Skip to content
البَقَرَة /

ఆయత్ 133

2 : 133

ఆయత్ 133 of البَقَرَة (2 : 133). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 133

أَمۡ كُنتُمۡ شُهَدَآءَ إِذۡ حَضَرَ يَعۡقُوبَ ٱلۡمَوۡتُ إِذۡ قَالَ لِبَنِيهِ مَا تَعۡبُدُونَ مِنۢ بَعۡدِيۖ قَالُواْ نَعۡبُدُ إِلَٰهَكَ وَإِلَٰهَ ءَابَآئِكَ إِبۡرَٰهِـۧمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ إِلَٰهٗا وَٰحِدٗا وَنَحۡنُ لَهُۥ مُسۡلِمُونَ

ఏమీ? యఅఖూబ్ కు మరణం సమీపించినప్పుడు, మీరు అక్కడ ఉన్నారా?" అప్పుడతను తన కుమారులతో: "నా తరువాత మీరు ఎవరిని ఆరాధిస్తారు?" అని అడిగినప్పుడు. వారన్నారు: "నీ ఆరాధ్యదైవం మరియు నీ పూర్వీకులగు ఇబ్రాహీమ్, ఇస్మాయీల్ మరియు ఇస్హాఖ్ ల ఆరాధ్యదైవమైన ఆ ఏకైక దేవుణ్ణి (అల్లాహ్ నే) మేము ఆరాధిస్తాము మరియు మేము ఆయనకే విధేయులమై (ముస్లింలమై) ఉంటాము."

Explanation & meanings · 2
  1. ఇక్కడ యూదులు ప్రశ్నింపబడుతున్నారు: "య'అఖూబ్ ('అ.స.) మరణించినప్పుడు మీరైతే అక్కడ లేరు కదా! అలాంటప్పుడు మీకెలా తెలుసు, అతను తన కుమారులకు బోధించిన ధర్మమేమిటో?" అతనే గాక ప్రతి ప్రవక్త బోధించిన ధర్మం ఇస్లాం మాత్రమే. ('స'హీ'హ్ బు'ఖారీ).
  2. అల్-వా'హిద్: The One, The Sole. అద్వితీయుడు, ఒకే ఒక్కడు. ఏకైకుడు ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి. చూడండి, 2:163, 12:39. అహదున్: The Unique and Alone, ఏకైకుడు, ఒకే ఒక్కడు. చూడండి, 112:1, 4.