Skip to content
المُمتَحنَة /

ఆయత్ 8

60 : 8

ఆయత్ 8 of المُمتَحنَة (60 : 8). This page carries the verse in the Uthmani script with a translation of its meaning, at a stable URL that can be cited on its own.

المُمتَحنَة ఆయతులు 13
సూరా · المُمتَحنَة
తెలుగు · Muhammad
60 : 8

لَّا يَنۡهَىٰكُمُ ٱللَّهُ عَنِ ٱلَّذِينَ لَمۡ يُقَٰتِلُوكُمۡ فِي ٱلدِّينِ وَلَمۡ يُخۡرِجُوكُم مِّن دِيَٰرِكُمۡ أَن تَبَرُّوهُمۡ وَتُقۡسِطُوٓاْ إِلَيۡهِمۡۚ إِنَّ ٱللَّهَ يُحِبُّ ٱلۡمُقۡسِطِينَ

ఎవరైతే ధర్మవిషయంలో మీతో యుద్ధం చేయరో మరియు మిమ్మల్ని మీ గృహాల నుండి వెళ్ళగొట్టరో! వారి పట్ల మీరు సత్ప్రవర్తనతో మరియు న్యాయంతో వ్యవహరించటాన్ని అల్లాహ్ నిషేధించలేదు. నిశ్చయంగా, అల్లాహ్ న్యాయవర్తనులను ప్రేమిస్తాడు.

Explanation & meanings · 2
  1. ఎలాంటి సత్యతిరస్కారులతో సత్ప్రవర్తనతో వ్యవహరించాలో వారి వివరాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఒకటి: మీరు కేవలం ముస్లింలు అయినందుకు మీతో శత్రుత్వం వహించి మీతో పోరాడని వారితో, రెండు: మిమ్మల్ని మీ ఇల్లూ వాకిలి విడిచి పొమ్మని బవలంతం చేయని వారితో! మూడు: మీకు విరుద్ధంగా ఇతర సత్యతిరస్కారులకు సహాయపడని వారితో!
  2. చూదైవప్రవక్త ('స'అస) ను అస్మా బిన్తె అబూ బక్ర్ సిద్ధీఖ్ (ర'అన్హా), ముష్రిక్ రాలైన తన తల్లితో ఎలా వ్యవహరించాలని అడిగారు. అతను ('స'అస) ఇలా జవాబిచ్చారు: 'నీ తల్లితో రక్త సంబంధాన్ని ఉంచుకో!' ('స'హీ 'హ్ ముస్లిం, 'స'హీ 'హ్ బు'ఖారీ) మరొక విషయం ఏమిటంటే బంధువులు కాని సత్యతిరస్కారులతో కూడ న్యాయంగా ప్రవర్తించాలి.