Skip to content
النِّسَاء /

ఆయత్ 163

4 : 163

ఆయత్ 163 of النِّسَاء (4 : 163). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

النِّسَاء ఆయతులు 176
సూరా · النِّسَاء
తెలుగు · Muhammad
4 : 163

۞ إِنَّآ أَوۡحَيۡنَآ إِلَيۡكَ كَمَآ أَوۡحَيۡنَآ إِلَىٰ نُوحٖ وَٱلنَّبِيِّـۧنَ مِنۢ بَعۡدِهِۦۚ وَأَوۡحَيۡنَآ إِلَىٰٓ إِبۡرَٰهِيمَ وَإِسۡمَٰعِيلَ وَإِسۡحَٰقَ وَيَعۡقُوبَ وَٱلۡأَسۡبَاطِ وَعِيسَىٰ وَأَيُّوبَ وَيُونُسَ وَهَٰرُونَ وَسُلَيۡمَٰنَۚ وَءَاتَيۡنَا دَاوُۥدَ زَبُورٗا

(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.

Explanation & meanings · 2
  1. ఇబ్నె 'అబ్బాస్ (ర'ది.'అ.) కథనం: "కొందరు (యూదులు) మూసా ('అ.స.) తరువాత ఎవరిపై కూడా దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడలేదు." అని అన్నారు. దానికి సమాధానంగా ఈ ఆయత్ అవతరింపజేయబడింది. (ఇబ్నె-కసీ'ర్).
  2. 'జబూర్ (కీర్తనలు / Pslams) : దావూద్ ('అ.స.)కు ఇవ్వబడిన గ్రంథం.