ఫలితాలను ఫిల్టర్ చేయండి
339 కార్డులు
الموضوعات
الموضوعات (13)
التصنيف الشرعي
Filter ▾
حجم المحتوى4
జవాబు: 1 - నొప్పి ఉన్న చోట కుడి చేయి ఉంచి, "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరిట) అని మూడుసార్లు పలకండి. ఆ తర్వాత ఇలా దుఆ చేయండి: "అవుదు బిఇజ్జతిల్లాహి వ ఖుద్రతీహి మిన్ షర్రి మా అజిదు వ ఉహాజిర్" (నేను గుర్తించిన మరియు భయపడుతున్న వాటికి వ్యతిరేకంగా అల్లాహ్ యొక్క తేజస్సు మరియు శక్తిలో శరణు పొందుతున్నాను) - ఏడు సార్లు పఠించాలి.
- అల్లాహ్ నిర్ణయించిన దాని పట్ల సంతృప్తిగా మరియు సహనంతో ఉండాలి.
ప్రామాణిక హదీసులో ఉమ్ముల్ అలా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం ఆమె ఇలా తెలిపారు : నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను పరామర్శించడానికి వచ్చారు. అప్పుడు ఆయన ఇలా తెలిపారు:
«ఆనందించు ఓ ఉమ్ముల్-అలా! నిశ్ఛయంగా ముస్లిం రోగం ద్వారా అల్లాహ్ అతని పాపాలను అగ్ని బంగారం మరియు వెండి మలినాన్ని తొలగించినట్లు తొలగిస్తాడు.»
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
- రోగిని సందర్శించడంలో త్వరపడాలి, రోగి కోసం ప్రార్థించాలి మరియు రోగి వద్ద ఎక్కువసేపు ఆగకుండా ఉండాలి.
- వ్యాధిగ్రస్తులు అడగకుండానే రుఖ్యహ్ (ఖుర్అన్ మరియు సున్నతుల ద్వారా వైద్యం చేసే పద్ధతి) చేయాలి.
- రోగిని ఓపికగా ఉండమని మరియు ప్రార్థనలు, నమాజులు మరియు తహారతుకు కట్టుబడి ఉండమని ఉపదేశించాలి.
- రోగి కొరకు చేయవలసిన దుఆ:
అస్'అలుల్లాహల్ అజీమ్, రబ్బిల్ అర్'షిల్ అజీమ్, అన్ యష్'ఫీక్ (నీకు స్వస్థత చేకూర్చమని మహోన్నత పీఠానికి అధిపతి, సర్వోన్నతుడైన అల్లాహ్ ను నేను అర్థిస్తున్నాను) అని ఏడు సార్లు పఠించాలి.
జవాబు: 1 - సంకల్పాన్ని సంపూర్ణ చిత్తశుద్ధితో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు అంకితం చేయడం
హదీసులో ఇలా ఉన్నది :
"ఎవరైతే జ్ఞానాన్ని పండితుల ముందు గొప్పతనం ప్రదర్శించడానికి, మూర్ఖులతో పోటీ పడేందుకు, లేదా ప్రజల దృష్టిని తన వైపు మళ్లించేందుకు నేర్చుకుంటాడో, అల్లాహ్ అతనిని నరకంలో ప్రవేశింపజేస్తాడు."
దీనిని ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు.
- నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టాలి.
“పునరుత్థాన దినము నాడు, కొన్ని విషయాలను గురించి ప్రశ్నించనంత వరకు, మానవుడి కాళ్ళు అతడు నిలుచుని ఉన్నచోటు నుండి ఏమాత్రమూ కదలవు. -ఆ విషయాలలో ఒకటి ప్రస్తావించారు - అతని జ్ఞానం గురించి, దానితో అతను ఏం చేశాడు?"
దీనిని తిర్మిజీ, దార్మీ ఉల్లేఖించారు.
- గురువును అతని సమక్షంలో మరియు పరోక్షంలో గౌరవించాలి మరియు అతనిని సత్కరించాలి.
- అతని సమక్షంలో వినమ్రతతో, అణుకువతో కూర్చోవాలి.
- గురువుకు మధ్యలో అంతరాయం కలగజేయకుండా శ్రద్ధగా వినాలి.
- గురువును మర్యాదతో ఉత్తమ పద్ధతిలో తన సందేహాలు అడిగి తెలుసుకోవాలి.
- గురువును పేరు పెట్టి పిలవ కూడదు.
"నిశ్ఛయంగా ముస్లిం వృద్ధులను మరియు ఖుర్ఆన్ హాఫిజ్ లను గౌరవించటం అల్లాహ్ను గౌరవించడం లో నుంచి అవుతుంది."
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
జవాబు: 1 - సభలో ప్రజలకు అభివాదం (సలాం) చేయడం.
- ఎవరి సీటూ ఖాళీ చేయమని అడగకుండా అందుబాటులో తనకు దగ్గరగా ఉన్న మొదటి ఖాళీ సీటులో కూర్చోవడం, ఉభయుల అనుమతితో తప్ప ఇద్దరు వ్యక్తుల మధ్య కూర్చోక పోవడం.
- ఇతరులు కూడా కూర్చునేలా సర్దుబాటు చేయడం.
- ఇతరుల మాటలకు అంతరాయం కలిగించకూడదు.
- సమావేశం విడిచి బయలుదేరే ముందు ప్రజలకు అభివాదం (సలాం) చేయడం మరియు వారి అనుమతి తీసుకోవడం
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖిస్తూ ఇలా తెలిపారు:
‘ఒక వ్యక్తి కూర్చున్న వ్యక్తిని లేపి తిరిగి అతని స్థానం లో కూర్చోవటం నుండి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారించారు, కూర్చో దలిస్తే అతనికి స్థానం కల్పిస్తూ ప్రదేశాన్నివిస్తారించాలి
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
హదీసులో ఇలా ఉన్నది :
సమావేశం ముగిసినప్పుడు సలాం చేయాలి అలాగే లేచి వెళ్ళేటప్పుడు కూడా సలాం చేసి వెళ్ళాలి మొదటి సలాం కు రెండవ సలాం పై ఎటువంటి ప్రాముఖ్యత లేదు(అనగా రెండు ప్రదానమైనవే)
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు.
- సభ ముగియగానే జరిగిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా కఫ్ఫారతు మజ్లిస్ ఇలా దుఆ చేయడం:
సుబహానకల్లాహుమ్మ వ బిహమ్దిక,అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అన్త,అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక. ఓ అల్లాహ్ నీవు పరిశుద్ధుడివి మరియు నీ స్థుతులతో. నీవు తప్ప నిజ ఆరాధ్య దైవం లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. నీతో మన్నింపును వేడుకుంటున్నాను మరియు నేను నీ వైపునకు పశ్చాత్తాపముతో మరలుతాను.
జవాబు: 1 - త్వరగా నిద్రపోవడం
హదీసు:
అబూ బర్జా రజియల్లాహు అన్హు కథనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇషా నమాజుకు ముందు పడుకోవటాన్ని, ఇషా తర్వాత కబుర్లు చెప్పుకోవటాన్ని అసహ్యించుకునేవారు.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
2 -వుజూ (ఆచరణ స్వచ్ఛత) స్థితిలో నిద్రించడం.
- వెల్లకిలా పొట్ట మీద నిద్ర పోకూడదు.
- కుడిచేతిని కుడి చెంప కింద పెట్టుకుని కుడివైపు తిరిగి పడుకోవడం.
- పడుకునే ముందు పక్క మీద దుమ్ము దులపడం.
హదీసులో ఇలా ఉన్నది :
బరా బిన్ ఆజిబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
నీవు నీ పడకపైకి పోయేటప్పుడు నమాజు కొరకు చేసేలా వుజూ చేయి పిదప కుడి ప్రక్కపై పడుకో.
అబూ హురైరా (రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం: ఆయన అన్నారు, ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక వ్యక్తిని తన పొట్టపై పడుకుని ఉండగా చూశారు, అప్పుడు ఆయన ఇలా అన్నారు:
"ఈ విధమైన పడుకోవడం అల్లాహ్కు ఇష్టం కాదు."
[దీనిని తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు]
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
మీలో ఎవరైతే నిద్రించడానికి ఉపక్రమిస్తారో వారు పడకలని తమ నడుము వస్రాల లోపటి క్రింది భాగం తో దులపండి,ఎందుకంటే అతను వెళ్ళాక దానిపై ఏం వచ్చి పడిందో తెలీదు
- నిద్రకు ఉపక్రమించే వేళ చేసే ప్రార్థనలు : అయత్ అల్-కుర్సీ ఒకసారి మరియు సూరతుల్ ఇఖ్లాస్, సూరతుల్ ఫలఖ్ మరియు సూరతున్నాస్, ఒక్కొక్కటి మూడుసార్లు పఠించాలి. ఆ తరువాత ఇలా ప్రార్థిస్తూ, పడుకోవాలి:
"బిస్మిక అల్లాహుమ్మా అముతు వ అహ్యా" (ఓ అల్లాహ్! నీ పేరుతో నేను చనిపోతాను మరియు మరలా బ్రతుకుతాను)
- తెల్లవారుజామున ఫజ్ర్ నమాజు కొరకు మేల్కొనడం.
- నిద్ర నుండి మేల్కొన్న తర్వాత ఇలా ప్రార్థించాలి:
"అల్'హమ్'దులిల్లాహిల్లజీ అహ్యానా బాదమా అమాతనా వ ఇలైహిన్ నుషూర్" (మన నుండి తీసుకున్న తర్వాత మరలా మనకు జీవితాన్ని ఇచ్చిన అల్లాహ్ కే సకల స్తోత్రాలు మరియు ప్రళయదినాన ఆయన వైపునకే మరలుతాము)
జవాబు:1 - సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు విధేయత చూపేందుకు అవసరమైన శక్తి పొందటానికి అన్నపానీయాలు సేవిస్తున్నాననే సంకల్పం చేయుకోవడం
- భుజించడానికి ముందు చేతులు కడుక్కోవడం.
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
తినాలని, త్రాగాలని నిర్ణయించుకున్నప్పుడు రెండు చేతులను కడిగి ఆ తరువాత తినాలి, త్రాగాలి.
దీనిని అహ్మద్ ఉల్లేఖించారు.
- భుజించడానికి ముందు ఇలా ప్రార్థించాలి: "బిస్మిల్లాహ్" (అల్లాహ్ పేరుతో). కుడిచేత్తో మరియు పళ్ళెంలో తనకు సమీపంలో ఉన్నదాని నుండి తినాలే గానీ, పళ్ళెం మధ్యలో లేదా ఇతరుల ముందు ఉన్న దాని నుండి కాదు.
హదీసు:
{ఓ పిల్లవాడా !అల్లాహ్ ను స్మరించుకుని (బిస్మిల్లాహ్ చదివి)కుడి చేతితో భుజించు, నీకు దగ్గరగా ఉన్న చోటు నుంచి నువ్వు భుజించు’}
ముత్తఫఖున్ అలైహి
- భుజించడానికి ముందు "బిస్మిల్లాహ్" అని చెప్పడం మరచిపోయిన సందర్భంలో, ఇలా పలకాలి: "బిస్మిల్లాహి అవ్వలుహు వ ఆఖిరుహు" (అల్లాహ్ పేరుతో, ఆరంభంలోనూ మరియు అంతంలోనూ).
ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు:
మీలో నుండి ఎవరైన తినడం ప్రారంభించేటప్పుడు "బిస్మిల్లాహ్” (అల్లాహ్ పేరుతో) అని పలకాలి. ఒకవేళ మరచిపోయి మధ్యలో జ్ఞాపకం వస్తే "బిస్మిల్లాహి ఫీ అవ్వలిహి వ ఆఖిరిహి” (అల్లాహ్ పేరుతో (అన్నం తింటున్నాను) దీని ప్రారంభము నుండి ఆఖరు నుండి) అని పలకాలి.
[దీనిని తిర్మిజీ మరియు అహ్మద్ ఉల్లేఖించారు]
- లభించిన భోజనంతో తృప్తి పడటం, దానిని విమర్శించకుండా ఉండడం అంటే ఇష్టం ఉంటే తినాలి, లేకుంటే వదిలేయాలి.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
'మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లమ్ భోజనంలో ఎన్నడూ లోపం చూపించేవారు కాదూ నచ్చితే తినేవారు నచ్చకపోతే వదిలేసేవారు.
6 -కొన్ని ముద్దలు మాత్రమే తినడం మరియు అతిగా తినకుండా ఉండడం.
హదీసులో ఇలా ఉన్నది :
ఆదమ్ సంతానం తన పొట్టను నింపినంతగా మరే పాత్ర ను నింపలేదు, మనిషి కొన్ని ముద్దలు తింటే చాలు అతని వెన్నును నిటారుగా ఉంచండములో తోడ్పడుతుంది, అధికంగా తినాలని కోరితే మూడింట ఒక వంతు భోజనం కోసం, మరొకవంతు నీటికోసం, ఇంకో వంతు శ్వాస కోసం వదిలిఉంచాలి.
దీనిని తిర్మిజీ, ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
- భోజనం లేదా పానీయంలో ఊదకూడదు మరియు అది చల్లబడే వరకు వేచి ఉండాలి.
"ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆహారంలో లేదా పానీయంలో ఊదటం నిషేధించారు."
అహ్మద్,ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
- తన కుటుంబంతో లేదా అతిథులతో కలిసి తినడం.
- ఒక హదీసులో ఇలా ఉన్నది ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను మేము ఎంత తిన్నా మా కడుపు నిండటం లేదు అన్నాడు దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా:
బహుశా మీరు విడివిడిగా తింటున్నారేమో. భోజనం చేసేటప్పుడు అందరూ ఒకచోట కూర్చుని అల్లాహ్ నామస్మరణ తో బుజించండి అల్లాహ్ మీకోసం అందులో సమృద్దిని బర్కత్ ను ఒసగుతాడు’
దీనిని అబూదావుద్,ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
- పెద్దలు తినడం ప్రారంభించక ముందే మీరు తినడం మొదలు పెట్టకూడదు.
- ఏదైనా పానీయం, మంచినీళ్ళు త్రాగే ముందు అల్లాహ్ పేరుతో ప్రారంభించడం, కూర్చుని మూడు గుక్కల్లో త్రాగడం.అందులో ఊదకుండా ఉండటం.
"మీలో ఎవరైన తాగుతున్నపుడు, పాత్రలో శ్వాస వదలకూడదు."
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం:
"నబీ సల్లల్లాహు అలైహి వసల్లం నిలుచుని తాగడాన్ని నివారించారు."
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
- హదీసు:
నిశ్చయంగా మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నీటిని మూడు శ్వాసాల్లో త్రాగేవారు’
- భుజించిన లేదా త్రాగిన తర్వాత అల్లాహ్ ను స్తుతించడం.
“ఆహారం భుజించిన తరువాత, అందుకు అల్లాహ్ ను కొనియాడిన వ్యక్తి పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు, అలాగే ఎవరైతే ఏదైనా పానీయాన్ని సేవించిన తరువాత అందుకు అల్లాహ్ ను కొనియాడుతాడో అతని పట్ల అల్లాహ్ ఆనందభరితుడు అవుతాడు”.
జవాబు: 1- అల్లాహ్ ను స్తుతిస్తూ, కుడివైపు నుండి వస్త్రధారణ ప్రారంభించడం.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
మీరు దుస్తులు ధరించేటప్పుడు మరియు, వజూ చేసేటప్పుడు కుడి చేతి నుండి ఆరంభించండి.
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.
- వస్త్రం, చీలమండలం క్రింద వరకు వేలాడేంత పొడువుగా ఉండకూడదు.
హదీసులో ఇలా ఉన్నది :
కాలి గిలకలకన్నా క్రిందికి వ్రేలాడే ధోవతీ (లుంగీ, షరాయి) భాగం నరకాగ్నికి ఆహుతి అవుతుంది.
దీనిని బుఖారీ ఉల్లేఖించారు.
కాబాని అనేవి పాదాల రెండువైపులనూ పొంగి ఉన్న ఎముకల భాగాలు."
- అబ్బాయిలు అమ్మాయిల దుస్తులు ధరించకూడదు. అలాగే అమ్మాయిలు అబ్బాయిల దుస్తులు ధరించకూడదు.
ఒక పురుషుడు స్త్రీ యొక్క వస్త్రాదారణ చేయడాన్ని అలాగే ఒక స్త్రీ పురుషునిలా వస్త్రాదారణ చేయడం పై మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శపించారు.
- అవిశ్వాసుల మరియు దుర్మార్గుల వస్త్రధారణను అనుకరించ కూడదు.
హదీసు:
"ఎవరైనా ఏదైనా జాతి వారిని అనుకరించినట్లయితే వారు అందులోని వారే అయిపోతారు".
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
- బట్టలు విప్పేటప్పుడు ముందుగా అల్లాహ్ పేరును ప్రస్తావించాలి.
"మీలో ఒకరు 'బిస్మిల్లాహ్' అని పలికి తన వస్త్రాలను తొలగిస్తే అది ఆదాము సంతానము మరియు జిన్ పిల్లల యొక్క మర్మావయవాలను కప్పివేయటం అవుతుంది."
దీనిని తబ్రానీ,ఇబ్నె అబీ షైబ ఉల్లేఖించారు.
- పాదరక్షలు ధరించేటప్పుడు ముందుగా కుడి వైపు నుండి మరియు వాటిని తీసేటప్పుడు ముందుగా ఎడమ నుండి ప్రారంభించండి.
హదీసు : విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా రజియల్లాహు అన్హా ఇలా సెలవిచ్చారు:
“ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుడి పార్శ్వానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు, పాదరక్షలు తొడుగుకొనుట, తలవెంట్రుకలు దువ్వుట, స్నానం చేయుట మొదలైన (ఉపయుక్తమైన) పనులన్నింటినీ కుడి వైపునుండి ప్రారంభించేవారు."
జవాబు: 1 - తన ప్రయాణాన్ని "బిస్మిల్లాహ్ (అల్లాహ్ పేరుతో, అల్'హందు లిల్లాహ్ (సకల ప్రశంసలు, కృతజ్ఞతలు అల్లాహ్ కే శోభిస్తాయి)" అనే పదాలతో ప్రారంభించాలి
{పరమ పరిశుద్ధుడగు అల్లాహ్ ఈ వాహనాన్ని మాకు లోబరిచాడు,మేము దీనిని మేము (ఆయన అనుగ్రహం లేకపోతే) దీనిని లోబరుచుకోలేక పోయేవారము, 13
మరియు నిశ్చయంగా, మేము మా ప్రభువు వైపునకే మరలిపోవలసి ఉన్నది! 14}
[జుఖ్'రుఫ్ : 13 - 14]
- ఒకవేళ ఎవరైనా ముస్లింను దాటుతున్న సందర్భంలో, అతనికి సలాం పలుకుతూ ముందుకు సాగండి.
జవాబు: 1 - సాధారణ వేగంతో, వినమ్రత, అణుకువలతో రహదారిపై నడవడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు భూమిపై విర్రవీగుతూ నడవకు. నిశ్చయంగా నీవు భూమిని చీల్చనూ లేవు మరియు పర్వతాల ఎత్తుకు చేరనూ లేవు!}
{అల్ ఇస్రా: 57}
- దారిలో ఎదురయ్యే వారికి (పరిచయం ఉన్నా, లేకపోయినా) సలాం చేస్తూ పలకరించడం.
“ఓక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు: “ఇస్లాంలో ఏ విషయం అన్నింటి కంటే ఉత్తమమైనది?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:
“(ఆకలిగొన్న వారికి) అన్నం తినిపించడం, ‘సలాం’ చేయడం, నీకు పరిచయం ఉన్న వారికీ, మరియు నీకు పరిచయం లేని వారికీ కూడా”.
ముత్తఫఖున్ అలైహి
- చూపులు క్రిందకు దించి, ఎవరికీ హాని కలుగ జేయకుండా ఉండటం.
- మంచి వైపుకు ఆహ్వానించడం, చెడును ఖండించడం.
హదీసులో ఇలా ఉంది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
‘రహదారుల హక్కులను పూరించండి అని చెప్పారు వారు ‘ఓ ప్రవక్త ‘రహదారుల హక్కులు ఏమిటి ?అని అడిగారు దానికి ప్రవక్త సమాధానమిస్తూ’కళ్లను క్రిందికి వాల్చడం మరియు ఇతరులకు హనీ చేయకపోవడం,సలాం కు జవాబు చెప్పడం,మంచిని బోధించటం,చెడును ఖండించటం’అని ఉపదేశించారు.
- దారి నుండి హానికరమైన వాటిని తొలగించడం.
హదీసులో ఇలా ఉన్నది :
బాధకరమైన వస్తువులను రహదారి నుండి తొలగించటం సదఖా అవుతుంది.
జవాబు: 1 - ఎడమ కాలు బయట పెట్టి, ఇంటి నుండి బయటకు అడుగు వేస్తూ ఇలా దుఆ చేయ వలెను:
"బిస్మిల్లాహి, తవక్కల్తు అలల్లాహ్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, అల్లాహుమ్మా ఇన్నీ అ'ఉదు బిక అన్ అదిల్ల అవ్ ఉదల్ల; అవ్ అజిల్ల, అవ్ ఉజల్ల, అవ్ అజ్'లిమ అవ్ ఉజ్'లమ; అవ్ అజ్'హల అవ్ ఉజ'హల అలయ్య" (అల్లాహ్ పేరుతో, నేను అల్లాహ్ పైనే ఆధారపడతాను మరియు అల్లాహ్లో తప్ప మరో దానిలో ఏ శక్తీ లేదా బలమూ లేదు. ఓ అల్లాహ్! నేను తప్పుదారి పట్టడం నుండి లేదా నన్ను ఎవరైనా తప్పుదారి పట్టించడం నుండి, నేను ఎవరినైనా అవమానించడం నుండి లేదా నన్ను ఎవరైనా అవమానించడం నుండి నేను ఎవరిపైనైనా దౌర్జన్యం చేయడం నుండి లేదా నాపై ఎవరైనా దౌర్జన్యం చేయడం నుండి, నేను అజ్ఞానంతో వ్యవహరించడం నుండి మరియు నాపై ఎవరైనా అజ్ఞానంతో వ్యవహరించడం నుండి నేను నీ వద్ద శరణు వేడుకుంటున్నాను.)
- కుడి పాదంతో ఇంట్లోకి ప్రవేశిస్తూ, ఇలా దుఆ చేయాలి:
"బిస్మిల్లాహి వలజ్నా, వ బిస్మిల్లాహి ఖరజ్'నా, వ ‘అలా రబ్బినా తవక్కల్నా” (అల్లాహ్ పేరుతో మేము ప్రవేశిస్తాము, అల్లాహ్ పేరుతో మేము బయటికి వెళతాము మరియు మా ప్రభువుపైనే మేము ఆధారపడతాము).
- మిస్వాక్ ఉపయోగిస్తూ (దంతాలు శుభ్రపరిచే పంటిపుల్లతో దంతాలు శుభ్రం చేసుకుంటూ ), ఇంట్లోని వ్యక్తులను సలాం చేస్తూ ఇంటిలోనికి ప్రవేశించవలెను.
హదీసులో ఇలా ఉన్నది :
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇల్లు ప్రవేశించినప్పుడు మొదట మిస్వాక్ చేసేవారు (పళ్ళు శుభ్రం చేసే పుల్ల) ఉపయోగించేవారు.
దీనిని ఇబ్నె మాజహ్ ఉల్లేఖించారు.
జవాబు: 1 - ఎడమకాలు లోపలికి పెట్టి ప్రవేశించడం.
- టాయిలెట్ లేదా హమామ్ లో ప్రవేశించే ముందు ఇలా దుఆ చేయడం:
"అల్లాహ్ పేరుతో" ఓ అల్లాహ్! నేను అపరిశుద్ధమైన స్త్రీ పురుష జిన్నుల నుండీ నీ శరణు వేడుకుంటున్నాను.
- అల్లాహ్ స్మరణ ఉన్న ఏ వస్తువును అందులో తీసుకెళ్ళకూడదు.
అనస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం :
మహనీయ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ వారు మలముత్రవిసర్జన కొరకు బహిర్భుమి వెళ్లినప్పుడు తన ఉంగారాన్ని తీసి విడిచి వెళ్ళేవారు
దీనిని అబూదావుద్,ఇబ్నె మాజ ఉల్లేఖించారు.
- మలమూత్ర విసర్జన సమయంలో ఇతరులకు కనబడకుండా ఉండే టాయిలెట్ గది లాంటిది లేదా పరదా లాంటిది ఏర్పాటు చేసుకోవడం.
హదీసులో ఇలా ఉన్నది :
అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన కాలకృత్యాలు తీర్చుకునే సమయంలో అత్యంత ఇష్టపడ్డది గోడ లేదా ఖర్జూర చెట్ల పొదల వెనుక దాగటం.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
- టాయిలెట్లో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడకుండా ఉండటం.
- మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఖిబ్లా దిశలో కూర్చోకుండా ఉండటం లేదా దాని వైపు వీపు చూపకుండా ఉండడం.
ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
మలమూత్ర విసర్జనలకై వెళ్ళినప్పుడూ మీరు ఖిబ్లా వైపుకు ముఖం కానీ వీపు కానీ చేయకండి ఉత్తరదక్షిణాల వైపుకు చేయండి.
ముత్తఫఖున్ అలైహి
- మలినాలను తొలగించడంలో, మర్మాంగాలు కడగడంలో కుడి చేతిని కాకుండా ఎడమ చేతిని ఉపయోగించడం.
హదీసు:
నిశ్చయంగా ...ఇస్తెంజా కొరకు కుడి చేతిని ఉపయోగించకూడదని మమ్మల్ని వారించారు.
- ప్రజల మార్గంలో లేదా నీడలో మలమూత్ర విసర్జన చేయకుండా ఉండటం.
అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు:
(లఆనైన్) శాపానికి గురిచేసే రెండు విషయాలనుండి భయపడండి. అనుయాయులు (లఆనైన్) ఆ రెండు విషయాలు ఏమిటి ?ప్రవక్త అని అడిగారు. ప్రవక్త బదులిస్తూ –జనులు సంచరించే మార్గాల్లో మలవిసర్జన చేయడం లేదా వారు సేదతీరే నీడలో విసర్జించడం.
- కాలకృత్యములు తీర్చుకున్న తరువాత చేతులను కడుక్కోవటం.
జరీర్ రజియల్లాహు అన్హు చెప్పిన హదీసు: "నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఉన్నాను. ఆయన మరుగుదొడ్లవైపు వెళ్లి తన అవసరాలను తీర్చుకున్నారు, ఆపై అన్నారు..."
ఓ జరీర్! పవిత్రత కోసం నీరు తీసుకురా." నేను నీటిని ఆయనకు అందించాను. ఆపై ఆయన నీటితో ఇస్తింజా (శుద్ధి) చేసుకున్నారు మరియు తన చేతిని నేలపై రుద్దారు.
దీన్ని నసాయీ ఉల్లేఖించారు.
- కుడి పాదంతో టాయిలెట్ నుండి బయటకు వస్తూ ఇలా పలకాలి : "గుఫ్రానక్" (ఓ ప్రభూ, నన్ను క్షమించు)
జవాబు: 1 - కుడిపాదం లోపలికి పెట్టి మస్జిదులో ప్రవేశి స్తూ ఇలా దుఆ చేయవలెను.
బిస్మిల్లాహి అల్లాహుమ్మ ఫ్'తహ్ లీ అబ్'వాబ రహ్'మతిక (అల్లాహ్ పేరుతో, ఓ అల్లాహ్ నా కొరకు నీ కారుణ్య ద్వారాలు తెరువుము)
- రెండు రకాతుల తహియ్యతుల్ మస్జిద్ నమాజు పూర్తి చేయకుండా, మస్జిదులో కూర్చోవద్దు.
హదీసు:
మీలో ఎవరయినా మస్జిద్ లోకి ప్రవేశిస్తే రెండు రకాతుల నమాజ్ చేసేంత వరకు కూర్చోకూడదు.
ముత్తఫఖున్ అలైహి
- నమాజు చేసే వ్యక్తుల ముందు నుండి వెళ్ళకూడదు, పోగొట్టుకున్న వస్తువులను వెతకకూడదు లేదా మస్జిదులలో అమ్మడం మరియు కొనడం చేయకూడదు.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు:
నమాజు చదివే వ్యక్తి ఎదుట నుండి వెళ్ళేవానికి దాని పాపం ఏమిటో తెలిస్తే,అతని ముందు నుండి వెళ్లే బదులు నలబై(రోజులు/నెలలు/సంవత్సరాలు)అక్కడ నిలబడటం మేలుగా భావిస్తాడు.
దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తి :
పోగొట్టుకున్న వస్తువు మస్జిద్లో ప్రకటించినప్పుడు కనుక మీరు విన్నట్లైతే ‘అల్లాహ్ నీకు ఎన్నటికీ తిరిగి చేరనివ్వడు’ఎందుకంటే మస్జిద్ లు వాటి కొరకు నిర్మించబడలేదు” అని చెప్పండి,
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
- మరియు హదీసులో ఇలా ఉంది:
మీరు మస్జిద్ లో ఏదైనా అమ్మడం కొనడం లాంటివి చేసినప్పుడు చూస్తే ఇలా చెప్పండి : అల్లాహ్ నీ వ్యాపారం లో లాభం ఇవ్వకూడదు.
దీనిని తిర్మిజీ, దార్మీ ఉల్లేఖించారు.
- నేను మసీదును శుభ్రంగా ఉంచడం పట్ల ఆశక్తిని కనబరుస్తాను.
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
మహనీయ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం: బస్తీల్లో వాడల్లో మస్జిదులు నిర్మించి వాటిని పరిశుబ్రంగా ఉంచుతూ సుగంధపరిమలాలతో నింపాలని ఆదేశించారు.
దీనిని తిర్మిజీ,అబూదావుద్,అహ్మద్ ఉల్లేఖించారు.
- ఎడమపాదం బయట పెట్టి, మస్జిదు నుండి బయటికి వస్తూ, ఇలా దుఆ చేయాలి:
అల్లాహుమ్మ ఇన్నీ అస్'అలుక మిన్ ఫజ్'లిక. (ఓ అల్లాహ్, నీ దయతో నేను నిన్ను వేడుకుంటున్నాను')
జవాబు: 1 - ఒక ముస్లిమ్ ను కలిసినప్పుడు, "అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహు" (అల్లాహ్ యొక్క శాంతి, దయ మరియు ఆశీర్వాదాలు మీపై ఉండుగాక) అని ప్రశాంతంగా పలకరించడంతో సంభాషణ ప్రారంభించాలి. సలాం చెప్పకుండా, కేవలం చేతితో సంజ్ఞ చేయడం మాత్రమే సరిపోదు.
- చిరునవ్వుతో ఇతరులకు సలాం చేయండి.
హదీసులో ఇలా ఉన్నది :
ఏ చిన్న సత్కార్యాన్ని కూడా సాధారణమైనదిగా భావించవద్దు, అది మీ సోదరుడిని చిరునవ్వుతో పలకరించడమైనా సరే!
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
- కుడిచేత్తో కరచాలనం చేయండి.
- ఎవరైనా సలాం చేసినప్పుడు, దానికి సమానమైన పదాలతో లేదా దాని కంటే ఉత్తమంగా ఇంకా ఎక్కువ పదాలతో తిరిగి సలాం చేయండి.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{మరియు మీకు ఎవరైనా సలాం చేస్తే, దానికి మీరు అంతకంటే ఉత్తమమైన రీతిలో ప్రతి సలాం చెయ్యండి లేదా కనీసం అవే పదాలు తిరిగి పలకండి (అదే విధంగానైనా చెయ్యండి). నిశ్చయంగా, అల్లాహ్ ప్రతి దానిని పరిగణించగలవాడు.}
[నిసా: 80]
- అవిశ్వాసిని కలుసుకున్నప్పుడు, అతనికి సలాం చెప్పడంతో ప్రారంభించకూడదు. ఒకవేళ అతను సలాం చేస్తే అతనికి అలైకుమ్ అని ప్రతిసలాం చేయాలి.
హదీసు:
“యూదునికి గానీ లేక క్రైస్తవునికి గానీ మీరు ముందుగా “సలాం” చేయకండి.
- యువకులు వృద్ధులకు సలాం చేయాలి, వాహనం మీద వెళుతున్నవాళ్ళు, నడుస్తున్న వారికి సలాం చేయాలి, నడుస్తున్న వారు, కూర్చున్నవారికి సలాం చేయాలి, కొద్దిమందితో ఉన్న బృందం, ఎక్కువ మంది ఉన్న పెద్ద బృందానికి సలాం చేయాలి.
రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు:
“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”
ముత్తఫఖున్ అలైహి
- మహరమ్ కాని స్త్రీతో కరచాలనం చేయవద్దు.
ఉమ్ముల్ ము’మినీన్ (విశ్వాసుల మాత) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం :
అల్లాహ్ సాక్షిగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన చేతి ద్వారా ఎన్నడు ఏ మహిళను తాకలేదు.
జవాబు: 1 - ఒక ప్రదేశంలోకి ప్రవేశించే ముందు అనుమతి కోరడం.
- ప్రవేశించేందుకు మూడు సార్లు మాత్రమే అనుమతి కోరాలి, అంతకంటే ఎక్కువ సార్లు తగదు. అయినా అనుమతి లభించకపోతే, అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోవాలి.
హదీసులో ఇలా ఉన్నది :
మీలో ఎవరైన మూడు సార్లు అనుమతి కోరితే అనుమతి ఇవ్వబడకపోతే, అతను మరలివెళ్ళిపోవాలి.
ముత్తఫఖున్ అలైహి
- తలుపును సున్నితంగా తట్ట వలెను మరియు తలుపు నుండి దూరంగాను అంటే, దాని కుడివైపున గానీ లేదా ఎడమవైపున గానీ నిలబడ వలెను. అస్సలాము అలైకుమ్ అని పలకవలెను.
హదీసు:
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరి గుమ్మం వద్దకు వచ్చినా, నేరుగా ద్వారానికి ఎదురుగా నిలబడకుండా, కుడి మూలకు లేదా ఎడమ మూలకు నిలబడేవారు. ఆ తరువాత "అస్సలాము అలైకుం, అస్సలాము అలైకుం" అని పలుకేవారు.
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
- ముందుగా అనుమతి తీసుకోకుండా, ముఖ్యంగా తెల్లవారుజామున, మధ్యాహ్న సమయంలో మరియు ‘ఇషా’ నమాజు తర్వాత తల్లిదండ్రుల గదిలోకి లేదా ఇతరుల గదిలోకి అస్సలు ప్రవేశింవద్దు.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
{ఓ విశ్వాసులారా! మీ బానిసలు మరియు యుక్తవయస్సుకు చేరని మీ పిల్లలు, మూడు సమయాలలో అనుమతి తీసుకొనే మీ వద్దకు రావాలి. (అవి) ఉదయపు (ఫజ్ర్) నమాజ్ కు ముందు, మధ్యాహ్నం (జుహ్ర్) తరువాత - మీరు మీ వస్త్రాలు విడిచి ఉన్నప్పుడు - మరియు రాత్రి (ఇషా) నమాజ్ తరువాత. ఈ మూడు, మీ కొరకు ఏకాంత (పరదా) సమయాలు. వీటి తరువాత వారు మరియు మీరు ఒకరి వద్దకు మరొకరు వచ్చి పోతూ వుంటే, వారిపై గానీ, మీపై గానీ ఎలాంటి దోషం లేదు. ఈ విధంగా అల్లాహ్ మీకు తన ఆజ్ఞలను విశదీకరిస్తున్నాడు. అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు.}
[నూర్ : 27]
- అనుమతి తీసుకోకుండానే ఆసుపత్రి లేదా దుకాణం వంటి బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఉంది.
{ఎవ్వరికీ నివాస స్థలం కాకుండా మీకు ప్రయోజనకరమైన వస్తువులున్న ఇండ్లలో ప్రవేశిస్తే, మీపై ఎట్టి దోషం లేదు. మరియు మీరు వ్యక్తపరిచేది మరియు మీరు దాచేది అంతా అల్లాహ్ కు బాగా తెలుసు.}
జవాబు: 1 - జంతువులకు ఆహారం మరియు నీరు అందించడం.
హదీసులో ఇలా ఉన్నది :
సహచరులు అడిగారు:-‘ఓ దైవప్రవక్త! మా ఈ పశువుల ద్వారా మాకు పుణ్యం లభిస్తుందా?ప్రవక్త చెప్పారు:- {అవును,తేమను కలిగిన ప్రతీ కాలేయంలో పుణ్యం ఉంది}}
ముత్తఫఖున్ అలైహి
- మహనీయ దైవప్రవక్త ఒకసారి ఒక ఒంటె గుండా ప్రయాణిస్తుండగా చూశారు దాని కడుపు వీపుకు అతుక్కుపోయింది అప్పుడు ప్రవక్త ఉపదేశిస్తూ ఇలా తెలిపారు :
«మీరు ఈ మూగ జంతువుల విషయంలో అల్లాహ్ కు భయపడండి.»
దీనిని అబూ దావూద్ ఉల్లేఖించారు.
- జంతువుపై దయ చూపడం మరియు అది భరించలేనంత భారం దానిపై వేయకుండా ఉండటం.
హదీసులో ఇలా ఉన్నది : దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు :
ఈ ఒంటె యజమాని ఎవరు?ఈ ఒంటె ఎవరిది ?అని అడిగారు, అప్పుడు అన్సారీ తెగకు చెందిన ఒక యువకుడు వచ్చి ‘ఓ దైవప్రవక్త ఇది నా ఒంటె అని చెప్పాడు, దైవప్రవక్త అతనికి ఉపదేశిస్తూ : నీవు ఈ పశువు పట్ల అల్లాహ్ కు భయపడటం లేదా ?ఆయనే నిన్ను దీనికి యజమాని చేశాడు? ఎందుకంటే “ నీవు దాని ఆకలిదప్పికలు తీర్చకుండా దాన్ని అలసటకు గురిచేస్తున్నావని అది నాకు ఫిర్యాదు చేసుకుంది” అని చెప్పారు.
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.
తుద్యిబుహు అంటే నీవు దానిని అలసటకు గురి చేస్తున్నావు.
- ఏ విధంగానైనా జంతువును హింసించడం లేదా బాధించడం వంటి వాటికి పాల్బడకుండా ఉండటం.
హదీసులో జాబిర్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గాడిద ముఖంపై ముద్ర వేయబడినది చూశారు. అప్పుడు ఆయన ఇలా పలికారు:
"మీకు తెలియలేదా? నేను జంతువులను ముఖంపై ముద్ర వేసేవారిని లేదా ముఖంపై కొట్టేవారిని శపించాను?" అని. అప్పుడు ఆయన దాని నుండి వారించారు.
దీనిని తిర్మిజీ,అబూదావుద్ ఉల్లేఖించారు. మరియు పదాలు ఆయనివి.
జవాబు: 1 - అల్లాహ్ కు విధేయత చూపడానికి మరియు ఆయన మెప్పును పొందటానికి అవసరమైనంత బలం చేకూర్చుకోవాలనే ఉద్దేశంతో క్రీడల,వ్యాయామముల అభ్యాసం చేయడం.
- నమాజు సమయంలో క్రీడలు,వ్యాయామములను ఆపి వేయడం.
మహోన్నతుడైన అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
అలాంటి నమాజీలకు వినాశనం తప్పదు.(4)
ఎవరైతే తమ నమాజ్ ల పట్ల అశ్రద్ధ వహిస్తారో.(5)
[అల్ మాఊన్ :4,5]
- అబ్బాయిలు అమ్మాయిలతో కలిసి క్రీడలు,వ్యాయామము చేయకూడదు.
- మర్మవయవాలను (తప్పనిసరిగా కప్పబడి ఉండవలసిన శరీర భాగాలు) కప్పి ఉంచేలా క్రీడా,వ్యాయామ దుస్తులను ధరించడం.
- ముఖం పై కొట్టడం లేదా 'మర్మావయవాలను బహిర్గతం చేయడం వంటి నిషేధించబడిన క్రీడలను నివారించడం.
హదీసులో ఇలా ఉన్నది :
మీలో ఎవరైన తన సోదరునితో పోరాడితే ముఖమును గాయపర్చకండి.
దీనిని ముస్లిం ఉల్లేఖించారు.
జవాబు: 1 - హాస్యమాడుతున్నప్పుడు కూడా అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఉండాలి.
హదీసులో ఇలా ఉన్నది :
‘ఇతరులను నవ్వించడానికి మాట్లాడినప్పుడల్లా అసత్యం పలికేవాడికి సర్వనాశనం తప్పదు,అతను నాశనం అయిపోతాడు,నాశనం అయిపోతాడు.
దీనిని అబూదావుద్,అహ్మద్ మరియు తిర్మిజీ ఉల్లేఖించారు.
- హాస్యం అనేది ఎగతాళి, అపహాస్యం, హాని మరియు బెదిరింపులు లేకుండా ఉండాలి.
ఆయన అలైహిస్సలాతు వస్సలాం ఇలా తెలియ చేశారు:
"ఒక ముస్లిం మరొక ముస్లింను భయపెట్టడం సమ్మతం కాదు."
దీనిని అబూదావూద్ మరియు అహ్మద్ ఉల్లేఖించారు.
- తరచుగా జోకులు వేయడం మానుకోండి.
"ఎక్కువగా నవ్వకుండా ఉండండి; ఎందుకంటే అధికంగా నవ్వడం హృదయాన్ని మృతిచేస్తుంది."
దీనిని తిర్మిజీ, ఇబ్నె మాజ ఉల్లేఖించారు.