు అత్యున్నత ఆదర్శాన్ని అందిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వాస్తవానికి, అల్లాహ్ యొక్క సందేశహరునిలో మీకు ఒక ఉత్తమమైన ఆదర్శం ఉంది...﴿ దైవప్రవక్త కేవలం జ్ఞానాన్ని అందించడమే కాకుండా, తన ఆచరణ మరియు మాటలు రెండింటి ద్వారా అంతరంగాలను సంస్కరించి సన్మార్గం చూపుతారు.
“అల్లాహ్ కేవలం బుద్ధిని మాత్రమే ఎందుకు సరిపోయేలా చేయలేదు?” అనే అభ్యంతరానికి సమాధానం ఏమిటంటే, ఒకవేళ అల్లాహ్ అలా చేసి ఉంటే ప్రజలు గందరగోళం మరియు విభేదాలలో పడి ఉండేవారు, మరియు వారిపై సంపూర్ణమైన రుజువు స్థాపించబడి ఉండేది కాదు. అంతేకాకుండా, బుద్ధి అనేది గ్రహించడానికి ఒక సాధనమైనప్పటికీ, అది ఇంద్రియాలు మరియు అనుభవాల పరిమితులకు లోబడి ఉంటుంది, మరియు అది అదృశ్య విషయాలను ఛేదించలేదు. అందువల్ల, దైవవాణి బుద్ధికి పరిపూర్ణతను చేకూర్చేదిగా, దానికి మార్గనిర్దేశం చేసేదిగా మరియు మానవాళిని చీకట్ల నుండి వెలుగులోకి తీసుకువచ్చేదిగా వచ్చింది.
అందువల్ల మనిషికి సంపూర్ణ మార్గదర్శకం చేయడానికి, సహజ స్వభావాన్ని స్థిరపరచడానికి మరియు బుద్ధిని నియంత్రించడానికి దైవప్రవక్తలను పంపడం అనేది ఒక తార్కిక మరియు షరీఅతుబద్ధమైన అవసరం. బుద్ధి సృష్టికర్తను సూచిస్తుంది, మరియు దైవప్రవక్తలు ఆయన ధర్మాన్ని మరియు ఉద్దేశ్యాన్ని స్పష్టంగా వివరిస్తారు. ఎవరిలోనైతే బుద్ధి యొక్క వెలుగు మరియు దైవసందేశం యొక్క వెలుగు ఏకమవుతాయో, వారు సరళమైన సన్మార్గాన్ని పొందినట్లే.
***
ప్రశ్న:
మనం చూడలేని దేవుడిని మనం ఎందుకు ఆరాధించాలి?
సమాధానం:
కొంతమంది ఇలా ప్రశ్నించవచ్చు: మన కంటికి కనిపించని ప్రభువును మనం ఎలా ఆరాధించాలి? మనం ఆయనను విశ్వసించాలంటే, ఆయన భౌతికంగా మరియు కంటికి కనిపించేలా ఉండటం సమంజసం కాదా?
మొదటిది: అల్లాహ్ ను చూడలేకపోవడం ఆయన ఉనికిని నిరాకరించదు.
మనం చూడలేని విషయాలు చాలా ఉన్నాయి, అయినప్పటికీ బుద్ధి, ఇంద్రియాలు మరియు వాటి ప్రభావాల ద్వారా వాటి ఉనికిని మనం ఖచ్చితంగా నమ్ముతున్నాము. (ఉదా: గాలి, విద్యుత్తు మరియు గురుత్వాకర్షణ శక్తి). వాటి ప్రభావాలను చూడడం వల్ల మనం వాటిని నమ్ముతున్నాము. అదేవిధంగా అల్లాహ్, ఆయన మహోన్నతుడు, ఎలాంటి లోపాలూ, కొరతలూ లేనివాడు, ఈ విశ్వంలో ఆయన సృష్టి, ఆయన శక్తి మరియు ఆయన గొప్పదనం యొక్క ప్రభావాలను మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఉనికిని కళ్లతో చూడాల్సిన అవసరం లేనంత స్పష్టంగా ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾... అల్లాహ్ ను గురించి (మీకు) సందేహం ఉందా? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించిన... ﴿ [ఇబ్రాహీం: 10]
రెండవది: కంటి చూపులు ఆయనను గ్రహించలేనంతగా అల్లాహ్ మహోన్నతుడు.
అల్లాహ్ మహోన్నతుడు మరియు సంపూర్ణుడు, ఆయన సృష్టితాలను పోలి ఉండడు మరియు ఇంద్రియాలు ఆయనను తమ పరిధిలోకి తీసుకురాలేవు. కావున ఇహలోకంలో ఆయనను చూడలేకపోవడం ఆయనలో ఎలాంటి లోపమూ కాదు, బదులుగా అది ఆయన గొప్పదనం మరియు మహోన్నత స్థానం వల్లనే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏ చూపులు కూడా ఆయనను అందుకోలేవు, కాని ఆయన (అన్ని) చూపులను పరివేష్టించి ఉన్నాడు. మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు.﴿ [అల్ అన్ ఆమ్:103] ఒకవేళ ఇహలోకంలో ఆయనను చూడటం సాధ్యమై ఉంటే, ఆయన పరిమితమైనవాడై ఉండేవాడు, మరియు అల్లాహ్ దాని నుండి పరిశుద్ధుడు.
మూడవది: అగోచర విషయాలను విశ్వసించడంలోని ఆంతర్యం
అగోచర విషయాలను విశ్వసించడం దైవభీతి గలవారి అత్యంత గొప్ప లక్షణాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾(వారికి) ఎవరైతే అగోచర యథార్థాన్ని విశ్వసిస్తారో...﴿ [అల్ బఖర: 3] అగోచర విషయాలను విశ్వసించడం వల్ల మనిషిలో సత్యసంధత మరియు చిత్తశుద్ధి అభివృద్ది చెందుతాయి, మరియు అతను పూర్ణవిశ్వాసంతో మరియు తనను తాను సమర్పించుకోవడంతో అల్లాహ్‌ను ఆరాధిస్తున్నాడా, లేక కేవలం తన ఇంద్రియాలకు గోచరమయ్యే వాటినే ఆరాధిస్తున్నాడా అని అతని వాస్తవికత పరీక్షించబడుతుంది. మరియు ప్రపంచంలో పరీక్షించటం యొక్క ఉద్దేశ్యాలలో ఇది ఒకటి.
నాలుగవది: పరలోక దినాన తనను చూస్తారని అల్లాహ్ విశ్వాసులకు వాగ్దానం చేశాడు.
విశ్వాసులు వారికి ఒక పరీక్షగా ఈ ప్రపంచంలో అల్లాహ్ దర్శనం నుండి దూరం చేయబడతారు, కానీ స్వర్గంలో అతిపెద్ద అనుగ్రహం ఏమిటంటే అల్లాహ్ వారిని తన ముఖాన్ని దర్శించుకునేలా చేసి గౌరవించడమే, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు : ﴾ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి; తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి.﴿ [అల్ ఖియామా: 22-23]
మహనీయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "నిశ్చయంగా మీరు ఏ విధంగానైతే పున్నమి రాత్రి చంద్రుడిని చూస్తున్నారో, ఆ విధంగా మీరు మీ ప్రభువును చూస్తారు; ఆయనను చూడడంలో మీరు ఎటువంటి ఇబ్బందినీ ఎదుర్కొనరు." ఈ ప్రపంచములో (అల్లాహ్ ను) కనులారా చూసే భాగ్యానికి దూరమవడానికి ప్రతిగా పరలోకమునందు అత్యంత మహత్తరమైన వరం లభిస్తుంది.
కాబట్టి, ఈ ఇహలోకంలో మనం అల్లాహ్ ను చూడలేకపోయినప్పటికీ ఆయనను ఆరాధించటం అనేది వింత కాదు మరియు లోపం కూడా కాదు. బదులుగా, అది ఆయన గొప్పదనం యొక్క ఆవశ్యకత, మరియు అదృశ్య విషయాలపై విశ్వాసం ఉంచడంలో మన పరీక్షా రంగం. బుద్ధిపరమైన, సహజమైన, విశ్వసంబంధమైన మరియు ధార్మిక ఆధారాల ద్వారా ఆయన ఉనికి నిర్ధారించబడింది. ఒకవేళ ప్రజలు ఆయనను ప్రత్యక్షంగా చూసినట్లయితే, పరీక్షకు ఎలాంటి అర్థం మిగిలి ఉండేది కాదు, మరియు విశ్వాసం ఒక ఎంపికగా కాకుండా బలవంతంగా మారిపోయేది. ఈ ఇహలోకంలో విశ్వాసం అదృశ్యంగా ఉండాలన్నదే అల్లాహ్ యొక్క వివేకం, తద్వారా అసత్యపరుల నుండి సత్యవంతులు, మరియు వట్టి వాదనలు చేసేవారి నుండి చిత్తశుద్ధి గలవారు వేరుచేయబడతారు.
మరియు ఆయన దర్శనం అల్లాహ్ పరలోకంలో తన దాసుల కోసం భద్రపరిచిన గొప్ప అనుగ్రహం, కావున ఇప్పుడు ఆయనను విశ్వసించడం దాసుని సత్యసంధతకు నిదర్శనం అవుతుంది, మరియు పరలోకదినాన ఆయన ముఖ దర్శనము ఈ సత్యసంధతకు ప్రతిఫలం అవుతుంది.
***
ప్రశ్న:
ముస్లిమేతరులు మంచివారైనప్పటికీ నరకంలో ఎందుకు ప్రవేశిస్తారు?
సమాధానం:
ఈ ప్రశ్న తరచుగా తలెత్తవచ్చు: ఎవరైతే మంచి జీవితాన్ని గడిపి, నిజాయితీ మరియు సత్ప్రవర్తనతో వ్యవహరించాడో, కానీ అతను ముస్లిం కాకపోయినట్లయితే, అతడు నరకంలో ఎలా ప్రవేశిస్తాడు? ఇది అన్యాయం కాదా?
నిశ్చయంగా హక్కులన్నింటిలో అత్యంత గొప్ప హక్కు అల్లాహ్ కు చెందిన తౌహీద్ హక్కు. మనిషి సృష్టితాలతో సత్ప్రవర్తన కలిగి ఉండవచ్చు, కానీ అతనికి సమస్త శుభాలను అనుగ్రహించిన తన సృష్టికర్తను అతను తిరస్కరిస్తే, అతను అత్యంత గొప్ప హక్కును వృధా చేసినట్లే. కాబట్టి దాసుల హక్కుల కంటే అల్లాహ్ హక్కు అత్యంత గొప్పది. అది, ఎటువంటి భాగస్వామ్యం లేకుండా ఆరాధనను అల్లాహ్ ఒక్కడికే చేయడం. మహోన్నతుడైన అల్లాహ్ తన వచనంలో ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, అల్లాహ్ తనకు భాగస్వామిని (సాటిని) కల్పించటాన్ని ఏ మాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు... ﴿ [అన్'నిసా: 48] ఎవరైతే తౌహీద్‌ను తిరస్కరిస్తాడో, అతను ఎంతటి కార్యం చేసినా సరే, అతని నుండి ఏ ఆచరణ కూడా స్వీకరించబడదు.
అల్లాహ్ రెండు షరతులతో తప్ప ఏ ఆచరణనూ అంగీకరించడు: ఆయనను విశ్వసించడం మరియు ఆయన పట్ల చిత్తశుద్ధి కలిగి ఉండటం. కనుక ఈమాన్ (విశ్వాసం) లేని వ్యక్తి ఆచరణలో ప్రజలకు మేలు ఉన్నప్పటికీ, అల్లాహ్ అతని ఆచరణను స్వీకరించడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడు: ﴾మరియు మేము, వారు (అవిశ్వాసులు) చేసిన కార్యాల వైపుకు మరలుతాము, తరువాత వాటిని సూక్ష్మకణాల వలే (ధూళి వలే) ఎగురవేస్తాము.﴿ [అల్-ఫుర్'ఖాన్: 23]
ఎవరైనా ముస్లిమేతరుడు సత్కర్మ ఆచరిస్తే, అల్లాహ్ అతనికి ఈ ప్రపంచంలోనే మానసిక ప్రశాంతత, లేదా మంచి పేరు, లేదా సిరిసంపదలు, లేదా సంతానం రూపంలో దాని ప్రతిఫలాన్ని ప్రసాదించవచ్చు. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “నిశ్చయంగా ఒక కాఫిర్ (దైవదిక్కారి) సత్కర్మలు చేసినప్పుడు అతనికి ఈ ప్రపంచంలోనే ఉపాధి నొసగబడుతుంది.” ఇక పరలోకంలో విశ్వాసం లేకుండా చేసే ఆచరణ అతనికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు.
మరియు అల్లాహ్ న్యాయవంతుడు, ఎవరినీ అతనికి ఆధారం చేరి అతను దానిని వ్యతిరేకించిన తరువాత తప్ప శిక్షించడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము... ﴿ [అల్ ఇస్రా:15] ఎవరైతే జీవించారో మరియు వారికి సరైన సందేశం చేరలేదో, ప్రళయ దినాన వారి తీర్పు అల్లాహ్ యొక్క ఆధీనములో ఉంటుంది. అల్లాహ్ యొక్క న్యాయము మరియు ఆయన కరుణను స్పష్టం చేసే విధంగా వారు పరీక్షించబడతారు.
తన సృష్టికర్తను తిరస్కరించిన వ్యక్తికి, ప్రజల పట్ల చూపే మంచి వైఖరి ఏమాత్రం ప్రయోజనం చేకూర్చదు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఉద్యోగి తన సహోద్యోగుల పట్ల విధేయత కనబరుస్తూ, తనకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ మేనేజర్ ఉనికినే తిరస్కరించినట్లుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ సమస్య సహోద్యోగులతో అతని ప్రవర్తనలో లేదు, బదులుగా అత్యంత గొప్ప హక్కుదారుడిని తిరస్కరించడంలో ఉంది.
తన అవిశ్వాస స్థితిలో మరణించిన వారు నరకంలో ప్రవేశించడం అన్యాయం కాదు, అది అల్లాహ్ యొక్క న్యాయం; ఎందుకంటే తౌహీద్ (ఏకదైవారాధన)ను తిరస్కరించడమే అతిపెద్ద పాపము. అయినప్పటికీ, అల్లాహ్ ఎవరికీ అన్యాయం చేయడు: ఎవరికైతే సత్యం చేరిన తరువాత దానికి విముఖత చూపుతారో వారు శిక్షకు అర్హులు, మరియు ఎవరికైతే రుజువు (సత్య సందేశం) చేరలేదో వారి తీర్పు అల్లాహ్ అధీనంలో ఉంటుంది. మరియు పరలోకదినాన పరిపూర్ణమైన న్యాయం స్పష్టమవుతుంది, అక్కడ ఎవరికీ అణువంత కూడా అన్యాయం జరగదు.
***
ప్రశ్న:
ఇస్లాంకు వ్యతిరేకంగా యుద్ధం చేయని ముస్లిమేతరుల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటి?
సమాధానం:
ముస్లిమేతరుల పట్ల ఇస్లాం వైఖరిని స్పష్టం చేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.﴿ [అల్ ముమ్'తహిన: 8] వారి పట్ల మంచితనం చూపడంలో వారికి మేలు చేయడం, వారికి దానం చేయడం, వారితో మంచి పొరుగువారిగా మెలగడం, వారి అవసరాలను తీర్చడంలో వారికి సహాయం చేయడం, వారి మతంతో సంబంధం లేని వారి కార్యక్రమాలలో పాలుపంచుకోవడం, మరియు వివాహం తదితర సందర్భాలలో వారు ఇచ్చే ఆహ్వానానికి హాజరుకావడం ఇమిడి ఉన్నాయి. అయితే మనిషి తన ధర్మాన్ని (దీన్ ను) సురక్షితంగా ఉంచుకోవాలనే షరతు ఉంది, మరియు వారు అందులో మద్యం సేవించడం లాంటి నిషిద్ధ కార్యాలను (మున్కర్ ను) బహిర్గతం చేయకూడదు. అస్మా బిన్త్ అబూబకర్ రజియల్లాహు అన్హుమా తెలియజేశారు, ఆమె ఇలా అన్నారు: దైవప్రవక్త ఖురైష్తో ఒప్పందం కుదుర్చుకున్న రోజుల్లో ఒకసారి మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. అప్పటికి ఆమె ఇంకా బహుదైవారాధకురాలిగానే ఉంది. అప్పుడు నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగాను: “ఓ దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?” అందుకాయన “అవును, నువ్వు నీ అమ్మ పట్ల సత్ప్రవర్తనతో మెలగాలి” అని అన్నారు. [ఈ హదీసును బుఖారీ, హదీథు సంఖ్య (2620) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (1003) లో ఉల్లేఖించారు].
వారి పట్ల చూపే అత్యంత గొప్ప ఉపకారం మరియు సదాచరణ, వారిని ఇస్లాం వైపునకు ఆహ్వానించడమే. దావా మరియు ఫికహ్ గ్రంథాలలో వివరించబడినట్లుగా, నిస్సందేహంగా ఇస్లాం వైపునకు ఆహ్వానించడం అనేది దశలవారీగా జరుగుతుంది.
జిమ్మీ లేదా ముఆహిద్ (ఒప్పందం కుదుర్చుకున్న) అవిశ్వాసికి ముస్లింలపై హక్కులు ఉన్నాయి, కాబట్టి అతణ్ణి చంపడం సంగతి అటుంచితే, కనీసం అతడిని బాధపెట్టడం కూడా అనుమతించబడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తిని హతమార్చినవాడు స్వర్గపు పరిమళాన్ని కూడా పీల్చలేడు, నిశ్చయంగా స్వర్గపు పరిమళం నలభై సంవత్సరాల ప్రయాణవ్యత్యాసం వరకు వ్యాపించి ఉంటుంది. [దీనిని బుఖారీ (3166) ఉల్లేఖించారు], కావున ఇస్లాము న్యాయం, సమతుల్యత మరియు కరుణ యొక్క ధర్మం.
***
(మతాలు మరియు వర్గాల విభాగము)
ప్రశ్న:
ముస్లింలు ఒకే గ్రంథాన్ని అనుసరిస్తున్నప్పటికీ, వారు ఎందుకు తెగలుగా మరియు వర్గాలుగా విడిపోయారు?
సమాధానం:
ఈ ప్రశ్నకు సమాధానం ఐదు అంశాలలో ఉంటుంది, అవి:
మొదటిది: విభేదాలు మరియు భేదాభిప్రాయాలు అనేవి అల్లాహ్ మానవజాతిని సృష్టించిన విశ్వ నియమం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు. నీ ప్రభువు కరుణించినవాడు తప్ప! మరియు దాని కొరకే ఆయన వారిని సృష్టించాడు. మరియు నీ ప్రభువు: "నేను జిన్నాతులు మరియు మానవులు అందరితో నరకాన్ని నింపుతాను!" అని అన్నమాట నెరవేరుతుంది.﴿ [సూరతు హూద్: 118-119]
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: «యూదులు డబ్బై ఒకటి లేదా డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు. మరియు క్రైస్తవులు కూడా అదే విధంగా విడిపోయారు. మరియు నా సమాజం (ఉమ్మత్) డబ్బై మూడు వర్గములుగా విడిపోతుంది.» [దీనిని తిర్మిజీ ఉల్లేఖించారు, మరియు అన్నారు: హసన్ సహీహ్ హదీథ్].
రెండవది: ధర్మము అల్లాహ్ వద్ద నుండి వచ్చిన సత్యమే అయినట్లయితే, దాని అనుచరులు దానిపై విభేదించినప్పటికీ ఆ విభేదాల కారణంగా ధర్మము నిందించబడదు; బదులుగా, సత్య ధర్మాన్ని వీడి మరియు జమాఅత్‌ను వదిలిపెట్టిన వారు మాత్రమే నిందించబడతారు.
మూడవది: ప్రజలు విభేదించినప్పుడు మనము ఎవరిని అనుసరించాలి? మనము ఎవరితో కలిసి ఉండాలి? మరియు విభేదించే వారు ఎక్కువైనప్పుడు సత్యం ఎవరితో ఉంటుంది? అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనకు వివరించారు. మరియు వర్గాలుగా చీలిపోవడం గురించి ప్రస్తావించిన తరువాత, ఒకే ఒక వర్గం తప్ప మిగిలిన వర్గాలన్నీ మార్గభ్రష్టత్వంలో ఉన్నాయని, ఆ ఒక్క వర్గమే సత్యంపై ఉందని స్పష్టపరుస్తూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "వారందరూ నరకంలోకి పోతారు, ఒక్క వర్గం మినహాయించి." వారు అడిగారు: "ఏది అది, ఓ ప్రవక్తా?" ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు: "నేను మరియు నా సహాబాలు ఉన్న మార్గంను అనుసరించినవారు." [సునన్ తిర్మిజీ (2641)].
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "«నిశ్చయంగా రెండు గ్రంథాల ప్రజలు తమ ధర్మంలో డబ్బై రెండు వర్గములుగా విడిపోయారు. మరియు ఈ సమాజం డబ్బై మూడు వర్గములుగా విడిపోతుంది - అనగా: మనోవాంఛలు - ఒక వర్గము తప్ప అన్ని వర్గములు నరకములో ఉంటారు, మరియు అది జమాఅత్.»" [ముస్నద్ అహ్మద్ (16937), అబూదావూద్ (4597)].
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "నిజానికి, మీలో ఎవరైతే (నా తర్వాత) జీవించి ఉంటారో, వారు చాలా విభేదాలు చూస్తారు. ధర్మంలో కొత్తగా ఆవిష్కరించబడిన విషయాలకు దూరంగా ఉండండి. ఎందుకంటే అవి మార్గభ్రష్టత. కనుక మీలో ఎవరైతే ఆ పరిస్థితిని చూస్తారో, వారు నా విధానాన్ని (సున్నతులను) మరియు సన్మార్గగాములైన మార్గదర్శక ఖలీఫాల విధానాన్ని ఖచ్చితంగా అనుసరించాలి. దానిని మీ దవడ పళ్ళతో గట్టిగా కరిచి పట్టుకోండి." [సుననె తిర్మిజీ (2676, మరియు సుననె ఇబ్నె మాజ 43), మరియు తిర్మిజీ ఈ హదీసు హసన్ (ఉత్తమ) మరియు సహీహ్ (ప్రామాణిక) హదీసు వర్గీకరణకు చెందుతుందని పలికారు].
మరియు ఈ వర్గమే నిజమైన ఇస్లాంకు ప్రాతినిధ్యం వహిస్తుంది, అది జీవితంలోని అన్ని రంగాలలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు ఆయన సహచరులు అనుసరించిన మార్గం, మరియు వారే అహ్లె సున్నత్ వల్ జమాఅత్.
నాలుగు : యూదులు మరియు క్రైస్తవులు విభేదించారు, అందువలన వారిలో ఏ వర్గమూ సత్యంపై మిగిలి లేదు. అయితే ఈ ధర్మంలో మరియు ఇస్లామిక్ సమాజంలో, అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు ఈ సమాజం నుండి ఒక వర్గము ఎల్లప్పుడూ సరైన ధర్మంపై ఉంటుంది, దీని గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) శుభవార్త తెలిపినట్లుగా: నా ఉమ్మత్ నుండి ఒక సమూహం ఎల్లప్పుడూ సత్యంపై ప్రబలంగా ఉంటుంది. వారిని విడిచిపెట్టిన వారు వారికి హాని చేయలేరు, అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు వారు అలాగే ఉంటారు. [సహీహ్ ముస్లిం (170)].
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత అసహ్యకరమైనా! అల్లాహ్ తన జ్యోతిని వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు. బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే!﴿ [సూరతుస్ సఫ్: 8-9]
ఐదవది: ఇస్లాంలో విభేదాలు రెండు రకాలు: ఆమోదయోగ్యమైన విభేదం, ఇందులో విభేదించిన వ్యక్తి భ్రష్టుడు లేదా వక్రమార్గం పట్టినవాడు అని పరిగణించబడడు. ఇది కొన్ని ఫిఖ్హ్ సమస్యలలోని అనగా ఆచరణాత్మక శాఖా తీర్పులలోని విభేదం వలె ఉంటుంది. ఉదాహరణకు: శుచిత్వం, నమాజు, క్రయవిక్రయాలు మరియు న్యాయ సంబంధిత సమస్యలు. ఈ విభేదానికి గల కారణాలలో అవగాహనలోని వ్యత్యాసం ఒకటి. ప్రజలలో కొందరి మేధస్సు మరియు అవగాహన విస్తృతంగా మరియు సూక్ష్మంగా ఉంటుంది, కనుక ఇతరులు గ్రహించలేని విషయాన్ని వారు గ్రహిస్తారు. ఇతర కారణాలతో పాటు ప్రామాణిక ఋజువు అస్పష్టంగా ఉండటం కూడా దీనికి ఒక కారణం కావచ్చు. విభేదానికి గురైన ఇటువంటి సమస్యలు పండితుల ఇజ్తిహాద్కు అవకాశమున్న పరిధిలోనివే.
రెండవ రకం: నిషేధించబడిన భేదాభిప్రాయం, ఇది అనేక వాక్యాలలో ఖండించబడింది, వాటిలో అల్లాహ్ వాక్కు: ﴾నిశ్చయంగా, ఎవరైతే తమ ధర్మంలో విభేదాలు కల్పించుకొని, వేర్వేరు తెగలుగా చీలి పోయారో, వారితో నీకు ఎలాంటి సంబంధం లేదు. నిశ్చయంగా, వారి వ్యవహారం అల్లాహ్ ఆధీనంలో ఉంది. తరువాత ఆయనే వారు చేస్తూ వున్న కర్మలను గురించి వారికి తెలుపుతాడు. [సూరతుల్ అన్ఆమ్: 159] అల్లాహ్ వాక్కు: ﴾వారిలో ఎవరైతే, తమ ధర్మాన్ని విభజించి వేర్వేరు తెగలుగా చేసుకున్నారో! ప్రతివర్గం వారు తమ వద్దనున్న దాని (సిద్ధాంతం) తోనే సంతోషపడుతున్నారు.﴿ [సూరతుర్ రూమ్: 32] మరియు అది ప్రవక్తత్వం, విశ్వాసం, ఖదర్ (విధి), గుణగణాలు మరియు సహాబాల వంటి విశ్వాసానికి సంబంధించిన ప్రధాన విషయాలలో ఉన్న విభేదం. కావున వర్గములలో ఈ విషయాలలో వారి విభేదం సలఫ్ (పూర్వీకుల) ఏకాభిప్రాయానికి విరుద్ధంగా ఉన్నందున వారిని ఇస్లాం పరిధి నుండి వైదొలగేలా చేసేదిగా పరిగణించబడేవి ఉన్నవి, మరియు వాటిలో అలా పరిగణించబడనివి కూడా ఉన్నవి.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
ఇస్లాం ఇతర విశ్వాసాలను అంగీకరిస్తుందా?
సమాధానం:
నమ్మకాలకు మరియు ఆ నమ్మకాలను కలిగి ఉన్న వ్యక్తులకు మధ్య మనం తప్పనిసరిగా వ్యత్యాసాన్ని గుర్తించాలి. కనుక మనం ఇలా చెబుతాము: ప్రవక్తలు మరియు సందేశహరుల ధర్మానికి విరుద్ధమైన ప్రతి నమ్మకం, అనగా యూదత్వం మరియు క్రైస్తవం, బౌద్ధం, హిందూమతం మరియు వాటిని పోలివున్నవి ఏవైనా సరే; అవి తప్పుడు మరియు వ్యర్థమైన నమ్మకాలు. అవి అల్లాహ్ వద్ద ఆమోదయోగ్యం కానివి మరియు తిరస్కరించబడినవి. వారు ఏకైక అల్లాహ్ ను విశ్వసించి, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యదైవం లేడని మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రవక్త అని సాక్ష్యమిచ్చేంత వరకు, ఆ నమ్మకాలను అనుసరించే వారి నుండి ఎటువంటి ప్రాయశ్చిత్తంగానీ లేదా పరిహారంగానీ స్వీకరించబడదు. ఇవన్నీ అల్లాహ్ దృష్టిలో ముమ్మాటికి తప్పుడు మతాలు. అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿ [సూరతు ఆలి ఇమ్రాన్: 85] అల్లాహ్ వద్ద సమ్మతమైన సత్యధర్మం ఇస్లాం'యే, మహోన్నతుడైన ఊఅల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే. కాని పూర్వ గ్రంథ ప్రజలు పరస్పర ఈర్ష్యతో, వారికి జ్ఞానం లభించిన తరువాతనే భేదాభిప్రాయాలకు లోనయ్యారు. మరియు ఎవరైతే అల్లాహ్ సూచనలను తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతి శీఘ్రుడు (అని తెలుసుకోవాలి).﴿ [సూరతు ఆలే ఇమ్రాన్: 19]
అయితే ఈ మతాలను అనుసరించే వారి పట్ల ఒక ముస్లిం విధిగా పాటించవలసిన విషయాలు:
మొదటిది: అత్యుత్తమ ధర్మసమ్మతమైన పద్ధతుల ద్వారా వారిని ఇస్లాం ధర్మం వైపునకు ఆహ్వానించటం మరియు వారికి అల్లాహ్ ధర్మాన్ని స్పష్టపరచటం; తద్వారా వారు జీవిస్తున్న ఈ అవిశ్వాసం నుండి విముక్తి పొందుతారు, అల్లాహ్ వైపునకు చేర్చే సన్మార్గంపై నడుస్తారు, ఆయన స్వర్గాన్ని పొందుతారు మరియు ప్రళయదినాన ఘోరమైన శిక్ష నుండి రక్షించబడతారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(ప్రజలను) వివేకంతోనూ, మంచి ఉపదేశం (ప్రచారం) తోనూ నీ ప్రభువు మార్గం వైపునకు ఆహ్వానించు. మరియు వారితో ఉత్తమరీతిలో వాదించు. నిశ్చయంగా, నీ ప్రభువుకు తన మార్గం నుండి భ్రష్టుడైన వాడెవడో తెలుసు. మరియు మార్గదర్శకత్వం పొందిన వాడెవడో కూడా ఆయనకు బాగా తెలుసు.﴿ [సూరతు న్నహ్ల్: 125] మరియు ఇస్లాం వైపుకు ఆహ్వానం బలవంతంగా ఉండరాదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.﴿ [సూరతుల్ బఖరహ్: 256]
రెండవది: ముస్లిం వారి పట్ల న్యాయశీలతను కలిగి ఉండటం విధి: వారికి అన్యాయం చేయరాదు లేదా వారి హక్కుల పట్ల లోపం చేయరాదు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును.﴿ [సూరతుల్ మాయిదహ్: 8]
అదేవిధంగా ఒక ముస్లింకు ఇలా ఆజ్ఞాపించడం జరిగింది: ఇతర మతస్థులు అతనితో మంచిగా వ్యవహరిస్తూ, అతనికి అన్యాయం చేయనంత వరకు, అతను వారి పట్ల ఉత్తమంగా మెలగాలి, వారికి ఉపకారము చేయాలి, వారి పట్ల దయ చూపాలి, వారితో మంచి వ్యవహారము కలిగి ఉండాలి, వారికి ఎలాంటి కీడు చేయకుండా ఆగిఉండాలి మరియు వారితో మంచి మాటలు మాట్లాడాలి. అయితే వారితో చేసే ఈ వ్యవహారం మద్యం విక్రయించడం లేదా వడ్డీతో వ్యవహరించడం వంటి షరీయతు బద్దంగా హరాము అయిన విషయాలలో ఉండరాదు. మరియు వారితో వ్యవహరించడం ద్వారా ముస్లిం ఏ విధమైన అవమానానికీ గురికాకూడదు. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ కరుణ మరియు శాంతి కురియుగాక.
***
ప్రశ్న:
ఇస్లాం మరియు క్రైస్తవంలో ఒక మనిషికి కొన్ని విషయాల్లో పోలికలు ఎందుకు కనిపిస్తాయి?
సమాధానం:
దైవ సందేశాలన్నీ విశ్వాసపు మౌలిక సూత్రాలపై ఏకీభవిస్తున్నాయి, అవేమిటంటే: అల్లాహ్ పట్ల విశ్వాసం, దైవదూతలపై విశ్వాసం, దైవగ్రంధాలపై విశ్వాసం, దైవప్రవక్తల పట్ల విశ్వాసం, పరలోకదినాన్ని విశ్వసించడం మరియు విధివ్రాత (తక్దీర్) పట్ల విశ్వాసం కలిగి ఉండటం. అలాగే అవి షిర్క్ (అల్లాహ్ కు సాటికల్పించడం), కుఫ్ర్ (సత్యతిరస్కారం) మరియు నిఫాఖ్ (కపటం) లను నిషేధిస్తాయి, మరియు వ్యభిచారం, స్వలింగ సంపర్కం, హత్య, చేతబడి, అసూయ, మోసం, ప్రజల సొమ్మును అన్యాయంగా తినడం, పంది మాంసం తినడం మరియు మద్యం సేవించడం వంటి అశ్లీలపనులను, చెడు పనులను నేరంగా పరిగణిస్తాయి. ఇంకా సత్యం, దాతృత్వం, లజ్జ, ధైర్యం, సృష్టితాలతో సత్ప్రవర్తన, తల్లిదండ్రులకు విధేయత చూపడం మరియు అవసరార్థులకు ఖర్చు చేయడం వంటి ప్రశంసనీయమైన గుణాలను ఆదేశిస్తాయి, మరియు పిసినారితనం, పిరికితనం, అత్యాశ, అబద్ధం, పరోక్ష నింద మరియు చాడీలు చెప్పడం వంటి దుర్గుణాల నుండి వారిస్తాయి.
కావున యూదత్వం మరియు క్రైస్తవం ఇస్లాంతో ఏకీభవించే అంశాలు ఏవైతే మీరు చూస్తున్నారో, అవి ఆ రెండు ధర్మములలో మార్పుచేర్పులు చేయబడకుండా మిగిలి ఉన్నవే. మరియు ఈ దైవసందేశాల మూలం ఒకటే అని, మరియు అవి అల్లాహ్ వద్ద నుండి వచ్చినవని ఇది తెలియజేస్తుంది. మరియు మూసా,ఈసా అలైహిమస్సలాంల దైవసందేశం యొక్క కొనసాగింపుగా ఉన్న ఇస్లాంలోని సత్యాన్ని మానవుడు అనుసరించాలని, మరియు తిరస్కారం, బహుదైవారాధన మరియు మార్గభ్రష్టత్వం నుండి వైదొలగాలని ఇది నిర్ధారిస్తుంది మరియు తప్పనిసరి చేస్తుంది.
పాఠకుడు ఈ రెండు ధర్మాలలో ఇస్లాంకు విరుద్ధంగా ఏదైతే గమనిస్తాడో - యూదత్వంలో అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్తల పట్ల మరియు ఆయన ధర్మం పట్ల చేసే దుస్సాహసం, సృష్టితాలకు అన్యాయం చేయటం మరియు వడ్డీని ధర్మసమ్మతం చేయటం లాంటివి - ఇదంతా యూదుల అన్యాయం మరియు వారు అల్లుకున్న అసత్యాల నుండి వచ్చినదే. మరియు క్రైస్తవంలో పాఠకుడు త్రిత్వం, శిలువ వేయటం, మసీహ్ అలైహిస్సలాం యే రక్షకుడైన ప్రభువని మరియు ఆయన అల్లాహ్ కుమారుడని విశ్వసించటం, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వాన్ని తిరస్కరించటం, పంది మాంసాన్ని మరియు మద్యం సేవించటాన్ని ధర్మసమ్మతం చేయటం గురించి ఏదైతే గమనిస్తాడో - ఇదంతా క్రైస్తవులు చేసిన మార్పుచేర్పులు, వారి అతిక్రమణ, వారి అతివాదం మరియు వారి మార్గభ్రష్టత్వం నుండి వచ్చినదే.
క్రైస్తవ మతంపై విగ్రహారాధన ప్రభావం గురించి తెలుసుకోవడానికి చూడండి- “హిదాయతుల్ హియారా ఫీ అజ్విబతిల్ యహూద్ వన్నసారా” ప్రచురణ: దార్ ఆలముల్ ఫవాయిద్ (పేజీ: 53), ఇందులో పరిశోధకుడు ఫుట్‌నోట్‌లో ఎనిమిది మూలాలను పేర్కొన్నారు, మరియు ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అత్తన్నీర్ రచించిన ఈ పుస్తకాన్ని కూడా చూడండి- “అల్ అఖాయిదుల్ వసనియ్య ఫిద్దియానతిన్నస్రానియ్య”.
***
ప్రశ్న:
పవిత్ర గ్రంథం నిజంగా అల్లాహ్ యొక్క గ్రంథమేనా?
సమాధానం:
నేడు యూదులు లేదా క్రైస్తవుల చేతుల్లో ఉన్న పవిత్ర గ్రంథము మొత్తంగా మహోన్నతుడైన అల్లాహ్ గ్రంథము కాదు; ఎందుకంటే అందులో వక్రీకరణ జరిగింది, మరియు అందులో వక్రీకరణకు గురికాని భాగం ఏదైతే ఉందో అది పవిత్ర ఖుర్ఆన్ కు అనుగుణంగా ఉంటుంది. ఈ తీర్పు ఆ గ్రంథాన్ని మొత్తంగా, అంటే మొదటి నుండి చివరి వరకు పరిగణనలోకి తీసుకుని ఇవ్వబడింది; ఎందుకంటే అసలు తౌరాత్ మరియు ఇంజీలు సత్యమైనవి. కాబట్టి మూసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన తౌరాత్ ను మరియు ఈసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన ఇంజీలు ను తప్పక విశ్వసించాలి, -కానీ అనుసరించాల్సింది మాత్రం పవిత్ర ఖుర్ఆన్ ను-, మరియు వాటిలో పెంచడం, తొలగించడం మరియు మార్చడం ద్వారా వక్రీకరణ జరిగింది. ఇది నిర్ధారించబడిన తరువాత, నేడు అందుబాటులో ఉన్న తౌరాత్ మరియు ఇంజీలు ప్రతులను అవమానించడం అనుమతించబడదు; దీనికి రెండు కారణాలు ఉన్నాయి: మొదటిది, వక్రీకరణకు గురికాని భాగాన్ని అవమానం నుండి సంరక్షించడం కోసం, మరియు రెండవది, ఆ గ్రంథం యొక్క అసలు మూలాన్ని దృష్టిలో ఉంచుకుని. అయితే దీని అర్థం వాటిని చదవడం లేదా వాటిలోని విషయాలను ఆచరించడం అనుమతించబడిందని కాదు. కానీ ఇస్లాం న్యాయం మరియు నిష్పక్షపాతంతో కూడిన ధర్మం, కాబట్టి సత్యం మరియు అసత్యం కలగలిసిపోయిన విషయాలలో వివరంగా తీర్పు ఇవ్వబడుతుంది. జహబీ ఇలా అన్నారు: "«మరియు అల్లాహ్ మూసా అలైహిస్సలాం పై అవతరింపజేసిన తౌరాత్ ను మేము గౌరవిస్తాము మరియు దానిని మేము విశ్వసిస్తున్నాము. అయితే ఈ దారితప్పిన వారి చేతుల్లో ఉన్న ఈ గ్రంధాలైతే, అసలు అవి ఏమిటో మాకు తెలియదు, మరియు మేము ఆగుతాము, కావున వాటి పట్ల గౌరవంగా గానీ లేదా అవమానంగా గానీ వ్యవహరించము. బదులుగా ఇలా అంటాము : మేము అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంధాలను మరియు ఆయన సందేశహరులను విశ్వసించాము. మరియు ఈ విషయంలో ఈ సంగ్రహమైన విశ్వాసమే మాకు సరిపోతుంది, మరియు సర్వ ప్రశంసలు అల్లాహ్ కొరకే»." చూడండి: సియరు ఆలామిన్ నుబలా, ముద్రణ: అర్'రిసాలా 2/419.
***
ప్రశ్న:
ముస్లిములు అల్లాహ్ ప్రవక్త అయిన ఈసా అలైహిస్సలాం ను ద్వేషిస్తారా?
సమాధానం:
మసీహ్ అలైహిస్సలాం అనగా మర్యమ్ అలైహస్సలాం కుమారుడైన ఈసా. ఆయన అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరు మరియు వారిలో ఆయన 'ఉలుల్ అజ్మ్' (దృఢ సంకల్పం గల) ప్రవక్తలలో ఒకరు. ఉలుల్ అజ్మ్ ప్రవక్తలు ఐదుగురు, వారు: నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా మరియు ముహమ్మద్ అలైహిముస్సలాతు వస్సలాం. ఇస్లాంలో ప్రవక్తలను విశ్వసించడం అనేది విశ్వాస మూలస్తంభాలలో ఒకటి, మరియు ఈసా అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడని, ఆయన ప్రవక్త అని విశ్వసించే వరకు ఏ వ్యక్తి విశ్వాసం ఆమోదయోగ్యం కాదు. ఇది ఆయనను ఘనపరచడాన్ని, ప్రేమించడాన్ని మరియు సత్కరించడాన్ని తప్పనిసరి చేస్తుంది. మరియు ఆయనపై విశ్వాసం ఉంచడం, ఆయనను ప్రేమించడం మరియు సత్కరించడం అనేది ఆయన విషయంలో మితిమీరి ప్రవర్తించడాన్ని మరియు ఆయనను ప్రభువుగా మరియు ఆరాధ్యుడిగా చేసుకోవడాన్ని నిరోధిస్తుంది.
క్రైస్తవులు విశ్వసించే విధంగా, ఈసా మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కుమారుడు (దైవకుమారుడు) కాడు. మసీహ్ అలైహిస్సలాం అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు, మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ). మరియు ఆయన (అల్లాహ్) తరుపు నుండి వచ్చిన ఆ ఆత్మ (రూహ్), అల్లాహ్ తఆలా చేత సృష్టించబడిన ఆత్మ. దానిని ఆయన (అల్లాహ్) అదనపు గౌరవ మర్యాదలతో ఇతరులకన్నా ప్రత్యేకించాడు.
మసీహ్ అలైహిస్సలామ్ మరియు మిగతా ప్రవక్తలందరినీ (వారందరిపై శాంతి కలుగుగాక) విశ్వసించేంత వరకు ఒక వ్యక్తి ఇస్లాం సరైనది కాదు. ఇస్లాంలో ప్రవక్తలలో ఏ ఒక్కరినైనా ద్వేషించడం అనుమతించబడదు, మరియు ఎవరైనా ఒక ప్రవక్తను ద్వేషించినట్లయితే అతడు అవిశ్వాసిగా మారి ధర్మం నుండి బయటకు వెళ్ళిపోతాడు.
***
ప్రశ్న:
ఈసా అలైహిస్సలాం అల్లాహ్ కుమారుడా?
సమాధానం:
అల్లాహ్ పరమపవిత్రుడు, ఆయన సర్వలోకాల ప్రభువు, మరియు ఆయన మొదటివాడు మరియు చివరివాడు, ه అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇలా అను: "ఆయనే అల్లాహ్! ఏకైకుడు. అల్లాహ్! ఎవరి అక్కరా లేని వాడు. ఆయనకు సంతానం లేదు (బిడ్డలను కనడు) మరియు ఆయన కూడా ఎవరి సంతానమూ (ఎవరికీ జన్మించిన వాడునూ) కాడు. మరియు (సర్వలోకాలలో) ఆయనతో పోల్చదగినది ఏదీ లేదు.﴿ [సూరతుల్ ఇఖ్లాస్: 1-4] మరియు ఆయన ఎవరికీ జన్మనిచ్చినవాడు కానప్పుడు, పరిశుద్ధుడు మరియు మహోన్నతుడైన ఆయనకు తన సృష్టిలో ఎవరూ సంతానము కారు. సంతానమును ఏర్పరచుకునే వానికే సహాయకులు మరియు మద్దతుదారుల అవసరం ఉంటుంది. కావున మానవుడు తనకు అండగా ఉండటానికి, వారి రాకతో సంతోషించడానికి మరియు జీవిత కష్టాలలో తనకు సహాయపడటానికి సంతానాన్ని కోరుకుంటాడు. కానీ మహోన్నతుడైన ప్రభువు విషయానికి వస్తే, భూమ్యాకాశాలు మరియు వాటిలో ఉన్న సమస్తం ఆయన ఆధిపత్యంలోనే ఉన్నాయి. కాబట్టి ఆయనకు ఎటువంటి సంతానము అవసరం లేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు. ఆయన సజీవుడు, విశ్వవ్యవస్థకు ఆధార భూతుడు. ఆయనకు కునుకు రాదు మరియు నిదుర రాదు. భూమ్యాకాశాలలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే.﴿ [సూరతుల్ బఖరహ్: 255] కావున ఆయన సజీవుడు, ప్రతి జీవి తన ఉనికిని మరియు జీవనాన్ని ఆయన నుండే పొందుతుంది. మరియు ఆయన ఆధారభూతుడు, ప్రతి జీవి నిలకడ ఆయనపైనే ఆధారపడి ఉంది మరియు ఆయన అవసరం లేకుండా ఏదీ ఉండజాలదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.﴿ [సూరతు సబా: 1], ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందినప్పుడు, ఆయన సంపూర్ణత మరియు స్వయం సమృద్ధి కారణంగా ఇహలోకంలో మరియు పరలోకంలో ఆయనే ప్రశంసనీయుడైనప్పుడు, అల్లాహ్‌కు ఒక కుమారుడు ఉన్నాడని ఎవరైనా ఎలా వాదించగలరు? వారు చెప్పే దాని నుండి అల్లాహ్ మహోన్నతుడు మరియు పవిత్రుడు.
అల్లాహ్ కు సంతానము ఉన్నదనే మరియు దైవదూతలు అల్లాహ్ కుమార్తెలనే వాదన, ఒక అత్యంత చెడ్డ మరియు అవిశ్వాసపు వాదన. అల్లాహ్ తన పవిత్ర గ్రంథంలోని పలు స్థానాల్లో దానిని అబద్ధమని తెలిపాడు, మరియు ఈ అవిశ్వాసపు మాట పూర్వపు అవిశ్వాసుల మాట అని స్పష్టపరిచాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడు: ﴾మరియు యూదులు ఉజైర్ అల్లాహ్ కుమారుడని అంటారు. మరియు క్రైస్తవులు మసీహ్ (క్రీస్తు) అల్లాహ్ కుమారుడని. ఇవి వారు తమ నోటితో అనే మాటలే. ఇంతకు పూర్వపు సత్యతిరస్కారులు పలికిన మాటలనే వారు అనుకరిస్తున్నారు. అల్లాహ్ వారిని నశింపజేయుగాక! వారెంత మోసగింపబడుతున్నారు (సత్యం నుండి మరలింప బడుతున్నారు)!﴿ [సూరతు అత్తౌబా: 30] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వారు, ఆయన (అల్లాహ్) సృష్టించిన జిన్నాతులను, అల్లాహ్ కే సాటిగా (భాగస్వాములుగా) కల్పిస్తున్నారు. మూఢత్వంతో ఆయనకు కుమారులు, కుమార్తెలు ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు, వారి ఈ కల్పనలకు మహోన్నతుడు.﴿ [సూరతుల్ అన్ఆమ్: 100] అల్లాహ్ అనేక ప్రమాణాలతో ఈ వాదనను అసత్యపరచాడు, వాటిలో ఉదాహరణకు (వీటికే పరిమితం కాకుండా) ఈ క్రిందివి ఉన్నాయి:
ఈ వాదనను మహోన్నతుడైన అల్లాహ్ ఖండించాడు: ఆయన భూమిని మరియు దానిలో ఉన్న వారందరినీ నాశనం చేయగల శక్తి కలవాడు. సృష్టిలో ఎవరైనా దేవుడై ఉంటే, వారు అల్లాహ్ ఆజ్ఞను తిప్పికొట్టి, నాశనం నుండి తప్పించుకునేవారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని అనే వారు నిస్సందేహంగా! సత్య తిరస్కారులు. (ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ (క్రీస్తు) ను అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే, ఆయనను ఆపగల శక్తి ఎవరికి ఉంది? మరియు ఆకాశాలలోను, భూమిలోను మరియు వాటి మధ్య ఉన్న సమస్తం మీద ఆధిపత్యం అల్లాహ్ దే. ఆయన తాను కోరినది సృష్టిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయ గల సమర్ధుడు.﴿ [సూరతుల్ మాయిద: 17] ఇబ్నె జరీర్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు : ""మరియు ఆయన వాక్యం: ﴾అల్లాహ్ గనక మర్యమ్ కుమారుడైన మసీహ్ ను, అతని తల్లిని మరియు భూమిపై ఉన్న వారందరినీ, నాశనం చేయగోరితే﴿, అంటే: ఒకవేళ ఆయన మర్యమ్ కుమారుడైన మసీహ్ ను భూమిపై నుండి తుదిముట్టించటం ద్వారా, మరియు అతని తల్లి మర్యమ్ ను తుదిముట్టించటం ద్వారా, మరియు భూమిపై ఉన్న సమస్త సృష్టిని అందరినీ తుదిముట్టించటం ద్వారా నాశనం చేయగోరితే, అల్లాహ్ ఆజ్ఞను ఏమాత్రం ఆపగల శక్తి ఎవరికి ఉన్నది?""
మహోన్నతుడైన అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఇలా సెలవిచ్చాడు: క్రైస్తవుల్లోని ఈ అజ్ఞానులతో మీరు ఇలా పలకండి: "ఒకవేళ మీరు వాదిస్తున్నట్లుగా మసీహ్ ఆయనే అల్లాహ్ అయి ఉంటే - వాస్తవానికి ఆయన అలా కాదు - అతనిని మరియు ఆయన తల్లిని నాశనం చేయటానికి అల్లాహ్ ఆదేశం వచ్చినప్పుడు, ఆ ఆదేశాన్ని ఆపే శక్తి అతనికి ఉండేది. ఆయన (అల్లాహ్) అతని తల్లిని నాశనం చేశాడు, ఆ ఆదేశం ఆమె పైకి వచ్చినప్పుడు దాన్ని ఆపే సామర్థ్యం అతనికి లేకపోయింది. కావున మీరు గుణపాఠం గ్రహిస్తే ఇందులో మీకు ఒక గుణపాఠం ఉంది, మరియు మీరు ఆలోచిస్తే మీపై ఒక ఆధారం ఉంది: అదేమిటంటే మసీహ్ ఆదమ్ సంతానంలోని ఇతరుల వలెనే ఒక మానవుడు, మరియు నిశ్చయంగా మహోన్నతుడైన అల్లాహ్ మాత్రమే ఓడించబడనివాడు, జయించబడనివాడు మరియు ఆయన ఆదేశాన్ని ఎవరూ ఆపలేరు. బదులుగా ఆయన ఎల్లప్పుడూ సజీవుడు, విశ్వాన్ని నిర్వహించేవాడు, ఆయనే బ్రతికిస్తాడు మరియు మరణింపజేస్తాడు, సృష్టిస్తాడు మరియు నాశనం చేస్తాడు, మరియు ఆయన ఎన్నటికీ మరణించని సజీవుడు." తబ్రీ వ్యాఖ్యానం = జామిఉల్ బయాన్ త. షాకిర్ (10/ 147).
ఎవరైతే ఈ అసత్య మరియు అన్యాయమైన వాదన చేస్తారో వారి వద్ద ఏదైనా ఆధారం ఉందా? లేక ఇది ఒక అబద్ధపు వాదనా, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ (ఒకడ్ని) కొడుకుగా చేసుకున్నాడు." అని వారు (యూదులు మరియు క్రైస్తవులు) అంటారు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన స్వయం సమృద్ధుడు. ఆకాశాలలోను మరియు భూమిలోనూ ఉన్నదంతా ఆయనకే చెందుతుంది! ఇలా అనటానికి మీ దగ్గర ఏదైనా నిదర్శనం ఉందా? ఏమీ? అల్లాహ్ ను గురించి మీకు తెలియని మాటలు అంటారా?﴿ [సూరతు యూనుస్: 68] ఆ విధంగా వాదించేవాడి వద్ద కేవలం ఊహలు మరియు అంచనాలు తప్ప మరేమీ లేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిశ్చయంగా, ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలోంచి తనకు కుమారునిగా ఉండేవారిని ఎన్నుకొని ఉండేవాడు. కానీ ఇది బుద్ధిపరంగానూ మరియు ధర్మపరంగానూ ఎంతమాత్రం సమ్మతం కాదు. సర్వలోపాలకు అతీతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: ﴾ఒకవేళ అల్లాహ్ ఎవరినైనా కుమారునిగా చేసుకోదలిస్తే, తన సృష్టిలో తాను కోరిన వానిని ఎన్నుకొని ఉండేవాడు. ఆయన సర్వలోపాలకు అతీతుడు. ఆయన అల్లాహ్! అద్వితీయుడు, తన సృష్టి మీద సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు.﴿ [సూరతు జ్జుమర్: 4]
ఎవరైతే సంతానం కలిగి ఉన్నారో అతనికి తప్పకుండా భార్య ఉండాలి, ఆమె నుండే సంతానం కలుగుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు.﴿ [సూరతుల్ అన్ఆమ్: 101] వాస్తవానికి, అల్లాహ్ యే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు, కావున ఆయనకు కొడుకు ఉండడు.
ఒకవేళ కరుణామయునికి కుమారుడు ఉంటే - అల్లాహ్ దాని నుండి పెద్ద పవిత్రుడు మరియు గొప్పవాడు - అతను ఆరాధ్యుడు అయ్యేవాడు, మరియు ఒకవేళ అతను ఆరాధ్యుడు అయితే తప్పనిసరిగా ఒకరు మరొకరిపై ఆధిపత్యం పొందుతారు, మరియు ఓడిపోయినవాడు ఖచ్చితంగా ఆరాధ్యుడు కాజాలడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾వారితో అను: "ఒకవేళ వారు వారన్నట్లు అల్లాహ్ తో పాటు ఇతర ఆరాధ్య దైవాలే ఉన్నట్లైతే, వారు కూడా (అల్లాహ్) సింహాసనానికి (అర్ష్ కు) చేరే మార్గాన్ని వెతికే వారు కదా!﴿ [సూరతుల్ ఇస్రా: 42] ఒకవేళ (రెండింటిలో) అందులో అల్లాహ్ కాకుండా ఇతర దేవతలు ఉండి ఉంటే, ఆకాశం మరియు భూమి నాశనమై ఉండేవి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.﴿ [సూరతుల్ అంబియా: 22]
అల్లాహ్ గ్రంథప్రజలను మసీహ్ అలైహిస్సలాం విషయంలో హద్దుమీరడాన్ని, మరియు ఆయన గురించి ఆయన అల్లాహ్ కుమారుడని, లేక (ఆరాధ్య దైవాలు) ముగ్గురిలో ఒకడని, లేక ఆయనే అల్లాహ్ అని వారు పలకడాన్ని వారించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ గ్రంథప్రజలారా! మీరు మీ ధర్మ విషయంలో హద్దుమీరి ప్రవర్తించకండి. మరియు అల్లాహ్ ను గురించి సత్యం తప్ప వేరే మాట పలుకకండి. నిశ్చయంగా, మర్యమ్ కుమారుడైన ఈసా మసీహ్ (ఏసు క్రీస్తు), అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన (అల్లాహ్) మర్యమ్ వైపునకు పంపిన, ఆయన (అల్లాహ్) యొక్క ఆజ్ఞ (కలిమ) మరియు ఆయన (అల్లాహ్) తరఫు నుండి వచ్చిన ఒక ఆత్మ (రూహ్). కావున మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మరియు (ఆరాధ్య దైవాలు): "ముగ్గురు!" అని అనకండి. అది మానుకోండి, మీకే మేలైనది! నిశ్చయంగా, అల్లాహ్ ఒక్కడే ఆరాధ్య దైవం. ఆయనకు కొడుకు ఉన్నాడనే విషయానికి ఆయన అతీతుడు. ఆకాశాలలో ఉన్నదంతా మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు కార్యకర్తగా అల్లాహ్ మాత్రమే చాలు.﴿ [సూరతున్నిసా: 171]
ఈసా అలైహిస్సలాంను దైవకుమారుడు అని విశ్వసించేవాడు అవిశ్వాసి, మరియు ఆయన (అలైహిస్సలాం) ప్రవక్త అని విశ్వసించేంత వరకు ఏ వ్యక్తి ఇస్లాం సరైనది కాదు. పవిత్ర ఖుర్ఆన్ గ్రంధంలో మర్యమ్ మరియు ఈసా అలైహిమస్సలాంల వృత్తాంతం సూరా ఆల్ ఇమ్రాన్, సూరా అల్ మాయిదా మరియు సూరా మర్యమ్ వంటి పలు సూరాలలో వివరించబడినది మరియు సున్నత్ లోని అనేక హదీసులలో దీని ధృవీకరణ వచ్చినది.
చూడండి: మిఫ్తాహు దారుస్సఆదతు-సంపుటం1పేజీ 303, మసీహ్ పట్ల నాకున్న గొప్ప ప్రేమ నన్ను ఇస్లాం వైపుకు నడిపించింది పేజీ 169.
***
ప్రశ్న:
మసీహ్ ఈసా అలైహిస్సలాం శిలువ వేయబడ్డారా?
సమాధానం:
మసీహ్ ఈసా అలైహిస్సలాం శిలువ వేయబడలేదు, బదులుగా ఆయన ఆకాశానికి ఎత్తుకోబడ్డారు. ఆయన ఇప్పుడు రెండవ ఆకాశంలో సజీవంగా ఉన్నారు, చనిపోలేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు. ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో! మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు! (జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.﴿ [సూరతు ఆలి ఇమ్రాన్: 52-55] మరియు ప్రళయ దినానికి ముందు ఆయన దిగివస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.﴿ [సూరతుల్ జుఖ్'రుఫ్: 61] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.﴿ [సూరతున్నిసా: 159]
మరియు ఈసా (అలైహిస్సలాం) దిగివచ్చినప్పుడు మసీహ్ దజ్జాల్‌ను చంపుతారు, మరియు ఇస్లాం ప్రకారం తీర్పునిస్తారు, శిలువను విరిచేస్తారు, పందిని చంపుతారు, జిజియాను ఎత్తివేస్తారు మరియు దానిని స్వీకరించరు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”" [సహీహ్ బుఖారీ (2222) మరియు సహీహ్ ముస్లిం (242)].
***
ప్రశ్న:
ఈసా అలైహిస్సలాం పట్ల విశ్వాసాన్ని ఇస్లాం ఎలా వివరిస్తుంది?
సమాధానం:
ఈసా అలైహిస్సలాం సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరు, మరియు ఆయన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే పూర్వం వచ్చిన ప్రవక్త. ఆయన ప్రవక్తలలో (వారిపై అల్లాహ్ శాంతి, శుభాలు కురియుగాక) ఊలిల్ అజమ్ (దృఢసంకల్పం కలిగినవారు) లలో ఒకరు. ఖుర్ఆన్ ఆయన గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించింది, మరియు ఆయన గొప్పతనాన్ని, ఇంకా ఆయన అల్లాహ్ దృష్టిలో అత్యంత గౌరవనీయుడు అని పేర్కొన్నది. మహోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ﴾దైవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు.﴿ [సూరతు ఆలి ఇమ్రాన్: 45] మరియు పవిత్ర ఖుర్ఆన్ మర్యమ్ మరియు ఈసా అలైహిమస్సలాంల గాధను సూరహ్ ఆలె ఇమ్రాన్, సూరహ్ మాయిదా మరియు సూరహ్ మర్యమ్ లాంటి అనేక సూరాలలో వివరించింది. మరియు సున్నత్ లోని అనేక హదీసులలో కూడా ఇది వచ్చినది. దీనంతటి ద్వారా అల్లాహ్ వద్ద, పవిత్ర ఖుర్ఆన్ లో, ప్రవక్త సున్నత్ లో మరియు ముస్లిముల వద్ద ఆయనకు గల ఉన్నత స్థాయి స్పష్టమవుతుంది.
మరియు ఇందులో ప్రస్తావించబడినదేమిటంటే, అల్లాహ్ ఈసా అలైహిస్సలాంను ఒక అసాధారణ అద్భుత నిదర్శనంగా సృష్టించాడు, అనగా ఆయనను తండ్రి లేకుండా తల్లితో సృష్టించాడు, పైగా ఆయన అతనితో కేవలం ఇలా అన్నాడు: 'కున్', (అయిపో) అద అయిపోయింది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾దైవదూతలు ఇలా అన్నది (జ్ఞాపకం చేసుకోండి): "ఓ మర్యమ్! నిశ్చయంగా, అల్లాహ్! నీకు తన వాక్కును గురించి శుభవార్తను ఇస్తున్నాడు. అతని పేరు: "మసీహ్ ఈసా ఇబ్నె మర్యమ్. అతను ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ గౌరవనీయుడైనవాడై మరియు (అల్లాహ్) సామీప్యం పొందినవారిలో ఒకడై ఉంటాడు. మరియు అతను ప్రజలతో ఉయ్యాలలో ఉండగానే మాట్లాడుతాడు మరియు పెద్దవాడైన తరువాత కూడా (మాట్లాడుతాడు) మరియు సత్పురుషులలో ఒకడై ఉంటాడు. ఆమె (మర్యమ్) ఇలా అన్నది: "ఓ నా ప్రభూ! నాకు కుమారుడు ఎలా కలుగుతాడు? ఏ పురుషుడు కూడా నన్ను ముట్టలేదే?" ఆయన ఇలా సమాధాన మిచ్చాడు: "అల్లాహ్ తాను కోరింది ఇదే విధంగా సృష్టిస్తాడు. ఆయన ఒక పని చేయాలని నిర్ణయించినపుడు కేవలం దానిని : 'అయిపో!' అని అంటాడు, అంతే అది అయిపోతుంది.﴿ [సూరతు ఆలే ఇమ్రాన్: 45 - 47]
ఈ అసాధారణ జననం మసీహ్ అలైహిస్సలాంను దేవునిగా గానీ, దేవుని కుమారునిగా గానీ చేయదని అల్లాహ్ తెలిపాడు. బదులుగా ఆయన మనుషుల్లోంచి ఒక మనిషి. మరియు ఆయన, ఆయన తల్లిగారు వారిద్దరూ ఆహారం తినేవారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!﴿ [సూరతుల్ మాయిదా: 75] ఇబ్నె జరీర్ రహిమహుల్లాహ్ ఇలా సెలవిచ్చారు: "అబూ జాఫర్ ఇలా అన్నారు: ఇది మహోన్నతుడైన అల్లాహ్ తరఫున తెలుపబడిన ఒక వార్త, మసీహ్ గురించి క్రైస్తవుల (నసారాల) వాదనలను ఖండిస్తూ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఒక ఆధారంగా ఇది తెలుపబడింది. ఆయన ఇలా సెలవిస్తున్నాడు= యాకూబియా (యాకూబియా అనేది ఒక ప్రాచీన క్రైస్తవ వర్గం) వారి "ఆయనే అల్లాహ్" అనే వాదనను, మరియు ఇతరుల "అతను అల్లాహ్ కుమారుడు" అనే వాదనను అసత్యమని తెలుపుతూ=: మసీహ్ గురించి ఈ అవిశ్వాసులు చెప్పే మాట సత్యం కాదు, బదులుగా అతను మర్యమ్ కుమారుడు. తల్లులు తమ పిల్లలకు జన్మనిచ్చినట్లుగానే ఆమె అతనికి జన్మనిచ్చింది. ఇది మానవ లక్షణమే తప్ప, మానవుల సృష్టికర్త లక్షణం కాదు. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు, ఆ గతించిన ఇతర ప్రవక్తల వలెనే అతను కూడా అల్లాహ్ యొక్క ఒక ప్రవక్త మాత్రమే. అతను సత్యవంతుడని మరియు అల్లాహ్ సృష్టిలో ఎవరి వద్దకైతే పంపబడ్డాడో వారి కొరకు అల్లాహ్ పంపిన ప్రవక్త అని రుజువు చేయడానికి, అల్లాహ్ తాను దయదలచిన సూచనలను మరియు గుణపాఠాలను అతని చేతుల మీదుగా వెలువరించాడు. అతనికి పూర్వం వచ్చిన ప్రవక్తల చేతుల మీదుగా కూడా వారు సత్యమైన అల్లాహ్ ప్రవక్తలని రుజువు చేయడానికి సూచనలను మరియు గుణపాఠాలను ఏ విధంగానైతే వెలువరించాడో అదే విధంగా. ﴿మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్)﴾, అల్లాహ్ తఆలా తెలుపుతున్నాడు మసీహ్ తల్లి సత్యవతి అని. మరియు ఆయన వచనం: ﴿వారిద్దరూ ఆహారం తినేవారు﴾. ఇది మసీహ్ మరియు అతని తల్లి గురించి అల్లాహ్ తఆలా ఇస్తున్న వార్త: ఆదమ్ సంతతికి చెందిన ఇతర మానవుల వలెనే, వారి శరీరాలను నిలబెట్టడానికి మరియు పోషించడానికి అవసరమైన ఆహారపానీయాల అవసరం వారిద్దరికీ ఉండేది. ఎవరైతే ఆ విధంగా ఉంటారో, వారు ఆరాధ్యదైవం కాజాలరు; ఎందుకంటే ఆహారం అవసరమైన వాడు తన మనుగడ కోసం ఇతరులపై ఆధారపడి ఉంటాడు. తన మనుగడకై వేరొకరిపై ఆధారపడటంలో మరియు తనను పోషించేదాని పట్ల అవసరం కలిగి ఉండటంలో, అతని నిస్సహాయతకు స్పష్టమైన రుజువు ఉంది. మరియు నిస్సహాయుడు కేవలం పోషింపబడేవాడు మాత్రమే అవుతాడు కానీ, ప్రభువు కాజాలడు." తబ్రీ వ్యాఖ్యానం = జామిఉల్ బయాన్ త. షాకిర్ (10/ 485).
మరియు మసీహ్ అలైహిస్సలాంపై ఒక వర్గం వారు విశ్వాసమును కనబరిచారు మరియు మరో వర్గం వారు ఆయనను తిరస్కరించారు, అప్పుడు అల్లాహ్ విశ్వాసులకు అవిశ్వాసులపై విజయం ప్రసాదించాడు. ఏ వ్యక్తి అయినా ఈసా అలైహిస్సలాం ప్రవక్త అని, మరియు ఆయన అల్లాహ్ యొక్క దాసుడని, ఆయన ప్రవక్త అని విశ్వసించే వరకు అతని ఇస్లాం సరైనది కాదు. మరియు ఆయన దేవుడని లేదా దేవుళ్ళలో ఒక భాగమని నమ్మేవాడు అవిశ్వాసి.
మరియు ఈసా అలైహిస్సలాం శిలువ వేయబడలేదు, బదులుగా ఆయన ఆకాశంలోకి పైకి ఎత్తుకోబడ్డారు, కాబట్టి ఆయన రెండవ ఆకాశంలో సజీవంగా ఉన్నారు, మరణించలేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము" అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు. వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.﴿ [సూరతున్నిసా: 157-159]
మరియు ప్రళయ దినానికి ముందు ఆయన దిగివస్తాడు; మసీహ్ దజ్జాల్‌ను చంపుతాడు; ఇస్లాం ధర్మం ప్రకారం తీర్పునిస్తాడు; శిలువను విరిచేస్తాడు; మరియు పందిని చంపుతాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "“ఎవరి చేతిలోనైతే నా ప్రాణమున్నదో, ఆయన సాక్షిగా – త్వరలో మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగివస్తాడు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.”" "[సహీహ్ అల్ బుఖారీ (2222) మరియు సహీహ్ ముస్లిం (242)]." ఆ తరువాత ఆయన భూమిపై 40 సంవత్సరాల వరకు ఉంటారు, అనంతరం ఆయన మరణిస్తారు మరియు ముస్లింలు ఆయన జనాజా నమాజు చేస్తారు.
***
ప్రశ్న:
మసీహ్ అలైహిస్సలాం శిలువపై మరణించారని చెప్పే వారి అభిప్రాయాన్ని ఇస్లాం సమర్థించిందా?
సమాధానం:
ఈసా అలైహిస్సలాం కాలంలో శిలువ వేయబడిన ఒక సంఘటన జరిగిందనే దానిని ఇస్లాం తిరస్కరించదు, కానీ యూదులు ఈసా అలైహిస్సలాంను హత్యచేయడానికి మరియు ఆయనకు శిలువ వేయడానికి ప్రయత్నించారు. అప్పుడు అల్లాహ్ ఆయనను వారి నుండి రక్షించాడు మరియు ఆయనను పైకి ఎత్తుకున్నాడు, కాబట్టి వారు ఆయనకు ఎలాంటి హాని కలిగించలేకపోయారు. మరియు మరొక వ్యక్తిపై ఆయన రూపమును వేశాడు, అప్పుడు యూదులు ఆనాటి విగ్రహారాధకుడైన రోమన్ పాలకునితో కుట్ర పన్ని అతనిని పట్టుకున్నారు, మరియు అతనిని చంపి అతనికి శిలువ వేశారు, తాము ఈసా అలైహిస్సలాంను చంపామని మరియు ఆయనకు శిలువ వేశామని వారు భావించారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఈసా వారిలో సత్యతిరస్కారాన్ని కనుగొని ఇలా ప్రశ్నించాడు: "అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా ఎవరు ఉంటారు?" (అప్పుడతని) శిష్యులు ఇలా జవాబిచ్చారు: "మేము నీకు అల్లాహ్ మార్గంలో సహాయకులముగా ఉంటాము. మేము అల్లాహ్ ను విశ్వసించాము మరియు మేము అల్లాహ్ కు విధేయులము (ముస్లింలము) అయ్యామని, నీవు మాకు సాక్షిగా ఉండు. ఓ మా ప్రభూ! నీవు అవతరింప జేసిన సందేశాన్ని మేము విశ్వసించాము మరియు మేము ఈ సందేశహరుణ్ణి అనుసరించాము. కావున మమ్మల్ని సాక్షులలో వ్రాసుకో! మరియు వారు (ఇస్రాయీల్ సంతతిలోని అవిశ్వాసులు, ఈసా కు విరుద్ధంగా) కుట్రలు చేశారు. మరియు అల్లాహ్ (వారి కుట్రలకు విరుద్ధంగా) పన్నాగాలు పన్నాడు. ఎత్తులు వేయటంలో అల్లాహ్ అత్యుత్తముడు! (జ్ఞాపకం చేసుకోండి) అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు: "ఓ ఈసా! నేను నిన్ను తీసుకుంటాను మరియు నిన్ను నా వైపునకు ఎత్తుకుంటాను మరియు సత్యతిరస్కారుల నుండి నిన్ను శుద్ధపరుస్తాను మరియు నిన్ను అనుసరించిన వారిని, పునరుత్థాన దినం వరకు సత్యతిరస్కారులకు పైచేయిగా ఉండేటట్లు చేస్తాను. చివరకు మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీ మధ్య తలెత్తిన విభేదాలను గురించి తీర్పు చేస్తాను.﴿ [సూరతు ఆలి ఇమ్రాన్: 52-55], మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వారు: "నిశ్చయంగా, మేము అల్లాహ్ యొక్క సందేశహరుడు, మర్యమ్ కుమారుడైన, ఈసా మసీహ్ ను (ఏసు క్రీస్తును) చంపాము." అని అన్నందుకు. మరియు వారు అతనిని చంపనూ లేదు మరియు శిలువపై ఎక్కించనూ లేదు, కాని, వారు భ్రమకు గురి చేయబడ్డారు. నిశ్చయంగా, ఈ విషయాన్ని గురించి అభిప్రాయభేదం ఉన్నవారు దీనిని గురించి సంశయగ్రస్తులై ఉన్నారు. ఈ విషయం గురించి వారికి నిశ్చిత జ్ఞానం లేదు. వారు కేవలం ఊహనే అనుసరిస్తున్నారు. నిశ్చయంగా, వారు అతనిని చంపలేదు. వాస్తవానికి, అల్లాహ్ అతనిని (ఈసాను) తన వైపునకు ఎత్తుకున్నాడు మరియు అల్లాహ్ సర్వశక్తి సంపన్నుడు, మహా వివేకవంతుడు. మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.﴿ [సూరతున్నిసా: 157-159]
మసీహ్ ఈసా బిన్ మర్యమ్ (అలైహిస్సలాం) శిలువ వేయబడలేదు మరియు చంపబడలేదు, దానికి బదులుగా అల్లాహ్ ఆయనను తన వైపునకు పైకి ఎత్తుకున్నాడు. మరియు ఆయన ఇప్పుడు రెండవ ఆకాశంలో ఉన్నారు, ప్రళయదినానికి ముందు ఆయన దిగివస్తారు. ఆయన దిగిరావటం ప్రళయదినం యొక్క గొప్ప సూచనలలో ఒకటిగా ఉంటుంది. అప్పుడు ఆయన మసీహ్ దజ్జాల్ ను చంపుతారు; అల్లాహ్ ను కాదని ఆరాధించబడిన మరియు ఆయన దానిపై శిలువ వేయబడ్డాడని క్రైస్తవులు అబద్ధం కల్పించిన శిలువను విరిచేస్తారు; పందిని చంపుతారు; మరియు ఇస్లామీయ షరియత్ ప్రకారం తీర్పునిస్తారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరియం కుమారుడు (ఈసా అలైహిస్సలాం) ఒక ధర్మబద్ధుడైన న్యాయమూర్తిగా మీ మధ్యకు (భువి నుండి) దిగిరానంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. అతడు శిలువను విరిచేస్తాడు; పందిని చంపుతాడు; మరియు జిజియాను ఎత్తివేస్తాడు; అప్పుడు సంపద ఎంత పుష్కలంగా ఉంటుందంటే, ఎవరూ దానిని స్వీకరించరు.” [సహీహ్ బుఖారీ (2476) మరియు ముస్లిం (155)].
***
ప్రశ్న:
క్రైస్తవులు స్వర్గంలో ప్రవేశిస్తారా?
సమాధానం:
భూమ్యాకాశాలపై అధికారము అల్లాహ్ కే కలదు. ఆయన తాను కోరినది చేస్తాడు మరియు ఎంచుకుంటాడు, మరియు స్వచ్ఛమైన ధర్మం ఆయనకే చెందుతుంది. కావున సృష్టి ఆయనదే, సామ్రాజ్యం ఆయనదే మరియు శాసనాధికారం ఆయనదే. మహిమాన్వితమైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?﴿ [సూరతు న్నహ్ల్: 52] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు భూమ్యాకాశాల సామ్రాజ్యాధిపత్యం కేవలం అల్లాహ్ కే చెందినది. మరియు అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్థుడు.﴿ [సూరతు ఆలె ఇమ్రాన్: 189], మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾తీర్పుదినానికి స్వామి.﴿ [సూరతుల్ ఫాతిహ: 4] కావున ఇహలోకము మరియు పరలోకములో సంపూర్ణ అధికారం అల్లాహ్ కే చెందుతుంది. ఆయనే ధర్మాన్ని శాసించాడు మరియు దానికి ప్రతిఫలమిస్తాడు. ఇస్లాం అనేది సత్య ధర్మం అని, అది తప్ప ఇతర ధర్మాలన్నీ అసత్యమైనవని మరియు వాటిని ఆచరించే వారి నుండి అవి తిరస్కరించబడతాయని తీర్పుచేసింది ఆయనే. అదే విధంగా ఇహలోకము మరియు పరలోకము పరమ పవిత్రుడు మరియు మహోన్నతుడైన సత్యప్రభువుకే చెందుతాయి, కావున ఆయనే ఆదేశిస్తాడు మరియు తీర్పుచేస్తాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.﴿ [సూరతుల్ ఖసస్: 70] అల్లాహ్ తీర్పు చేశాడు మరియు ఆయన తీర్పే సత్యమైనది: అల్లాహ్ కొరకు కుమారుడిని చేసేవాడు బహుదైవారాధకుడు మరియు అవిశ్వాసి. మరియు మసీహ్ అలైహిస్సలాం క్రైస్తవులను అల్లాహ్ తో పాటు సాటి కల్పించటం నుండి హెచ్చరించారు, మరియు ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి నిశ్చయంగా అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడని హెచ్చరించారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చినట్లు: ﴾నిశ్చయంగా, మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) యే అల్లాహ్!" అని పలికే వారు వాస్తవంగా సత్యతిరస్కారులు! మరియు మసీహ్ (క్రీస్తు) ఇలా అన్నాడు: "ఓ ఇస్రాయీల్ సంతతి వారలారా! నా ప్రభువు మరియు మీ ప్రభువైన అల్లాహ్ నే ఆరాధించండి. వాస్తవానికి, ఇతరులను అల్లాహ్ కు భాగస్వాములుగా చేసే వారికి, నిశ్చయంగా, అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు. మరియు వారి ఆశ్రయం నరకాగ్నియే! మరియు దుర్మార్గులకు సహాయం చేసే వారు ఎవ్వరూ ఉండరు. ﴿ [సూరతుల్ మాయిద: 72]
మరియు అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులు అలైహిముస్సలాతు వస్సలాంలలో ఎవరైనా ఒక్క ప్రవక్తను తిరస్కరించినా, అతను నరకంలో శాశ్వతంగా, ఎల్లప్పుడూ ఉంటాడు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆద్ జాతి, సందేశహరులను అసత్యవాదులని తిరస్కరించింది.﴿ [సూరతుష్ షుఅరా: 123] వారు ప్రవక్తలను తిరస్కరించారని అల్లాహ్ తెలియపరచాడు, ఇంకా వారు తమ ప్రవక్తను తప్ప ఇంకెవరినీ తిరస్కరించలేదు, కానీ ఒక ప్రవక్తను తిరస్కరించినవాడు నిజానికి ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే; ఎందుకంటే వారందరి సందేశం ఒకటి, మరియు తన ప్రవక్తలలో (అలైహిస్సలాం) ఒక ప్రవక్తను అవిశ్వసించిన వారిని అల్లాహ్ అవిశ్వాసులుగా తీర్మానించాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! అల్లాహ్ ను, ఆయన సందేశహరుణ్ణి, ఆయన తన సందేశహరునిపై (ముహమ్మద్ పై) అవతరింపజేసిన గ్రంథాన్ని మరియు ఆయన ఇంతకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసించండి. అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంతాలను, ఆయన ప్రవక్తలను, అంతిమ దినాన్ని తిరస్కరించినవాడు, వాస్తవానికి మార్గభ్రష్టుడై, మార్గభ్రష్టత్వంలో చాలా దూరం పోయినట్లే!﴿ [సూరతున్నిసా: 136]
యూదులు మరియు క్రైస్తవులకు సంబంధించి హదీసులో ఇలా వచ్చింది, అబూ హురైర ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.” [సహీహ్ ముస్లిం (240)], మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: “ముస్లిం ఆత్మ తప్ప మరెవరూ స్వర్గంలో ముమ్మాటికి ప్రవేశించలేరు” [ఈ హదీసును బుఖారీ (6528) మరియు ముస్లిం (221) లో ఉల్లేఖించారు], అయితే ఇస్లాం కాలాన్ని పొందని ఏకేశ్వరోపాసకులైన క్రైస్తవులు, ఎవరైతే అల్లాహ్ ను ప్రభువుగా మరియు ఈసా అలైహిస్సలాంను సందేశహరునిగా విశ్వసించారో, వారు విశ్వాసులు మరియు వారి గమ్యస్థానం స్వర్గము.
కానీ, ఏ మానవుడైతే ఇస్లాం సందేశం గురించి వినలేదో, మరియు అల్లాహ్ యొక్క ధర్మం ఏమిటో తెలుసుకోలేదో, మరియు ఎవరిపై ఆధారం నిరూపితమవలేదో, అల్లాహ్ అతనికి అన్యాయం చేయడని తెలుసుకోవాలి; ఎందుకంటే అల్లాహ్ న్యాయముగా తీర్పునిస్తాడు, మరియు ఆయన ప్రజలకు ఏమాత్రం అన్యాయం చేయడు. మరియు తీర్పు దినము నాడు అల్లాహ్ సృష్టితాలను తిరిగి లేపినప్పుడు, ఎవరికైతే ఇస్లాం సందేశం చేరలేదో వారిని ఆయన పరీక్షిస్తాడు; ఒకవేళ వారు విశ్వసించి మరియు సత్యమని అంగీకరిస్తే వారు స్వర్గంలో ప్రవేశిస్తారు, మరియు ఒకవేళ వారు తిరస్కరించి మరియు అహంకారం ప్రదర్శిస్తే, అల్లాహ్ పట్ల వారి అవిశ్వాసానికి, మూర్ఖత్వానికి మరియు అహంకారానికి గాను ఆయన వారిని నరకాగ్నిలో ప్రవేశింపజేస్తాడు.
***
ప్రశ్న:
అన్ని మతాలు ఒకే గమ్యానికి దారితీస్తాయని ముస్లింలు విశ్వసిస్తారా?
సమాధానం:
అల్లాహ్ తన దాసుల కోసం శాసనంగా ఆజ్ఞాపించి, దానిని తమ అనుచరులకు చేరవేయమని తన సందేశహరులందరికీ (అలైహిమ్ సలామ్) బాధ్యతగా అప్పగించిన ధర్మమే ఇస్లాం. కావున ప్రవక్తలందరూ ఇస్లాం ధర్మాన్నే పాటించారు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.﴿ [సూరతు అష్షూరా:13] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఇబ్రాహీమ్ తన సంతానాన్ని దీనిలోనే (ఈ ఇస్లాం మార్గంలోనే) నడవండని బోధించాడు. మరియు యఅఖూబ్ కూడా (తన సంతానంతో అన్నాడు): " నా బిడ్డలారా! నిశ్చయంగా, అల్లాహ్ మీ కొరకు ఈ ధర్మాన్నే నియమించి ఉన్నాడు. కావున మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) కాకుండా మరణించకండి!".﴿ [సూరతుల్ బఖరహ్: 132] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?" అప్పుడతను తన కుమారులతో: "నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" అని అడిగినప్పుడు. వారన్నారు: "నీ ఆరాధ్యదైవం మరియు నీ పూర్వీకులగు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఆ ఏకైక దేవుణ్ణి (అల్లాహ్ నే) మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము.﴿ [సూరతుల్ బఖరహ్: 133] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(ఓ ముస్లింలారా!) మీరు ఇలా అనండి: "మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, 'ఈసా మరియు ఇతర ప్రవక్తలందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లింలం) అయ్యాము.﴿ [సూరతుల్ బఖరహ్: 136]
ఇస్లాంను కాకుండా ఇతర ధర్మాన్ని విశ్వసించే ప్రతీ ఒక్కరి ధర్మం అవాస్తవము మరియు వారి కర్మలు తిరస్కరించబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿ [సూరతు ఆలి ఇమ్రాన్: 85].
కావున ముస్లిం విశ్వసించేదేమిటంటే, అన్ని ధర్మాలు సత్యమైనవి కావు మరియు సత్య ధర్మం ఒక్కటే. మరియు పరలోకంలో ఉత్తమ ముగింపు, గొప్ప గమ్యం మరియు గొప్ప విజయం ఎవరైతే ముస్లింగా అల్లాహ్‌ను కలుస్తాడో అతనికి లభిస్తాయి. మరియు ఎవరైతే ఆయనను తిరస్కరించేవాడిగా మరియు ఆయనతో పాటు ఇతరులను సాటికల్పించేవాడిగా అల్లాహ్‌ను కలుస్తాడో; అతను తన ఇహలోకాన్ని మరియు పరలోకాన్ని నష్టపోతాడు. మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు: ﴾నిశ్చయంగా, సత్యతిరస్కారులైన గ్రంథ ప్రజలు మరియు బహుదైవారాధకులు నరకాగ్నిలోకి పోతారు. వారందులో శాశ్వతంగా ఉంటారు. ఇలాంటి వారే, సృష్టిలో అత్యంత నికృష్ట జీవులు.﴿ [సూరతుల్ బయ్యిన: 6] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(ఇంకా) ఇలా అను: "నేను కేవలం అల్లాహ్ నే ఆరాధిస్తూ నా భక్తిని (ఆరాధనను) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకుంటాను; కావున మీరు ఆయనను వదలి మీకు ఇష్టమైన వారిని ఆరాధించండి!" ఇంకా ఇలా అను: "పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!﴿ [సూరతు జ్జుమర్ : 14-15]
మరియు పరమ పవిత్రుడైన అల్లాహ్ సత్యము, మరియు ఆయన సూటియైన (రాజ) మార్గముపై ఉన్నాడు. పరమ పవిత్రుడైన, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క న్యాయము ఏమిటంటే, పునరుత్థాన రోజున అల్లాహ్ ను విశ్వసించి, సందేశహరులను (వారిపై శాంతి కలుగుగాక) సత్యమని నమ్మిన విశ్వాసులందరి నివాసమును ఆయన స్వర్గముగా చేస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది!﴿ [సూరతున్ నిసా: 69] మరియు అల్లాహ్ అవిశ్వాసుల పర్యవసానాన్ని నరకంగా చేశాడు, మరియు అది చాలా భయానకమైన నివాసం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడికి అల్లాహ్ మార్గదర్శకత్వం చేస్తాడో అతడే సన్మార్గం పొందుతాడు. మరియు ఎవడిని ఆయన మార్గభ్రష్టత్వంలో పడనిస్తాడో వాడికి, ఆయన తప్ప, ఇతరుల నెవ్వరినీ నీవు సంరక్షకులుగా పొందలేవు. మరియు వారిని మేము పునరుత్థాన దినమున గ్రుడ్డివారిగా, మూగవారిగా మరియు చెవిటివారిగా చేసి, వారి ముఖాల మీద బోర్లా పడవేసి లాగుతూ ప్రోగుచేస్తాము. వారి ఆశ్రయం నరకమే! అది చల్లారినప్పుడల్లా మేము వారికై అగ్నిజ్వాలను తీవ్రం చేస్తాము. అదే వారి ప్రతిఫలం. ఎందుకంటే వాస్తవానికి వారు మా సూచనలను తిరస్కరించారు మరియు అన్నారు: "ఏమీ? మేము ఎముకలుగా, పొడిగా మారిపోయిన తరువాత కూడా, సరిక్రొత్త సృష్టిగా మళ్ళీ లేపబడతామా?" ﴿ [సూరతుల్ ఇస్రాఅ: 97 - 98] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, అల్లాహ్ కపట విశ్వాసులను మరియు సత్యతిరస్కారులను అందరినీ నరకంలో జమ చేస్తాడు.﴿ [సూరతున్నిసా: 140] విశ్వాసపరులని స్వర్గములో ఒకచోట చేర్చటం మరియు అవిశ్వాసపరులని నరకములో ఒకచోట చేర్చటం అనేది పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ తరపు నుండి జరిగే సంపూర్ణ న్యాయం. నరకాగ్ని శిక్ష నుండి రక్షించమని మేము అల్లాహ్ ను వేడుకుంటున్నాము.
***
ప్రశ్న:
ఇతర మతాలు మరియు అల్పసంఖ్యాక వర్గాల పట్ల ఇస్లాం వైఖరి ఏమిటి?
సమాధానం:
పరిశుద్ధుడు మరియు మహోన్నతుడైన అల్లాహ్ దే భూమ్యాకాశాల సార్వభౌమత్వం. పరలోకంలో సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే మరియు సమస్త వ్యవహారాలు ఆయన వైపుకే మరలించబడతాయి. మహోన్నతుడు ఇలా సెలవిచ్చాడు: ﴾సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు. భూమిలోకి ప్రవేశించేది మరియు దాని నుండి బయటికి వచ్చేది మరియు ఆకాశం నుండి దిగేది మరియు దానిలోకి పైకి ఎక్కిపోయేది, అంతా ఆయనకు బాగా తెలుసు. మరియు ఆయన అపార కరుణా ప్రదాత, క్షమాశీలుడు.﴿ [సూరతు సబా: 1-2] అల్లాహ్ సృష్టికర్త, ఆహార ప్రధాత, సమస్త వ్యవహారాల నిర్వాహకుడు. ఆయనే ఆరాధనకు అర్హుడైన దేవుడు మరియు ఆయన తప్ప ప్రతిదీ పోషింపబడే సృష్టియే. ఆయనే విధులను తప్పనిసరి చేసినవాడు, ధర్మశాస్త్రాలను నిర్దేశించినవాడు, ధర్మాన్ని అవతరింపజేసినవాడు మరియు తన ధర్మాన్ని అన్ని ధర్మాలపై ఆధిపత్యం వహించేలా చేసినవాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾బహుదైవారాధకులకు (ముష్రికీన్ లకు) అది ఎంత అసహ్యకరమైనా, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్నీ ఇచ్చి పంపి దానిని సకల ధర్మాల మీద ప్రబలింప జేసినవాడు (ఆధిక్యతనిచ్చిన వాడు) ఆయన (అల్లాహ్) యే!﴿ [సూరతు త్తౌబహ్: 33] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయనే, తన ప్రవక్తను మార్గదర్శకత్వంతో మరియు సత్యధర్మంతో అన్ని ధర్మాలపై అది ఆధిక్యత కలిగి వుండేలా చేసి పంపాడు. మరియు సాక్షిగా అల్లాహ్ యే చాలు.﴿ [సూరతుల్ ఫతహ్: 28] ధర్మం ఏకైక అల్లాహ్ కొరకు మాత్రమే అయితే తప్ప స్వచ్ఛమైనది కాజాలదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా?﴿ [సూరతు న్నహ్ల్: 52] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వినండి! భక్తి కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది!﴿ [సూరతు జ్జుమర్: 3]
తన వద్ద స్వీకరించబడే మరియు ఇష్టపడే ధర్మం అది ఇస్లాం అని అల్లాహ్ స్పష్టంగా తెలియజేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే.﴿ [సూరతు ఆలె ఇమ్రాన్: 19] మరియు ఆయన అది తప్ప మరే ఇతర ధర్మాన్ని ఇష్టపడడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿ [సూరతు ఆలి ఇమ్రాన్: 85].
మరియు ఆయన (సుబ్ హానహు వ తఆలా) ఈ విధంగా తీర్పునిచ్చాడు: ఎవడైనా ఇస్లాం ధర్మం తప్ప ఇతర ధర్మాన్ని అవలంబిస్తే, అతని ప్రయత్నం మార్గభ్రష్టత్వం మరియు నష్టం, మరియు అతని పర్యవసానం వినాశనం మరియు గొప్ప శిక్ష. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾పునరుత్థాన దినమున తమకు తాము మరియు తమ కుటుంబం వారికి నష్టం కలిగించుకున్న వారే నిశ్చయంగా నష్టపడ్డ వారు. వాస్తవానికి అదే స్పష్టమైన నష్టం!﴿ [సూరతు జ్జుమర్: 15] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయనే అల్లాహ్! ఆకాసాలలో ఉన్నదీ మరియు భూమిలో ఉన్నదీ సర్వమూ ఆయనకే చెందుతుంది! మరియు సత్యతిరస్కారులకు కఠిన శిక్ష వల్ల తీవ్రమైన దుఃఖం (వ్యధ) కలుగుతుంది. ఎవరైతే పరలోక జీవితం కంటే, ఇహలోక జీవితానికి అధిక ప్రాధాన్యతనిచ్చి, (ప్రజలను) అల్లాహ్ మార్గం నుండి ఆటంక పరుస్తూ, దానిని వక్రమైనదిగా చూపగోరుతారో! అలాంటి వారే మార్గభ్రష్టత్వంలో చాలా దూరం వెళ్ళిపోయిన వారు.﴿ [సూరతు ఇబ్రాహీం: 2-3] సర్వలోకాల ప్రభువు, సార్వభౌముడు, స్పష్టమైన సత్యవంతుడు ఎలా తీర్పునిచ్చాడో మీరు చూశారా? ఇస్లాం తప్ప వేరే ఏ ధర్మమైనా అది అసత్యమైన మరియు మార్గభ్రష్టమైన ధర్మం అని, పరలోకంలో ఆ ధర్మాన్ని అనుసరించే వారి నివాసము నరకమే అని, అది ఎంత చెడ్డ నివాసమో!
ఇక అల్పసంఖ్యాక వర్గాలు మరియు ఇతర మతస్థుల విషయానికొస్తే, ముస్లిములతో వారు యుద్దంచేయనంతవరకు ఇస్లాంలో వారి పట్ల నిబంధన ఏమిటంటే, ముస్లిములు వారిని ఇస్లాం వైపుకు ఆహ్వానించటం మరియు వారితో న్యాయంగా వ్యవహరించటం తప్పనిసరి. మరియు ముస్లిములు వారి పట్ల మంచిగా మెలగాలని, వారితో ‘ఇహ్సాన్’(ఉత్తమ) వైఖరి కలిగి ఉండాలని మరియు వారిలోని బలహీనుల పట్ల దయ చూపాలని ఆదేశించబడ్డారు. మరియు ఒక వేళ మనిషి ముస్లిం అయ్యి, అతని తల్లిదండ్రులు ముస్లిమేతరులైనప్పటికీ, అతడు వారి పట్ల మంచిగా వ్యవహరించడం, వారితో ‘ఇహ్సాన్’(ఉత్తమ) వైఖరి కలిగి ఉండటం మరియు వారితో ఉత్తమ రీతిలో సత్సంబంధాలు కలిగి ఉండటం అతనిపై తప్పనిసరి. మరియు సాధారణంగా ఒక ముస్లిం ప్రజలందరితో ఉత్తమ ప్రవర్తనతో వ్యవహరించాలి. అతడు ఎవరికీ హాని కలిగించకూడదు, మరియు అన్యాయం చేయకూడదు మరియు వారి హక్కులలో దేనినీ ఏమాత్రం తగ్గించకూడదు.
ఒకవేళ ముస్లిమేతరుడు ముస్లిముల దేశాలలో ఉండి, వారి మధ్య కలిసి జీవించడానికి అంగీకరిస్తే, అతడు సాధారణ వ్యవస్థకు కట్టుబడి ఉండాలి. అప్పుడు ఇస్లాం ఆచారాలకు మరియు దాని నిబంధనలకు విరుద్ధంగా లేనంత వరకు ఇస్లాం అతని డబ్బు, రక్తం, గౌరవం, సంతానం మరియు స్వేచ్ఛను రక్షిస్తుంది.
ముస్లిమేతరులకు అన్యాయం చేయడం, వారికి నష్టం కలిగించడం, వారి హక్కులను నిరాకరించడం మరియు ఇలాంటి విషయాలు ఏవైతే ఇస్లాం మరియు ముస్లిములకు ఆపాదించబడుతున్నాయో, ఇదంతా ఇస్లాం మరియు ముస్లిములకు వ్యతిరేకంగా నిర్దేశించబడిన అన్యాయమైన ప్రసార మాధ్యమాల దురాగతమే. ముస్లిముల మధ్య జీవించి, వారి మతం యొక్క ఔన్నత్యాన్ని, వారి ధర్మం యొక్క సౌలభ్యాన్ని మరియు వారి ఉన్నతమైన నైతికతను తెలుసుకున్న వారు, తప్పుదోవ పట్టించే ఈ ప్రసార మాధ్యమాలు చెప్పేదంతా కేవలం అబద్దము మరియు మోసం అని గ్రహిస్తారు. అల్లాహ్ యే సహాయం చేసేవాడు.
***
(ఖుర్ఆన్ మరియు మునుపటి దివ్యగ్రంథాల విభాగము)
ప్రశ్న:
ఖుర్ఆన్ అంటే ఏమిటి?
సమాధానం:
సర్వ ప్రశంసలు అల్లాహ్ కొరకే, ఇకపోతే నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తలకు మరియు సందేశహరులకు అలైహిస్సలాతు వస్సలాం స్పష్టమైన నిదర్శనాల ద్వారా మద్దతు తెలిపాడు, అవి అల్లాహ్ తరువాత వారి జాతుల ప్రజల మార్గదర్శకత్వానికి కారణమయ్యాయి. మరియు ప్రవక్తల అలైహిస్సలాతు వస్సలాం సూచనలన్నీ అదృశ్యమయ్యాయి. ఉదాహరణకు: సాలిహ్ అలైహిస్సలాం యొక్క ఒంటె మరియు మూసా అలైహిస్సలాం చేతి కర్ర, మరియు ఈసా అలైహిస్సలాం ద్వారా కుష్టు రోగిని, మూగవాడిని నయం చేయటం మరియు చనిపోయినవారిని బ్రతికించడం. వాటిలో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్ప అద్భుతం మినహా ఏదీ మిగిలి లేదు. మరియు ఆయన గొప్ప అద్భుతమైన పవిత్ర ఖుర్ఆన్ దైవప్రవక్తలకు ఇవ్వబడిన అద్భుతాలలో మహా గొప్పది, అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా పలికారు: «దైవప్రవక్తల్లోని ప్రతీ ఒక్క ప్రవక్తకు అద్భుతాలు ఇవ్వబడ్డాయి,ఆ ప్రకారంగా ప్రజలు విశ్వసించేవారు,నిశ్చయంగా నాకు దైవవాణి ఇవ్వబడింది,అల్లాహ్ దాన్ని నా వైపుకు పంపాడు,కాబట్టి ప్రళయదినాన అత్యధిక అనుచరులు నాకు ఉంటారని నేను ఆశిస్తున్నాను» [ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ (4981), సహీహ్ ముస్లిం (152)].
మరియు అల్లాహ్ ఆయనకు ఇచ్చిన ఈ దైవవాణి: ఖుర్ఆను మరియు దైవప్రవక్త సున్నతు (సంప్రదాయం), మరియు ప్రశ్న ఖుర్ఆను గురించి కాబట్టి, మనం ఇక్కడ పవిత్ర ఖుర్ఆను గురించిన విషయాన్ని వివరంగా తెలుపుతూ ఇలా చెబుతున్నాము:
ఖుర్ఆను దివ్యగ్రంధం గురించి దానిని అవతరింపజేసిన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నిశ్చయంగా, ఇది సర్వలోకాల ప్రభువు అవతరింపజేసిన (గ్రంథం). దీనిని నమ్మదగిన ఆత్మ (రూహుల్ అమీన్) అవతరింపజేశాడు ١٩٣ నీ హృదయం మీద, నీవు హెచ్చరిక చేసేవారిలో చేరిపోవాలని స్పష్టమైన అరబ్బీ భాషలో! నిశ్చయంగా, దీని (ప్రస్తావన) పూర్వ దివ్యగ్రంథాలలో ఉంది.﴿ [షు'అరా: 192-196] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾దీని (ఈ ఖుర్ఆన్) అవతరణ అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత తరఫు నుండి జరిగింది. దివ్యగ్రంథం. దీని సూక్తులు (ఆయాత్) వివరించబడ్డాయి, ఇది జ్ఞానులైన ప్రజల కోసం అరబ్బీ భాషలో ఉన్న ఖురాన్. (స్వర్గపు) శుభవార్తనిచ్చేదిగా మరియు హెచ్చరించేదిగా; అయినా చాలా మంది దీని పట్ల విముఖత చూపుతున్నారు, కాబట్టి వారు వినటం లేదు.﴿ [ఫుస్సిలత్ : 2-4] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, తమ దగ్గరకు హితబోధ వచ్చినపుడు దానిని తిరస్కరించే వారే (నష్టపోయేవారు). మరియు నిశ్చయంగా, ఇది (ఈ ఖుర్ఆన్) చాలా శక్తివంతమైన (గొప్ప) గ్రంథం; అసత్యం దాని (ఖుర్ఆన్) ముందు నుండి గానీ లేదా దాని వెనుక నుండి గానీ దాని పైకి రాజాలదు. అది మహా వివేకవంతుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు, అయిన ఆయన (అల్లాహ్) తరఫు నుండి అవతరింప జేయబడింది.﴿ [ఫుస్సిలత్ : 41-42] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది. సురక్షితమైన గ్రంథంలో ఉన్నది దానిని పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ ముట్టుకోరు ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది.﴿ [అల్ వాఖిఅ: 77 - 80] మరియు దీనిని అవతరింపజేసిన అల్లాహ్ యే తౌరాతు మరియు ఇంజీలును అవతరింపజేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయన, సత్యమైన ఈ దివ్యగ్రంథాన్ని (ఓ ముహమ్మద్!) నీపై అవతరింపజేశాడు. ఇది పూర్వం అవతరింపజేయబడిన గ్రంథాలలో నుండి (మిగిలి వున్న సత్యాన్ని) ధృవపరుస్తోంది. మరియు ఆయనే తౌరాత్ ను మరియు ఇంజీలును అవతరింపజేశాడు. దీనికి ముందు ప్రజలకు సన్మార్గం చూపటానికి, మరియు (సత్యాసత్యాలను విశదీకరించే) ఈ గీటురాయిని కూడా అవతరింపజేశాడు. నిశ్చయంగా, ఎవరైతే అల్లాహ్ ఆజ్ఞను తిరస్కరిస్తారో వారికి కఠినశిక్ష ఉంటుంది. మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు.﴿ [ఆలె ఇమ్రాన్: 3-4]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన గురించి ఇలా పలికారు: «అల్లాహ్ యొక్క దివ్య గ్రంథములో మీకంటే పూర్వం గడిచిన వారి సమాచారం, మీ తరువాత రాబోయే విషయాల సమాచారం మరియు మీ మధ్య వ్యవహారాలను పరిష్కరించే తీర్పు ఉన్నాయి. మరియు అది సత్యాసత్యాలను స్పష్టంగా వేరు చేసేది, అది ఎగతాళి కాదు. దానిని వదిలివేసే ఏ అహంకారిని అయినా అల్లాహ్ నాశనం చేస్తాడు, మరియు దానిని వదిలి వేరొక దానిలో మార్గదర్శకత్వాన్ని వెతికే వాడిని అల్లాహ్ మార్గభ్రష్టుని చేస్తాడు. మరియు అది అల్లాహ్ యొక్క పటిష్టమైన త్రాడు, మరియు అది జ్ఞానపూర్వకమైన ఉద్బోధ, మరియు అది ఒక రాచమార్గము. అది ఎటువంటిదంటే, దాని వల్ల మనోవాంఛలు దారితప్పవు, మరియు దాని వల్ల నాలుకలు తడబడవు, విద్వాంసులకు దాని జ్ఞానంతో ఎన్నటికీ తృప్తి తీరదు, దానిని పదే పదే పఠించినా అది పాతబడదు, మరియు దానిలోని అద్భుతాలు ఎన్నటికీ అంతం కావు. జిన్లు దానిని విన్నప్పుడు, వారు ఇలా అనకుండా ఉండలేకపోయారు: ﴾నిశ్చయంగా మేము ఒక అద్భుతమైన ఖుర్ఆన్ను విన్నాము, అది సన్మార్గం వైపునకు మార్గదర్శకత్వం వహిస్తుంది...﴿ [అల్ జిన్: 2]. దాని ఆధారంగా మాట్లాడిన వాడు సత్యమే పలికాడు, మరియు దానిపై ఆచరించిన వానికి ప్రతిఫలం లభిస్తుంది, మరియు దానితో తీర్పు ఇచ్చిన వాడు న్యాయం చేశాడు, మరియు దాని వైపునకు పిలిచిన వాడు రాచమార్గము వైపునకు మార్గదర్శకత్వం చేయబడతాడు.» [సుననె తిర్మిథీ త. షాకిర్, హదీథు సంఖ్య (2906) మరియు సునన్ దారిమీ, హదీథు సంఖ్య (2650)].
మరియు ఖురైష్ అవిశ్వాసులలో ఒకడైన వలీద్ దానిని విన్న తరువాత దాని గురించి ఇలా అన్నాడు: "«అల్లాహ్ సాక్షిగా! నేను కొద్దిసేపటి క్రితమే ముహమ్మద్ నుండి కొన్ని మాటలు విన్నాను. అవి మానవుల మాటలు కావు, అలాగే జిన్నాతుల మాటలు కూడా కావు. నిశ్చయంగా ఆ మాటలలో ఎంతో మాధుర్యం ఉంది, వాటికి ఎంతో ఆకర్షణ ఉంది. దాని పైభాగం ఫలవంతమైనది, దాని కింది భాగం సమృద్ధిగా ఉన్నది. నిశ్చయంగా అది అత్యున్నతంగా ఉంటుంది, దానిని ఏదీ అధిగమించలేదు.»" [మరాహ్ లబీద్ లి కష్ఫ్ మఅనల్ ఖుర్ఆనుల్ మజీద్ (2/ 580)].
మరియు ఖుర్ఆన్ మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు, ఇది జిబ్రయీల్ అలైహిస్సలాం ద్వారా అక్షర జ్ఞానం లేని ప్రవక్త అయిన మన దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అవతరింపబడినది, దాని పారాయణంతో ఆరాధన చేయబడుతుంది. ఇది అంతకు ముందు ప్రవక్తలపై అవతరింపబడిన తౌరాత్ మరియు ఇంజీల్ లాంటి పూర్వ గ్రంథాలను రద్దు చేసేది మరియు వాటిని ధృవీకరించే గ్రంథం. అనగా, తౌహీద్ (ఏకదైవారాధన) వైపుకు ఆహ్వానించడం, అగోచర విషయాలపై మరియు పునరుత్థానంపై విశ్వాసం ఉంచడం మరియు సాధారణంగా విశ్వాస (అఖీదా) మూలాలలో ఇవి ఏకీభవిస్తాయని దీని అర్థం. ఇది మన దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఇరవై మూడు సంవత్సరాల వ్యవధిలో అవతరించినది. సహాబాలు దీనిని కంఠస్థం చేశారు మరియు వారి తరువాత వారికి వ్రాతపూర్వకంగా మరియు కంఠస్థం ద్వారా చేరవేశారు. కావున ఇది హృదయాలలో భద్రంగా ఉంది మరియు పుస్తకాలలో వ్రాయబడి భద్రంగా ఉంది. ముస్లింలు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించారు మరియు దాని అక్షరాలను మరియు పఠన విధానాలను తరతరాలుగా పారంపర్యంగా చేరవేశారు. ఇది ముప్పై జుజ్ లు (భాగాలు) గా ఉంది మరియు ఇందులో నూట పద్నాలుగు సూరాలు ఉన్నాయి.
మరియు ఇది ఒక గొప్ప గ్రంధం. ఇది విశ్వాసం, శాసనాలు, మర్యాదలు, ప్రవక్తల కథలు మరియు పూర్వపు సమాజాల సమాచారాన్ని కలిగి ఉంది. అల్లాహ్ ఇందులో ప్రపంచంలో విశ్వాసులను ఎలా రక్షించాడో, మరియు ప్రపంచంలో అవిశ్వాసులను మరియు కపటులను ఎలా శిక్షించాడో పేర్కొన్నాడు. మరియు ఇది ప్రళయ దినాన విశ్వాసుల గమ్యం మరియు అవిశ్వాసుల, కపటుల గమ్యం యొక్క వివరణను కలిగి ఉంది. మరియు అల్లాహ్ మానవులు మరియు జిన్ లకు - వారు ఏకమైనప్పటికీ - ఇటువంటి దానిని తయారు చేసుకురండి అని ఛాలెంజ్ చేశాడు. ఇక ఇటువంటి దానిని లేదా దీనిలో కొంత భాగాన్నైనా తయారు చేసుకురావడం అటుంచితే, దీనిని మార్చడం ఎవరివల్లా కాలేదు మరియు ఎప్పటికీ సాధ్యం కాదు. మరియు అల్లాహ్ సుబహానహు వతఆలా ఈ ఖుర్ఆన్ ఆత్మ మరియు శరీర వ్యాధులన్నింటికీ నివారణ అని వివరించాడు. మరియు ఇందులో ఉన్నదాని ద్వారా సలహా పొందాలనుకునేవారికి మరియు దీని ద్వారా మార్గదర్శకత్వం పొందాలనుకునేవారికి ఇందులో సలహా ఉంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల) కు స్వస్థత నిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది).﴿ [యూనుస్: 57]
మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సందేశం అంతిమ సందేశం అయినందున - అనగా ఆయన తరువాత ఏ ప్రవక్తా రాడు కాబట్టి; అల్లాహ్ ఈ సందేశం యొక్క అద్భుతాన్ని తీర్పు రోజు వరకు మిగిలి ఉండిపోయే ఒక అద్భుతంగా నిలబెట్టాడు. అనగా దానిని పరిశీలించిన మరియు చదివిన ప్రతి ఒక్కరిపై ఈ సందేశం యొక్క సత్యానికి మరియు దానిని తీసుకువచ్చిన ప్రవక్త, అనగా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్తత్వానికి ఆధారం స్థాపించబడుతుంది. అందువల్ల అల్లాహ్ ఖుర్ఆన్ లో ధర్మ మూలాలపై బుద్ధిని ఆశ్చర్యపరిచే మరియు హృదయాలను ఆకట్టుకునే స్పష్టమైన సాక్ష్యాలు, స్పష్టమైన ఆధారాలు మరియు రుజువులను ఉంచాడు. అందువల్ల వేలాది మంది మానవులు దానిని లేదా దాని భావాల అనువాదాన్ని పరిశీలించినప్పుడు ఇస్లాం స్వీకరిస్తూనే ఉన్నారు. మరియు అందులో ఉదాహరణలు, బుద్ధిపూర్వక ఆధారాలు మరియు దివ్యఖుర్ఆన్ మానవుడిని ఎదుర్కొనే ప్రశ్నలు ఉన్నాయి; అతను న్యాయవంతుడైతే వాటిని అంగీకరించేలా చేస్తాయి, లేదా అతను కృతఘ్నుడు మరియు సత్యాన్ని తిరస్కరించేవాడైతే మొండితనం మరియు అహంకారం చూపేలా చేస్తాయి. మరియు ఈ అద్భుతమైన ఆధారాల లో మహోన్నతుడైన అల్లాహ్ వాక్యం ఇలా ఉంది: ﴾ఓ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.﴿ [హజ్జ్: 5] మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: ﴾వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.﴿ [అల్ అంబియా: 22] మరియు నిరుత్తరులను చేసే ప్రశ్నలలో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా? ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము? మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు; మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి. మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు? మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా? మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము? మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు.﴿ [అల్ వాఖిఅ: 58 - 65]
మరియు అల్లాహ్ కాకుండా ఇతరుల ఆరాధన సరికాదనటానికి ఆధారాన్ని చూపుతూ ఖుర్ఆన్ ఇచ్చిన ఉదాహరణలలో మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ మానవులారా! ఒక ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని శ్రద్ధగా వినండి! నిశ్చయంగా, మీరు అల్లాహ్ ను వదిలి ఎవరినైతే ప్రార్థిస్తున్నారో, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. మరియు ఒకవేళ, ఆ ఈగ వారి నుండి ఏమైనా లాక్కొని పోయినా, వారు దానిని, దాని (ఆ ఈగ) నుండి విడిపించుకోనూ లేరు. ఎంత బలహీనులు, ఈ అర్థించేవారు మరియు అర్థించబడేవారు.﴿ [అల్ హజ్జ్: 73]
మరియు ఇది పొరపాట్లు మరియు వైరుధ్యాలకు అతీతమైన గ్రంథం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇది (ఈ ఖుర్ఆన్) ఒక దివ్య గ్రంథం; ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. దైవభీతి గలవారికి ఇది మార్గదర్శకత్వము.﴿ [అల్ బఖర: 2] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏమీ? వారు ఖుర్ఆన్ ను గురించి ఆలోచించరా? ఒకవేళ ఇది అల్లాహ్ తరఫు నుండి గాక ఇతరుల తరఫు నుండి వచ్చి వుంటే, అందులో ఎన్నో పరస్పర విరుద్ధమైన విషయాలను చూసేవారు కదా! ﴿ [నిసా: 82]
మరియు ఖుర్ఆన్ స్పష్టమైన అరబీ భాషలో అవతరింపబడినది, అది తన వాగ్ధాటి మరియు స్పష్టతతో అరబ్బులను ఆశ్చర్యపరిచింది. మరియు ఈ గొప్ప భాషా అద్భుతం యొక్క విలువను, అది ఎవరి భాషలో అవతరించిందో ఆ భాషా ప్రజలు మాత్రమే గ్రహించగలరు. మరియు అది ఏ భాషలో అవతరింపబడినదో అదే భాషలో సురక్షితంగా ఉంది, మరియు ముస్లింలు దానిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పఠించిన విధంగానే పఠిస్తారు.
పవిత్ర ఖుర్ఆన్కు తజ్వీద్, భాష్యం, అవతరణ కారణాలు మరియు ఇతరాల వంటి అనేక శాస్త్రాలు ఉన్నాయి. వీటిపై పండితులు కష్టపడితే తప్ప లెక్కించలేనన్ని ప్రసిద్ధ గ్రంథాలను రచించారు. మరియు ఖుర్ఆన్ యొక్క అర్థాలకు అనేక భాషలలో ప్రామాణికమైన అనువాదాలు ఉన్నాయి.
కాబట్టి తమ మానవత్వానికి విలువనిచ్చే మరియు తమ బుద్ధిని గౌరవించే ప్రతి ఒక్కరూ, మానవాళికి దీనికంటే ఉత్తమమైన గ్రంథం మరేదీ రాని ఈ మహా దివ్యగ్రంథాన్ని చదవడానికి కృషి చేయాలి, లేదా ఒకవేళ అరబీ భాష తెలియకపోతే దాని అనువాద అర్ధం చదవాలి. అత్యంత వివేకవంతుడైన ఒక వివేకి ఒక పుస్తకాన్ని వ్రాశాడని మరియు అతను తన వివేకాన్నంతా అందులో పొందుపరిచాడని ఒక బుద్ధిమంతుడికి చెప్పబడితే, దానిని చదివి తెలుసుకోవడానికి కృషి చేయడం మనిషికి ఎంతైనా తగును. అలాంటప్పుడు ఓ మానవుడా! నీ చేతుల్లో ఒక దైవ గ్రంథం ఉంది, ఇది ఏ భాషలో అవతరించినదో అలాగే ఈ రోజు వరకు అదే భాషలో భద్రంగా ఉంది, ఏ అక్షరమైనా తగ్గడం గానీ పెరగడం గానీ లేకుండా, మార్చడం గానీ జరుగకుండా సురక్షితంగా ఉంది, అందులో గతించిన వారి వృత్తాంతాలు, గతించిన మరియు ఉన్నవారి ధర్మ చట్టాలు మరియు ప్రతి ప్రాణి గమ్యం గురించిన వివరణలు ఉన్నాయి, అయినా నీవు దానిని చదివి తెలుసుకోవా! నిశ్చయంగా మనిషి ఖుర్ఆన్ను నిర్లక్ష్యం చేయడం మరియు దాని పట్ల శ్రద్ధ వహించకపోవడం ఖుర్ఆను కరీంకు ఎలాంటి నష్టం కలిగించదు, దానికి బదులుగా విముఖత చూపే ఆ వ్యక్తినే అది నష్టపరుస్తుంది; ఎందుకంటే అల్లాహ్ తన సృష్టితాల అవసరం లేనివాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: "నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే!﴿ [అన్-నమ్ల్: 92] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు.﴿ [అల్-అన్'కబూత్: 6]. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
ఖుర్ఆన్ ప్రస్తావించే అంశాలు ఏమిటి?
సమాధానం:
సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే. దివ్యఖుర్ఆన్ అనేది అల్లాహ్ యొక్క వాక్కు, దివ్యగ్రంథాల పరంపరలో చిట్టచివరిది మరియు పూర్వగ్రంథాలను రద్దు చేసేది. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినది. ఇది భాగాలుగా విభజించబడినది, ప్రతి భాగం సూరాలుగా మరియు ప్రతి సూరా ఆయతులుగా విభజించబడినది. ఒక సూరా అనేది ఒకే అంశం గురించి లేదా వివిధ అంశాల గురించి ఉండవచ్చు.
ఖుర్ఆన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అది యూదులు మరియు క్రైస్తవుల గ్రంథాలలో వలె ఒకసారి చదివితే బహుశా మీరు దానిని మళ్లీ చదవని విధంగా ఒక నిరంతర చారిత్రక కథనంగా ఉండదు. కానీ దానిలోని ప్రతి చోట ప్రవక్తల గాధల యొక్క గొప్ప వైవిధ్యం మరియు వాటి ద్వారా హితబోధన ఉన్నట్లు మనం పొందుతము, మరియు అల్లాహ్ యొక్క ఆయతులపై మరియు ఆయన అద్భుత సృష్టిపై దృష్టి సారించడానికి గల ఆధారాలు ఇమిడి ఉంటాయి. మరియు వీటి మధ్యలో ఆదేశాలు, నిషేధాలు, నైతిక విలువలు, మర్యాదలు మరియు ధర్మ శాసనాలు వస్తుంటాయి. ఇదంతా ఒక తోట లాంటిది, సాధారణంగా ఏ చోటనైనా ఖుర్ఆన్ను అధ్యయనం చేసినప్పుడు మానవుడు దాని ద్వారా ప్రయోజనం చెందగలడు. ఒక్క ప్రవక్త యొక్క గాధ కూడా కేవలం ఒకేసారి వచ్చి ముగిసిపోదు, కానీ అది అనేక సూరాలలో మరియు అనేక ప్రదేశాలలో వస్తుంది. మరియు ప్రతి చోట, లోతుగా ఆలోచించే పాఠకుడు దృష్టి సారించడానికి క్రొత్త ప్రయోజనాలు మరియు సంఘటనల పట్ల ఒక క్రొత్త కోణం ఉంటాయి.
అయితే ఖుర్ఆన్లో ప్రస్తావించబడిన విషయాలలో కొన్ని ఇవి:
1- ఇది ఒక వ్యక్తికి తన ధర్మం మరియు ఇహలోక వ్యవహారాలలో, తన ప్రభువుతో తన సంబంధం, తనతో తన సంబంధం, తన చుట్టూ ఉన్న ప్రజలతో తన సంబంధం మరియు తాను జీవిస్తున్న విశ్వంతో తన సంబంధం కొరకు అవసరమైన ప్రతిదాన్ని కలిగి ఉన్న సమగ్రమైన గ్రంథం.
2 - సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క సర్వోత్కృష్ట గుణగణాలు మరియు ఆయన పేర్లు, ఆయన కార్యాలు, ఆయన ప్రతిఫలం, ఆయన ధర్మం, ఆయన ఆఙ్ఞలు, ఆదేశాలు మరియు ఆయన విధి నిర్ణయాలను (ఖదర్ మరియు ఖజా) వివరించడం; మరియు సృష్టించడంలో, సార్వభౌమాధికారంలో, ఉపాధి ప్రసాదించడంలో, నిర్వహించడంలో, జీవింపజేయడంలో మరియు మరణింపజేయడంలో ఆయన మాత్రమే ఏకైకుడు అని స్పష్టం చేయడం.
3- సృష్టితాలపై మహోన్నతుడైన అల్లాహ్ యొక్క హక్కును వివరించడం, అది ఏమిటంటే, ఆయనను ఏకైక దైవంగా విశ్వసించడం మరియు ఆయన తప్ప మరెవరినీ కాకుండా కేవలం ఆయనను మాత్రమే ఆరాధించడం; మరియు వారు ఆయనను ఆరాధించి, ఆయన ఆదేశాలను పాటించినప్పుడు సృష్టికర్తపై సృష్టితాలకు గల హక్కును వివరించడం. మరియు ఇందులో ఆరాధనలు, నియమాలు మరియు వ్యవహారాల వివరాలు ఉన్నాయి.
4. ఇది సృష్టికి జ్ఞానజ్యోతులు, మరియు సరళమైన మార్గం మరియు రుజుమార్గం వైపు మార్గనిర్దేశం చేయడంలో మానవాళికి మార్గదర్శకం, కరుణ, బోధన మరియు సరిపోయేది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ పూర్తిగా, సరైన (సవ్యమైన) మార్గం వైపుకు మార్గదర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫలముందనే శుభవార్తనూ అందజేస్తుంది;﴿ [సూరతుల్ ఇస్రాఅ: 9] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! ఇది వారికి చాలదా? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలున్నాయి.﴿ [అల్-అన్'కబూత్: 51] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వాస్తవానికి ఇప్పుడు మీ ప్రభువు తరఫు నుండి నిదర్శనాలు వచ్చాయి. కావున వాటిని ఎవడు గ్రహిస్తాడో తన మేలుకే గ్రహిస్తాడు! మరియు ఎవడు అంధుడిగా ఉంటాడో అతడే నష్టపోతాడు. మరియు నేను మీ రక్షకుడను కాను.﴿ [అల్ అన్ ఆమ్: 104] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇను (ఈ ఖుర్ఆన్) లో విశ్వసించేవారి కొరకు, మీ ప్రభువు తరఫు నుండి అనేక బోధనలు, మార్గదర్శకత్వం మరియు కారుణ్యమున్నాయి.﴿ [అల్-అరాఫ్: 203] తాహిర్ బిన్ ఆషూర్ రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు: «మరియు 'బసాఇర్' అనేది 'బసీరహ్' (అంతర్దృష్టి) యొక్క బహువచనం, దీని ద్వారానే సత్యం స్పష్టమవుతుంది... మరియు ఇది ఖుర్ఆన్ యొక్క గొప్పతనాన్ని ప్రస్తావిస్తుంది, మరియు వారు అడిగే నిదర్శనాల కంటే ఇది అత్యంత ఉత్తమమైనది; ఎందుకంటే ఇది తన అద్భుత నిదర్శనం ద్వారా మరియు నిరక్షరాస్యుడైన ప్రవక్త నుండి వెలువడటం ద్వారా ప్రవక్త యొక్క సత్యసంధతను ధృవీకరించడాన్ని, మరియు మార్గదర్శకత్వం, బోధన, సూచనలు మరియు యుగయుగాల వరకు నిలిచి ఉండటాన్ని తనలో కలిపి ఉంచుతుంది. మరియు 'బసాఇర్' అని బహువచనంగా పేర్కొనడానికి కారణం ఏమిటంటే, ఖుర్ఆన్ తాను మార్గదర్శకం చేసే వివిధ కోణాలకు అనుగుణంగా అనేక రకాల మార్గదర్శకాలను కలిగి ఉంటుంది: విశ్వాసాన్ని సంస్కరించడంలో బుద్ధిని ప్రకాశింపజేయడం, ధర్మంలో అవగాహనను సరిదిద్దడం, పరస్పర వ్యవహారాల కోసం నియమాలను ఏర్పరచడం, మానవుల మధ్య సామాజిక సంబంధాలు, ప్రపంచంలో సాఫల్యం మరియు విముక్తి యొక్క మార్గాలను సూచించడం, మరియు నష్టాల అగాధాల నుండి హెచ్చరించడం.» [అత్ తహ్రీర్ వత్ తన్వీర్ (9/ 238)]
5- దైవగ్రంధాలు మరియు వాటిలో ఉన్న మార్గదర్శకత్వం మరియు సూచనలు, హలాల్ మరియు హరామ్, మరియు ధర్మశాసనాల గురించిన ప్రస్తావన. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾మరియు మేము వారి (ఆ ప్రవక్తల) అడుగు జాడలను (ఆసారిహిమ్) అనుసరించేవాడు మరియు తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరచే వాడయిన, మర్యమ్ కుమారుడు ఈసా (ఏసును) పంపాము. మేము అతనికి ఇంజీల్ గ్రంథాన్ని ప్రసాదించాము. అందులో మార్గదర్శకత్వం మరియు జ్యోతి ఉన్నాయి మరియు అది తౌరాత్ లో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తుంది మరియు దైవభీతి గల వారికి మార్గదర్శకత్వం మరియు హితోపదేశం కూడా!﴿ [అల్ మాయిదా : 46]
6- పవిత్ర ఖుర్ఆన్లో ప్రస్తావించబడిన అత్యంత గొప్ప విషయాలలో ప్రవక్తలు మరియు దైవిక సందేశాలు, ప్రతి ప్రవక్త తన జాతితో పలికిన మాటలు మరియు దానికి అతని జాతి నాయకులు ఇచ్చిన సమాధానం, అతడిని విశ్వసించిన వారి ప్రతిఫలం మరియు అతడిని విభేదించి అవిధేయత చూపిన వారి శిక్ష, మరియు అల్లాహ్ ప్రతి ప్రవక్తకు మద్దతుగా ఇచ్చిన సూచనల వివరణ ఉన్నాయి. మరియు సృష్టికి దైవప్రవక్తల అవసరం, వారి హెచ్చరికలు మరియు శుభవార్తలు, వారిపై అవతరింపజేయబడిన గ్రంథాల పట్ల విశ్వాసం తప్పనిసరి అయిన విషయాలను వివరించడం, మరియు వాటి నుండి గుణపాఠం మరియు హితబోధ గ్రహించడానికి పూర్వపు జాతుల స్థితిగతులను మరియు వారు తమ ప్రవక్తలతో వ్యవహరించిన తీరును వివరించడం ఉన్నాయి.
7- గొప్ప ఖుర్ఆన్ ప్రస్తావించిన అత్యంత గొప్ప అంశాలలో ఒకటి: అంతిమ దినం, ఇది మరణాంతరం లేపబడటం, పునరుత్థానం మరియు ప్రతిఫలం ఇవ్వబడే రోజు, విశ్వాసుల ప్రతిఫలం మరియు వారు స్వర్గంలోకి ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉండటం యొక్క వివరణ, మరియు అవిశ్వాసుల ప్రతిఫలం మరియు వారు నరకాగ్నిలోకి ప్రవేశించి అందులో శాశ్వతంగా ఉండటం, మరియు వీటన్నింటి వివరాలు.
8- దైవదూతలు, జిన్నులు, షైతానులు వంటి అగోచర లోకాల గురించి చర్చించబడింది. అవి ఎలా సృష్టించబడ్డాయి, వాటి కార్యాలు ఏమిటి, వాటి లక్షణాలు ఏమిటి, తమ ప్రభువుకు దైవదూతల విధేయత, జిన్నులు మరియు షైతానుల అవిధేయత, వాటి ఇతర పరిస్థితులు, అలాగే దైవదూతలు విశ్వాసులకు విధేయ కార్యాలలో సహాయం చేస్తారని, షైతానులు అవిశ్వాసులను పాపాల వైపు బలంగా ప్రేరేపిస్తారని ప్రస్తావించబడింది.
9- ధర్మసమ్మతమైన ఆరాధనలను వివరించటం, అనగా: సలాహ్ (నమాజు), జకాత్, ఉపవాసాలు, హజ్, సత్కార్యాలు, ఉపకారం మరియు అల్-వలా వల్-బరా (మైత్రి మరియు విరోధం); లావాదేవీలను అనగా: క్రయవిక్రయాలు, ఋణాలు, వివాహాలు మరియు వారసత్వాలను తెలియజేయటం; ఉత్తమ నైతికతతో ఆత్మను పరిశుద్ధపరచుకోవటం మరియు చెడు ప్రవర్తనల నుండి దానిని శుద్ధి చేయటం; ఇంకా నిషిద్ధ కార్యాలు, అయిష్టకరమైనవి, అనైతికతలు మరియు పాపాలను వివరించటం.
10- ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలలో ఉన్న విశ్వపరమైన సూచనలను (చిహ్నాలను) చూడటం మరియు గుణపాఠం పొందటం వైపునకు ఆహ్వానం. అదేవిధంగా దిగంతాలలో మరియు తమ అంతరంగాలలో ఇమిడి ఉన్నవాటిని పరిశీలించటం, మరియు మనిషిని విశ్వాసం, ఇస్లాం, సృష్టికర్తకు విధేయత చూపటం మరియు ఆయన ఆరాధన వైపునకు నడిపించే విధంగా వాటి గురించి ఆలోచించటం; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలున్నాయి.﴿ [అల్ బఖర: 164]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలో మరియు రేయింబవళ్ళ అనుక్రమం (ఒకదాని తరువాత ఒకటి రావడం మరియు వాటి హెచ్చుతగ్గుల)లో, బుద్ధిమంతుల కొరకు ఎన్నో సూచనలు (ఆయాత్) ఉన్నాయి;﴿ [ఆలె ఇమ్రాన్: 190]
11- ఈ విశ్వం మరియు మొదటి మానవుని సృష్టి వృత్తాంతం, భూమిపై అతని ప్రాతినిధ్యం, దానిని అభివృద్ధి చేసే బాధ్యతను అతనికి అప్పగించడం, అందులో ప్రాతినిధ్యం వహించడానికి అతనికి సహాయపడే దైవిక ధర్మశాసనాల మరియు విశ్వ నియమాల వివరణ, ఖుర్ఆన్ మార్గదర్శకాల నీడలో మానవుడు నిర్మించవలసిన ఉన్నతమైన నాగరికతను ఏర్పరచడం, మరియు గతించిన జాతులు ఏ విధంగా మార్గభ్రష్టతకు గురై దౌర్జన్యానికి పాల్పడి భూమిలో కల్లోలాన్ని వ్యాపింపజేశాయో అన్న విషయాల వివరణ, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారి కెలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.﴿ [అర్రూమ్: 9] మహోన్నతుడైన అల్లాహ్ వాక్కు: ﴾వారికి ఇహలోక జీవితపు బాహ్యరూపం మాత్రమే తెలుసు మరియు వారు పరలోకాన్ని గురించి ఏమరుపాటులో పడి ఉన్నారు. ఏమీ? వారు తమలో తాము (ఎన్నడూ) ఆలోచించలేదా? ఆకాశాలనూ, భూమినీ మరియు వాటి మధ్య ఉన్నదంతా, అల్లాహ్ సత్యంతో ఒక నిర్ణీత గడువు కొరకు మాత్రమే సృష్టించాడని? అయినా నిశ్చయంగా ప్రజలలో చాలా మంది తమ ప్రభువును దర్శించవలసి వున్న వాస్తవాన్ని తిరస్కరిస్తున్నారు. ఏమీ? వీరు భూమిపై ప్రయాణం చేయలేదా? వీరి పూర్వీకుల గతి ఏమయిందో చూడటానికి? వారు, వీరి కంటే ఎక్కువ బలవంతులుగా ఉండేవారు మరియు వారు భూమిని బాగా దున్నేవారు, సేద్యం చేసేవారు మరియు దానిపై, వీరి కట్టడాల కంటే ఎక్కువ కట్టడాలు కట్టారు మరియు వారి వద్దకు వారి సందేశహరులు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చారు. అల్లాహ్ వారికి ఎలాంటి అన్యాయం చేయలేదు, కాని వారే తమకు తాము అన్యాయం చేసుకున్నారు. చివరకు చెడుకార్యాలు చేసిన వారి ముగింపు చెడుగానే జరిగింది. ఎందుకంటే, వారు అల్లాహ్ సూచనలను అబద్ధాలని నిరాకరించేవారు. వాటిని గురించి ఎగతాళి చేసేవారు. అల్లాహ్ యే సృష్టి ప్రారంభిస్తాడు, తరువాత దానిని తిరిగి ఉనికిలోకి (పూర్వ స్థితిలోకి) తెస్తాడు. ఆ తరువాత మీరంతా ఆయన వైపునకే మరలింప బడతారు.﴿ [అర్రూమ్: 7-11] మరియు దైవభీతిపరులకు ఫలితం లభిస్తుందని అల్లాహ్ స్పష్టపరచాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఆ పరలోక జీవితపు గృహాన్ని మేము భూమిలో పెద్దరికం చూపగోరని వారి కొరకు మరియు కల్లోలం రేకెత్తించని వారి కొరకు ప్రత్యేకిస్తాము. మరియు దైవభీతి గలవారికే (మేలైన) పర్యవసానం ఉంటుంది.﴿ [అల్ ఖిసస్: 83]
12- ఖుర్ఆన్లో ఉన్న బుద్ధిపరమైన ఆధారాలు, తార్కిక ఉపమానాలు, ఉదాహరణలు మరియు ప్రత్యర్థులను నిశ్శబ్దులను చేసే ప్రశ్నలు ఎంతో విస్తారంగా ఉన్నాయి; వాటిని పూర్తిగా ఆవరించడం చాలా కష్టసాధ్యం. ఇవన్నీ ఖుర్ఆన్ ప్రస్తావించిన విషయాలపై స్పష్టమైన సాక్ష్యాలు మరియు ఖచ్చితమైన ప్రమాణాలు. నిష్పక్షపాతంగా వీటిని పరిశీలించే వ్యక్తి, అవి సూచించిన సత్యాన్ని అంగీకరించి లొంగిపోవడం తప్ప మరేమీ చేయలేడు. అంతేకాక, నిజాయితీతో సత్యాన్వేషణ చేసే నాస్తికుడు కూడా వీటిని పరిశీలిస్తే తన నాస్తికత్వాన్ని విడిచిపెట్టి, ఈ మహత్తర ఖుర్ఆన్ తీసుకువచ్చిన సత్యాన్ని విశ్వసిస్తాడు.
13- అత్యున్నతమైన మహోన్నత విలువలు : ఇవి అందుబాటులో ఉండి, వాటిని సాధించడానికి కృషి చేస్తే తప్ప ఒక మార్గదర్శక నాగరికత లేదా సమగ్ర పౌర సమాజం ఏర్పడజాలదు. కాబట్టి పవిత్ర ఖురాన్లో మీరు విశ్వాస, న్యాయ, ఆరోగ్య, భద్రతా, సామాజిక, ప్రవర్తనా మరియు ఆర్థిక విలువలతో పాటు భూమిపై మానవ మనుగడకు అవసరమైన ఇతర విలువలు మొదలైన వాటిని కనుగొంటారు.
మరియు పవిత్ర ఖుర్ఆన్ ను పఠించేవారు గమనించవలసిన విషయం ఏమిటంటే, మిగతా మానవ గ్రంథాల వలె ఖుర్ఆన్ విషయానుసారంగా వర్గీకరించబడి ఉండటాన్ని వారు పొందలేరు; బదులుగా ఇదొక దైవ గ్రంథం, ఇందులో విశ్వాస సంబంధిత అంశం, దాని ఆధారం మరియు దాని ప్రతిఫలం అనేవి భూమిని అభివృద్ధి పరుచుటకు గల ప్రాపంచిక నియమంతో అనుసంధానించబడి వస్తాయి. దానిని అనుసరించి, ఈ విషయంలో అవిధేయత చూపిన పూర్వపు జాతులలోని ఒక జాతి పరిస్థితి యొక్క వివరణ వస్తుంది. కాబట్టి, దివ్యఖుర్ఆన్ వివరించిన విషయాలను తెలుసుకోవాలని కోరుకునే వారు, అందులోని అంశాలను గ్రహించడానికి ఖుర్ఆన్ ను పూర్తిగా పఠించాలి.
కావున, తన మానవత్వాన్ని గౌరవించే మరియు తన బుద్ధిని సన్మానించే ప్రతి ఒక్కరూ, మానవాళికి లభించిన గ్రంథాలలో దీనికంటే ఉత్తమమైన గ్రంథం మరొకటి లేని ఈ మహా దివ్యగ్రంథాన్ని చదవడానికి గట్టిగా కృషి చేయాలి, లేదా ఒకవేళ అతనికి అరబీ భాష తెలియకపోతే దాని భావార్థం యొక్క అనువాదాన్ని చదవాలి. ఒక బుద్ధిమంతుడికి, అత్యంత వివేకవంతుడైన ఒక జ్ఞాని ఒక పుస్తకాన్ని రచించాడని మరియు అందులో తన జ్ఞానాన్నంతటినీ నిక్షిప్తం చేశాడని చెప్పబడితే, మనిషి దానిని అధ్యయనం చేసేందుకు కృషి చేయడం ఎంతో సమంజసం. అలాంటప్పుడు, ఓ మనిషీ! సాక్షాత్తూ ఒక దైవగ్రంథమే నీ ముందు ఉండి, అది ఏ భాషలో అవతరించిందో ఈ రోజు వరకు అదే భాషలో ఉండి, అందులో ఏ అక్షరమైన తగ్గడం గానీ, పెరగడం గానీ జరగకుండా రక్షించబడి, ఎలాంటి మార్పులు చేర్పులకు గురికాకుండా సురక్షితంగా భద్రంగా ఉన్నప్పుడు, మరియు అందులో గతించిన వారి వృత్తాంతాలు, గడిచిన మరియు మిగిలి ఉన్నవారి కోసం ధర్మశాస్త్రం, మరియు ప్రతి ప్రాణి యొక్క అంతిమ గమ్యం గురించి స్పష్టమైన వివరణ ఉండి కూడా, ఆ తర్వాత నీవు దానిని చదవకపోవడం ఎలా సమంజసం? నిశ్చయంగా మనిషి ఖుర్ఆన్ను విస్మరించడం మరియు దాని పట్ల శ్రద్ధ వహించకపోవడం వలన ఖుర్ఆను కరీంకు ఎటువంటి నష్టం వాటిల్లదు, బదులుగా ముఖం తిప్పుకున్న ఆ వ్యక్తికే నష్టం వాటిల్లుతుంది; ఎందుకంటే అల్లాహ్ తన సృష్టి పట్ల ఎలాంటి అవసరం లేనివాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఈ ఖుర్ఆన్ ను చదివి వినిపించాలని కూడా (ఆజ్ఞ ఇవ్వబడింది). కావున మార్గదర్శకత్వం పొందినవాడు తన మేలుకే, మార్గదర్శకత్వం పొందుతాడు. మరియు మార్గభ్రష్టుడైన వాడితో అను: "నిశ్చయంగా, నేను హెచ్చరిక చేసేవాడను మాత్రమే!﴿ [అన్-నమ్ల్ : 92] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కావున (అల్లాహ్ మార్గంలో) పాటుపడే వాడు నిశ్చయంగా, తన (మేలు) కొరకే పాటు పడుతున్నాడని (తెలుసుకోవాలి). నిశ్చయంగా, అల్లాహ్ సర్వలోకాల వారి అక్కర ఏ మాత్రం లేనివాడు.﴿ [అల్-అన్'కబూత్: 6]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ను రచించారని మరియు దానిని ఇంజీల్ (కొత్త నిబంధన - Gospel) నుండి నకలు చేశారని అనడం సరైనదేనా?
సమాధానం:
ఈ ప్రశ్నకు సమాధానంగా మేము ఇలా అంటున్నాము:
మొదటిది: ఈ ప్రశ్న అడిగిన వ్యక్తికి ఖుర్ఆన్ గురించి తెలియదు మరియు ఇంజీల్ గురించి తెలియదు, ఎందుకంటే ఖుర్ఆన్, ఇంజీల్ కు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మరియు ఇంజీల్ అనేది ఒకే ఒక ఇంజీల్ కాదు, బదులుగా అవి అనేక సువార్తలు. ప్రవక్త ముహమ్మద్ ﷺ మార్కు లేదా లూకా లేదా మత్తయి లేదా యోహానుల నుండి, లేదా పౌలు పత్రికల నుండి లేదా యాకోబు పత్రికల నుండి గ్రహించారని ప్రశ్నించే వ్యక్తి ఉద్దేశ్యమా?
రెండవది: సువార్తలు(ఇంజీల్ లు) చాలా విషయాలలో తమలో తాము పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి, యేసుక్రీస్తు దేవుని కుమారుడని స్థిరపరచడానికి యోహాను సువార్త వచ్చింది — వారు చెప్పేదానికి అల్లాహ్ ఎంతో అతీతుడు మరియు మహోన్నతుడు — అయితే మిగిలిన మూడు సువార్తలు కుమారుడనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదు. అలాగే, శిలువ వేసే విషయంలో కూడా అవి భయంకరమైన వైరుధ్యాలను కలిగి ఉన్నాయి. అలాంటప్పుడు, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏ సువార్త నుండి గ్రహించారు?
మూడవది :- యూదులు మరియు క్రైస్తవులు భిన్నంగా విశ్వసించే కొన్ని సమస్యలను మహత్తర ఖుర్ఆన్ సరిదిద్దింది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ ఇస్రాయీల్ సంతతి వారు విభేదిస్తూ వున్న పెక్కు విషయాల వాస్తవాన్ని వారికి తెలుపుతున్నది.﴿ [సూరతు అన్నమల్: 76] ఈ విషయాలలో నుంచి సత్యవంతురాలైన మహిళకు ఆపాదించబడిన నిందల నుండి ఆమె పవిత్రత కూడా ఉంది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మర్యమ్ కుమారుడు మసీహ్ (క్రీస్తు) కేవలం ఒక ప్రవక్త మాత్రమే. అతనికి పూర్వం కూడా అనేక ప్రవక్తలు గతించారు. మరియు అతని తల్లి సత్యవతి (సిద్ధీఖహ్). వారిద్దరూ ఆహారం తినేవారు. చూడండి! మేము వారికి ఈ సూచనలను ఏ విధంగా స్పష్టపరిచామో! అయినా చూడండి! ఏ విధంగా వారు మోసగింపబడుతున్నారో (సత్యం నుండి మరలింపబడుతున్నారో)!﴿ [సూరతుల్ మాయిదా: 75] అదేవిధంగా అంతిమ కాలంలో మసీహ్ అలైహిస్సలాం దిగిరావడం అనే విషయానికి వస్తే, దాసులను విచారించడానికి ఆయన అల్లాహ్ కుమారుని హోదాలో దిగి వస్తారని క్రైస్తవులు విశ్వసిస్తారు. కానీ ఆయన ఒక మానవుడు మరియు సందేశహరుడు అని, ఆయన ప్రళయ ఘడియను సూచించే చిహ్నాలలో ఒకటిగా దిగివస్తారని ఖుర్ఆన్ రుజువు చేసింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾మరియు నిశ్చయంగా, అతని (ఈసా పునరాగమనం) అంతిమ ఘడియ రావటానికి సూచన. కావున మీరు దానిని (ఆ ఘడియను) గురించి సంశయంలో పడకండి. మరియు నన్నే (అల్లాహ్ నే) అనుసరించండి, ఇదే ఋజుమార్గం.﴿ [సూరతుల్ జుఖ్'రుఫ్: 61].
నాల్గవది: మసీహ్ అలైహిస్సలాం మరియు ఆయన తల్లి అలైహస్సలాం గురించి క్రైస్తవులకు తెలియని విషయాలను గొప్పదైన ఖురాన్ పేర్కొన్నది. వాటిలో పుట్టిన తరువాత మసీహ్ మాట్లాడటం మరియు ఆకాశం నుండి ఆహార పళ్ళెము అవతరించటం (దిగిరావటం) ఉన్నాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾దానికి మర్యమ్ కుమారుడు ఈసా (ఏసు): "ఓ అల్లాహ్! మా ప్రభూ! ఆకాశం నుండి ఆహారంతో నిండిన ఒక పళ్ళాన్ని మా కొరకు అవతరింపజేయి (దింపు); అది మాకు మొదటివాని నుండి చివరివాని వరకు పండుగగా ఉండాలి; అది నీ తరపు నుండి ఒక సూచనగా ఉండాలి. మాకు ఆహారాన్ని ప్రసాదించు. నీవే అత్యుత్తమమైన ఉపాధి ప్రదాతవు!" అని ప్రార్థించాడు.﴿ [సూరతుల్ మాయిదహ్: 114]
ఐదవది: మహత్తర ఖుర్ఆన్ సువార్తలలో (అనాజీల్ లో) ఉన్న పొరపాట్ల నుండి సురక్షితంగా ఉంది, మరియు ఇంజీల్ లో ఉన్న అనేక పరస్పర విరుద్ధ విషయాల నుండి సురక్షితంగా ఉంది.
ఆరవది: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు చదవడం మరియు వ్రాయడం ఎలాగో తెలియదు, మరియు మహత్తరమైన ఖుర్ఆన్ లో దీని ప్రస్తావన వచ్చింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾మరియు (ఓ ముహమ్మద్!) ఇంతకు పూర్వం నీవు ఏ గ్రంథాన్ని కూడా చదువ గలిగే వాడవు కావు మరియు దేనిని కూడా నీ కుడిచేతితో వ్రాయగలిగే వాడవూ కావు. అలా జరిగి వుంటే ఈ అసత్యవాదులు తప్పక అనుమానానికి గురి అయి ఉండేవారు.﴿ [సూరతుల్ అన్'కబూత్: 48] మరియు ఆయన సమాజం నిరక్షరాస్యులు, వారిలో చదవడం ప్రాచుర్యంలో లేదు, మరియు మక్కాలో గ్రంథ ప్రజల (అహ్లె కితాబ్) గ్రంథాలు వాడుకలో లేవు, మరియు గ్రంథ ప్రజల వద్ద ఉన్నవాటి గురించి వారికి జ్ఞానం లేదు.
ఈ వివరణ తరువాత, ఏ నిష్పక్షపాతమైన వ్యక్తి అయినా ఇలా అనగలడా: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్ఆన్ ను ఇంజీల్ నుండి వ్రాశారని మరియు దాని నుండే నకలు చేశారని. మరియు ఒక నిష్పక్షపాతమైన వ్యక్తి మేము సమాధానంగా వ్రాసిన దాన్ని చదివినప్పుడు, ప్రశ్నించిన ఆ వ్యక్తికి గొప్ప ఖుర్ఆన్ గురించి గానీ లేదా ఇంజీల్ గురించి గానీ ఏమీ తెలియదని అతను ఖచ్చితంగా తీర్పునిస్తాడని మేము దృఢంగా విశ్వసిస్తున్నాము.
ఇంజీల్ లో పవిత్ర ఖుర్ఆన్ కు అనుగుణంగా ఉండే విషయాలు, మసీహ్ అలైహిస్సలాం తీసుకువచ్చిన సత్యం యొక్క అవశేషాలు. ఉదాహరణకు, కేవలం అల్లాహ్ ఒక్కడినే ఆరాధించమని పిలవడం వంటివి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, పవిత్ర ఖుర్ఆన్ పై వివాదాలు సృష్టిస్తూ, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పవిత్ర ఖుర్ఆన్ ను ఇంజీల్ నుండి నకలు (కాపీ) చేశారని క్రైస్తవులను భ్రమపెట్టేవారు ఒక వాస్తవాన్ని విస్మరిస్తున్నారు. అదేమిటంటే, ఇంజీల్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం రాకను స్పష్టంగా పేర్కొంది, ఆయన శుభవార్తను తెలియజేసింది మరియు ఆయన పంపబడినప్పుడు ఆయనను విశ్వసించాలని తన అనుచరులకు ఆదేశించింది. కానీ వారు వీటిని ప్రస్తావించరు; పైగా వాటిని దాచిపెట్టడానికి మరియు వక్రీకరించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు.
***
ప్రశ్న:
అల్లాహ్ ప్రవక్తపై దివ్యఖుర్ఆన్ ను ఎందుకు అవతరింపజేశాడు? మరియు దీని అర్థం తౌరాత్ మరియు ఇంజీలు రెండింటినీ రద్దుపరచడమేనా? మరియు తౌరాత్ మరియు ఇంజీలును అనుసరించేవారు అల్లాహ్ తరపు నుండి సన్మార్గంలో లేరని దీని అర్థమా, అందుకే అల్లాహ్ దివ్యఖుర్ఆన్ ను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరింపజేశాడా?
సమాధానం:
ప్రశ్నించే వారికి ఇలా చెప్పబడుతుంది: దానికి ముందు ఇబ్రాహీం అలైహిస్సలాం పత్రాలు ఉన్నప్పటికీ, అల్లాహ్ తౌరాత్ ను ఎందుకు అవతరింపజేశాడు? మరియు దానికి ముందు తౌరాత్ ఉన్నప్పటికీ, అల్లాహ్ ఇంజీలును ఎందుకు అవతరింపజేశాడు? దానికి సమాధానం ఒక్కటే, అదేమిటంటే అల్లాహ్ ప్రతి కాలంలో ఆ కాలపు ప్రజలకు తగిన దానిని నిర్ణయిస్తాడు. ఇక విశ్వాస మూలాల విషయానికొస్తే, సందేశహరులందరిలో అవి సమానంగా ఉంటాయి, వారందరూ ఏకైక మహోన్నతుడైన అల్లాహ్ ఆరాధన వైపుకు మరియు తాగూత్ (అసత్య దైవాల) తిరస్కరణ వైపుకు పిలుపునిచ్చారు. అల్లాహ్ తౌరాత్ మరియు ఇంజీలు పరిరక్షణ బాధ్యత బనీ ఇస్రాయీల్ పండితులకు అప్పగించాడు, కావున వారు వాటిలో మార్పులు, చేర్పులు చేశారు. మహోన్నతుడైన అల్లాహ్ అంతిమ కాలంలో ఒక సందేశహరుడిని పంపుతాడని మరియు ఆయనతో సందేశహరుల పరంపరకు ముగింపు పలుకుతాడని, ఆయనే ప్రవక్త ముహమ్మద్ ﷺ అని వారి జ్ఞానంలో ఉండేది. కావున మహోన్నతుడైన అల్లాహ్ మునుపటి దైవిక నియమాలను రద్దు చేసే గ్రంథాన్ని ఆయనపై అవతరింపజేశాడు, అది ప్రళయం సంభవించే వరకు ప్రతి కాలానికి మరియు ప్రతి స్థలానికి తగినది. మరియు ఈసా అలైహిస్సలాం అంతిమ కాలంలో దిగివచ్చినప్పుడు దీని ప్రకారమే నిర్ణయాలు చేస్తారు. మరియు మహోన్నతుడైన అల్లాహ్ స్వయంగా అనేక కారణాల ద్వారా దీని పరిరక్షణ బాధ్యత తీసుకున్నాడు. కావున కొందరు వ్యక్తులు దానిలో మార్పులు చేయడానికి ఎంత ప్రయత్నించినా వారి వ్యవహారం బహిర్గతమవుతుంది. దీని ఆధారంగా, ఇస్లాంను పొంది కూడా దానిలో ప్రవేశించని ప్రతి యూదుడు లేదా క్రైస్తవుడు సన్మార్గంలో లేనట్లే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾గ్రంధ ప్రజలలోని పలువురు - వారి మనస్సులలో ఉన్న అసూయ వల్ల - సత్యం వారికి సుస్పష్టం అయినప్పటికీ, మీరు విశ్వసించిన తరువాత, మిమ్మల్ని ఏదో ఒక విధంగా, దాని (విశ్వాస మార్గం) నుండి మరల్చి మళ్ళీ సత్యతిరస్కారం వైపునకు తీసుకు పోదామని కోరుతుంటారు. అయితే (వారి పట్ల) అల్లాహ్ తన ఆదేశం ఇచ్చేవరకు, మీరు (వారిని) మన్నించండి, ఉపేక్షించండి. నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడు.﴿ [సూరతుల్ బఖరహ్:109] రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఎవరి చేతిలోనైతే ఈ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రాణాలు ఉన్నాయో, ఆయన సాక్షిగా, ఈ జాతిలో (ఈ మానవ జాతిలో) అది యూదుల జాతి గాని, మరియు క్రైస్తవుల జాతి గానీ ఎవరైతే నా గురించి విని కూడా నేను ఏ సందేశముతో అయితే పంపబడినానో దానిని విశ్వసించకుండానే చనిపోతాడో, అతడు తప్పకుండా నరకవాసులలో ఒకడు అవుతాడు.” [దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (153)] మరియు ఈ సమాజము అనగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాజం, అనగా: ఆయన ఎవరికైతే పంపబడ్డాడో వారు, మరియు దీనిని ఆహ్వానించబడిన సమాజం అని పిలుస్తారు. మరియు వారిలో ఆయనను విశ్వసించిన వారిని ఆహ్వానాన్ని స్వీకరించిన సమాజం అని పిలుస్తారు. దీని ఆధారంగా ఆ కాలంలో యూదుడైనా లేదా క్రైస్తవుడైనా, తౌరాత్ మరియు ఇంజీల్ లను అవి ఎలా అవతరించాయో అలాగే విశ్వసించి, ఎటువంటి మార్పులు మరియు వక్రీకరణలు చేయనివాడై ఉండి, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తగా పంపబడక మునుపు మరణిస్తే, అతను సన్మార్గముపై ఉన్నాడు. మరియు ఇస్లాం సందేశం చేరిన తరువాత కూడా ఇస్లాం స్వీకరించని ప్రతి ఒక్కరూ మార్గభ్రష్టత్వంలో ఉన్నారు.
***
(ఇస్లాం విభాగము)
ప్రశ్న:
ఇస్లాం అంటే ఏమిటి?
సమాధానం:
ప్రశ్న - ఇస్లాం ధర్మం అంటే ఏమిటి?
జవాబు: సాధారణ అర్థంలో ఇస్లాం అంటే: బాహ్యంగా మరియు అంతర్గతంగా అల్లాహ్ కు మనస్పూర్తిగా సమర్పించుకోవడం, ఆయనకు మాత్రమే విధేయత చూపటం మరియు ఆయన తన ప్రవక్తల ద్వారా నిర్ణయించిన ధర్మాన్ని అనుసరించటం. ఇది ఆయన ఆజ్ఞలను పాటించడం మరియు ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉండటం ద్వారా సాధ్యపడుతుంది, సాధారణ అర్థంలో ఇస్లాం అంటే ఇదే.
మరియు కొన్ని షరీయత్ లు (చట్టాలు) వేరైనప్పటికి, ఇది ప్రవక్తలందరి ధర్మము. ఇది అల్లాహ్ కు మాత్రమే లోబడి ఉండటం, కావున ఆయనకు మరియు ఇతరులకు లోబడి ఉండేవాడు ముష్రిక్ (బహుదైవారాధకుడు) అవుతాడు, మరియు ఆయనకు లోబడి ఉండని వాడు అహంకారి అవుతాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾నిశ్చయంగా, అల్లాహ్ కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్ కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే.﴿ [ఆలె ఇమ్రాన్: 19].
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿ [ఆలి ఇమ్రాన్ : 85]
ప్రామాణిక హదీసులో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు : «ప్రవక్తలంతా ఒకపితృ సోదరులు; వారి తల్లులు భిన్నంగా ఉంటారు,కాని అందరిధర్మం ఒకటే».
అల్లాత్: ఇది 'అల్ల' యొక్క బహువచనం మరియు అది సవతి, మరియు బనూ అల్లాత్ అనగా: ఒకపితృ సోదరులు మరియు వారి తల్లులు భిన్నంగా ఉంటారు. మరియు దాని అర్థం ప్రవక్తల ధర్మం యొక్క మూలం ఒకటే ఒక వేళ వారి షరీఅత్లు వేరైనా కూడా.
ఇస్లాం ప్రత్యేకమైన అర్ధం: ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ ప్రభవించిన పిమ్మట ఉన్నది: ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చి పంపించిన దానికి ఇది ప్రత్యేకించబడింది; ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ కు ఇచ్చి పంపించినది పూర్వ ధర్మాలన్నింటినీ రద్దు చేసింది, కావున ఆయనను అనుసరించినవాడు ముస్లిం అవుతాడు మరియు ఆయనను వ్యతిరేకించినవాడు ముస్లిం కాడు,
కాబట్టి, ప్రవక్తల అనుచరులు తమ ప్రవక్తల కాలంలో ముస్లిములు. ఆ విధంగా యూదులు మూసా అలైహిస్సలాం కాలంలో ముస్లిములు, మరియు క్రైస్తవులు ఈసా అలైహిస్సలాం కాలంలో ముస్లిములు.
అయితే ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పంపించబడ్డారో, వారు ఆయన్ను తిరస్కరించారు: కనుక వారు ముస్లింలు కారు.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ప్రతి సమాజం కొరకు వారి పరిస్థితికి మరియు కాలానికి అనుకూలమైన, వారి సంస్కరణకు హామీ ఇచ్చే మరియు వారి ప్రయోజనాలను కలిగి ఉన్న ధర్మశాస్త్రాన్ని నిర్ణయిస్తాడు. ఆ తరువాత ఆ ధర్మశాస్త్రాల గడువు ముగిసినందున అల్లాహ్ వాటిలో తాను కోరినవాటిని రద్దుపరుస్తాడు, చివరగా ఆయన తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చివరి ప్రవక్తగా భూమిపై ఉన్న ప్రజలందరి వద్దకు మరియు తీర్పు దినం వరకు అన్ని కాలాల కొరకు పంపించాడు,
మరియు ఆయన కొరకు ప్రతీ కాలము మరియు ప్రదేశము కొరకు సమగ్రమైన, సముచితమైన షరియత్ ను విధించాడు; అది మార్చబడదు మరియు రద్దు చేయబడదు; కావున భూమిపై ఉన్న ప్రజలందరికీ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం మరియు విశ్వసించడం తప్పనిసరి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(ఓ ముహమ్మద్!) వారిలో ఇలా అను: "మానవులారా! నిశ్చయంగా, నేను మీ అందరి వైపునకు (పంపబడిన) అల్లాహ్ యొక్క సందేశహరుడను...﴿ [అల్ అఅ్ రాఫ్: 158]
పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.﴿ [అల్ అంబియా 21:107]
మరియు అల్లాహ్ దీని ద్వారా ధర్మమును సమాప్తం చేశాడు మరియు దీని ద్వారా అనుగ్రహమును పరిపూర్ణం చేశాడు. మరియు ఇస్లాం ధర్మమును జీవితము యొక్క అన్ని రంగాల కొరకు సమగ్రమైన మరియు పరిపూర్ణమైనదిగా చేశాడు. ఇందులో అల్లాహ్ హక్కులను సంరక్షించడం, వాటిని పాటించడం మరియు నెరవేర్చడం, సృష్టి హక్కులు మరియు వాటికి కట్టుబడి ఉండటం మరియు మన చుట్టూ ఉన్న సృష్టితాల హక్కులు ఇమిడి ఉన్నాయి. మరియు ప్రతీ హక్కుదారునికి అతని హక్కును చెల్లించడాన్ని ముస్లింపై విధిగా చేస్తుంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾ఈనాడు నేను మీ ధర్మాన్ని మీ కొరకు పరిపూర్ణం చేసి, మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీ కొరకు అల్లాహ్ కు విధేయులుగా ఉండటాన్నే (ఇస్లాంనే) ధర్మంగా సమ్మతించాను.﴿ [అల్ మాయిదా: 3]
మరియు ఇస్లాం ధర్మం విజ్ఞానశాస్త్రం, బుద్ధి మరియు సహజసిద్ధతకు అనుగుణంగా ఉంటుంది, మరియు ఇది అన్ని రంగాలలో సరైన అనువర్తిత మరియు ప్రయోగాత్మక విజ్ఞానశాస్త్రాల ఫలితాలకు విరుద్ధంగా ఉండదు.
ఇస్లాంలో ప్రవేశించడానికి రెండు సాక్ష్యాలను ఉచ్చరించడం అవసరం: నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజఆరాధ్య దైవం ఎవ్వరూ లేరని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని. దీని అర్ధాన్ని తెలుసుకుని, దీనిపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి మరియు దీనికి అనుగుణంగా ఆచరించాలి. ఇంకా అల్లాహ్, ఆయన దేవదూతలు, ఆయన గ్రంథాలు, ఆయన ప్రవక్తలు, అంతిమ దినం మరియు విధిపై విశ్వాసం కలిగి ఉండటం అవసరం. మరియు ఒక వ్యక్తి తన ప్రభువును ఆయన విధించిన విధంగా ఆరాధించాలి; నమాజ్ స్థాపించాలి, జకాత్ చెల్లించాలి, రమజాన్ ఉపవాసాలు పాటించాలి మరియు దానికి స్థోమత ఉంటే దేవుని గృహానికి హజ్ చేయాలి. మరియు తన అన్ని వ్యవహారాలలో అల్లాహ్ కు పూర్తిగా లొంగిపోయి, ఆయన ఆదేశించిన వాటిని ఆచరించాలి మరియు ఆయన నిషేధించిన వాటిని విడిచిపెట్టాలి.
అల్లాహ్ మన మహానాయకుడు అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని ప్రసాదించుగాక.
***
ప్రశ్న:
ధర్మం యొక్క అవసరం ఏమిటి?
సమాధానం:
నిశ్చయంగా అన్నపానీయాల అవసరం కంటే ధర్మం ఆవశ్యకత చాలా ఎక్కువగా అవసరం ఉంది. ఎందుకంటే మనిషి సహజంగానే ధార్మికుడు, ఒకవేళ అతను నిజమైన సత్యధర్మాన్ని పొందలేకపోతే, మానవులు కల్పించిన విగ్రహారాధన మతాలలో జరిగినట్లుగా అతను తన కోసం ఒక ధర్మాన్ని సృష్టించుకుంటాడు. మరియు మనిషికి ఇహలోకంలో భద్రత,రక్షణ ఎంత అవసరమో, అతని మరణం తరువాత మరియు పరలోకంలో కూడా అతనికి భద్రత,రక్షణ అంతే అవసరం ఉంది.
సత్యధర్మం అనేది దానిని అనుసరించేవారికి ఇహపరలోకాల్లో పూర్తి శాంతిని ప్రసాదిస్తుంది. ఉదాహరణకు:
- ఒక వేళ మనం ఒక మార్గములో నడుస్తూ ఉండి, దాని ముగింపు మనకు తెలియకపోతే, మన ముందు రెండు ఎంపికలు ఉంటాయి: ఆ మార్గములోని సూచికల పై ఉన్న సూచనలను మనం అనుసరించడం, లేదా ఊహించడానికి ప్రయత్నించడం, ఇది మనం దారితప్పడానికి మరియు విధ్వంసానికి కారణం కావచ్చు.
- ఒకవేళ మనము ఒక టెలివిజన్ పరికరాన్ని కొనుగోలు చేసి, దాని ఆపరేటింగ్ సూచనలను పరిశీలించకుండా దానిని పనిచేయించడానికి ప్రయత్నిస్తే, మనము దానిని పాడుచేస్తాము. ఒకే కర్మాగారం నుండి తయారైన టెలివిజన్, ఉదాహరణకు, వేరొక దేశానికి చేరే అదే సూచనల పుస్తకంతోనే (instruction manual) ఇక్కడికి మనకు చేరుతుంది, కాబట్టి మనము దానిని అదే విధంగా ఉపయోగించాలి.
- ఉదాహరణకు, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని సంప్రదించాలనుకుంటే, ఆ మరొక వ్యక్తి తనకు సాధ్యమయ్యే విధానాన్ని అతనికి తెలియజేయాలి, అనగా ఇమెయిల్ ద్వారా కాకుండా ఫోన్ ద్వారా మాట్లాడమని చెప్పడం, మరియు అతను స్వయంగా అందించిన ఫోన్ నెంబర్‌ను మాత్రమే ఉపయోగించాలి, వేరే ఏ ఇతర నెంబర్‌ను ఉపయోగించకూడదు.
గత ఉదాహరణలు మనకు తెలియజేసేదేమిటంటే, మనుషులు తమ ఇష్టాలకు అనుగుణంగా అల్లాహ్ ను ఆరాధించడం సాధ్యం కాదు. ఎందుకంటే వారు ఇతరులకు హాని చేసే కంటే ముందు తమకు తామే హాని చేసుకుంటారు. సర్వలోకాల సృష్టికర్తతో సంబంధం ఏర్పరచుకోవడానికి కొంతమంది ప్రజలు ఆరాధనా మందిరాలలో నృత్యం మరియు గానం చేయడం మనం చూస్తాము, మరియు ఇతర ప్రజలు తమ నమ్మకం ప్రకారం దైవాన్ని మేల్కొల్పడానికి చప్పట్లు కొడతారు. వారిలో కొందరు ఒక మధ్యవర్తిని ఎంచుకుని అల్లాహ్ ను ఆరాధిస్తారు, మరియు అల్లాహ్ మనిషి లేదా రాయి రూపంలో వస్తాడని భావిస్తారు. మనకు ప్రయోజనం చేకూర్చని మరియు హాని చేయని, పైగా పరలోకంలో మన నాశనానికి కారణమయ్యే వాటిని మనం ఆరాధించినప్పుడు, అల్లాహ్ మనలను మన నుంచే రక్షించాలనుకుంటున్నాడు. కాబట్టి అల్లాహ్ తో పాటు ఇతరులను ఆరాధించడం అత్యంత ఘోరమైన పాపంగా పరిగణించబడుతుంది, మరియు దాని శిక్ష నరకాగ్నిలో శాశ్వతంగా ఉండటం. నిశ్చయంగా అల్లాహ్ యొక్క గొప్పదనం ఏమిటంటే, ఆయనతో మన సంబంధాన్ని మరియు మన చుట్టూ ఉన్నవారితో మన సంబంధాన్ని క్రమబద్ధీకరించడానికి, మనమందరం అనుసరించాల్సిన ఒక వ్యవస్థను ఆయన మన కోసం ఏర్పాటు చేశాడు. దానినే 'దీన్' (ధర్మం) అని అంటారు.
***
ప్రశ్న:
ఒక వ్యక్తి ముస్లింగా ఎలా మారతాడు?
సమాధానం:
ఇస్లాంలో ప్రవేశించాలనుకునే వారు ఏ మస్జిద్ కు లేదా పండితుని (ఆలిమ్) వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎవరైతే ఇస్లాంలో ప్రవేశించాలనుకుంటారో వారు కేవలం ఇలా పలికితే సరిపోతుంది: అష్హదు అన్ లాయిలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ రసూలుల్లాహ్ (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప నిజఆరాధ్య దైవం లేడని మరియు నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మద్ అల్లాహ్ యొక్క ప్రవక్త అని). దీని అర్ధాన్ని విశ్వసిస్తూ పలకాలి, అదేమిటంటే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజమైన ఆరాధ్య దైవం ఎవరూ లేరని ఖచ్చితంగా విశ్వసించాలి మరియు ఇతర అన్ని ఆరాధ్య దైవాలను మరియు మతాలను తిరస్కరించాలి. తన హృదయంలో అల్లాహ్ పై విశ్వాసాన్ని కలిగి ఉండాలి, ఆయన ప్రతిదానికీ యజమాని అయిన ప్రభువు అని మరియు ఆయన తాను కోరుకున్నట్లుగా దానిని నియంత్రిస్తాడని విశ్వసించాలి. మరియు దైవదూతలను విశ్వసించాలి, వారు అల్లాహ్ కు విధేయులైన సృష్టి అని విశ్వసించాలి. మరియు అల్లాహ్ తన ప్రవక్తలపై (వారిపై శాంతి కలుగుగాక) అవతరింపజేసిన తౌరాత్ మరియు ఇంజీల్ లాంటి గ్రంథాలను విశ్వసించాలి, ఖురాన్ ఆ గ్రంథాలను రద్దు చేస్తుందని మరియు అది ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేయబడిన గ్రంథమని విశ్వసించాలి. మరియు ప్రవక్తలందరినీ మొత్తంగా విశ్వసించాలి; ముఖ్యంగా ఒకవేళ అతను క్రైస్తవుడైతే, వారిలో ఈసా (అలైహిస్సలాం) అల్లాహ్ యొక్క దాసుడు మరియు ఆయన ప్రవక్త అని, అల్లాహ్ అతనిని తన ఒక మాట ద్వారా సృష్టించాడని, అనగా ఆయన 'కున్' (అయిపో) అని అనగానే అతను సృష్టించబడ్డాడని విశ్వసించాలి. మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ప్రవక్తలలో మరియు సందేశహరులలో (వారిపై శాంతి కలుగుగాక) చివరివారు అని, ఆయన తర్వాత ఏ ప్రవక్త మరియు సందేశహరుడు రారు అని, ఆయన ధర్మం (షరియత్) మునుపటి అన్ని ధర్మాలను రద్దు చేస్తుందని విశ్వసించాలి. మరియు పరలోక దినాన్ని విశ్వసించాలి, దీని అర్థం మరణం తర్వాత వచ్చే అదృశ్య విషయాలైన శిక్ష, సుఖం మరియు పునరుత్థానాలను విశ్వసించడం. మరియు పరలోక దినం అంటే తీర్పు దినం (ఖియామత్ దినం), అది ప్రతిఫలం మరియు లెక్కల దినం. మరియు విధిని (ఖజా మరియు ఖదర్) విశ్వసించాలి, విశ్వంలో జరిగే ప్రతిదీ అది జరగకముందే అల్లాహ్ కు వివరంగా తెలుసు అని, ఆయన దానిని 'లౌహె మహ్ఫూజ్' (భద్రపరచబడిన పలక)లో లిఖించాడని, ఆయన జ్ఞానం, సంకల్పం మరియు సృష్టి లేకుండా ఏదీ జరగదని విశ్వసించాలి. ఆతరువాత అతను పరిశుభ్రత, నమాజు మరియు నిషేధించబడిన వాటిని వదిలివేయడం వంటి ఇస్లాం యొక్క ఆచారాలను నెమ్మదిగా నేర్చుకోవాలి.
***
ప్రశ్న:
ఇస్లాంను స్వీకరించిన వెంటనే నేను నమాజు చేయాలా?
సమాధానం:
అవును, ఇస్లాంలో ప్రవేశించినప్పుడు నమాజు నిర్వర్తించడం ఒక ముస్లింపై తప్పనిసరి, ఎందుకంటే నమాజు ఇస్లాం యొక్క మూలస్తంభాలలో రెండవది. మరియు అది ప్రవక్తలు మరియు సందేశహరులందరిపై (వారిపై శాంతి కలుగుగాక), మరియు ప్రళయదినం వరకు వారి అనుచరులపై అల్లాహ్ విధించిన ఆవశ్యక విధి. మరియు ఒక ముస్లిం ఇస్లాంలో ప్రవేశించినప్పుడు ఐదు పూటల నమాజును వాటి నిర్ణీత సమయాల్లో నిర్వర్తించడం తప్పనిసరి; ఎందుకంటే నమాజు విశ్వాసపరులపై నిర్ణీత సమయాల్లో నిర్వర్తించవలసిన ఆవశ్యక విధి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.﴿ [సూరతున్నిసా : 103] మరియు మూసా అలైహిస్సలాంతో ఆయన ప్రభువు సంభాషించినప్పుడు అల్లాహ్ ఆయనకు ఆదేశించిన రెండవ ఆదేశం నమాజు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾అతను దాని దగ్గరకు చేరినప్పుడు ఇలా పిలువబడ్డాడు: "ఓ మూసా! నిశ్చయంగా, నేనే నీ ప్రభువును, కావున నీవు నీ చెప్పులను విడువు. వాస్తవానికి, నీవు పవిత్రమైన తువా లోయలో ఉన్నావు. మరియు నేను నిన్ను (ప్రవక్తగా) ఎన్నుకున్నాను. నేను నీపై అవతరింపజేసే దివ్యజ్ఞానాన్ని (వహీని) జాగ్రత్తగా విను. నిశ్చయంగా, నేనే అల్లాహ్ ను! నేను తప్ప మరొక ఆరాధ్యుడు లేడు, కావున నన్నే ఆరాధించు మరియు నన్ను స్మరించడానికి నమాజ్ ను స్థాపించు.﴿ [సూరతు తాహా : 11-14]. మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మేము మూసాకు మరియు అతని సోదరునికి ఇలా దివ్యజ్ఞానం (వహీ) పంపాము: "మీరు, మీ జాతివారి కొరకు ఈజిప్టులో గృహాలను సమకూర్చుకోండి. మరియు మీ గృహాలను, ప్రార్థనా స్థలాలుగా చేసుకొని నమాజ్ లను స్థాపించండి. మరియు విశ్వాసులకు శుభవార్తలు ఇవ్వు.﴿ [సూరతు యూనుస్: 87]
నమాజుకు గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనది ఏమిటంటే అది మానవునికి సన్మార్గంలో స్థిరంగా ఉండటానికి మరియు అసహ్యకరమైన పనుల నుండి, పాపాల నుండి దూరంగా ఉండటానికి సహాయం చేస్తుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: (ఓ ప్రవక్తా!) నీపై దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేయబడిన గ్రంథాన్ని చదివి వినిపించు మరియు నమాజ్ ను స్థాపించు. నిశ్చయంగా, నమాజ్ అసహ్యకరమైన పనుల నుండి మరియు అధర్మమైన పనుల నుండి వారిస్తుంది. మరియు అల్లాహ్ ధ్యానమే (అన్నిటి కంటే) గొప్పది. మరియు మీరు చేసేదంతా అల్లాహ్ కు బాగా తెలుసు. [సూరతుల్ అన్'కబూత్: 45]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
నా వయస్సు పద్నాలుగు సంవత్సరాలు మరియు నేను ఇస్లాంను స్వీకరించడానికి నా కుటుంబం అంగీకరించదని నేను భావిస్తున్నాను?
ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి కొన్ని కోణాలు ఉన్నాయి:
మొదటిది: దైవప్రవక్తలు మరియు సందేశహరుల (అలైహిముస్సలాతు వస్సలామ్) మార్గాన్ని ఎంపిక చేసుకోవాలనే మనిషి యొక్క నిర్ణయం అత్యంత గొప్ప నిర్ణయం; ఎందుకంటే అందులో అల్లాహ్ ప్రసన్నత ఉంది, మరియు ఇహలోకం మరియు పరలోకంలో సాఫల్యం ఉంది. కాబట్టి తన మానవత్వాన్ని మరియు బుద్ధిని గౌరవించే ప్రతి ఒక్కరూ మనోవాంఛల బానిసత్వం నుండి మరియు అల్లాహ్ వైపు పయనించకుండా అడ్డుకునే సమాజపు సంకెళ్ల నుండి తప్పక విముక్తి పొందాలి, మరియు సరైన బుద్ధి, స్వచ్ఛమైన సహజస్వభావం మరియు సత్యమైన దైవవాణి (వహీ) మార్గనిర్దేశం చేసే దానిని విశ్వసించాలి.
రెండవది: అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, నీవు తప్పనిసరిగా ఇస్లాంను స్వీకరించాలనే నిశ్చితత్వం కలిగి ఉండాలి; ఎందుకంటే పరలోక శిక్ష నుండి నీ రక్షణ దీనిపైనే ఆధారపడి ఉంటుంది మరియు ఈ నిర్ణయంలో ఎలాంటి సందేహం లేకుండా దృఢంగా ఉండాలి.
మూడవది: అత్యుత్తమ ఫలితాలను ఆశించు, మరియు అత్యంత చెడ్డ పరిస్థితుల కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకో. అంటే: ఒకవేళ నీ కుటుంబం అంగీకరించి, "నీవు కోరినది చెయ్యి", లేదా "నీకు స్వేచ్ఛ ఉంది" అని లేదా అలాంటిదేమైనా చెప్తే అప్పుడు ఏమిటి? కోరుకున్నది ఇదే కదా, మరియు ఇది జరగడానికి అవకాశం ఉన్నదే కదా? అవును, కానీ షైతాను ఎల్లప్పుడూ ఇలాంటి ఆలోచనలు మరియు అనుమానాలతో నీకూ మరియు ఇస్లాంకూ మధ్య అడ్డుపడటానికి ప్రయత్నిస్తాడు. తరువాత ఒకవేళ వారు దానికి అంగీకరించకపోతే అప్పుడు ఏమిటి? నీవు ఉన్న స్థితి తప్పు అని తెలిసినప్పటికీ, అదే స్థితిలో ఉండిపోవడం సరైన పరిష్కారం అని నీవు భావిస్తున్నావా? సమాధానం 'కాదు', కానీ దానికి అనువైన పరిష్కారం గురించి ఆలోచించవలసి ఉంటుంది. మరియు ప్రతి వ్యక్తికీ తనకు అనువైన కాల మరియు స్థల పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరికైతే తన ఇస్లాంను దాచుకోవడం అనుకూలంగా ఉంటుందో, ఇన్ షా అల్లాహ్ దాని వలన ఎలాంటి నష్టం ఉండదు, మరియు వేరొకరికి తమ ఇస్లాంను బహిర్గతం చేయడం ఉత్తమం కావచ్చు.
నాల్గవది: ఒకవేళ ఇస్లాం స్వీకరించిన తర్వాత మీ కుటుంబంతో కలిసి ఉండటం, మరియు వారిని (సన్మార్గం వైపుకు) ఆహ్వానించడానికి ప్రయత్నించడమే ఉత్తమమైనట్లయితే, ఇదే ఉత్తమం. ఒకవేళ అది అనుకూలం కాదని మీరు భావించి స్వతంత్రంగా ఉండగలిగే శక్తి మీకు ఉన్నట్లైతే, మీరు ఆ విధంగా చేయవలసి ఉంటుంది. మీరు వారి నుండి విడిపోయినప్పటికీ, మీ కుటుంబాన్ని వదిలివేయమని లేదా వారితో సంబంధాలు తెంచుకోమని ఇస్లాం మిమ్మల్ని ఆదేశించదు, అంతేకాకుండా వారికి సన్మార్గం ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకుంటూ ఉండాలి. ఒకవేళ వారు ఇస్లాం స్వీకరించకపోయినప్పటికీ, వారిపట్ల అత్యుత్తమంగా వ్యవహరించాలని మరియు వారికి మేలు చేయాలని ఇస్లాం మిమ్మల్ని ఆదేశిస్తుంది.
ఐదవది: మానవుడు తన సోదరుల అండతో బలవంతుడు, స్వతహాగా చాలా బలహీనుడు. కాబట్టి మీకు అండగా నిలవగలిగే తోటి ముస్లింలతో సత్సంబంధాలు కలిగి ఉండటం మీకు మంచిది.
***
ప్రశ్న:
భార్య తప్ప ఇతర కుటుంబ సభ్యులు ఇస్లాంను స్వీకరించని పరిస్థితిలో, ఇస్లాంను స్వీకరించిన ముస్లిం ఏమి చేయాలి?
సమాధానం:
ఒకవేళ అతని భార్య యూదురాలు లేదా క్రైస్తవురాలు అయినట్లయితే, నికాహ్ కొనసాగించడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి. ఎవడు విశ్వాస మార్గాన్ని తిరస్కరిస్తాడో అతడి కర్మలు వ్యర్థమవుతాయి. మరియు అతడు పరలోకంలో నష్టం పొందేవారిలో చేరుతాడు.﴿ [సూరతుల్ మాయిదహ్: 5] అతను ఆమెను ఇస్లాం వైపుకు ఆహ్వానించడానికి మరియు ఆమె కోసం ప్రార్థన (దుఆ) చేయడానికి కృషి చేయాలి, బహుశా అల్లాహ్ ఆమెకు సన్మార్గం (హిదాయత్) ప్రసాదించవచ్చు. ఒకవేళ అతని భార్య అహ్లె కితాబ్ (గ్రంథ ప్రజల)కు చెందినది కాకపోతే, భర్త ఇస్లాం స్వీకరించిన వెంటనే వారి వివాహం (నికాహ్) రద్దు అవుతుంది. బహుశా అల్లాహ్ ఆమెకు ఇస్లాం వైపునకు సన్మార్గం (హిదాయత్) చూపుతాడని అతను కొంత సమయం నిరీక్షించవచ్చు, కానీ ఆమె ఇస్లాం స్వీకరించే వరకు వారి మధ్య లైంగిక సంపర్కం జరగకూడదు.
***
ప్రశ్న:
భర్తకు ముందే భార్య ఇస్లాంను స్వీకరిస్తే, వారి వివాహం చెల్లుబాటు అవుతుందా?
సమాధానం:
ఒకవేళ ఆమెతో లైంగిక కలయిక జరిపిన ఆమె భర్త, ఆమె ఇద్దతు ముగియక ముందే ఇస్లాం స్వీకరిస్తే, వారి వివాహం చెల్లుబాటు అవుతుంది. మరియు ఒకవేళ ఆమె రుతుక్రమంలో ఉంటే ఇద్దతు మూడు రుతుస్రావాలు, లేదా ఆమెకు రుతుస్రావం కాకపోతే మూడు నెలలు. మరియు ఒకవేళ ఆమె ఇద్దతు ముగిసి, అతను ఇస్లాం స్వీకరించకపోతే ఆమె వివాహ ఒప్పందం రద్దవుతుంది. మరియు ఒకవేళ భర్త ఆమెతో లైంగిక కలయిక జరపకపోయి ఉంటే, ఆమె ఇస్లాం స్వీకరించిన వెంటనే విడిపోవడం జరుగుతుంది మరియు దాంతో వారి నికాహ్ రద్దవుతుంది.
***
ప్రశ్న:
నిజానికి ఇస్లాం ధర్మమే సత్యమైన ధర్మమని నాకు తెలుసు. అయితే నేను నిజంగా నమ్మకం లేకపోయినా, నేను పెరిగిన మతాన్ని విడిచిపెట్టడం నాకు కష్టంగా అనిపిస్తోంది.
సమాధానం:
అల్లాహ్ చిత్తంతో ఈ అవగాహన సన్మార్గానికి మొదటి అడుగు. వాస్తవానికి మనిషి సత్యాన్ని సూర్యునిలా ప్రకాశవంతంగా మరియు అసత్యాన్ని రాత్రిలా చీకటిగా చూసిన తరువాత కూడా, సత్యం పట్ల గుడ్డివాడిగా మారి చీకటిలోనే ఉండిపోవడం ద్వారా తనను తాను కించపరుచుకుంటాడు, తనపై తాను దౌర్జన్యం చేసుకుంటాడు మరియు తన బుద్ధికి దౌర్జన్యం చేసుకుంటాడు. నిశ్చయంగా తన మానవత్వాన్ని గౌరవించే మనిషి, కేవలం చిన్నప్పటి నుండి అలవాటు పడ్డాడనే కారణంతో అసత్యమని దృఢంగా తెలిసిన ధర్మంలో జీవిస్తూ, అల్లాహ్ తన కోసం ఇష్టపడి, దానిని చేరవేయడానికి తన సందేశహరులకు బాధ్యత అప్పగించిన సక్రమమైన ధర్మాన్ని విడిచిపెట్టడానికి నిరాకరిస్తాడు. నిశ్చయంగా సరైన బుద్ధి మరియు సరైన నిర్ణయం ఏమిటంటే, మనిషి తాను చూస్తున్న సత్యం వైపుకు మరలాలి, మరియు అసత్యమని తాను ఖచ్చితంగా నమ్మిన అసత్యాన్ని విడిచిపెట్టాలి. మరియు ఇహలోకంలో మరియు పరలోకంలో సాఫల్యం మరియు రక్షణ, అల్లాహ్ ను విశ్వసించి సందేశహరులను సత్యవంతులుగా నమ్మిన వారి కొరకేనని అతను తెలుసుకోవాలి. అలాగే అల్లాహ్ ను తిరస్కరించి, షైతానుల మార్గాన్ని అనుసరించిన వారి కొరకు రెండు లోకాలలో నష్టము, పతనము మరియు వినాశనము ఉన్నాయని కూడా అతను తెలుసుకోవాలి.
తరువాత మేము మీకు చెప్పేది ఏమిటంటే, మీరు పొందిన ఈ అవగాహన అద్భుతమైనది మరియు విలువైనది; కానీ అది ఇస్లాంలో ప్రవేశించడానికి దారితీయకపోతే దాని వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు, మరియు మీకు మా సలహా ఈ క్రింది విధంగా ఉంది:
మొదట: సకలలోకాల ప్రభువైన అల్లాహ్ వైపు నీ హృదయాన్ని మరల్చు, మరియు సత్యం కోసం నీ హృదయాన్ని విశాలపరచమని ఆయనను వేడుకో. రెండవది: ఒకవేళ నీవు ఇస్లాంలో ప్రవేశించక ముందే మరణిస్తే నీ గతి ఏమిటో ఆలోచించు. ఎందుకంటే నిర్ణయం తీసుకోవడంలో ఎదురయ్యే ఈ కష్టం మరియు ఇబ్బంది, ఒకవేళ మనిషి ఇస్లాంను తిరస్కరిస్తే మరణాంతరం అతను ఎదుర్కొనే కష్టంతో ఏమాత్రం పోల్చబడదు. మరియు బుద్ధిగలవాడు పరిణామాల గురించి ఆలోచిస్తాడు. మూడవది: ఇస్లాంలో ప్రవేశించకుండా నిన్ను నిరోధిస్తున్న మరియు నీవు కష్టంగా భావిస్తున్న విషయాన్ని ఆలోచించి గుర్తించు, మరియు దానికి పరిష్కారాన్ని వెతుకు. నాల్గవది: సాధ్యమైనంత వరకు నీ చుట్టూ ఉన్న సమాజాన్ని మార్చుకో; దీని ద్వారా, ఇన్ షా అల్లాహ్, సరైన నిర్ణయం తీసుకోవడం నీకు సులభతరం అవుతుంది.
***
ప్రశ్న:
ఇస్లాం విశ్వాసం ప్రకారం, నా ముస్లిమేతర కుటుంబం పరలోకంలో స్వర్గంలోకి ప్రవేశించదు, ఇది నిజమేనా?
సమాధానం:
సర్వస్తోత్రాలన్నీ అల్లాహ్ కొరకే. పరలోకంలో మానవుని అంతిమ గమ్యానికి సంబంధించిన విషయం అల్లాహ్ కే చెందుతుందని పాఠకుడు తెలుసుకోవాలి; ఎందుకంటే ఆకాశాలకు, భూమికి మరియు వాటిలో ఉన్నవాటన్నింటికీ అల్లాహ్ మాత్రమే యజమాని. మరియు ప్రతి స్థితిలోనూ సర్వస్తోత్రాలు ఆయనకే చెందుతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾సర్వస్తోత్రాలకు అర్హుడు అల్లాహ్ మాత్రమే! ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకే చెందుతుంది. మరియు పరలోకంలో కూడా సర్వస్తోత్రాలకు అర్హుడు ఆయనే! మరియు ఆయన మహా వివేకవంతుడు, సర్వం తెలిసినవాడు.﴿ [సూరతు సబా: 1], ఆజ్ఞాపించే అధికారం ఆయనకే చెల్లు మరియు సృష్టితాలన్నీ ఆయన వైపునకే మరలించబడతాయి, వారిలోని పుణ్యాత్ములు మరియు పాపాత్ములు, విశ్వాసులు మరియు అవిశ్వాసులు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఆయనే, అల్లాహ్! ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు! మొదట (ఇహలోకంలో) మరియు చివరకు (పరలోకంలో) స్తుతింపదగినవాడు కేవలం ఆయనే! మరియు విశ్వన్యాయాధిపత్యం ఆయనదే. మీరంతా ఆయన వైపునకే మరలింపబడతారు.﴿ [సూరతుల్ ఖసస్: 70] మరియు నిశ్చయంగా 'సర్వసామ్రాజ్యం' అల్లాహ్ ఆధీనంలో ఉంటుంది, మరియు ఆయనే పరలోకదినానికి యజమాని. కావున ఆయనతో పాటు ఎవరూ నిర్వాహకుడు లేడు, ఆయన అనుమతి లేకుండా ఎవరూ సంరక్షకుడు కానీ, సిఫారసు చేసేవాడు కానీ లేడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾తీర్పుదినానికి స్వామి.﴿ [సూరతుల్ ఫాతిహా: 4] ఇది తెలిసినప్పుడు, మనకు దృఢంగా తెలిసినది ఏమంటే: అల్లాహ్ ప్రజలను తనను ప్రభువుగా అంగీకరించే సహజ స్వభావంపై సృష్టించాడని, సృష్టిపై వాదన స్థాపించబడటానికి వారి కొరకు ప్రవక్తలను పంపించాడని మరియు గ్రంథములను అవతరింపజేశాడని, మరియు వారికి వినికిడి, చూపు మరియు హృదయాలను ప్రసాదించాడని. మరియు ప్రజల సృష్టి యొక్క ఉద్దేశం వారు ఆయనను ఆరాధించటం మరియు ఆయనకు సాటిగా దేనినీ కల్పించకపోవటమే అని ఆయన ప్రజలకు వివరించాడు. మరియు సృష్టిని అల్లాహ్ శిక్ష నుండి హెచ్చరించమని, చెడు ముగింపు గురించి వారిని భయపెట్టమని, మరియు భూమ్యాకాశాలంత విశాలమైన స్వర్గం గురించి వారికి శుభవార్తనివ్వమని ఆయన తన ప్రవక్తలకు (వారిపై శాంతి కలుగుగాక) బాధ్యతను అప్పగించాడు. మరియు ప్రతి ప్రవక్తా తన జాతి వారికి శుభవార్తనిచ్చాడు మరియు వారిని హెచ్చరించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.﴿ [సూరతున్నిసా:165] మరియు ప్రళయదినాన ప్రజల గమ్యం ఈ రెండు వర్గాలకు మరియు రెండు గమ్యాలకు వెలుపల ఉండదని అల్లాహ్ స్పష్టపరచి ఇలా పలికాడు: ﴾మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.﴿ [సూరతు అష్షూరా: 7] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, ఇందులో పరలోక శిక్షకు భయపడే వారికి ఒక సూచన ఉంది. అది సర్వ మానవులను సమావేశ పరిచే రోజు! ఆ దినమున అందరూ హాజరవుతారు. మరియు మేము దానిని కేవలం ఒక నియమిత కాలం వరకు మాత్రమే ఆపి ఉన్నాము. ఆ దినం వచ్చినప్పుడు, ఆయన (అల్లాహ్) సెలవు లేనిదే, ఏ ప్రాణి కూడా మాట్లాడజాలదు. వారిలో కొందరు దౌర్భాగ్యులుంటారు మరికొందరు భాగ్యవంతులుంటారు. దౌర్భాగ్యులైన వారు నరకాగ్నిలో చేరుతారు, అక్కడ వారు దుఃఖం వల్ల మూలుగుతూ ఉంటారు మరియు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు. ఇక భాగ్యవంతులైన వారు, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! ఇదొక ఎడతెగని బహుమానం.﴿ [సూరతు హూద్: 103 - 108]
ఇది దైవసందేశహరులు మరియు దైవప్రవక్తలందరూ (అలైహిముస్సలామ్) ఏకీభవించిన విషయం, మరియు అంతిమ దైవసందేశహరులు దీనిని అత్యంత దృఢంగా నొక్కి చెప్పారు. ముఆజ్ బిన్ జబల్ (రజియల్లాహు అన్హు) ఉల్లేఖన ప్రకారం, ఆయన ఇలా అన్నారు: "ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉండగా, నాకు మరియు ఆయనకు మధ్య జీను వెనుక భాగం తప్ప మరేమీ లేదు. అపుడు ఆయన “ఓ ముఆధ్ ఇబ్నె జబల్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” [మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్] అన్నాను. తరువాత ఆయన కాస్త సమయం ప్రయాణించి, మళ్ళీ “ఓ ముఆధ్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” అన్నాను. మళ్ళీ కాస్త సమయం ప్రయాణించి, ఆయన “ఓ ముఆధ్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” అన్నాను. అపుడు ఆయన అడిగారు: “దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు” అన్నారు. మళ్ళీ కాస్త సమయం ప్రయాణించాక, ఆయన “ఓ ముఆధ్ ఇబ్న్ జబల్!” అన్నారు. దానికి నేను “లబ్బైక్ రసూలుల్లాహ్ వ సఅదైక్” అన్నాను. అపుడు ఆయన అడిగారు: “వారు అలా చేసినప్పుడు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన అన్నారు: “అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటంటే, ఆయన వారిని శిక్షించరాదు”. [ముఆజ్ కథనం ముత్తఫఖున్ అలైహి సహీహ్ అల్ బుఖారి (5967) ముస్లిం (48)], జాబిర్ ఉల్లేఖనం: ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా ప్రశ్నించినాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఆ రెండు అనివార్యమైన విషయాలు ఏమిటి?” ఆయన ఇలా పలికినారు “అల్లాహ్ కు ఎవరినీ లేక దేనినీ సాటి కల్పించని స్థితిలో ఎవరైతే మరణిస్తారో వారు స్వర్గములోనికి ప్రవేశిస్తారు. మరియు ఎవరైతే ఆయనకు సాటి కల్పిస్తున్న స్థితిలో మరణిస్తారో వారు నరకం లోనికి ప్రవేశిస్తారు” [సహీహ్ ముస్లిం (151)].
కాబట్టి ఈ తీర్పు మరియు పర్యవసానం ముస్లింలు కల్పించినది కాదు, వాస్తవానికి మీరు చూసినట్లు మరియు తెలుసుకున్నట్లుగా ఇది దైవిక తీర్పు. వీరు స్వర్గవాసులు మరియు వారు నరకవాసులు అని తీర్పునిచ్చేది ముస్లిం కాదు, కానీ ఇహలోకములో మరియు పరలోకములో తీర్పుచేసే అధికారము అల్లాహ్ కు మాత్రమే ఉన్నది.
అల్లాహ్ ఒక మనిషికి ఇస్లాం వైపునకు సన్మార్గమును ప్రసాదించినట్లైతే, అతనిపై విధి ఏమిటంటే అతను తన తల్లిదండ్రులను మరియు బంధువులను ఇస్లాం వైపునకు ఆహ్వానించడానికి శ్రమించాలి, తద్వారా బహుశా అల్లాహ్ వారికి కూడా ఇస్లాం వైపునకు సన్మార్గమును ప్రసాదించవచ్చు, అదే అల్లాహ్ యొక్క సరైన మార్గం, మరియు అది ప్రవక్తల (అలైహిమస్సలాం) మార్గం. అయితే ఒకవేళ మీ కుటుంబ సభ్యులు ఇస్లాంపై కాకుండా మరణించి ఉన్నట్లైతే, వారికి ఇస్లాం యొక్క ఆహ్వానం చేరలేదని మేము ఆశిస్తున్నాము. మరియు ఎవరైతే ఇస్లాం యొక్క ఆహ్వానం చేరక మరియు దాని గురించి తెలియక మరణిస్తారో; నిశ్చయంగా అల్లాహ్ వారికి అన్యాయం చేయడు, బదులుగా ప్రళయ దినాన అల్లాహ్ సృష్టితాలన్నింటినీ తిరిగి లేపినప్పుడు; ఇస్లాం యొక్క ఆహ్వానం చేరని వారిని ఆయన పరీక్షిస్తాడు, అప్పుడు అంగీకరించిన వాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు, మరియు అల్లాహ్ యొక్క ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు:- “ముస్లిం తప్ప మరెవరూ స్వర్గంలో ప్రవేశించలేరు” [ఈ హదీసును బుఖారీ హదీసు సంఖ్య (6528) మరియు ముస్లిం హదీసు సంఖ్య (221) లో ఉల్లేఖించారు], ఒకవేళ అతడు అవిధేయత చూపి అహంకరిస్తే, అతని అహంకారం, మూర్ఖత్వం మరియు అవిశ్వాసం కారణంగా అతన్ని నరకంలో ప్రవేశింపజేస్తాడు. మన దైవప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి కురియుగాక.
***
ప్రశ్న:
ఇస్లాం వర్గ వ్యవస్థ (కులవ్యవస్థ) అనే భావనను సమర్థిస్తుందా?
సమాధానం:
సర్వ స్తోత్రాలు అల్లాహ్ కొరకే ప్రత్యేకము. వర్గవ్యవస్థ అంటే ధనం, వంశం లేదా పదవి ఆధారంగా ప్రజలను వర్గాలుగా విభజించడం. అలా విభజించిన తరువాత మనిషి తన వర్గాన్ని మార్చుకోలేడనే భావన. ఇస్లాం దృష్టిలో వర్గవ్యవస్థ అనేది అజ్ఞాన యుగం (జాహిలియ్యత్) యొక్క ప్రభావాలలో ఒకటి.
మరియు ఇస్లాం ముస్లింలలో వర్గభేదాల ఉనికిని నిషేధిస్తుంది; ఎందుకంటే అల్లాహ్ ప్రజలను ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి సృష్టించాడు, అది మనం ఒకరినొకరు పరిచయం చేసుకోవడానికే గానీ, మనలో ఒకరిపై మరొకరు దౌర్జన్యం చేయడానికి కాదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.﴿ [సూరతుల్ హుజురాత్:13]
మరియు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు, వంశం కేవలం వంశం కారణంగా మనిషికి ఎటువంటి ప్రాధాన్యతను ఇవ్వదు, బదులుగా అతని ఆచరణ మరియు ప్రజల ప్రయోజనం కొరకు అతను చేసిన మేలు మాత్రమే అతనికి ప్రాధాన్యతను ఇస్తాయి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: «ఎవరి ఆచరణ అతన్ని వెనక్కి వదిలేస్తుందో, అతని వంశం అతన్ని ముందుకు పంపదు» [సహీహ్ ముస్లిం (38)].
ఇక సృష్టితాల మధ్య ధనము, ఉన్నత స్థానము మరియు ఇతర కారణాల వలన వ్యత్యాసం ఉండటం అనేది స్వతహాగా ప్రశంసించబడదు మరియు నిందించబడదు. అయితే మానవుడు తనకు అల్లాహ్ ప్రసాదించిన గౌరవము, పదవి మరియు ధనమును అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తే అది ప్రశంసించబడుతుంది. ఒకవేళ దాని కారణంగా అతడు తన ప్రభువుకు అవిధేయత చూపితే, ప్రజలపై అహంకారం ప్రదర్శిస్తే, వారిపై దౌర్జన్యం చేస్తే మరియు వారికి అన్యాయం చేస్తే అది నిందించబడుతుంది. అలా కాని పక్షంలో, ప్రాపంచిక విషయాలలో ప్రజల మధ్య వ్యత్యాసం అనేది భూమిని అభివృద్ధి చేయడానికి అల్లాహ్ ఉద్దేశించిన ఒక సృష్టి ధర్మం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి, వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే ఎంతో ఉత్తమమైనది. మరియు మానవులందరూ ఒక (దుష్ట) సమాజంగా మారి పోతారన్న భయమే గనక మాకు లేకున్నట్లయితే, మేము ఆ కరుణామయుణ్ణి తిరస్కరించేవారి ఇళ్ళ కప్పులనూ మరియు వాటి పైకి ఎక్కే మెట్లను వెండితో నిర్మించేవారము. మరియు వారి ఇండ్ల తలుపులను మరియు వారు ఆనుకొని కూర్చునే పీఠాలను కూడా; మరియు బంగారంతో కూడా! మరియు ఇవన్నీ ప్రాపంచిక జీవిత సుఖసంతోషాలు మాత్రమే. మరియు దైవభీతి గలవారికి నీ ప్రభువు వద్ద పరలోక జీవిత (సుఖం) ఉంటుంది.﴿ [సూరతుల్ జుఖ్'రుఫ్: 32-35]
ప్రాపంచిక సదుపాయాలలోని ఈ వ్యత్యాసం ఆయన ఏర్పాటు అని అల్లాహ్ వివరించాడు, షైఖ్ అబ్దుర్రహ్మాన్ స'అది' రహిమహుల్లాహ్ ఇలా తెలిపారు:- మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేస్తున్నాడు: ఆయన దృష్టిలో ఈ ఇహలోక జీవితానికి ఎటువంటి విలువా లేదు. ఆయన తన దాసుల పట్ల చూపే దయ, కరుణలు గనక లేకపోయి ఉంటే (వాటికంటే ఆయన దేనినీ ముందు ఉంచడు), సత్యతిరస్కారులకు ఆయన ఈ ఇహలోక జీవితాన్ని గొప్పగా విస్తరించి ఉండేవాడు. మరియు ﴿...వారి ఇండ్లకు వెండి పైకప్పులను మరియు మెట్లను...﴾ అనగా: ఎక్కడానికి వెండి మెట్లను చేసి ఉండేవాడు, ﴿...వాటి ద్వారా వారు పైకి ఎక్కేవారు.٣٣﴾ అనగా: తమ డాబాలపైకి ఎక్కేవారు. అనగా: వారి ఇహలోక జీవితాన్ని రకరకాల అలంకరణలతో మనోహరంగా చేసేవాడు, మరియు వారు కోరుకున్నదంతా వారికి ప్రసాదించేవాడు. కానీ ప్రాపంచిక జీవితంపై ఉన్న ప్రేమ కారణంగా వారు అవిశ్వాసం వైపు వేగంగా వెళతారని, మరియు పాపాలు ఎక్కువగా చేస్తారని భయపడి, తన దాసుల పట్ల ఆయనకున్న కరుణ ఆయనను ఆ పని చేయకుండా నివారించింది. కాబట్టి అల్లాహ్ తన దాసుల ప్రయోజనాల కొరకే ఇహలోక విషయాలలో కొన్నింటిని సాధారణంగా లేదా ప్రత్యేకంగా నిరోధిస్తాడనడానికి ఇందులో ఒక సాక్ష్యం ఉంది. అల్లాహ్ దృష్టిలో ఈ ప్రపంచం ఒక దోమ రెక్క అంత బరువు కూడా తూగదు. మరియు పైన పేర్కొనబడినవన్నీ ఇహలోక జీవిత తాత్కాలిక సుఖసంతోషాలు మాత్రమే. అవి దుఃఖపూరితమైనవి, కలుషితమైనవి మరియు నశించిపోయేవి. మరి తమ ప్రభువు ఆజ్ఞలను పాటించి, ఆయన నిషేధించిన వాటికి దూరంగా ఉంటూ భయభక్తులు గలవారి కొరకు మహోన్నతుడైన అల్లాహ్ వద్ద పరలోకం ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే అందులోని అనుగ్రహాలు అన్ని విధాలుగా సంపూర్ణమైనవి మరియు పరిపూర్ణమైనవి. స్వర్గంలో మనస్సులు కోరుకునేవి మరియు కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేవి అన్నీ ఉన్నాయి, మరియు వారు అందులో శాశ్వతంగా ఉంటారు. కాబట్టి ఈ రెండు నివాసాల మధ్య ఎంత గొప్ప వ్యత్యాసం ఉందో కదా! తఫ్సీర్ అస్సఅదీ, తైసీరుల్-కరీమ్ అర్-రహ్మాన్ (సాద్: 765).
కాబట్టి ఇస్లాం, ఉదాహరణకు ప్రజలందరినీ ధనికులుగా లేదా పేదవారుగా మార్చటం ద్వారా వారిలోని ధనిక మరియు పేద విభజనను రద్దు చేయడానికి ప్రయత్నించదు. కానీ పేదవారిని ఆదుకోవటాన్ని ధనికులకు ధర్మబద్ధం చేసింది. ఇక మానవుల మధ్య ఉండే సాధారణ మరియు సహజమైన వ్యత్యాసాలను ఎదిరించటం, వాటిని తొలగించడానికి ప్రయత్నించటం అనేది సృష్టి నియమాలకు విరుద్ధం. అందువల్ల ఇస్లాం వాటి పట్ల సరైన విధానంతో వ్యవహరించటానికి వచ్చింది. మరియు మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు కలుగుగాక.
***
ప్రశ్న:
ఇస్లాంలో మితవాదం యొక్క భావన ఏమిటి?
సమాధానం:
సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే. ఇస్లాంలో తటస్తత (మితవ్యవహారం) అనేది రెండు మార్గభ్రష్టత్వాల మధ్య గల మధ్యేమార్గం: అవి ‘అతి’ (మితిమీరిన ఆచరణ) మరియు ‘అనా’ (మితిమీరిన నిర్లక్ష్యం). ఇది ఒకవైపు యూదమతం యొక్క మితిమీరిన నిర్లక్ష్యానికి మరియు అల్లాహ్ పట్ల వారు చూపిన దురుసుతనానికి — అనగా "నిశ్చయంగా అల్లాహ్ దరిద్రుడు మరియు మేము ధనవంతులము" అని యూదులు అన్నప్పుడు; మరియు ప్రవక్తల పట్ల వారు కనబరిచిన తీరుకు, అనగా ఒక వర్గాన్ని వారు అసత్యవాదులని ధిక్కరించి, మరో వర్గాన్ని హత్య చేసినప్పుడు — మరియు మరోవైపు క్రైస్తవుల ‘అతి’ (మితిమీరిన ఆచరణ)కి — అనగా వారు మసీహ్ ను ఆరాధ్యునిగా చేసి, అల్లాహ్ ను వదలి తమ ధార్మిక పండితులను మరియు సన్యాసులను ప్రభువులుగా చేసుకున్న విధానానికి — ఈ రెండు మితిమీరే స్థితుల మధ్య గల సమతుల్యత.
ఇస్లాంలో మితత్వం అనేది సర్వవ్యాప్తమైనది మరియు సమగ్రమైనది. హక్కుల విషయంలో దీని అర్థం ఏమిటంటే, ఎవరి హక్కును వారికి చెందేలా చేయడం; వారు ధర్మంలో మీతో విభేదించినా లేదా మీతో శత్రుత్వం వహించినా సరే. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును.﴿ [సూరతుల్ మాయిదహ్: 8]
అతను “పామరుల విషయంలో మాపై ఎలాంటి పాపమూ లేదు” అని పలికే యూదుల మాదిరిగా ఉండడు, లేదా “నీ కుడి చెంపపై ఎవరైనా కొడితే, అతనికి ఎడమ చెంపను కూడా తిప్పు” అని పలికే క్రైస్తవుల మాదిరిగా ఉండడు, కానీ వారిలో ఎక్కువ మంది దానిని ఆచరణ చేయరు; పైగా వారు ప్రజల చెంపలు కొడతారు మరియు వారి సంపదలను అన్యాయంగా కబళిస్తారు.
మితవ్యవహారం అనగా మధ్యేమార్గం మరియు న్యాయం అయినట్లే, ఇస్లాం అన్ని విషయాలలో రెండు చెడుల మధ్య ఉన్న ఒక మంచి సద్గుణం. ముస్లిం నుండి ఆశించబడేది ఏమిటంటే, అతను మితవ్యవహారాన్ని పాటించాలి, అంటే అతను అతిగా వ్యవహరించకూడదు మరియు నిర్లక్ష్యంగా లేదా ఉదాసీనంగా ఉండకూడదు. అతను తనలో, తాను చేపట్టే పనులలో మరియు హక్కులలో మితవ్యవహారాన్ని వర్తింపజేయాలి మరియు దానిని తన మాటలకు మరియు చర్యలకు కూడా అన్వయించాలి. ఆ విషయాలలో కొన్ని: మొదటిది: ఇస్లాం ఆరాధనల ద్వారా, ఆత్మల ప్రక్షాళన మరియు మొదలైన వాటి ద్వారా ఆత్మ అవసరాలను పరిగణనలోకి తీసుకుంది. అలాగే లావాదేవీలను క్రమబద్ధీకరించడం, ఆహారం, పానీయాలను నియంత్రించడం ద్వారా శరీర అవసరాలను పరిగణనలోకి తీసుకుంది. ఇది వివాహాన్ని ప్రోత్సహించింది మరియు బ్రహ్మచర్యాన్ని, అనగా ఆరాధనకే పరిమితమై వివాహాన్ని వదులుకోవడాన్ని నిరోధించింది. అయితే కొంతమంది ప్రజలు ఆత్మకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి శరీరాన్ని నిర్లక్ష్యం చేశారు, వాస్తవానికి ఆరాధనలు శరీరం ద్వారానే చేయబడతాయి. కాబట్టి వారు స్నానం చేయడం మరియు శుభ్రత పాటించడం మానేశారు. తమకు సరిపడని ఆహారం తింటూ, కఠినమైన దుస్తులు ధరిస్తూ తమను తాము కష్టపెట్టుకున్నారు. అంతేకాకుండా క్రైస్తవ సన్యాసులు, కొందరు బౌద్ధులు, హిందువులు మరియు సూఫీలలోని అతివాదుల వలె ఆరాధనలో అతిగా ప్రవర్తించారు, ప్రజలకు దూరంగా ఉంటూ సహజసిద్ధమైన స్వభావానికి విరుద్ధంగా వ్యవహరించారు. దీనికి భిన్నంగా, మరికొంతమంది ప్రజలు శరీరానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆత్మను నిర్లక్ష్యం చేశారు. వారు కేవలం తమ కోరికల కోసం మరియు వాటిని తీర్చుకోవడం కోసమే జీవిస్తారు. వారు ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉండరు మరియు ఆరాధనల పట్ల ఎలాంటి శ్రద్ధ వహించరు.
రెండవది: ఇస్లాం అవిశ్వాసులతో క్రయవిక్రయాలు జరపటం, బహుమతులు ఇవ్వడం మరియు అలాంటి వ్యవహారాలు చేయటమును అనుమతిస్తుంది. మరియు వారితో న్యాయంగా వ్యవహరించడాన్ని తప్పనిసరి చేస్తుంది. మరియు వారి విశ్వాసాలు మరియు వారి ఆచారాల ప్రభావానికి లోనుకాకుండా ఉండటమును మరియు వారితో హృదయపూర్వక మైత్రిని (స్నేహాన్ని) నివారిస్తూనే, జిహాద్ స్థితిలో తప్ప వారికి హాని కలిగించటమును నిషేధిస్తుంది. మరియు ప్రజలలో కొందరు తమ ధర్మంతో విభేదించే వారందరినీ చంపేస్తారు. మరియు వారి ఉనికిని భరించలేరు. వారు తమ ధర్మంలో, లేదా తమ మార్గంలో లేదా తమ మతంలో లేరనే కారణంతో వారిపై దౌర్జన్యం చేస్తారు. దీనికి విరుద్ధంగా, వారిలో కొందరు అవిశ్వాసుల కొరకు తమ ధర్మాన్ని వదులుకుంటారు. మరియు అల్లాహ్ కు అవిధేయత చూపే విషయంలో ముఖస్తుతి కొరకు మరియు అత్యాశతో వారికి లోబడి ఉంటారు. దీని ద్వారా వారు తమను అవమానిస్తారని (చులకనగా చూస్తారని) వారికి తెలియదు. కావున వారు ధర్మాన్ని గానీ, లేదా ఇహలోకాన్ని (దునియాను) గానీ పొందలేరు.
మూడవది: మహోన్నతుడైన అల్లాహ్ ను, ఆయన లక్షణాలను మరియు ఆయన చేష్టలను దేనితోనూ పోల్చకుండా (తమ్సీల్ లేకుండా) విశ్వసించటాన్ని ఇస్లాం బోధించింది. ప్రజలలో కొందరు నాస్తికత్వాన్ని విశ్వసిస్తూ, తమ హృదయాలలో తమ మాటకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, తమ నోటితో అల్లాహ్ ఉనికిని తిరస్కరిస్తారు. మరికొందరు ఆయనను శూన్యంగా భావిస్తూ, ఆయనకు ఎటువంటి లక్షణాన్ని గానీ, చేష్టను గానీ ధృవీకరించరు. వీరు మరియు వీరిలాంటి వారు తఅతీల్ (నిరాకరణ) లో పాలుపంచుకున్నారు. దానికి విరుద్ధంగా, ప్రతిదీ అల్లాహ్ యే అని విశ్వసించిన వారు కొందరున్నారు. ఇంకొందరు దేవదూతలు మరియు మసీహ్ వంటి కొన్ని సృష్టితాలలో, లేదా వాటి కంటే తక్కువైన విగ్రహాలు మరియు చెట్లలో ఉలూహియత్ ను విశ్వసించారు. వాటిలో కొన్నింటికి మహోన్నతుడైన అల్లాహ్ పేర్ల నుండి గ్రహించబడిన పేర్లను పెట్టారు. వీరు మరియు వీరిలాంటి వారు తమ్సీల్ (పోల్చటం) లో పాలుపంచుకున్నారు.
నాల్గవది: ఇస్లాం తఖ్దీరును రూఢీ చేసింది, నిశ్చయంగా ఈ విశ్వంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ తఆల కోరిక ప్రకారంగానే సంభవిస్తుంది, మరియు ఇందులో ఆయన ఆదేశించిన వాటి నుండి ఏదైతే జరుగుతుందో నిశ్చయంగా ఆయన దానిని ఇష్టపడతాడు మరియు దాని పట్ల సంతృప్తి చెందుతాడు, నిశ్చయంగా దాసునికి ఒక కోరిక ఉంటుంది, మరియు అతని ఇష్టపూర్వక చర్యలు మహోన్నతుడైన అల్లాహ్ కోరికను దాటి జరగవు.
మరియు ప్రజలలో కొందరు ఇలా అంటారు, మానవుడు తన చర్యలపై బలవంతం చేయబడ్డాడు మరియు అతనికి ఎలాంటి నిర్ణయం లేదు. దీనికి విరుద్ధంగా, మానవుడు తన పనిని సృష్టిస్తాడు మరియు అది అల్లాహ్ సంకల్పం మరియు అతని నిర్ణయంతో కాదు అని అనే వారు కూడా ఉన్నారు.
5 - ఆర్థిక వ్యవస్థలో ఇస్లాం సామ్యవాదం మరియు పెట్టుబడిదారీ విధానం మధ్య మధ్యేమార్గం.
ఆరవది: ఇస్లాం అన్ని విషయాలలో అనగా మహోన్నతుడైన అల్లాహ్ తో గల సంబంధంలో, ప్రజలతో గల సంబంధంలో మరియు మనిషికి తనతో తనకు గల సంబంధంలో న్యాయం మరియు మధ్యస్థతను నెలకొల్పింది. ఇస్లాం కాని ఇతర వాటిలో ఈ అంశాలలో కొన్నింటిని సాధించడం మీరు కనుగొనవచ్చు, కానీ అది సమగ్రమైన కోణంలో కాదు. ఎందుకంటే ఇస్లాం అల్లాహ్ తఆలా యొక్క ధర్మము, ఆయన దానిని ఆమోదించాడు మరియు దీనితో ధర్మాలను ముగించాడు. మరియు ఆయన దీనిని ప్రతీ కాలము, ప్రదేశము మరియు మానవుని కొరకు సముచితమైనదిగా చేశాడు. బుద్ధులను దీని రహస్యాన్ని మరియు పరాకాష్టను గ్రహించడంలో అశక్తులుగా చేశాడు. మరియు దీనికి మినహా ఎవరి నుండి కూడా మరే ఇతర ధర్మాన్ని ఆయన స్వీకరించడు. మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అల్లాహ్ యొక్క కరుణ మరియు శాంతి కురియుగాక.
***
ప్రశ్న:
ఇస్లాములో సహనానికి ఉన్న రూపాలు ఏమిటి?
సమాధానం:
సమస్త ప్రశంసలు అల్లాహ్ కే, ఇస్లాంలో సహనం అనేది మానవాళి ఎరిగిన అత్యంత ఉన్నతమైన మరియు పరిపూర్ణమైన సహనం, మరియు షరియత్ లో దీనికి పర్యాయపదం సరళత్వము. ఇస్లాంలో సరళత్వము అనేక రంగాలలో వస్తుంది, వాటిలో:
ఇస్లాం ధర్మంలో ఆరాధనల విషయంలో అల్లాహ్ సౌలభ్యాన్ని కలిగించాడు, గత ధర్మాల మాదిరిగా ఇది భారాలు మరియు సంకెళ్ళతో కూడిన ధర్మం కాదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలియజేశాడు: ﴾ఎవరైతే ఈ సందేశహరుణ్ణి నిరక్ష్యరాస్యుడైన ఈ ప్రవక్తను అనుసరిస్తారో! ఎవరి ప్రస్తావన వారి వద్ద వున్న తౌరాత్ మరియు ఇంజీల్ గ్రంథాలలో వ్రాయబడి ఉన్నదో, అతను వారికి ధర్మమును ఆదేశిస్తాడు మరియు అధర్మము నుండి నిషేధిస్తాడు మరియు వారి కొరకు పరిశుద్ధమైన వస్తువులను ధర్మసమ్మతం చేసి అపరిశుద్ధమైన వాటిని నిషేధిస్తాడు. వారిపై మోపబడిన భారాలను మరియు వారి నిర్భంధాలను తొలగిస్తాడు.﴿ [సూరతుల్ అఅ్ రాఫ్: 157] ఉదాహరణకు, పూర్వపు ధర్మాలలో నమాజు ఆచరించే వ్యక్తి కేవలం ఆరాధనా స్థలంలో మాత్రమే నమాజు ఆచరించేవాడు, కానీ ఈ ధర్మంలో ముస్లింకు నమాజు సమయం ఆసన్నమైనప్పుడు అతను గాలిలో, సముద్రంలో లేదా భూమి మీద ఏ ప్రదేశంలో ఉన్నా సరే అక్కడ నమాజు ఆచరించుటకు అనుమతించబడింది. అదేవిధంగా, పూర్వపు ధర్మాలలో అపవిత్రత కేవలం నీటి ద్వారా మాత్రమే తొలగించబడేది, అయితే అల్లాహ్ ఇస్లాంలో తయమ్ముమ్ విధానాన్ని ప్రసాదించాడు, కనుక అది ఒక కారుణ్యంగా మారింది. ఇంకా ప్రయాణంలో మరియు అనారోగ్యంతో ఉన్నప్పుడు నమాజును తక్కువ చేసి ఆచరించుట (ఖస్ర్) మరియు ఉపవాసాన్ని వదిలివేయుట (ఫితర్) కూడా అటువంటివే.
ఇస్లాం యొక్క సౌలభ్యం మరియు సహనాలలో ఒకటి ఏమిటంటే, పాపాత్ముని కొరకు తౌబా'ను అల్లాహ్ షరీఅతుబద్దమైనదిగా చేశాడు. మరియు అల్లాహ్ వారి పశ్చాత్తాపమును స్వీకరించటానికి బనీ ఇస్రాయీల్ యొక్క పశ్చాత్తాపం వారిలో కొందరు కొందరిని వధించటమే అయి ఉండింది; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారితో ఇలా అన్న విషయాన్ని: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను (సృష్టికర్తను) వేడుకోండి. మీలోని వారిని (ఘోరపాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు - మీ సృష్టికర్త దృష్టిలో - శ్రేష్ఠమైనది." ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రధాత. ﴿ [సూరతుల్ బఖరా: 54]
అయితే ఇస్లాంలో మనిషి పశ్చాత్తాప పడితే, అల్లాహ్ అతనిని మన్నిస్తాడు, మరియు అతని పాపములను పుణ్యాలుగా మార్చి వేస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు. పునరుత్థాన దినం నాడు, అతనికి రెట్టింపు శిక్ష పడుతుంది మరియు అతడు అందులోనే అవమానంతో శాశ్వతంగా పడి ఉంటాడు. కాని, ఇక ఎవరైతే (తాము చేసిన పాపాలకు) పశ్చాత్తాప పడి, విశ్వసించి సత్కార్యాలు చేస్తారో! అలాంటి వారి పాపాలను అల్లాహ్ పుణ్యాలుగా మార్చుతాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రధాత. మరియు ఎవడైతే, పశ్చాత్తాప పడి సత్కార్యాలు చేస్తాడో! నిశ్చయంగా అలాంటి వాడు హృదయపూర్వకంగా అల్లాహ్ వైపునకు పశ్చాత్తాపంతో మరలుతాడు!﴿ [సూరతుల్ ఫుర్ఖాన్: 68-71]
సౌలభ్యపు రూపాలలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనంలో ఈ విధంగా తెలుపబడింది: «ఇస్లాంలో అత్యుత్తములుగా మెలిగేవారు అజ్ఞానకాలపు పనులకు బదులుగా శిక్షించబడరు, మరెవరైతే ఇస్లాంలో చెడుగా వ్యవహరిస్తాడో అతని మొదటి మరియు తరువాత పనులకు బదులుగా పట్టుకోబడతాడు.» [అల్ బుఖారీ, హదీథు సంఖ్య (6921) మరియు ముస్లిం, హదీథు సంఖ్య (120)].
హదీసులో 'ఇసాఆ' (చెడు చేయడం) అంటే మతభ్రష్టత్వం, పాపాన్ని మళ్ళీ చేయడం కాదు. ఒక వేళ అతను ఇస్లాం నుండి మతభ్రష్టుడైతే మొదటి మరియు చివరి పాపాలకు పట్టుబడతాడు, ఇక ఒకవేళ మతభ్రష్టత్వానికి కాకుండా పాపానికి మళ్ళీ పాల్పడితే; అతను ఇస్లాంలో చేసిన దానికి మాత్రమే పట్టుబడతాడు, అంతకు ముందు చేసిన దానికి కాదు; దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనం ప్రకారం: "ఇస్లాం వెనుకటి పాపాలను తుడిచివేస్తుందన్న విషయం నీకు తెలియదా?" [దీనిని ముస్లిం ఉల్లేఖించారు, హదీసు సంఖ్య (121)].
ఇస్లాం యొక్క సౌలభ్యతలలో ఒకటి ఏమిటంటే, ఇది సౌలభ్యతను కలిగి యున్న ధర్మము, అందులో ఎలాంటి సంకెళ్ళు మరియు భారాలు లేవు, అందుకే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "నిశ్చయంగా ధర్మము సులభమైనది’ ఎవరైతే దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తారో అది వారి పై పైచేయి సాధిస్తుంది (అతన్ని అలసటకు గురిచేస్తుంది) కాబట్టి ఋజుమార్గాన్ని అవలంభించండి, ధర్మానికి దగ్గరగా ఉండండి, ప్రజలకు శుభవార్తలను అందించండి, అలాగే ఉదయం సాయంత్రం మరియు రాత్రుల్లో ఆరాధన ద్వారా సహాయాన్ని పొందండి." సహీహ్ బుఖారి (39)
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముఆజ్ మరియు అబూ మూసా అల్-అష్అరీ రదియల్లాహు అన్హుమా'ను యమన్ వైపుకు పంపించినప్పుడు వారికి ఇలా ఉపదేశించారు:- “(ప్రజల కొరకు) విషయాలను తేలిక చేయండి, కష్టతరం చేయకండి; ప్రజలకు శుభవార్తలు వినిపించండి, వారిని దూరం చేయకండి; పరస్పరం సహకరించుకోండి, విభేదించకండి”. [సహీహ్ బుఖారీ (3038), ముస్లిం (7)].
ఇస్లాం యొక్క సులభతరం మరియు సహనంలో భాగంగా, తల్లిదండ్రులు అవిశ్వాసులు అయినప్పటికీ, ఇంకా ఇస్లాం నుండి అతనిని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, సంతానం వారితో మంచి ప్రవర్తన చేయాలని ఇస్లాం ఉపదేశించింది. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾మరియు ఒకవేళ వారిరువురు - నీవు ఎరగని దానిని - నాకు (అల్లాహ్ కు) భాగస్వామిగా చేర్చమని, నిన్ను బలవంతం చేస్తే, వారి మాటను నీవు ఏ మాత్రం వినకు. మరియు ఇహలోక విషయాలలో ధర్మసమ్మతమైన వాటిలో వారికి తోడుగా ఉండు. మరియు పశ్చాత్తాపంతో నా వైపుకు మరలేవాని మార్గాన్ని అనుసరించు. తరువాత మీరంతా నా వైపునకే మరలి రావలసి ఉన్నది. అప్పుడు నేను మీరు చేసే కర్మలను గురించి మీకు తెలుపుతాను.﴿ [సూరతు లుఖ్మాన్:15] అస్మా బింతె అబూ బకర్ రజియల్లాహు అన్హుమా తల్లి ఆమెను కలవడానికి వచ్చినప్పుడు, ఆమెతో బంధాన్ని కొనసాగించడం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి కోరుతూ ఆమె ఇలా తెలిపారు: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైష్తో ఒప్పందం కుదుర్చుకున్న రోజుల్లో ఒకసారి నా వద్దకి బహుదైవారాధకురాలైన నా తల్లి తన తండ్రితో కలిసి వచ్చింది." అప్పుడు ఆమె ఈ విషయం గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ప్రస్తావిస్తూ ఇలా అడిగారు: “దైవప్రవక్తా! మా అమ్మ నా దగ్గరికి వచ్చి ఉంది. ఆమె నా నుండి సద్వర్తనను ఆశిస్తోంది. మరి నేను మా అమ్మ పట్ల మంచిగా మెలగవచ్చా?” అందుకాయన ఇలా అన్నారు: «అవును, ఆమెతో సత్సంబంధాలు నెరపండి» [సహీహ్ బుఖారీ (3183) మరియు సహీహ్ ముస్లిం (50)].
అదేవిధంగా, భర్త తన యూద లేదా క్రైస్తవ భార్యతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలని, ఆమె మతం కారణంగా ఆమెను ఇబ్బంది పెట్టకూడదని, నిందించకూడదని లేదా చిన్నచూపు చూడకూడదని హితబోధ చేయబడింది.
ఇస్లాం యొక్క సౌలభ్యం మరియు ఉదారత ఏమిటంటే, ధర్మం విషయంలో పోరాడని ముస్లిమేతరులతో ఉత్తమంగా సహకరించుకోవాలని అది ఒక ముస్లిముకు హితబోధ చేసింది, మరియు వారితో న్యాయం చేయటాన్ని అతనిపై విధిగా చేసింది, మరియు వారితో సద్వ్యవహారం చేయాలని అతన్ని ప్రోత్సహించింది. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.﴿ [సూరతుల్ ముమ్తహినహ్: 8]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
ఇస్లాం ధర్మం లోని మానవహక్కులు ఏమిటి?
సమాధానం:
స్థుతులన్ని అల్లాహ్ కే శోభిస్తాయి, ఇస్లాం సృష్టికర్త హక్కును మరియు సృష్టితాల హక్కును పరిరక్షించింది, ముఆద్ ఇబ్నె జబల్(రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : ఒకసారి నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెనుక వాహనముపై కూర్చుని ఉన్నాను, నాకు మరియు ఆయనకు మధ్య జీను వెనుక భాగం తప్ప మరేమీ లేదు. అప్పుడు ఆయన “ఓ ముఆధ్ ఇబ్నై జబల్” అని పిలిచారు. దానికి నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. మళ్ళీ కాస్త సమయం గడిచాక, ఆయన తిరిగి “ఓ ముఆధ్ ఇబ్నె జబల్” అన్నారు. నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. మళ్ళీ కాస్త సమయం గడిచాక, ఆయన తిరిగి “ఓ ముఆధ్ ఇబ్నె జబల్” అన్నారు. నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: “దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “నిశ్చయంగా దాసులపై అల్లాహ్ యొక్క హక్కు ఏమిటంటే, దాసులు ఆయనను మాత్రమే ఆరాధించాలి మరియు ఎవరినీ ఆయనకు సాటి కల్పించరాదు” అన్నారు. మళ్ళీ కాస్త సమయం గడిచాక, ఆయన తిరిగి “ఓ ముఆధ్ ఇబ్నె జబల్” అని పిలిచారు. నేను “లబ్బైక్ వ సఅదైక్ (మీ సేవలో హాజరుగా ఉన్నాను ఓ రసూలుల్లాహ్)” అన్నాను. ప్రవక్త అడిగారు: “వారు అలా చేసినప్పుడు అల్లాహ్ పై దాసుల యొక్క హక్కు ఏమిటో నీకు తెలుసా?” దానికి నేను “అల్లాహ్ కు మరియు ఆయన సందేశహరునికి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. అపుడు ఆయన “ఆయన వారిని శిక్షించకూడదు” అన్నారు. [ముత్తఫఖున్ అలైహి: సహీహ్ బుఖారీ హదీథు సంఖ్య 6267, ముస్లిం హదీథు సంఖ్య 48].
మరియు ఇస్లాం మనిషి ధర్మాన్ని, ప్రాపంచిక జీవితాన్ని పరిరక్షించడానికి వచ్చింది. కావున ఇస్లాం సమగ్రత ఏమనగా, మానవ కల్పిత చట్టాలలో ఉన్న విధంగా అది కొన్ని అంశాలలో మనిషి హక్కును విస్మరించలేదు. మరియు ఈ అంశాలలో:
మొదటిది: ధర్మంలో మనిషి హక్కు: ఇస్లాం సత్యమైన ధర్మం వైపుకు ఆహ్వానించింది మరియు ఇతర ధర్మాల అసత్యతను స్పష్టం చేసింది, కానీ ఇస్లాం స్వీకరించమని ఎవ్వరినీ బలవంతం చేయరాదు. మరియు ఇది ధర్మాన్ని అత్యంత ఆవశ్యకమైనదిగా చేసింది, కాబట్టి దాని పరిరక్షణకు అన్నింటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఇస్లాం నిర్దేశించిన షరతులకు అనుగుణంగా, ముస్లిముల దేశంలో నివసించే ముస్లిమేతరుడు తన ధర్మాన్ని గట్టిగా పట్టుకుని ఉండే హక్కును కూడా పరిరక్షించింది.
రెండవది: మానవుని జీవించే హక్కు: ఇస్లాం గౌరవనీయమైన ప్రాణాలన్నింటినీ చంపడాన్ని నిషేధించడం ద్వారా సంరక్షించింది, యుద్ధ సందర్భంలో కూడా పోరాటంలో పాల్గొనని పిల్లలను, స్త్రీలను మరియు వృద్ధులను హతమార్చటమును ఇస్లాం నిషేధించింది.
మూడవది: సంతానోత్పత్తి మరియు సంతానం యొక్క హక్కు, ఇస్లాం మనిషికి సంతానోత్పత్తి హక్కును పరిరక్షించింది, మరియు దానిని నిరోధించడాన్ని లేదా దానిని పొందడంలో మనిషికి ఆటంకాలు కల్పించడాన్ని నిషేధించింది.
నాల్గవది: సామాజిక మానవ హక్కులు: ఇస్లాం తల్లిదండ్రుల హక్కును, బంధువుల హక్కును వారితో మంచిగా వ్యవహరించడం ద్వారా, అవసరమైనప్పుడు వారి కోసం ఖర్చు చేయడం ద్వారా మరియు వారితో బంధుత్వాన్ని కొనసాగించడం ద్వారా, పొరుగువారి హక్కును వారి పట్ల మంచిగా వ్యవహరించడం ద్వారా మరియు వారికి ఎలాంటి హాని కలిగించకుండా ఉండటం ద్వారా, దారి హక్కును దారి తప్పిన వారికి దారి చూపడం ద్వారా, చూపులను కిందికి ఉంచుకోవడం ద్వారా, హాని కలిగించే వాటిని తొలగించడం ద్వారా, ఇబ్బంది కలిగించకుండా ఉండటం ద్వారా మరియు ఇతర విషయాల ద్వారా పరిరక్షించింది. మరియు సాధారణ ప్రజలందరికీ కూడా ఇస్లాంలో భద్రపరచబడిన మరియు సుపరిచితమైన హక్కులు ఉన్నాయి.
ఐదవది: మానవ ఆర్థిక హక్కులు: ఇస్లాం వ్యక్తిగత ఆస్తి హక్కును పరిరక్షించింది, మరియు వడ్డీని నిషేధించింది, మరియు అవసరార్థులకు అప్పును అనుమతిస్తూనే అప్పుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించింది. మరియు అవసరార్థులను జకాత్ ద్వారా ఆదుకోవడాన్ని విధిగా (తప్పనిసరి) చేసింది మరియు దానధర్మాలు (సదఖా) చేయమని ప్రోత్సహించింది. మరియు ఎవరికైనా అత్యవసర అవసరం ఏర్పడితే, ఆ అవసరం తీరేవరకు ప్రజలను అడగటానికి (సహాయం కోరడానికి) అతనికి అనుమతినిచ్చింది, మరియు రాజ్యం యొక్క సాధారణ వనరులను మరియు ఆదాయ మార్గాలను క్రమబద్ధీకరించింది.
ఆరవది: మానవ ఆరోగ్య హక్కులు: ఇస్లాంలో ఆరోగ్యానికి సంబంధించిన చట్టాలుశాసనాలు చాలా ఉన్నాయి, అవన్నీ వ్యక్తిగత ఆరోగ్యాన్ని మరియు ప్రజారోగ్యాన్ని రక్షించడానికి ఉద్దేశించబడ్డాయి. మరియు మనిషికి తానుగా లేదా తన చుట్టూ ఉన్న సమాజం యొక్క ఆరోగ్యానికి నష్టపరిచే విషయాల నుండి నిరోధించడం కూడా ఇందులో ఉంది, ఉదాహరణకు: ఇస్లాం మత్తుపదార్థాలను మరియు మద్యపానసేవనాన్ని నిషేదించింది. మరియు వ్యభిచారం, అనైతికత వల్ల కలిగే వ్యాధుల కారణంగా వాటిని నిషేదించింది. అలాగే వ్యాధులు వ్యాపించకుండా రక్షించడానికి, ఉదాహరణకు: ఏదైనా ప్రాంతంలో ప్లేగు (అంటువ్యాధి) ప్రబలినప్పుడు ఆ ప్రాంతం నుండి బయటకు వెళ్లడాన్ని లేదా అక్కడికి ప్రవేశించడాన్ని ఇస్లాం నిషేదించింది; ఎందుకంటే అక్కడికి ప్రవేశించడం వల్ల మనిషి వ్యాధికి లేదా మరణానికి గురవుతాడు, మరియు అక్కడి నుండి బయటకు రావడం ఆరోగ్యవంతులకు వ్యాధి సంక్రమించడానికి మరియు వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది.
ఏడవది: స్త్రీల హక్కులు: ఇస్లాం ఒక తల్లిగా ఆమె హక్కులను సంరక్షించింది, వీలైనంత వరకు ఆమె సంరక్షణను, ఆమె పట్ల సత్ప్రవర్తనను మరియు ఆమెను సంతోషపెట్టడాన్ని తప్పనిసరి చేసింది, మరియు ఒక సోదరిగా, భార్యగా మరియు కూతురిగా ఆమె హక్కులను సంరక్షించింది, ఆమెకు సంరక్షణ మరియు భద్రతను కల్పిస్తూ, ఆమె సౌకర్యం కోసం కృషి చేస్తూ మరియు ఆమెతో పాటు ప్రయాణిస్తూ, ఎందుకంటే ప్రయాణం అలసటకు గురిచేసే అవకాశం ఉంది మరియు ఇతర కారణాల వలన, మరియు స్త్రీ యొక్క సంరక్షకుడిపై ఆమె పోషణ ఖర్చులను తప్పనిసరి చేసింది, ఎందుకంటే అవసరం ఉంటే తప్ప ఆమె ఇంట్లోనే ఉండాలని ఆదేశించబడింది, మరియు ఆమె తాను కలిగి ఉన్న సంపద, వారసత్వం లేదా ఇతర వస్తువులపై వ్యవహరించే హక్కును కలిగి ఉంది, మరియు ఆమెకు భర్తను ఎన్నుకునే హక్కు, తన పిల్లల పెంపకం మరియు సంరక్షణా హక్కు మరియు ఇతర హక్కులు ఉన్నాయి. మరియు ఇస్లాంకు మరియు ఇతర వ్యవస్థలకు ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, ఒక వ్యక్తి ఈ హక్కులను పాటించడం అనేది నమ్మకం మరియు అల్లాహ్ తాలా నుండి ప్రతిఫలాలు పొందే కోరికతో ఉంటుంది, అంతేగానీ ఏదైనా చట్టం లేదా అలాంటి వాటి భయంతో కాదు, మరియు ఇస్లాంకు పూర్వం మరియు సమకాలీన వ్యవస్థలలో సాధారణంగా మనిషికి (స్త్రీ-పురుషుడు) మరియు ముఖ్యంగా మహిళకు ఉన్న పరిస్థితిని పోల్చి చూసినప్పుడు ఇస్లాం యొక్క గొప్పదనం స్పష్టంగా వ్యక్తమవుతుంది.
ఎనిమిదవది: కర్మశాస్త్ర (ఫిఖహ్) గ్రంథాలలో విదితమైనట్లుగా, ఇస్లాం జిన్నాతుల హక్కును మరియు పశుపక్ష్యాదుల హక్కును పరిరక్షించింది; మరి ఇస్లాం జిన్నాతుల మరియు పశుపక్ష్యాదుల హక్కులనే పరిరక్షించినప్పుడు, అల్లాహ్ గౌరవం ఇచ్చిన మనిషి హక్కుల పట్ల నిర్లక్ష్యం వహిస్తుందని ఊహించగలమా? మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ మరియు వాస్తవానికి మేము ఆదమ్ సంతతికి గౌరవము నొసంగాము. మరియు వారికి నేల మీదనూ, సముద్రం లోనూ, ప్రయాణం కొరకు వాహనాలను ప్రసాదించాము. మరియు మేము వారికి పరిశుద్ధమైన వస్తువులను జీవనోపాధిగా సమకూర్చాము. మరియు మేము సృష్టించిన ఎన్నో ప్రాణులపై వారికి ప్రత్యేక ప్రాధాన్యత నిచ్చాము.﴿ [సూరతుల్ ఇస్రా: 70], కావున ఇస్లాంలో ఈ గౌరవం యావత్ మానవ జాతికి అనగా విశ్వాసి మరియు అవిశ్వాసికి, తెల్లవారు మరియు నల్లవారికి, అరబ్బులు మరియు అరబ్బేతరులకు వర్తిస్తుంది. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
ఇస్లాం కత్తి బలంతో వ్యాపించిందా? ఒకవేళ అదే నిజమైతే, దానిని శాంతి వైపు ఆహ్వానించే ధర్మంగా ఎలా వర్ణించవచ్చు?
సమాధానం:
ప్రశ్న: ఇస్లాం ఖడ్గం ద్వారా వ్యాపించిందా?
జవాబు: ప్రాథమికంగా ఇస్లాం వ్యాప్తి మహోన్నతుడైన అల్లాహ్ వైపు ఆహ్వానించడం ద్వారానే జరిగింది, మరియు ఇస్లాం ధర్మప్రచారాన్ని అడ్డుకునేవారికి లేదా దానిపై యుద్ధం చేసేవారికి వ్యతిరేకంగా ఇది ఖడ్గంతో బలపరచబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో పదమూడేళ్ల పాటు ఇస్లాం వైపు ఆహ్వానిస్తూ ధర్మప్రచారం చేశారు, ఆ తరువాత యుద్ధం చేయమని ఆజ్ఞాపించబడక ముందే ధర్మప్రచారం ద్వారా మదీనా జయించబడింది. సహాబాలు మరియు ముస్లింలు భూమిపై నలుదిశలా వ్యాపించి అల్లాహ్ వైపు ఆహ్వానించారు, ఎవరైతే నిరాకరించి యుద్ధానికి దిగారో వారితో వారు పోరాడారు. మరియు ఇస్లాం ఏ ఒక్కరినీ ధర్మంలో బలవంతపెట్టలేదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ధర్మం విషయంలో బలవంతం లేదు.﴿ మరియు ఇస్లాంలో ప్రవేశించడానికి ఇష్టపడని వారి కోసం జిజియా విధించబడింది, ఇది వారి రక్షణకు బదులుగా చెల్లించే చాలా తక్కువ సొమ్ము.
వాస్తవధర్మమైన ఇస్లాం 'అహ్లె జిమ్మా' (రక్షణ బాధ్యత గల ప్రజల)కు రక్షణ కల్పించింది. అంతకుముందు ఒకరినొకరు హింసించుకుంటూ మరియు ఒకరినొకరు చంపుకుంటూ ఉండిన యూదులు మరియు క్రైస్తవుల ధర్మాలు ఆ తర్వాత ఇస్లాం నీడలో మనుగడ సాగించాయి. తద్వారా ఇస్లాం వారి మధ్య ప్రశాంతతను, సామరస్యాన్ని మరియు శాంతిని నెలకొల్పింది. దైవసందేశం ప్రజలకు చేరే వరకు మరియు ఇస్లాం ఆధిపత్యం వహించే వరకు జిహాద్‌ను విధించడం దాసుల పట్ల పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ యొక్క కారుణ్యం. దీని ద్వారానే ఇహలోకంలో మరియు పరలోకంలో చాలా మంది ప్రజలకు సౌభాగ్యం మరియు రక్షణ లభిస్తుంది. అల్లాహ్ యే సద్బుద్ధిని ప్రసాదించువాడు. మన నాయకుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, వారి కుటుంబీకులు మరియు వారి సహచరులందరిపై అల్లాహ్ కారుణ్యాలు వర్షించుగాక.
***
ప్రశ్న:
అన్ని మతాలూ తాము అల్లాహ్ తరపు నుండి వచ్చినవేనని దావా చేస్తాయి, మరి ఒక మనిషి కేవలం ఇస్లాంను మాత్రమే ఎందుకు అనుసరించాలి?
సమాధానం:
సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే, నిజమైన సత్యధర్మాన్ని వేరుచేసే ప్రమాణాలు కింది విధంగా ఉన్నాయి :
మొదటిగా: ప్రతి మతం తాము మహోన్నతుడైన అల్లాహ్ వద్ద నుండి వచ్చినవని ప్రకటించదు. కొన్ని మతాలు భౌతిక మతాలుగా ఉంటాయి, ఉదాహరణకు బౌద్ధం మరియు హిందూమతం. అంటే, వాటి స్థాపకులు అవి అల్లాహ్ వద్ద నుండి వచ్చాయని ప్రకటించలేదు. అంతేకాక, ఈ మతాలు కొంతమంది మనుష్యులను గొప్పగా భావించి వారిని దేవుళ్లుగా ఆరాధించమని పిలుస్తాయి. లేదా సూర్యుడు, చంద్రుడు, కొన్ని గ్రహాలు వంటి కనబడే వస్తువులను ఆరాధించమని పిలుస్తాయి. అలాగే చెట్లు, పర్వతాలు, జంతువులు, నదులు వంటి కొన్ని సృష్టులను గౌరవించి పూజించమని ప్రోత్సహిస్తాయి. ఇవే విగ్రహారాధనా సిద్ధాంతాలు.
రెండవది: సత్యమైన ధర్మం అనేది అల్లాహ్ నుండి వచ్చినది, ఆయన దానిని తన దాసుల కోసం శాసించాడు మరియు దైవప్రవక్తలు దానిని ప్రజలకు తెలియజేశారు. గత దివ్యసందేశాలైన యూద మరియు క్రైస్తవ ధర్మాలు సరైన దైవిక సందేశాలే, కానీ ఆ తరువాత వాటిలో వక్రీకరణలు మరియు మార్పులు చోటుచేసుకున్నాయి, ఇంకా ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ ﷺ రాకతో అవి రద్దు చేయబడ్డాయి. ఆ దివ్యసందేశాలు వక్రీకరించబడక ముందు, ప్రవక్త ﷺ ఆవిర్భవించినప్పుడు ఆయనను తప్పనిసరిగా అనుసరించాలన్న ఆదేశం వాటిలో ఉండేది. నేటికీ వాటిలోని కొన్ని వచనాలు ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ ﷺ గురించి సాక్ష్యమిస్తూ మరియు శుభవార్తను తెలుపుతూనే ఉన్నాయి, ఇంకా వాటిని అనుసరించే వారిని ఇస్లాంలోకి మారాలని ఆహ్వానిస్తున్నాయి. అందుకే, ప్రవక్త ﷺ కాలంలో జీవించిన యూదులు ఆయనను అనుసరించడానికి ఆయన ఆవిర్భావం కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉండేవారని మనం గమనిస్తాము, మరియు అరబ్ ముష్రిక్ లతో (బహుదైవారాధకులతో) ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వారు ఆయన (రాకను) చూపి వారిని బెదిరించేవారు. బదర్ సహచరులలో ఒకరైన సలమా బిన్ సలామా బిన్ వఖ్ష్ (రజియల్లాహు అన్హు) ఇలా తెలిపారు: బనీ అబ్దుల్ అష్‌హల్ తెగలో మాకు ఒక యూద పొరుగువాడు ఉండేవాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పంపబడటానికి కొద్దికాలం ముందు, ఒకరోజు అతను తన ఇంటి నుండి మా వద్దకు వచ్చాడు. అతను బనీ అబ్దుల్ అష్‌హల్ వారి సమావేశం వద్ద నిలబడ్డాడు. ఆ రోజు అక్కడ ఉన్నవారిలో వయసులో అందరికంటే చిన్నవాడిని నేనే. నేను ఒక దుప్పటి కప్పుకుని అందులో పడుకుని ఉన్నాను. అప్పుడు అతను పునరుత్థానం, ప్రళయదినం, కర్మల లెక్క, మీజాన్ (త్రాసు), స్వర్గం మరియు నరకాల గురించి ప్రస్తావించాడు. అతను ఈ మాటలను మరణం తరువాత పునరుత్థానం ఉంటుందని నమ్మని, విగ్రహాలను పూజించే బహుదైవారాధకులతో చెప్పాడు. దానికి వారు అతనితో ఇలా అన్నారు: "ఓ పలానా వ్యక్తీ! నీకు నాశనం కలుగుగాక, ఇదంతా జరుగుతుందని నువ్వు భావిస్తున్నావా? నిజంగానే మనుషులు చనిపోయిన తరువాత స్వర్గం మరియు నరకం ఉన్న ఒక లోకంలో పునరుత్థానం చేయబడతారా మరియు అక్కడ వారి కర్మలకు ప్రతిఫలం ఇవ్వబడుతుందా?" అతను అన్నాడు: "అవును, ఎవరి పేరు మీదుగా ప్రమాణం చేయబడుతుందో ఆయన సాక్షిగా! ఆ నరకాగ్నిలో తన వంతు శిక్షకు బదులుగా, ఈ ప్రపంచంలోని అతిపెద్ద కొలిమిని బాగా వేడిచేసి తనను అందులో వేసి పైన మూసివేసినా సరే, రేపు తాను ఆ నరకాగ్ని నుండి రక్షించబడితే చాలని కోరుకుంటాడు." వారు అతనితో అన్నారు: "నీకు నాశనం కలుగుగాక, దానికి సూచన ఏమిటి?" అతను అన్నాడు: "ఈ ప్రాంతాల వైపు నుండి ఒక ప్రవక్త పంపబడతారు" - అంటూ అతను తన చేతితో మక్కా మరియు యెమెన్ వైపు సైగ చేశాడు. వారు: "అయితే ఆయనను నువ్వు ఎప్పుడు చూస్తావు?" అని అడిగారు. అప్పుడు అతను అక్కడ వయసులో అందరికంటే చిన్నవాడినైన నా వైపు చూసి ఇలా అన్నాడు: "ఈ బాలుడు తన వయస్సును పూర్తి చేసేలోపే ఆయనను కలుసుకుంటాడు." సలమా ఇలా అన్నారు: "అల్లాహ్ సాక్షిగా! రాత్రింబవళ్ళు గడిచిపోకముందే అల్లాహ్ తఆలా తన రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం ను పంపాడు. అప్పుడు ఆ యూదుడు మా మధ్యే సజీవంగా ఉన్నాడు. మేము ప్రవక్తను విశ్వసించాము, కానీ ఆ యూదుడు ద్వేషం మరియు అసూయతో ఆయనను తిరస్కరించాడు. అప్పుడు మేము అన్నాము: 'ఓ పలానా వ్యక్తీ! నీకు నాశనం కలుగుగాక, ఆయన గురించి మాతో ఆ మాటలు చెప్పింది నువ్వే కదా?' దానికి అతను, 'అవును, కానీ ఆయన ఇతను కాదు' అని అన్నాడు." [దీనిని అహ్మద్ (15841) హసన్ సనదుతో ఉల్లేఖించారు], కాని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు మరియు ఆయన యూద జాతికి చెందినవారు కారని యూదులకు స్పష్టమైనప్పుడు, వారు అసూయతో ఆయన పట్ల అవిశ్వాసం చూపారు, లేకపోతే ఆయన అల్లాహ్ తరఫు నుండి వచ్చిన ప్రవక్త అని వారికి తెలుసు.
మూడు: మానవుడు ఈ గొప్ప ధర్మాన్ని తప్పనిసరిగా అనుసరించడానికి కారణం ఏమిటంటే; అది అల్లాహ్ యొక్క ధర్మం, మరే ఇతరమైనదంతా షైతాన్ యొక్క ధర్మం, మరియు ఇస్లాం సత్యం, దానికి ఇతరమైనదంతా అసత్యం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇదంతా ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ కేవలం ఆయనే సత్యం. మరియు ఆయనను వదలి వారు ఆరాధించేవన్నీ అసత్యాలు మరియు నిశ్చయంగా అల్లాహ్! కేవలం ఆయనే మహోన్నతుడు, మహనీయుడు (గొప్పవాడు).﴿ [సూరతు లుఖ్మాన్: 30]
నాలుగు:- సత్యమైన ధర్మం ఇస్లాం ద్వారా మనిషికి రెండు ఫలితాలు లభిస్తాయి, ఒకటి ఇహలోకంలో మరియు మరొకటి పరలోకంలో. ఇహలోక ఫలితం ఏమిటంటే, అతను ప్రశాంతతను మరియు ఉత్తమమైన జీవితాన్ని పొందుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿ [సూరతు నహల్: 97] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఎవరైతే విశ్వసించారో వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన తృప్తి పొందుతాయి. జాగ్రత్తగా వినండి! కేవలం అల్లాహ్ ధ్యానమే (స్మరణయే) హృదయాలకు తృప్తినిస్తుంది.﴿ [సూరతు ర్రఅద్: 28] ఇక పరలోకం విషయానికొస్తే, అది శాశ్వత సాఫల్యం, నరకాగ్ని నుండి ముక్తి మరియు అల్లాహ్ మన్నతతో సాఫల్యం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ప్రతి పాణి చావును చవి చూస్తుంది. మరియు నిశ్చయంగా, తీర్పుదినమున మీ కర్మల ఫలితం మీకు పూర్తిగా ఇవ్వబడుతుంది. కావున ఎవడు నరకాగ్ని నుండి తప్పించబడి స్వర్గంలో ప్రవేశపెట్టబడతాడో! వాస్తవానికి వాడే సఫలీకృతుడు. మరియు ఇహలోక జీవితం కేవలం మోసపుచ్చే సుఖానుభవం మాత్రమే!﴿ [సూరతు ఆలె ఇమ్రాన్: 185]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఇలా చెప్పు: "ఏమీ? వాటి కంటే ఉత్తమమైన వాటిని నేను మీకు తెలుపనా? దైవభీతి గలవారికి, వారి ప్రభువు వద్ద స్వర్గవనాలుంటాయి. వాటి క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి, అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు మరియు వారికి అక్కడ పవిత్ర సహవాసులు (అజ్వాజ్) ఉంటారు మరియు వారికి అల్లాహ్ ప్రసన్నత లభిస్తుంది." మరియు అల్లాహ్ తన దాసులను కనిపెట్టుకొని ఉంటాడు.﴿ [సూరతు ఆలె ఇమ్రాన్: 15]
ఐదు:- సత్య ధర్మము, అదే ఇస్లాం, మానవునికి ఒక ప్రమాణాన్ని ప్రసాదిస్తుంది, దీని ద్వారా అతను సత్యాన్ని అసత్యం నుండి, సన్మార్గాన్ని మార్గభ్రష్టత్వం నుండి తెలుసుకుంటాడు మరియు మంచి, చెడుల మధ్య తేడాను గుర్తిస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉంటే, ఆయన మీకు (మంచి-చెడులను గుర్తించే) విచక్షణా శక్తిని ప్రసాదించి, మీ నుండి మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్షమిస్తాడు. మరియు అల్లాహ్ దాతృత్వంలో సర్వోత్తముడు.﴿ [సూరతుల్ అన్'ఫాల్: 29]
కాబట్టి, పురుషుడైనా లేదా స్త్రీ అయినా, ప్రతి మనిషి ఇస్లాం ధర్మంలో ప్రవేశించడం తప్పనిసరి. ఎందుకంటే ఇతర మతాలు ఒకవేళ పూర్వపు దైవిక సందేశాలై ఉంటే, అవి వక్రీకరించబడ్డాయి మరియు మార్చబడ్డాయి, తద్వారా ఇస్లాం వాటిని రద్దు చేసింది. లేదా అవి మూలంలోనే అబద్ధమైన మతాలు, కనుక వాటిలో ఎలాంటి మేలు లేదు. మరియు వాటి ప్రకారం ఆరాధించడం ఇహలోకం మరియు పరలోకంలో నష్టమే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు.﴿ [సూరతు ఆలె ఇమ్రాన్: 85] అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
స్వేచ్ఛా సంకల్పం మరియు బలవంతపు విధి అనే రెండు భావనల విషయంలో ఇస్లాం ఏ స్థానం తీసుకుంటుంది?
సమాధానం:
ప్రశంసలన్నీ అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి, పరిశుద్ధుడైన మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఆకాశాలను మరియు భూమిని సృష్టించక ముందే అన్ని విషయాల విధిరాతలను రాసి ఉంచాడు, మరియు ప్రవక్తలను పంపాడు, మరియు గ్రంథాలను అవతరింపజేశాడు, మరియు మంచిని ప్రేమించే మరియు చెడును ద్వేషించే సహజ స్వభావంపై దాసులను సృష్టించాడు, మరియు సృష్టికి మంచి మరియు చెడులను తెలుసుకునేలా మార్గదర్శకత్వం చేశాడు, మరియు దీనికి మరియు దానికి మధ్య వ్యత్యాసాన్ని గుర్తించే వివేచనను వారిలో ఉంచాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.﴿ [అల్ బలద్: 10] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, మేము అతనికి మార్గం చూపాము. ఇక అతడు కృతజ్ఞుడు కావచ్చు, లేదా కృతఘ్నుడూ కావచ్చు!﴿ [అల్ ఇన్సాన్: 3] ఫిర్ఔన్ మూసా అలైహిస్సలాంను: "మీ ఇరువురి ప్రభువు ఎవరు?" అని అడిగినప్పుడు, అల్లాహ్ ఆయన గురించి తెలియజేసిన విధంగా ఆయన ఇలా పలికాడు: ﴾(మూసా) జవాబిచ్చాడు: "ప్రతి దానికి దాని రూపాన్నిచ్చి, తరువాత దానికి మార్గదర్శకత్వం చేసేవాడే మా ప్రభువు.﴿ [తాహా: 50]
కాబట్టి ప్రతీ మనిషిని అల్లాహ్ సృష్టించాడు మరియు అతనికి ప్రయోజనం ఉన్న మార్గాన్ని చూపించాడు, దీనిని ప్రతీ మనిషి తనలో తాను కనుగొంటాడు, అంతేకాదు మూగ జంతువులకు కూడా వాటికి ప్రయోజనకరమైన వాటి కొరకు అల్లాహ్ మార్గదర్శకత్వం చేశాడు, వాటి జాతిని రక్షించుకోవడానికి మరియు వాటి సంతానోత్పత్తి మరియు వృద్ధి నిరంతరం కొనసాగేలా నిర్ధారించాడు.
అల్లాహ్ సృష్టితాలపై ప్రమాణాన్ని నెలకొల్పాడు, మరియు అదృష్టవంతులను సౌలభ్యం వైపుకు సౌలభ్యపరిచాడు మరియు వారిని కష్టత నుండి దూరంగా ఉంచాడు, మరియు దురదృష్టవంతులను కష్టత వైపుకు సౌలభ్యపరిచాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾దానిని క్రమ్ముకునే, రాత్రి సాక్షిగా! ఆకాశం మరియు దానిని నిర్మించిన ఆయన (అల్లాహ్) సాక్షిగా! భూమి మరియు దానిని విస్తరింపజేసిన ఆయన సాక్షిగా! మానవ ఆత్మ మరియు దానిని తీర్చిదిద్దిన ఆయన సాక్షిగా! ఆ తరువాత ఆయనే దానికి దుష్టతనాన్ని మరియు దైవభీతిని తెలియజేశాడు. వాస్తవానికి తన ఆత్మను శుద్ధపరచుకున్నవాడే సఫలుడవుతాడు. మరియు వాస్తవానికి దానిని అణగ ద్రొక్కిన వాడే విఫలుడవుతాడు.﴿ [అష్షమ్స్: 4 - 10]
సహాబాలలో ఒకరు (రిజ్వానుల్లాహి అలైహిమ్) దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను పూర్వమే లిఖించబడిన విధివ్రాత పట్ల ఒక వ్యక్తి వైఖరి గురించి ఇలా అడిగారు: మేము దానిపైనే ఆధారపడి అమలు చేయడం మానేయాలా లేక అమలు చేయాలా? దానికి సమాధానం ఈ హదీసులో ఉన్నది, అలీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: మేమొక జనాజా వెంట బఖీవుల్ గర్ఖద్ శ్మశానానికి వెళ్ళాం. అంతలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా అక్కడికి వచ్చి ఒకచోట కూర్చున్నారు. కాసేపటికి మేము కూడా ఆయన చుట్టూ గుమిగూడి కూర్చున్నాం. అప్పుడు ఆయన చేతిలో ఒక బెత్తం ఉంది. ఆయన తలక్రిందికి దించుకొని బెత్తంతో నేలమీద గీయసాగారు. ఆ తరువాత ఆయన ఇలా పలికారు : స్వర్గం లేదా నరకంలో వారి నివాసం అని అల్లాహ్ చేత వ్రాయబడని ఏ ప్రాణం మీ మధ్య లేదు, ప్రాణం ఉన్న ప్రతి ప్రాణి గురించి వ్రాసిపెట్టబడింది మరియు ప్రతి వ్యక్తి అతను దురదృష్టవంతుడా లేదా పుణ్యాత్ముడా అని కూడా వ్రాయబడింది. దీనిపై ఒక వ్యక్తి ఇలా అన్నాడు: ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం! అలాంటప్పుడు మేము ఆచరణను వదలిపెట్టి మా ఈ విధివ్రాతను నమ్ముకుంటే చాలుకదా? అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు : మనలో పుణ్యాత్ముడు పుణ్యకార్యాల వైపుకు తిరిగి వస్తాడు మరియు దురదృష్టవంతుడు దురదృష్ట కార్యాల వైపుకు తిరిగి వస్తాడు. ఆయన మళ్ళీ ఇలా పలికారు : మీరు కర్మలు ఆచరించండి, ప్రతి ఒక్కరికీ సౌలభ్యం కలిగించబడుతుంది. సత్పురుషులకు మంచిపనులు చేయుటకు సౌలభ్యం కలిగించబడుతుంది, దురదృష్టవంతులకు చెడ్డపనులు సులువుగా చేయటానికి సౌలభ్యం కలిగించబడుతుంది. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతులను పటించారు : ﴾కాని ఎవడైతే (దానధర్మాలు) చేస్తూ దైవభీతి కలిగి ఉంటాడో! మరియు మంచిని నమ్ముతాడో! మేము అతనికి సులభమైన మార్గాన్ని సుగమం చేస్తాము. మరియు ఎవడైతే పిసినారితనం చేస్తాడో మరియు నిర్లక్ష్యం వహిస్తాడో! మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! మేము అతనికి కష్టమైన మార్గాన్ని సులభతరం చేస్తాము.﴿ [సహీహ్ ముస్లిం (2647)].
పరిశుద్ధుడైన, మహోన్నతుడైన అల్లాహ్ ఎవరినీ బలవంతం చేయవలసిన అవసరం లేని నిరుపేక్షాపరుడు; ఎందుకంటే విధేయతలు ఆయనకు ప్రయోజనం చేకూర్చవు మరియు పాపాలు ఆయనకు నష్టం కలిగించలేవు. కానీ అల్లాహ్ సృష్టిని సృష్టించాడు మరియు వారికి సులభతరం చేశాడు, మరియు ఆయన బలవంతం చేయడం నుండి స్వతంత్రుడు.
మరియు సృష్టిరాసులను సృష్టించక ముందే వారు ఏమి చేస్తారో పరిశుద్ధుడైన,మహోన్నతుడైన అల్లాహ్ కు తెలుసు. మరియు ఆయన దానిని లౌహె మహ్ఫూజ్ లో వ్రాశాడు. మరియు ఆయన ఇచ్ఛ లేకుండా ఏదీ జరగదు. మరియు జరిగేదంతా అల్లాహ్ సృష్టి, ఆయన కోరిక మరియు ఆయన పర్యాలోచన. మరియు అందులో ఆయనకు అత్యున్నతమైన వివేకం ఉంది. మరియు మానవునికి కోరిక,ఇచ్ఛ కలదు మరియు అది అల్లాహ్ ఇచ్ఛకు లోబడి ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ తలచనంత వరకు, మీరు తలచినంత మాత్రాన ఏమీ కాదు.﴿ [సూరతు అత్తక్వీర్: 29] మరియు అతను తాను ఎంపిక చేసుకున్న మరియు కోరుకున్న దానికి బాధ్యత వహిస్తాడు.
ప్రతి మనిషికి తాను తన సంకల్పం మరియు స్వయనిర్ణయంతో చేసే పనులకు, మరియు వ్యాధి మరియు పడిపోవడం వంటి తన ఇష్టానికి వ్యతిరేకంగా తనపై వాటిల్లే వాటికి మధ్య ఉన్న తేడా తెలుసు. కనుక మనిషి తాను కోరుకునే దానిని ఎంచుకుంటాడు, మరియు తాను కోరుకోని దానిని తన స్వయనిర్ణయంతో వదిలిపెడతాడు.
కాబట్టి మనిషి తన ఇచ్చ మరియు ఎంపికతో వ్యవహరిస్తాడు, దీనికే పరలోకదినాన అతడు బాధ్యత వహిస్తాడు మరియు ప్రశ్నించబడతాడు. ఇక మనిషి తాను అడ్డుకోలేని దైవ నిర్ణయం కారణంగా తనపై వాటిల్లే అనారోగ్యం లేదా విధిగా చేయవలసిన ఆచరణను నెరవేర్చటంలో అసమర్థత లాంటి వాటి గురించి పరలోకదినాన అతడు ప్రశ్నించబడడు. మన ప్రవక్త ముహమ్మద్ పై అల్లాహ్ కారుణ్యం మరియు శాంతి వర్షించుగాక.
***
ప్రశ్న:
ఇస్లాం ధర్మ శ్రేష్ఠతలు ఏమిటి లేదా ఇతర మతాలను కాకుండా నేను ఇస్లాం ధర్మాన్నే ఎందుకు అనుసరిస్తున్నాను?
సమాధానం:
ఇస్లాం ధర్మం యొక్క శ్రేష్ఠతలు దాని మూలాల్లో మరియు శాఖల్లో సమగ్రంగా ఉన్నాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾మరియు తన ముఖాన్ని (తనను తాను) అల్లాహ్ కు సమర్పించుకొని (ముస్లిం అయి), సజ్జనుడై...﴿ [నిసా: 125]
- ఇస్లాం ధర్మం యొక్క సుగుణాలలో ఒకటి ఏమిటంటే, అది మానవుల ఆరాధన నుండి మనిషికి విముక్తి కలిగించి దాసుల ప్రభువు ఆరాధన వైపుకు తీసుకువెళుతుంది, కాబట్టి ఒక ముస్లిం సర్వోన్నతుడైన అల్లాహ్ కు తప్ప మరెవరినీ ఆరాధించడు, సాష్టాంగం చేయడు, వంగడు, భయపడడు మరియు ఆశించడు, సర్వోన్నతుడైన అల్లాహ్ ఇలా తెలిపాడు:- ﴾మరియు మీ ఆరాధ్యదైవ కేవలం ఆ అద్వితీయుడు (అల్లాహ్) మాత్రమే. ఆయన తప్ప! మరొక ఆరాధ్యదేవుడు లేడు, అనంత కరుణా మయుడు, అపార కరుణా ప్రధాత.﴿ [అల్ బఖర: 163]
- ఇస్లాం ధర్మం యొక్క సుగుణాలలో ఒకటి, ఇది దాసులందరినీ సమానం చేసింది; కాబట్టి ఏ అరబ్బునకు అరబ్బేతరునిపై మరియు ఏ తెల్లవానికి నల్లవానిపై ఎలాంటి ఆధిక్యత లేదు - కేవలం తఖ్వా (దైవభీతి) లో తప్ప. మరియు ప్రజలు గర్వపడే అజ్ఞానకాలపు (జాహిలియ్యత్) ప్రమాణాలైన హోదా, సంపద, పదవి మరియు అధికారం లాంటి వాటిని ఇది రద్దు చేసింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము. మరియు మీరు ఒకరి నొకరు గుర్తించుకోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.﴿ [అల్-హుజ్'రాత్:13 ]
ప్రామాణికమైన హదీసులో నిరూపితమైనది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారని : «నిశ్చయంగా అల్లాహ్ మీలోని అజ్ఞాన కాలం నాటి అహంభావాలను, పూర్వీకుల గొప్పలు చెప్పుకుని గర్వాతిశయంతో విర్రవీగటాన్ని అంతమొందించాడు. ఇక ఇప్పుడు ధర్మపరాయణుడైన విశ్వాసి అన్నా ఉండాలి లేదా దౌర్భాగ్యుడైన అవిశ్వాసి అన్నా ఉండాలి. మనుషులంతా ఆదం బిడ్డలే. ఆదం మట్టితో పుట్టించబడ్డారు. ప్రజలు తమ (పూర్వీకులైన) వ్యక్తుల గురించి గర్వపడటం ఖచ్చితంగా మానుకోవాలి. లేనిపక్షంలో, తమ ముక్కులతో దుర్గంధాన్ని నెట్టే పేడ పురుగుల కంటే కూడా వారు అల్లాహ్ దృష్టిలో మరింత హీనంగా తయారవుతారు.»
- ఇస్లాం ధర్మం యొక్క సుగుణాలలో ఒకటి, మహోన్నతుడైన అల్లాహ్ పై విశ్వాసమును ఉంచాలని ఆదేశించడం. పరిశుద్ధుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: ﴾వాస్తవానికి, ఎవరైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను విశ్వసించి...﴿ [అన్నూర్: 62] మరియు తౌహీదును ఆదేశిస్తూ వచ్చాడు, పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾మరియు వారికిచ్చిన ఆదేశం: "వారు అల్లాహ్ నే ఆరాధించాలని, పూర్తి ఏకాగ్ర చిత్తంతో తమ ధర్మాన్ని (భక్తిని) కేవలం ఆయన కొరకే ప్రత్యేకించుకోవాలని...﴿ [అల్ బయ్యిన: 5] మరియు నమాజు మరియు జకాతులను ఆజ్ఞాపించడం జరిగింది, పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾మరియు నమాజ్ స్థాపించండి. విధిదానం (జకాత్) ఇవ్వండి...﴿ [నూర్: 56], మరియు అమానతులను, వాగ్దానాలను పరిరక్షించాలని ఆదేశిస్తున్నది. పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వారు ఎవరైతే తమ పూచీలను (అమానతులను) మరియు తమ వాగ్దానాలను కాపాడుకుంటారో.﴿ [అల్ ముమినూన్: 8] మరియు ఒప్పందాలను నెరవేర్చే విషయంలో ఆదేశిస్తూ, పరమ పవిత్రుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి.﴿ [అల్ మాయిదా: 1] మరియు సృష్టితాల పట్ల వ్యవహారంలో సమస్త మేలును పాటించాలని, వారి పట్ల అత్యుత్తమంగా నడుచుకోవాలని ఆజ్ఞాపిస్తుంది. పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు :- ﴾మేలు చేయండి. నిశ్చయంగా, అల్లాహ్ మేలు చేసే వారిని ప్రేమిస్తాడు.﴿ [అల్ బఖర: 195]، మరియు జమాఅత్‌ను అంటిపెట్టుకుని ఉండాలని ఆజ్ఞాపిస్తూ, పరిశుద్ధుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మీరందరూ కలసి అల్లాహ్ త్రాడు (ఖుర్ఆన్) ను గట్టిగా పట్టుకోండి. మరియు విభేదాలలో పడకండి.﴿ [ఆలె ఇమ్రాన్: 103], కావున అది కారుణ్యము, మేలు, వివేకము, బుద్ధి, సహజ స్వభావము మరియు సత్ప్రవర్తన గల ధర్మము. ఇది మంచి లక్షణాల వైపుకు పిలుపునిస్తుంది మరియు చెడు లక్షణాలను నిరోధిస్తుంది, ఇది న్యాయం వైపుకు పిలుపునిస్తుంది మరియు దౌర్జన్యాన్ని నిరోధిస్తుంది, ఇది ఔదార్యం వైపుకు పిలుపునిస్తుంది మరియు పిసినారితనాన్ని నిరోధిస్తుంది, ఇది గొప్ప నైతికతల వైపుకు పిలుపునిస్తుంది మరియు వాటిలోని చెడ్డ గుణాలను నిరోధిస్తుంది, ఇది పవిత్రత వైపుకు పిలుపునిస్తుంది మరియు అశ్లీలతను నిరోధిస్తుంది, ఇది సత్యం వైపుకు పిలుపునిస్తుంది మరియు అబద్ధాన్ని నిరోధిస్తుంది, ఇది బంధుత్వాలను కలపడం వైపుకు పిలుపునిస్తుంది మరియు వాటిని త్రెంచడాన్ని నిరోధిస్తుంది, ఇది మంచి పనుల వైపుకు పిలుపునిస్తుంది మరియు పాపాన్ని నిరోధిస్తుంది, ఇది ఉపకారం వైపుకు పిలుపునిస్తుంది మరియు అతిక్రమణను నిరోధిస్తుంది, ఇది పవిత్రమైన ప్రాణాలను రక్షించడం వైపుకు పిలుపునిస్తుంది మరియు వాటిని నాశనం చేయడాన్ని నిరోధిస్తుంది, మరియు ఇది ప్రజల సంపదను అన్యాయంగా అనుభవించడాన్ని నిరోధిస్తుంది, మరియు వడ్డీని మరియు దొంగతనాన్ని నిరోధిస్తుంది, మరియు ఇది వ్యాపారం, దానధర్మాలు మరియు అన్ని రకాల మంచి పనుల వైపుకు పిలుపునిస్తుంది. అందువల్ల, ఇస్లాం మార్గనిర్దేశం చేయని ధార్మిక లేదా ఇహలోక ప్రయోజనం ఏదీ లేదు, మరియు ఇస్లాం నిరోధించని అనర్థం ఏదీ లేదు. ఇది భూమిని అభివృద్ధి చేయడం మరియు దానిని సంస్కరించడం వైపుకు పిలుపునిస్తుంది మరియు అందులో అవినీతిని సృష్టించడాన్ని నిరోధిస్తుంది, కావున అది అన్ని మంచి లక్షణాలు గల ధర్మము.
అహ్మద్ మరియు ఇతరులు జాఫర్ బిన్ అబూ తాలిబ్ రదియల్లాహు అన్హు మాటలను ఇలా ఉల్లేఖించారు: "మేము అంధకారంలో అజ్ఞానులుగా జీవిస్తూ ఉండేవారము,‘విగ్రహాలను’ఆరాధించేవారము,మృతజీవులను’తినేవారము,అశ్లీలానికి,అనైతికతకు’పాల్పడేవారము,బంధుత్వాలను త్రెంచేవారము,పొరుగువారితో చెడుగా మెలగేవారము,మాలోని బలవంతుడు బలహీనుడిని దోచుకునేవాడు,ఈ విధంగా జీవిస్తున్నతరుణంలో మా వైపుకు అల్లాహ్ ఒక ప్రవక్తను పంపాడు’అతని వంశం, సత్యసంధత,అమానతు,పవిత్రత గురించి మాకు చాలా బాగా తెలుసు.ఆయన ఒక అల్లాహ్ వైపుకు ఆహ్వానించాడు,మేము అల్లాహ్ ఏకత్వాన్ని విశ్వసిస్తూ ఆయనను ఆరాధించాలి,మేము ఆరాధించేవి వదిలిపెట్టాలి,అప్పుడు మేము మాపూర్వీకులు అల్లాహ్’ను కాకుండా రాళ్ళను,విగ్రహాలను ఆరాధించేవారము,ఆయన మాకు ఈ విషయాలు భోదించారు :- మేము సత్యం మాట్లాడాలి,అమానతులు తిరిగి అప్పచెప్పాలి,బంధుత్వాలను కలుపుకోవాలి,పొరుగువారితో ఉత్తమంగా మెలగాలి, దురాక్రమణ,రక్తపాతం నుండి ఆగిపోవాలి,అలాగే ఈ విషయాల నుండి మమ్మల్ని వారించారు అవి :- అశ్లీలానికి దూరంగా ఉండాలి,అబద్దసాక్ష్యం చెప్పకూడదు,అనాధ సొమ్మును అన్యాయంగా తినకూడదు,శీలగుణవంతులపై అబాండాలు మోపకూడదు,అదేవిధంగా మాకు ఈ విషయాన్నికూడా ఆజ్ఞాపించారు;-మేము కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించాలి,ఆయనతో పాటు మరొకరిని సాటి కల్పించకూడదు,నమాజు స్థాపించాలి,జకాతు చెల్లించాలి,ఉపవాసాలు పాటించాలి."
మరియు ఇస్లాం ధర్మం యొక్క విశిష్టతలలో ఒకటి ఏమిటంటే, అది ఇహలోకం కంటే శ్రేష్టమైన పరలోకం వైపునకు పిలుస్తుంది. ఎందుకంటే అత్యంత గొప్ప భద్రత అనగా, స్వర్గంలో ప్రవేశించడం మరియు నరకం నుండి విముక్తి పొందడంలో ఉన్న శాశ్వతమైన మరియు నిరంతరమైన శాంతి భద్రతలే; మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అనబడుతుంది.﴿ [ఇబ్రాహీం: 23] అందువలన, సంపూర్ణమైన పరిపూర్ణత అంతటిలో అల్లాహ్ అద్వితీయుడని మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం మరియు సత్యంపై ఉన్నారని సాక్ష్యం పలకడానికి ఇస్లాం ధర్మం అత్యంత గొప్ప ఆధారం మరియు గొప్ప సాక్ష్యంగా ఉన్నది. ఇది అందులో ఇహలోకం మరియు పరలోకానికి సంబంధించిన సద్గుణాలు, పరిపూర్ణత, మేలు, కారుణ్యము, న్యాయము మరియు విజ్ఞత ఇమిడి ఉండటం వలన. మరియు అల్లాహ్ యే సాఫల్యాన్ని ప్రసాదించువాడు, మరియు అల్లాహ్ మన నాయకుడు ముహమ్మద్, ఆయన కుటుంబీకులు మరియు ఆయన అనుచరులందరిపై తన కారుణ్యాన్ని కురిపించుగాక.
***
(ముస్లింల విభాగము)
ప్రశ్న:
ముస్లింలు మూల పాప సిద్ధాంతాన్ని విశ్వసిస్తారా?
సమాధానం:
'(వారసత్వంగా వచ్చిన పాపం)' అని పిలవబడేది ఎలాంటి వాస్తవం లేని ఒక భ్రమ, మరియు ఇది యూదులు మరియు క్రైస్తవుల పవిత్ర గ్రంథంలోని కల్పిత కథలలో ఒకటి. ఆదమ్ మరియు హవ్వా ఒక ఘోరమైన పాపం చేశారని, మరియు ఆదమ్ ను చెట్టు నుండి తినేలా ప్రేరేపించింది హవ్వా అని వారు ఆరోపిస్తారు. మరియు వారి ఈ అబద్ధపు వాదన ఫలితంగా, ఆదమ్ తన పాప భారాన్ని మోశాడని, మరియు దానిని తన తర్వాత తన సంతానానికి వారసత్వంగా ఇచ్చాడని, తన భర్త ఆదమ్ ను ప్రేరేపించినందుకు శిక్షగా అల్లాహ్ స్త్రీని గర్భం దాల్చేలా మరియు ప్రసవించేలా శిక్షించాడని, షైతాన్ స్వర్గంలో ప్రవేశించాలనుకున్నప్పుడు పాము రూపం ధరించినందున అల్లాహ్ పామును తన పొట్టపై పాకేలా మరియు మట్టి తినేలా శిక్షించాడని, ఆదమ్ పాపం కారణంగా భూమిని శపించాడని మొదలగునవి. ఈ అబద్ధపు కల్పిత కథ మార్పుచేయబడిన యూదుల పవిత్ర గ్రంథం యొక్క అపవాదులలో ఒకటి.
ఆ తరువాత క్రైస్తవ మతం బహుదైవారాధక మతాల నుండి అరువు తెచ్చుకున్న ఒక ఘోరమైన విషయంతో వచ్చింది, అదేమిటంటే: అల్లాహ్ మానవులను వారి తండ్రి పాపం నుండి కరుణించి, తన కుమారుడిని బలి ఇవ్వాలని కోరుకున్నాడు, కాబట్టి తన కుమారుడిని పంపి, మసీహ్ శరీరంలో మూర్తీభవించేలా చేసాడు, ఆ తరువాత ఆదమ్ పాపానికి ప్రాయశ్చిత్తంగా అతనిని చంపడానికి మరియు సిలువ వేయడానికి యూదులకు అతనిపై అధికారం ఇచ్చాడు.
వాస్తవం ఏమిటంటే, అల్లాహ్ సృష్టిని సృష్టించి, ఆకాశాలు, భూమి మరియు దైవదూతల సృష్టిని పూర్తి చేసిన తరువాత, తాను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నానని దైవదూతలకు తెలియజేశాడు. అప్పుడు దైవదూతలు, తమ సహజ స్వభావంలో కాంక్ష మరియు కల్లోలం రేకెత్తించే గుణాలు ఉన్న వారిని అందులో ఎలా నియమిస్తావు? అని ప్రశ్నించారు. దానికి అల్లాహ్, నిశ్చయంగా తాను సర్వజ్ఞుడని మరియు మహా వివేకవంతుడని దైవదూతలకు తెలియజేస్తూ, ఈ ఖలీఫా భూమిపై సంతానోత్పత్తి చేస్తాడని, అందులో అతని సంతానం వృద్ధి చెందుతుందని, వారు ఒకరికొకరు ప్రాతినిధ్యం వహించుకుంటారని మరియు వారిలో సంస్కర్తలు కూడా ఉంటారని తెలియజేశాడు. అల్లాహ్ ఆదామును మరియు అతని భార్య హవ్వను సృష్టించడానికి ముందే లౌహె మహ్ఫూజ్ (భద్రపరచబడిన పలక)లో, భూమిని నిర్మించేందుకు మరియు అందులో ప్రాతినిధ్యం వహించే విధిని నెరవేర్చేందుకు, తాను వారిద్దరినీ భూమ్మీదకు వెళ్ళేలా చేస్తానని లిఖించాడు. ఆయన అతనిని సృష్టించిన తరువాత, తన గురించి మరియు తాను భూమ్మీద ఎదుర్కోబోయే తన శత్రువైన షైతాన్ గురించి అతనికి ఒక గుణపాఠం నేర్పడానికి అతనిని పరదైసులో నివసించడానికి అనుమతించాడు. అక్కడ ఆయన పరదైసులోని చెట్లన్నింటి నుండి తినడానికి అతనికి అనుమతినిచ్చాడు, కానీ ఇతర చెట్ల కంటే ఎటువంటి ప్రత్యేకత లేని ఒకే ఒక చెట్టు నుండి తినడాన్ని ఆయన వారించాడు. ఆయన దానిని కేవలం అతని కోసం ఒక పరీక్షగా మరియు మదింపుగా మాత్రమే నిషేధించాడు. షైతాన్ అతనిని మోసగించి, ఆ చెట్టు నుండి తినేలా అతనితో అబద్ధం ఆడినప్పుడు, తాను తప్పు చేశానని మరియు అల్లాహ్ తనకు చేసిన హెచ్చరికను మరచిపోయానని ఆదాము గ్రహించాడు. అప్పుడు ఈ పొరపాటు నుండి ఎలా పశ్చాత్తాపపడాలో అల్లాహ్ అతనికి నేర్పించాడు, కాబట్టి అల్లాహ్ ఆజ్ఞాపించినట్లుగానే అతను పలికాడు, ఆ తర్వాత అల్లాహ్ అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు, మరియు ఆ విషయం అక్కడితో ముగిసింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు. మరియు ఆయన (అల్లాహ్) ఆదమ్ కు సకల వస్తువుల పేర్లను నేర్పాడు, ఆ పిదప వాటిని దేవదూతల ఎదుట ఉంచి: "మీరు సత్యవంతులే అయితే, వీటి పేర్లను నాకు తెలుపండి." అని అన్నాడు. వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు. ఆయన (అల్లాహ్): "ఓ ఆదమ్! వీటి (ఈ వస్తువుల) పేర్లను వీరికి తెలుపు." అని అన్నాడు. ఎపుడైతే అతను (ఆదమ్) ఆ వస్తువుల పేర్లను వారికి తెలిపాడో; ఆయన అన్నాడు: "నిశ్చయంగా, నేను మాత్రమే భూమ్యాకాశాల అగోచర విషయాలను ఎరుగుదునని మీతో చెప్పలేదా? మరియు మీరు ఏది బహిర్గతం చేస్తారో మరియు ఏది దాస్తారో కూడా నాకు బాగా తెలుసు! మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము దేవదూతలతో: "మీరందరూ ఆదమ్ ముందు సాష్టాంగం (సజ్దా) చేయండి." అని ఆదేశించినపుడు, ఒక ఇబ్లీస్ తప్ప మిగతా వారంతా సాష్టాంగం (సజ్దా) చేశారు; అతడు నిరాకరించాడు మరియు దురహంకారానికి గురయ్యాడు మరియు సత్యతిరస్కారులలోని వాడయ్యాడు. మరియు మేము (ఆదమ్ తో) అన్నాము: "ఓ ఆదమ్! నీవూ మరియు నీ భార్యా, ఈ స్వర్గంలో నివసించండి మరియు మీరిద్దరూ మీకు ఇష్టమైనది యథేచ్ఛగా తినండి, కానీ ఈ చెట్టు దరిదాపులకు పోకండి, అలా చేస్తే మీరిద్దరూ దుర్మార్గులలో చేరిన వారవుతారు! ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి, వారిద్దరినీ వారున్న స్థితి నుండి బయటికి తీశాడు. మరియు మేము (అల్లాహ్) అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి; మీరు ఒకరికొకరు విరోధులవుతారు. ఒక నియమిత కాలం వరకు మీరు భూమిలో ఉండి, అక్కడే జీవితం గడప వలసి ఉంటుంది. తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రధాత. మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగి పోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా!﴿ [సూరతుల్ బఖరహ్: 30-38]
ఈ కథ యొక్క సంఘటనలు దేని చుట్టూ తిరుగుతాయంటే, అల్లాహ్ భూమి కొరకు ఒక ప్రతినిధిని సృష్టించాడు మరియు అతని తొలి నివాసాన్ని స్వర్గంలో ఉంచాడు. ఆ తరువాత ఆయన అతనికి జ్ఞానాన్ని బోధించగా అతను దానిని నేర్చుకున్నాడు, ఆయన అతనికి ఆదేశించాడు మరియు నిషేధించాడు. అప్పుడు అతని వల్ల ఒక తప్పు జరిగింది, దానిని ఖురాన్ 'జల్లా' (పొరపాటు) అని పేర్కొంది మరియు దానిని 'పాపము' అని పేర్కొనలేదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆ పిదప షైతాన్ వారిద్దరినీ దాని (స్వర్గం) నుండి తప్పించి﴿ [సూరతుల్ బఖరహ్: 36] తనపై నిర్దారించబడిన పరీక్షకు అతడు గురైనప్పుడు, తన ద్వారా తప్పు జరిగినప్పుడు దానిని ఎలా సరిదిద్దుకోవాలో మరియు తన ప్రభువుతో ఎలా పశ్చాత్తాపపడాలో అల్లాహ్ అతనికి తెలిపాడు. మరియు అల్లాహ్ అతని పశ్చాత్తాపం ఆమోదించాడు, అతనికి మార్గదర్శనం చేశాడు మరియు అతన్ని సత్కరించాడు. మరియు అతని పశ్చాత్తాపం ఆమోదించిన తరువాత, అతను ఏ కార్యము కొరకు సృష్టించబడ్డాడో దానిని పూర్తి చేయడానికి అతన్ని భూమిపైకి పంపాడు.
మరియు యూదుల గ్రంథంలో అనేక వచనాలు ఉన్నాయి - వాటిని ప్రస్తావించవలసిన అవసరం లేదు - అవి సంతానం తన తండ్రి పాపానికి వారసులవుతారని లేదా మానవాళి పాపాన్ని వారసత్వంగా పొందుతుందనే విషయాన్ని ఖండిస్తాయి, మరి అలాంటప్పుడు యూదులు మరియు వారిని అనుసరించి క్రైస్తవులు ఈ అబద్ధాన్ని ఎలా కల్పించారు.
మరియు పవిత్ర ఖుర్ఆన్ లో ఒక వ్యక్తి మరొక వ్యక్తి పాపాన్ని మోయడు, మరియు బిడ్డ తన తండ్రి పాపానికి వారసుడు కాడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾ఎవడు సన్మార్గాన్ని అవలంబిస్తాడో, అతడు నిశ్చయంగా, తన మేలుకే సన్మార్గాన్ని అవలంబిస్తాడు. మరియు ఎవడు మార్గభ్రష్టుడవుతాడో, అతడు నిశ్చయంగా, తన నష్టానికే మార్గభ్రష్టుడవుతాడు. మరియు బరువు మోసే వాడెవ్వడూ మరొకని బరువును మోయడు. మరియు మేము ఒక ప్రవక్తను పంప నంత వరకు (ప్రజలకు) శిక్ష విధించేవారము కాము.﴿ [సూరతుల్ ఇస్రాఅ: 15]
ఈ ప్రకటన తరువాత మేము దృఢంగా చెప్పేదేమిటంటే: వారసత్వంగా పొందిన లేదా అసలైన పాపం అనే విషయానికి అసలు ఉనికే లేదు, అది కేవలం యూదుల కల్పితంపై ఆధారపడిన ఒక మూఢనమ్మకం మాత్రమే. ఆదమ్ అలైహిస్సలాం యొక్క పాపానికి పరిహారంగా మసీహ్ అలైహిస్సలాం అవతరించడం మరియు ఆయనకు సిలువ వేయడానికి సంబంధించిన క్రైస్తవుల కల్పితం దీనిని మరింత బలోపేతం చేసింది. వాస్తవానికి ఒక కల్పితంపై ఆధారపడిన మూఢనమ్మకానికి ఎటువంటి విలువ ఉండదు, పైగా ఈ వాదన మరియు అపనిందల నుండి మేము అల్లాహ్ తో క్షమాపణ కోరుకుంటున్నాము.
తన ప్రభువుచే సంస్కరించబడి, సత్యం మరియు అసత్యాల మధ్య వ్యత్యాసం చూపే గీటురాయిని పొంది, ఆధారము మరియు వాదనపై స్థిరపడిన సత్య ధర్మంతో గౌరవించబడి, వంచనను మరియు మూఢనమ్మకాలను ద్వేషించే అల్లాహ్ ధర్మాన్ని అనుసరించే వ్యక్తి, ఈ మూఢనమ్మకానికి ఏమాత్రం ప్రాముఖ్యతనివ్వడు. మరియు అది ఒక పచ్చి అబద్ధం అని అతనికి తెలుసు, కనుక అది అతని సంస్కృతి మరియు లక్ష్యాలపై ఎటువంటి ప్రభావం చూపదు; బదులుగా అతడు దీనిని దైవ ప్రవక్తలు మరియు సందేశహరులకు (అలైహిముస్సలాతు వస్సలామ్) జరిగిన అవమానంగా భావిస్తాడు. ఎందుకంటే, మసీహ్ వారి కొరకు చేసిన ప్రాయశ్చిత్తం ద్వారా వారు పవిత్రులయ్యేంత వరకు, దైవ ప్రవక్తలు మరియు సందేశహరులందరూ (అలైహిముస్సలాతు వస్సలామ్) ఆపాదించబడిన వారసత్వ పాపంతో అపవిత్రులై ఉండేవారని దీని ఉద్దేశం. మరి మసీహ్ కాలం కంటే ముందు మరణించిన దైవ ప్రవక్తలు ఎలా పవిత్రులవుతారు??
అల్లాహ్ ధర్మాన్ని అనుసరించే బుద్ధిమంతుడు, ప్రచారంలో ఉన్న ఈ పొరపాటును సరిదిద్దడానికి మరియు దీనికి, ఇతర విషయాలకు సంబంధించిన సత్యాన్ని అసత్యం నుండి వేరుచేసి స్పష్టపరచడానికి ఆసక్తి చూపుతాడు. తనకు సరైన ధర్మాన్ని నేర్పినందుకు, మరియు తనను ప్రవక్తల, సందేశహరుల (అలైహిముస్సలాతు వస్సలామ్) అనుచరులలో ఒకరిగా చేసినందుకు అతను అల్లాహ్‌ను స్తుతిస్తాడు.
***
ప్రశ్న:
మానవాళి అభ్యున్నతిలో ముస్లింల తోడ్పాటు ఏమైనా ఉందా?
సమాధానం:
ముస్లింలు మానవాళి పురోగతిలో ఏ ఉమ్మత్ సహకారమూ సాటిరాలేనంతటి సహకారాన్ని అందించారు, మరియు వారి ఈ సహకారం క్రింది అంశాల ద్వారా గొప్పది మరియు సమగ్రమైనది:
మొదటిది: వారి సహకారంతో అభివృద్ధి చెందిన స్థలం.
రెండవ విషయం: వారి సహకారంతో గౌరవించబడిన కాల వ్యవధి.
మూడవది: వారు అందించిన నాగరికతాపరమైన తోడ్పాటు సారాంశం.
వారి నాగరికతాపరమైన తోడ్పాటు ద్వారా అభివృద్ధి చెందిన ప్రదేశాల విషయానికి వస్తే: వారి కాలంలో భూగోళంలోని జనావాస ప్రాంతాలన్నింటినీ వారి నాగరికత ఆవరించింది. ఎంతలా అంటే, ఒక అమెరికన్ విశ్వవిద్యాలయంలో హిబ్రూ భాషా ప్రొఫెసర్ మరియు అమెరికా అధ్యక్షుని తాత అయిన జార్జ్ బుష్, ఇస్లామిక్ ఖిలాఫత్ రాజ్యం గురించి ఇలా పేర్కొన్నాడు: "రోమ్ ఎనిమిది వందల సంవత్సరాలలో సాధించిన దానికంటే మరింత ఎక్కువగా మరియు విశాలంగా రాజ్యాలు మరియు దేశాలపై కేవలం ఎనభై సంవత్సరాల వ్యవధిలోనే తన అధికారాన్ని విస్తరించగలిగింది, మరియు రాజకీయంగా ఆయన సాధించిన విజయాన్ని పక్కన పెట్టి -అంటే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ ఉద్దేశించబడ్డారు- ఆయన ధర్మం యొక్క ఎదుగుదల,దాని వేగవంతమైన ప్రచారవ్యాప్తి,దాని నిరంతర కొనసాగింపు మరియు శాశ్వత స్థిరత్వం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మన ఆశ్చర్యం మరింతగా పెరుగుతుంది» ముహమ్మద్ ఇస్లాం ధర్మ స్థాపకులు మరియు ముస్లిం సామ్రాజ్య స్థాపకులు." రచన జార్జ్ బుష్, అరబీ అనువాదం ఉస్తాద్ అబ్దుల్లాహ్ షేఖ్.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మత స్థాపకుడు అని ఈ అవిశ్వాసపరుడు చెప్పే దాన్ని మేము అంగీకరించము మరియు ఖిలాఫత్ రాజ్యం ఒక సామ్రాజ్యం కాదు.
ఇక కాల వ్యవధి పరంగా చూస్తే: ముస్లిముల పాలన 1340 సంవత్సరాలకు పైగా కొనసాగింది. సన్మార్గ గాములైన ఖలీఫాల రాజ్యంతో ప్రారంభమై, ఆ తరువాత బనీ ఉమయ్య రాజ్యం, ఆ తరువాత బనీ అబ్బాస్ రాజ్యం, ఆపై ఉస్మానియా సామ్రాజ్యం, ఇలా ఇస్లామిక్ రాజ్యాలు ఒకదాని తరువాత ఒకటిగా పాలించాయి. హిజ్రీ 1344 (క్రీ.శ. 1923) సంవత్సరం వరకు ఇస్లామిక్ రాజ్య పతాకం నేలకొరగలేదు. అంటే ఇస్లామిక్ రాజ్య పాలన పదమూడు వందల సంవత్సరాల కంటే పైగా కొనసాగింది. పాలక వంశం యొక్క తెగ మారినా, లేదా వారి జాతి (అరబ్బులు లేదా తురుష్కులు లాగా) వేరైనా, లేదా రాజ్య నాయకత్వ స్థానం మరియు దాని రాజధాని మారినప్పటికీ — ఇస్లాం అనే ఒకే పతాకాన్ని చేతబూని, వెయ్యి సంవత్సరాల పాటు తమ పలుకుబడిని మరియు అధికారాన్ని కొనసాగించిన మరే ఇతర రాజ్యం చరిత్రలో ఎక్కడా కానరాదు.
ముస్లింలు అందించిన నాగరికతా సహకారం యొక్క సారాంశం విషయానికొస్తే, అది ప్రకాశవంతమైన, సమగ్రమైన మరియు విభిన్నమైన సారాంశం. అది బుద్ధి, జ్ఞానం, ఆత్మ, శరీరం మరియు సహజసిద్ధమైన స్వభావాలకు అనుగుణంగా ఉంటుంది. మరియు ఈ సారాంశం యొక్క కొన్ని కోణాలను క్రింది ప్రకాశవంతమైన అంశాలలో మేము వివరిస్తాము:
మొదటి అంశం: ముస్లింలు అందించిన నాగరికతా సహకారంలో ఎటువంటి అతివాదానికి లేదా నిర్లక్ష్యానికి తావులేని విలువైన, మితవాద ధర్మం ఇమిడి ఉంది. ఈ ధర్మం ప్రవక్తల (అలైహిమస్సలామ్) ధర్మం, ఇది సౌలభ్యం మరియు స్వచ్ఛమైన సహజ స్వభావం గల ధర్మం, హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను పోషించే ధర్మం. ఇది మానవ సహజ స్వభావానికి అనుగుణంగా ఉంటుంది, శరీర అవసరాలను తీరుస్తుంది మరియు ఆత్మ అవసరాలను కూడా తీరుస్తుంది. ఏ పరిస్థితిలోనూ మనిషికి ఇది లేకుండా గడవని ధర్మం ఇది; ఎందుకంటే మనిషి తన సహజ స్వభావంతోనే ధార్మికతను కలిగి ఉంటాడు, మరియు ఏదో ఒక ధర్మాన్ని ఆచరించకుండా ఉండలేడు. కాబట్టి, ముస్లింలు ప్రపంచానికి ఒక దైవిక ధర్మాన్ని అందించారు, దీనిని మానవాళి ఇప్పటికీ ఆచరిస్తోంది, ఆమోదిస్తోంది మరియు వారి మేధోపరమైన, విద్యాపరమైన మరియు సామాజిక స్థాయిలు వేరుగా ఉన్నప్పటికీ వేలాది మంది ప్రజలు ప్రతిరోజూ ఇందులో చేరుతున్నారు. మతాన్ని మరియు ఆత్మ అవసరాలను విస్మరించిన తన భౌతిక నాగరికత వల్ల పాశ్చాత్య మానవుడు ఎంతగానో కష్టాలపాలయ్యాడు, దాని కారణంగా మనిషి దుఃఖానికి గురయ్యాడు. అలాగే తూర్పు మానవుడు జీవితాన్ని, మనస్సును మరియు శరీరాన్ని పణంగా పెట్టి కేవలం ఆత్మ అవసరాలను తీర్చడంలో కూరుకుపోయిన మానవ నిర్మిత మతాలతో ఎంతగానో కష్టాలపాలయ్యాడు.
రెండవ అంశం: ముస్లింలు అందించిన నాగరికతా సహకారంలో విజ్ఞాన శాస్త్రం ఇమిడి ఉంది, ముస్లింలు మానవాళికి దైవిక జ్ఞానాన్ని మరియు మానవ విజ్ఞానాన్ని మిళితం చేసి, మానవులకు సంతోషం కలిగించడంలో తోడ్పడే సమగ్రమైన విజ్ఞాన శాస్త్రాన్ని అందించారు, మరియు తమ కంటే పూర్వపు జాతుల శాస్త్రాలలోని సరైన విషయాలను ఇతర జాతులకు బదిలీ చేశారు, మరియు ఆ జాతుల వద్ద ఉన్న మూఢనమ్మకాలను మరియు నకిలీ శాస్త్రాలను విడిచిపెట్టారు, మరియు వాటికి మరింత జ్ఞానాన్ని జోడించారు, తద్వారా వారు తమ కాలంలోనే ఎంతో అద్భుతమైన ఆవిష్కరణలను సమర్పించారు, మరియు ఖగోళ శాస్త్రం పట్ల వారికి ప్రత్యేక శ్రద్ధ ఉండేది; ఉదాహరణకు 180వ సంవత్సరంలో మరణించిన శాస్త్రవేత్త ముహమ్మద్ బిన్ ఇబ్రాహీం అల్-ఫజారీ ఆస్ట్రోలేబ్ను (الإصطرلاب) తయారు చేసేవారు, మరియు ఆయన లాగే 232వ సంవత్సరంలో మరణించిన బీజగణిత శాస్త్రవేత్త ముహమ్మద్ బిన్ మూసా అల్-ఖవార్జిమీ, నేటి కృత్రిమ మేధస్సు (Artificial Intelligence) కూడా ఈ అసాధారణ శాస్త్రవేత్త యొక్క అల్గారిథమ్‌ల పైనే ఆధారపడి ఉంది.
వారు ప్రపంచానికి ప్రయోగాత్మక విధానాన్ని దాని ఆధునిక భావనలో అందించారు, మరియు ప్రయోగాత్మక విధానమే పాశ్చాత్య నాగరికతను సమకాలీన ఉత్పత్తుల వైపు ముందుకు నడిపించింది, అలాగే యూరోప్ ఉన్నత వంశీయుల కుమారులు కొర్డోబా, బాగ్దాద్ మరియు షామ్ లలోని ముస్లింల విశ్వవిద్యాలయాలలో శాస్త్రాలను అభ్యసించేవారు.
మూడవ అంశం: ముస్లిములు అందించిన నాగరికతా సహకారం సంపూర్ణ న్యాయాన్ని, మరియు ప్రతి హక్కుదారుని హక్కును కాపాడిన సమగ్ర శాసనాన్ని కలిగి ఉంది. ఇస్లాం రాజ్యాల పతాకం కింద 1340 సంవత్సరాల పాటు వివిధ రకాల మానవ జాతులు జీవించారు, వారు యూదులు, క్రైస్తవులు, బౌద్ధులు, జొరాస్ట్రియన్లు మరియు హిందువులు.... వంటి వివిధ మతాలకు చెందినవారు. తమ జాతి, ధర్మం లేదా దేశం కారణంగా వారిలో ఏ ఒక్కరూ ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు; ఎందుకంటే ముస్లిములు మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్య సారాంశానికి కట్టుబడి ఉంటారు: ﴾ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ కొరకు న్యాయంగా సాక్ష్యమివ్వటానికి స్థిరంగా నిలబడండి. ఇతరుల పట్ల మీకున్న ద్వేషానికిలోనై, మీరు న్యాయాన్ని త్యజించకండి. న్యాయం చేయండి, అది దైవభక్తికి సమీపమైనది. మరియు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, మీరు చేసేదంతా అల్లాహ్ ఎరుగును.﴿ [సూరతుల్ మాయిద: 8], మరియు రాజ్యం వారి ధర్మాలను, ఆస్తులను మరియు సంపదలను రక్షించింది, మరియు వారి ఇతర హక్కులన్నింటికీ పూర్తి హామీ కల్పించింది. కజకిస్తాన్ లేదా అండలూసియా (స్పెయిన్) లో ఏ షరీఅతు చట్టం అయితే అమలు చేయబడేదో అదే మక్కా ముకర్రమ మరియు మదీనా నబవియ్యలో కూడా అమలు చేయబడేది. ప్రజలందరికీ ఒకే షరీఅతు చట్టం వర్తించేది. మరియు ఈ చట్టం పౌర, ధార్మిక, రాజకీయ, సైనిక, సామాజిక హక్కులను మరియు వారసత్వం, ఆస్తుల పంపకాలను సమగ్రంగా పొందుపరిచింది -ఈనాటికీ ప్రపంచంలో ఎక్కడా ఈ వారసత్వ పంపకాల వ్యవస్థకు దరిదాపుల్లో లేదా దానికి సమానంగా ఉన్నటువంటి సమగ్రమైన వ్యవస్థ లేదు-. ఇంకా నేటికీ చాలా దేశాలలో ఒక మనిషి తన సంపదనంతా తన కుక్కకు రాసిచ్చి, తన కన్న పిల్లలను ఆ సంపద నుండి దూరం చేయగలుగుతున్నాడు. కానీ ఈ షరీఅతు చట్టం మాత్రం అందరికీ ఎంతో ఆమోదయోగ్యంగా ఉండేది. అయితే నేటి ప్రపంచాన్ని మనం గమనిస్తే ప్రతీ దేశానికి దాని స్వంత చట్టం ఉంది, కానీ వారు ఏ ఒక్క చట్టం పైనా ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అంతేకాదు వారి చట్టాలలో ఉన్నటువంటి అన్యాయం, జాత్యహంకారం మరియు దౌర్జన్యం ఎవరికీ తెలియని విషయమేమీ కాదు. ఆఫ్రికా నుండి వారు అపహరించుకొచ్చిన లక్షలాది మంది బానిసల శ్రమపైనే కదా ఈ భౌతిక నాగరికత స్థాపించబడింది? మరియు బలహీన దేశాల ఆర్థిక వ్యవస్థల నుండి వారు దోచుకున్న మరియు ఇప్పటికీ దోచుకుంటున్న సంపదపై, వాటి వనరులను కొల్లగొట్టడంపై మరియు ఆ దేశాల గనులు, సంపదలను దుర్వినియోగం చేయడం పైనే కదా వారి ఆర్థిక వ్యవస్థలు నిర్మించబడ్డాయి? అంతకంటే దారుణంగా, పేద దేశాలు కేవలం వినియోగదారులుగా మాత్రమే మిగిలిపోవాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకే వారు ఆ పేద దేశాలను కేవలం వినియోగ ఆధారిత ప్రాజెక్టుల వైపుకే ప్రోత్సహిస్తున్నారు, మరియు ఆ దేశాలకు, అభివృద్ధి ప్రాజెక్టులకు మధ్య అడ్డుకట్ట వేయడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఇది న్యాయమేనా?
నాల్గవ అంశము: ముస్లింలు అందించిన నాగరికతా సహకారం వైద్య విద్య మరియు అభ్యాసాలను కలిగి ఉంది. ప్రతి ఇస్లామీయ నగరంలో ఆసుపత్రులు ఉండేవి. వైద్యులే కాకుండా, మన్సూర్ మరియు రషీద్ వంటి కొందరు ఖలీఫాలు కూడా సహజ శాస్త్రాలపై శ్రద్ధ వహించారు. బస్రా, కూఫా, బాగ్దాద్ మరియు దమస్కులలో వైద్యశాస్త్ర అధ్యయనం కోసం ముస్లింలు పాఠశాలలను స్థాపించారు. వారి వైద్య గ్రంథాలు మరియు చికిత్సా పద్ధతులు ఇప్పటికీ పుస్తకాలలో భద్రపరచబడి ఉన్నాయి. ఇస్లామీయ నగరాలు ఆసుపత్రుల సంఖ్యలో పోటీ పడుతున్న ఆ కాలంలో, ఐరోపాకు అసలు ఆసుపత్రులు అంటే ఏమిటో కూడా తెలియదు.
ఐదవ అంశం: ముస్లింలు అందించిన నాగరికతా సహకారంలో ప్రతి కళ మరియు శాస్త్రానికి సంబంధించిన ఉన్నతమైన ఆలోచనలు మరియు రచనలు ఇమిడి ఉన్నాయి. విద్వాంసులకు మరియు రచయితలకు బహుమతులు మరియు పారితోషికాలను అందించడంలో ఖలీఫాలు మరియు అమీర్లు పోటీ పడ్డారు. ఖలీఫాల సభలు మేధోపరమైన వేదికలుగా ఉండేవి, వాటిలో వివిధ రకాల ఆలోచనలు, కవిత్వం మరియు శాస్త్రీయ విషయాలు చర్చించబడేవి. ఖలీఫాలు గ్రంథాలయాలను నిర్మించడంలో, వాటికి పుస్తకాలను సమకూర్చడంలో, వాటిలో సిబ్బందిని నియమించడంలో మరియు వాటి కోసం వక్ఫ్ ఆస్తులను కేటాయించడంలో ఎంతో పోటీ పడ్డారు. గ్రంథ రచన, గ్రంథాలయాలు, వక్ఫ్ ఆస్తులు, శాస్త్రీయ మరియు మేధో వేదికలు అనే ఈ అంశాలు చాలా గొప్పవిగా, విస్తారమైనవిగా మరియు వైవిధ్యభరితమైనవిగా ఉండేవి. ఈ రంగాలలో మరియు ఇతర ఉజ్వలమైన రంగాలలో ముస్లింల చరిత్రను చదివిన వారికి మాత్రమే వాటి నిజమైన విలువ తెలుస్తుంది.
ఆరవ అంశం: ముస్లింలు అందించిన నాగరిక సహకారంలో స్త్రీల పట్ల శ్రద్ధ వహించడం ఇమిడి ఉంది. ఎందుకంటే ఇస్లాం స్త్రీని పురుషుడికి సహోదరిమణిగా పరిగణించింది, మరియు పురుషులపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో ఆమెపై కూడా అలాంటి బాధ్యతలే ఉన్నాయి, మరియు పురుషుడికి ఎలాంటి హక్కులు ఉన్నాయో ఆమెకు కూడా అలాంటి హక్కులే ఉన్నాయి, ప్రతి లింగానికి దాని స్వభావం మరియు సృష్టిని బట్టి, దానికి తగినట్లుగా ప్రత్యేకమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు సత్కార్యాలు చేసేవాడు పురుషుడైనా, లేక స్త్రీ అయినా, ఆ వ్యక్తి విశ్వాసి అయి ఉంటే, అలాంటి వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు వారికి ఖర్జూర బీజపు చీలిక (నఖీరా) అంత అన్యాయం కూడా జరుగదు.﴿ [సూరతు అన్నిసా: 124] ఆమె సంరక్షకుడైన తండ్రి లేదా భర్తపై ఆమె పోషణ ఖర్చులను ఇస్లాం తప్పనిసరి చేసింది. వివాహం అనేది దంపతులిద్దరికీ ఉమ్మడి ప్రయోజనం అయినప్పటికీ, వివాహ సమయంలో స్త్రీకి 'మహర్' చెల్లించడాన్ని పురుషునిపై విధిగా చేసింది. ఆమెకు తగిన నివాసం కల్పించాల్సిన బాధ్యతను కూడా అతనిపైనే విధించింది. ఒకవేళ ఆమెకు పనిమనిషి అవసరమైతే, ఆమెకు సేవ చేయడానికి ఒకరిని ఏర్పాటు చేయాలని నిర్దేశించింది. అంతేగాక, అనేక ఆయతులు మరియు హదీసులలో స్త్రీల పట్ల ఉత్తమంగా వ్యవహరించాలని పురుషులకు ఉపదేశించింది. అయితే యూదులు మరియు క్రైస్తవులు ఆదమ్ పాపానికి స్త్రీయే కారణమని విశ్వసిస్తారు, అందువల్ల వారు అదే ప్రాతిపదికన ఆమెతో వ్యవహరిస్తారు. స్త్రీకి ఆత్మ ఉంటుందా లేదా? అన్న విషయమై ఇటీవలి కాలం వరకు క్రైస్తవులు విభేదిస్తూనే ఉన్నారు. చివరకు ఆమెకు ఆత్మ ఉంటుందని, కానీ అది సైతాను ఆత్మ అని వారు ఒక నిర్ధారణకు వచ్చారు. అర్హతలు మరియు పని ఒకేలా ఉన్నప్పటికీ, నేటికీ ఆమె జీతం పురుషుని జీతం కంటే తక్కువే ఉంటుంది.
ఏడవ అంశం: ముస్లింలు అందించిన నాగరికతా సేవల్లో ఉన్నతమైన సంక్షేమ వ్యవస్థ కూడా ఒకటి. ఇస్లామీయ సమాజంలోని ప్రతి వ్యక్తి ఈ సంక్షేమాన్ని అనుభవించేవాడు. ప్రజల సంక్షేమాన్ని సాధించేందుకు వారు వక్ఫ్ వ్యవస్థను ఎంతో నైపుణ్యంతో ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలు మరియు పేదల సేవల కోసం వక్ఫ్‌లు కేటాయించబడేవి. అలాగే ఈ వక్ఫ్‌ల నుండి బలహీనులు, మానసిక రోగులు మరియు చికిత్స ఖర్చులు భరించలేని రోగుల వైద్యానికి ఖర్చు చేయబడేది.
ఎనిమిదవ అంశం: ముస్లింలు అందించిన నాగరికతా సేవల్లో పరిశుభ్రత కూడా ఒకటి. ఇస్లాంలో పరిశుభ్రత ఒక సమగ్ర వ్యవస్థ. అది హృదయాన్ని షిర్క్, అవిశ్వాసం, అసూయ మరియు ఇతర చెడు గుణాల నుండి పరిశుభ్రపరచడం నుండి ప్రారంభమవుతుంది. అలాగే శరీర పరిశుభ్రతను కూడా ప్రాధాన్యంగా ఉంచుతుంది. ఇస్లాం ముస్లింలకు ప్రతి వారం జుముఅ నమాజు కోసం స్నానం చేయాలని విధిగా చేసింది. ప్రతి వారం స్నానం చేయాలని తమ మతం ఆజ్ఞాపించిన మరో జాతిని మీరు చూశారా? అలాగే దాంపత్య సంబంధం తరువాత భార్యాభర్తలపై స్నానం విధిగా చేసింది. ఇస్లాం ఇళ్లు, పరుపులు, ప్రాంగణాలు మరియు వీధులను శుభ్రంగా ఉంచాలని కూడా ప్రోత్సహించింది. అందలుస్ (స్పెయిన్) నగరాలలో మురుగు నీటిని తరలించేందుకు కాలువలు ఉండేవి. అదే సమయంలో పారిస్ వీధుల్లో ఆ మురుగు నీరు ప్రవహించేది. పారిస్‌లో రాత్రివేళ వెలుగులు కూడా ఉండేవి కావు, అలాగే పర్యావరణ కాలుష్యంతో బాధపడేది. కానీ ఫాస్ నగరంలోని వీధులు వెలుగులతో, రాళ్లతో నిర్మించబడి, శుభ్రంగా ఉండేవి. స్పెయిన్‌వారు ఇస్లామీయ పట్టణాలలోకి ప్రవేశించినప్పుడు అక్కడ ఆవిరి స్నానాల గదులను చూశారు. వారికి అవి తెలియకపోవడంతో, అవి ముస్లింల ఆరాధనా స్థలాలనుకుని వాటిని ధ్వంసం చేశారు.
తొమ్మిదవ అంశం: ముస్లింలు అందించిన నాగరికతా సహకారం శాంతి మరియు భద్రతలను కలిగి ఉంది. ముస్లింల నాగరికత అణు ఆయుధాలను, లేదా జీవాయుధాలను, లేదా సామూహిక విధ్వంసక ఆయుధాలను ఉత్పత్తి చేయలేదు. అక్కడి పిల్లలు మరియు మహిళలు ఆకలి మరియు వ్యాధులతో చనిపోయేంతగా ఒక దేశాన్ని ముట్టడించినట్లు ముస్లింల చరిత్రలో ఎక్కడా లేదు. అలాగే ముస్లింలకు సామూహిక సమాధులు తెలియవు, మరియు అమెరికాను అక్కడి స్థానిక రెడ్ ఇండియన్ వాసుల నుండి నిర్మూలించడానికి ఉపయోగించిన విధంగా, లేదా ఆధునిక కాలంలో ఇతర దేశాలపై దండెత్తిన ఆక్రమణ సైన్యాలు ఉపయోగించిన విధంగా జాతి నిర్మూలన లాంటి నేరాలు ముస్లింలకు తెలియవు.
ఇంతకు ముందు తెలిపినట్లు మరియు మేము వివరించిన విధంగా, నాగరికతా సహకారం అనేది ఉన్నతమైన, సమగ్రమైన, వైవిధ్యమైన, నిర్మాణాత్మకమైన, న్యాయమైన మరియు సమతుల్యమైన సహకారం, ఇది జాత్యహంకారాన్ని, అన్యాయాన్ని లేదా సామూహిక మారణహోమాలను ఎరుగదు.
ఇస్లామీయ నాగరికతలో ఈ ప్రత్యేకత ఎందుకు అని మీరు అడగవచ్చు. దానికి నేను అంటాను: ఎందుకంటే, ఇస్లామీయ నాగరికత యొక్క ఆధారాలు, దాని పునాది మరియు దాని సూత్రాలు ఒక గొప్ప, పరిపూర్ణమైన, సమగ్రమైన ధర్మం నుండి ఉద్భవించాయి. అది సర్వలోకాల ప్రభువు యొక్క ధర్మం, ఇస్లాం ధర్మం. అది తన విశ్వాసాలలో, విధులలో మరియు చట్టాలలో సృష్టికర్త హక్కులను మరియు సృష్టి హక్కులను, ఇహలోక ప్రయోజనాలను మరియు పరలోక ప్రయోజనాలను, ధర్మానికి సంబంధించిన విషయాలను మరియు ప్రపంచానికి సంబంధించిన విషయాలను, ముస్లింకు ప్రత్యేకమైన విషయాలను మరియు ముస్లిమేతరునికి ప్రత్యేకమైన విషయాలను సమ్మిళితం చేసుకున్నది. మరియు అల్లాహ్ సత్యమే పలికాడు, ఆయన ఇలా సెలవిచ్చాడు: ﴾మేము గ్రంథంలో ఏ కొరతా చేయలేదు. తరువాత వారందరూ తమ ప్రభువు వద్దకు మరలింపబడతారు.﴿ [సూరతుల్ అన్ఆమ్: 38]
దీని గురించి చాలా పుస్తకాలలో వివరంగా తెలుపబడింది, వాటిలో కొన్ని సంక్షిప్త పుస్తకాలను ఇక్కడ సూచిస్తున్నాము. అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
చూడండి: ఇస్లామీయ నాగరికత-రచన అబ్దుర్రహ్మాన్ హబన్నక అల్ మైదానీ-పేజీ 549-579/మరియు అల్ ఖియముల్ హదారియ్య ఫిల్ ఇస్లాం-రచన ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ అస్ సుహైమ్.
***
ప్రశ్న:
సృష్టికర్త తన దాసుల పట్ల కరుణామయుడు, మరి అసహజ లైంగిక ప్రవృత్తి గల వ్యక్తి యొక్క మనోవాంఛలను ఆయన ఎందుకు అంగీకరించడు?
సమాధానం:
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾ఇక లూత్! అతను తన జాతి వారితో: "ఏమీ? మీరు ఇంతకు పూర్వం ప్రపంచంలో ఎవ్వరూ చేయని అసహ్యకరమైన పనులు చేస్తారా?" అని అడిగిన విషయం జ్ఞప్తికి తెచ్చుకోండి. వాస్తవానికి, మీరు స్త్రీలను వదలి కామంతో పురుషుల వద్దకు పోతున్నారు. వాస్తవంగా, మీరు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. కాని అతని జాతి వారి జవాబు కేవలం ఇలాగే ఉండింది: "వీరిని మీ నగరం నుండి వెళ్ళగొట్టండి. వాస్తవానికి వీరు తమను తాము మహా పవిత్రులని అనుకుంటున్నారు!"﴿ [అల్ అఅ్ రాఫ్: 80 -82]
స్వలింగ సంపర్కము వంశపారంపర్యమైనది కాదని, మరియు అది మానవుని జన్యు సంకేత నిర్మాణ మూలానికి చెందినది కాదని ఈ ఆయత్ ధృవీకరిస్తుంది. ఎందుకంటే లూత్ జాతి వారే ఈ రకమైన అశ్లీల చర్యను మొదట ఆరంభించిన వారు. స్వలింగ సంపర్కానికి జన్యువులతో ఎలాంటి సంబంధం లేదని నిర్ధారించే అత్యంత విస్తృతమైన శాస్త్రీయ అధ్యయనంతో ఇది ఏకీభవిస్తుంది. ఖుర్ఆన్ మరియు సున్నత్ లోని అద్భుతాల కహీల్ విజ్ఞాన సర్వస్వం.
దొంగతనం పట్ల దొంగకు ఉండే ప్రవృత్తిని మనం అంగీకరించి గౌరవిస్తామా? అది కూడా ఒక ప్రవృత్తే, కానీ ఆ రెండు సందర్భాలలోనూ అది అసహజమైన ప్రవృత్తి. ఇది మానవ సహజ స్వభావానికి విరుద్ధమైనది మరియు ప్రకృతిపై అతిక్రమణ, కాబట్టి దానిని తప్పనిసరిగా సరిదిద్దాలి.
అల్లాహ్ మనిషిని సృష్టించాడు మరియు అతనికి సన్మార్గం వైపుకు మార్గదర్శనం చేశాడు, మరియు అతనికి మంచిమార్గం మరియు చెడు మార్గం మధ్య ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉంది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾మరియు అతనికి (మంచీ - చెడూ) అనే స్పష్టమైన రెండు మార్గాలను చూపాము.﴿ [అల్ బలద్: 10]
అందువల్ల, స్వలింగ సంపర్కాన్ని హరాము చేసే సమాజాలలో ఈ స్వలింగ సంపర్కం చాలా అరుదుగా కనిపిస్తుందని మనం గమనిస్తాము, మరియు ఈ ప్రవర్తనను అనుమతించే మరియు ప్రోత్సహించే వాతావరణంలో స్వలింగ సంపర్కుల శాతం పెరుగుతుంది. దీనిని బట్టి ఒక మనిషిలో స్వలింగ సంపర్కం కలిగే అవకాశాన్ని నిర్ణయించేది అతని చుట్టూ ఉన్న వాతావరణం మరియు బోధనలే అని స్పష్టమవుతుంది.
మనిషి యొక్క గుర్తింపు ప్రతి క్షణం మారుతూ ఉంటుంది, అది అతను చూసే ఉపగ్రహ ఛానెళ్లపై, లేదా అతను ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానంపై, లేదా ఉదాహరణకు ఒక ఫుట్‌బాల్ జట్టు పట్ల అతనికి ఉన్న గుడ్డి అభిమానంపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచీకరణ అతనిని ఒక సంక్లిష్టమైన మనిషిగా మార్చేసింది. ద్రోహి కూడా ఒక దృక్కోణాన్ని కలిగి ఉన్నవాడిగా మారిపోయాడు, మరియు ప్రకృతి విరుద్ధమైన వ్యక్తి సహజమైన ప్రవర్తన కలిగినవాడిగా మారిపోయాడు. అంతేకాకుండా బహిరంగ చర్చలలో పాల్గొనడానికి అతనికి చట్టబద్ధమైన అధికారం లభించింది, పైగా మనం అతనికి మద్దతునిచ్చి, అతనితో రాజీపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎవరి వద్ద అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉందో వారిదే పైచేయిగా మారింది. ఒకవేళ ప్రకృతి విరుద్ధమైన వ్యక్తి అధికార బలాన్ని కలిగి ఉన్న పక్షమైతే, అతను తన విశ్వాసాలను రెండవ పక్షంపై బలవంతంగా రుద్దుతాడు. ఇది మనిషికి తనతో, తన సమాజంతో మరియు తన సృష్టికర్తతో ఉన్న సంబంధాన్ని పాడుచేయడానికి దారితీస్తుంది. వ్యక్తివాదం నేరుగా ప్రకృతి విరుద్ధమైన లైంగికతతో అనుసంధానించబడటం వల్ల, మానవజాతికి చెందిన సహజ స్వభావం (ఫిత్రా) ఇక్కడ కనుమరుగైంది, మరియు ఏక కుటుంబ భావనలు పతనమయ్యాయి. కాబట్టి పాశ్చాత్యులు వ్యక్తివాదం నుండి బయటపడటానికి పరిష్కారాలను కనుగొనడం ప్రారంభించారు. ఎందుకంటే ఈ భావనను ఇలాగే కొనసాగిస్తే, అది కుటుంబ భావనను ఎలాగైతే నాశనం చేసిందో అదే విధంగా సమకాలీన మానవుడు సాధించిన విజయాలను కూడా నాశనం చేస్తుంది. పర్యవసానంగా, పాశ్చాత్య దేశాలు నేటికీ సమాజంలో వ్యక్తుల సంఖ్య (జనాభా) తగ్గిపోతున్న సమస్యతో బాధపడుతున్నాయి, ఇది వలసదారులను ఆకర్షించడానికి తలుపులు తెరవడానికి దారితీసింది. కాబట్టి, అల్లాహ్ పై విశ్వాసం ఉంచడం, ఆయన మన కోసం సృష్టించిన ఈ మహా బ్రహ్మాండం యొక్క నియమాలను గౌరవించడం మరియు ఆయన ఆదేశాలను, నిషేధాలను అనుసరించి కట్టుబడి ఉండటమే ఇహలోకంలో మరియు పరలోకంలో ఆనందానికి మరియు సాఫల్యానికి ఏకైక మార్గం.
***
ప్రశ్న:
మహోన్నతుడైన అల్లాహ్ తన దాసులను ఎందుకు పరీక్షిస్తాడు? వారిని ఎల్లప్పుడూ సుఖసంతోషాల్లోనే ఎందుకు ఉంచడు?
సమాధానం:
అల్లాహ్ సృష్టిలో పరీక్ష అనేది నిరంతరం కొనసాగుతున్న ఒక దైవ సంప్రదాయం, ఇది వృధా కాదు మరియు అన్యాయం కాదు, బదులుగా దీని వెనుక గొప్ప వివేకం, అపారమైన కారుణ్యం దాగి ఉన్నాయి. ప్రాపంచిక జీవితంలో పరీక్ష అనేది విశ్వాసము యొక్క సత్యసంధతను పరీక్షించే ఒక మైదానం, దీని ద్వారానే సజ్జనుడు దుర్జనుడి నుండి, మరియు సహనం పాటించే విశ్వాసి తిరస్కరించే అవిశ్వాసి నుండి వేరు చేయబడతారు. మహోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ﴾ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు...﴿ [ముల్క్: 2] ఈ లోక జీవితమంతా ఒక పరీక్షా స్థలము, దీని లక్ష్యం తాత్కాలిక సుఖాలను పొందడం కాదు, బదులుగా ఇది ప్రజలను పరలోకంలో శాశ్వత ప్రతిఫలానికి అర్హులను చేసే ఒక పరీక్ష.
ప్రజల మధ్య వ్యత్యాసం కేవలం పరీక్ష ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఒక సరియైన బుద్ధి అంగీకరిస్తుంది. ఒకవేళ అందరూ ఎలాంటి కష్టాలు మరియు ఆపదలు లేకుండా నిరంతర సుఖసంతోషాలలో జీవించినట్లయితే, ఎవరి సత్యసంధత వ్యక్తమయ్యేది కాదు మరియు ఒకరి దృఢసంకల్పం మరొకరి దాని నుండి వేరుచేయబడేది కాదు. అదేవిధంగా పరీక్ష అనేది మనిషికి తన బలహీనతను మరియు తన ప్రభువు పట్ల తనకున్న అవసరాన్ని వెల్లడిస్తుంది, మరియు అది అతన్ని వినయం వైపుకు మరియు తన సృష్టికర్త వైపుకు మరలేలా చేస్తుంది, తద్వారా అతని ఆత్మ పవిత్రమవుతుంది మరియు అతని విశ్వాసం బలపడుతుంది. అందుకనే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “ప్రజల్లో అత్యంత కఠినమైన పరీక్షలకు గురయ్యేవారు దైవప్రవక్తలు. తరువాత వారి తరువాతి ఉత్తములు, ఆ తరువాత వారి తరువాతి ఉత్తములు.” కాబట్టి, ఒక దాసుడు పరీక్షలను సహనం మరియు సంతృప్తితో స్వీకరిస్తే, ఆ పరీక్ష మహోన్నతుడైన అల్లాహ్ తన దాసునిపై ప్రేమ కలిగి ఉన్నాడనే సూచనగా ఉంటుంది. .
పరీక్షల వెనుక ఉన్న వివేకాలలో అవి పాపాలను శుద్ధి చేస్తాయి, తప్పులను క్షమింపజేస్తాయి మరియు స్థాయులను ఉన్నతపరుస్తాయి. కాబట్టి ఒక విశ్వాసి సహనం పాటించి ప్రతిఫలాన్ని ఆశిస్తే, మహోన్నతుడైన అల్లాహ్ అతని పరీక్షను ఈ లోకంలోను పరలోకంలోను అతనికి ఉన్నత స్థానం కలిగించే సాధనంగా మారుస్తాడు. హదీసులో ఇలా వచ్చింది: «ఒక ముస్లింకు ఎలాంటి అలసట, అనారోగ్యం, చింత, దుఃఖం, హాని లేదా వేదన కలిగినా, చివరికి ముల్లు గుచ్చుకున్నా - వాటి కారణంగా అల్లాహ్ అతని పాపాలలో కొన్నింటిని క్షమించి వేస్తాడు.» విశ్వాసపరుని విషయంలో పరీక్ష అనేది పూర్తిగా మేలే; అది అతని అంతస్తును పెంచుతుంది, లేదా అతని పాపాలను క్షమిస్తుంది, లేదా అతన్ని అల్లాహ్ కు మరింత చేరువ చేస్తుంది.
ఇక కొంతమంది ప్రజలు లేవనెత్తే అభ్యంతరం ఏమిటంటే: “ఒకవేళ అల్లాహ్ అనంత కరుణామయుడు అయితే, ఆయన తన దాసులను ఎందుకు పరీక్షిస్తాడు?” దీనికి సమాధానం ఏమిటంటే, నిజమైన కారుణ్యం అనేది ప్రజలను ఇహలోక జీవితంలో ఎటువంటి లెక్క లేకుండా వినోదాలలో మునిగితేలేలా వదిలివేయటంలో లేదు, కాని వారిని వారి సృష్టికర్త వైపునకు మరలటానికి గుర్తుచేయటంలో మరియు శాశ్వతమైన పరలోక జీవితం కొరకు వారిని సన్నద్ధం చేయటంలో ఉన్నది. ఎందుకంటే ఆపదలు సన్మార్గం పొందటానికి మరియు పశ్చాత్తాపంతో మరలటానికి కారణం కాగలవు. అయితే నిరంతర సుఖాలు మానవుడిని అహంకారానికి మరియు అశ్రద్ధకు గురిచేసి ప్రలోభపెట్టగలవు. అందువల్లే మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు: ﴾మరియు ఆ పెద్ద శిక్షకు ముందు మేము (ఇహలోకంలో) వారికి సమీప శిక్షను రుచి చూపుతాము. బహుశా, వారు (పశ్చాత్తాప పడి సత్కార్యాల వైపునకు) మరలి వస్తారేమోనని!﴿ [అస్ సజ్దహ్: 21]
పరీక్ష అనేది కూడా ఈ లోకం యొక్క వాస్తవాన్ని వెల్లడిస్తుంది మరియు ఇది శాశ్వత నివాస స్థలం కాదని, పరలోకానికి చేర్చే ఒక మార్గం మాత్రమేనని స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఇందులో బాధలు మరియు కష్టాలు లేకపోయినట్లయితే, ప్రజలు దీని పట్ల వ్యామోహంలో పడి తమ మహత్తర లక్ష్యాన్ని మరచిపోయేవారు. కానీ ఈ ప్రపంచం కొద్దికాలం మాత్రమే ఉండే నశ్వరమైనదిగా ఉండాలని, మరియు నిజమైన సుఖసంతోషాలు స్వర్గంలో ఉండాలని అల్లాహ్ కోరుకున్నాడు, అక్కడ ఎలాంటి అలసట, కష్టం మరియు దుఃఖం ఉండవు.
సారాంశం: నిస్సందేహంగా పరీక్ష అనేది ఒక కరుణ మరియు శోధన, దీని ద్వారా విశ్వాసి ఇతరుల నుండి వేరుచేయబడతాడు, ఆత్మలు పవిత్రమవుతాయి, పాపాలు క్షమించబడతాయి, ప్రాపంచిక వాస్తవం వ్యక్తమవుతుంది మరియు దాసుడు పరలోకానికి సన్నద్ధమవుతాడు. వాస్తవానికి ఇది అల్లాహ్ యొక్క న్యాయం, ఆయన వ్యూహం మరియు ఆయన కరుణలో ఒక భాగం, మరియు ఇది వాటికి ఏమాత్రం విరుద్ధమైనది కాదు.
***
ప్రశ్న:
మనం చేసే ప్రతి దుఆను అల్లాహ్ ఎందుకు స్వీకరించడు?
సమాధానం:
ఈ ప్రశ్న తరచుగా పునరావృతమవుతుంది: అల్లాహ్ సర్వం ఆలకించేవాడు మరియు సర్వశక్తిమంతుడు అయినప్పుడు, మనం కొన్నిసార్లు ఆయనతో దుఆ చేసినప్పటికీ మనం కోరిన దానికి వెంటనే ఎందుకు సమాధానం లభించదు? ఇది ఆయన కరుణకు మరియు దుఆను స్వీకరిస్తానన్న ఆయన వాగ్దానానికి విరుద్ధం కాదా?
మొదటిది: అల్లాహ్ స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: "నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపు విని, జవాబిస్తాను.﴿ [అల్-బఖరహ్:186] కావున అల్లాహ్ తన వాగ్దానాన్ని భంగ పరచడు, కానీ ఆయన స్వీకరించటం అనేది దాసుడికి మేలు చేకూర్చే విధంగా ఉంటుందే తప్ప, ఎల్లప్పుడూ అతడు కోరుకున్న విధంగా కాదు. ఎందుకంటే మనిషి బహుశా తన వినాశనానికి కారణమయ్యే దానిని కోరుకోవచ్చు, మరియు అతనికి ఏది మంచిదో అల్లాహ్ కు బాగా తెలుసు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మీకు నచ్చని విషయమే మీకు మేలైనది కావచ్చు మరియు మీకు నచ్చే విషయమే మీకు హానికరమైనది కావచ్చు!﴿ [అల్ బఖర: 216]
రెండవది: దుఆ స్వీకరించబడే రూపాలు అనేకం.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: దుఆ తిరస్కరించబడదు, దానికి బదులుగా అది ఈ మూడు రూపాలలో ఒకదానిలో ఉంటుంది: "ఏ ముస్లిం అయినా తాను అల్లాహ్ తో ఏదైనా దుఆ చేస్తే అందులో ఎటువంటి పాపముగాని బంధుత్వమును త్రెంచే విషయంగాని లేకపోతే అల్లాహ్ దాని ఫలితంగా మూడు విషయాలలో ఒక దానిని అతనికి ఇస్తాడు: అతని దుఆను వెంటనే స్వీకరించి ప్రసాదిస్తాడు లేదా దానిని అతని కొరకు ప్రళయదినంలో నిల్వచేసి ఇస్తాడు లేదా దానికి తగిన విధంగా అతని నుండి చెడును తొలగిస్తాడు." కావున ప్రతి దుఆ స్వీకరించబడుతుంది, అయితే దానికి సమాధానం మనం కోరుకున్నది లభించడం ద్వారా గానీ, లేదా నష్టాన్ని తొలగించడం ద్వారా గానీ, లేదా దాని ప్రతిఫలాన్ని పరలోకం కోసం నిల్వ చేయడం ద్వారా గానీ ఉండవచ్చు.
మూడవది: దుఆ అనేది కేవలం ఒక అభ్యర్థన మాత్రమే కాదు; అది ఒక ఆరాధన కూడా.
విశ్వాసి దుఆలో తన చేతులను ఎత్తినప్పుడు, అతడు తన ప్రభువు ఎదుట తన దాస్యాన్ని మరియు తన నిస్సహాయతను ప్రదర్శిస్తాడు. దుఆ యొక్క ప్రభావం తక్షణమే కనిపించినా లేదా కనిపించకపోయినా సరే, ఇది స్వతహాగా ఒక గొప్ప ఆరాధన, దీనికి అతనికి ప్రతిఫలం లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు: "నిశ్చయంగా దుఆ యే ఆరాధన" . కావున ఒక ముస్లిం దుఆ చేయుట ద్వారా ఎన్నటికీ నష్టపోడు, పైగా అతడు నిరంతర ఆరాధనలో ఉంటాడు.
నాలుగవది: దుఆ స్వీకరించటం ఆలస్యం కావడం దాసునికి మేలు కావచ్చు.
అల్లాహ్ కొన్నిసార్లు దాసుడి సహనాన్ని పరీక్షించడానికి, లేదా తనతో అతని అనుబంధాన్ని మరింత పెంచడానికి, లేదా అతను అడిగిన దాని కన్నా గొప్ప మేలును అతనికి ప్రసాదించడానికి దుఆకు సమాధానం ఇవ్వడాన్ని ఆలస్యం చేస్తాడు. ఎంతో మంది అల్లాహ్‌ను ఒక నిర్దిష్టమైన ఉపాధిని అడిగారు కానీ ఆయన దానిని వారికి ఇవ్వలేదు, ఆ తర్వాత దానికి బదులుగా వారి ధర్మానికి మరియు ప్రాపంచిక జీవితానికి మరింత మేలైన దానిని ఆయన వారికి ప్రసాదించాడు.
సారాంశం: ఒక వ్యక్తి తాను చేసిన దుఆ ద్వారా కోరుకున్నది అతనికి లభించకపోవడం అంటే, అల్లాహ్ దానికి సమాధానం ఇవ్వలేదని కాదు. బదులుగా, ఆయనకు మాత్రమే తెలిసిన వివేకంతో అల్లాహ్ దానిని అత్యంత పరిపూర్ణమైన రీతిలో అంగీకరించాడని దాని అర్థం. కావున, ప్రతి దుఆకు తప్పక ఒక ఫలితం ఉంటుందని విశ్వాసి దృఢంగా నమ్ముతాడు: అతని దుఆకు వెంటనే సమాధానం లభించవచ్చు, లేదా అది అతని కోసం పుణ్యంగా జమచేసి ఉంచబడుతుంది, లేదా ఏదైనా ఆపద అతని నుండి దూరం చేయబడుతుంది. అందువల్ల, దుఆ అనేది కారుణ్యానికి మరియు ప్రశాంతతకు ద్వారంగా మారుతుంది, అంతేగానీ అనుమానానికి మరియు అభ్యంతరానికి ద్వారం కాదు.
***
ప్రశ్న:
ముస్లిములలో ఇతరుల వలె అన్యాయం చేసేవారు మరియు అల్లకల్లోలాలను రేకెత్తించేవారు ఎందుకు ఉన్నారు?
సమాధానం:
కొందరు ఇలా పలుకుతూ అభ్యంతరం వ్యక్తం చేయవచ్చు: ఒకవేళ ఇస్లాం ధర్మమే నిజమైన ధర్మం అయితే, అవిశ్వాసులు చేస్తున్నట్లుగా కొందరు ముస్లిములు అన్యాయం, ద్రోహం మరియు నష్టం కలిగించటం మనం ఎందుకు చూస్తున్నాము? ఇస్లాం మంచి వైపు మార్గదర్శకత్వం చేస్తుందనే వాదనకు ఇది విరుద్ధం కాదా?
ధర్మము దాని అనుచరుల చర్యల ద్వారా అంచనా వేయబడదు, కానీ అది దాని మూల సూత్రాలు మరియు బోధనల ద్వారా అంచనా వేయబడుతుంది. కావున ఇస్లాం ధర్మం న్యాయం మరియు కరుణ వైపుకు పిలుపునిస్తుంది, మరియు దౌర్జన్యం, పీడ మరియు వినాశనాల నుండి ఆపుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾నిశ్చయంగా, అల్లాహ్ న్యాయం చేయమని మరియు (ఇతరులకు) మేలు చేయమని మరియు దగ్గరి బంధువులకు సహాయం చేయమని మరియు అశ్లీలత, అధర్మం మరియు దౌర్జన్యాలకు దూరంగా ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు...﴿ [అన్ నహ్ల్: 90] ఒకవేళ ఒక ముస్లిం అన్యాయానికి లేదా దుర్మార్గానికి పాల్పడితే, అతను తన మత బోధనలను ఉల్లంఘించినట్లే, అంతేగానీ మతం అతన్ని ఆ విధంగా ఆదేశించిందని కాదు.
అల్లాహ్ నిజమైన షరీఅతు చట్టాలను అవతరింపజేసిన పూర్వపు సముదాయాలలో సైతం, అవిధేయత చూపినవారు మరియు తిరస్కరించినవారు ఉన్నారు. కాబట్టి ముస్లిములలో అన్యాయస్తులు ఉండటం అనేది మానవ సహజమే, ఎందుకంటే సత్యాన్ని పాటించడంలో ప్రజలు విభిన్నంగా ఉంటారు. కానీ తప్పు ఒప్పులను నిర్ణయించే ప్రమాణంగా ఇస్లాం మాత్రమే నిలుస్తుంది, అంతేగాని కొందరు ముస్లిముల ఆచరణలు కావు.
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఏ ముస్లింను కేవలం అతని పేరు లేదా వంశం ఆధారంగా శిక్ష నుండి మినహాయించడు, బదులుగా అతని కర్మల ఆధారంగా లెక్కతీసుకుంటాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు. మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసి ఉన్నా, దానిని చూసుకుంటాడు.﴿ [జల్ జలహ్: 7-8] ఒకవేళ ఒక ముస్లిం అన్యాయానికి పాల్పడితే, అతను అల్లాహ్ వద్ద పాపి అవుతాడు, మరియు అతను పశ్చాత్తాపం చెందితే తప్ప, ఈ లోకంలో లేదా పరలోకంలో శిక్షించబడవచ్చు.
మరియు ఇస్లాం ముస్లిం చేసే తప్పును సమర్థించదు, పైగా దొంగతనం చేసేవారిపై, హత్య చేసేవారిపై లేదా దౌర్జన్యం చేసేవారిపై వారు ముస్లింలైనప్పటికీ శిక్షలను ఖరారు చేస్తుంది. మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ సెలవిచ్చారు :- "ఒకవేళ ముహమ్మద్ కూతురు ఫాతిమా దొంగతనం చేసిన నేను ఆమె చేతులు ఖచ్చితంగా ఖండిస్తాను". ఇస్లాం న్యాయ ధర్మమని, అది తన అనుచరుల పట్ల పక్షపాతం చూపదని అనడానికి ఇది ఆధారం.
ఇస్లాం సరైన కొలమానాన్ని ఏర్పరుస్తుంది మరియు సంస్కరణ మరియు పశ్చాత్తాపం కొరకు ఒక ప్రణాళికను అందిస్తుంది. ముస్లింలలో ఎవరైనా తప్పు చేస్తే వారు దోషులు, కానీ ధర్మం స్వచ్ఛంగా మిగిలి ఉంటుంది, అది మంచిని ఆదేశిస్తుంది మరియు చెడును నిషేధిస్తుంది. లోపం ఇస్లాంలో లేదు, కానీ దాని కొంతమంది అనుచరుల నిర్లక్ష్యంలో ఉంది.
***
ప్రశ్న:
స్త్రీ పరదా (హిజాబ్) ధరించడంలో ఉన్న వివేకం ఏమిటి?
సమాధానం:
ఇస్లాంలో విధిగా ఉన్నది ఏమిటంటే, మనిషికి దాని వెనుక ఉన్న జ్ఞానం తెలియకపోయినా ఆజ్ఞను పాటించడం మరియు నిషేధాన్ని దూరంగా ఉంచడం. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ తాను శాసించిన ప్రతి విషయంలోను, నిర్ణయించిన ప్రతి విషయంలోను పరమ జ్ఞానవంతుడు. హిజాబ్ కేవలం ఇస్లాంకే ప్రత్యేకమైనది కాదు. మూసా మరియు ఈసా అలైహిమస్సలాం వారి షరీఅత్లలో కూడా స్త్రీ హిజాబ్ ధరించాల్సిందిగా ఆదేశాలు ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని మతపరమైన యూద కుటుంబాలు ఈ నియమాన్ని పాటిస్తున్నాయి. ఇది మూసా అలైహిస్సలాం వారి షరీఅత్లో మిగిలి ఉన్న అవశేషాలలో ఒకటి.
అల్లాహ్ స్త్రీ, పురుష జాతులలో ఒకరి పట్ల మరొకరికి ఆకర్షణను సృష్టించాడు; తద్వారా ధర్మసమ్మతమైన సంబంధమైన వివాహం జరగాలని మరియు మానవ సంతతి కొనసాగాలని. స్త్రీ తన అందచందాలను ప్రదర్శించడం వల్ల ఆమెకు నష్టం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు; ఎందుకంటే దీని ద్వారా ఆమె చెడు పురుషుల బారిన పడుతుంది. మరియు ఆమెను చూసే పురుషులకు కూడా ఇందులో నష్టం ఉంది, ఎందుకంటే దీని వల్ల సాధారణంగా వారి కోరికలు ప్రేరేపించబడతాయి. కాబట్టి పరదా అనేది అందరికీ రక్షణనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు, మరియు ఇది స్త్రీ పవిత్రతకు నిదర్శనం, అలాగే ఇతరుల ప్రమేయం లేకుండా భార్య అందచందాలను కేవలం ఆమె భర్త మాత్రమే చూసే ప్రత్యేక హక్కు ఇది. స్వచ్ఛమైన సృష్టి స్వభావం ఈ ప్రత్యేకతను సమర్థిస్తుంది, మరియు మర్యాదకు, అలాగే అనైతికతల నష్టాల నుండి, వ్యాధుల నుండి, అక్రమ సంతానం వ్యాప్తి చెందడం నుండి మరియు వంశాలు కలిసిపోవడం నుండి భద్రతకు పిలుపునిస్తుంది. వీటన్నింటికీ మూలం స్త్రీలు పరదా పాటించడంలో నిర్లక్ష్యం వహించడం మరియు పురుషులు తమ చూపులను క్రిందికి వంచడంలో అలసత్వం వహించడమే. ఈ విషయం యొక్క తీవ్రత దృష్ట్యా, వ్యభిచారానికి దారితీసే ప్రతి విషయానికీ ధర్మం హెచ్చరించింది. మహిమాన్వితుడైన మన ప్రభువు ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు వ్యభిచారాన్ని సమీపించకండి. అది నిశ్చయంగా, అశ్లీలమైనది మరియు బహు చెడ్డ మార్గము.﴿ [అల్ ఇస్రా: 32] మరియు అల్లాహ్ పురుషులను మరియు స్త్రీలను చూపులను క్రిందికి వాల్చమని ఆదేశించి, మహాశక్తిసంపన్నుడైన మా ప్రభువు ఇలా సెలవిచ్చాడు: ﴾విశ్వసించిన పురుషులతో, వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. ఇది వారికి ఎంతో శ్రేష్ఠమైనది. నిశ్చయంగా, అల్లాహ్ వారి చేష్టలను బాగా ఎరుగును. మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు!﴿ [అన్-నూర్: 30-31].
***
ప్రశ్న:
ఇస్లాం స్త్రీకి ఎలా గౌరవం ఇచ్చింది?
సమాధానం:
- ఇతర మత సిద్ధాంతాల్లాగా ఆదమ్ అలైహిస్సలాం చేసిన పాప భారాన్ని స్త్రీపై మోపకుండా, ఇస్లాం ఆమెను గౌరవించింది. అంతేకాక, ఇస్లాం స్త్రీ యొక్క స్థాయిని ఉన్నతపరచడానికి ప్రత్యేక శ్రద్ధ చూపింది.
- ఇస్లాంలో అల్లాహ్ ఆదమ్‌ను క్షమించాడు మరియు మన జీవితాంతం మనం ఎప్పుడు తప్పు చేసినా ఆయన వైపునకు ఎలా మరలాలో మనకు నేర్పించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾తరువాత ఆదమ్, తన ప్రభువు నుండి కొన్ని మాటలు గ్రహించి, (పశ్చాత్తాప పడి క్షమాభిక్ష కోరాడు) మరియు ఆయన (అల్లాహ్) అతని పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా, ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు, అపార కరుణా ప్రధాత.﴿ [అల్ బఖర: 37]
- దైవప్రవక్త ఈసా అలైహిస్సలాం వారి తల్లి అయిన మర్యం అలైహస్సలాం, ఖుర్ఆన్లో పేరుతో ప్రస్తావించబడిన ఏకైక స్త్రీ.
- ఖురాన్లో ప్రస్తావించబడిన అనేక కథలలో స్త్రీలు గొప్ప పాత్రను పోషించారు, ఉదాహరణకు సబా రాణి బిల్ఖీస్ మరియు ప్రవక్త సులైమాన్ అలైహిస్సలాంతో ఆమె కథ, అది ఆమె విశ్వాసంతో మరియు సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌కు విధేయతను (ఇస్లాంను) స్వీకరించటంతో ముగిసింది. పవిత్ర ఖురాన్లో ఈ విధంగా ప్రస్తావించబడింది: ﴾నిశ్చయంగా, నేను అక్కడ ఒక స్త్రీని చూశాను. ఆమె వారిపై (రాణిగా) పరిపాలన చేస్తుంది. ఆమెకు ప్రతి వస్తువు ఒసంగబడి ఉంది. ఆమె దగ్గర ఒక గొప్ప సింహాసనం ఉంది.﴿ [నమల్: 23]
- ఇస్లామిక్ చరిత్ర మనకు వివరించి తెలియజేస్తుంది ఏమనగా, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనేక సందర్భాలలో స్త్రీలను సంప్రదించారు మరియు వారి అభిప్రాయాలను స్వీకరించారు. అలాగే, స్త్రీ తన ఇంట్లో నమాజు చేసుకోవడమే మరింత ఉత్తమం అయినప్పటికీ, వారు హుందాతనాన్ని మరియు మర్యాదను పాటించాలనే షరతుతో పురుషుల వలె స్త్రీలను కూడా మస్జిదులకు వెళ్ళడానికి ఆయన అనుమతించారు. అంతేకాకుండా, స్త్రీలు యుద్ధాలలో పురుషులతో పాటు పాల్గొనేవారు మరియు వైద్య ఉపచార విషయాలలో సహాయపడేవారు. అదేవిధంగా, వారు వ్యాపార లావాదేవీలలో కూడా పాలుపంచుకునేవారు మరియు విద్య, జ్ఞాన రంగాలలో పోటీపడేవారు.
- ప్రాచీన అరబ్ సంస్కృతులతో పోలిస్తే ఇస్లాం మహిళ స్థితిని ఎంతో మెరుగుపరిచింది, ఎందుకంటే అది ఆడపిల్లలను సజీవంగా సమాధి చేయటమును నిషేదించింది మరియు స్త్రీకి స్వతంత్ర వ్యక్తిత్వాన్ని ప్రసాదించింది. అలాగే వివాహానికి సంబంధించిన ఒప్పంద వ్యవహారాలను క్రమబద్ధీకరించింది, అందులో స్త్రీకి మహర్ పై ఉన్న హక్కును పరిరక్షించింది. మరియు వారసత్వంలో ఆమె హక్కులకు హామీ ఇచ్చింది, మరియు వ్యక్తిగత ఆస్తి పై ఆమె హక్కును మరియు తన సంపదను స్వయంగా నిర్వహించుకునే హక్కును ప్రసాదించింది.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ఉత్తమ నడవడిక గల వారే పరిపూర్ణ విశ్వాసులు, మీలో తమ భార్యల పట్ల మంచిగా మెలిగే వారే అందరికన్నా శ్రేష్ఠులు.”
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾నిశ్చయంగా, ముస్లిం (అల్లాహ్ కు విధేయులైన) పురుషులు మరియు ముస్లిం స్త్రీలు; విశ్వాసులైన (ము'మిన్) పురుషులు మరియు విశ్వాసులైన (ము'మిన్) స్త్రీలు; భక్తిపరులైన పురుషులు మరియు భక్తిపరులైన స్త్రీలు; సత్యవంతులైన పురుషులు మరియు సత్యవంతులైన స్త్రీలు; ఓర్పు గల పురుషులు మరియు ఓర్పు గల స్త్రీలు; వినమ్రత గల పురుషులు మరియు వినమ్రత గల స్త్రీలు; దానశీలురైన పురుషులు మరియు దానశీలురైన స్త్రీలు; ఉపవాసాలు ఉండే పురుషులు మరియు ఉపవాసాలు ఉండే స్త్రీలు; తమ మర్గాంగాలను కాపాడుకునే పురుషులు మరియు (తమ మర్మాంగాలను) కాపాడుకునే స్త్రీలు; మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే పురుషులు మరియు అల్లాహ్ ను అత్యధికంగా స్మరించే స్త్రీలు; ఇలాంటి వారి కొరకు అల్లాహ్ క్షమాభిక్ష మరియు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధపరచి ఉంచాడు.﴿ [అల్ అహ్జాబ్: 35]
﴾ఓ విశ్వాసులారా! మీరు బలవంతంగా స్త్రీలకు వారసులు కావటం మీకు ధర్మసమ్మతం కాదు. మరియు మీరు వారికిచ్చిన దాని (మహ్ర్) నుండి కొంత తీసుకోవటానికి వారిని ఇబ్బందిలో పెట్టకండి, వారు నిస్సందేహంగా వ్యభిచారానికి పాల్పడితే తప్ప. మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి. ఒకవేళ మీకు వారు నచ్చకపోతే! బహుశా మీకు ఒక విషయం నచ్చకపోవచ్చు, కాని అందులోనే అల్లాహ్ ఎంతో మేలు ఉంచి ఉండవచ్చు!﴿ [నిసా: 19]
﴾ఓ మానవులారా! మీ ప్రభువు పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి (ఆదమ్) నుండి సృష్టించాడు మరియు ఆయనే దాని (ఆ ప్రాణి) నుండి దాని జంట(హవ్వా)ను సృష్టించాడు మరియు వారిద్దరి నుండి అనేక పురుషులను మరియు స్త్రీలను వ్యాపింపజేశాడు. మరియు ఆ అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి, ఎవరి ద్వారానైతే (పేరుతోనైతే) మీరు మీ పరస్పర (హక్కులను) కోరుతారో; మరియు మీ బంధుత్వాలను గౌరవించండి (త్రెంచకండి). నిశ్చయంగా, అల్లాహ్ మిమ్మల్ని సదా కనిపెట్టుకొని ఉన్నాడు.﴿ [అన్నిసా :1]
﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿ [అన్-నహ్ల్: 97]
﴾వారు మీ వస్త్రాలు, మీరు వారి వస్త్రాలు.﴿ [అల్ బఖర: 187]
﴾మరియు ఆయన సూచనలలో; ఆయన మీ కొరకు మీ జాతి నుండియే - మీరు వారి వద్ద సౌఖ్యం పొందటానికి - మీ సహవాసులను (అజ్వాజ్ లను) పుట్టించి, మీ మధ్య ప్రేమను మరియు కారుణ్యాన్ని కలిగించడం. నిశ్చయంగా, ఇందులో ఆలోచించే వారికి ఎన్నో సూచనలున్నాయి.﴿ [అర్రూమ్: 21].
﴾మరియు వారు నిన్ను స్త్రీల వ్యవహారంలో గల ధార్మిక తీర్పు (ఫత్వా)ను గురించి అడుగుతున్నారు. వారితో ఇలా అను: "అల్లాహ్ వారిని (స్త్రీలను) గురించి ధార్మిక తీర్పు ఇస్తున్నాడు: 'అనాథ స్త్రీలను, వారి కొరకు నిర్ణయించబడిన హక్కు (మహ్ర్) ను మీరు వారికివ్వక, వారిని పెండ్లాడ గోరుతున్న విషయాన్ని గురించీ మరియు బలహీనులైన బిడ్డలను గురించీ మరియు అనాథ పిల్లల విషయంలోనూ న్యాయంగా వ్యవహరించాలని, ఈ గ్రంథంలో మీకు తెలుపబడుతోంది.' మరియు మీరు ఏ మంచిపని చేసినా అది అల్లాహ్ కు తప్పకుండా తెలుస్తుంది. మరియు ఒకవేళ స్త్రీ తన భర్త, అనాదరణతో ప్రవర్తిస్తాడేమోనని, లేదా విముఖుడవుతాడేమోనని, భయపడితే! వారిద్దరూ తమ మధ్య రాజీ చేసుకుంటే! వారిపై ఎలాంటి దోషం లేదు. రాజీ పడటం ఎంతో ఉత్తమమైనది. మరియు మానవుల మనస్సులలో పేరాస ఇమిడి వున్నది. మీరు సజ్జనులై దైవభీతి కలిగి ఉండండి! ఎందుకంటే! నిశ్చయంగా, అల్లాహ్ మీ కర్మలన్నింటినీ బాగా ఎరుగును.﴿ [నిసా: 127-128]
- మహోన్నతుడైన అల్లాహ్ పురుషులకు స్త్రీలపై ఖర్చు చేయాలని మరియు వారి సంపదను సంరక్షించాలని ఆదేశించాడు. అయితే కుటుంబం పట్ల స్త్రీపై ఎలాంటి ఆర్థిక బాధ్యతను విధించలేదు. అలాగే ఇస్లాం స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని మరియు గుర్తింపును కాపాడింది. వివాహం తరువాత కూడా ఆమె తన కుటుంబ పేరును కొనసాగించడానికి అనుమతించింది.
***
ప్రశ్న:
ముస్లిం క్రైస్తవ స్త్రీని వివాహం చేసుకోవచ్చా? మరియు ముస్లిం స్త్రీ క్రైస్తవునితో వివాహం చేసుకోవడానికి అనుమతి ఉందా?
సమాధానం:
క్రైస్తవ స్త్రీ పవిత్రురాలైతే, ఒక ముస్లిం ఆమెను వివాహమాడటం అనుమతించబడింది, మరియు దీనికి ఆధారం మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఈనాడు మీ కొరకు పరిశుద్ధమైన వస్తువులన్నీ ధర్మసమ్మతం (హలాల్) చేయబడ్డాయి. మరియు గ్రంథ ప్రజల ఆహారం మీకు ధర్మ సమ్మతమైనది మరియు మీ ఆహారం వారికి ధర్మ సమ్మతమైనది. మరియు సుశీలురు అయిన విశ్వాస (ముస్లిం) స్త్రీలు గానీ మరియు సుశీలురు అయిన పూర్వ గ్రంథ ప్రజల స్త్రీలు గానీ, మీరు వారికి వారి మహ్ర్ చెల్లించి, న్యాయబద్ధంగా వారితో వివాహ జీవితం గడపండి. కాని వారితో స్వేచ్ఛా కామక్రీడలు గానీ, లేదా దొంగచాటు సంబంధాలు గానీ ఉంచుకోకండి...﴿ [అల్ మాయిదా: 5] ముస్లిం స్త్రీకి ముస్లిం కాని వ్యక్తిని వివాహం చేసుకోవడం అనుమతించబడదు. ఎందుకంటే మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾మరియు ముష్రిక్ స్త్రీలు, విశ్వసించనంత వరకు, మీరు వారిని వివాహమాడకండి...﴿ [అల్-బఖరహ్: 221] అల్లాహ్ వాక్కు: ﴾వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు.﴿ [అల్ ముమ్'తహిన: 10] దీనిలోని ఆంతర్యం ఏమిటంటే, ఇస్లాం మాత్రమే సత్యమయమైన ధర్మం. కాబట్టి ముస్లిం మహోన్నతుడైన అల్లాహ్ అవతరింపజేసిన గ్రంథాలన్నింటినీ విశ్వసిస్తాడు, వాటిలో ఇంజీల్ కూడా ఒకటి. మరియు మహోన్నతుడైన అల్లాహ్ పంపిన ప్రవక్తలందరినీ విశ్వసిస్తాడు, వారిలో ఈసా అలైహిస్సలాం కూడా ఉన్నారు. దీనికి భిన్నంగా, కొన్ని గ్రంథాలను మరియు కొందరు ప్రవక్తలను తిరస్కరించిన వారు వీరికి సమానులు కారు. మరోవైపు, పురుషుడికి స్త్రీపై సంరక్షకత్వం మరియు అధికారం ఉంటాయి; ఎందుకంటే ఆమె సృష్టిరీత్యా బలహీనమైనది, మరియు సాధారణంగా ఆమె చాలా విషయాలలో తన భర్తను అనుసరిస్తుంది. కాబట్టి, ఒకవేళ ఒక అవిశ్వాసి ముస్లిం స్త్రీకి భర్త అయితే, అది ఆమె అవిశ్వాసానికి మరియు ఆమె సత్యం నుండి అసత్యం వైపుకు మారడానికి కారణమవుతుంది.
***
ప్రశ్న:
జీవిత లక్ష్యం మరియు ఉద్దేశ్యం తెలియకుండా మనిషి నిజమైన సంతోషాన్ని పొందగలడా?
సమాధానం:
అల్లాహ్’ను విశ్వసించకుండా; మరియు అల్లాహ్ తనను ఎందుకు సృష్టించాడో, తాను ఈ ఉనికిలోకి ఎందుకు వచ్చాడో మరియు తన మరణం తరువాత తాను ఎక్కడికి వెళతాడో తెలుసుకోకుండా ఒక వ్యక్తి నిజమైన ఆనందాన్ని పొందలేడు.
మానవుడు ఎన్ని రకాల అనుగ్రహాలను మరియు సంతోషాన్ని కలిగించే వివిధ రకాల సాధనాలను పొంది అనుభవించినప్పటికీ, అతన్ని వీడిపోని కష్టము అతనిలో తప్పక మిగిలి ఉంటుంది. అయితే ప్రశ్నించేవాడు ఇలా అడగవచ్చు : మీలో ఇంతటి దృఢనిశ్చయం ఎందుకు? అప్పుడు మేము ఇలా అంటాము, ఎందుకంటే మానవ ఆత్మను సృష్టించిన అల్లాహ్ ఈ విషయాన్ని తెలియజేశాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది మరియు పునరుత్థాన దినమున అతినిని అంధునిగా లేపుతాము.﴿ [సూరతు తాహా: 124] అతడు విశ్వసించకపోతే, అతనికి కష్టతరమైన మార్గాన్ని మరియు శాశ్వతమైన దౌర్భాగ్యాన్ని సులభతరం చేస్తాడని అల్లాహ్ తెలియపరుస్తున్నాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: ﴾కాని ఎవడైతే పిసినారితనం చేస్తూ, నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తాడో! మరియు మంచిని అబద్ధమని తిరస్కరిస్తాడో! అతనికి మేము చెడు కొరకు దారిని సులభం చేస్తాము. మరియు అతడు నశించి పోయినప్పుడు, అతని ధనం అతనికి ఎలా ఉపయోగపడుతుంది?﴿ [సూరతుల్ లైల్ : 8-11] ఈ విషయం పవిత్రుడైన మరియు సత్యవంతుడైన అల్లాహ్ నుండి వచ్చినది; ఎందుకంటే ఆయనే మానవ ఆత్మను సృష్టించాడు, మరియు దానికి ఏది ప్రయోజనమో మరియు ఏది కీడు చేస్తుందో ఆయనకు తెలుసు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏమిటీ? పుట్టించిన వాడికే తెలియదా? మరియు ఆయన సూక్ష్మగ్రాహి, సర్వం తెలిసినవాడు!﴿ [సూరతుల్ ముల్క్: 14] మరియు ఆయనే దానిలో మేలు, సద్గుణం, మార్గదర్శకత్వం మరియు సత్యం పట్ల ప్రేమను, మరియు అసత్యం, అవిశ్వాసం మరియు దుర్గుణం పట్ల ద్వేషాన్ని సృష్టించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కావున నీవు నీ ముఖాన్ని, ఏకాగ్రచిత్తంతో, సత్యధర్మం (ఇస్లాం) దిశలో స్థిరంగా నిలుపు. అల్లాహ్ మానవులను ఏ స్వభావంతో పుట్టించాడో, ఆ స్వభావం పైననే వారు ఉంటారు. అల్లాహ్ సృష్టి స్వభావాన్ని (ఎవ్వరూ) మార్చలేరు. ఇదే సరైన ధర్మం, కాని చాలా మంది ఇది ఎరుగరు.﴿ [సూరతు రూమ్: 30].
తన ఉనికి యొక్క ఉద్దేశ్యాన్ని తెలుసుకోనివాడు జీవిత ఆనందాన్ని, సంతృప్తి యొక్క ఆనందాన్ని మరియు తాను చేసే సదాచరణకు ఇహలోకంలో కాకపోయినా పరలోకంలోనైనా దాని ప్రతిఫలం ఖచ్చితంగా పొందుతాడని తెలుసుకోవడం ద్వారా కలిగే సాఫల్యపు ఆనందాన్ని కోల్పోతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾అప్పుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "ఈ రోజు సత్యవంతులకు వారి సత్యం లాభదాయక మవుతుంది. వారికి క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు లభిస్తాయి. అక్కడ వారు శాశ్వతంగా కలకాలముంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయనతో ప్రసన్నులవుతారు. ఇదే గొప్ప విజయం (సాఫల్యం)!﴿ [సూరతుల్ మాయిదహ్: 119] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఏ పురుషుడు గానీ, లేక స్త్రీ గానీ విశ్వాసులై, సత్కార్యాలు చేస్తే, అలాంటి వారిని మేము తప్పక (ఇహలోకంలో) మంచి జీవితం గడిపేలా చేస్తాము. మరియు వారికి (పరలోకంలో) వారు చేసిన సత్కార్యాలకు ఉత్తమ ప్రతిఫలం తప్పక ప్రసాదిస్తాము.﴿ [సూరతుల్ నహ్ల్: 97]. సంతోషం యొక్క వాస్తవికతను, విశ్వాసం యొక్క మాధుర్యాన్ని మరియు సిరిసంపదలు గానీ, సంతానం గానీ ఎలాంటి లాభం చేకూర్చని ఆ దినం కొరకు సత్కర్మలను కూడబెట్టుకోవడంలోని ఆనందాన్ని మహోన్నతుడైన అల్లాహ్ ను విశ్వసించేవాడు తప్ప మరెవరూ తెలుసుకోలేరు.
ఎవరైనా ఇలా అనవచ్చు: నిశ్చయంగా మనం కొందరిని అత్యున్నత సంతోషంలో చూస్తాము, మరియు వారు అల్లాహ్ పై విశ్వాసము లేని వారు. అయితే మేము ఇలా అంటాము: అవును, వాస్తవాన్ని (హఖ్) తెలుసుకోని పరధ్యానంలో ఉన్నవాడు ఉంటాడు, మరియు అతడు అల్లాహ్ ఎవరి గురించి అయితే తెలియజేశాడో వారిలోని వాడే. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వారిని తింటూ (త్రాగుతూ) సుఖసంతోషాలను అనుభవిస్తూ (వృథా) ఆశలలో ఉండటానికి విడిచిపెట్టు. తరువాత వారు (సత్యాన్ని) తెలుసుకుంటారు.﴿ [సూరతుల్ హిజ్ర్: 3] అల్లాహ్ వాక్కు: ﴾(ఓ ప్రవక్తా!) దేశాలలో సత్యతిరస్కారుల సంచారం, నిన్ను మోసంలో పడవేయకూడదు! ఇది వారికి కొద్దిపాటి సుఖం మాత్రమే! తరువాత వారి ఆశ్రయం నరకమే. మరియు అది అతి అధ్వాన్నమైన నివాస స్థలము.﴿ [సూరతు ఆలె ఇమ్రాన్: 196-197], నిశ్చయంగా, అజ్ఞానంలో పడి ఉండి ఏమరపాటులో ఉన్న, వ్యర్థమైన వాటిలో మునిగిపోయిన ఈ వ్యక్తి సుఖాలను అనుభవిస్తున్నాడు. ఒకవేళ మృత్యువు సమయంలో మరియు మృత్యువు తరువాత తనకు ఏమి ఎదురుచూస్తుందో అతనికి తెలిసి ఉంటే, అతడు ఏ సుఖాన్నీ అనుభవించేవాడు కాదు. కానీ ఈ స్థితి అతని మృత్యువు సమయంలో తప్ప అతనికి వెల్లడి కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి.﴿ [సూరతుల్ అన్'ఫాల్: 50] సత్యం అతనికి స్పష్టమయ్యినప్పుడు — ప్రతి ముస్లిం తెలిసి నిశ్చయంగా విశ్వసించే ఆ సత్యం — అతను మహోన్నతుడైన అల్లాహ్ తెలియజేసినట్లుగా ఇలా అంటాడు: ﴾చివరికి వారిలో ఒకడికి మరణం సమీపించినప్పుడు వాడిలా వేడుకుంటాడు: "ఓ నా ప్రభూ! నన్ను తిరిగి (భూలోకానికి) పంపు: నేను చేయకుండా వచ్చిన సత్కార్యాలు చేయటానికి." అది కాని పని. నిశ్చయంగా అది అతని నోటిమాట మాత్రమే! ఇక (ఈ మరణించిన) వారు తిరిగి లేపబడే దినం వరకు వారి ముందు ఒక అడ్డుతెర (బర్ జఖ్) ఉంటుంది. ఆ తరువాత బాగా ఊదబడిన దినమున వారి మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. మరియు వారు ఒకరి నొకరు పలుకరించుకోరు కూడా! ఇక ఎవరి (సత్కార్యాల) పళ్ళాలు బరువుగా ఉంటాయో, ఆలాంటి వారే సాఫల్యం పొందేవారు. మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు.﴿ [సూరతుల్ మోమినూన్: 99-103]
అందువలన, జీవిత లక్ష్యాన్ని తెలుసుకోని వాడు, అతను ఎంత కృషి చేసినా మరియు ఎంత ప్రయత్నించినా నిజమైన సంతోషాన్ని పొందలేడని మేము నిర్ధారిస్తున్నాము మరియు ఖచ్చితంగా నమ్ముతున్నాము. కాబట్టి మేము అల్లాహ్’ను వేడుకుంటున్నాము! ఆయన మమ్మల్ని దురదృష్టవంతులను చేయకుండుగాక మరియు తన వద్ద నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించుగాక!
***
(ఇస్లాం మూలస్తంభాల విభాగం)
ప్రశ్న:
ఇస్లాంలో ఇబాదత్ (ఆరాధన) భావన అంటే ఏమిటి?
సమాధానం:
ఆరాధన అనగా ప్రేమ మరియు భక్తిగౌరవాలతో అల్లాహ్ తాలా పట్ల సమర్పణ మరియు విధేయత కలిగి ఉండటం. అల్లాహ్ తాలా ఇష్టపడే మరియు సంతోషించే బాహ్యపరమైన, అంతర్గతపరమైన పలుకులు మరియు చేతలన్నీ ఆరాధన భావనలో ఇమిడి ఉంటాయి. వీటిలో నమాజు మరియు హజ్ వంటి పరిపూర్ణమైన ఆరాధనలు ఉన్నాయి, మరియు అల్లాహ్ వద్ద ప్రతిఫలాన్ని ఆశించినట్లయితే మనిషికి ప్రతిఫలం లభించే చేతలు కూడా ఉన్నాయి; ఆరాధన కోసం బలాన్ని పొందే ఉద్దేశ్యంతో నిద్రపోవడం మరియు ఇదే ఉద్దేశ్యంతో తినడం లాంటివి. ఇవి ఎప్పుడైతే ఈ ఉద్దేశ్యంతో ముడిపడి ఉంటాయో, అప్పుడు అవి అల్లాహ్ సుబహానహు వతఆలాకు ఇష్టమైనవిగా మారుతాయి. మరియు ఒక వ్యక్తి ప్రతిఫలాన్ని ఆశిస్తూ హలాల్‌ను (ధర్మసమ్మతమైన దానిని) ఉద్దేశించి, హరామ్‌ను (నిషిద్ధమైన దానిని) విడిచిపెడితే, దానికి కూడా అతనికి ప్రతిఫలం ఇవ్వబడుతుంది, అబూ దర్ర్ ఉల్లేఖించినట్లుగా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో కొంతమంది సహాబాలు ఇలా అన్నారు: "ఓ దైవప్రవక్త! ధనవంతులు ఎన్నో పుణ్యాలు సంపాదించేస్తున్నారు. మేము నమాజు చేసినట్లుగానే వారు కూడా నమాజు చేస్తారు, మేము ఉపవాసాలు పాటించినట్లుగానే వారు కూడా ఉపవాసాలు పాటిస్తారు, మరియు తమ మిగులుధనం నుండి సదఖా చేస్తారు." దానికి ఆయన ఇలా పలికారు: "అల్లాహ్ మీకు కూడా సదఖా చేయడానికి మార్గాలను కల్పించలేదా? నిస్సందేహంగా ప్రతీ తస్బీహ్ (సుబ్ హానల్లాహ్ పలకటం) ఒక సదఖా, ప్రతీ తక్బీర్ (అల్లాహు అక్బర్ పలకటం) ఒక సదఖా, ప్రతీ తహ్మీద్ (అల్హందులిల్లాహ్ పలకటం) ఒక సదఖా, మరియు ప్రతీ తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్ పలకటం) కూడా ఒక సదఖాయే. మంచిని ఆదేశించడం సదఖా, చెడును నిరోధించడం సదఖా, మరియు మీలో ఎవరైనా తమ కోరికను తీర్చుకోవడంలో కూడా ఒక సదఖా ఉంది." వారు అడిగారు: "ఓ దైవప్రవక్త! మాలో ఎవరైనా తన కోరికను తీర్చుకుంటే దానిపై కూడా అతనికి పుణ్యం లభిస్తుందా?" దానికి ఆయన ఇలా బదులిచ్చారు: "మీరే చెప్పండి, ఒకవేళ అతను ఆ కోరికను హరామ్ మార్గంలో తీర్చుకుంటే అతనిపై పాపం ఉంటుందా లేదా? అలాగే, అతను దానిని హలాల్ మార్గంలో తీర్చుకుంటే అతనికి పుణ్యం లభిస్తుంది." [సహీహ్ ముస్లిం (53)].
మరియు కార్యాలలో ఉద్దేశ్యపూర్వకంగా మానుకోవడం మరియు వదిలివేయడం లాంటివి ఉంటాయి, ఉదాహరణకి ఉపవాసం. ఇక వాక్కులు ఉదాహరణకి జిక్ర్ (స్మరణ) మరియు ఖురాన్ పఠనం. అంతర్ముఖ కార్యాలు అనగా హృదయం యొక్క కార్యాలు ఒక ముస్లిం దృఢంగా విశ్వసించే విశ్వాసాలు మరియు విషయాలు, ఉదాహరణకి పునరుత్థానం, అగోచరమైన దానిపై ఈమాన్ మరియు తౌహీద్. మరియు హృదయం యొక్క కార్యాలు ఉదాహరణకి నమ్మకం ఉంచడం, భయం మరియు ఆశ. సర్వశక్తిమంతుడైన అల్లాహ్‌కు కాకుండా మరెవరికీ ఆరాధనను సమర్పించడం అనుమతించబడదు, మరియు మూడు షరతులతో తప్ప ఏ ఆరాధనా స్వీకరించబడదు: మొదటిది ఇస్లాం, రెండవది నిజాయితీ, మరియు మూడవది సున్నత్‌ను అనుసరించడం.
***
ప్రశ్న:
ఇస్లాం ఐదు మూలస్తంభాలు ఏవి?
సమాధానం:
ఇస్లాం ఐదు మూలస్తంభాలపై నిర్మితమై ఉంది, వాటిని వివరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు: "ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఆధారపడి ఉంది: అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడనీ, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవప్రవక్త అని సాక్ష్యం పలకటం, నమాజ్ స్థాపించటం, జకాత్ చెల్లించటం, దైవగృహ యాత్ర చేయటం, రమజాన్ నెలలో ఉపవాసాలు పాటించటం." [ముత్తఫఖున్ అలైహి].
మొదటి మూలస్తంభము : అల్లాహ్ తప్ప వేరొక నిజ ఆరాధ్యదైవం లేడని మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడని సాక్ష్యమివ్వటం. అంటే: మహోన్నతుడైన అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యదైవం ఎవరూ లేరని విశ్వసించడం, అలాగే దీని అర్థాన్ని మరియు దీని అవసరాలైన తాగుత్ను నిరాకరించటాన్ని తెలుసుకోవడం, మహోన్నతుడైన అల్లాహ్ ధర్మానికి కట్టుబడి ఉండటం, మరియు ప్రేమ, గౌరవాలతో పాటు ఆయనకే ఆరాధనను ప్రత్యేకించటం, మరియు అల్లాహ్ ఒక్కడే ప్రభువు, యజమాని, కార్యనిర్వాహకుడు, సృష్టికర్త మరియు ఉపాధిదాత అని మనిషి విశ్వసించడం, మరియు ఆయన తన కొరకు స్వయంగా ధృవీకరించిన లేదా ఆయన సందేశహరుడు ఆయన కొరకు ధృవీకరించిన అత్యుత్తమ పేర్లు మరియు ఉన్నతమైన గుణగణాలన్నింటినీ ఆయన కొరకు ధృవీకరించటం, మరియు ఇతరులు కాకుండా అల్లాహ్ ఒక్కడే ఆరాధనకు అర్హుడని విశ్వసించడం, ఎందుకంటే ఆయన ఒక్కడే సృష్టికర్త, ఆయనకు ఎవరు సాటి లేరు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయనే ఆకాశాలను మరియు భూమిని ఏ నమూనా లేకుండా ఆరంభించిన వాడు. నిశ్చయంగా, ఆయనకు జీవన సహవాసియే (భార్యయే) లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? మరియు ప్రతి దానిని ఆయనే సృష్టించాడు. మరియు ఆయనే ప్రతి విషయం గురించి బాగా తెలిసినవాడు. ఆయనే అల్లాహ్ ! మీ ప్రభువు, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయనే సర్వానికి సృష్టికర్త, కావున మీరు ఆయననే ఆరాధించండి. మరియు ఆయనే ప్రతి దాని కార్యకర్త.﴿ [అల్ అన్ ఆమ్: 101-102].
ముహమ్మద్ బిన్ అబ్దుల్లాహ్ బిన్ అబ్దుల్ ముత్తలిబ్ అల్-హాష్మీ అల్-ఖురైషీ గారు ప్రవక్తల పరంపరలో చివరివారని మరియు సందేశహరులలో అత్యంత శ్రేష్ఠుడని సాక్ష్యం పలకటం. దీనితో పాటు, దైవ నియమావళిలో తెలుపబడిన విధంగా ఎటువంటి నిర్లక్ష్యానికి గానీ, అతిశయోక్తికి గానీ తావు లేకుండా ఆయన ధర్మానికి కట్టుబడి ఉండాలి మరియు ఆయనను గౌరవించాలి. ఆయన విధానాన్ని (సున్నత్‌ను) ఆచరించకపోవడం నిర్లక్ష్యం అవుతుంది మరియు అల్లాహ్‌ను వదిలి ఆయనను ఆరాధించడం అతిశయోక్తి అవుతుంది. ఉదాహరణకు: ఆయన పేరు మీద ప్రమాణం చేయడం, ఆయనను ప్రార్థించడం లేదా అల్లాహ్‌కు తప్ప ఇతరులకు చేయకూడని మరే ఇతర కార్యాలైనా ఆయనకు చేయడం.
అల్లాహ్ తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను పంపాడని, ఆయనపై ఖుర్ఆన్ ను అవతరింపజేశాడని మరియు ఈ ధర్మాన్ని ప్రజలందరికీ అందజేయాలని ఆయనను ఆదేశించాడని మానవుడు ఏ విధంగానైతే విశ్వసిస్తాడో, అదే విధంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తను ప్రేమించడం మరియు వారికి విధేయత చూపడం ప్రతి ఒక్కరిపై విధి అని, మరియు అల్లాహ్ ప్రేమ ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని కూడా విశ్వసిస్తాడు. మహోన్నతుడైన ఆయన ఇలా పలికాడు: ﴾(ఓ ప్రవక్తా!) ఇలా అను: "మీకు (నిజంగా) అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు. మరియు అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణాప్రధాత.﴿ [ఆలి ఇమ్రాన్: 31]
మరియు ఆయన ఆదేశించిన వాటిలో ఆయనకు విధేయత చూపడం, ఆయన తెలియపరచిన వాటిలో ఆయనను సత్యవంతుడు అని నమ్మడం, ఆయన నిషేధించిన మరియు మందలించిన వాటి నుండి దూరంగా ఉండడం, మరియు ఆయన ధర్మశాసనం చేసిన వాటి ద్వారా మాత్రమే అల్లాహ్ ను ఆరాధించడం అనివార్యము, అంతేగానీ ప్రజలు కల్పించిన నూతన ఆవిష్కరణల (బిద్అతుల) ద్వారా కాదు.
ప్రవక్తను పంపించటంలో ఉన్న విజ్ఞత ఏమిటంటే, ప్రజల ధార్మిక మరియు ప్రాపంచిక జీవితాలలో వారికి మేలు మరియు శ్రేయస్సు చేకూర్చే విషయాల వైపుకు మరియు వారి ప్రభువును ప్రసన్నుడిని చేసే విషయాల వైపుకు వారికి మార్గదర్శకం చేయటం మరియు సన్మార్గం చూపటం.
రెండవ మూలస్థంభము : నమాజును నెలకొల్పడం, మరియు సలాహ్ (నమాజు) అంటే నిర్దిష్ట పదాలు మరియు చర్యల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం. ఇది తక్బీర్ (అంటే అరబీ భాషలో అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు)) అనే పదాలతో మొదలై, తస్లీమ్ (సలాహ్ (నమాజు)ను ముగించే సలాం పదాలతో ముగుస్తుంది.
అవి రాత్రింబవళ్ళలో ఐదు వేళల నమాజులు, అవి: ఫజర్, జొహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు.
మరియు సలాహ్ (నమాజు) ప్రతి ముస్లింపై విధిగావించబడింది.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు : ﴾నిశ్చయంగా, నమాజ్ విశ్వాసులకు నియమిత సమయాలలో పాటించడానికి విధిగా నియమించబడింది.﴿ [సూరతున్నిసా: 103].
నమాజు యొక్క ప్రయోజనాల్లో ఒకటి ఏమిటంటే, ఇది దాసుడు మరియు అతని ప్రభువు మధ్య ఒక అనుసంధానం, ఉపశమనం మరియు ప్రశాంతత, మరియు అది అసభ్యతలను, చెడు పనుల నుంచి ఆపుతుంది, మొదలైనవి.
మూడవ మూలస్తంభము: జకాత్ చెల్లించడం, ఇది నిర్దిష్ట సమయంలో, నిర్దిష్ట వర్గానికి, నిర్దిష్ట సంపదలో విధిగా చెల్లించవలసిన హక్కు. ఇది ఇస్లాం యొక్క మూలస్తంభాలలో ఒకటి, మరియు ధనవంతుల నుండి తీసుకొని పేదలకు ఇవ్వబడే తప్పనిసరి దానం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(కావున ఓ ప్రవక్తా!) నీవు వారి సంపదల నుండి దానం (సదఖహ్) తీసుకొని, దానితో వారి పాపవిమోచనం చెయ్యి మరియు వారిని సంస్కరించు...﴿ [తౌబా :103]
జకాతు యొక్క ప్రయోజనాలలో ఒకటి ఏమిటంటే, అది సంపదను పరిశుద్ధపరుస్తుంది మరియు వృద్ధి చేస్తుంది, లోభత్వం మరియు పిసినారితనం నుండి హృదయాలను పరిశుద్ధపరుస్తుంది, మరియు ధనవంతులకు మరియు పేదలకు మధ్య ప్రేమ బంధాలను బలోపేతం చేస్తుంది, తద్వారా ద్వేషం తొలగిపోతుంది, భద్రత నెలకొంటుంది మరియు సమాజం ఆనందపడుతుంది.
నాల్గవ మూలస్థంభము: రమదాన్ మాసపు ఉపవాసములు పాటించుట. ఉపవాసము అంటే హిజ్రీ సంవత్సరంలోని తొమ్మిదవ మాసపు పగటిపూట తినుట, త్రాగుట మరియు సంభోగము వంటి ఉపవాసాన్ని భంగపరిచే విషయాల నుండి దూరంగా ఉండుట.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾రమదాన్ నెల! అందులో దివ్య ఖుర్ఆన్ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింపజేయబడింది! మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యాసత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి...﴿ [అల్ బఖర:185]
ఉపవాసం యొక్క విజ్ఞతలలో ఒకటి ఏమిటంటే, ఉపవాసం మహోన్నతుడైన అల్లాహ్ పట్ల భయభక్తులను సాధించే ఒక సాధనం.
ఉపవాసం ఉండే వ్యక్తికి మహోన్నతుడైన అల్లాహ్ తనపై చేసిన అనుగ్రహాన్ని గుర్తు చేయడం.
మరియు ఉపవాసకుడికి తన సోదరులైన పేదలు మరియు నిరుపేదల గురించి గుర్తుచేయడం.
ఉపవాసం ముస్లింల మనోభావాలను ఏకం చేస్తుంది.
ఉపవాసం శరీరానికి ఆరోగ్యాన్ని మరియు శక్తిని చేకూరుస్తుంది.
ఇవే కాకుండా, మరెన్నో ఉన్నాయి.
ఐదవ మూలస్థంభము: “హజ్జ్”. స్థోమత గలవారు జీవితంలో ఒక్కసారైనా మక్కా నగరంలోని పవిత్ర ప్రదేశాలను దర్శించి, అక్కడ నిర్ణీత విధి,విధానాలను ఆచరించడాన్ని “హజ్జ్” అంటారు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర (హిజ్జుల్ బైత్) అల్లాహ్ (ప్రసన్నత) కొరకు చేయటం, విధిగా చేయబడింది. ఎవరు దీనిని తిరస్కరిస్తారో! వారు నిశ్చయంగా, అల్లాహ్ సమస్త లోకాల వారి అవసరం లేని స్వయం సమృద్ధుడు (అని తెలుసుకోవాలి).﴿ [ఆలె ఇమ్రాన్: 97]
హజ్ యొక్క జ్ఞాన పరమైన ప్రయోజనాలలో: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క తౌహీద్ (ఏకత్వం) ను నెలకొల్పడం, అల్లాహ్ (సుభానహు) పట్ల తఖ్వా (దైవభీతి) ని సాధించడం, అల్లాహ్ (అజ్జ వ జల్) స్మరణ (జిక్ర్) ను స్థాపించడం, మానవ ఆత్మను సంస్కరించడం, మరియు ఉమ్మత్‌కు (సమాజానికి) సరైన ఐక్యత యొక్క భావాలను నేర్పించడం ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో మరెన్నో జ్ఞాన పరమైన ప్రయోజనాలు, ఫలాలు మరియు లాభాలు ఉన్నాయి.
ఇది సంక్షిప్త వివరణ, మరియు ప్రతీ మూలస్థంభానికి షరతులు, మూలాలు మరియు అనేక వివరాలు ఉన్నాయి.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
వుజూ విధానం ఏమిటి?
సమాధానం:
సంపూర్ణ వుజూ విధానం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1 - మనిషి పవిత్రత కొరకు మరియు అశుద్ది (హదస్) ను తొలగించుటకు సంకల్పం చేయాలి. సంకల్పాన్ని బయటకు ఉచ్ఛరించకూడదు, ఎందుకంటే దాని స్థానం మనస్సు. మిగతా అన్ని ఆరాధనల విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది.
2- బిస్మిల్లాహ్ అని పలకాలి.
3- ఆపై తన రెండు అరచేతులను మూడు సార్లు కడగాలి.
4- ఆపై మూడు సార్లు నోరు పుక్కిలించాలి. (పుక్కిలించడం అనగా నోటిలో నీటిని అటూ ఇటూ తిప్పడం)
మూడు సార్లు ముక్కులో నీటిని పీల్చి, ఎడమ చేతితో ముక్కు నుండి నీటిని బయటకు వదలాలి. “ఇస్తిన్షాఖ్” అంటే ముక్కు లోపలికి నీటిని చేర్చడం. “ఇస్తిన్సార్” అంటే ముక్కు నుండి ఆ నీటిని బయటకు తీయడం.
5- ముఖాన్ని మూడు సార్లు కడగాలి. ముఖం యొక్క పరిమితి: సాధారణంగా తల వెంట్రుకలు మొదలయ్యే చోట నుండి దవడలు మరియు గడ్డం వరకు పొడవుగా, మరియు కుడి చెవి అంచు నుండి ఎడమ చెవి అంచు వరకు వెడల్పుగా ఉంటుంది. పురుషుడు తన గడ్డం వెంట్రుకలను కడగాలి, ఎందుకంటే అది ముఖంలో భాగం. ఒకవేళ అది లేత గడ్డం అయితే, దాని వెలుపలి మరియు లోపలి భాగాలను కడగటం తప్పనిసరి, మరియు ఒకవేళ అది దట్టమైనది అనగా చర్మాన్ని కప్పి ఉంచేది అయితే, దాని వెలుపలి భాగాన్ని మాత్రమే కడిగి ఖిలాల్ చేయాలి.
6- ఆ తరువాత తన రెండు చేతులను మోచేతుల వరకు మూడు సార్లు కడగాలి, మరియు చేతి హద్దు గోళ్లతో సహా వేళ్ళ చివరి నుండి పైచేతి ప్రారంభం వరకు ఉంటుంది, మరియు కడగడానికి ముందు చర్మం వరకు నీరు చేరడాన్ని అడ్డుకునే పిండి లేదా మట్టి, రంగు మరియు అలాంటి చేతికి అంటుకున్న వాటిని తప్పనిసరిగా తొలగించాలి.
7- ఆ తరువాత తన తలను మరియు రెండు చెవులను కొత్త నీటితో ఒకసారి మసహ్ చేయాలి,
తలను మసాహ్ చేసే విధానం ఎలాగంటే, నీటితో తడిపిన రెండు చేతులను తల ముందు భాగము పై పెట్టి వెనుక భాగము వద్దకు పోనిచ్చి ఆ తరువాత వాటిని మొదలు పెట్టిన స్థలం వద్దకు తీసుకు రావాలి, తరువాత చూపుడు వేళ్ళను రెండు చెవుల లోపలి భాగములో పోనిచ్చి, మరియు బొటన వేళ్ళతో వాటి బాహ్య భాగమును మసాహ్ చేయాలి.
ఇక మహిళ జుట్టు విషయానికొస్తే, ఆమె జుట్టు కిందకు వేలాడుతున్నా లేదా ముడి కట్టుకుని ఉన్నా, తల ముందు భాగం నుండి మెడపై జుట్టు మొదలయ్యే చోటు వరకు ఆమె దానిపై మసహ్ చేయాలి. మరియు ఆమె వీపుపై పొడవుగా ఉన్న జుట్టుకు మసహ్ చేయడం తప్పనిసరి కాదు.
8- ఆ తరువాత రెండు పాదాలను చీలమండలాల వరకు మూడు సార్లు కడగాలి. చీలమండలాలు అనగా కాలి కింది భాగంలో (పిక్క కింద) వెనకకు పొడుచుకు వచ్చిన రెండు ఎముకలు.
- నీటిని పొందలేని వ్యక్తి తయమ్ముమ్ చేసుకోవాలి, మరియు తయమ్ముమ్ అంటే నీరు అందుబాటులో లేనప్పుడు లేదా దానిని ఉపయోగించలేనప్పుడు శుభ్రమైన ఇసుక, దుమ్ము, ధూళి లేదా మట్టి వంటి వాటిని ఉపయోగించి పరిశుభ్రం కావడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు.﴿ [నిసా: 43]
తయమ్ముమ్ విధానం: రెండు అరచేతులను ఒక్కసారి మట్టిపై కొట్టి, ముఖాన్ని మరియు చేతుల వెనుక భాగాలను ఒక్కసారి మాత్రమే మసహ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రవక్త ﷺ అమ్మార్ బిన్ యాసిర్ (రజియల్లాహు అన్హు) తో ఇలా అన్నారు: "నీవు ఇలా చేస్తే సరిపోతుంది." అలా చెప్పి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులతో నేలపై కొట్టారు మరియు వాటిపై ఊదారు, ఆ తరువాత వాటితో తన ముఖం మరియు తన చేతులపై మసహ్ చేశారు. దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
పైన పేర్కొన్న విషయానికి ఆధారం, ఉస్మాన్ రజియల్లాహు అన్హు వారి సేవకుడు హుమ్రాన్ రివాయత్ చేసిన హదీసు. ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు «వుజూ చేయుట కొరకు నీళ్ళు తెప్పించి వుజూ చేశారు. తన రెండు చేతులను మూడు సార్లు కడిగారు. తరువాత పుక్కిలించారు మరియు ముక్కును శుభ్రపర్చుకున్నారు. తరువాత తన ముఖాన్ని మూడు సార్లు కడిగారు. తరువాత తన కుడి చేతిని మోచేతి వరకు మూడు సార్లు కడిగారు. తరువాత తన ఎడమ చేతిని అదే విధంగా కడిగారు. తరువాత తన తలను మసాహ్ చేశారు. తరువాత తన కుడి పాదాన్ని చీలమండలాల వరకు మూడు సార్లు కడిగారు. తరువాత ఎడమ పాదాన్ని అదే విధంగా కడిగారు. ఆ తరువాత ఆయన ఇలా అన్నారు: "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను చేసిన ఈ వుజూ మాదిరిగానే వుజూ చేయగా నేను చూశాను. ఆ తరువాత దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: ‘ఎవరైతే నేను చేసిన ఈ వుజూ మాదిరిగా వుజూ చేసి, తరువాత నిలబడి, రెండు రకాతుల నమాజును వాటి మధ్య ఎలాంటి ప్రాపంచిక ఆలోచనలూ రానీయకుండా ఆచరిస్తాడో, అతడి పూర్వపు పాపాలు క్షమించి వేయబడతాయి.’"» దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
నమాజు విధానం ఏమిటి?
సమాధానం:
నమాజు చేసే పద్ధతి ఈ క్రింది విధంగా ఉంది:
1 - ఖిబ్లా దిశకు (మక్కాలోని కాబాగృహం దిక్కుకు) అభిముఖంగా శరీరం మొత్తాన్ని త్రిప్పి, అటూ ఇటూ తిరగకుండా నిలబడాలి.
2 - బయటకు ఉచ్ఛరించకుండా, మనస్సులోనే ఏ నమాజు చేస్తున్నారో, దాని కొరకు సంకల్పం చేసుకోవాలి.
3 - తరువాత తక్బీరతుల్ ఇహ్రామ్ పలుకుతూ, "అల్లాహు అక్బర్" (అల్లాహ్ గొప్పవాడు) అని పలకాలి, మరియు ఆ తక్బీర్ సమయంలో తన రెండు చేతులను భుజాల ఎత్తులో పైకెత్తాలి.
4 - ఛాతీపై ఎడమచేయి ఉంచి, దానిపై కుడి చేతిని ఉంచవలెను.
లేదా ఇలా పలకాలి: సుబ్'హానకల్లాహుమ్మ వ బిహమ్'దిక, వ తబారకస్ముక, వ తఆలా జద్దుక, వ లా ఇలాహ గైరుక. (ఓ అల్లాహ్! నీవు పరమ పవిత్రుడవు మరియు సకల స్తుతులు, కృతజ్ఞతలు నీకే శోభిస్తాయి. నీ నామము అన్నింటి కంటే శ్రేష్ఠమైనది, నీ మహిమ అత్యున్నతమైనది. నీవు తప్ప, మరో నిజ ఆరాధ్యుడు లేడు.)
6 - అల్లాహ్ వద్ద ఈ పదాలు పలుకుతూ శరణు వేడుకోవాలి. అఊదు బిల్లాహి మినష్షయితా నిర్రజీమ్ (శాపగ్రస్తుడైన షైతాన్ నుండి అల్లాహ్ శరణు కోరుతున్నాను)
7 - ఆ తరువాత ఇలా బస్మలతో ప్రారంభించి, సూరతుల్ ఫాతిహా పఠించవలెను. ﴾అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రధాత. తీర్పుదినానికి స్వామి. మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము. మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి. నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు.﴿ [సూరతుల్ ఫాతిహ: 1-7]
ఆ తరువాత ఆమీన్ (అంటే ఓ అల్లాహ్! నా ప్రార్థన స్వీకరించుము) అని పలక వలెను.
8 - తరువాత ఖుర్ఆన్ లో నుండి మీకు వీలయిన భాగాన్ని పఠించ వలెను. ఉదయపు ఫజ్ర్ నమాజులో దీర్ఘంగా ఎక్కువ సేపు ఖుర్ఆన్ పారాయణం చేయవలెను.
9 - ఆ తరువాత (అల్లాహు అక్బర్) తక్బీర్ పలుకుతూ, రెండు చేతులూ భుజాల వరకు ఖిబ్లా దిశలో పైకెత్తి, దించుతూ రుకూలోకి వెళ్ళవలెను. రుకూలో చేతి వ్రేళ్ళను వ్యాపింపజేసి, రెండు అరచేతులతో మోకాలి చిప్పలను గట్టిగా పట్టుకుని, వీపును తిన్నగా అంటే నేలకు సమాంతరంగా ఉంచి, తల మరియు నడుము ఒకే ఎత్తులో ఉండేటట్లు చూడటం సున్నతు.
10- తన రకూలో ఇలా పలకాలి: సుబహానల్లాహి రబ్బియల్ అజీమ్. మహోన్నతుడైన నా ప్రభువు పరిశుద్ధుడు మూడు సార్లు, ఒకవేళ ఇంకా చేర్చితే: "సుబ్'హానక అల్లాహుమ్మ వ బిహమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్! నీవు పరమ పరిశుద్ధుడవు మరియు నేను నిన్ను స్తుతిస్తున్నాను, నన్ను మన్నించు.)" మంచిది.
11 - ఆ తరువాత ఇలా పలుకుతూ రుకూ నుండి తల పైకెత్తాలి: సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్తుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు) అప్పుడు తన రెండు చేతులను తన భుజాల స్థాయి వరకు పైకి లేపాలి. మరియు మఅమూమ్ (ఇమామ్ వెనుక నమాజు చేసే వ్యక్తి) ఇలా పఠించకూడదు: సమిఅల్లాహు లిమన్ హమిదహ్ (స్తుతించిన వాడిని అల్లాహ్ విన్నాడు) దానికి బదులుగా ఇలా పలకాలి: రబ్బనా వలకల్ హమ్దు (మా ప్రభువా, స్థుతులన్ని నీ కొరకే)
12 - ఆపై లేచిన తర్వాత ఇలా పఠించాలి: "రబ్బనా వ లకల్ హమ్దు, మిల్అస్సమావాతి వల్ అర్ది, వ మిల్అ మా షి’త మిన్ షైఇన్ బఅ్దు." అర్థం: "భూమ్యాకాశాలు నిండిపోవునంత, ఆ తర్వాత నీవు కోరిన ప్రతీది నిండిపోవునంత ప్రశంసలు నీ కొరకే ఓ మా ప్రభువా!."
13- తరువాత మొదటి సజ్దా చేయాలి మరియు తన సజ్దాలో ఇలా పలకాలి: "అల్లాహు అక్బర్", శరీరంలోని ఏడు భాగాలను నేలకు ఆన్చి సజ్దా చేయవలెను: నుదురు, ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు మరియు రెండు కాళ్ళవేళ్లు; చేతులను పక్కల నుండి దూరంగా ఉంచి, నేలపై మోచేతులు ఆన్చకుండా, కాలివేళ్లను ఖిబ్లా దిశలో ఉంచ వలెను.
14 - తన సజ్దాలో ఇలా పలకాలి: సుబహాన రబ్బియల్ అఅ్'ల మూడు సార్లు, ఒకవేళ ఎక్కువ పఠిస్తే: "సుబ్'హానక అల్లాహుమ్మ రబ్బనా వ బిహమ్'దిక, అల్లాహుమ్మగ్'ఫిర్'లీ (ఓ అల్లాహ్! నీవు పరమ పరిశుద్ధుడవు. ఓ మా ప్రభూ! నేను నిన్నే స్తుతిస్తున్నాను, నన్ను మన్నించు.)" మంచిది.
15 - ఆ తరువాత ఇలా పలుకుతూ సజ్దా నుండి తల పైకెత్తాలి: అల్లాహు అక్బర్ (అల్లాహ్ అందరికంటే గొప్పవాడు).
16 - ఆ తరువాత రెండు సజ్దాల మధ్య ఎడమ పాదం మీద కూర్చొని; కుడి పాదం నిటారుగా ఉంచి;తన రెండు చేతులను తన తొడలు,తన మోకాళ్ళపై పెట్టవలెను.
17 - రెండు సజ్దాల మధ్య జులూస్ లో కూర్చున్నప్పుడు ఇలా దుఆ చేయవలెను: రబ్బిగ్ఫిర్లీ, వర్హమ్నీ, వహ్దినీ, వర్జుఖ్నీ, వజ్బుర్నీ, వఆఫినీ (ఓ నా ప్రభూ! నన్ను క్షమించు, నన్ను కరుణించు, నాకు మార్గదర్శకత్వం చేయి, నాకు జీవనోపాధిని ప్రసాదించు, నా లోపాలను సరిచేయి, మరియు నాకు క్షేమాన్ని ప్రసాదించు.)
18 - ఆ తరువాత అల్లాహు అక్బర్ అని పలుకుతూ మొదటిసారి చేసినట్లుగానే చేస్తూ, మొదటి సజ్దాలో ప్రార్థించినట్లుగానే ప్రార్థిస్తూ, రెండవ సారి సజ్దా చేయవలెను.
19 - ఆ తరువాత ఇలా పలుకుతూ, రెండవ సజ్దా నుండి లేవ వలెను: "అల్లాహు అక్బర్" అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు. మొదటి రకాత్‌లో చేసిన విధంగానే రెండవ రకాత్ను కూడా చేయాలి, అంటే చెప్పే దుఆలు మరియు చేసే క్రియలు అన్నీ మొదటి రకాత్‌లో ఉన్నట్లే ఉంటాయి. అయితే, రెండవ రకాత్‌లో ఇస్తిఫ్తా దుఆ (ప్రారంభ దుఆ) చదవకూడదు.
20 - రెండవ రకాత్ ముగిసిన తర్వాత ఇలా పలుకుతూ కూర్చోవాలి: "అల్లాహు అక్బర్", రెండు సజ్దాల మధ్య కూర్చున్నట్లుగానే కూర్చో వలెను.
21 - అలా కూర్చొని, ఇలా తషహ్హుద్ పఠించ వలెను. అత్తహియ్యాతు లిల్లాహి వస్సలవాతు వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు, వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అల్లాహుమ్మ బారిక్ అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ కమా బారక్త అలా ఇబ్రాహీమ వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుమ్మజీద్. అఊజు బిల్లాహి మిన్ అజాబి జహన్నమ, వమిన్ అజాబిల్ ఖబ్రి, వమిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వమిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాల్. (“సకల శరీర సంబంధమైన, ధన సంబంధమైన మరియు నోటి సంబంధమైన ఆరాధనలు అల్లాహ్ కు మాత్రమే. ఓ ప్రవక్తా! అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యాలు మరియు శుభాలు నీపై కురియుగాక! అలాగే మా పైనా మరియు సద్వర్తనులైన అల్లాహ్ దాసుల పైనా కురియుగాక. అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు ఎవరూ లేరని నేను సాక్ష్యమిస్తున్నాను. మరియు ముహమ్మద్ ఆయన దాసుడు మరియు దైవదూత అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఓ అల్లాహ్! ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై నీవు కరుణలు కురిపించినట్లే, ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబంపై కరుణలు కురిపించు. నిశ్చయంగా నీవు సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహిమాన్వితుడు. మరియు ఇబ్రాహీం మరియు ఇబ్రాహీం కుటుంబంపై నీవు అనుగ్రహాలు కురిపించినట్లే, ముహమ్మద్ మరియు ముహమ్మద్ కుటుంబంపై అనుగ్రహాలు కురిపించు. నిశ్చయంగా నీవు సర్వ స్తోత్రాలకు అర్హుడు, మహిమాన్వితుడు. నేను నరకం శిక్ష నుండి, సమాధి శిక్ష నుండి, జీవితం మరియు మరణపు పరీక్షల నుండి, మరియు మసీహుద్దజ్జాల్ పరీక్ష నుండి మహోన్నతుడైన అల్లాహ్ శరణు కోరుతున్నాను.”) ఆ తరువాత తన ప్రభువుతో ఇహపరలోకాలలో ప్రయోజనం చేకూర్చేలా తనకు ఇష్టమైన దుఆ చేసుకోవలెను.
22 - ఆ తరువాత ఇలా పలుకుతూ కుడివైపు తల త్రిప్పవలెను: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక.) అలాగే ఎడమ వైపున కూడా తిరగాలి.
23 - ఒకవేళ మూడు లేదా నాలుగు రకాతుల నమాజు చేస్తున్నట్లయితే, మొదటి తషహ్హుద్ చివరిలో ఆపి వేయవలెను, అదేమిటంటే: “అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహూ వ రసూలుహూ.” (వాస్తవానికి అల్లాహ్ తప్ప వేరొక ఆరాధ్యుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను మరియు ముహమ్మద్ అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఆయన దాసుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను.)
24 - ఆ తరువాత ఇలా పలుకుతూ లేచి నిలబడ వలెను: "అల్లాహు అక్బర్", ( “అల్లాహ్ అత్యంత గొప్పవాడు”) అప్పుడు తన రెండు చేతులను తన భుజాల స్థాయి వరకు పైకి లేపాలి.
25 - ఆ తరువాత రెండవ రకాతు చేసినట్లుగానే మూడవ రకాతులో చేయవలెను. అయితే, సూరతుల్ ఫాతిహా పఠనం తరువాత ఖుర్ఆన్ లోని మరోభాగం పఠించనవసరం లేదు.
26 - తర్వాత, అతను తవర్రుక్ భంగిమలో కూర్చోవాలి, అంటే తన కుడి పాదాన్ని నిటారుగా ఉంచి, తన ఎడమ పాదాన్ని కుడి కాలి కింద నుండి బయటకు తీసి, తన పిరుదులను నేలపై స్థిరంగా ఉంచాలి. తన చేతులను, మొదటి తషహ్హుద్‌లో ఉంచిన విధంగానే, తన తొడలపై ఉంచాలి.
27 - అలా ప్రశాంతంగా కూర్చుని, తషహుద్ లో మిగిలిన భాగాన్ని పూర్తి చేయవలెను.
28 - ఆ తరువాత కుడి వైపుకు సలాం తిరుగుతూ, ఇలా పలకాలి: అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహ్ (మీపై అల్లాహ్ యొక్క శాంతి,కారుణ్యములు కురియుగాక.) అలాగే ఎడమ వైపున కూడా తిరగాలి, అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
కాఅబా అంటే ఏమిటి? మరియు ముస్లింలు కాఅబాను ఆరాధిస్తారా?
సమాధానం:
పవిత్రమైన కఅబా గృహము ముస్లింలు తమ నమాజుల్లో ఖిబ్లా (అభిముకమయ్యే ప్రదేశము), అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾...కావున మేము నిన్ను, నీవు కోరిన ఖిబ్లా వైపునకు త్రిప్పుతున్నాము. కావున నీవు మస్జద్ అల్ హరామ్ వైపునకు నీ ముఖాన్ని త్రిప్పుకో! ఇకపై మీరంతా ఎక్కడ ఉన్నా సరే (నమాజు చేసేటప్పుడు), మీ ముఖాలను ఆ వైపునకే త్రిప్పుకోండి...﴿ [అల్ బఖర: 144]
మరియు హజ్జ్ మరియు ఉమ్రహ్ విధులను నిర్వహించే సమయంలో వారు దాని చుట్టూ తవాఫ్ చేస్తారు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆ ప్రాచీన గృహం (కఅబహ్) యొక్క ప్రదక్షిణ చేయాలి.﴿ [అల్ హజ్జ్: 29]
అది మక్కా ముకర్రమాలో ఉన్న అత్యంత గౌరవప్రదమైన నిర్మాణం, దీనిని నిర్మించమని అల్లాహ్ తన ప్రవక్త మరియు స్నేహితుడు అయిన ఇబ్రాహీం అలైహిస్సలాంను ఆదేశించాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు మేము ఇబ్రాహీమ్ కు ఈ గృహం (కఅబహ్) యొక్క స్థలాన్ని నిర్దేశించి (చూపుతూ) అతనితో: "ఎవ్వరినీ నాకు సాటిగా (భాగస్వాములుగా) కల్పించకు, మరియు నా గృహాన్ని, ప్రదక్షిణ (తవాఫ్) చేసేవారి కొరకు నమాజ్ చేసేవారి కొరకు, వంగే (రుకూఉ) మరియు సాష్టాంగం (సజ్దా) చేసేవారి కొరకు, పరిశుద్ధంగా ఉంచు" అని అన్నాము.﴿ [అల్ హజ్జ్: 26 ]
మరియు ఇది అల్లాహ్ తఆలా ఆరాధన నిమిత్తం భూమండలం పై మొట్టమొదట నిర్మితమైన గృహం. పరిశుద్ధుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, మానవజాతి కొరకు మొట్టమొదట నియమించబడిన (ఆరాధనా) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే, శుభాలతో నిండినది సమస్త లోకాల ప్రజలకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదించేది.﴿ [ఆలె ఇమ్రాన్: 96]
ఇక రెండవ ప్రశ్నకు సమాధానం విషయానికొస్తే, ముస్లింలు కాఅబాను మరియు హజ్రే అస్వద్‌ను ఆరాధించరు. వారు వాటికి లోబడరు మరియు తలవంచరు. కేవలం వారు వాటిని ఆదరిస్తారు మరియు గౌరవిస్తారు. మరియు వారు కాఅబా మరియు హజ్రే అస్వద్ నుండి ఎటువంటి ఆదేశాలను కానీ, నిషేధాలను కానీ స్వీకరించరు; ఎందుకంటే అవి నష్టం కలిగించలేవు మరియు లాభం చేకూర్చలేవు, అలాగే మార్గదర్శకత్వం లేదా ఉపదేశం ఉండేలా వాటి నుండి ఏదీ వెలువడదు. కేవలం ముద్దు పెట్టుకోవడం, గౌరవించడం మరియు కాఅబాకు అభిముఖమవ్వడం అనేది వారి ఐక్యత మరియు వారి లక్ష్య ఐక్యతకు ప్రతీకలుగా ఉన్నాయి. అల్లాహ్ వారికి చేసిన ఆదేశాన్ని పాటిస్తూ వారు దానిని సందర్శిస్తారు మరియు దాని చుట్టూ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు. మరియు ఆరాధన మాత్రం ఒక్కడైన అల్లాహ్ కొరకే, కాఅబాకు కాదు. అది నష్టం కలిగించలేని మరియు లాభం చేకూర్చలేని ఒక రాయి మాత్రమేనని ముస్లింలకు తెలుసు. కానీ ముస్లిం అల్లాహ్ ఆదేశాన్ని పాటిస్తాడు; ఎందుకంటే ఇది సర్వలోకాల ప్రభువైన అల్లాహ్ కు దాస్యం చేయటంలోని ఆవశ్యకతలలో ఒకటి.
దీనికి సంబంధించి హజ్రె అస్వద్ ను ముద్దాడినప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు పలికిన మాట ఉంది. ఆయన ఇలా పలికారు: "«నిశ్చయంగా నువ్వు ఒకరాయివి నీకు నష్టపర్చే మరియు లాభపర్చే శక్తిగాని లేదన్న విషయం నాకు బహుబాగా తెలుసు, మహనీయ ప్రవక్త (సల్లల్లాహు అలైహివ సల్లం) నిన్ను చుంబించడం గనుక నేను చూసి ఉండకపోతే నిన్ను నేను చుంబించేవాన్నికాదు.»" [దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు].
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై, ఆయన కుటుంబముపై, ఆయన సహచరులందరిపై శుభాలను, శాంతిని కురిపించుగాక.
***
(మరణాంతరం లేపబడటం విభాగం)
ప్రశ్న:
మరణం గురించి ముస్లిం విశ్వాసం ఏమిటి?
సమాధానం:
సమస్త స్తోత్రములు అల్లాహ్ కే, అల్లాహ్ జీవితాన్ని సృష్టించినట్లుగానే మరణాన్ని కూడా సృష్టించాడు, మహోన్నతుడైన ఆయన ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయనే! మీలో మంచిపనులు చేసే వారెవరో పరీక్షించటానికి, చావు-బ్రతుకులను సృష్టించాడు. మరియు ఆయన సర్వశక్తిమంతుడు, క్షమాశీలుడు.﴿ [ముల్క్: 2] కాబట్టి మరణం మరియు జీవితం, అలాగే రాత్రి మరియు పగలుల మార్పు ఇవన్నీ ఈ విశ్వాన్ని అందులోని సమస్తంతో సహా నిర్వహిస్తున్న మహోన్నత సృష్టికర్త ఉనికిని సూచించే గొప్ప సూచనలు. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾మరియు మీకు జీవితాన్ని ఇచ్చేవాడు మరియు మరణింపజేసేవాడు ఆయనే! మరియు రాత్రింబవళ్ళ మార్పు ఆయన ఆధీనంలోనే ఉంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా?﴿ [అల్ ముమినూన్: 80] కావున అల్లాహ్ యే జీవింపజేసేవాడు, మరియు ఆయనే మరణింపజేసేవాడు, కాబట్టి మనం చెప్పుకున్నట్లుగా మరణం అనేది మహిమాన్వితుడైన ప్రభువు యొక్క ఉనికిని సూచించే నిదర్శనాలలో ఒకటి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయన తన దాసులపై సంపూర్ణ అధికారం (ప్రాబల్యం) గలవాడు. మరియు ఆయన మీపై కనిపెట్టుకొని ఉండే వారిని పంపుతాడు. చివరకు మీలో ఒకరికి చావు సమయం వచ్చినపుడు, మేము పంపిన దూతలు అతనిని మరణింపజేస్తారు మరియు వారెప్పుడూ అశ్రద్ధ చూపరు.﴿ [అల్ అన్ఆమ్: 61]
కాబట్టి మరణం అనేది దైవిక వ్యవహారం. దానిపై మహోన్నతుడైన అల్లాహ్ తప్ప మరెవరికీ అధికారం లేదు. అందువల్ల మీరు చూస్తారు — ఒక మనిషి తన సంపూర్ణ శక్తి, యౌవనోత్సాహంలో, మైదానంలో ఆడుతున్న ఆటగాడిలా తన ప్రేక్షకుల ముందే మరణం అతనిని అకస్మాత్తుగా కబళిస్తుంది. అలాగే ఒక రాజు తన అధికారంలో, తన రక్షక సైన్యాల మధ్య ఉన్నప్పటికీ మరణం అతనిని కబళిస్తుంది; దానిని అతని నుండి తొలగించే వారెవరూ ఉండరు. అందుచేత ఈ విషయం మహోన్నతుడైన ప్రభువు ఉనికికి సూచనలలో ఒకటి.
ఖుర్ఆన్ మరియు సున్నత్ లలో మరణం రెండు రకాలు:
మొదటిది: ఇది ఆధ్యాత్మిక మరణం, అనగా మనిషి ఒక అవిశ్వాసి (కాఫిరు) గా ఉండటం, మరియు అల్లాహ్ దీనిని మరణంగా పేర్కొన్నాడు; ఎందుకంటే మనిషి తన బుద్ధిని, వినికిడిని మరియు చూపును నిర్వీర్యం చేసుకుంటాడు, కాబట్టి అతను మృతునితో సమానం. లేకపోతే, ఒక మనిషి జీవితంలోకి వచ్చి, అల్లాహ్ తన కోసం స్థలాన్ని సిద్ధం చేశాడని, ఆకాశాలను మరియు భూమిని తనకు లోబడేలా చేశాడని, తన పానీయాన్ని మరియు ఆహారాన్ని ఏర్పాటు చేశాడని, వేడి, చలి మరియు వర్షం నుండి తనను రక్షించే వాటిని సృష్టించాడని, ఇంకా ఈ భూమిపై జీవించడానికి తనను సన్నద్ధం చేశాడని కనుగొన్న తర్వాత, ఆ మనిషి తాను సజీవుడనని, తనకు వినికిడి, చూపు మరియు ఆలోచించే హృదయం ఉన్నాయని భావిస్తూ జీవితం గడిపినా, ఈ విశ్వాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నారని గుర్తించకుండా, మరియు తనను ఉనికిలోకి తెచ్చిన ప్రభువును ఆరాధించకుండా ఎలా ఉంటాడు? తన అవయవాలన్నీ ఒక వివేకవంతుడైన సృష్టికర్త ప్రణాళికతో నిర్వహించబడుతున్నాయని అతను చూడటం లేదా? అయినా అతను ఆయనను విశ్వసించడు, తన సృష్టికర్తను గుర్తించని మరియు తన చుట్టూ ఉన్నవాటిని తనకు ప్రయోజనం చేకూర్చే అవగాహనతో గ్రహించలేని ఈ మనిషికి, తన చుట్టూ ఉన్నదేమిటో తెలియకుండా సమాధిలో పాతిపెట్టబడిన మృతునికి మధ్య తేడా ఏమిటి? మహోన్నత ఖురాన్ ప్రకారం, ఈ మనిషి -సజీవులలోని మృతుడు- జంతువు కంటే ఎక్కువ దారి తప్పినవాడు; ఎందుకంటే కనీసం జంతువు తన తోటిదానిపై దాడి చేయదు, దానిని చూసి అసూయపడదు, దానిని చంపదు మరియు దానితో అబద్ధం చెప్పదు. ఒక గాడిద దగ్గర ఉన్నదాన్ని చూసి ఇంకో గాడిద అసూయపడటం, లేదా దానిని మోసం చేయటం, లేదా దానికి అన్యాయం చేయటం మీరు ఎప్పుడైనా చూశారా? జంతువు తన ఇంద్రియాలను తనకు ప్రయోజనం కలిగించే వాటి కోసం వాడుకుంటుంది, మరియు తన అవగాహన ద్వారా తనకు హాని కలిగించే వాటికి దూరంగా ఉంటుంది.
పవిత్ర ఖుర్ఆన్ స్పష్టం చేసిందేమిటంటే, అవిశ్వాసపరుడు తన ఇంద్రియాలను మరియు తన శక్తులను అవి దేనికోసమైతే సృష్టించబడ్డాయో అందులో ఉపయోగించడు, తనకు ప్రయోజనము చేకూర్చే మరియు శాశ్వత దౌర్భాగ్యం నుండి తనను బయటపడేసే దానిలో కూడా ఉపయోగించడు. బదులుగా అతడు తన ఇంద్రియాలను తనకు కీడు మరియు నష్టము కలిగించే వాటిలోనే వినియోగిస్తాడు.
ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది: పవిత్ర ఖుర్ఆన్ సజీవులలోని మృతుడిని ఎప్పుడు సజీవునిగా పరిగణిస్తుంది? అతను తన మేధోశక్తిని, వినికిడిని మరియు దృష్టిని సరైన పద్ధతిలో ఉపయోగించి, ఆ తర్వాత ఈ ఇంద్రియాలు మరియు శక్తులు అతనిని తన సృష్టికర్తపై విశ్వాసం వైపునకు నడిపించినప్పుడే అతను సజీవుడు అవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఏమీ? ఒక మరణించిన వ్యక్తిని (అవిశ్వాసిని), మేము సజీవునిగా (విశ్వాసిగా) చేసి జ్యోతిని ప్రసాదించగా! దానితో ప్రజల మధ్య సంచరిస్తున్నవాడూ మరియు అంధకారంలో (అవిశ్వాసంలో) చిక్కుకొని, వాటి నుండి బయటకు రాజాలనివాడూ ఇద్దరూ సమానులా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు, వారు చేస్తున్న కర్మలు, మరోహరమైనవిగా చేయబడ్డాయి.﴿ [అల్ అన్ఆమ్: 122]
రెండవది: అందరికీ తెలిసిన మృత్యువు, అంటే శరీరం నుండి ఆత్మను వేరుచేయడం. ఇది అన్ని సంస్కృతులకు మరియు సమాజాలకు తెలిసినదే, మరియు దీనిని ముస్లిం మరియు అవిశ్వాసి ఇద్దరూ ఎదుర్కొంటారు. కనుక మరణ సమయం వచ్చినప్పుడు, మరణం ఆసన్నమైన ఈ మానవుని ఆత్మను సేకరించడానికి అల్లాహ్ మరణదూతలను పంపుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు.﴿ [అస్ సజదహ్: 11]
కావున అల్లాహ్ ఆజ్ఞ కానంతవరకూ ఎవరూ ఎవరినీ మరణింపజేయలేరు, మరి అల్లాహ్ తప్ప మరెవరు మరణింపజేస్తారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆయనే జీవన్మరణాలను ఇచ్చేవాడు మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు.﴿ [యూనుస్: 56] ఆయన ఎవరికైనా మరణాన్ని నిర్ధారిస్తే, దానిని అతని నుండి ఎవరూ తప్పించలేరు. మరియు ఆయన ఎవరి ఆయుష్షునైనా పొడిగించాలని ఆజ్ఞాపిస్తే, అతనిని ఎవరూ మరణింపజేయలేరు. కావున మరణం మరియు జీవితం పరిశుద్ధుడైన అల్లాహ్ చేతిలోనే కలవు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు;﴿ [అల్ వాఖిఅ: 60], మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మీరు సత్యవంతులే అయితే, మీకు మరణం రాకుండా మిమ్మల్ని మీరు తప్పించుకోండి!﴿ [ఆలె ఇమ్రాన్: 168]
మరియు మరణానికి ఒక నిర్దిష్ట సమయం ఉంది, అది ముందుకు గాని వెనుకకు గాని జరగదు. మహోన్నతుడై అల్లాహ్ తెలియజేశాడు:- ﴾ఇక, వారి కాలం వచ్చినప్పుడు వారు, ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు.﴿ [అన్ నహ్ల్: 61]
ఇక్కడ మరొక ప్రశ్న ఏమిటంటే: ఖుర్ఆన్ మరియు సున్నత్ ప్రకారం విశ్వాసి మరణం, అవిశ్వాసి మరణం కంటే భిన్నంగా ఉంటుందా? దానికి మేము ఇలా చెబుతున్నాము: అవును, చాలా గొప్ప వ్యత్యాసం ఉంటుంది. కానీ ఈ విషయం మరణ ఘడియ సమీపించిన వారికి తప్ప మరెవరికీ అనుభవంలోకి రాదు. ఇది ప్రతి మనిషికీ ఎదురయ్యే ఒక అగోచర సత్యం కాబట్టి, దీని గురించి అతనికి తెలిసినా లేదా తెలియకపోయినా, అతడు విశ్వాసపరుడైనా గాని అవిశ్వాసపరుడైనా గాని; పవిత్ర ఖురాన్ దీని గురించి తెలియజేసింది మరియు స్పష్టపరిచింది; మనిషి తన మరణ సమయంలో ఆశ్చర్యానికి గురి కాకుండా ఉండేందుకు, మరియు ప్రళయదినమున తన ప్రభువుతో: "నీవు నాకు ఎందుకు తెలియజేయలేదు!" అని అనకుండా ఉండేందుకు.
ఇక విశ్వాసి మరణం విషయానికొస్తే, పవిత్ర ఖుర్ఆన్ లోని ఈ పవిత్ర ఆయతులు దానిని వివరిస్తాయి. నిశ్చయంగా అతని మరణ సమయం ఆసన్నమైనప్పుడు, కారుణ్య దైవదూతలు అతని వద్దకు దిగివచ్చి, అతనిపై అల్లాహ్ యొక్క మన్నత గురించి అతనికి శుభవార్తను అందజేస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(సన్మార్గునితో ఇలా అనబడుతుంది): "ఓ తృప్తి పొందిన ఆత్మా! ﴾నీ ప్రభువు సన్నిధికి మరలి రా! (నీకు లభించే సత్ఫలితానికి) ఆనందిస్తూ మరియు (నీ ప్రభువునకు) ప్రియమైనదానివై! నీవు (పుణ్యాత్ములైన) నా దాసులలో చేరిపో! మరియు నీవు నా స్వర్గంలో ప్రవేశించు!﴿ [అల్ ఫజ్ర్: 27-30] మరియు అతను ఎదుర్కొనే దాని విషయంలో అతనిపై ఎటువంటి భయం ఉండదని, మరియు తాను వదలివెళ్లిన సంతానం మరియు తల్లిదండ్రుల విషయంలో బాధ పడకూడదని అతనికి శుభవార్త కూడా ఇవ్వబడుతుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, ఎవరైతే: "అల్లాహ్ యే మా ప్రభువు!" అని పలుకుతూ తరువాత దాని పైననే స్థిరంగా ఉంటారో! వారిపై దేవదూతలు దిగి వచ్చి (ఇలా అంటారు): "మీరు భయ పడకండి మరియు దుఃఖపడకండి, మీకు వాగ్దానం చేయబడిన స్వర్గపు శుభవార్తను వినండి!﴿ [ఫుస్సిలత్: 30]
అవిశ్వాసి మరణం విషయానికొస్తే, అది ఒక ఘోరమైన మరణం, మరియు కఠినమైన పరిస్థితి, అందులో మరణ యాతనలు, ప్రపంచాన్ని వీడిపోతున్నాననే బాధ, కుటుంబం మరియు పిల్లల గురించిన విచారం, తాను ఎదుర్కోబోయే దాని పట్ల భయం, మరియు అతని ప్రాణం తీసేటప్పుడు అతనికి ఎదురయ్యే యాతన పెట్టె దూతలు అన్నీ అతనిపై కమ్ముకుంటాయి. ఈ భయంకరమైన పరిస్థితిని ఈ ఆయతులు స్పష్టం చేస్తున్నాయి, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా చెప్పాడు: ﴾...దుర్మార్గులు మరణ వేదనలో ఉన్నప్పుడు దేవదూతలు తమ చేతులు చాచి: "మీ ప్రాణాలను వదలండి! అల్లాహ్ పై అసత్యాలు పలుకుతూ ఉన్నందు వలన మరియు ఆయన సూచనల పట్ల అనాదరణ చూపటం వలన, ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది!" అని అంటూ ఉండే దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండేది!﴿ [అల్ అన్ఆమ్: 93] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు సత్యతిరస్కారుల ప్రాణాలను దైవదూతలు తీసే దృశ్యాన్ని నీవు చూపడగలిగితే (ఎంత బాగుండేది). వారు (దేవదూతలు) వారి ముఖాలపైనను మరియు వారి పిరుదులపైనను కొడుతూ ఇలా అంటారు: "భగభగమండే ఈ నరకాగ్ని శిక్షను చవి చూడండి. ఇది మీరు స్వయంగా మీ చేతులారా చేసి పంపిన కర్మల ఫలితమే! మరియు నిశ్చయంగా, అల్లాహ్ తన దాసులకు ఏ మాత్రం అన్యాయం చేయడు.﴿ [అల్-అన్'ఫాల్: 50-51] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకొని, వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకు వెళ్ళేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది?﴿ [ముహమ్మద్ : 27] కాబట్టి అది అవిశ్వాసికి అవమానం మరియు నీచత్వ స్థితి. మహోన్నతుడైన అల్లాహ్ సెలవిస్తున్నాడు: ﴾అయితే, ఆ రోజు, ఆయన (అల్లాహ్) శిక్షించినట్లు, మరెవ్వడూ శిక్షించలేడు! మరియు ఆయన (అల్లాహ్) బంధించినట్లు, మరెవ్వడూ బంధించలేడు.﴿ [అల్ ఫజ్ర్: 25-26]
అవిశ్వాసి మరణం మరియు అతని ఆత్మను తీసే విధానాన్ని వర్ణిస్తూ హదీసులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: «నిశ్చయంగా అవిశ్వాసి ఎప్పుడైతే ప్రపంచం నుండి సంబంధం తెంచుకుని, పరలోకం వైపునకు వెళ్లే సమయంలో ఉంటాడో, అతని వద్దకు చెండాలమైన, కఠినమైన దైవదూతలు దిగివస్తారు. ఎలాగైతే తడి ఉన్నిలో నుండి అనేక ముళ్లు గల ఇనుప కడ్డీని లాగుతారో, ఆ విధంగా వారు అతని ప్రాణాన్ని బయటికి లాగేస్తారు, మరియు నరాలతో పాటుగా అతని ఆత్మ బయటికి లాగబడుతుంది. అప్పుడు భూమ్యాకాశాల మధ్య ఉన్న ప్రతి దైవదూత మరియు ఆకాశంలో ఉన్న ప్రతి దైవదూత అతనిని శపిస్తారు.» [ముస్నద్ అహ్మద్ (18614)].
ఆత్మ యొక్క చావు అంటే శరీరం నుండి అది వేరు చేయబడటం, కావున ఆత్మలు శాశ్వతంగా అంతరించిపోవు, బదులుగా అవి బర్‌జఖ్ జీవితానికి చేరతాయి. పునర్జన్మ అనే వాదనలో నమ్మినట్లుగా బర్‌జఖ్ జీవితంలో ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరాన్ని ధరించదు. బర్‌జఖ్ జీవితం ఇహలోక జీవితం కంటే భిన్నమైనది, మరియు అది పరలోక జీవితానికి కూడా భిన్నమైనది. మరణాంతరం ఆత్మకు శరీరంతో సంబంధం ఉంటుంది, బర్‌జఖ్ జీవితంలో శరీరం మరియు ఆత్మ రెండూ కలిసి అనుగ్రహాలను పొందుతాయి, అలాగే అవి రెండూ కలిసి శిక్షను కూడా అనుభవిస్తాయి. అది ఏ రూపంలో ఉంటుందో మనకు తెలియదు, కానీ ఏ విషయమూ దాగి ఉండని మహాజ్ఞాని, సర్వమెరిగినవాడు దీని గురించి మనకు తెలియజేశాడు. ఈ బర్‌జఖ్ జీవితంలో వారి భౌతిక అవశేషాలు వారు మరణించిన ప్రదేశంలో లేదా సమాధిలో ఉన్నప్పటికీ, విశ్వాసి యొక్క ఆత్మ స్వర్గంలో ఉంటుంది మరియు అవిశ్వాసి యొక్క ఆత్మ నరకంలో ఉంటుంది. నేడు ఫిరౌన్ అనుచరులు తమ సమాధులలో ఉండి ఎలాంటి శిక్షను అనుభవిస్తున్నారో అల్లాహ్ మనకు గొప్ప ఖురాన్ లో తెలియజేశాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾ఆ నరకాగ్ని! వారు దాని యెదుటకు ఉదయమూ మరియు సాయంత్రమూ రప్పింపబడుతూ ఉంటారు. మరియు (పునరుత్థాన) దినపు ఘడియ వచ్చినపుడు: "ఫిర్ఔన్ జనులను తీవ్రమైన శిక్షలో పడవేయండి!" అని ఆజ్ఞ ఇవ్వబడుతుంది.﴿ [గాఫిర్: 46]
ఆ తరువాత పునరుత్థాన దినమున అల్లాహ్ ఆజ్ఞతో అవశేషాలు తిరిగి మళ్ళీ శరీరాలుగా రూపాంతరం చెందుతాయి, మరియు ప్రతి ఆత్మ తన శరీరంలోకి తిరిగి వస్తుంది, ఆ తరువాత లెక్కింపు జరుగుతుంది, దాని పర్యవసానంగా విశ్వాసులు స్వర్గంలో శాశ్వతంగా ఉంటారు, లేదా అవిశ్వాసులు నరకాగ్నిలో శాశ్వతంగా ఉంటారు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾(జ్ఞాపకముంచుకోండి) సమావేశపు రోజున ఆయన మీ అందరిని సమావేశపరుస్తాడు. అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్ ను విశ్వసించి, సత్కార్యాలు చేస్తాడో, అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు. మరియు అతనిని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు, వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు. అదే గొప్ప విజయం. మరియు ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచన (ఆయాత్) లను అబద్ధాలని నిరాకరిస్తారో, అలాంటి వారు నరకవాసులవుతారు. అందు వారు శాశ్వతంగా ఉంటారు.﴿ మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం! [అత్తగాబున్: 9-10] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా ఎవరైతే సత్య తిరస్కారులై, అక్రమానికి పాల్పడతారో, వారిని అల్లాహ్ ఏ మాత్రమూ క్షమించడూ మరియు వారికి ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వమూ చేయడు. వారికి కేవలం నరక మార్గం మాత్రమే చూపుతాడు. అందులో వారు శాశ్వతంగా కలకాలం ఉంటారు. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.﴿ [అన్ నిసా: 168-169] అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
మరణాంతర జీవనాన్ని రుజువు చేయటం ఎలా సాధ్యం?
సమాధానం:
మరణాంతరం లేపబడటమును తిరస్కరించేవాడిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది, ఎందుకంటే ఇది వివేకం తప్పనిసరి చేసే విషయం, మరియు దైవ సందేశాలన్నీ దీనిని విశ్వసిస్తాయి, మరియు సాధారణంగా ఏదో ఒక రూపంలో లేదా ఏదో ఒక విధంగా మరణాంతరం లేపబడటమును విశ్వసించని మతమేదీ లేదు, మరియు దీనికి సమాధానం ఈ క్రింది విధంగా ఉంది:
మొదటిది: సృష్టిరాసులను తిరిగి బ్రతికించడం అనేది న్యాయం మరియు వివేకం యొక్క ఆవశ్యకత; ఒకవేళ మరణాంతరం లేపటం ఉండదని మనం భావించినట్లయితే, అప్పుడు ఈ గ్రహంపై మానవుని ఉనికి వృధాగా మారుతుంది, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?﴿ [అల్ ముమినూన్: 115]
ఒక వేళ మరణాంతరజన్మ లేదని మనం భావిస్తే, మరి దుర్మార్గుడి నుండి అన్యాయానికి గురైనవాడికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబడుతుంది? మరియు భూమిలో కల్లోలం సృష్టించేవారు న్యాయం యొక్క చేతులకు చిక్కి శిక్షించబడక ముందే ఒక వేళ వారు సహజ మరణం పొందితే, వారికి ఎలా ప్రతిఫలం లభిస్తుంది? మరియు బలహీనుల కొరకు గొప్ప కార్యాలు చేసి, ఈ ఇహలోక జీవితంలో తమ కార్యాలకు ఎలాంటి ప్రతిఫలం పొందని సంస్కర్తలకు ఏ విధంగా ప్రతిఫలం ఇవ్వబడుతుంది? అందువల్ల సర్వలోకాల ప్రభువు ముందు ప్రజలు నిలబడే రోజు ఒకటి ఖచ్చితంగా ఉండి తీరాలి, తద్వారా ఆయన ప్రతీ ఒక్కరికీ వారి కర్మల పరంగా ప్రతిఫలమును ప్రసాదిస్తాడు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు:- ﴾ఏమీ? మేము విధేయులను (ముస్లింలను) నేరస్థులతో సమానంగా ఎంచుదుమా?﴿ [అల్ ఖలమ్: 35]
దీనిని మనం ఒక ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం: ఒక వేళ ఒక దుర్మార్గపు మానవుడు వెయ్యి మందిని చంపి, మహిళలపై అత్యాచారం చేసి, సంపదలను దొంగిలించి, ఆ తరువాత సహజ మరణం పొందితే, మరియు న్యాయం అతని దరికి చేరక అతని నుండి ప్రతీకారం తీసుకోబడకపోతే, అతడు తన శిక్షను ఎలా పొందుతాడు? మరియు జరిగిన ఈ అన్యాయాలకు, చిందించబడిన రక్తానికి, భంగపరచబడిన మానప్రాణాలకు, మరియు దోచుకోబడిన సంపదలకు బదులు ఎలా తీర్చబడుతుంది? వాటి హక్కుదారుల తరపున ప్రతీకారం ఎలా తీర్చబడుతుంది? ఒక వేళ పునరుత్థానం లేకపోయి ఉంటే, భూమిపై కల్లోలం సృష్టించిన క్రూరమైన నేరస్థుడు శిక్ష నుండి తప్పించుకోవడం అనేది అత్యంత దారుణమైన విషయంగా ఉండేది. కానీ నిశ్చయంగా అల్లాహ్ ప్రతి బాధితుడికి, అతనికి అన్యాయం చేసిన వాడి నుండి ప్రతీకారం తీరుస్తాడని మనకు తెలియజేశాడు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾నిశ్చయంగా, ఎవరు మా సూచనలను తిరస్కరించారో! వారిని మేము మున్ముందు నరకాగ్నిలో పడవేస్తాము. ప్రతిసారీ వారి చర్మాలు కాలిపోయి నపుడల్లా వాటికి బదులుగా - వారు బాధను బాగా రుచి చూడటానికి - వేరే చర్మాలతో మార్చుతాము. నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు మహావివేచనాపరుడు.﴿ [సూరతున్నిసా: 56] అవిశ్వాసి నరకాగ్నిలో దహించబడతాడు. అతని చర్మం కాలిపోయిన ప్రతిసారి, శిక్షను అనుభవించేందుకు అతనికి మరో చర్మం మార్చబడుతుంది. అలాగే అతడు చేసిన ప్రతి అన్యాయానికి ప్రతీకారం తీసుకోబడుతుంది. అతడు వెయ్యిమందిని హత్య చేసి ఉంటే, పునరుత్థాన దినాన మహోన్నతుడైన అల్లాహ్ అతనిని వెయ్యిసార్లు చంపుతాడు. ఇలాంటి విషయం ఈ లోకంలో జరుగుతుందా? నిజానికి ఒక నేరస్థుడు వందమందిని హత్య చేసినా, అతడు పట్టుబడితే గరిష్టంగా ఒక్కసారి మాత్రమే చంపబడతాడు; అప్పుడు అతడు మరణిస్తాడు.
రెండవది: ఈ క్రింది ఆధారాల ద్వారా మరణాంతరం లేపబడటాన్ని నిరూపించవచ్చు:
నిశ్చయంగా భూమ్యాకాశాలను సృష్టించే సామర్ధ్యం గల అల్లాహ్, మానవులను మరోసారి సృష్టించే సామర్ధ్యం గలడు. కాబట్టి, ఈ మహా ఖగోళాలను సృష్టించినవాడు మానవులను మరోసారి సృష్టించటం నుండి అశక్తుడు కాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾వాస్తవానికి, ఆకాశాలను మరియు భూమిని స్పష్టించటం, మానవులను సృష్టించటం కంటే ఎంతో గొప్ప విషయం, కానీ చాలా మంది ప్రజలకు ఇది తెలియదు.﴿ [గాఫిర్: 57]
నిశ్చయంగా మొట్టమొదటి మనిషి ఆదమును మట్టి నుండి సృష్టించి మరియు అతనిని ఒక సంపూర్ణ మనిషిగా చేసిన అల్లాహ్ కు, మనిషి మట్టిగా మారిన తరువాత తిరిగి జీవనం పోయడంలో కూడా శక్తి ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు?" చెప్పు: "అవి మొదటిసారి సృష్టించినవాడు వాటిని తిరిగి బ్రతికించగలడు. మరియు ఆయన ప్రతి సృష్టిని గురించి బాగా తెలిసినవాడు.﴿ [యా,సీన్: 78-79]
నిస్సందేహంగా అల్లాహ్, ఎవరైతే ప్రతీ రోజు ఒక అల్పమైన వీర్యబిందువు నుంచి ధ్రవపదార్ధపు సారంతో జరిగే మనిషి యొక్క నూతన సృష్టిని మనకు చూపుతున్నాడో, ఆయనకు సృష్టిని మరోసారి పునః సృష్టించడం అసాధ్యం కాదు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾ఏ మానవులారా! ఒకవేళ (మరణించిన తరువాత) మరల సజీవులుగా లేపబడటాన్ని గురించి మీకు ఏదైనా సందేహముంటే! (జ్ఞాపకముంచుకోండి) నిశ్చయంగా, మేము మిమ్మల్ని మట్టితో సృష్టించాము, తరువాత వీర్యబిందువుతో, ఆ తరువాత నెత్తురు గడ్డతో, ఆ పైన మాంసపు కండతో; అది పూర్తిగా రూపం పొందవచ్చు, లేక పూర్తిగా రూపం పొందక పోవచ్చు. ఇదంతా మేము మీకు (మా శక్తిని తెలుసుకోవటానికి) స్పష్టం చేస్తున్నాము. ఆ తరువాత మేము కోరిన వారిని ఒక నిర్ణీత కాలం వరకు గర్భకోశాలలో ఉంచుతాము. పిదప మిమ్మల్ని శిశువుల రూపంలో బయటికి తీస్తాము. ఆ తరువాత మిమ్మల్ని యవ్వన దశకు చేరనిస్తాము. మీలో ఒకడు (వృద్ధుడు కాక ముందే) చనిపోతాడు, మరొకడు నికృష్టమైన వృద్ధాప్యం వరకు చేర్చబడతాడు; అప్పుడతడు, మొదట అంతా తెలిసిన వాడైనా ఏమీ తెలియని వాడిగా అయి పోతాడు. నీవు భూమిని ఫలింపలేని దానిగా చూస్తావు. కాని ఒకవేళ మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపిస్తే, అది పులకరించి పొంగిపోయి అన్ని రకాల మనోహరమైన వృక్షకోటిని ఉత్పన్నం చేస్తుంది.﴿ [హజ్జ్: 5]
నిశ్చయంగా అల్లాహ్ ఈ జీవితంలో మనం తరచుగా చూసే ఒక ఉదాహరణను మన ముందు ఉంచాడు, అదేమిటంటే భూమి బంజరుగా, నిర్జీవంగా, ఎటువంటి జీవం లేకుండా ఉంటుంది. అప్పుడు దానిపై వర్షం కురుస్తుంది, దానితో అది పులకించి సజీవంగా మారుతుంది మరియు అందాలు చిందించే ప్రతి జత పచ్చని మొక్కలను పుట్టిస్తుంది. నిస్సందేహంగా దానిని జీవింపజేసినవాడే మృతులను కూడా జీవింపజేస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఆయన సూచన (ఆయాత్) లలో ఒకటి: నిశ్చయంగా నీవు భూమిని పాడు నేలగా (ఎండిపోయిన బంజరు నేలగా) చూస్తున్నావు; కాని మేము దానిపై నీటిని (వర్షాన్ని) కురిపించగానే, అది పులకించి, ఉబ్బి పోతుంది. నిశ్చయంగా దీనిని (ఈ భూమిని) బ్రతికించి లేపే ఆయన (అల్లాహ్ యే) మృతులను కూడా బ్రతికించి లేపుతాడు. నిశ్చయంగా, ఆయన ప్రతిదీ చేయగల సమర్థుడు.﴿ [ఫుస్సిలత్: 39]
నిశ్చయంగా అల్లాహ్ పవిత్ర ఖుర్ఆన్ లో మన కొరకు మరణాంతరం లేపబడటం పై సూచించే ఒక అద్భుతమైన సూచనను ఏర్పాటు చేశాడు, అదేమిటంటే మనం అటవీ మంటలలో చూస్తున్నట్లుగానే పచ్చటి తడి చెట్ల నుండి వేడి అగ్ని వెలువడటం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మీరు రాజేసే అగ్నిని గమనించారా? దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా? మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.﴿ [అల్ వాఖిఅ: 71 - 73] అయితే ఎవరైతే దానికి విభిన్నమైన దాని నుండి అంటే పచ్చటి చెట్టు నుండి వేడి అగ్నిని వెలికి తీస్తాడో, అతడే మృతుల నుండి సజీవులను వెలికి తీయటంపై సామర్ధ్యం కలవాడు.
నిద్ర అనేది మరణానికి మరియు మరణాంతరం లేపబడటానికి ఒక సూక్ష్మరూపం; మానవుడు తన అత్యుత్తమ స్థితిలో మరియు శక్తితో ఉండటాన్ని మనం చూడటం లేదా, ఆ తరువాత అతన్ని నిద్ర ఆవహించినప్పుడు, నిద్ర సమయములో అతని ఆత్మ అతని శరీరమును వదిలివెళుతుంది, కాబట్టి తన చుట్టూ ఉన్నవాటిని అతడు అనుభూతి చెందడు, మరియు బహుశా అతడు నివసించే ఇంటికి నిప్పంటుకున్నా అతనికి తెలియదు కనుక అతడు కాలిపోతాడు. కాబట్టి మానవుడు మరణించినట్లయితే, అతడు తన నిద్ర నుండి మేల్కొన్నట్లుగానే మరణాంతరం లేపబడతాడు, మరియు ఇది మనలో ప్రతి ఒక్కరూ తమలో మరియు తమ చుట్టూ ఉన్నవారిలో చూసే ఒక ప్రత్యక్ష సాక్ష్యం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు ఆయన సూచనలలో, మీరు రాత్రిపూట మరియు పగటి పూట, నిద్ర పోవటం మరియు మీరు ఆయన అనుగ్రహాన్ని అన్వేషించడం కూడా ఉన్నాయి. నిశ్చయంగా, ఇందులో శ్రద్ధతో వినేవారికి ఎన్నో సూచనలున్నాయి.﴿ [అర్రూమ్: 23] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾అల్లాహ్ యే ఆత్మలను (ప్రాణాలను) మరణ కాలమున వశపరచుకునేవాడు మరియు మరణించని వాడి (ఆత్మలను) నిద్రావస్థలో (వశపరచుకునే వాడునూ). తరువాత దేనికైతే మరణం నిర్ణయింప బడుతుందో దానిని ఆపుకొని, మిగతా వారి (ఆత్మలను) ఒక నియమిత కాలం వరకు తిరిగి పంపుతాడు. నిశ్చయంగా ఇందులో ఆలోచించే వారికి గొప్ప సూచనలు (ఆయాత్) ఉన్నాయి.﴿ [జుమర్: 42]
అది దైవప్రవక్తలైన మహనీయ ఇబ్రాహీం ఖలీల్, మూసా లేదా ఈసా అలైహిమస్సలాంల ద్వారా జరిగినప్పటికీ, మానవులు లేదా జంతువులలో మరణించిన వారిని తిరిగి బ్రతికించడం మరియు వారు తిరిగి సజీవులు అవ్వడం వంటి తన ప్రవక్తల (అలైహిమస్సలాం) ద్వారా జరిగిన అద్భుతాలను అల్లాహ్ మనకు ప్రస్తావించాడు. కాలక్రమంలో జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవాలనుకునే వారి కోసం చరిత్ర భద్రపరిచిన భౌతిక మరియు జ్ఞానాత్మక ఆధారం ఇది.
పునరుత్థానాన్ని (బఅస్) విశ్వసించడం అగోచర విషయాలను విశ్వసించడంలో భాగం. దీని గురించి మరియు ఇతర అగోచర విషయాలను గురించి అల్లాహ్ మనకు తెలియజేశాడు, వీటిపై విశ్వాసం ఉంచడం మీదనే మానవుని ధార్మిక మరియు ప్రాపంచిక ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. ఈ అగోచర విషయాలు అక్షరాలా సత్యమైనవనే సంపూర్ణ విశ్వాసాన్ని ఒక ముస్లింకు ప్రసాదించే అనేక నిదర్శనాలను ఆయన మనకోసం ఏర్పాటు చేశాడు. తద్వారా అతను వాటిని తన కళ్ళతో చూస్తున్నట్లుగానే తన హృదయంతో గ్రహిస్తాడు. అగోచర విషయాల సమాచారం ఇమిడి ఉన్న దివ్యవాణి (వహీ), బుద్ధి ధృవీకరించే అనేక వాస్తవాలను మరియు కచ్చితమైన విషయాలను అందించినట్లుగానే, మానవుడు తన జీవితంలో వాటి సత్యతను గ్రహిస్తాడు. కాబట్టి, తనకు తెలిసిన విషయాల సత్యత, తనకు గోప్యంగా ఉన్న (అగోచర) విషయాల జ్ఞానాన్ని అతనికి మరింత దృఢపరుస్తుంది.
మరణాంతరం లేపబడటం పై విశ్వాసం లేకుండా ఎవరి ఇస్లాం మరియు విశ్వాసము సరైనవి కావు. మరియు మరణాంతరం లేపబడటంను తిరస్కరించేవాడు, అతను ఎంతటి మేలు మరియు పుణ్యకార్యాలు చేసినప్పటికీ గొప్పవాడైన అల్లాహ్ పై అవిశ్వాసం చూపినవాడే అవుతాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾సత్యాన్ని తిరస్కరించిన వారు (చనిపోయిన తరువాత) మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను: "అది కాదు, నా ప్రభువు సాక్షిగా! మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు (ప్రపంచంలో) చేసిందంతా మీకు తెలుపబడుతుంది. మరియు ఇది అల్లాహ్ కు ఎంతో సులభం.﴿ [అత్తగాబున్: 7]
***
ప్రశ్న:
ప్రళయదినం అంటే ఏమిటి?
సమాధానం:
సకల ప్రశంసలు అల్లాహ్ కొరకే. ప్రళయదినం ఒక గొప్ప దినం, పవిత్ర ఖుర్ఆన్లో దీనికి అనేక పేర్లు ఉన్నాయి. అందులో సంభవించే అనేక భయానక పరిస్థితులు మరియు సంఘటనల కారణంగానే దానికి ఇన్ని పేర్లు వచ్చాయి. దీనికి తీర్పు దినం (యౌముల్ ఖియామ), నష్టాల దినం (యౌముత్ తగాబున్), చెవులను చెవిటిగా చేసేది (అస్సాఖ్ఖ), గుండెలను దడదడలాడించేది (అల్ ఖారిఅ), పునరుత్థానం (అల్ బఅస్), సమీకరణ (అల్ హష్ర్), పునర్జీవనం (అన్ నుషూర్), పిలుపుల దినం (అత్తనాద్), భూకంపం (అజ్ జల్జల) మరియు గొప్ప విపత్తు (అత్తామ్మ) వంటి అనేక ఇతర పేర్లు ఉన్నాయి.
మరియు ఈ రోజు సమయం అల్లాహ్ కు తప్ప ఎవరికీ తెలియదు, దీని గురించి ఏ పంపబడిన దైవప్రవక్తకు కూడా, ఏ సామీప్య దైవదూతకు కూడా తెలియదు, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:- ﴾నిశ్చయంగా, తీర్పు ఘడియ రానున్నది, ప్రతి వ్యక్తీ తాను చేసిన కర్మల ప్రకారం ప్రతిఫలం పొందటానికి; నేను దానిని గోప్యంగా ఉంచాలని నిర్ణయించాను.﴿ [తాహా: 15] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾(ఓ ప్రవక్తా!) వారు నిన్ను ఆ అంతిమఘడియను గురించి: "అది ఎప్పుడు రానున్నది?" అని అడుగుతున్నారు. వారితో ఇలా అను: "నిస్సందేహంగా, దాని జ్ఞానం నా ప్రభువుకు మాత్రమే ఉంది. కేవలం ఆయన స్వయంగా దానిని, దాని సమయంలో తెలియజేస్తాడు. అది భూమ్యాకాశాలకు ఎంతో దుర్భరమైనదిగా ఉంటుంది. అది మీపై అకస్మాత్తుగానే వచ్చి పడుతుంది." దానిని గురించి నీకు బాగా తెలిసి ఉన్నట్లు భావించి, వారు నిన్ను దానిని గురించి అడుగుతున్నారు. నీవు ఇలా సమాధానం ఇవ్వు: "నిస్సందేహంగా, దాని జ్ఞానం అల్లాహ్ కు మాత్రమే ఉంది. కాని చాలా మంది ఇది తెలుసుకోలేరు.﴿ [అల్-అఅరాఫ్: 187]
ప్రళయం సంభవించక మునుపు దాని సూచనలు ఉంటాయి, అవే దాని సంకేతాలు. మరియు ప్రళయం యొక్క సంకేతాలు చాలా ఉన్నాయి, వాటిలో సంభవించి గడిచిపోయినవి ఉన్నాయి, మరియు యుగాంతము సమీపిస్తున్న కాలములో సంభవించే పది పెద్ద సంకేతాలు కూడా వాటిలో ఉన్నాయి. ఇవి హుజైఫా బిన్ ఉసైద్ అల్ గిఫారీ నుండి ఉల్లేఖించబడిన ఈ హదీసులో ప్రస్తావించబడినవి, ఆయన ఇలా పలికారు: మేము చర్చలో నిమగ్నమై ఉన్న సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హఠాత్తుగా మా వద్దకు వచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: "మీరు ఏమి చర్చిస్తున్నారు?" మేము ఇలా చెప్పాము: "మేము ప్రళయం గురించి చర్చిస్తున్నాము." అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మీరు దాని ముందు పది సంకేతాలు చూసే వరకు అది రాదు.” - ఆయన వాటిని ప్రస్తావించారు - పొగ, దజ్జాల్, జంతువు, పశ్చిమం నుండి సూర్యోదయం, ఈసా బిన్ మర్యం అలైహిస్సలాం అవరోహణ, యాజూజ్,మాజూజ్ మరియు మూడు ప్రదేశాలలో భూకంపం రావటం గురించి ప్రస్తావించారు అవి: తూర్పున ఒకటి, పశ్చిమాన ఒకటి మరియు అరేబియాలో ఒకటి, మరియు వీటిలో చివరిది యమన్ నుండి ఉద్భవించే అగ్ని, ఇది ప్రజలను వారి సమీకరించబడే స్థానానికి (హషర్ మైదానము) తీసుకునివెళుతుంది. [సహీహ్ ముస్లిం (39)].
మరియు ఆ రోజున ప్రజలు కాళ్ళకు చెప్పులు లేకుండా, నగ్నంగా, వొడుగులు (సున్తీ) చేయని స్థితిలో పునరుత్థానం చేయబడతారు (లేపబడతారు). లెక్కల తీర్పు కోసం ఎదురుచూస్తూ వారు చాలా కాలం పాటు నిలబడతారు. సూర్యుడు వారికి దగ్గరగా వస్తాడు, మరియు వారి నుండి విపరీతంగా చెమట కారుతుంది. అల్లాహ్ అందులో పూర్వీకులను మరియు తరువాతి వారందరినీ ఒకచోట సమీకరిస్తాడు. తాము ఉన్న ఈ విపత్కర స్థితి నుండి విముక్తి పొందడానికి శిఫారసు చేయమని ప్రజలు ప్రవక్తలను (అలైహిస్సలాం) అర్థిస్తారు. అప్పుడు సృష్టితాల పక్షాన అల్లాహ్ మన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క శిఫారసును అంగీకరిస్తాడు. కావున లెక్కల తీర్పు చేయమని ఆయన తన ప్రభువుకు శిఫారసు చేస్తారు. ఆ రోజున ఎన్నో భయానక పరిస్థితులు, ఆందోళనలు మరియు అనేక దృశ్యాలు ఉంటాయి, వీటి పూర్తి వివరాలు గ్రంథం మరియు ప్రామాణిక సున్నతులలో వివరించబడ్డాయి.
మరియు ఆ రోజున ప్రతీ సమాజము తమ ప్రవక్తతో వస్తుంది, అప్పుడు ఆయన వారిపై సాక్ష్యమిస్తాడు. మరియు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజము, ప్రతీ ప్రవక్త సందేశాన్ని చేరవేశారని మరియు అమానతును నెరవేర్చారని సాక్ష్యమిస్తుంది. మరియు ఆ రోజున దాసుల కర్మల పుస్తకాలు తెరవబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు కర్మపత్రం వారి ముందు ఉంచబడినపుడు, ఆ అపరాధులు, అందులో ఉన్న దానిని చూసి భయపడటాన్ని నీవు చూస్తావు. వారు ఇలా అంటారు: "అయ్యో! మా దౌర్భాగ్యం, ఇదేమి గ్రంథం! ఏ చిన్న విషయాన్న గానీ, ఏ పెద్ద విషయాన్ని గానీ ఇది లెక్కపెట్టకుండా విడువ లేదే!" తాము చేసిందంతా వారు తమ ఎదుట పొందుతారు. నీ ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయడు.﴿ [ అల్ కహఫ్: 49] మరియు దాసుల ఆచరణలను తూకం వేయడానికి తూకములు ఏర్పాటు చేయబడతాయి. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!﴿ [అల్ అంబియా: 47] మరియు సాక్షులు హాజరుపరచబడతారు, మరియు తీర్పును నిర్ణయించడానికి మహాబలవంతుడైన అల్లాహ్ వస్తాడు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు భూమి తన ప్రభువు తేజస్సుతో వెలిగి పోతుంది మరియు కర్మపత్రం వారి యెదుట ఉంచబడుతుంది, ప్రవక్తలు మరియు (ఇతర) సాక్షులు రప్పింపబడతారు. మరియు వారి మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు వారికెట్టి అన్యాయం జరుగదు.﴿ [జుమర్: 69] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు నీ ప్రభువు (స్వయంగా) వస్తాడు మరియు దేవదూతలు వరుసలలో వస్తారు.﴿ [అల్ ఫజర్: 22]
అది ఇహలోక జీవితంలో ప్రజలు చేసిన కర్మలకు ప్రతిఫలం మరియు లెక్క తీసుకునే దినం, కనుక ఎవరి తూకము బరువుగా ఉంటుందో వారు సఫలీకృతులు మరియు రక్షింపబడిన వారిలో ఉంటారు, మరియు ఎవరి తూకము తేలికగా ఉంటుందో వారే నష్టపోయినవారు, మహోన్నతుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾అప్పుడు (జరిగిందంతా) వారికి పూర్తి జ్ఞానంతో వివరిస్తాము. ఎందుకంటే, మేము (ఎక్కడనూ, ఎప్పుడునూ) లేకుండా లేము. మరియు ఆ రోజు (కర్మల) తూకం న్యాయంగా జరుగుతుంది. కావున ఎవరి తూనికలు బరువుగా ఉంటాయో అలాంటి వారే సఫలీకృతలు. మరియు ఎవరి తూనికలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేస్తుకున్నవారు. ఎందుకంటే, వారు మా సూచనలను దుర్మార్గంతో తిరస్కరిస్తూ ఉండేవారు.﴿ [అల్ అఅ్ రాఫ్: 8-9] లెక్కల అప్పచెప్పులు ముగిసిన తరువాత విశ్వాసులు స్వర్గానికి తీసుకువెళ్లబడతారు, అది అంతు లేని శాశ్వతమైన అనుగ్రహాల నిలయం. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో వారు మరియు వారితో పాటు సద్వర్తనులైన వారి తండ్రి తాతలు, వారి సహవాసులు (అజ్వాజ్) మరియు వారి సంతానం కూడా ప్రవేశిస్తారు. మరియు ప్రతి ద్వారం నుండి దేవదూతలు వారి (స్వాగతం) కొరకు వస్తారు.﴿ [రఅద్: 23] మరియు అవిశ్వాసపరులైన అపరాధులు నరకం వైపునకు తోలుకొని పోబడతారు, అది అంతం లేని శాశ్వతమైన శిక్ష మరియు వేదనల నివాసం, మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు సత్యతిరస్కారులైన వారి కొరకు నరకాగ్ని ఉంటుంది. అందులో వారు చనిపోవాలనీ తీర్పూ ఇవ్వబడదు, లేదా వారికి దాని (నరకపు) శిక్ష కూడా తగ్గింప బడదు. ఈ విధంగా, మేము ప్రతి కృతఘ్నునికి (సత్యతిరస్కారునికి) ప్రతీకారం చేస్తాము.﴿ [ఫాతిర్: 36]
మరియు అవిశ్వాసపరులు తమ ప్రతిఫలాన్ని, మరియు విశ్వాసపరులు తమ పుణ్యఫలాన్ని పొందిన పిమ్మట, దైవదూతలు తమ ప్రభువును ఆయన పరిపూర్ణమైన న్యాయంపై మరియు ఆయన గొప్ప విజ్ఞతపై ప్రశంసిస్తారు. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా పలికాడు: ﴾మరియు దైవదూతలను తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, ఆయనను స్తుతిస్తూ, ఆయన సింహాసనాన్ని (అర్ష్ ను) అన్ని వైపుల నుండి చుట్టుకొని ఉండటాన్ని నీవు చూస్తావు. మరియు వారి (సర్వ ప్రాణుల) మధ్య న్యాయంగా తీర్పు చేయబడుతుంది మరియు : "సర్వస్తోత్రాలకు అర్హుడైన అల్లాహ్ యే సమస్త లోకాలకు ప్రభువు." అని పలుకబడుతుంది.﴿ [జుమర్: 75]
అల్లాహ్ మన ప్రవక్త అయిన ముహమ్మద్ పై శుభాలను,శాంతిని కురిపించుగాక.
***
ప్రశ్న:
స్వర్గం మరియు నరకంలో ఏమి జరుగుతుంది?
సమాధానం:
స్వర్గం పరలోకంలో విశ్వాసుల ప్రతిఫల నివాసం మరియు వారు శాశ్వతమైన అనుగ్రహాలు పొందే నిలయం, మరియు నరకం పరలోకంలో అవిశ్వాసుల ప్రతీకార నివాసం మరియు వారు శాశ్వతమైన శిక్షను అనుభవించే నిలయం. అందులో అవిధేయులైన ఏకదైవారాధకులు శిక్షించబడతారు, ఆ తరువాత వారు స్వర్గంలోకి పంపబడతారు. మరియు స్వర్గంలో ఉన్న వాటిని ఏ కన్ను చూడలేదు మరే చెవి వినలేదు, ఏ మానవ మనస్సు ఊహించలేదు. పవిత్ర ఖుర్ఆన్ మరియు ప్రవక్త సున్నత్లలో స్వర్గంలో జరిగిన మరియు జరగబోయే అనేక విషయాలు స్పష్టంగా తెలుపబడ్డాయి, మనస్సులు దాని కోసం ఆశపడేలా అది సవివరంగా వర్ణించబడింది. అదేవిధంగా, నరకంలోని శిక్ష కూడా మనస్సులలో భయాన్ని కలిగించేలా మరియు దాని నుండి తప్పించుకోవడానికి సత్కార్యాలు చేసేలా సవివరంగా వర్ణించబడింది. మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు.﴿ [అస్ సజ్దహ్: 17] మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది;﴿ [అన్నబ: 31]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾నిశ్చయంగా, నరకం ఒక మాటు; ధిక్కారుల గమ్యస్థానం. అందులో వారు యుగాల తరబడి ఉంటారు. అందులో వారు ఎలాంటి చల్లదనాన్ని గానీ మరియు (చల్లని) పానీయాన్ని గానీ చవి చూడరు. సలసల కాగే నీరు మరియు చీము లాంటి మురికి (పానీయం). (వారి కర్మలకు) తగిన పూర్తి ప్రతిఫలంగా! వాస్తవానికి వారు లెక్క తీసుకోబడుతుందని ఆశించలేదు. పైగా వారు మా సూచనలను (ఆయాత్ లను) అసత్యాలని తిరస్కరించారు. మరియు మేము (వారు చేసిన) ప్రతిదానిని ఒక పుస్తకంలో వ్రాసి పెట్టాము. కావున మీరు (మీ కర్మల ఫలితాన్ని) చవి చూడండి. ఎందుకంటే, మేము మీకు శిక్ష తప్ప మరేమీ అధికం చేయము. నిశ్చయంగా, దైవభీతి గలవారికి సాఫల్యం (స్వర్గం) ఉంది; ఉద్యానవనాలూ, ద్రాక్ష తోటలూ! మరియు ఈడూజోడూ గల (యవ్వన) సుందర కన్యలు; మరియు నిండి పొర్లే (మధు) పాత్ర. అందులో (స్వర్గంలో) వారు ఎలాంటి వ్యర్థపు మాటలు గానీ, అసత్యాలు గానీ వినరు. (ఇదంతా) నీ ప్రభువు తరఫు నుండి లభించే ప్రతిఫలం, చాలినంత బహుమానం.﴿ [అన్నబ: 21-36] ﴾భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గం యొక్క ఉదాహరణ ఇలా వుంది: అందులో వాసన మరియు రంగు మారని నీటి సెలయేళ్ళు ఉంటాయి మరియు రుచి మారని పాల కాలువలు ఉంటాయి మరియు అందులో త్రాగేవారికి మధురంగా వుండే మద్యపానపు కాలువలు ఉంటాయి మరియు అందులో శుద్ధమైన తేనె కాలువలు ఉంటాయి. మరియు వారి కొరకు అందులో అన్ని రకాల మంచి ఫలాలు మరియు వారి ప్రభువు నుండి క్షమాపణ కూడా వుంటాయి. ఇలాంటి వాడు - నరకాగ్నిలో శాశ్వతంగా ఉండి సలసల కాగే నీటిని త్రాగేందుకు ఇవ్వబడి, దానితో ప్రేగులు కోయబడినట్లు బాధపడేవానితో - సమానుడు కాగలడా?﴿ [ముహమ్మద్: 15]
మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾ఆ దినమున స్వర్గానికి అర్హులైన వారు మంచి నివాసంలో మరియు ఉత్తమ విశ్రాంతి స్థలంలో ఉంటారు.﴿ [అల్-ఫుర్'ఖాన్: 24] పరిశుద్ధుడైన అల్లాహ్ సెలవిచ్చాడు: ﴾మరియు ఎవరి పళ్ళాలు తేలికగా ఉంటాయో, అలాంటి వారే తమను తాము నష్టానికి గురి చేసుకున్న వారు, వారే నరకంలో శాశ్వతంగా ఉండేవారు. అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది. వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.﴿ [అల్ ముమినూన్: 103-104] రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "మహోన్నతుడూ, మహోత్కృష్టుడు అయిన అల్లాహ్ స్వర్గమును సృష్టించినపుడు, జిబ్రయీల్ తో ఇలా అన్నాడు “వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” తరువాత ఆయన దానిని కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండేలా చేసాడు, తరువాత ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు అని భయంగా ఉన్నది.” ఆయన (ప్రవక్త) అన్నారు: అల్లాహ్ నరకమును సృష్టించినపుడు ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరూ దానిలోనికి ప్రవేశించరు.” అపుడు ఆయన దానిని వాంఛలు, కోరికలతో చుట్టుకుని ఉండేలా చేసాడు, తరువాత ఇలా అన్నాడు “ఓ జిబ్రయీల్! వెళ్ళు, వెళ్ళి దానిని చూడు”. ఆయన వెళ్ళి దానిని చూసాడు, తరువాత వచ్చి ఇలా అన్నాడు “ఓ నా ప్రభూ! నీ ఘనత సాక్షిగా! దానిలోనికి ప్రవేశించకుండా ఎవరూ మిగలరు అని భయంగా ఉన్నది”. [ముస్నద్ (8398), ఈ హదీసును అబూ దావుద్ హసన్ ఇస్నాద్ తో, హదీసు సంఖ్య (4744) లో ఉల్లేఖించారు], రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "ప్రళయదినాన ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా సౌఖ్యం అనుభవించిన నరకవాసి ప్రవేశపెట్టబడతాడు. ఒకసారి నరకంలో ముంచి తీసిన పిదప అతనితో, “ఓ ఆదం పుత్రుడా! గతంలో నీవెప్పుడయినా సౌఖ్యాన్ని చవి చూశావా? నీకు ఇంతకు ముందు సౌఖ్యాన్ని అనుభవించినట్లు గుర్తుందా?” అని అడగటం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తి, “లేదు. అల్లాహ్ సాక్షి! ప్రభూ!” అని అంటాడు. ఆ తరువాత ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా కష్టాలు అనుభవించిన స్వర్గవాసి హాజరుపరచబడతాడు. అతన్ని ఒకసారి స్వర్గంలో ముంచి తీసిన తరువాత అతనితో "ఓ ఆదం పుత్రుడా! గతంలో నువ్వెప్పుడైనా కష్టాలు ఎదుర్కొన్నావా? నీకు ఇంతకు ముందు కష్టాలు వచ్చినట్లు గుర్తుందా?" అని అడగటం జరుగుతుంది. దానికి సమాధానంగా అతను, “లేదు, అల్లాహ్ సాక్షి! ప్రభూ! నేనెన్నడూ కష్టాలు చూడలేదు. గతంలో నేను బాధపడినట్లు నాకు గుర్తే లేదు” అని అంటాడు." [దీనిని ముస్లిం ఉల్లేఖించారు హదీసు సంఖ్య (2807)].
మరింత సమాచారం కొరకు ఇబ్ను ఖయ్యిమ్ అల్ జౌజియా గారి హాదిల్ అర్వాహ్ ఇలా బిలాదిల్ అఫ్రాహ్ మరియు ఉమర్ అల్ అష్‌ఖర్ గారి అల్ జన్నహ్ వన్-నార్ చూడండి.
***
ప్రశ్న:
అల్లాహ్ నరకాన్ని ఎందుకు సృష్టించాడు?
సమాధానం:
అగ్ని రెండు రకాలు: ఇహలోకపు అగ్ని, మరియు పరలోకపు అగ్ని. ఇక ఇహలోకపు అగ్ని విషయానికొస్తే, దానికి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి, వాటిలో అత్యంత గొప్పది ఏమిటంటే, అది పునరుత్తాన దినానికి సూచికగా ఉంటుంది. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా? మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము. కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.﴿ [సూరతుల్ వాఖిఆ: 72-74] మరియు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ﴾మరియు అతడు మాకు పోలికలు కల్పిస్తూ తన సృష్టినే మరలిపోయాడు. అతడు ఇలా అంటాడు: "కృశించిపోయిన ఈ ఎముకలను తిరిగి ఎవడు బ్రతికించగలడు? ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది. ఆయనే పచ్చని చెట్టు నుండి మీ కొరకు అగ్నిని పుట్టించేవాడు, తరువాత మీరు దాని నుండి మంటను వెలిగించుకుంటారు.﴿ [సూర యాసీన్: 78-80] చల్లని పచ్చని చెట్టు నుండి వేడి మరియు దహించే అగ్నిని వెలికి తీసేవాడు, తన అనుమతితో మృతులను జీవింపజేయటంపై సామర్ధ్యం కలవాడని అల్లాహ్ ప్రజలకు గుర్తు చేశాడు.
మరియు ఇహలోకపు అగ్ని వల్ల కలిగే అత్యంత ప్రసిద్ధమైన ప్రయోజనాలలో: చీకటిలో దాని వెలుగు ద్వారా ప్రయోజనం పొందటం, ఆహార పానీయాలను వండటం, చలిలో వెచ్చదనం పొందటం, మనిషికి నాశనం చేయవలసిన అవసరమున్నవాటిని నాశనం చేయటం, లోహాలను మెత్తబరచటం, పరిశ్రమలను సులభతరం చేయటం మరియు కొన్ని వ్యాధులకు చికిత్స చేయటం.
ఇక పరలోక నరకం : అల్లాహ్ దానిని లెక్కించలేనన్ని వివేకాల కొరకు సృష్టించాడు, కానీ వాటిలో కొన్నింటిని ప్రస్తావించడానికి మనం ప్రయత్నిస్తాము, అవి:
మొదటగా: రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: "స్వర్గ నరకలు పరస్పరం వాదులాడుకున్నాయి. అప్పుడు నరకం చెప్తుంది: నాలో కఠినాత్ములు మరియు గర్విష్టులు ప్రవేశిస్తారు, స్వర్గం చెప్తుంది: నాలో బలహీనులు మరియు ఆగత్యపరులు ప్రవేశిస్తారు. అప్పుడు అల్లాహ్ నరకంతో అంటాడు: నీవు నా శిక్షవి, నేను తలచినవారిని నీ ద్వారా శిక్షిస్తాను - లేదా బహుశా 'నేను కోరిన వారిని నీ ద్వారా పట్టుకుంటాను' అని అన్నారు - ఆపై స్వర్గంతో అంటాడు: నీవు నా కారుణ్యానివి, నేను తలచినవారిని నీ ద్వారా కరుణిస్తాను. మరియు మీ ఇద్దరిలో ప్రతి ఒక్కరినీ నింపడం జరుగుతుంది." [సహీహ్ ముస్లిం (34)] అది అల్లాహ్ శిక్ష, అందులో ఆయన అవిశ్వాసపరులలో మరియు నేరస్థులలో తాను కోరిన వారిని శిక్షిస్తాడు.
రెండవది: కొంతమంది ప్రజల హృదయములు రాళ్ళ కన్న ఎక్కువగా కఠినంగా ఉంటాయి. మరియు అహంకారం, గర్వంతో కూడిన ఈ హృదయాలను ఈ గొప్ప నరకాగ్ని తప్ప మరేదీ కరిగించలేదు మరియు వాటికి బుద్ధి చెప్పలేదు.
మూడవది: అల్లాహ్ నరకాన్ని సృష్టించడం అనేది ఆయన వివేకం మరియు కారుణ్యంలో భాగం; ఎందుకంటే అల్లాహ్ ఈ ప్రపంచాన్ని కష్టాల మరియు పరీక్షల నిలయంగా చేశాడు. మానవుడిని సృష్టించి అతనిలో కోరికలను ఉంచాడు మరియు ఆ కోరికలను తీర్చుకునే మార్గాలను ఏర్పరిచాడు. ఆపై వాటిలో ధర్మసమ్మతమైనవి మరియు నిషిద్ధమైనవి (హరామ్) నిర్ణయించాడు. నిషిద్ధమైన కోరికలకు చేరువ కావడం ద్వారా తనకు అవిధేయత చూపవద్దని ఆయన తన దాసులను హెచ్చరించాడు. అదే విధంగా తన ఆరాధనలో సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క హక్కును నెరవేర్చడంలో ఎలాంటి లోపం చేయవద్దని కూడా వారిని హెచ్చరించాడు. నిషిద్ధ కార్యాలకు పాల్పడటం లేదా విధేయతలో లోపం చేయడం ద్వారా ఎవరైతే ఆయన పట్ల అవిధేయత చూపుతారో, వారందరినీ నరకంలో ప్రవేశపెడతానని కఠినంగా హెచ్చరించాడు. కాబట్టి నరకం యొక్క ఉనికి అనేది వివేకవంతులైన వారు పాపాలకు పాల్పడకుండా మరియు ఆరాధనలో లోపం చేయకుండా అడ్డుకునే ఒక ఉత్తమ నివారణగా ఉంది. సర్వోన్నతుడైన అల్లాహ్ ఈ విధంగా సెలవిచ్చాడు: ﴾కాబట్టి నేను మిమ్మల్ని ప్రజ్వలించే నరకాగ్నిని గురించి హెచ్చరించాను. పరమ దౌర్భాగ్యుడు తప్ప, మరెవ్వడూ అందులో కాలడు! ఎవడైతే (సత్యాన్ని) తిరస్కరించి (దాని నుండి) విముఖుడవుతాడో . కాని దైవభీతి గలవాడు దాని నుండి (ఆ నరకాగ్ని నుండి) దూరంగా ఉంచబడతాడు! అతడే! ఎవడైతే, పవిత్రుడవటానికి తన ధనం నుండి (ఇతరులకు) ఇస్తాడో!﴿ [సూరతుల్ లైల్: 14-18] ఇది మీరు తెలుసుకుంటే, దాని ఉనికి అల్లాహ్ కు కోపం తెప్పించే వాటికి దూరంగా ఉండటానికి మరియు ఆయన ఆజ్ఞాపించే మరియు ఇష్టపడే వాటికి కట్టుబడి ఉండటానికి ఒక కారణం అని మీరు గ్రహిస్తారు. అదేవిధంగా నరకంలో ఒక అవిశ్వాసి కాఫిర్ కి మరియు దౌర్జన్యకారుడికి విధించే శిక్షలో, ఈ లోకంలో దౌర్జన్యానికి గురైన బాధితునికి విజయం చేకూర్చడం మరియు అతని కోపాన్ని పోగొట్టడం ఉంది, మరియు అలాగే ఒక అవిశ్వాసి కాఫిర్ తన ప్రభువుకు అవిధేయత చూపినందుకు తన శిక్షను ఖచ్చితంగా పొందుతాడు.
***
Related books
All books
ఒక నాస్తికునికి సంక్షిప్త సందేశం61 భాషలుఒక నాస్తికునికి సంక్షిప్త సందేశం
నాస్తికునికి ఒక సంక్షిప్త సందేశం: విశ్వం యొక్క ఖచ్చితత్వం మరియు దాని వ్యవస్థ యాదృచ్ఛికతను తిరస్కరించి, ఒక వివేకవంతుడైన సృష్టికర్తను సూచిస్తాయి. అయితే, ఇదంతా శూన్యం నుండి ఉద్భవించిందని బుద్ధి ఎలా అంగీకరిస్తుంది? కాబట్టి, నీ హృదయాన్ని ఆలోచనకు, పరిశీలనకు తెరువు, సత్యాన్ని అన్వేషించు. బహుశా దానిలో నీకు మార్గనిర్దేశం చేసే జ్యోతి లభించవచ్చు.
నీవు నీ స్వయాన్ని ప్రశ్నించుకున్నావా? నిన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? మరణంతరం ఏమి జరుగుతుంది?69 భాషలునీవు నీ స్వయాన్ని ప్రశ్నించుకున్నావా? నిన్ను ఎవరు సృష్టించారు? మరియు ఎందుకు? మరణంతరం ఏమి జరుగుతుంది?
ఈ పుస్తకం ఉనికిని మరియు సృష్టిని సంబంధించిన ప్రశ్నను పరిశీలిస్తుంది. మరియు సంపూర్ణ జ్ఞానం మరియు సంపూర్ణత కలిగిన సృష్టికర్త ఉనికిని మేధోపరంగా రుజువు చేస్తుంది. జీవితం యొక్క లక్ష్యం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించడం అని స్పష్టం చేస్తుంది, మరియు ఇస్లాం ధర్మం నిజమైన సత్యధర్మం అని, ఇది భద్రపరచబడిన ధర్మం అని తెలియజేస్తుంది. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లమ్ ను విశ్వసించి, ఆయన బోధనలను అనుసరించమని ఆహ్వానిస్తుంది, మరియు షిర్క్ నుండి హెచ్చరిస్తూ, పరలోకంలో లెక్క మరియు ప్రతిఫలం గురించి ధృవీకరిస్తుంది.
సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్యమైన పాఠాలు78 భాషలుసాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్యమైన పాఠాలు
అబ్దుల్ అజీజ్ బిన్ బాజ్ వారి 'సాధారణ ముస్లింలందరి కొరకు ముఖ్యమైన పాఠాలు' అనే పుస్తకం గొప్ప ప్రయోజనకరమైన ఒక సంక్షిప్త పత్రిక. ప్రతి ముస్లింకు సరైన విశ్వాసం మరియు ఆరాధనను దగ్గర చేయడానికి, ఖుర్ఆన్ మరియు సున్నత్ ఆధారాలతో, సులభమైన, స్పష్టమైన శైలిలో, సాధారణ ముస్లింల కొరకు ఒక విజ్ఞాన నిధిగా దీనిని ఇమామ్ గారు రచించారు. దీనిలో వారు తౌహీద్, ఈమాన్, ఇస్లాం వంటి ధర్మ మూలాలు మరియు మూలస్తంభాల నుండి మొదలుకొని, పవిత్రత మరియు నమాజ్ నియమాలు, ఇస్లామీయ మర్యాదలు, మరియు షిర్క్, ఇతర పాపాల నిషేధాల వరకు వివరించారు.
ఇస్లాం89 భాషలుఇస్లాం
అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? భూమ్యాకాశాలను మరియు వాటిలోని గొప్ప సృష్టితాలను ఎవరు సృష్టించారు? మరియు వాటిని నియంత్రించే ఈ నిర్ధిష్టమైన వ్యవస్థను ఎవరు తయారు చేశారు?