Skip to content
الشُّورى /

ఆయత్ 13

42 : 13

ఆయత్ 13 of الشُّورى (42 : 13). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

الشُّورى ఆయతులు 53
సూరా · الشُّورى
తెలుగు · Muhammad
42 : 13

۞ شَرَعَ لَكُم مِّنَ ٱلدِّينِ مَا وَصَّىٰ بِهِۦ نُوحٗا وَٱلَّذِيٓ أَوۡحَيۡنَآ إِلَيۡكَ وَمَا وَصَّيۡنَا بِهِۦٓ إِبۡرَٰهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰٓۖ أَنۡ أَقِيمُواْ ٱلدِّينَ وَلَا تَتَفَرَّقُواْ فِيهِۚ كَبُرَ عَلَى ٱلۡمُشۡرِكِينَ مَا تَدۡعُوهُمۡ إِلَيۡهِۚ ٱللَّهُ يَجۡتَبِيٓ إِلَيۡهِ مَن يَشَآءُ وَيَهۡدِيٓ إِلَيۡهِ مَن يُنِيبُ

ఆయన, నూహ్ కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే, మీ కొరకు శాసించాడు; మరియు దానినే (ఓ ముహమ్మద్!) మేము నీకు దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము; మరియు మేము దానినే ఇబ్రాహీమ్, మూసా మరియు ఈసాలకు కూడా విధిగా చేశాము. ఈ ధర్మాన్నే స్థాపించాలని మరియు దానిని గురించి భేదాభిప్రాయాలకు గురి కాకుండా ఉండాలని. నీవు దాని వైపునకు పిలిచేది బహుదైవారాధకులకు ఎంతో సహింపలేనిదిగా ఉంది. అల్లాహ్ తాను కోరిన వానిని తన వైపునకు ఆకర్షిస్తాడు మరియు పశ్చాత్తాపంతో తన వైపునకు మరలేవానికి మార్గదర్శకత్వం చేస్తాడు.

Explanation & meanings · 2
  1. అద్దీను: ధర్మం అంటే అల్లాహ్ (సు.తా.) ను విశ్వసించి ఆయన అద్వితీయాన్ని నమ్మి, ఆయన ప్రవక్తలను అనుసరించి, ఆయన షరీయత్ పై నడవటం. ప్రవక్తలందరి ధర్మం ఇదే! చూడండి, 2:213. కాని వారి షరీయత్ లలో కొన్ని భేదాలుండవచ్చు. (చూడండి, 5:48) అందుకే దైవప్రవక్త ('స'అస) అన్నారు : 'మేము (ప్రవక్తలం) అంతా సోదరులం. మా అందరి ధర్మం ఒక్కటే ఇస్లాం!' ('స'హీ'హ్ బు'ఖారీ)
  2. అల్లాహ్ (సు.తా.) అతనికే మార్గదర్శకత్వం చేస్తాడు, ఎవడైతే స్వయంగా, అల్లాహ్ (సు.తా.) వైపునకు మరలుతాడో ! ఇక ఎవడైతే మార్గభ్రష్టత్వాన్ని ఎన్నుకుంటాడో, ఆయన, అతనిని దానిలో వదలుతాడు. అల్లాహ్ (సు.తా.) దృష్టిలో, ఆయనకు విధేయత (ఇస్లాం) మాత్రమే నిజమైన ధర్మం. చూడండి, 3:19, 3:85, 21:92 చూడండి, 23:52.