ఈ హదీసు పూర్తి చేయండి, «ألا إن في الجسد مضغة...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
- الباب / الفصل
- قسم الحديث
السؤال
س10: أكمل حديث «ألا إن في الجسد مضغة...»، واذكر بعض فوائده.
ప్రశ్న10: ఈ హదీసు పూర్తి చేయండి, «ألا إن في الجسد مضغة...» మరియు ఈ హదీసు యొక్క కొన్ని ప్రయోజనాలు పేర్కొనండి?
الجواب
ج:عن النعمان بن بشير رَضِيَ اللَّهُ عَنْهُما قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«ألا وإن في الجسد مضغة إذا صلحت صلح الجسد كله، وإذا فسدت فسد الجسد كله، ألا وهي القلب»
رواه البخاري ومسلم.
بعض فوائد الحديث:
- صلاح القلب فيه صلاح الظاهر والباطن.
- الاهتمام بصلاح القلب لأن به صلاح الإنسان.
జవాబు : నుమాన్ బిన్ బషీర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిస్తుండగా నేను విన్నాను:
నిజానికి, శరీరంలో ఒక మాంసం ముక్క ఉన్నది; అది సరైన దారిలో ఉంటే, శరీరం మొత్తం సరైన దారిలోనే ఉంటుంది. ఒకవేళ అది భ్రష్టుపడితే, శరీరం మొత్తం అవినీతిమయం అయిపోతుంది. నిశ్చయంగా, అదే హృదయం.
దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.
ఈ హదీసు ద్వారా కలిగే ప్రయోజనాలు:
- హృదయం సరైన దారిలో ఉండటం అనేది ఒక వ్యక్తిని బాహ్యంగానూ (మాటలలో, చేతలలో) మరియు ఆంతరంగీకంగానూ (ఆలోచనలో, సంకల్పంలో) సరైన దారిలో ఉండేలా చేస్తుంది.
- హృదయాన్ని సరైన దారిలో ఉంచటంపై శ్రద్ధ చూపడం, ఎందుకంటే మనిషి నిజాయితీ దానిపైనే ఆధారపడి ఉంటుంది.