Skip to content
అన్-నిసా /

ఆయత్ 69

4 : 69

ఆయత్ 69 of అన్-నిసా (4 : 69). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అన్-నిసా ఆయతులు 176
సూరా · అన్-నిసా
తెలుగు · Muhammad
4 : 69

وَمَن يُطِعِ ٱللَّهَ وَٱلرَّسُولَ فَأُوْلَٰٓئِكَ مَعَ ٱلَّذِينَ أَنۡعَمَ ٱللَّهُ عَلَيۡهِم مِّنَ ٱلنَّبِيِّـۧنَ وَٱلصِّدِّيقِينَ وَٱلشُّهَدَآءِ وَٱلصَّٰلِحِينَۚ وَحَسُنَ أُوْلَٰٓئِكَ رَفِيقٗا

మరియు ఎవరు అల్లాహ్ కు మరియు ప్రవక్తకు విధేయులై ఉంటారో, అలాంటి వారు అల్లాహ్ అనుగ్రహం పొందిన ప్రవక్తలతోనూ సత్యవంతులతోనూ, (అల్లాహ్) ధర్మం కొరకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల (షహీదుల) తోనూ, సద్వర్తనులతోనూ చేరి ఉంటారు. మరియు అలాంటి వారి సాంగత్యం ఎంతో మేలైనది!

Explanation & meanings · 1
  1. మానవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో వారితో బాటు ఉంటాడు. ('స. బు'ఖారీ, కితాబుల్ ఆదాబ్, బాబ్ 97, ముస్లిం 'హదీస్' నెం. 1640). మరొక 'హదీస్'లో ఇలా ఉంది : "అత్యధికంగా నఫిల్ నమా'జ్ లు చేయటం వల్ల స్వర్గంలో దైవప్రవక్త ('స'అస) సాంగత్యం లభిస్తుంది." ('స. ముస్లిం కితాబ్ అ'స్సలాహ్, బాబ్ ఫ'ద్ల్ అస్సుజూద్, 'హదీస్' నం. 488).