Skip to content
النِّسَاء /

ఆయత్ 159

4 : 159

ఆయత్ 159 of النِّسَاء (4 : 159). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 159

وَإِن مِّنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ إِلَّا لَيُؤۡمِنَنَّ بِهِۦ قَبۡلَ مَوۡتِهِۦۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ يَكُونُ عَلَيۡهِمۡ شَهِيدٗا

మరియు గ్రంథ ప్రజల్లో ఎవడు కూడా అతనిని (ఈసాను), అతని మరణానికి పూర్వం (అతను, అల్లాహ్ యొక్క సందేశహరుడు మరియు ఒక మానవుడని), విశ్వసించకుండా ఉండడు. మరియు పునరుత్థాన దినమున అతను (ఈసా) వారిపై సాక్షిగా ఉంటాడు.

Explanation & meanings · 2
  1. ఇక్కడ 'ఈసా ('అ.స.) యొక్క మరణం అంటే, అతను మరల భూమి మీదికి పునరుత్థాన దినానికి దగ్గరి రోజులలో పంపబడి, పైన వివరించిన విషయాలన్నీ జరిగి, అతని సహజ మరణానికి మిందు, అని అర్థం. (ము'హమ్మద్ జూనాగఢి). దీని మరొక తాత్పర్యంలో: "ఆ యూదుని లేక క్రైస్తవుని మరణ సమయంలో అంటే, ఆత్మ (ప్రాణం) తీసే దైవదూత వచ్చినప్పుడు అతడు (ఆ యూదుడు లేక క్రైస్తవుడు): 'ఈసా ('అ.స.), అల్లాహ్ (సు.తా.) యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని విశ్వసిస్తాడు. కానీ ఆ విశ్వాసం అతనికి ప్రయోజనకరం కాజాలదు." అని, వ్యాక్యానించారు.
  2. ఈ సాక్ష్యం 'ఈసా ('అ.స.) ను, అల్లాహ్ (సు.తా.) సజీవునిగా తన వైపునకు లేపుకొనక ముందటి విషయాల గురించి ఉంటుంది. చూడండి, 5:117 (ము'హమ్మద్ జూనాగఢి).