Skip to content
అల్-బఖరహ్ /

ఆయత్ 164

2 : 164

ఆయత్ 164 of అల్-బఖరహ్ (2 : 164). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

అల్-బఖరహ్ ఆయతులు 286
సూరా · అల్-బఖరహ్
తెలుగు · Muhammad
2 : 164

إِنَّ فِي خَلۡقِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَٱخۡتِلَٰفِ ٱلَّيۡلِ وَٱلنَّهَارِ وَٱلۡفُلۡكِ ٱلَّتِي تَجۡرِي فِي ٱلۡبَحۡرِ بِمَا يَنفَعُ ٱلنَّاسَ وَمَآ أَنزَلَ ٱللَّهُ مِنَ ٱلسَّمَآءِ مِن مَّآءٖ فَأَحۡيَا بِهِ ٱلۡأَرۡضَ بَعۡدَ مَوۡتِهَا وَبَثَّ فِيهَا مِن كُلِّ دَآبَّةٖ وَتَصۡرِيفِ ٱلرِّيَٰحِ وَٱلسَّحَابِ ٱلۡمُسَخَّرِ بَيۡنَ ٱلسَّمَآءِ وَٱلۡأَرۡضِ لَأٓيَٰتٖ لِّقَوۡمٖ يَعۡقِلُونَ

నిశ్చయంగా, భూమ్యాకాశాల సృష్టిలోనూ, రేయింబవళ్ళ మార్పులోనూ, ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకొని, సముద్రంలో పయనించే ఓడలలోనూ మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి, అందులో వివిధ రకాల జీవరాసులను వర్ధిల్లజేయటంలోనూ; మరియు వాయువులు మరియు మేఘాలు, భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలనున్నాయి.

Explanation & meanings · 1
  1. ఈ ఆయతులో అల్లాహ్ (సు.తా.) సృష్టించి, నడిపిస్తున్న ప్రకృతి నియమాలను గురించి వివరించడమైనది. 1) భూమ్యాకాశాల సృష్టి, 2) రాత్రింబవళ్ళు ఒకదాని తరువాత ఒకటి రావటం మరియు వాటి కాలాలలో హెచ్చు తగ్గులు, 3) సముద్రాలలో నావలు ఎంతో భారాన్ని తీసుకొని పయనించటం, 4) వర్షం కురిసి జీవం లేని భూమికి జీవమివ్వటం, 5) వివిధ రకాల జీవరాసుల సృష్టి, 6) చల్లని, వెచ్చని వివిధ దిక్కుల నుండి వీచే గాలి, 7) అల్లాహుతా'ఆలా తాను కోరిన చోట వర్షం కురిపించటానికి, తనకు నియమబద్ధులుగా సృష్టించిన మేఘాలు; వీటన్నింటిలో బుద్ధిమంతులకు ఎన్నో సూచనలున్నాయి. ఈ కార్యాలలో ఆయనకు మరెవ్వరూ భాగస్వాములు లేరనేది కూడా వ్యక్తమౌతోంది. ఎందుకంటే ఎవరైనా ఆయనకు భాగస్వాములుంటే ఈ సృష్టిలో అల్లకల్లోలం చెలరేగి ఉండేది.