Skip to content
البَقَرَة /

ఆయత్ 30

2 : 30
البَقَرَة ఆయతులు 286
సూరా · البَقَرَة
తెలుగు · Muhammad
2 : 30

وَإِذۡ قَالَ رَبُّكَ لِلۡمَلَٰٓئِكَةِ إِنِّي جَاعِلٞ فِي ٱلۡأَرۡضِ خَلِيفَةٗۖ قَالُوٓاْ أَتَجۡعَلُ فِيهَا مَن يُفۡسِدُ فِيهَا وَيَسۡفِكُ ٱلدِّمَآءَ وَنَحۡنُ نُسَبِّحُ بِحَمۡدِكَ وَنُقَدِّسُ لَكَۖ قَالَ إِنِّيٓ أَعۡلَمُ مَا لَا تَعۡلَمُونَ

మరియు (జ్ఞాపకం చేసుకో!) నీ ప్రభువు దేవదూతలతో: "వాస్తవంగా నేను భూమిలో ఒక ఉత్తరాధికారిని (ఖలీఫాను) సృష్టించబోతున్నాను!" అని చెప్పినపుడు, వారు: "ఏమీ? నీవు భూమిలో కల్లోలం రేకెత్తించే వానిని మరియు నెత్తురు చిందించే వానిని నియమించబోతున్నావా? మేము నీ స్తోత్రం చేస్తూ, నీ పవిత్రతను కొనియాడుతూనే ఉన్నాము కదా!" అని విన్నవించు కున్నారు. దానికి ఆయన: "నిశ్చయంగా, మీకు తెలియనిది నాకు తెలుసు!" అని అన్నాడు.

Explanation & meanings · 1
  1. 'ఖలీఫా: అంటే భూమిలో తరతరాలుగా వచ్చే జనపదం, ఉత్తరాధికారి. చూడండి, 6:165, 27:62, 35:39. మానవుడు భూమిలో అల్లాహ్ (సు.తా.) యొక్క ప్రతినిధి అనటం సరైనది కాదు.