Skip to content
البَقَرَة /

ఆయత్ 256

2 : 256

ఆయత్ 256 of البَقَرَة (2 : 256). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 256

لَآ إِكۡرَاهَ فِي ٱلدِّينِۖ قَد تَّبَيَّنَ ٱلرُّشۡدُ مِنَ ٱلۡغَيِّۚ فَمَن يَكۡفُرۡ بِٱلطَّٰغُوتِ وَيُؤۡمِنۢ بِٱللَّهِ فَقَدِ ٱسۡتَمۡسَكَ بِٱلۡعُرۡوَةِ ٱلۡوُثۡقَىٰ لَا ٱنفِصَامَ لَهَاۗ وَٱللَّهُ سَمِيعٌ عَلِيمٌ

ధర్మం విషయంలో బలవంతం లేదు. వాస్తవానికి సన్మార్గం (రుష్ద్) దుర్మార్గం నుండి సుస్పష్టం చేయబడింది. కావున కల్పితదైవాన్ని (తాగూత్ ను) తిరస్కరించి, అల్లాహ్ ను విశ్వసించిన వాడు, సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆధారాన్ని పట్టుకున్నట్లే. మరియు అల్లాహ్ సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు.

Explanation & meanings · 2
  1. ఇస్లాం ధర్మం స్వీకరించమని ఎవ్వరినీ బలవంతం చేయరాదు. ఎందుకంటే అల్లాహ్ (సు.తా.) మంచీ-చెడూ, అనే రెండు మార్గాలను చూపి, వాటిని అనుసరించటం వల్ల లభించే ప్రతిఫలాలను కూడా స్పష్టపరచాడు. కాని అల్లాహ్ (సు.తా.) మార్గాన్ని అనుసరిస్తూ దానిని ఇతరులకు బోధించటాన్ని విరోధించే వారి, అత్యాచారాన్ని నిర్మూలించటానికి ధర్మపోరాటం (జిహాద్) చేయాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తికి తనకు ఇష్టమైన ధర్మాన్ని అనుసరించే స్వాతంత్ర్యం ఉంది.
  2. 'తా గూత్ కు ఎన్నో అర్థాలున్నాయి. ముఖ్యంగా అల్లాహుతా'ఆలాకు బదులుగా ఆరాధించే ప్రతి వస్తువు, అంటే షై'తాన్, విగ్రహం, రాయి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, దైవదూతలు, మానవులు, జిన్నాతులు, గోరీలు, సాధు సన్యాసులు, సత్పురుషులు, మొదలైనవి.