29 : 51
أَوَلَمۡ يَكۡفِهِمۡ أَنَّآ أَنزَلۡنَا عَلَيۡكَ ٱلۡكِتَٰبَ يُتۡلَىٰ عَلَيۡهِمۡۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحۡمَةٗ وَذِكۡرَىٰ لِقَوۡمٖ يُؤۡمِنُونَ
ఏమీ? వాస్తవానికి మేము నీపై అవతరింప జేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) వారికి వినిపించబడుతోంది కదా! ఇది వారికి చాలదా? నిశ్చయంగా, ఇందులో విశ్వసించే ప్రజలకు కారుణ్యం మరియు హితబోధలనున్నాయి.
Explanation & meanings · 1
- ఖుర్ఆన్, అల్లాహ్ (సు.తా.) అద్భుత సంకేతాలలో ఒకటి. అందుకే ఖుర్ఆన్ లో అల్లాహ్ (సు.తా.) దాని వంటి ఒక్క సూరహ్ నైనా రచించి తెమ్మని సత్యతిరస్కారులతో సవాలు చేశాడు. కాని వారు ఈ నాటికీ దానిని పూర్తి చేయలేక పోయారు. ఇంతకంటే మంచి అద్భుత సంకేతం ఇంకేం కావాలి? విశ్వసించనవారు ఎన్ని అద్భుతసంకేతాలు చూసినా విశ్వసించరు. ఉదాహరణకు: ఫిర్'ఔన్ మరియు అతని జాతివారు.