25 : 68
وَٱلَّذِينَ لَا يَدۡعُونَ مَعَ ٱللَّهِ إِلَٰهًا ءَاخَرَ وَلَا يَقۡتُلُونَ ٱلنَّفۡسَ ٱلَّتِي حَرَّمَ ٱللَّهُ إِلَّا بِٱلۡحَقِّ وَلَا يَزۡنُونَۚ وَمَن يَفۡعَلۡ ذَٰلِكَ يَلۡقَ أَثَامٗا
మరియు ఎవరైతే, అల్లాహ్ తో పాటు ఇతర దైవాలను ఆరాధించరో! మరియు అల్లాహ్ నిషేధించిన ఏ ప్రాణిని కూడ న్యాయానికి తప్ప చంపరో! మరియు వ్యభిచారానికి పాల్పబడరో. మరియు ఈ విధంగా చేసేవాడు (అవిధేయుడిగా ప్రవర్తించేవాడు) దాని ఫలితాన్ని తప్పక పొందుతాడు.
Explanation & meanings · 2
- న్యాయానికి చంపే పరిస్థితులు మూడు: 1) ఇస్లాం స్వీకరించిన తరువాత మరల సత్యతిరస్కారి అవటం, 2) పెండ్లి అయినవాడు వ్యభిచారం చేయటం, 3) ఎవరినైనా చంపటం.
- ఒకడు దైవప్రవక్త ('స'అస)తో ప్రశ్నించాడు: 'అన్నింటి కంటే మహాపాపం ఏమిటీ?' అతను ('స'అస) జవాబిచ్చారు: 'అల్లాహ్ (సు.తా.)కు ఎవరినైనా సాటికల్పించటం (షిర్క్). ఎందుకంటే ఆయనయే నిన్ను సృష్టించాడు.' అతనన్నాడు: 'దాని తరువాత ఏ పాపం పెద్దది?' దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'తన సంతానాన్ని జీవనోపాధికి భయపడి చంపటం.' అతడు మళ్ళీ అడిగాడు, ఆ తరువాత అతను జవాబిచ్చారు: 'తన పొరుగు వాని భార్యతో వ్యభిచారం చేయటం!' ఆ తరువాత దైవప్రవక్త ('స'అస) అన్నారు: 'ఈ మూడు విషయాలు ఈ ఆయత్ తో విశదీకరించబడుతున్నాయి.' ఆని ఈ ఆయత్ ను చదివారు. ('స. బు'ఖారీ, ముస్లిం).