Skip to content
الزُّخرُف /

ఆయత్ 32

43 : 32
الزُّخرُف ఆయతులు 89
సూరా · الزُّخرُف
తెలుగు · Muhammad
43 : 32

أَهُمۡ يَقۡسِمُونَ رَحۡمَتَ رَبِّكَۚ نَحۡنُ قَسَمۡنَا بَيۡنَهُم مَّعِيشَتَهُمۡ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۚ وَرَفَعۡنَا بَعۡضَهُمۡ فَوۡقَ بَعۡضٖ دَرَجَٰتٖ لِّيَتَّخِذَ بَعۡضُهُم بَعۡضٗا سُخۡرِيّٗاۗ وَرَحۡمَتُ رَبِّكَ خَيۡرٞ مِّمَّا يَجۡمَعُونَ

నీ ప్రభువు కారుణ్యాన్ని పంచి పెట్టే వారు వారేనా ఏమిటి? మేమే వారి జీవనోపాయాలను, ఈ ప్రాపంచిక జీవితంలో వారి మధ్య పంచి పెట్టాము. వారు ఒకరితో నొకరు పని తీసుకోవటానికి, వారిలో కొందరికి మరి కొందరిపై స్థానాలను పెంచాము. మరియు వారు కూడబెట్టే దాని (సంపద) కంటే నీ ప్రభువు కారుణ్యమే ఎంతో ఉత్తమమైనది.

Explanation & meanings · 2
  1. అల్లాహ్ (సు.తా.) వ్యవహారాలను సరళంగా నడపటానికి, ప్రజలలో ధనసంపత్తులను, తెలివి జ్ఞానాలను, ఎక్కువ తక్కువగా పంచాడు. దీని వల్ల ప్రతి మానవుడు మరొకని సహాయం మీద ఆధారపడి ఉన్నాడు. ధనవంతుడు పేదవాని మీద, పేదవాడు ధనవంతుని మీద.
  2. ఈ కారుణ్యం అంటే పరలోక జీవిత సుఖం.