Skip to content

సూరతుల్ మాఊన్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

الباب / الفصل
قسم التفسير

السؤال

س١٠: اقرأ سورة الماعون وفسرها.

ప్రశ్న10: సూరతుల్ మాఊన్ పఠించండి మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం) వివరించండి?

الجواب

ج:سورة الماعون وتفسيرها:

بِسۡمِ ٱللَّهِ ٱلرَّحۡمَٰنِ ٱلرَّحِيمِ

﴿أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ 1

فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ 2

وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ 3

فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ 4

ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ 5

ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ 6

وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ 7﴾

[سورة الماعون: ١ - ٧].

التفسير:

  1. ﴿أَرَءَيۡتَ ٱلَّذِي يُكَذِّبُ بِٱلدِّينِ1﴾:

هل عرفت الذي يكذب بالجزاء يوم القيامة؟!

  1. ﴿فَذَٰلِكَ ٱلَّذِي يَدُعُّ ٱلۡيَتِيمَ2﴾:

فهو ذلك الذي يدفع اليتيم بغلظة عن حاجته.

  1. ﴿وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلۡمِسۡكِينِ3﴾:

ولا يحثّ نفسه، ولا يحث غيره على إطعام الفقير.

  1. ﴿فَوَيۡلٞ لِّلۡمُصَلِّينَ4﴾:

فهلاك وعذاب للمصلِّين.

  1. ﴿ٱلَّذِينَ هُمۡ عَن صَلَاتِهِمۡ سَاهُونَ5﴾:

الذين هم عن صلاتهم لاهون، لا يبالون بها حتى ينقضي وقتها.

  1. ﴿ٱلَّذِينَ هُمۡ يُرَآءُونَ6﴾:

الذين هم يراؤون بصلاتهم وأعمالهم، لا يخلصون العمل لله.

  1. ﴿وَيَمۡنَعُونَ ٱلۡمَاعُونَ7﴾:

ويمنعون إعانة غيرهم بما لا ضرر في الإعانة به.

జవాబు: సూరతుల్ మాఊన్ మరియు దాని తఫ్సీర్ (వ్యాఖ్యానం):

బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీమ్ (అపార కరుణామయుడు,పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో) (1)

{తీర్పుదినాన్ని తిరస్కరించే వ్యక్తిని నీవు చూశావా? (1)

అతడే అనాధులను కసరి కొట్టేవాడు; (2)

మరియు పేదవాళ్ళకు అన్నం పెట్టమని ప్రోత్సహించనివాడు. (3)

అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4)

ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5)

ఎవరైతే ప్రదర్శనాబుద్ధితో వ్యవహరిస్తారో (నమాజ్ సలుపుతారో)! (6)

మరియు (ప్రజలకు) సామాన్య ఉపకారం (సహాయం) కూడా నిరాకరిస్తారో (7)}

[సూరతుల్ మాఊన్: 1-7వ ఆయతులు]

తఫ్సీర్ (వ్యాఖ్యానము):

ఏమీ ప్రళయదినం నాటి ప్రతిఫలమును తిరస్కరించే వాడిని నీవు గుర్తించావ ?!

అతనే అనాథను అతని అవసరం నుండి చాలా మొరటుగా నెట్టివేస్తాడు.

పేదవాడికి భోజనం తినిపించే విషయంలో స్వయమును ప్రేరేపించడు మరియు ఇతరులను ప్రేరేపించడు.

వినాశనము మరియు శిక్ష ఆ నమాజీలకు కలదు.

ఎవరైతే తమ నమాజుల విషయంలో అశ్రద్ధ వహిస్తారో. మరియు వాటి సమయం దాటేంతవరకు వాటిని పట్టించుకోరో.

వారే తమ నమాజులను మరియు తమ కర్మలను ప్రదర్శిస్తారు. ఆచరణను అల్లాహ్ కొరకు చిత్తశుద్ధితో చేయరు.

మరియు ఇతరులకు సహాయం చేయటం నుండి ఆపుతారు. ఆ సహాయం చేయటంలో ఎటువంటి నష్టం ఉండదు.