Skip to content

సూరతుల్ ఫలఖ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

الباب / الفصل
قسم التفسير

السؤال

س16: اقرأ سورة الفلق وفسرها.

ప్రశ్న16:సూరతుల్ ఫలఖ్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

الجواب

ج:سورة الفلق وتفسيرها:

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ 1

مِن شَرِّ مَا خَلَقَ 2

وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ 3

وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ 4

وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ 5﴾

[الفلق: 1-5].

التفسير:

  1. ﴿قُلۡ أَعُوذُ بِرَبِّ ٱلۡفَلَقِ1﴾:

قل - يا أيها الرسول -: أعتصم بربّ الصبح، وأستجير به.

  1. ﴿مِن شَرِّ مَا خَلَقَ2﴾:

من شرّ ما يؤذي من المخلوقات.

  1. ﴿وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ3﴾:

وأعتصم بالله من الشرور التي تظهر في الليل من دواب ولصوص.

  1. ﴿وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِي ٱلۡعُقَدِ4﴾:

وأعتصم به من شرّ السواحر اللائي يَنْفُثْن في العُقَد.

  1. ﴿وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ5﴾:

ومن شر حاسد مبغض للناس إذا حسدهم على ما وهبهم الله من نِعَم، يريد زوالها عنهم، وإيقاع الأذى بهم.

జవాబు: సూరతుల్ ఫలఖ్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)

{ఇలా అను: "నేను ఉదయ కాలపు ప్రభువు అయిన (అల్లాహ్) శరణు వేడుకుంటున్నాను.(1)

ఆయన సృష్టించిన ప్రతిదాని కీడు నుండి. (2)

మరియు చిమ్మచీకటి కీడు నుండి, ఎప్పుడైతే అది క్రమ్ముకుంటుందో! 3

మరియు ముడుల మీద మంత్రించి ఊదే వారి కీడు నుండి; 4

అసూయాపరుడు అసూయచెందినప్పటి కీడు నుండి. 5 }

[అల్ ఫలక్ : 1-5]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : నేను ఉదయపు ప్రభువుతో రక్షణ కోరుతున్నాను మరియు నేను ఆయనతో శరణం వేడుకుంటున్నాను.

సృష్టితాల్లోంచి బాధను కలిగించే వాటి కీడు నుండి.

మరియు నేను అల్లాహ్ తో రాత్రి వేళ బహిర్గతమయ్యే జంతువుల, దొంగల కీడుల నుండి శరణు వేడుకుంటున్నాను.

మరియు నేను ముడులలో ఊదే మంత్రజాలకుల కీడు నుండి అల్లాహ్ తో శరణం వేడుకుంటున్నాను.

మరియు అల్లాహ్ వారికి ప్రసాదించిన దీవెనలను చూసి ఓర్పుకోలేక, ప్రజలను ద్వేషించే మరియు అసూయపడే వ్యక్తి యొక్క చెడు నుండి. ఆ ప్రజలు ఇకపై అలాంటి ఆశీర్వాదాలను పొందకూడదని మరియు వారికి హాని కలిగించాలని ఆ దుష్టులు కోరుకుంటారు.