5 : 1
يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ أَوۡفُواْ بِٱلۡعُقُودِۚ أُحِلَّتۡ لَكُم بَهِيمَةُ ٱلۡأَنۡعَٰمِ إِلَّا مَا يُتۡلَىٰ عَلَيۡكُمۡ غَيۡرَ مُحِلِّي ٱلصَّيۡدِ وَأَنتُمۡ حُرُمٌۗ إِنَّ ٱللَّهَ يَحۡكُمُ مَا يُرِيدُ
ఓ విశ్వాసులారా! ఒప్పందాలను పాటించండి. మీ కొరకు పచ్చిన మేసే చతుష్పాద పశువులన్నీ (తినటానికి) ధర్మ సమ్మతం (హలాల్) చేయబడ్డాయి; మీకు తెలుపబడిన పశువులు తప్ప! మీరు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వేటాడటం మీకు ధర్మ సమ్మతం కాదు. నిశ్చయంగా, అల్లాహ్ తాను కోరింది శాసిస్తాడు.
Explanation & meanings · 3
- 'అఖ్ద్: 'ఉఖూద్ (బ.వ.), అంటే ముడి అని అర్థం. ఇవి ధర్మాచారణలో మూడు రకాలు: 1) అల్లాహ్ - మానవుల మధ్య, 2) మానవుడు - తన ఆత్మతో, 3) మానవుడు - తన తోటివారితో చేసేవి. (రా'గిబ్).
- బహీమ: అంటే మేసే పశువు. అన్'ఆమున్: అంటే ఒంటెలు, ఆవులు, ఎడ్లు, గొర్రెలు, మేకల వంటి సాధు జంతువులు. చూడండి, 6:124. ఇవే కాక అడవి పశువులు, ఉదా: అడవి ఆవులు, జింకలు మొదలైనవి. ఇవి గడ్డి, చెట్లు తినేవి. వేటాడి ఇతర జంతువులను తననివి. జా'-నాబిన్: అంటే కోరపళ్ళుగల క్రూరమృగాలు మాంసాహారులైనవి. ఉదా: కుక్క, పులి. జూ'-మి'ఖ్లబిన్: అంటే, గోళ్ళు గల వేటాడే పక్షులు. ఏవైతే తమ వేట జంతువును తమ గోళ్ళతో పట్టుకుంటాయో, ఉదా: డేగ.
- ఇ'హ్రామ్ స్థితిలో వేటాడే నిషిద్ధాలను గురించి చూడండి, 5:94-96.