Skip to content
الشُّورى /

ఆయత్ 7

42 : 7
الشُّورى ఆయతులు 53
సూరా · الشُّورى
తెలుగు · Muhammad
42 : 7

وَكَذَٰلِكَ أَوۡحَيۡنَآ إِلَيۡكَ قُرۡءَانًا عَرَبِيّٗا لِّتُنذِرَ أُمَّ ٱلۡقُرَىٰ وَمَنۡ حَوۡلَهَا وَتُنذِرَ يَوۡمَ ٱلۡجَمۡعِ لَا رَيۡبَ فِيهِۚ فَرِيقٞ فِي ٱلۡجَنَّةِ وَفَرِيقٞ فِي ٱلسَّعِيرِ

మరియు ఈ విధంగా మేము నీపై ఈ ఖుర్ఆన్ ను, అరబ్బీ భాషలో, దివ్యజ్ఞానం (వహీ) ద్వారా అవతరింపజేశాము. దానితో నీవు ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టుప్రక్కల వారిని హెచ్చరించటానికి మరియు - దానిని గురించి ఎలాంటి సందేహం లేని - ఆ సమావేశ దినాన్ని గురించి హెచ్చరించేందుకు కూడా. (ఆ రోజు) ఒక వర్గం వారు స్వర్గానికి పోతారు, మరొక వర్గం వారు మండే నరకాగ్నిలోకి పోతారు.

Explanation & meanings · 3
  1. చూడండి, 14:4, 13:37, 19:97 ప్రతి ప్రవక్త ('అ.స.) తన కాలపు ప్రజల భాషనే మాట్లాడేవాడు.
  2. ఉమ్ముల్-ఖురా: అంటే అన్ని నగరాల తల్లి. మక్కా యొక్క మరొక పేరు. ఇది అతి ప్రాచీన నగరం. చూడండి 6:92
  3. పునరుత్థానదినం: సమావేశదినం ఎందుకు అనబడిందంటే, ఆ రోజు అన్ని తరాలకు చెందిన మానవులు, మంచివారు, చెడ్డవారు, విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ సమావేశపరచ బడతారు.