السؤال
س١٦: ما هي البشاشة؟
ప్రశ్న16: బషాష (ఉల్లాసం) అంటే ఏమిటి?
الجواب
ج:هي طلاقةُ الوَجهِ، مع الفَرحِ والتَّبسُّمِ واللطف وإظهار السرور عند لقاء الناس.
وهي بعكس العبوس في وجه الناس مما ينفرهم.
- وفي فضل ذلك جاءت الأحاديث، فعن أبي ذَرٍّ رَضِيَ اللَّهُ عَنْهُ، قال: قال ليَ النَّبيُّ ﷺ:
«لا تَحْقِرَنَّ مِنَ المَعرُوفِ شَيْئًا، ولو أَنْ تَلْقَى أخاكَ بِوَجْهٍ طَلْقٍ»
رواه مسلم.
- وقالَ رَسولُ اللهِ ﷺ:
«تَبَسُّمُكَ فِي وَجْهِ أَخِيكَ لَكَ صَدَقَةٌ»
رواه الترمذي.
జవాబు: ఉల్లాసమైన ముఖాన్ని కలిగి ఉండటం, దానితో పాటు సంతోషంతో మరియు చిరునవ్వుతో, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ స్నేహపూర్వకంగా ప్రజలను కలవడం.
ఇది కోపంతో నుదురు చిట్లిస్తూ, అసహ్యంతో మరియు విరోధంతో ప్రజల వైపు చూడడానికి వ్యతిరేకమైన వైఖరి.
ఉల్లాసం యొక్క ఔన్నత్యాన్ని ప్రస్తావిస్తూ అనేక హదీసులు ఉల్లేఖించ బడినాయి. వాటిలో ఒకటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినట్లు అబూ జర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీసు కూడా ఉంది:
ఏ చిన్న సత్కార్యాన్ని కూడా సాధారణమైనదిగా భావించవద్దు, అది మీ సోదరుడిని చిరునవ్వుతో పలకరించడమైనా సరే!
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
చిరునవ్వుతో నీ సోదరుడిని పలకరించడం కూడా సదఖ (దానం) గా పరిగణించ బడుతుంది.
దీనిని తిర్మిజి ఉల్లేఖించారు.