2 : 32
قَالُواْ سُبۡحَٰنَكَ لَا عِلۡمَ لَنَآ إِلَّا مَا عَلَّمۡتَنَآۖ إِنَّكَ أَنتَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ
వారు (దేవదూతలు): "నీవు సర్వలోపాలకు అతీతుడవు, నీవు తెలిపినదే తప్ప మాకు మరేమీ తెలియదు. నిశ్చయంగా, నీవే సర్వజ్ఞుడవు, మహా వివేకవంతుడవు." అని అన్నారు.
Explanation & meanings · 3
- సుబ్'హానున్: Extolled be his absolute perfection. Hallowed, Exalted, Glirified, సర్వలోపాలకు అతీతుడు, పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు, పానవుడు, ప్రశంసనీయుడు, శ్లాఘింప, పొగడ, స్తుతింప దగిన వాడు. చూడండి, 2:116, 12:108, 59:23.
- అల్-'అలీము: The All -knowing, The Omniscient. సర్వజ్ఞుడు, జ్ఞానసంపన్నుడు, సర్వం ఎరిగిన వాడు, జ్ఞానం గల, నేర్పు గల, తన దాసుల ప్రతిమాటనూ, ప్రతి పనినీ, భావాన్నీ, అభిప్రాయాన్నీ, ప్రత్యక్షంగా ఎరిగినవాడు. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 2:127.
- అల్ హకీము: All-Wise, possessing Knowledge or Science, The Omniscient, మహా వివేకవంతుడు, వివేచనాపరుడు. ఈ పేరు దివ్యఖుర్ఆన్ కొరకు కూడా వాడబడుతుంది. అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 59:24